23 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 22, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏ కర్మ వికర్మగా అవ్వకూడదు, దీని కోసం చాలా జాగ్రత్తగా ఉండాలి, అడుగడుగునా తండ్రి శ్రీమతాన్ని తీసుకుని కర్మలోకి రావాలి’’

ప్రశ్న: -

వికర్మల నుండి ఎవరు రక్షింపబడగలరు? తండ్రి సహాయం ఎవరికి లభిస్తుంది?

జవాబు:-

ఎవరైతే తండ్రితో సదా సత్యంగా ఉంటారో, ప్రతిజ్ఞ చేసి, వికారాలను దానమిచ్చి, తిరిగి తీసుకునే సంకల్పం చేయరో, వారు వికర్మల నుండి రక్షింపబడతారు. ఎవరైతే కర్మ వికర్మగా అవ్వకముందే తండ్రి నుండి సలహా తీసుకుంటారో, సాకారునికి తమ సత్యాతి-సత్యమైన సమాచారాన్ని తెలియజేస్తారో, వారికి తండ్రి సహాయం లభిస్తుంది. బాబా అంటారు, పిల్లలూ, సర్జన్ ఎదురుగా ఎప్పుడూ మీ రోగాన్ని దాచిపెట్టకండి. పాపాలను దాచి పెట్టినట్లయితే, అవి వృద్ధి చెందుతూ ఉంటాయి, పదవి కూడా భ్రష్టమవుతుంది, శిక్షలను కూడా అనుభవించాల్సి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

బాల్యపు రోజులను మర్చిపోకండి… (బచ్పన్ కే దిన్ భులా న దేనా…)

ఓంశాంతి. పిల్లలు పాటలో ఏమని విన్నారంటే, తండ్రి పిల్లలను సావధానపరుస్తారు – ఓ పిల్లలూ, మీరు వచ్చి ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారు మరియు మీరు ఈశ్వరుని సంతానమని మీకు తెలుసు. వారు గాడ్ ఫాదర్ అని మొత్తం ప్రపంచమంతా నమ్ముతుంది. ఫాదర్ అనగా మనం వారి సంతానమైనట్లు. పరమపిత అయితే పిల్లలూ అనే అంటారు. మీరు లౌకిక తండ్రికి కూడా పిల్లలే. ఇప్పుడు పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఎందుకోసము? అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవడం కోసము. తండ్రి ఉన్నదే స్వర్గ రచయిత, స్వర్గంలో తప్పకుండా దేవతల రాజ్యాధికారం ఉంది. ఇది తెలుసుకుని మీరు పిల్లలుగా అయ్యారు. రాజుకు ఒకవేళ పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. షావుకార్లకే దత్తత అవుతారు. ఎప్పుడూ పేదవారికి దత్తత అవ్వరు. ఏదైనా లాభముంటేనే దత్తత అవుతారు. మేము ఈశ్వరునికి చెందినవారిగా అయ్యాము, వారి నుండి స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని మీకు కూడా ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇటువంటి తండ్రిని ఎప్పుడూ మర్చిపోకూడదు, వారి మతంపై నడుచుకోవాలి. రావణుని మతంపైనైతే వికర్మలు చేస్తూ ఉంటారు. ఈ 5 వికారాలకు వశమవ్వకూడదు. ఎక్కడైనా మోసపోతారేమో అని గమనిస్తే, వెంటనే బాబా నుండి సలహా తీసుకోవాలి. కర్మ వికర్మగా అవ్వకముందే అడగాలి, బాబా, మేము ఇది చేయవచ్చా అని! అప్పుడు, దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకండి అని అర్థం చేయించడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అడుగడుగునా పరమపిత పరమాత్ముని మతముపై నడుస్తూ ఉండండి. ఎప్పుడైనా, ఏదైనా విషయం అర్థం కాకపోతే అడగాలి – బాబా, నేను ఫలానావారిపై మోహితుడనయ్యాను, నన్ను కామం యొక్క భూతం కమ్మేసింది. తుఫాన్లు అయితే చాలా వస్తాయి కానీ స్వయాన్ని సంభాళించుకోవాలి. బురదలో పడిపోయారంటే అనంతమైన తండ్రిని మరచి నల్ల ముఖం చేసుకున్నట్లే. బాబా మిమ్మల్ని తెల్లగా చేయడానికి వచ్చారు కావున 5 వికారాల వలలో ఎప్పుడూ చిక్కుకోకూడదు. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో, అప్పుడు చిక్కుకుంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే బాబా ఉన్నారని భయం ఉంటుంది. వికారాల్లోకి వెళ్ళారంటే పెద్ద వికర్మ అవుతుంది ఎందుకంటే మీరు వికారాలను దానమిచ్చారు. ఒకవేళ దానమిచ్చి తిరిగి తీసుకున్నట్లయితే, హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ధనం యొక్క విషయమైతే ఏమీ లేదు. ఇక్కడున్నది 5 వికారాలను దానమిచ్చే విషయము. మీ వద్ద ఏవైతే ముళ్ళు ఉన్నాయో, వాటిని దానంగా ఇవ్వండి, ఇక మళ్ళీ ఎప్పుడూ ఉపయోగించకండి. ఒకవేళ తిరిగి తీసుకోవాలంటే, ముందు చెప్పాలి, చెప్పకపోతే పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది, మళ్ళీ-మళ్ళీ వికారాల్లోకి వెళ్తూ ఉంటారు. చెప్పినట్లయితే సహాయం లభిస్తుంది. మనం శివబాబా పిల్లలము. ఎప్పుడూ ఓడిపోము అని తండ్రికి ప్రతిజ్ఞ చేసాము. ఇది 5 వికారాల రూపీ శత్రువును జయించేటువంటి బాక్సింగ్. ఇందులో ఎప్పుడూ ఓడిపోము. ఒకవేళ పడిపోయారంటే శివబాబాకు వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ అలా జరిగితే, సాకారునికి రాయాలి అని ఆజ్ఞ లభించింది, ఒకవేళ రాయకపోతే వికర్మ పెరుగుతూ ఉంటుంది మరియు 100 రెట్లు శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. బాబాకు చెప్పినట్లయితే సగం కట్ అవుతుంది. సిగ్గుగా అనిపించడం కారణంగా సమాచారం ఇవ్వనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఏ విధంగా ఏదైనా అశుద్ధ రోగం ఉంటే సర్జన్ కు చెప్పడానికి మనసు తింటుంది – సర్జన్ ఏమంటారు? దాని ఫలితం ఏమవుతుంది? అని. రోగం పెరుగుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఏదైనా పాపం జరిగితే దాచి పెట్టవద్దు, లేదంటే పూర్తిగా పద భ్రష్టులవుతారు మరియు కల్ప-కల్పాంతరాలు ఇటువంటి భ్రష్టమైన పదవే లభిస్తుంది, ఇక జ్ఞానాన్ని అయితే తీసుకోలేరు. బాబా, వారి గతి ఏమవుతుంది అని అడుగుతారు. వారు చాలా శిక్షలు అనుభవిస్తారు. వినాశన సమయంలో శిక్షల లెక్కాచారాలు తీరుతాయి కదా. ఏ విధంగా కాశీలో కత్తుల బావిలో దూకి ప్రాణ త్యాగం చేసుకునే ఆచారం ఉంది, ఇప్పుడు శివునిపై సత్యాతి-సత్యంగా మీరు బలి అవుతారు. వారసత్వం తీసుకునేందుకు శివునికి చెందినవారిగా అవుతారు. ఇకపోతే, అక్కడ ఎవరైతే కాశీలో బలి అవుతారో, అది జీవ హత్య చేసుకోవడం అవుతుంది కానీ నవవిధ భక్తితో బలి అయినట్లయితే, అప్పటివరకు ఏవైతే పాపాలు చేసారో, వాటికి శిక్ష ఆ సమయంలో అనుభవిస్తారు, తద్వారా పాపలు సమాప్తమైపోతాయి. కానీ మళ్ళీ పాపాలు చేయడం నుండైతే విముక్తులవ్వలేరు. యోగాగ్నితోనే పాపాలు భస్మం అవ్వగలవు. మాయా రాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి. సత్యయుగంలో వికర్మలుగా అవ్వవు ఎందుకంటే మాయా రాజ్యమే లేదు. ఇప్పుడు ప్రపంచమంతా భ్రష్టాచారిగా ఉంది. మొదటి నంబరు భ్రష్టాచారము – వికారాల్లోకి వెళ్ళడము. ఎవరైతే భ్రష్టాచారంతోనే జన్మిస్తారో, వారు పాపాలే చేస్తారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. రావణుడిని కాలుస్తారు కానీ రావణుడంటే ఏమిటి అనేది అసలు తెలియనే తెలియదు. రావణుడు అని 5 వికారాలను అంటారు. స్వర్గంలో ఈ వికారాలు ఉండవు, అందుకే దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ వేరే రాజ్యము లేక ఖండము ఉండనే ఉండదు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారంతా తర్వాత వచ్చారు. వారు కూడా మొదట సతోప్రధానంగా ఉంటారు, తర్వాత రజో, తమోలలోకి వస్తారు. సత్య-త్రేతా యుగాలలో సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా, సంపూర్ణ వికారులుగా అవుతూ వచ్చారు. పూర్తిగా వికారులుగా అవ్వడానికి కూడా సమయం పడుతుంది. సత్యయుగంలో 16 కళలు, తర్వాత 14 కళలు, ఆ తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి ఎందుకంటే ఉన్నదే దిగే కళ. ఇప్పుడు మీది ఎక్కే కళ. ఎక్కే కళను రాముడు తయారుచేస్తారు, దిగే కళను రావణుడు తయారుచేస్తాడు. ఏ విధంగా చంద్రుని కళ నెమ్మది-నెమ్మదిగా తగ్గుతూ వస్తుందో, ప్రపంచం కూడా అలానే ఉంది. ఇప్పుడైతే ఏ కళ లేదు. ఇటువంటి సమయంలో తండ్రి వచ్చి మళ్ళీ 16 కళలు కలవారిగా తయారుచేస్తారు. ఈ ఆట అంతా భారత్ పైనే తయారై ఉంది. వర్ణాలు కూడా భారత్ కు చెందినవే, లేదంటే 84 జన్మల లెక్క ఎలా కుదురుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇది ఉన్నదే ఇనుపయుగ ప్రపంచము. ఇది కలియుగ అంతిమము, మళ్ళీ సత్యయుగ ఆది జరుగుతుంది. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిన దేవీ-దేవతా ధర్మం వారు మళ్ళీ వస్తారు. మీరు వచ్చారు కదా. చూడండి, వృక్షం చివర్లో బ్రహ్మా నిలబడి ఉన్నారు, వారు తమోప్రధానంగా ఉన్నారు మరియు సతోప్రధానంగా అయ్యేందుకు కింద తపస్య చేస్తున్నారు. కావున బ్రహ్మా ఎలా తపస్య చేస్తున్నారో, అలానే బ్రహ్మాకుమారులు, కుమారీలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు సతోప్రధానంగా అవుతున్న ఈ బ్రహ్మాలోకి పరమాత్మ వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. వీరికి కూడా తెలియజేస్తారు, అలాగే పిల్లలకు కూడా తెలియజేస్తారు. బాబా మరియు పిల్లలైన మీరు దేవతలుగా అయ్యేందుకు కల్పవృక్షము కింద తపస్య చేస్తున్నారు. ఈ మందిరము ఖచ్ఛితంగా మీ స్మృతిచిహ్నమే. ఇది ఉన్నతోన్నతమైన మందిరం అని ఈ మందిరం యొక్క పూర్తి చరిత్ర-భౌగోళికాన్ని తెలియజేసే బుద్ధిశాలి బిడ్డ ఎవరైనా ఉండాలి. ఇందులో మమ్మా కూడా ఉన్నారు, బాబా కూడా ఉన్నారు, పిల్లలు తపస్య చేస్తున్నారు. ఎవరైతే భారత్ ను స్వర్గంగా తయారుచేసారో, వారి చరిత్ర-భౌగోళికాన్ని విదేశీయులు విన్నట్లయితే – ఇది భారత్ ను స్వర్గంగా తయారుచేసే మా తండ్రి మందిరము అని అంటారు. వారు ఈ సమయంలో ప్రాక్టికల్ గా కూర్చుని ఉన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ చిత్రాలన్నీ అంధ విశ్వాసంతో తయారుచేయబడినవి, దీనిని భూత పూజ అని అంటారు, బొమ్మల పూజ. సిక్కు ధర్మాన్ని స్థాపన చేసిన గురునానక్ ఆత్మ, కొత్త ఆత్మ, నిర్వికారి ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడికి వచ్చింది? తప్పకుండా ఏదో ఒక శరీరంలో ప్రవేశించి ఉంటారు కనుక పవిత్రాత్మ ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించలేదు. మొదట అయితే ఆ ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుంది, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. అసలు వికర్మలే చేయనప్పుడు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తుంది! మనం కూడా మొదట సంపూర్ణంగా ఉంటాము, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గుతాయి. ప్రతి మనిషి విషయంలో ఇలాగే జరుగుతుంది. పతిత-పావనా రండి అని పిలుస్తారు కావున తప్పకుండా వచ్చి పావన ప్రపంచ స్థాపన చేస్తారు మరియు పతిత ప్రపంచ వినాశనం చేస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన మరియు శంకరుని ద్వారా వినాశము. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందిన వారుంటారో, ఇది వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. అందుకే బాబా అంటారు, భక్తులకు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. మేము మొదట దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని, తర్వాత అసురులుగా అయ్యామని ఎవరికీ తెలియనే తెలియదు. లక్ష్మీ-నారాయణులు పూర్తి 84 జన్మలను తీసుకున్నారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, ఎవరైతే తర్వాత వస్తారో, వారు బ్రాహ్మణులుగా అవ్వరు. కల్పక్రితం ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనైతే కూర్చున్నాయో, వారి బుద్ధిలోనే మళ్ళీ కూర్చుంటాయి లేదంటే బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతాయి. ఇందులో శ్రమ ఉంది. మిగతా స్థానాల్లోనైతే కేవలం కథలు విని, మళ్ళీ ఇంటికి వెళ్ళి వికారాల్లో పడిపోతారు. గురువును పూర్తిగా ఫాలో చేయరు. మరి వారు ఫాలోవర్స్ (అనుచరులు)గా ఎలా పిలువబడతారు. గురువులు కూడా వారిని ఏమీ అనరు. ఒకవేళ ఏమైనా అంటే, ఇక ఫాలోవర్స్ ఒక్కరు కూడా మిగలరు, ఇక వారు ఎక్కడ నుండి తింటారు! గృహస్థులదే తింటారు కదా, మళ్ళీ వికారుల వద్ద జన్మ తీసుకోవాల్సి వస్తుంది. దేవతలైతే సన్యాసం చేయరు. ఇది ప్రవృత్తి మార్గపు సన్యాసము. అది నివృత్తి మార్గపు సన్యాసము. తండ్రి వచ్చి స్త్రీ-పురుషులు ఇరువురికీ అర్థం చేయిస్తారు, పిల్లలూ, సంపూర్ణ పవిత్రంగా అయినట్లయితే, సంపూర్ణ రాజ్య పదవిని పొందుతారు. తక్కువ పవిత్రంగా అయినట్లయితే, తక్కువ పదవిని పొందుతారు. తల్లి-తండ్రిని ఫాలో చేయాలి.

తండ్రి అంటారు, తల్లి-తండ్రి వలె శ్రమించినట్లయితే సింహాసనాధికారులుగా అవుతారు. ముఖ్యమైన విషయము – పవిత్రతకు సంబంధించినది. ఇప్పుడు దేహాభిమానాన్ని వదలండి. నేను ఆత్మను, బాబా తీసుకువెళ్ళడానికి వచ్చారు, పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కుంభ మేళా అని అంటారు. ఆ త్రివేణి మొదలైనవి నదుల మేళాలు, వాటిని సంగమమని అంటారు. వాస్తవానికి ఇది అనేక నదులు మరియు సాగరం యొక్క మేళా. మీరంతా జ్ఞాన నదులు – తండ్రి జ్ఞానసాగరుడు. తండ్రి అంటారు, నాతో యోగం జోడించినట్లయితే, పతితం నుండి పావనంగా అవుతారు. తప్పకుండా మరణించాల్సిందే. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, అయితే, ఇప్పుడే భక్తి ఫలితాన్ని భగవంతుడి నుండి తీసుకోగలరు. లేదంటే మీరు భక్తి చేయలేదని భావించడం జరుగుతుంది. భక్తి చేసేవారే వచ్చి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మిగిలినవారందరి బుద్ధిలోనైతే శాస్త్రాలే ఉంటాయి. ఇక్కడ జ్ఞానసాగరుడైన తండ్రి అర్థం చేయిస్తున్నారు కావున మీరు శ్రేష్ఠంగా అవుతున్నారు. రాజధానిని స్థాపన చేయడంలో ఎంత శ్రమ ఉంటుంది. రుద్ర జ్ఞాన యజ్ఞంలో చాలా విఘ్నాలు కలుగుతాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ కూడా వికారాల వలలో చిక్కుకోకూడదు. కర్మ వికర్మగా అవ్వకూడదు, అందుకే కర్మ చేసే ముందే తండ్రి నుండి సలహా తీసుకోవాలి.

2. తల్లి-తండ్రిని ఫాలో చేయాలి. ఉన్నత పదవి కోసం సంపూర్ణ పావనంగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-

పాస్ విత్ ఆనర్ (గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే) సర్టిఫికెట్ ను ప్రాప్తి చేసుకునేందుకు నోరు మరియు మనసు, ఈ రెండింటి శబ్దాలకు అతీతంగా శాంత స్వరూప స్థితిలో స్థితులయ్యే అభ్యాసం కావాలి. ఆత్మ శాంతి సాగరంలో ఇమిడిపోవాలి. ఈ స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతి చాలా ప్రియమనిపిస్తుంది. తనువు మరియు మనసుకు విశ్రాంతి లభిస్తుంది. అంతిమంలో ఈ అశరీరిగా అయ్యే అభ్యాసమే పనికొస్తుంది. శరీరం యొక్క ఏ ఆట నడుస్తున్నా సరే, అశరీరిగా అయి ఆత్మ సాక్షీగా (అతీతంగా) అయి తన శరీరం యొక్క పాత్రను చూడాలి, ఈ అవస్థనే అంతిమంలో విజయులుగా చేస్తుంది.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహా వాక్యాలు – సృష్టిపై ఎప్పుడూ ప్రళయం జరగదు

సృష్టిపై ప్రళయం ఎప్పుడూ జరగదు. ఈ సృష్టిపై ఏదో ఒక సమయంలో ప్రళయం తప్పకుండా జరుగుతుంది అని ఇప్పుడు మనుష్యులు ఏదైతే భావిస్తారో, వారు ప్రళయమంటే సృష్టి జలమయమైపోవటమని భావిస్తారు. కొత్త సృష్టి స్థాపన అవుతుంది, ఆ కొత్త సృష్టి యొక్క ప్రారంభాన్ని ఎలా చూపిస్తారంటే, సృష్టి ఆదిలో దేవత అయిన శ్రీకృష్ణుడు రావి ఆకుపై బొటనవేలును చప్పరిస్తూ సృష్టిపైకి వస్తారు, ఈ విధంగా సృష్టి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడిది వివేకంతో ఆలోచించాల్సిన విషయము, మనం ప్రళయమంటే జలమయమైపోవడము అని అన్నట్లయితే, ఒక్కరు కూడా ఈ సృష్టిపై ఉండకూడదని దీని అర్థము. మనుష్యులకు ప్రళయమంటే ఏమిటో తెలియదు. ప్రళయం యొక్క యథార్థ అర్థం ఏమిటంటే, సృష్టిపై ఇంతటి అపవిత్రత ఉన్న కారణంగా సృష్టి దుఃఖమయమైపోయింది, ఆ అపవిత్రత యొక్క ప్రళయం జరుగుతుంది మరియు సృష్టి పవిత్రంగా అవుతుంది అనగా తమోగుణీ సృష్టి పరివర్తన అయి సతోగుణీ సృష్టిగా తయారవుతుంది కనుక దీని అర్థమేమిటంటే సృష్టిపై ప్రళయం జరగదు కానీ సృష్టిపై ఉన్న ఆసురీ అవగుణాల ప్రళయం జరుగుతుంది, అంతేకానీ మనుష్యుల ప్రళయం జరగదు. ఒకవేళ సృష్టిపై ప్రళయం జరిగినట్లయితే – గీత భగవానుడు సృష్టి అనాదిగా నడుస్తుంది అని వినిపించిన భగవానువాచను అసత్యమని భావించాలా? అయితే తప్పకుండా పాత ప్రపంచం అనగా తమోగుణీ సృష్టి వినాశనం అవుతుంది, మళ్ళీ కొత్త సతోగుణీ ప్రపంచ స్థాపన జరుగుతుంది. కనుక వినాశనం మరియు స్థాపన యొక్క కార్యాలు, రెండూ కలిసి ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సృష్టిపై ప్రళయం జరుగుతుందని అనము, ఈ సృష్టిపైనే స్వర్గం మరియు నరకం యొక్క స్థాపన జరుగుతుంది. ఇకపోతే, ఎప్పుడైతే స్వర్గం ఉంటుందో, అప్పుడు నరకం ఉండదు, ఎప్పుడైతే నరకం ఉంటుందో, అప్పుడు స్వర్గం ఉండదు. ఎక్కడైతే పవిత్ర దేవీ-దేవతల నివాస స్థానం ఉంటుందో, దానిని స్వర్గం అని అంటారు మరియు ఎక్కడైతే అపవిత్ర మనుష్యాత్మల నివాస స్థానం ఉంటుందో, ఆ మృత్యులోకాన్ని నరకం అని అంటారు అనగా అపవిత్రత యొక్క ప్రళయం జరుగుతుంది.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top