18 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 17, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వం) ను స్మృతి చేసినట్లయితే రమణీయకంగా తయారవుతారు, తండ్రి రమణీయకమైనవారు కనుక వారి పిల్లలు కూడా రమణీయకంగా ఉండాలి”

ప్రశ్న: -

మహావీరులైన పిల్లలు ఎటువంటి కర్తవ్యాన్ని చేసారు, దాని స్మృతి చిహ్నము శాస్త్రాలలో ఉంది?

జవాబు:-

మహావీరులైన పిల్లలు మూర్ఛితులైన వారికి సంజీవని మూలికనిచ్చి స్ప్రహలోకి తీసుకొచ్చారు, దీని స్మృతి చిహ్నము శాస్త్రాలలో కూడా చూపిస్తారు. పిల్లలైన మీకు దయ కలగాలి. ఎవరైతే సేవ చేస్తూ-చేస్తూ, తండ్రి నుండి వారసత్వము తీసుకుంటూ-తీసుకుంటూ, ఏదో ఒక కారణం వలన తండ్రి చేతిని విడిచి వెళ్ళిపోయారో, వారికి ఉత్తరాలు రాసి పునర్జీవితులను చేయండి. మీకు ఏమి జరిగిన కారణంగా మీరు చదువును విడిచిపెట్టారు… దురదృష్టవంతులుగా ఎందుకు అయ్యారు అని ఉత్తరాన్ని రాయండి. పడిపోతున్నవారిని రక్షించాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నయన హీనులకు దారిని చూపించండి… (నయన్ హీన్ కో రాహ్ దిఖావో…)

ఓంశాంతి. ఈ పాట చాలా సాధారణంగా పాడుతూ ఉంటారు, ఓ భగవంతుడా, అంధులకు చేతికర్రగా అవ్వండి ఎందుకంటే భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు. కానీ తండ్రిని పొందలేరు. ఆత్మ అంటుంది, ఓ బాబా, నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ శరీరం ద్వారా ఎంతో భ్రమించాను. మిమ్మల్ని పొందే మార్గం చాలా కఠినమైనదని. జన్మ-జన్మాంతరాలుగా మేము భక్తిని చేస్తూ వచ్చాము అనైతే మనుష్యులు తప్పకుండా భావిస్తారు. మాకు జ్ఞానం లభించాలి, అప్పుడు మేము నయన హీనుల నుండి నయనాలు కలవారిగా అవుతాము అని వారికి తెలియదు. భక్తి చేయడము, ఎదురు దెబ్బలు తినడము, ఇది భక్తి మార్గం యొక్క నియమము. అర్ధ కల్పము ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు మీరు ఎదురు దెబ్బలు తినడం ఆపేసారు. మీరు భక్తి చేయరు, శాస్త్రాలూ చదవరు. భగవంతుడు లభించిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేయాలి! మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళే భగవంతుడు లభించారు, కనుక ఇక మేము ఎదురు దెబ్బలు ఎందుకు తింటాము! భగవంతుడు వస్తే తప్పకుండా అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. అందరూ ఎదురుదెబ్బలు కూడా తింటూ ఉంటారు మరియు ఒకరికొకరు ఆశీర్వాదాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు, ఏమీ అర్థం చేసుకోరు. పోప్ లు, సాధు-సత్పురుషులు ఎవరైతే వస్తారో, వారి కోసం ఈ గురువులు భగవంతుడిని కలుసుకోవడానికి మాకు మార్గాన్ని చెప్తారని భావిస్తారు. కానీ స్వయం ఆ గురువులకే మార్గం తెలియకపోతే ఇక ఎలా చూపిస్తారు! ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా కేవలం భగవంతుడిని స్మృతి చేయండి, రామ-రామ అని అనండి అని అంటారు. ఎలాగైతే మార్గంలో ఫలానా స్థానం ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, ఈ మార్గం ద్వారా వెళ్ళండి అప్పుడు చేరుకుంటారు. తోడుగా తీసుకువెళ్తాము అని అయితే అనరు. మీకు మార్గం కావాలి – అది చెప్తారు, కానీ తోడుగా ఎవరో ఒక గైడ్ అయితే కావాలి కదా. గైడ్ లేనట్లయితే తికమకపడతారు. మీరు కూడా పొగమంచు కారణంగా అడవిలో తికమక పడ్డారు కదా. ఈ మాయ యొక్క పొగమంచు చాలా శక్తివంతమైనది. స్టీమరులో ఉన్న వారికి పొగమంచు కారణంగా మార్గం కనిపించదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇదైతే మాయ యొక్క పొగమంచు. ఎవ్వరికీ మార్గం గురించి తెలియదు. జప తపాదులు, తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు. జన్మ-జన్మాంతరాలు భగవంతుడిని కలుసుకోవడానికి భక్తి చేస్తూ వచ్చారు. అనేక రకాల మతాలు కూడా లభిస్తూ ఉంటాయి, ఎలాంటి సాంగత్యమో, అలాంటి రంగు అంటుతుంది. ప్రతి జన్మలో గురువును కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు సద్గురువు లభించారు. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను, మళ్ళీ విష్ణుపురిలోకి పంపిస్తాను అని వారు స్వయంగా అంటారు.

ఇప్పుడు మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఎవరైనా గురువు లేక పండితుడు మొదలైనవారు వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ ఇతరులకు మన్మనాభవ, శివబాబాను స్మృతి చేయండి అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు అని వారి శిష్యులు మొదలైనవారు అడుగుతారు! ఇతను వేరే మార్గాన్ని తీసుకున్నారని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. వారి దుకాణం సమాప్తమైపోతుంది. గౌరవం సమాప్తమైపోతుంది. మీరు బ్రహ్మాకుమారీల వద్ద జ్ఞానం తీసుకున్నట్లయితే మరి మేమెందుకు బి.కె.ల వద్దకు వెళ్ళకూడదు అని అంటారు. గురువులు కూడా స్వయంగా అంటారు – అందరూ జిజ్ఞాసువులు మమ్మల్ని విడిచిపెడతారు. తర్వాత మేము ఎక్కడ నుండి తినాలి. మొత్తం వ్యాపారమంతా సమాప్తమైపోతుంది. మొత్తం గౌరవం సమాప్తమైపోతుంది. ఇక్కడైతే 7 రోజులు భట్టీలో ఉంచి తర్వాత అన్నీ చేయించవలసి ఉంటుంది. రొట్టెలు కాల్చండి, ఇది చేయండి… ఎలాగైతే సన్యాసులు కూడా దేహాభిమానం తొలగిపోవాలని చేయిస్తారు లేకపోతే నిలవడము చాలా కష్టము. రెండవ విషయము, ఎవరైతే బయట నుండి వస్తారో, వారికి మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, మేము తల్లి-తండ్రి నుండి విశ్వానికి యజమానిగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. బాబా విశ్వ రచయిత. మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అన్నది మా లక్ష్యము ఉద్దేశ్యము. మీరు కూడా చేరాలనుకుంటే 8 రోజులు వచ్చి చదవాల్సి ఉంటుంది. చాలా భారీ శ్రమతో కూడినది. ఇంతగా అభిమానాన్ని ఎవ్వరూ తొలగించలేరు. అటువంటి వారు త్వరగా రాలేరు. మీరు సోదరీ-సోదరులు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకరికొకరు అర్థం చేయించుకోగలరు. కొందరు పిల్లలు ఎవరైతే చాలా మంచి సేవ చేసేవారో, చాలా మందికి అర్థం చేయించేవారో, ఇప్పుడు బాబా చేతిని విడిచిపెట్టారు. ఇప్పుడు ఇదైతే మీకు తెలుసు, శివబాబా మనల్ని బ్రహ్మా ద్వారా చదివిస్తున్నారు. డైరెక్టుగా అయితే చదివించలేరు. కావున బాబా అంటారు, బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తాను. రాజయోగాన్ని నేర్పిస్తాను. ఒకవేళ ఎవరైనా బ్రహ్మా చేతిని విడిచిపెట్టినట్లయితే, శివునిది కూడా విడిచిపెట్టినట్లే. ఫలానావారు ఎందుకు విడిచిపెట్టారు అని ఆలోచించడం జరుగుతుంది. అదృష్టవంతులుగా అయ్యేందుకు బదులుగా దురదృష్టవంతులుగా ఎందుకు అయ్యారు? మీరు ఎవరిపై అలిగారు? సోదరీల (అక్కయ్యల) తో అలిగి ఉంటారు. మీరు ఇంతగా వారసత్వం తీసుకునేవారు, మళ్ళీ ఏమైంది! నేర్పించే తండ్రి మిమ్మల్ని ఏమైనా అన్నారా. చదువును విడిచిపెట్టారు మరియు దురదృష్టవంతులుగా అయిపోయారు! బాబా కూడా అడగగలరు – మీరు రాజయోగం నేర్చుకోవడం ఎందుకు విడిచిపెట్టారు! మీరు కూడా ఆశ్చర్యవంతులై విని, వర్ణించి, పారిపోయేవారిలోకి వచ్చేసారు. తమ అదృష్టానికి అడ్డుగీత పెట్టుకున్నారు! సమయాన్ని చూసి వారికి రాయాలి. ఉత్తరం చూసిన తర్వాత మళ్ళీ మేలుకోవడము జరగవచ్చు. పడిపోతున్నవారిని రక్షించాల్సి ఉంటుంది. మునిగిపోవడం నుండి ఎవరినైనా రక్షిస్తే అభినందిస్తారు. ఇది కూడా మునిగిపోవడం నుండి రక్షించడము. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. మీరు నావికుడి చేతిని విడిచిపెట్టినట్లయితే మునిగిపోయి మరణిస్తారు అని రాయాలి. ఈదేవారు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఇతరులను కూడా రక్షిస్తారు. ఎవరైనా పూర్తిగా ఈత రానివారైతే వారు స్వయం కూడా మాయమైపోతారు. మీరు కూడా ఎవరినైనా మునిగిపోతూ చూసినట్లయితే 10 – 20 ఉత్తరాలు రాయండి. ఇదేమీ అవమానం కాదు. మీరు ఇంత కాలం చేతిని పట్టుకున్నారు, ఇతరులకు కూడా అర్థం చేయించారు. మళ్ళీ మీరు ఎలా మునిగిపోతారు. మీరు ప్రేమతో రాయండి. అక్కయ్య, మీరైతే రాజయోగం నేర్చుకొని తీరాన్ని దాటేవారు – ఇప్పుడు మీరు మునిగిపోతున్నారు. పాపం వారిని రక్షించాలి అని దయ కలుగుతుంది. తర్వాత ఎవరైనా రక్షింపబడతారా లేదా – అన్నదైతే వారి భాగ్యములోని విషయము. రెండవ విషయము, ఇక్కడ నరుని నుండి నారాయణునిగా అయ్యే మార్గం తెలియజేయబడుతుంది, ఈ రాజయోగం చాలా మంచిది అని ఇక్కడ ప్రదర్శనీలో అభిప్రాయాన్ని రాసి ఇస్తారు. కేవలం అలా రాసి, బయటకు వెళ్ళి తర్వాత మర్చిపోతారు, అందుకనే ఎవరైతే రాస్తారో వారి వెనుక పడాలి – మీరు ఈ అభిప్రాయాన్ని రాసి ఇచ్చారు, కానీ ఏం చేసారు, మీరు కూడా లాభాన్ని పొందలేదు, ఇతరులకు ఇవ్వలేదు! మొదటి ముఖ్యమైన విషయము – తల్లి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. అందుకనే బాబా ప్రశ్నావళిని తయారుచేయించారు. కనుక అడగండి – పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి? ఏ వారసత్వము లభిస్తుంది! ఇది రాయాలి. ఇకపోతే, మొత్తం ప్రదర్శినీ అర్థం చేయించి చివర్లో రాయడం వలన లాభమేమీ లేదు. ముఖ్యమైన విషయం – తల్లి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడము. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి రాయండి, లేదంటే ఏమీ అర్థం చేసుకోనట్లే. మనస్ఫూర్తిగా అర్థం చేయించి అప్పుడు రాయించాలి. తప్పకుండా వీరు జగదంబ, జగత్పిత. తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని వారు వ్రాయాలి. ఇలా రాసి ఇస్తే, అప్పుడు మీరు కొంత సేవ చేసారు అని భావించవచ్చు. మళ్ళీ ఒకవేళ రాకపోయినట్లయితే ఉత్తరం రాయాలి, తప్పకుండా వీరు జగదంబ మరియు జగత్పిత అయినప్పుడు మళ్ళీ వారసత్వాన్ని తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు! అకస్మాత్తుగా మృత్యువు కబళిస్తుంది. శ్రమ చేయాలి. ప్రదర్శినీ చేసారు. దాని వలన కష్టం మీద ఎవరో 2-4 వెలువడినట్లయితే లాభం ఏం జరిగింది! పిల్లలు పురుషార్థం చేయాలి. రావడం మానేస్తే ఉత్తరం రాయాలి. మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేవారు మళ్ళీ మాయ మిమ్మల్ని పట్టుకుంది. ప్రభువు యొక్క మార్గాన్ని విడిచిపెడుతున్నారు. దీని వలన మీరు మీ పదవిని భ్రష్టము చేసుకుంటారు. మహావీరులు ఎవరైతే ఉంటారో వారు వెంటనే సంజీవని మూలికనిస్తారు. వారు మూర్ఛితులయ్యారు. మాయ ముక్కు పట్టుకుంది కావున వారిని రక్షించాలి. ఇంత శ్రమ చేస్తే అప్పుడు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడుతారు. ఈ అంటు ఎలా ఉంది అని పరిశీలించాలి. మా గొంతు ఎండిపోతుంది అని పిల్లలు రాస్తారు కానీ మీరు ఎక్కువ విషయాలలోకి వెళ్ళకండి. మొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించి రాయించండి, తర్వాత వేరే విషయాలు. ఒక్క త్రిమూర్తి చిత్రంపైనే పూర్తిగా అర్థం చేయించాలి. వీరు మా తల్లి-తండ్రి, వీరి నుండి వారసత్వం లభించనున్నది అని నిశ్చయం చేసుకుంటారు. ఎవరు ఎంత వృద్ధులైనా కానీ – ఈ రెండు పదాలైతే అందరికీ అర్థం చేయించగలరు కదా. ఒకవేళ ఈ రెండు పదాలు కూడా ధారణ అవ్వలేనట్లయితే, వీరి బుద్ధి ఎక్కడో చెత్తలో చిక్కుకుని ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు. నోటితో ఎక్కువగా మాట్లాడకూడదు. కేవలం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. వారసత్వము విష్ణుపురి, దానికి మీరు యజమానిగా అవుతారు. బాబా చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. అహల్యలు, కుబ్జలు ఎలాంటివారైనా కూడా, వారసత్వాన్ని పొందగలరు. కేవలం శ్రీమతంపై నడుచుకోవాలి. దేహీ-అభిమానిగా అవ్వడమైతే సహజము. ఎవరికైనా గృహస్థ వ్యవహారం లేనట్లయితే, ఒంటరిగా ఉన్నట్లయితే చాలా సేవ చేయగలరు. కొంతమందికి దేహాభిమానం ఉంటుంది. మోహపు బంధనం తెగదు. దేహీ-అభిమానులు శరీరంపై మోహం పెట్టుకోరు! స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా యుక్తిని చెప్తారు. ఇది పాత ప్రపంచము. దీనిపై మమకారాన్ని తొలగించాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. వారసత్వాన్ని స్మృతి చేస్తే రచయిత కూడా గుర్తుకొస్తారు. ఎంత సంపాదన ఉంది, స్వయం కూడా చేయండి మరియు ఇతరుల చేత కూడా చేయించండి. తల్లిదండ్రులు పిల్లలను యోగ్యులుగా చేస్తారు, తర్వాత తండ్రిని సంభాళించడము పిల్లల యొక్క పని. అప్పుడు తల్లిదండ్రులు ఫ్రీ అవుతారు. ఇక్కడ చాలా మందికి మోహపు ఆకర్షణ ఉంటుంది. ఎవరికైనా తమ పిల్లలు లేకపోతే దత్తత తీసుకున్న పిల్లలపై మోహం ఉంటుంది. అప్పుడు వారు పదవిని పొందలేరు. సేవకు బదులుగా డిస్ సర్వీస్ చేస్తారు. ప్రదర్శనీలో ముఖ్యమైన విషయం ఇదే అర్థం చేయించాలి – తప్పకుండా వీరు మాకు తండ్రి అన్న నిశ్చయం ఏర్పడాలి. రాజయోగం ద్వారా వీరి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. కొత్త ప్రపంచము యొక్క రచన ఎలా ఉంటుంది! ఎలా మనం యజమానులుగా అవుతాము. ఇది లక్ష్యము ఉద్దేశ్యము. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోరు. మేము ఈశ్వరీయ సంతానము అని పిల్లలైన మీరు రాత్రింబవళ్ళు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఈశ్వరీయ సంతానమైన మీకు ఎంత సంతోషం ఉంటుందో అక్కడ విష్ణువు యొక్క దైవీ సంతానానికి అంత సంతోషం ఉండదు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, మళ్ళీ మీరే విష్ణువు యొక్క సంతానంగా అవుతారు. కానీ సంతోషం ఇప్పుడే ఉంటుంది. దేవతలను ఈశ్వరీయ సంతానము కన్నా ఉన్నతమైనవారు అని అనరు. కావున ఈశ్వరీయ సంతానానికి ఎంత సంతోషముండాలి. కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మాయ పూర్తిగా మరపింపజేస్తుంది. అప్పుడు అదృష్టంలో రాజ్యము లేదు అని భావించండి. చాలా శ్రమ చేయాలి. మాయ ఎలాంటిదంటే అక్కడికి అక్కడే చెంప దెబ్బ వేసి మరిచిపోయేలా చేస్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మోహపు బంధనాలన్నింటినీ తెంచి వేసి, ఈ పాత దేహము మరియు ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించి సేవలో నిమగ్నమవ్వాలి. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేసి సంపాదన జమ చేసుకోవాలి.

2. బాగా ఈతకొట్టేవారిగా అయి అందరినీ తీరానికి చేర్చే సేవ చేయాలి. శ్రీమతంపై నడుచుకోవాలి, బుద్ధిని చెత్తలో ఉంచకూడదు.

వరదానము:-

ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయి ఉంటారో, అంతగా ఈ సర్వ శక్తులు ఆర్డర్ లో ఉంటాయి. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలు ఏ సమయంలో ఏ ఆర్డర్ చేస్తారో ఆ విధంగా ఆర్డర్ పై నడుస్తాయో, అదే విధంగా సూక్ష్మ శక్తులు కూడా ఆర్డర్ పై నడిచేవిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సర్వ శక్తులు ఇప్పటి నుండే ఆర్డర్ పై ఉంటాయో, అప్పుడు అంతిమంలో సఫలతను ప్రాప్తి చేసుకోగలరు ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో, అక్కడ సఫలత జన్మ సిద్ధ అధికారంగా ఉంటుంది.

స్లోగన్:-

అమూల్యమైన రత్నాలు (దాదీల పాత డైరీల నుండి)

వాస్తవానికి స్మృతి యొక్క రూపం ఏమిటి? తండ్రి సమానంగా దివ్య కర్తవ్యంలో తత్పరులై ఉండడము. పరమాత్మ స్మృతిలో ఉంటున్నారు అన్నది దేని ద్వారా కనిపిస్తుంది! ఎలాగైతే చూడండి, ఒక బాలుడు ఉన్నాడంటే, అతను ఎప్పుడైతే తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ స్వయం కూడా కార్యం చేయడంలో తత్పరుడై ఉంటాడో, అదే, తండ్రి స్మృతి యొక్క రూపము ఎందుకంటే తండ్రి తన పిల్లలను ఆజ్ఞాకారిగా ఉండడం చూసి చాలా హర్షిస్తారు, నా కుమారుడు చాలా సుపాత్రునిగా ఉన్నాడు, నేను లేకున్నా నా ఇంటి యొక్క పాలన-పోషణ చేస్తున్నాడు. అదే విధంగా ఏ-ఏ దైవీ వత్సలైతే తమ దైవీ తల్లి-తండ్రి సమానంగా దివ్య కర్తవ్యాలు చేయడంలో తత్పరులై ఉంటారో, అదే స్మృతి యొక్క ఒరిజినల్ రూపము. ఏ స్వ-స్వరూపంలో తల్లి-తండ్రి స్థితులై ఉంటారో, అదే స్వ-స్వరూపంలో బాలకుడు కూడా స్థితి అయి ఉండడంతో ఇద్దరి తీగలు కనెక్ట్ అవుతాయి మరియు తండ్రి దగ్గరకు త్వరగా వెళ్ళి చేరుకుంటారు. తండ్రి కూడా అంటారు, అలాంటి వత్సలు నాతో ఎప్పుడూ కలిసే ఉంటారు అనగా వారు సాక్షాత్ నా స్వరూపమే. ఈ విధంగా అంతర్ముఖతలో ఉంటూ సైలెన్స్ తో పరమాత్మను కూడా సమీపంగా లాక్కుంటారు. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top