22 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 21, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఒకవేళ తండ్రితో మిలనం జరుపుకోవాలంటే, పావనంగా అవ్వాలంటే, సత్యాతి-సత్యమైన ఆత్మిక ప్రేయసులుగా అవ్వండి, ఒక్క తండ్రిని తప్ప ఎవ్వరినీ స్మృతి చేయకండి’’

ప్రశ్న: -

బ్రాహ్మణులు ఎవరైతే దేవతలుగా అవుతారో, ఆ బ్రాహ్మణుల పదవి దేవతల కన్నా ఉన్నతమైనది, ఎలా?

జవాబు:-

బ్రాహ్మణులు ఈ సమయంలో సత్యాతి-సత్యమైన ఆత్మిక సమాజ సేవకులు. మనుష్యుల ఆత్మలకు పవిత్రత, యోగం యొక్క ఇంజెక్షన్ ను వేస్తారు. భారత్ యొక్క మునిగిపోయి ఉన్న నావను శ్రీమతంపై తీరానికి చేరుస్తారు. నరకవాసి భారత్ ను స్వర్గవాసిగా చేస్తారు. ఈ విధంగా దేవీ-దేవతలు చేయరు. వారైతే ఈ సమయంలోని సేవ యొక్క ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు, అందుకే బ్రాహ్మణులు దేవతల కన్నా ఉన్నతమైనవారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మా తీర్థాలు అతీతమైనవి…. (హమారే తీర్థ్ న్యారే హై…)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. జీవాత్మలమైన మనము, ఆత్మ మరియు శరీరము, ఆత్మను ఆత్మ అని, శరీరాన్ని జీవము అని అంటారు. ఆత్మలు పరంధామం నుండి వస్తాయి. ఇక్కడకు వచ్చి శరీరాలను ధారణ చేస్తాయి. ఇది కర్మక్షేత్రము, ఇక్కడకు వచ్చి మనం పాత్రను అభినయిస్తాము. తండ్రి అంటారు, నేను కూడా పాత్రను అభినయించాలి. నేనైతే పతితులను పావనంగా తయారుచేయడానికి వచ్చాను. ఈ సమయంలో, ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైనవారు లేరు. మళ్ళీ పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితమైనవారు ఉండరు. సత్య-త్రేతాయుగాలు పావనమైనవి, ద్వాపర-కలియుగాలు పతితమైనవి. పతిత-పావనుడైన తండ్రే వచ్చి అందరికీ శిక్షణను ఇస్తారు – ఓ ఆత్మలూ, మీరు ఈ శరీరంతో 84 జన్మల పాత్రను పూర్తి చేసారు. అందులో అర్ధ సమయం సుఖము, అర్ధ సమయం దుఃఖాన్ని పొందారు. దుఃఖం కూడా నెమ్మది-నెమ్మదిగా మొదలవుతుంది. ఇప్పుడు చాలా దుఃఖముంది. ముఖ్యంగా ఇప్పుడు చాలా ఆపదలు రానున్నాయి. ఈ సమయంలో అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. ఎవ్వరి యోగము తండ్రితో లేదు. ఆత్మ స్వయాన్ని మర్చిపోయింది. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఎలాగైతే ప్రేయసి, ప్రియుడు ఉంటారు కదా! ఎలాగైతే కుమారి మరియు కుమారుడు ఉన్నారనుకోండి, ఒకరి గురించి ఒకరికి అసలు తెలియనే తెలియదు. ఇరువురికి నిశ్చితార్థం జరగడంతో ప్రేయసి-ప్రియులుగా అయిపోతారు. ఆ నిశ్చితార్థం వికారాల కోసం జరుగుతుంది. వారిని వికారీ పతిత ప్రేయసీ-ప్రియులు అని అంటారు. వేరే ప్రేయసీ-ప్రియులు ఉంటారు, వారు కేవలం ముఖాన్ని చూసి ప్రేయసులుగా అవుతారు, లైలా-మజ్నూ మొదలైనవారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. వారు వికారాల్లోకి వెళ్ళరు. పని చేస్తూ-చేస్తూ, ప్రియుడు ఎదురుగా నిలబడిపోతాడు. ఎలాగైతే మీరా ఎదురుగా కృష్ణుడు నిలబడేవారు. ఇప్పుడు, ఇక్కడ పరమపిత పరమాత్మ ప్రియుడు, ఆత్మలమైన మనమంతా వారికి ప్రేయసులుగా అయ్యాము. అందరూ వారిని స్మృతి చేస్తారు. ప్రేయసులు చాలా మంది ఉన్నారు – అందరికీ ప్రియుడు ఒక్కరే. మనుష్యమాత్రులందరూ ఆ ఒక్కరికే ప్రేయసులు. భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి చేస్తారు. భక్తులు ప్రేయసులు, భగవంతుడు ప్రియుడు. ఇప్పుడు మిలనం ఎలా జరగాలి? కావున పరమాత్మ, ఎవరైతే అందరికీ ప్రియుడో, వారు వస్తారు. ఇప్పుడు వచ్చి అంటారు, ఒకవేళ పిల్లలైన మీరు నన్ను కలవాలనుకుంటే, నిరంతరము నన్నొక్కడినే స్మృతి చేయండి. నాతో యోగం జోడించి, నాకే ప్రేయసులుగా అవ్వండి. ఈ రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడిది వినాశనం అవ్వనున్నది. మిమ్మల్ని పావనంగా తయారుచేయడానికి నేను వచ్చాను. ఇది మీ అంతిమ జన్మ, అందుకే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి కూడా విముక్తులవుతారు. ఆ నిరాకార తండ్రి అంటారు, నా గారాబాల పిల్లలూ, ఇప్పుడు ఇది అంతిమ సమయము, తలపై పాపాల భారముంది. ఇప్పుడు పుణ్యాత్ములుగా అవ్వాలి. యోగం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు రావణ రాజ్యంలో పాపాత్ములుగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారుచేస్తాను. దేవతలు పుణ్యాత్ములు. పాపాత్ములే పుణ్యాత్ములను పూజిస్తారు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ, అందరూ అయితే మరణించాల్సిందే, అటువంటప్పుడు వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు! పుణ్యాత్ములుగా ఎందుకు అవ్వకూడదు! అన్నింటికన్నా పెద్ద పాపము – వికారాల్లోకి వెళ్ళడము. వికారులను పతితులు అని, నిర్వికారులను పావనులు అని అంటారు. సన్యాసులు కూడా పతితంగా ఉండేవారు, అందుకే పావనంగా అయ్యేందుకు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. ఎప్పుడైతే మళ్ళీ పావనంగా అవుతారో, అప్పుడు అందరూ వారికి తల వంచుతారు. ఇంతకుముందు పతితంగా ఉన్నప్పుడు ఎవరూ వంగేవారు కాదు. ఇక్కడైతే తల వంచడం మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, మనం ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చాము, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇప్పుడు దైహిక తీర్థ యాత్రలన్నీ సమాప్తమవ్వనున్నాయి. మీరు తిరిగి ఇంటికి, శాంతిధామానికి వెళ్ళాలి. ఎప్పుడైతే యాత్రలకు వెళ్తారో, యాత్ర చేసే సమయంలో పవిత్రంగా ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి పతితులుగా అవుతారు. అవి అల్పకాలం కోసం దైహిక యాత్రలు. ఇప్పుడు మీకు ఆత్మిక యాత్రను నేర్పిస్తారు. తండ్రి అంటారు – నా శ్రీమతంపై నడుచుకున్నట్లయితే మీరు అర్ధకల్పం అపవిత్రంగా అవ్వరు. సత్యయుగంలో రాధే-కృష్ణుల నిశ్చితార్థం పతితులుగా అయ్యేందుకు ఏమైనా జరుగుతుందా. అక్కడైతే పావనంగా ఉంటారు. ఎలాగైతే యోగబలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారో, అలా యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. అక్కడ పిల్లలు ఎప్పుడూ అల్లరి చేయరు ఎందుకంటే అక్కడ మాయ ఉండదు. పిల్లలు మంచి కర్మలే చేస్తారు. ఆ కర్మలు, అకర్మలుగా అవుతాయి. ఇక్కడ రావణ రాజ్యంలో మీ కర్మలు, వికర్మలుగా అవుతాయి. ఈ ఆట తయారై ఉంది. కుమార-కుమారీలైన మీరంతా పరస్పరంలో సోదరీ-సోదరులు. శివబాబాకు మనవలుగా అయ్యారు. స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వం తాతగారి నుండి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చి, స్త్రీ-పురుషులు ఇరువురి యోగం తమతో జోడింపజేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ ధైర్యాన్ని చూపించండి. కలిసి ఉంటూ, కామాగ్ని అంటుకోకూడదు, ఇలా ఉండి చూపిస్తే, అప్పుడు చాలా ఉన్నత పదవిని పొందుతారు. భీష్మ పితామహుని వలె బ్రహ్మచారిగా అవ్వడము, ఇందులో శ్రమ ఉంది. ఇది చాలా కష్టము అని మనుష్యులు భావిస్తారు. కానీ ఈ యుక్తిని తండ్రే నేర్పిస్తారు.

శివ భగవానువాచ – కృష్ణుడేమీ భగవంతుడు కారు. వారు దైవీ గుణాల కల మనిషి. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా సూక్ష్మవతనవాసులు. ఎలాగైతే బ్రాహ్మణుల పదవి దేవతల కన్నా కూడా ఉన్నతమైనదో, అలా బ్రహ్మా పదవి విష్ణువు కన్నా ఉన్నతమైనది ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆత్మిక సమాజ సేవకులు. మనుష్యాత్మలకు పవిత్రత, యోగం అనే ఇంజెక్షన్ ను వేస్తారు. మీరే ఈ భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు, అందుకే తయారుచేసేవారి మహిమ ఎక్కువగా ఉంది. మీరే దేవతలుగా అవుతారు కానీ ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయి సేవ చేస్తారు, దేవతా రూపంలో సేవ చేయరు. అక్కడైతే మీరు రాజ్యం చేస్తారు. నరకవాసి భారత్ ను స్వర్గవాసిగా చేయడము మీ సేవ, అందుకే వందేమాతరం అని అంటారు. ఇది శివ శక్తి సైన్యము. మమ్మాను సింహంపై స్వారీ చేసినట్లుగా చూపిస్తారు, కానీ అలా కాదు. మీరు సింహాలు ఎందుకంటే మీరు 5 వికారాలపై విజయం పొందుతారు. భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. ఇది ఉన్నతమైన సేవ అయినట్లు కదా, అందుకే శక్తుల మందిరాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనది ఒకటి. శక్తినిచ్చేవారు శివబాబా. మహిమ అంతా వారిదే. తర్వాత ఎవరెవరైతే సహాయకులుగా ఉన్నారో, వారి పేర్లు కూడా ఉన్నాయి. పురుషులైన పాండవులను కూడా మహారథులు అని అంటారు. స్త్రీ-పురుషులు ఇరువురూ కావాలి. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఎప్పుడూ వికారీ గురువులను ఆశ్రయించకూడదు. గృహస్థులను గురువులుగా చేసుకోవడంతో ఎలాంటి లాభం లేదు. గృహస్థి అనగా పతితులకు పతితులు లభించారు, వారెప్పుడూ కూడా పావనంగా చేయలేరు. సన్యాసులకు శిష్యులము అని స్వయం గురించి చెప్పుకుంటారు కానీ స్వయం సన్యాసులుగా అవ్వలేదంటే, ఇది కూడా అసత్యం అయినట్లే. ఈరోజుల్లో మోసం చాలా జరుగుతుంది. గృహస్థులు గురువులుగా అయి కూర్చొంటారు, పవిత్రత విషయం చెప్పరు. ఇక్కడైతే తండ్రి అంటారు, పవిత్రంగా అయితేనే పిల్లలు అని పిలవబడతారు. పావనంగా అవ్వకుండా రాజ్యం లభించదు. కావున తండ్రితో తప్పకుండా యోగం జోడించాలి. ఇకపోతే, ఎవరు ఎవరిని నమ్ముతారో, ఉదాహరణకు ఎవరైనా గురునానక్ ను నమ్మేవారైతే, వారు ఆ వంశంలోకి వెళ్తారు. ఎవరైతే ఈ సమయంలో శిక్షణ తీసుకొని పవిత్రంగా అవుతారో, వారు స్వర్గంలోకి వస్తారు. గురునానక్ ను ఏమీ దేవత అని అనరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. అక్కడ సుఖం చాలా ఉంటుంది, మిగిలిన ధర్మాలవారికి స్వర్గ సుఖాల గురించి తెలియదు. స్వర్గంలో ఉండేది భారతవాసులే. మిగిలినవారైతే తర్వాత వస్తారు. ఎవరెవరైతే దేవతలుగా అయ్యేది ఉందో, వారే అవుతారు. ఈ సమయంలో దేవతలను, లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు మరియు తమది హిందూ ధర్మమని అంటారు ఎందుకంటే పతితులుగా అయిపోయారు కావున తమ పవిత్ర ధర్మాన్ని మర్చిపోయి, హిందువులుగా చెప్పుకుంటారు. అరే, మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, మళ్ళీ మిమ్మల్ని మీరు హిందువులు అని ఎందుకు చెప్పుకుంటారు! హిందూ అనేది ధర్మమేమీ కాదు, కానీ వారు పడిపోయారు. దేవతలైతే చాలా కొద్ది మందే ఉంటారు, ఎవరైతే ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటారో – వారే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. కొంత శిక్షణ తీసుకుంటే, సాధారణ ప్రజల్లోకి వస్తారు. తండ్రికి చెందినవారిగా అయినట్లయితే విజయమాలలోకి వస్తారు. ఇప్పుడైతే ఆత్మిక ప్రేయసి-ప్రియులుగా అవ్వాలి. సత్యయుగంలో దైహికమైనవారిగా అవుతారు, కలియుగంలో కూడా దైహికమైనవారిగా అవుతారు. ఇప్పుడు సంగమయుగంలో, ఒక్క ఆత్మిక ప్రియునికి ప్రేయసులుగా అవ్వాలి.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. వికారాల్లోకి వెళ్తే వంద రెట్ల శిక్ష లభిస్తుంది, ఒకవేళ పడిపోయినట్లయితే – బాబా, నేను నల్ల ముఖం చేసుకున్నాను అని రాయాలి. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు మీరు తెల్లగా అవ్వాలి. కృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు, వారి ఆత్మ ఈ సమయంలో నల్లగా అయిపోయింది. మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చొని తెల్లగా అవుతుంది. 21 జన్మల కొరకు సుందరంగా అవుతుంది, మళ్ళీ శ్యామంగా అవుతుంది. ఈ శ్యామము మరియు సుందరము యొక్క ఆట తయారై ఉంది. శ్యామం నుండి సుందరంగా అయ్యేందుకు ఒక్క సెకెండు, సుందరం నుండి శ్యామంగా అయ్యేందుకు అర్ధకల్పం పడుతుంది. అర్ధకల్పం శ్యామము, అలాగే అర్ధకల్పం సుందరము. శివబాబా ఒక్కరు యాత్రికుడు, మిగిలిన ప్రేయసులంతా నల్లగా ఉన్నారు. అతి సుందరంగా తయారుచేసేందుకు మీకు యోగం నేర్పిస్తారు. సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ సహజసిద్ధమైన సౌందర్యం ఉంటుంది ఎందుకంటే 5 తత్వాలు సతోప్రధానంగా ఉండడంతో శరీరం కూడా సుందరంగా అవుతుంది. ఇక్కడైతే కృత్రిమమైన సౌందర్యం ఉంటుంది. పవిత్రత చాలా మంచిది. బాబా వద్దకు చాలామంది వస్తారు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేస్తారు కానీ కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతారు. ఇది ఈశ్వరీయ మిషన్. మునిగిపోయి ఉన్న భారత్ ను రక్షించడము. భారత్ యొక్క నావను రావణుడు ముంచేసాడు, రాముడు వచ్చి దాటిస్తారు. మీ బుద్ధిలో ఉంది, మేము స్వర్గంలోకి వెళ్ళి వజ్ర-వైఢూర్యాల మహళ్ళను తయారుచేస్తాము, ఈ శరీరాన్ని వదిలి రాకుమార-రాకుమారీలుగా అవుతాము అని. ఎవరైతే పిల్లలుగా అవుతారో, వారికే ఇలాంటి ఆలోచనలు నడుస్తాయి. ఇది ఈశ్వరీయ దర్బారు అనగా ఈశ్వరీయ ఫ్యామిలీ. మీరు మాతా-పిత… మేము మీ పిల్లలము అని పాడుతారు, కావున ఫ్యామిలీ అయినట్లు కదా! ఈశ్వరుడు తాతగారు, బ్రహ్మా తండ్రి. మీరు సోదర-సోదరీలు. మీరు స్వర్గ వారసత్వాన్ని తాతగారి నుండి తీసుకుంటారు, తర్వాత మీరు పోగొట్టుకుంటారు, మళ్ళీ ఇవ్వడానికి బాబా వస్తారు. వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా తండ్రికి చెందినవారిగా అయ్యారు. ప్రాక్టికల్ గా మీరు బ్రహ్మాకు పిల్లలు, శివునికి మనవలు. కావున దీనిని ఈశ్వరీయ దర్బారు అని కూడా అంటారు, ఈశ్వరీయ కుటుంబమని కూడా అనవచ్చు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానచితిపై కూర్చొని సంపూర్ణ పావనంగా (తెల్లగా) అవ్వాలి. పవిత్రతనే నంబరువన్ సుందరత, ఈ సుందరతను ధారణ చేసి తండ్రికి పిల్లలము అని పిలిపించుకునేందుకు హక్కుదారులుగా అవ్వాలి.

2. ఈ వినాశన సమయంలో తలపైన ఏదైతే పాపాల భారముందో, దానిని ఒక్క తండ్రి స్మృతితో తొలగించుకోవాలి. పుణ్యాత్మగా అయ్యేందుకు శ్రేష్ఠ కర్మలు చేయాలి.

వరదానము:-

ఎలాగైతే శరీరం మరియు ఆత్మ కంబైండ్ గా ఉన్నాయో, భవిష్య విష్ణు స్వరూపం కంబైండ్ గా ఉందో, అలా తండ్రి మరియు ఆత్మలైన మనం కంబైండ్ గా ఉన్నాము, ఈ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ, స్వ సేవ మరియు సర్వాత్మల సేవ కలిపి చేయండి, అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. సేవలో చాలా బిజీగా ఉన్నాము అందుకే స్వ స్థితి యొక్క చార్టు ఢీలా అయిపోయింది అని ఎప్పుడూ అనకండి. సేవ చేయడానికి వెళ్ళి, తిరిగి వచ్చాక, మాయ వచ్చింది, మూడ్ ఆఫ్ అయింది, డిస్టర్బ్ అయ్యాము అన్నట్లు ఉండకూడదు. స్వయం మరియు సర్వుల సేవ కంబైండ్ గా జరగడమే సేవలో వృద్ధికి సాధనము.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – నిరాకారీ ప్రపంచ మరియు సాకారీ ప్రపంచం యొక్క విస్తారము

ఒకటి నిరాకారీ ప్రపంచము, మరొకటి సాకారీ ప్రపంచము అని స్వయం పరమాత్మ ద్వారా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నిరాకారీ ప్రపంచాన్ని బ్రహ్మాండము అనగా అఖండ జ్యోతి మహాతత్వము అని అంటారు, అది ఆత్మలైన మన యొక్క మరియు పరమపిత పరమాత్మ యొక్క నివాస స్థానము. ఆ నిరాకార ప్రపంచం నుండే పరమాత్మ, ఆత్మలైన మనల్ని పాత్రను అభినయించడానికి సాకార సృష్టిలోకి పంపిస్తారు. ఎలాగైతే బ్రహ్మాండంలో ఆత్మల వృక్షముందో, అలా సాకార సృష్టిలో ఆత్మలది శరీర సహితంగా వృక్షముంది. ఎలాగైతే జడమైన వృక్షం యొక్క ఉదాహరణ చెప్తారో, ఏ విధంగా వృక్షం యొక్క వేర్లు కింద ఉంటాయో, అలా మనుష్య సృష్టిని కూడా తలక్రిందులుగా ఉన్న వృక్షం అని అంటారు ఎందుకంటే మనుష్య సృష్టి వృక్షం యొక్క వేర్లు పైన నిరాకారీ ప్రపంచంలో ఉంటాయి. అక్కడ కూడా ప్రతి ఒక్క ధర్మం యొక్క సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి, ఆ ప్రపంచంలో సూర్య చంద్రుల ప్రకాశమేమీ ఉండదు, నిజానికి ఆ ప్రపంచమైతే స్వయం అఖండ జ్యోతి తత్వము, అది పూర్తిగా స్థూల తత్వాల కన్నా అతి సూక్ష్మమైనది. ఎలాగైతే సాకార సృష్టి ఆకాశం, వాయువు, అగ్ని, జలం మరియు భూమి అనే పంచ తత్వాలతో తయారుచేయబడిందో, వీటిలో కూడా భూమి స్థూల తత్వము, దీని కన్నా సూక్ష్మమైనది జలము, అంతకన్నా సూక్ష్మమైన తత్వము అగ్ని, దీని కన్నా ఇంకా సూక్ష్మమైనది వాయువు, తరువాతది ఆకాశ తత్వము. ఇప్పుడు ఈ పంచ తత్వాల కన్నా కూడా అతి సూక్ష్మమైనది ఈ అఖండ జ్యోతి మహాతత్వము, అది ఈ స్థూల సృష్టి కన్నా దూరంగా ఉన్న నిరాకార ప్రపంచము, అక్కడ ఆత్మలమైన మనం అండాకారం సమానంగా (జ్యోతిర్బిందు రూపంలో) మన పరమపిత పరమాత్మతో పాటు ఉంటాము కనుక బ్రహ్మాండం కన్నా వేరైనది ఈ సాకార సృష్టి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top