17 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 16, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు భక్తి యొక్క ఆసక్తికరమైన విషయాలకు బదులుగా ఆత్మిక విషయాలను అందరికీ వినిపించాలి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసే సేవను చేయాలి’’

ప్రశ్న: -

సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు ముఖ్యంగా ఏ గుణం కావాలి?

జవాబు:-

నిరహంకారితనము యొక్క గుణము. మహావీర్ కోసం కూడా చూపిస్తారు, ఎక్కడ సత్సంగం జరిగినా సరే, అక్కడ చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవారు ఎందుకంటే వారిలో దేహాభిమానం ఉండేది కాదు, కానీ ఇందులో ధైర్యం కావాలి. మీరు ఏ డ్రస్సునైనా వేసుకుని ఆ సత్సంగాలకు వెళ్ళి వినవచ్చు. గుప్త వేషంలో వెళ్ళి వారి సేవను చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ..

ఓంశాంతి. ఇది ఉన్నతోన్నతమైన భగవంతుని మహిమ. ఈశ్వరుడు అనండి, పరమపిత పరమాత్మ అనండి, కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అనడంతో తండ్రి అని భావించడం జరగదు, అందుకే పరమపిత పరమాత్మ అని అనాలి. వారు ఈ మనుష్య సృష్టి యొక్క రచయిత. ఇప్పుడు ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి ఏం చెప్తారు? వారంటారు – పతిత మనుష్యులు నన్ను పిలుస్తారు, వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని. పావనము అనగా పవిత్రము. పతిత-పావనా అని భగవంతుడినే అనడం జరుగుతుంది. నిజానికి వారు తప్పకుండా వస్తారు. భక్తి మార్గంలో భగవంతుడిని స్మృతి చేస్తున్నారంటే వారు రావడం కూడా తప్పకుండా వస్తారు. కానీ ఎప్పుడైతే భక్తులకు భక్తి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుందో, అప్పుడు వారు వస్తారు. ఫలాన్ని ఇవ్వడము అనగా వారసత్వాన్ని ఇవ్వడము, వారికైతే చాలా సహజము. ఒక్క సెకెండులో జీవన్ముక్తిని ఇవ్వగలరు. జనకుడికి సెకెండులో జీవన్ముక్తి లభించింది అని అంటారు కూడా. ఒక్కరి పేరునే గుర్తు చేసుకుంటూ ఉంటారు. సెకండులో జీవన్ముక్తి అనగా సుఖ-శాంతులు లభించాయి. శాంతి, సుఖం మరియు ఎక్కువ ఆయుష్షు కావాలని మనుష్యులు అంటారు కూడా. చిన్నతనంలో ఎవరైనా మరణించినట్లయితే, అకాల మృత్యువు సంభవించింది, పూర్తి ఆయుష్షు గడపలేదు అని అంటారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చేసి వెళ్ళారో, దానికే మహిమ ఉంది. సెకండులో జీవన్ముక్తి, అనగా తప్పకుండా దానికి ముందు జీవనబంధనంలో ఉంటారు. జీవనబంధనము అని కలియుగాంతమును మరియు జీవన్ముక్తి అని సత్యయుగ ఆదిని అనడం జరుగుతుంది. జనకుని వలె ఇంట్లో-గృహస్థంలో ఉంటూ జీవన్ముక్తిని పొందాలి అని అంటారు.

తండ్రి అర్థం చేయిస్తారు, పదాలు రెండే – రాజయోగము మరియు జ్ఞానము. భారత్ యొక్క ప్రాచీన రాజయోగమైతే ప్రసిద్ధమైనది. ప్రాచీనము అనగా మొట్టమొదటిది, కానీ ఎప్పటిది? ఇది మనుష్యులకు తెలియదు ఎందుకంటే కల్పము యొక్క ఆయువును లక్షల సంవత్సరాలని చెప్తారు. భారత్ యొక్క ప్రాచీన జ్ఞానాన్ని మరియు యోగాన్ని అయితే అందరూ కోరుకుంటారు, వీటితో భారత్ స్వర్గంగా అవుతుంది. ఇప్పుడైతే భారత్ చాలా దుఃఖితముగా ఉంది, మొదట సూర్యవంశీ రాజ్యం ఉండేది. ఇప్పుడు లేదు, మళ్ళీ – ఆ రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు అని అంటూ వారిని గుర్తు చేసుకుంటారు! ఈ విషయం వారికి తెలియదు. లేదంటే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడంలో పిల్లలకు ఎటువంటి కష్టమూ ఉండదు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే వారసత్వానికి యోగ్యులుగా అయినట్లు. అయినా కూడా తల్లి, తండ్రి, టీచరు యొక్క శిక్షణ లభించాల్సి ఉంటుంది. ముక్తి యొక్క వారసత్వం కూడా కావాలి, అందుకే గురువులను ఆశ్రయిస్తారు. కానీ జీవన్ముక్తినైతే ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎప్పుడైతే జీవనబంధనం యొక్క అంతం జరుగుతుందో, జీవన్ముక్తి యొక్క ఆది జరుగుతుందో, అప్పుడే జీవన్ముక్తినిచ్చేవారు మళ్ళీ వస్తారు. మనుష్యులు కేవలం విన్నారు, సెకండులో జీవన్ముక్తి అని అనగా సెకండులో రావణ రాజ్యము నుండి రామ రాజ్యము, పతితము నుండి పావనము. కానీ ఎలా అనేది తెలియదు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతారు. ఇది సుప్రీమ్ ఆత్మ (పరమ ఆత్మ) ఇచ్చే ఆత్మిక శిక్షణ. అక్కడైతే మనుష్యులే శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతారు. ఫలానా మహాత్మ ఈ జ్ఞానాన్ని ఇచ్చారు అని అంటారు. ఇక్కడ ఉన్నది ప్రాచీన రాజయోగము మరియు జ్ఞానము, దీనిని 5 వేల సంవత్సరాల క్రితం, పరమపిత పరమాత్మ ఇచ్చారు, దీనితో మీరు దేవీ-దేవతలుగా అయ్యారు. ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది. ఒకవేళ ప్రాయః లోపమవ్వకపోతే ఎలా వినిపించాలి? మనుష్యులు పతితంగా అవ్వకపోతే, పతితపావనుడైన తండ్రి ఎలా వస్తారు? పతితంగా అవ్వడంలో 84 జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని విస్తారాన్ని అంతా కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వర్ణాల గురించి కూడా అర్థం చేయిస్తారు. బ్రహ్మా కావాలి, అలాగే బ్రహ్మా యొక్క తండ్రి కూడా కావాలి. బ్రహ్మా, విష్ణు, శంకరులు, ఈ ముగ్గురికీ తండ్రి శివ్. ఇప్పుడు బ్రహ్మా ద్వారా కూర్చొని ప్రాచీన జ్ఞానాన్ని ఇస్తారు, దీనితో విష్ణుపురికి యజమానులుగా అవుతారు మరియు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యుల నుండి దేవీ-దేవతా ధర్మం వారిగా అవుతున్నారు. కావున మొదట ప్రజాపిత బ్రహ్మా కావాలి. కృష్ణుడినైతే ప్రజాపిత అని అనలేరు. కృష్ణుడికి ఇంతమంది రాణులు, పిల్లలు మొదలైనవారు ఉండేవారని అంటూ వారైతే అన్నీ తప్పుడు విషయాలను తయారుచేసారు, ఇది పొరపాటు. వాస్తవానికి పిల్లలు బ్రహ్మాకు ఉన్నారు, కృష్ణుడికి కాదు. బ్రహ్మానే కృష్ణుడిగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ యొక్క గందరగోళమే మనుష్యులను తికమకపడేలా చేసింది. గీతా భగవంతుడు కృష్ణుడని చెప్తూ శివుడిని ఎగరగొట్టేసారు. బ్రహ్మాకు 3 ముఖాలు ఉండేవని అందరూ అంటారు, ఎంత తికమకపడిపోయారు. రచయిత అయిన శివుడినైతే పూర్తిగా మాయం చేసేసారు. రచయితనే వచ్చి, వారు దేవీ-దేవతా ధర్మాన్ని ఎలా రచిస్తారు అన్నది తెలియజేస్తారు. అంతేకానీ, పరమాత్మ సృష్టిని ఎలా రచిస్తారు అని కాదు. పరమపిత పరమాత్ముడినే – ఓ పతిత పావనా, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. ఈ సమయంలో రావణ రాజ్యం నడుస్తుందని ప్రపంచానికి తెలియనే తెలియదు. రావణుడి యొక్క పెద్ద-పెద్ద కథలను కూర్చొని వినిపిస్తారు. వీటిని భక్తి యొక్క ఆసక్తికరమైన విషయాలు అని అనడం జరుగుతుంది మరియు ఇవి ఆత్మిక విషయాలు. ఈ సమయంలో సీతలు లేక భక్తురాళ్ళు అందరూ రావణుని జైలులో ఉన్నారు మరియు రావణ రాజ్యంలో చాలా దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడు అందరినీ రావణ రాజ్యం నుండి విముక్తులను చేయించాలి. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారంటారు – పిల్లలూ, మీ 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. దుఃఖహర్త-సుఖకర్త రండి, అని నన్నే పిలిచేవారు. ఇది నా పేరే. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. సత్యయుగంలో అపారమైన సుఖం ఉంది. మళ్ళీ మీకు సుఖం యొక్క వారసత్వాన్ని ఇప్పించడానికి, మీకు రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని మళ్ళీ నేర్పిస్తున్నాను. ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుంది. మనుష్యులైతే వినాశనానికి చాలా భయపడతారు. వీరు పరస్పరంలో అసలు కొట్లాడుకోకపోతే శాంతి ఏర్పడుతుంది అని భావిస్తారు. మరి, ఇన్ని అనేక ధర్మాలలో శాంతి ఎలా ఏర్పడుతుంది? తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు ఈ ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవి ఇంతకుముందు లేవు, ఒకే ధర్మం ఉన్నప్పుడు తప్పకుండా సుఖ-శాంతుల రాజ్యం ఉండేది. ఇప్పుడు అందరూ మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు! అరే, మనసు అంటే ఏమిటి – మొదట దీనినైతే అర్థం చేసుకోండి. ఆత్మలోనే మనసు-బుద్ధి ఉన్నాయి. మనుష్యుల నాలుక మాట్లాడుతుంది. కళ్ళు చూస్తాయి. మొత్తం కలిపి మనుష్యులు దుఃఖితులుగా ఉన్నారు అని అంటారు. తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. మళ్ళీ కల్పవృక్షము మరియు డ్రామా యొక్క వివరణను కూడా ఇవ్వాల్సి ఉంటుంది, దాని కోసమే ఈ చిత్రాలు తయారుచేయబడి ఉన్నాయి. కేవలం మన్మనాభవ అని చెప్పడానికైతే చిత్రం యొక్క అవసరం లేదు. చిత్రాలపై అర్థం చేయించడానికి గంట పడుతుంది. ప్రాచీన రాజయోగాన్ని భగవంతుడు నేర్పించారు మరియు రాజ్యం లభించింది. మరి మనుష్యులు ఎవరైనా రాజయోగాన్ని నేర్పిస్తారా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమైతే సరైనది. కానీ ఎప్పటివరకైతే ఎవరికైనా ఈ వివరాలను అర్థం చేయించరో, అప్పటివరకు బుద్ధి తెరుచుకోదు, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడైనా ఏదైనా డ్రామాను చూసి వస్తే, అది ఆది నుండి అంతిమం వరకు బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, అనడానికైతే, మేము డ్రామాను చూసి వచ్చాము అని ఇంతమాత్రమే అంటారు. మీరు కూడా, మాకు ఈ డ్రామా గురించి తెలుసు అని అంటారు. కానీ విస్తారమైతే చాలా ఉంది. తండ్రి నుండి సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది, మళ్ళీ బుద్ధిలో చక్రం కూడా ఉంది. 84 జన్మల చక్రాన్ని తప్పకుండా ఘడియ-ఘడియ గుర్తు చేయాలి. ఈ జ్ఞానం బ్రాహ్మణులకే లభిస్తుంది, వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువు, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మా. ఇంతకుముందు దేవీ-దేవతలుగా ఉన్న మీరే, పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మళ్ళీ వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. హద్దు తండ్రి అయితే కేవలం ఉత్పత్తి, పాలన చేస్తారు. వినాశనమైతే చేయరు. వినాశనం అనగా ఇక మొత్తం పతిత ప్రపంచమే ఉండదు. మొత్తం రావణ రాజ్యం యొక్క వినాశనమే జరగనున్నది. లేదంటే రామరాజ్యం ఎలా వస్తుంది! అక్కడ ఎప్పుడూ రావణుడిని కాల్చరు. భక్తి మార్గం యొక్క ఏ విషయము జ్ఞాన మార్గంలో ఉండదు. మీరు సత్య, త్రేతా యుగాలలో ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అది జ్ఞానం యొక్క ప్రారబ్ధము. దీనిని భక్తి యొక్క ప్రారబ్ధము అని అంటారు. ఇది అల్పకాలికమైన క్షణభంగుర సుఖము. మొదట భక్తి అవ్యభిచారిగా ఉండేది, తర్వాత వ్యభిచారిగా అవుతూ-అవుతూ పూర్తిగా దుఃఖితులుగా అయిపోతారు. సద్గతిదాత ఒక్క తండ్రి, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అన్నదైతే అర్థం చేయించాలి. స్మృతి చేసారు మరియు స్వర్గ రాజ్యం లభించింది, మళ్ళీ నరకంలోకి ఎలా వచ్చారు, ఈ విషయాలన్నీ కూర్చొని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలిసింది. కావున ఈ సమయంలో మీరు త్రికాలదర్శులుగా అవుతున్నారు. దేవతలు కూడా త్రికాలదర్శులుగా లేరు అని మీరు వారికి చెప్తారు. అప్పుడు వారు, మరి త్రికాలదర్శులుగా ఎవరు ఉండేవారు అని అంటారు. ఎందుకంటే సంగమయుగీ బ్రాహ్మణుల గురించైతే ఎవరికీ తెలియనే తెలియదు. సత్సంగం ఎక్కడ జరిగినా సరే, హనుమాన్ వెళ్ళి చెప్పుల వద్ద కూర్చునేవారన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయం మహావీర్ కోసం ఎందుకు చెప్పారు? ఎందుకంటే పిల్లలైన మీలో ఎటువంటి దేహాభిమానము లేదు. సత్సంగంలో అటువంటి విషయం ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు చెప్పవచ్చు, ప్రాచీన సహజ రాజయోగము మరియు జ్ఞానంతో సెకెండులో జీవన్ముక్తిని తీసుకోవాలంటే, ఫలానావారి వద్దకు వెళ్ళండి అని. అర్థం చేయించేవారైతే చాలా ధైర్యవంతులుగా, నిరహంకారులుగా ఉండాలి. కొద్దిగా కూడా దేహాభిమానం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే, సమయం లభిస్తే ఇతరులకు చెప్పాలి. శక్తిశాలిగా ఉన్నట్లయితే భాషణ ఇస్తారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ సెకండులో జీవన్ముక్తి ఎలా లభించగలదు అని. పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ విషయాన్ని మహావీరులే అర్థం చేయించగలరు. సత్సంగాలకు వెళ్ళి వినడానికి వద్దనరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లలైన మీరు చాలా సేవ చేయగలరు. రాజయోగం నేర్చుకోవాలనుకుంటే బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళండి అని చెప్పండి. మున్ముందు మీ పేరు ప్రసిద్ధమవుతుంది, మెజారిటీ ఏర్పడుతుంది. ఇప్పుడైతే కొద్దిమందే ఉన్నారు. ఎత్తుకుపోతారు అన్న పేరు కూడా చాలా ఉంది. కృష్ణుడు ఎత్తుకుపోయారని అంటారు, అరే, ఎత్తుకుపోయే విషయమే లేదు. టీచరు ఎప్పుడైనా చదివించడానికి ఎత్తుకుపోతారా! సేవ చేసేవారైతే చాలా విచార సాగర మథనం చేయాలి మరియు చాలా ధైర్యవంతులుగా అవ్వాలి.

అచ్ఛా – మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భక్తురాళ్ళ రూపీ సీతలందరినీ రావణుడి జైలు నుండి విడిపించాలి. సెకండులో ముక్తి-జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపించాలి.

2. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దేహాభిమానాన్ని విడిచి మహావీరులుగా అయి సేవ చేయాలి. విచార సాగర మథనం చేసి సేవ యొక్క కొత్త-కొత్త యుక్తులను కనుగొనాలి.

వరదానము:-

బ్రాహ్మణులు అనగా సదా ఆనందమయ స్థితిలో ఉండేవారు. మనసులో సదా స్వతహాగా ఇదే పాట మోగుతూ ఉండాలి – వాహ్ బాబా మరియు వాహ్ నా భాగ్యము. ప్రపంచంలోని అలజడి కలిగించే ఏ పరిస్థితిలోనూ ఆశ్చర్యపడకూడదు, ఫుల్ స్టాప్. ఏం జరిగినా సరే, అది మీ కొరకు నథింగ్ న్యూ. కొత్త విషయమేమీ కాదు. లోపల ఇంతటి అచల స్థితి ఉండాలి. ఎందుకు, ఏమిటి అనేదానిలో మనసు తికమకపడకూడదు. అప్పుడు స్థిరమైన-చలించని ఆత్మలని అంటారు.

స్లోగన్:-

అమూల్యమైన జ్ఞాన రత్నాలు (దాదీల పాత డైరీల నుండి)

1) ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఓర్పు అనే గుణము యొక్క ధారణ కూడా నిశ్చయంతో ఏర్పడుతుంది మరియు సాక్షీతనపు అవస్థలోనే సంతోషముంది. ఈ ధారణతోనే పరమాత్మ తమంతట తామే వేయి అడుగులు ముందు ప్రత్యక్షమవుతారు. బాబా అంటారు, మీరు సూక్ష్మంగా రెండు అడుగులు దగ్గరకు వచ్చినట్లయితే నేను స్థూలంలో అనేక అడుగులు వేసి మీ ముందుకు వస్తాను. స్వ లక్ష్యములో స్థితులై ఉండడమే జ్ఞానము. స్వ లో స్థితులై ఉండటంతోనే పరమాత్మ స్వయంగా ముందుకు వస్తారు. బాబా యొక్క ఈ మహావాక్యాలను గుర్తుంచుకోండి, అవేమిటంటే – ఎంతగా దైవీ గుణాలను ధారణ చేస్తారో, అంతగానే ఒకరికొకరు సుఖాన్నిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. ఈ రోజు ఇస్తే రేపు లభిస్తుంది. ఈ రోజు సేవకునిగా అయి ఇస్తే, రేపు యజమానిగా అయి రాజ్యం చేస్తారు. ఇప్పుడైతే మీరు విశ్వ సేవాధారులు కదా.

2) ప్రతి ఒక్కరూ స్వ-స్వరూపంలో స్థితులై మీ రథాన్ని (శరీరాన్ని) నడిపిస్తూ వెళ్ళండి. ఎలా అంటే… ఈ రథాన్ని నేను కూర్చోబెడతాను, నేను తినిపిస్తాను, నేను నిద్రపుచ్చుతాను, నేను నోటి ద్వారా మాట్లాడిస్తాను. ఒకవేళ నేను నోటి ద్వారా ఎవరికైనా దుఃఖాన్నిస్తే, నేను నా స్వ స్వరూపాన్నే అవమానపర్చినట్లవుతుంది. అప్పుడు, ఆ స్వ-సంపూర్ణ ఆత్మ అంటుంది, ఓ జీవాత్మ, నీపై నాకు దుఃఖము కలుగుతుంది. ఇటువంటి మనిషి లేక ప్రాణిలో శుద్ధ ఆత్మనైన నేను ప్రవేశించి లేను. స్వ-శుద్ధ ఆత్మ ఏ స్థానంలో ఉంటుందో, ఆ స్థానంలో దుఃఖముండదు. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వలేదు. స్వ శుద్ధ ఆత్మ అయితే సుఖ స్వరూపము. మరియు ఇలాంటి స్వ నిశ్చయ బుద్ధి ఉన్నట్లయితే సదా సుఖాన్నే ఇస్తుంది. అది సాక్షాత్తు నా స్వరూపము మరియు ఎవరైతే తమను తాము స్వ ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూడా ఇతరులకు దుఃఖాన్నిస్తారో, వారైతే కేవలం పేరుకే పండితులు. వారి ప్రభావం ఇతరులపై పడదు. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top