28 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 27, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మనుష్య మతముపైనైతే మీరు అర్ధకల్పము నడుస్తారు, ఇప్పుడు నా శ్రీమతముపై నడిచి పావనంగా అయినట్లయితే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు’’

ప్రశ్న: -

దేవతల చిత్రాల పట్ల అందరికీ ఆకర్షణ ఎందుకు కలుగుతుంది? వారిలో ఏ విశేషమైన గుణముంది?

జవాబు:-

తండ్రి ఆశీర్వదిస్తారు – పిల్లలూ, మీరు 21 జన్మలు సదా సుఖమయంగా ఉంటారు, అమరులుగా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ కాలుడు కబళించడు, అకాల మృత్యువు సంభవించదు. కామధేనువైన తల్లి మీ మనోకామనలన్నింటినీ పూర్తి చేస్తుంది. కానీ మీరు ఈ విషాన్ని (వికారాలను) విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే శ్రీమతముపై ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతారో మరియు తయారుచేస్తారో, వారికే ఈ ఆశీర్వాదము ప్రాప్తిస్తుంది. బాబా అంటారు, పిల్లలూ, ప్రపంచం మారుతూ ఉంది, అందుకే పావనంగా తప్పకుండా అవ్వండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ.

ఓంశాంతి. భగవంతుని పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు అందరూ భగవంతుని పిల్లలే. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారందరూ భగవంతుడిని బాబా అని అంటారు. సర్వులకు తండ్రి వారొక్కరే. లౌకిక తండ్రిని సర్వుల తండ్రి అని అనరు. అనంతమైన తండ్రి సర్వులకూ తండ్రి, సర్వుల సద్గతిదాత. ఇతరులెవ్వరికీ మహిమ ఉండజాలదు. అందరూ ఆ నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు. మీ ఆత్మ కూడా నిరాకారియే, అలాగే తండ్రి కూడా నిరాకారుడే. వారి మహిమనే మీరు విన్నారు. పరమపిత పరమాత్మ శివబాబా, మీరు ఉన్నతోన్నతమైనవారు, సర్వుల సద్గతిదాత. మీరు సర్వుల సద్గతిని చేస్తారు కావున వారు స్వర్గానికి యజమానులుగా, దేవీ-దేవతలుగా అవుతారు. మనుష్యులు, మనుష్యుల సద్గతిని చేయలేరు. మనుష్యులకు ఏ మహిమా లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. అర్ధకల్పము మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. దానిని రామ రాజ్యమని అంటారు, తర్వాత ద్వాపరం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. 5 వికారాల రూపీ భూతాలు ప్రవేశిస్తాయి. ఎలాగైతే ఆ భూతం (అశుద్ధ ఆత్మ) ఎవరిలోనైతే ప్రవేశిస్తుందో, వారు పిచ్చివారి వలె అయిపోతారు. అలా ఈ భూతాలలో నంబరువన్ భూతము, కామము మహాశత్రువు. అర్ధకల్పం ఈ భూతం మిమ్మల్ని చాలా దుఃఖితులుగా చేసింది. ఇప్పుడు దీనిపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రే అందరి చేత ప్రతిజ్ఞను చేయిస్తారు. తండ్రి అంటారు, మీరు పావనంగా అయ్యే రాఖీని కట్టుకున్నట్లయితే, 21 జన్మల కోసం పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి మీరు యజమానులుగా అవుతారు. నేను పతితులను పావనంగా చేయడానికి వచ్చాను. దేవీ-దేవతల రాజ్యం ఉన్నప్పుడు భారత్ పావనంగా ఉండేది. పేరే సుఖధామము. ఇప్పుడిది దుఃఖధామము. ఒకటేమో కామ ఖడ్గాన్ని నడిపిస్తారు, రెండవది గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు, చూడండి ఎంత దుఃఖముంది. తండ్రి రావడమే సంగమంలో వస్తారు. ఇది కళ్యాణకారీ సంగమయుగము. పిల్లలైన మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు మీ కళ్యాణం చేసుకోవడానికి వచ్చారు. తండ్రి అంటారు, ఇప్పుడు నా శ్రీమతంపై నడవండి. మనుష్య మతంపైనైతే మీరు అర్ధకల్పంగా నడుస్తూ ఉన్నారు. సద్గతిదాత అయితే ఒక్క తండ్రి మాత్రమే, వారి శ్రీమతంతోనే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇకపోతే, ఈ శాస్త్రాలను చదువుతూ-చదువుతూ ఇప్పుడు కలియుగం యొక్క అంతం వచ్చేసింది. తమోప్రధానంగా అయ్యారు. స్వయాన్ని ఈశ్వరునిగా చెప్పుకుంటూ తమకు తామే పూజ చేయించుకుంటారు. శాస్త్రాలలో ప్రహ్లాదుని విషయాన్ని చూపించారు. స్తంభం నుండి నరసింహ భగవానుడు వచ్చారని, వారు వచ్చి హిరణ్యకశిపుడిని హతమార్చారు అని చూపిస్తారు. ఇప్పుడు స్తంభం నుండైతే ఎవరూ రారు. ఇకపోతే, అందరి వినాశనమైతే జరిగేదే ఉంది. తండ్రి అంటారు, ఈ సాధు-సత్పురుషులను, మహాత్ములను, అజామిళ్ వంటి పాపాత్ములను కూడా నేను వచ్చి ఉద్ధరిస్తాను.

తండ్రి వచ్చి జ్ఞానామృత కలశాన్ని మాతలపై పెడతారు. గురువైన మాత లేకుండా ఎవరి సద్గతి జరగజాలదు. జగదంబ కామధేనువు, వారు అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. మీరు వారి కుమార్తెలు. ఇప్పుడు తండ్రి అంటారు, మనుష్యమాత్రులెవ్వరి మాటను వినకండి. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. కావున తప్పకుండా పతితంగా చేసేవారు కూడా ఎవరో ఉంటారు. రావణ రాజ్యంలో అందరూ పతితంగా ఉన్నారు. స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి ఇప్పుడు ఆ పతిత-పావనుడైన తండ్రి వచ్చారు. వారంటారు, 21 జన్మలు మీరు సదా సుఖమయంగా ఉంటారు. ఆశీర్వాదాన్ని ఇస్తారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా ఆశీర్వదిస్తారు. అది అల్పకాలిక సుఖం కోసము. వీరు అనంతమైన తల్లి-తండ్రి, వీరు అంటారు, పిల్లలూ, మీరు సదా అమరులుగా ఉండండి. అక్కడ మిమ్మల్ని కాలుడు కబళించడు. అకాల మృత్యువు ఉండదు, సదా సుఖమయంగా ఉంటారు. కామధేనువైన తల్లి మీ సర్వ మనోకామనలను పూర్తి చేస్తారు. కేవలం విషాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే అపవిత్రులైతే అక్కడకు వెళ్ళలేరు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానకి వచ్చాను, కేవలం పావనంగా అవ్వండి. అలాగని కొడుకుకు వివాహం చేయించాలని అనకండి. స్వయాన్ని పతితంగా చేసుకోకూడదు, ఇతరులను కూడా పతితంగా అవ్వనివ్వకూడదు. ఈ మృత్యులోకంలో అంతిమ జన్మ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి, అప్పుడే అమరలోకానికి వెళ్తారు. తండ్రి కూర్చుని అత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనే ధారణ చేస్తుంది. తండ్రి అంటారు, మీరు మా పిల్లలు. ఆత్మలైన మీరు పరంధామంలో ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎవరైతే పవిత్రంగా అవుతారో, వారిని నాతో పాటు తీసుకువెళ్తాను. మళ్ళీ అక్కడ నుండి మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. మీరా కూడా విషాన్ని త్యాగం చేసారు కనుక ఆమె పేరు ఎంతగా ప్రఖ్యాతి చెందింది. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు పాత ప్రపంచం మారి కొత్తదిగా తయారవ్వనున్నది. కొత్త ప్రపంచంలో దేవతలు రాజ్యం చేసేవారు. నేను బ్రహ్మా ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రేష్ఠమైన దేవతలుగా అయ్యేందుకు మీకు శ్రీమతాన్ని ఇస్తాను. కృష్ణపురిలోకి వెళ్ళాలి. శ్రీకృష్ణుడికి ఎంత మహిమ ఉందో చూడండి. వారు సర్వగుణ సంపన్నులు. మా మతముపై నడిచినట్లయితే ఈ విధంగా లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఎవరైతే కల్పక్రితం వారసత్వాన్ని తీసుకుని ఉంటారో, వారు శ్రీమతంపై నడుస్తారు. లేదంటే ఆసురీ మన్మతంపై నడుస్తూ ఉంటారు. ఈ బాబా కూడా ఆ నిరాకారుడి నుండే మతం తీసుకుంటారు. శివబాబా, బ్రహ్మా తనువులోకి ప్రవేశించి మీకు మతమునిస్తారు. వారంటారు, మీరంతా ప్రేయసులు లేక భక్తురాళ్ళు. ప్రియుడు లేక భగవంతుడు ఒక్కరే. మనుష్యులను ఎప్పుడూ కూడా భగవంతుడని అనలేరు. మీకు ఈ తప్పుడు మతం లభించింది, అందుకే మీకు ఇటువంటి దుర్గతి ఏర్పడింది. నేనొక్కడినే తీరానికి చేర్చేవాడిని. ఈ గురువులకు నా ధామం గురించే తెలియదు కావున నా వద్దకు ఎలా తీసుకువస్తారు. మనుష్యులైతే ఎక్కడకు వెళ్ళినా సరే, తల వంచి నమస్కరిస్తారు, అందుకే స్వయం నేనే తీసుకువెళ్ళేందుకు వచ్చాను, తర్వాత మిమ్మల్ని స్వర్గధామానికి పంపిస్తాను. అది విష్ణుపురి, సూర్యవంశము. త్రేతాను రామ రాజ్యమని అంటారు. దాని తర్వాత ద్వాపరంలో రావణ రాజ్యం మొదలవుతుంది. కావున భారత్ శివాలయం నుండి వేశ్యాలయంగా అవుతుంది. ఇదే భారత్ సంపూర్ణ నిర్వికారీగా ఉండేది, ఇదే భారత్ పూర్తి వికారీగా అయ్యింది. ఇప్పుడు పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకొని మొత్తం విశ్వంపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. రెండు కోతుల కథ ఉంది. అవి పరస్పరంలో కొట్లాడుకుంటాయి, విశ్వం రూపీ వెన్న మీకు లభిస్తుంది. మీరు కేవలం శివబాబాను మరియు స్వర్గాన్ని మాత్రమే స్మృతి చేయండి. ఇంట్లో, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రత విషయంలోనే అత్యాచారాలు జరుగుతాయి. కల్పక్రితం కూడా జరిగాయి, ఇప్పుడు కూడా తప్పకుండా జరుగుతాయి ఎందుకంటే మీరు ఇప్పుడు విషాన్ని ఇవ్వరు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతారు అని అంటూ ఉంటారు కూడా. అమృతాన్ని తాగుతూ-తాగుతూ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఎవరైతే పక్కా బ్రాహ్మణులు ఉంటారో, వారంటారు – ఏది ఏమైనా కానీ మేము విషాన్ని ఇవ్వము. ఎంతో సహనం చేస్తారు కూడా, అందుకే ఉన్నతమైన పదవిని పొందుతారు. శివబాబాను స్మృతి చేస్తూ-చేస్తూ ప్రాణాలను కూడా విడిచిపెట్టేస్తారు. ఇది శివబాబా ఆజ్ఞ. ఆజ్ఞ అయితే అందరికీ ఉంది, అందుకే అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, నా వద్దకు పరంధామానికి వచ్చేస్తారు. శివబాబా ఈ ముఖం ద్వారా ఆత్మలైన మీతో మాట్లాడుతారు. వీరు కూడా మనిషే. మనుష్యులెప్పుడూ కూడా మనుష్యులను పావనంగా చేయలేరు. మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. కనుక నేను తప్పకుండా పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పావనులైతే ఎవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ శ్రీకృష్ణుని వలె పావనంగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఒకవేళ ఎవరైనా, నేను బంధనంలో ఉన్నాను అని అంటే బాబా ఏం చేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ శ్రీమతంపై నడిచినట్లయితే మీరు శ్రేష్ఠంగా అవుతారని మీకైతే జ్ఞానం లభిస్తుంది. మీరంతా ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. శివబాబా, బ్రహ్మా దాదా, బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మీరు మనవలు మరియు మనవరాళ్ళు. మీ అందరికీ స్వర్గ వారసత్వము, రాజ్యము లభిస్తుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు కనుక మనం తండ్రికి వారసులము. కనుక తప్పకుండా మనం స్వర్గంలో ఉండాలి. మరి మనం ఇప్పుడు నరకంలో ఎందుకున్నాము? తండ్రి అర్థం చేయిస్తారు, రావణ రాజ్యం కారణంగా మీరు నరకంలో ఉన్నారు. మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను వచ్చాను. తండ్రి నావికుడు, అందరినీ ఆ తీరానికి తీసుకువెళ్తారు. శ్రీకృష్ణుడేమీ అందరికీ తండ్రి కాదు. ఒక్కరినే స్మృతి చేయాలి. అనేకులను స్మృతి చేయడము అనగా భక్తి మార్గము. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే అంత మతి సో గతి జరుగుతుంది. ఒక్క తండ్రి శ్రీమతమే మహిమ చేయబడింది, అంతేకానీ, అనేకమంది గురువులది, పండితులది కాదు. వారైతే, భగవంతుడు నామ రూపాలకు అతీతుడని అంటారు. కానీ నామ రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశం, ధ్రువానికి సంబంధించినదైనా కూడా పేరైతే ఉంది కదా. ఇప్పుడు ఈ భారత్ ఎంత నిరుపేదగా ఉంది, దివాలా తీసి ఉంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు నేను వచ్చి భారత్ ను బంగారు పిచ్చుకగా చేస్తాను. ఈ ప్రపంచానికి నిప్పు అయితే అంటుకునేదే ఉంది. పాత ప్రపంచమంతా సమాప్తమై కొత్తదిగా అవుతుంది.

పిల్లలైన మీరు శ్రీమతంపై స్వర్గ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది ఈశ్వరీయ చదువు. మిగిలినవన్నీ ఆసురీ చదువులు. ఈ చదువుతో మీరు స్వర్గవాసులుగా అవుతారు, ఆ చదువుతో మీరు నరకవాసులుగా అవుతారు. ఇప్పుడు దైవీ వృక్షం రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫానులు కూడా చాలా వస్తాయి, అందుకే ఇది దుఃఖధామము అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి, పరంధామాన్ని స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, అప్పుడు నావ తీరానికి చేరుతుంది. తండ్రి దుఃఖధామం నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు వస్తారు. తర్వాత సుఖధామంలోకి పంపిస్తారు. ఇప్పుడు దుఃఖధామాన్ని మర్చిపోతూ వెళ్ళండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానం మరియు యోగంతో తమ బంధనాలను తెంచుకోవాలి. ఈ దుఃఖధామాన్ని మరచి, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి.

2. కొంత సహించవలసి వచ్చినా, ప్రాణాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చినా కూడా, పావనంగా అవ్వడానికి తండ్రి ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో, దానిపై నడవాల్సిందే. పతితంగా ఎప్పుడూ అవ్వకూడదు.

వరదానము:-

సంగమయుగంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా అవ్వాలి, ఫరిశ్తా అనగా పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత దేహం పట్ల ఎటువంటి ఆకర్షణ యొక్క సంబంధం లేనివారు, ఈ మూడింటి నుండి ముక్తులు. అందుకే డ్రామాలో మొదట, ముక్తి యొక్క వారసత్వం ఉంది, ఆ తర్వాత జీవన్ముక్తిది. కనుక ఫరిశ్తాలు అనగా ముక్తులు మరియు ముక్తులైన ఫరిశ్తాలే జీవన్ముక్త దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే ఈ విధంగా బ్రాహ్మణుల నుండి సర్వ ఆకర్షణ ముక్త ఫరిశ్తాలుగా, మళ్ళీ దేవతలుగా అవుతారో, అప్పుడు ప్రకృతి కూడా ప్రాణప్రదంగా, ఎంతో ప్రేమగా మీ అందరి సేవ చేస్తుంది.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – పరమాత్మ చేసేవారుచేయించేవారు, ఎలా?

చాలామంది మనుష్యులు ఏమని భావిస్తున్నారంటే, ఈ అనాది తయారై తయారుచేయబడిన సృష్టి డ్రామా ఏదైతే నడుస్తుందో, దీనినంతటినీ పరమాత్మ నడిపిస్తున్నారు, అందుకే వారంటారు, మనుష్యుల చేతిలో ఏమీ లేదు… చేసేవారు, చేయించేవారు స్వామి…అంతా పరమాత్మనే చేస్తారు. సుఖ-దుఃఖాలు, ఈ రెండు భాగాలను పరమాత్మనే తయారుచేసారు. ఇప్పుడు ఇటువంటి బుద్ధి కలవారి బుద్ధిని ఏమంటారు? మొట్టమొదటగా వారికిది తప్పకుండా అర్థం చేయించాలి, ఏమనంటే, ఈ అనాది తయారై తయారుచేయబడిన సృష్టి ఆట, దేనినైతే ఇప్పుడు పరమాత్మ తయారుచేస్తారో, అదే నడుస్తుంది. దీనినే మనం, ఈ తయారై తయారుచేయబడిన ఆట ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉంటుందని అంటాము. అలాగే పరమాత్మ గురించి కూడా, ఇదంతా పరమాత్మనే చేస్తారని అనడం జరుగుతుంది. పరమాత్మను చేసేవారు, చేయించేవారు అని ఏదైతే అంటారో, ఈ పేరు మరి ఏ గొప్పవారికి వర్తిస్తుంది? ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మొదటగా ఏమి అర్థం చేసుకోవాలంటే – ఈ సృష్టి యొక్క అనాది నియమం ఏదైతే ఉందో, అది తయారై తయారుచేయబడినది. పరమాత్మ కూడా అనాది, మాయ కూడా అనాది మరియు ఈ చక్రం కూడా ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు అనాదిగా, అవినాశీగా తయారై తయారుచేయబడినది. ఎలాగైతే బీజంలో వృక్షం యొక్క జ్ఞానముందని అర్థమవుతుంది మరియు వృక్షంలో బీజం ఉందని అర్థమవుతుంది, రెండూ కంబైండ్ గా ఉన్నాయి, రెండూ అవినాశీ, ఇకపోతే బీజం పనేమిటి. బీజాన్ని నాటుతారు మరియు వృక్షం వెలువడుతుంది. ఒకవేళ బీజాన్ని నాటకపోతే, వృక్షం ఉత్పన్నమవ్వదు. మరి పరమాత్మ కూడా స్వయంగా ఈ మొత్తం సృష్టికి బీజరూపుడు మరియు పరమాత్మ పాత్ర బీజాన్ని నాటడము. పరమాత్మనే అంటారు, నేను బీజాన్ని నాటినప్పుడే పరమాత్మను. ఒకవేళ బీజాన్ని నాటకపోతే వృక్షం ఎలా వెలువడుతుంది! ఎప్పుడైతే నాది పరమ కార్యమో, అప్పుడే నా పేరు పరమాత్మ. నేను స్వయం పాత్రధారిగా అయ్యి బీజాన్ని నాటుతాను, ఇది నా కార్యము. సృష్టి యొక్క ఆదిని కూడా చేస్తాను మరియు అంతాన్ని కూడా చేస్తాను, నేను చేసేవానిగా అయ్యి బీజాన్ని నాటుతాను. బీజం నాటడమంటే అర్థము, రచనను రచించడము, పాత సృష్టిని అంతం చేయడము మరియు కొత్త సృష్టి ఆదిని చేయడము. దీనినే, పరమాత్మ అంతా చేస్తారు అని అంటారు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top