25 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 24, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రే మీకు తండ్రి, టీచరు మరియు గురువు, జీవిస్తూ వారికి చెందినవారిగా అయి మాలలో కూర్చబడాలి’’

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఏ నిశ్చయం ఆధారంగా పక్కా బ్రాహ్మణులుగా అవుతారు?

జవాబు:-

మీకు మొదట నిశ్చయం కలిగింది, ఈ నేత్రాలతో దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో, ఇదంతా పాతది అని. ఈ ప్రపంచం చాలా ఛీ-ఛీగా ఉంది, ఇది మనం ఉండేందుకు యోగ్యంగా లేదు. మనకు తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభిస్తుంది, ఈ నిశ్చయం ఆధారంగా మీరు జీవిస్తూనే ఈ పాత ప్రపంచం మరియు పాత శరీరం నుండి మరణించి తండ్రికి చెందినవారిగా అవుతారు. తండ్రి ద్వారానే విశ్వ రాజ్యం లభిస్తుందని మీకు నిశ్చయముంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ దారిలోనే మరణించాలి… (మర్నా తేరీ గలీ మే…) 

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను పాడుతారు. ఎవరైతే రాతిబుద్ధి కలవారిగా ఉండేవారో, వారు పారసబుద్ధి కలవారిగా అవ్వడానికి ఇప్పుడు పాట పాడుతారు. రాళ్ళు పాట పాడాయి అని ఒక పాట కూడా ఉంది. ఆ రాళ్ళు అయితే పాట పాడవు కానీ రాతిబుద్ధి కల మనుష్యులు పాడుతారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ బుద్ధి లభించింది. ఈశ్వరుడు తమ పిల్లలకు బుద్ధినిచ్చారు. ఎప్పుడైతే మనం ఈశ్వరునికి చెందినవారిగా అయ్యామో, అప్పుడు మనం దేహ సహితంగా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాము ఎందుకంటే ఇది ఉండేందుకు యోగ్యమైన ప్రపంచం కాదు. ఇది చాలా ఛీ-ఛీగా ఉంది, ఇందులో చాలా గొడవలున్నాయి, వ్యాపార-వ్యవహారాలు ఉన్నాయి. ఎటువంటి సుఖమూ లేదు. అందుకే మేము మీ మెడలోని మాలలో కూర్చబడతాము. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని మేము మీకు చెందినవారిగానే అవుతాము. కనుక పాత ప్రపంచం, పాత శరీరం నుండి మనసు తొలగిపోతుంది ఎందుకంటే మీ నుండి మాకు కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభిస్తుందని తెలుసు. ఎప్పటివరకైతే ఈ నిశ్చయం కలగదో, అప్పటివరకు వారు బ్రాహ్మణులుగా అవ్వలేరు. జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అవ్వాలి. నిరాకార తండ్రినే బాబా అని అంటారు. మీరు మా తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. మీరు మాకు ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేవారు కూడా. మీరు తండ్రి రూపంలో విశ్వరాజ్యం యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు. శిక్షకుని రూపంలో మొత్తం బ్రహ్మాండం మరియు ప్రపంచం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేవారు. సద్గురువు రూపంలో మమ్మల్ని మీతో పాటు ముక్తిధామానికి తీసుకువెళ్తారు, మళ్ళీ జీవన్ముక్తిలోకి పంపిస్తారు. ఓ బాబా, మేము మీతో పాటే వస్తాము, మీరే మా సత్యమైన సద్గురువు అని అంటారు కూడా. ఆ గురువులైతే తమతో పాటు తీసుకువెళ్ళరు. వారికైతే ముక్తి-జీవన్ముక్తుల మార్గం గురించే తెలియదు. వారైతే తండ్రిని సర్వవ్యాపి అని అంటారు, అటువంటప్పుడు వారసత్వాన్ని ఎవరిస్తారు! ఓ గాడ్, అని ఎవరిని అంటారు. ఇప్పుడు మనం నిరాకార శివబాబాకు చెందినవారిగా అయ్యామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మా దేహభానం తెగిపోయింది. మేము మీ డైరెక్షన్లపై నడుస్తాము. మీరు చెప్తారు, దేహ సంబంధాల నుండి బుద్ధిని తొలగించి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్ను స్మృతి చేయండి అని. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు, మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే. తర్వాత ఇక ఏ సంబంధమూ ఉండదు. ఎప్పటి వరకైతే తల్లి గర్భంలో ప్రవేశించరో, అప్పటి వరకు మీ కొరకు అసలు ఏ ప్రపంచము ఉండదు. ప్రపంచానికి మీరు వేరుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, మీరు జీవిస్తూ అంతటినీ మరచి నాకు చెందినవారిగా అవ్వండి. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. దేవతలెప్పుడూ పతిత ప్రపంచంలోకి రారు. లక్ష్మిని ఆహ్వానించినప్పుడు శుభ్రపరచడం మొదలైనవి చాలా చేస్తారు, కానీ లక్ష్మి రావడానికి ఇదేమైనా సత్యయుగమా. మరి నారాయణుడు ఎక్కడ నుండి వస్తారు? మహాలక్ష్మికి 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? ఇది ఇరువురి రూపము అని ఎవరైనా ఏమైనా అర్థం చేసుకుంటారా. 4 భుజాలు ఉండే ఈ విధమైన చిత్రాన్ని ఎవరూ తయారుచేయలేరు. అలాగైతే 2 ముఖాలను చూపించాలి కదా. 4 కాళ్ళనైతే ఎప్పుడూ చూపించరు ఎందుకంటే మనుష్యులు ఎప్పుడూ ఈ విధంగా ఉండజాలరు. ఇదంతా వీరు యుగళులైన లక్ష్మీ-నారాయణులు అని అర్థం చేయించడం కోసం ఉంది. వేర్వేరుగా చూపించినట్లయితే 2 భుజాలు, 2 కాళ్ళు కూడా ఉంటాయి. తండ్రి అంటారు, మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పరచండి, ఏమనంటే, వారు మన తండ్రి, టీచరు, గురువు, ముగ్గురూ కూడా, వారు మనందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. చివర్లో వచ్చి జ్ఞానమివ్వడానికి లేక తమతో పాటు తీసుకువెళ్ళడానికి వారికి శిష్యులు ఎవ్వరూ లేరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఎందుకంటే నాటకం పూర్తి అవుతుంది. తండ్రి అంటారు, సర్వుల సద్గతిదాతను, పతిత-పావనుడను నేను, కాలుడికే కాలుడను. ఈ యమదూతలు మొదలైనవారి సాక్షాత్కారం జరుగుతుంది ఎందుకంటే పాపాలు చేసి శిక్షలు కూడా అనుభవిస్తారు. ఇకపోతే, యమదూతలు మొదలైనవారెవ్వరూ లేరు. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది. గర్భంలో శిక్ష లభించినప్పుడు ఆర్తనాదాలు చేస్తారు. ఇప్పుడు మొట్టమొదట పిల్లలు ఇదే నిశ్చయం ఏర్పరచుకోవాలి, ఏమనంటే, వీరే మాకు తండ్రి, టీచరు, సద్గురువు మరియు వీరొక్కరినే స్మృతి చేయాలి. రచయిత కూడా ఒక్కరే ఉంటారు. 10 మంది లేక 100 మంది రచయితలు లేరు, అలాగే 10 ప్రపంచాలూ లేవు.

పిల్లలు అంటారు, బాబా, మేము మీ మెడలోని హారంగా అవ్వాలి. అప్పుడు మన రుద్రమాల తయారవుతుంది. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు. మీ మాల తయారవ్వజాలదు ఎందుకంటే మీరు పడుతూ-లేస్తూ ఉంటారు. మేము బాబా మాలగా అయి, మళ్ళీ విష్ణు మాలగా అవుతామని మీకు తెలుసు. మొట్టమొదట, నిరాకారీ మాల అయిన మీరు పరంధామంలోకి వస్తారు. తర్వాత సాకారీ మాలగా అయి విష్ణు లోకంలోకి వస్తారు. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. పిల్లలు అంటారు, మేము జీవిస్తూనే మీకు చెందినవారిగా అయ్యాము. సాకార మనుష్యులు సాకార మనుష్యులను దత్తత తీసుకుంటారు. ఇక్కడ నిరాకారీ ఆత్మలైన మిమ్మల్ని నిరాకార శివబాబా దత్తత తీసుకుంటారు. బ్రహ్మా ద్వారా అంటారు, ఓ ఆత్మలూ, మీరు నా వారు. ఓ సాకారులూ, మీరు నా వారు అని ఇలా అనరు. ఇక్కడ నిరాకారులు, నిరాకారునితో అంటారు, నేను మీ వాడిని. ఇకపోతే, బయట ఎవరైతే దత్తత తీసుకుంటారో, వారు శరీరాన్ని చూస్తారు. స్వయాన్ని ఆత్మగా కూడా భావించరు. సోదరుడు సోదరుడిని దత్తత తీసుకుంటే ఏం లభిస్తుంది? ఇక్కడైతే, వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి దత్తత తీసుకుంటారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు, ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో, వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చుంటాయి. నిరాకార తండ్రి అంటారు – దేహ భానాన్ని విడిచి నాకు చెందినవారిగా అయినట్లయితే నేను మిమ్మల్ని నిరాకారీ ప్రపంచంలోకి నాతో పాటు తీసుకువెళ్తాను. శ్రీకృష్ణుని ఆత్మను పరమాత్మ అని అనలేరు. వారు కూడా 84 జన్మలను పూర్తిగా తీసుకుంటారు. లక్ష్మీ-నారాయణుల రాజధాని నడిచింది. రాజు రాజే, రాణి రాణినే. అందరికీ తమ భిన్న-భిన్న పాత్రలు లభించి ఉన్నాయి. 84 జన్మలను తీసుకుంటారు. ఇది ఒక్కరి విషయం కాదు. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాలి. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అన్నది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. 84 లక్షల జన్మలు అనడంతో మొత్తం విషయం మారిపోతుంది. లక్షల సంవత్సరాల విషయమైతే గుర్తు కూడా రాదు. ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈ రోజు భ్రష్టాచారీ ప్రపంచం ఉంది, రేపు శ్రేష్ఠాచారిగా తయారవుతుందని మనం రాయవచ్చు. మేము న్యూ ఇండియాను తయారుచేసే తీరుతామని శాస్త్రి రాసారు కదా. ఇప్పుడు న్యూ ఇండియా (కొత్త భారత్) అయితే కొత్త ప్రపంచంలో ఉంటుంది. అక్కడ దేవతా ధర్మం తప్ప ఇతర ఏ ధర్మమూ ఉండనే ఉండదు. ఇప్పుడైతే భారత్ లో ఎన్నో ధర్మాలున్నాయి. అనేక రకాల కొమ్మలు, రెమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చివరి సమయంలోనివి. లక్ష్మీ-నారాయణులే ఇప్పుడు బ్రహ్మా-సరస్వతులుగా అయ్యారని కూడా చూపించారు. మళ్ళీ బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. అందుకే, విష్ణువు నుండి బ్రహ్మా వెలువడ్డారు, బ్రహ్మా నుండి మళ్ళీ విష్ణువు వెలువడ్డారని చూపిస్తారు. మీరిప్పుడు విష్ణు కులానికి చెందినవారిగా అవుతున్నారు. తప్పకుండా ఇప్పుడు నాటకం పూర్తి అవ్వనున్నది అని ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారికే సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది. నాటకం అని అనడంతో ఆది మధ్యాంతాలు అన్నీ గుర్తుకొస్తాయి. మీ వద్ద ఎవరైతే తెలివైనవారుంటారో, వారికి అనంతమైన డ్రామా యొక్క స్మృతి ఉంటుంది. మొదట సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యముండేది, ఆ తర్వాత బయటివారు వచ్చారు. వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అయ్యారు. ఆత్మలమైన మనం ఈ విధంగా 84 జన్మలను తీసుకున్నాము. ఇది కూడా చాలా మందికి గుర్తుకు రాదు. డ్రామా యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానముండాలి. ఇది 5 వేల సంవత్సరాల నాటకము, ఇది బుద్ధిలో ఉండాలి. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది! 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. పరమాత్మ కూడా ఎంత చిన్నగా ఉంటారు! వారు కూడా పాత్రను అభినయించేందుకు బంధించబడి ఉన్నారు. డ్రామాకు వశమై ఉన్నారు. సంగమం వచ్చినప్పుడు వారు పాత్రను అభినయించే సమయం ఇమర్జ్ అవుతుంది. శాస్త్రాలలోనేమో, భగవంతునికి కొత్త సృష్టిని రచించాలి అన్న సంకల్పం కలిగిందని రాసారు. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేని విధంగా రాసారు. అవన్నీ గతం యొక్క విషయాలు. మీరైతే ప్రాక్టికల్ గా పాత్రను అభినయిస్తున్నారు. వారు మా తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ కూడా అని మీకు తెలుసు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ఇలా అనరు. గురువును గురువనే అంటారు. ఇక్కడైతే ముగ్గురూ ఒక్కరే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నాలెడ్జ్ ఫుల్ (జ్ఞానసంపన్నులు) అని గాడ్ ఫాదర్ నే అంటారు. వారిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానముంది ఎందుకంటే వారు చైతన్యమైనవారు. వారు వచ్చి మొత్తం జ్ఞానాన్ని ఇస్తారు. మనం ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టి బాబాతో పాటు వెళ్ళిపోతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడైతే మీరు కర్మాతీతులుగా అవుతారో, అప్పుడు మీలో ఇక ఏ భూతమూ ఉండదు. దేహాభిమానము మొదటి నంబరు భూతము. ఈ భూతాలందరికీ పెద్ద, రావణుడు. భారత్ లోనే రావణుడిని కాలుస్తారు. కానీ రావణుడంటే ఏమిటి అన్నది ఎవరికీ తెలియనే తెలియదు. దసరా, రక్షాబంధనం, దీపావళి ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారు అన్నది ఏమీ తెలియదు. ఆఖరుకి ఈ రావణుడు మరణించనున్నాడా లేక ఇలాగే కొనసాగుతూ ఉంటాడా అన్నది ఏమీ తెలియదు. రావణుడిని కాలుస్తారు, మళ్ళీ బ్రతుకుతాడు ఎందుకంటే ఇది అతడి రాజ్యము. సత్యయుగంలో రావణుడు ఉండనే ఉండడు. అక్కడ యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. యోగబలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అన్నప్పుడు యోగంతో పిల్లలు జన్మించలేరా. అక్కడ రావణుడే ఉండడు కావున భోగించడం యొక్క మాట కూడా ఉండదు. అందుకే కృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. వారు సంపూర్ణ నిర్వికారి. యోగీలు ఎప్పుడూ భోగించరు. ఒకవేళ భోగించేవారిగా అయినట్లయితే, యోగం చేయలేరు. ఇప్పుడు మీరు యోగం నేర్చుకుంటున్నారు. భోగించేవారిగా అవ్వడంతో లేక వికారాల్లోకి వెళ్ళడంతో యోగం కుదరదు. పిల్లలైన మీకు తండ్రి, టీచరు, సద్గురువు, ముగ్గురి వారసత్వం కలిపి లభిస్తుంది. సద్గురువు అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. వారు తీసుకువెళ్ళడమైతే అందరినీ తీసుకువెళ్తారు కానీ మీరు మెడలో హారంగా అవుతారు. ప్రియతముడు ప్రేయసులందరినీ తీసుకువెళ్తారు. మొదట ప్రియతముడు వెళ్తారు, ఆ తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ఆ తర్వాత వారి వంశావళి అంతా, ఆ తర్వాత ఇస్లాముల ఊరేగింపు మరియు వంశావళి, ఆ తర్వాత బౌద్ధుల వంశావళి వెళ్తారు. ఆత్మలందరూ తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళి కూర్చోవాలి. ఆత్మ నక్షత్రం వంటిది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అదృష్టవంతులే ధారణ చేసి, ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. అప్పుడు ఇవతలివారు మహిమను కూడా రాస్తారు, ఫలానా వారు మాకు అర్థం చేయించారు, అప్పుడు మా కపాటము తెరుచుకుంది, వీరు మాకు ప్రాణదానమిచ్చారు అని. తర్వాత వారి పట్లనే ప్రీతి ఏర్పడుతుంది, ఇక వారినే స్మృతి చేస్తూ ఉంటారు. కావున వారి నుండే విడిపించడం జరుగుతుంది. మధ్యవర్తిని ఏమైనా స్మృతి చేస్తారా. మధ్యవర్తి, మధ్యవర్తి కర్తవ్యాన్ని చేసారు, అంతే. ఇక ప్రేయసి, ప్రియుడిని గుర్తు చేస్తుంది. బ్రహ్మా కూడా మధ్యవర్తి వంటివారు. ఆ శివబాబానే స్మృతి చేయాలి. ఈ మధ్యవర్తి కూడా వారినే స్మృతి చేస్తారు, వీరికి మహిమ లేదు. వీరైతే పతితులు. మొదట వీరిలో ప్రవేశించి వీరిని పావనంగా చేసారు. ఒకరు పతితుడు, మరొకరు పావనుడు. సూక్ష్మవతనంలో బ్రహ్మా పావనుడు. వారి ముఖాన్ని కూడా చూపించాలి. వివరణ అయితే మళ్ళీ-మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కానీ తండ్రికి చెందినవారిగా అవ్వాలి కదా. బాబా, మేము మీ వారిగా అయ్యాము. మీరు మాకు తండ్రి, టీచరు, సద్గురువు. తండ్రి అంటారు, నేను కూడా మిమ్మల్ని స్వీకరిస్తాను కానీ గుర్తుంచుకోండి, నా గౌరవాన్ని పోగొట్టకండి. నాకు చెందినవారిగా అయి మళ్ళీ వికారాల్లోకి వెళ్ళకండి. వాస్తవానికి ఈ సమయంలో అందరూ నరకవాసులు. స్వర్గాన్ని స్మృతి చేస్తారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు. అరే, స్వర్గం ఎక్కడుంది? ఒకవేళ స్వర్గానికి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడకు పిలిచి భోజనం మొదలైనవి ఎందుకు తినిపిస్తారు? పతిత ప్రపంచంలో పతిత బ్రాహ్మణులకే తినిపిస్తారు. పావనులైతే ఎవరూ లేరు. కానీ ఈ చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానమిచ్చేటువంటి మధ్యవర్తి పట్ల ప్రీతి పెట్టుకోకుండా ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. వారే ప్రాణదానాన్ని ఇచ్చేవారు.

2. ఈ అనంతమైన నాటకాన్ని బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహ భానాన్ని విడిచి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి.

వరదానము:-

సంగమయుగీ బ్రాహ్మణాత్మల కర్తవ్యము, సదా సంతోషంగా ఉండడము మరియు సంతోషాన్ని పంచడము. కానీ దీని కోసం ఖజానా నిండుగా ఉండాలి. ఇప్పుడు ఎంతగా నాజూకు సమయం దగ్గరకు వస్తూ ఉంటుందో, అంతగా అనేకమంది ఆత్మలు మీ నుండి కొంత సమయం కోసం సంతోషాన్ని వేడుకునేందుకు వస్తారు. కనుక ఎంత సేవ చేయాలంటే, ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దీని కోసం ముఖంపై సదా సంతోషపు గుర్తులుండాలి, ఎప్పుడూ కూడా మూడ్ ఆఫ్ గా ఉన్నటువంటి, మాయతో ఓడిపోయేటువంటి, నిరాశగా ఉన్నటువంటి ముఖం ఉండకూడదు. సదా సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి – అప్పుడు హీరో, హీరోయిన్ పాత్రధారులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top