12 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 11, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలంటే ఏవైతే లోపాలున్నాయో, వాటిని తొలగించండి, చదువును మంచి రీతిలో చదువుకోండి మరియు చదివించండి’’

ప్రశ్న: -

తండ్రి సమానంగా సేవకు నిమిత్తంగా అయ్యేందుకు ఏ ముఖ్య గుణం కావాలి?

జవాబు:-

సహనశీలత. దేహం పట్ల అతిగా మోహం పెట్టుకోకూడదు. యోగబలంతో పని చేయాలి. ఎప్పుడైతే యోగబలంతో అన్ని వ్యాధులు సమాప్తమైపోతాయో, అప్పుడు తండ్రి సమానంగా సేవకు నిమిత్తంగా అవ్వగలరు.

ప్రశ్న: -

ఏ మహాపాపం జరగడంతో బుద్ధి తాళం వేయబడుతుంది?

జవాబు:-

ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రిని నిందింపజేస్తే, ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా అయ్యేందుకు బదులుగా ఏదైనా భూతానికి వశీభూతులై డిస్సర్వీస్ చేస్తే, అశుద్ధతను విడిచిపెట్టకపోతే ఈ మహాపాపం వలన బుద్ధికి తాళం వేయబడుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నా మనసు అనే ద్వారము వద్దకు ఎవరు వచ్చారు… (కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే…)

ఓంశాంతి. భగవానువాచ – నిరాకారుడు, ఎవరైతే పతితపావనుడు జ్ఞానసాగరుడో, వారు కూర్చుని ఆత్మలను చదివిస్తారని పిల్లలు తెలుసుకున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదవడము – ఇదంతా భక్తి మార్గము. సత్య, త్రేతా యుగాలలో ఎవరూ చదవరు. ద్వాపరము నుండి మొదలుకొని మనుష్యులు వీటిని చదువుతూ ఉంటారు. మనుష్యులే శాస్త్రాలను తయారుచేసారు. భగవంతుడు తయారుచేయలేదు, అలాగే వ్యాసుడేమీ భగవంతుడు కాదు. వ్యాసుడైతే మనిషి. నిరాకార పరమపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. కేవలం ఈ పొరపాటే చేసారు, గీతా భగవంతుడని శ్రీకృష్ణుడిని భావించారు. తండ్రి అర్థం చేయిస్తారు, జ్ఞాన సాగరుడను నేను, శ్రీకృష్ణుడు కాదు. ఈ ఆత్మలు ఎలా వస్తాయి అని ఈ అనంతమైన ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికములు ఆది నుండి అంతిమం వరకు తండ్రికి మాత్రమే తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము మరియు ఇది స్థూలవతనము. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని నిరాకారుడు, బీజరూపుడు, జ్ఞానసాగరుడినైన నేను తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు. తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం మొదలవుతుందో, అప్పుడు భక్తులే కూర్చుని ఈ శాస్త్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఈ శాస్త్రాలైతే మళ్ళీ కూడా తయారవ్వనున్నాయి. అంతేకానీ, ఇవి తయారవ్వడము ఆగిపోతుందని కాదు. భారత్ యొక్క అసలైన ఆది సనాతన ధర్మమే దేవీ-దేవతా ధర్మము. సత్యయుగ ఆదిలో దేవీ-దేవతల రాజ్యముండేది. భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయారు. ఎవరైతే పావనంగా ఉండేవారో, ఇప్పుడు వారు పతితంగా అయిపోయారు, అందుకే భగవంతుడు అంటారు, నేను వచ్చి మిమ్మల్ని పతిత మనుష్యుల నుండి పావన దేవతలుగా తయారుచేస్తాను. దేవతలుగా తయారయ్యేందుకు మనం చదువుకుంటున్నామని మీకు కూడా తెలుసు. మనుష్యుల నుండి దేవతలుగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు ఎందుకంటే ఇక్కడైతే అందరూ పతితంగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. వారిని మళ్ళీ పావనంగా, శ్రేష్ఠాచారిగా ఎలా తయారుచేస్తారు. ఇది పతిత ఆసురీ ప్రపంచము, రావణ రాజ్యము. రాజ్యమైతే లేనే లేదు. రామ రాజ్యము, రావణ రాజ్యము అని అంటూ ఉంటారు కూడా. భగవంతుడు వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఓ భగవంతుడా, గీతా జ్ఞానాన్ని మళ్ళీ వచ్చి వినిపించండి అని అంటారు కూడా. కృష్ణుడైతే వినిపించరు. మనల్ని మనుష్యులెవరూ చదివించడం లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యాత్మలందరూ చదువుతున్నారు. చదివించేవారు నిరాకార భగవంతుడు. ఎలా తయారుచేస్తారు? మనుష్యుల నుండి దేవతలుగా. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. స్కూల్లో లక్ష్యము-ఉద్దేశ్యము లేకుండా ఎవరైనా ఏం చదువుకోగలరు. మేము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. చదివించేవారి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు శివ్. శారీరక పేరైతే లేదు. మిగతా చదివించేవారంతా ఆత్మలు, వారు తమ-తమ శరీరాల ద్వారా చదివిస్తారు. ప్రతి ఒక్కరికీ తమ శరీరముంది. ఈ ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే ఇలా అంటారు, నాకు నా శరీరమంటూ లేదు. నేను వీరి ఆధారాన్ని తీసుకుంటాను, వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది, వీరు మొదటి నంబరు దేవతగా అవుతారు. ఎవరైతే కొత్త మనిషిగా ఉండేవారో, వారే పాతవారిగా అయిపోయారు. కృష్ణుడు అందరికన్నా మొదటి కొత్త మనిషి, మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మాగా అయ్యారు. వీరికి తమ జన్మల గురించి తెలియదు, అందుకే నేను కూర్చుని వినిపిస్తాను. మొదటి జన్మలో వీరు శ్రీకృష్ణునిగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు నేను వీరిని మళ్ళీ బ్రహ్మాగా చేసి, వీరినే మళ్ళీ శ్రీకృష్ణునిగా చేస్తాను. వృక్షం చిత్రంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. వీరు కింద బ్రాహ్మణ రూపంలో తపస్య చేస్తున్నారు. పైన, ఆ బ్రహ్మానే పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు మరియు ఇక్కడ సంగమంలో ఇప్పుడు తపస్య చేస్తున్నారు, తతత్వమ్, మీరు కూడా దేవతలుగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితులుగా, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మీరు మళ్ళీ పావనంగా అవుతారు. పతిత-పావనుడైన పరమపిత పరమాత్మ ద్వారా మనం పావనంగా అవుతున్నామని మీకు తెలుసు. తండ్రి ఉపాయాన్ని తెలియజేస్తారు, నన్ను స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయడంతోనే మీరు పావనంగా అవుతారు. ఆత్మ మరియు శరీరం, కేవలం సత్యయుగంలోనే రెండూ పావనంగా ఉంటాయి. ఇక్కడ శరీరం అందరికీ పతితమైనది లభిస్తుంది. అన్నింటికన్నా చెడ్డ భ్రష్టాచారము కామ వికారము. విషం ద్వారా జన్మించినవారినే భ్రష్టాచారులు అని అంటారు. సత్యయుగంలో భ్రష్టాచారులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అక్కడ విషమే లేదు. కృష్ణుడిని సంపూర్ణ నిర్వికారి అని అంటారు, నిర్వికారినే మళ్ళీ వికారిగా అవుతారు. సత్య-త్రేతా యుగాలలో వికారాలు ఉండనే ఉండవు, అందుకే తండ్రి అంటారు, ఈ 5 భూతాలపై విజయం పొందాలి. తండ్రే వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేస్తారు. అసలు ఏ మాత్రం ధారణ జరగనివారు చాలామంది ఉన్నారు. క్రోధం యొక్క భూతము, లోభం యొక్క భూతము, మోహం యొక్క భూతము పూర్తిగా నల్లగా చేసేస్తాయి. అన్నింటికన్నా అశుద్ధమైనది కామ వికారము. అది కూడా ఎప్పుడైతే దేహాభిమానం వస్తుందో, అప్పుడే వస్తుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే జ్ఞానం యొక్క సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు ఆత్మలో జ్ఞానం యొక్క సంస్కారాలు పూర్తిగా సమాప్తమైపోయాయి.

బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. మనుష్యులైతే సాకారమైనవారినే స్మృతి చేస్తారు. భక్తిలో అలవాటు పడిపోయారు, గురువులను, పండితులను లేక ఎవరైనా దేవతలను స్మృతి చేస్తారు. బద్రీనాథ్, అమరనాథ్ కు వెళ్ళినప్పుడు కూర్చొని రాతిని పూజిస్తారు. శివ మందిరాలకు కూడా వెళ్తారు కానీ వీరు తండ్రి అని ఎవ్వరికీ తెలియనే తెలియదు. దీనిని అంధశ్రద్ధ అని అంటారు. తండ్రి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అన్నది ఎవరికీ తెలియనే తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు అంతా అర్థం చేయించడం జరుగుతుంది. కానీ మీలో కూడా ఎవరో కొద్దిమందే మంచి తెలివైనవారిగా, విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారీ పిల్లలుగా ఉన్నారు, వారిలో భూతాలు ప్రవేశించి లేవు. భూతాలు ప్రవేశించినవారు చాలా విసిగిస్తారు. చాలా డిస్సర్వీస్ చేస్తారు కనుక పదవి కూడా నీచమైనది లభిస్తుంది. పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా ఇంకా పాపాత్మగా అయిపోతారు. ఒకటేమో దేహాభిమానము, రెండవది ఇతర వికారాలు కూడా వచ్చేస్తాయి. లోభం యొక్క భూతం వచ్చేస్తుంది. ఈ బాసుంది, మీగడ తినాలి అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఇది మొదటి నుండి నడుస్తూనే ఉంది. ఇప్పుడైతే అవస్థను పరిపక్వంగా చేసుకోవాలి. లోభం యొక్క భూతం కూడా పద భ్రష్టులుగా చేసేస్తుంది. అర్ధకల్పము ఈ భూతాలు హైరానా పెట్టాయి. ఎవరైతే మేము పుణ్యాత్ములుగా అవుతాము మరియు తయారుచేస్తాము అని అంటారో, స్వయం వారే పాపాత్మగా అయిపోతారు మరియు ఇతరులను కూడా అలా తయారుచేయడం మొదలుపెడతారు. పేరును అప్రతిష్టపాలు చేసేస్తారు. ఒకవేళ మీలోనే క్రోధం యొక్క భూతం ఉన్నట్లయితే, మీరు ఇక ఇతరులది ఎలా తొలగిస్తారు. ఎవరిదైనా దేహాభిమానం యొక్క తప్పుడు నడవడికను చూసినట్లయితే, రిపోర్టు చేయండి. ధర్మరాజు వద్దనైతే రిజిస్టరు ఉంటుంది, తర్వాత శిక్ష అనుభవించే సమయంలో మీకు అంతా సాక్షాత్కారం చేయిస్తారు, నీవు ఈ భూతాలకు వశమై చాలా మందిని విసిగించావు. చాలామంది పిల్లలు క్రోధం యొక్క అగ్నిలో కాలి మరణిస్తారు. ఆత్మ పూర్తిగా నల్లగా అయిపోతుంది. డిస్సర్వీస్ చేసినట్లయితే బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. వారి ద్వారా ఇక ఏ సేవ జరగజాలదు. చివర్లో బాబా అంతా సాక్షాత్కారము చేయిస్తారు, అప్పుడు చాలా వ్యాకులపడతారు, అందుకే పిల్లలూ, అటువంటి పని ఏదీ చేయకూడదు. బాబా అంటారు, ఒకవేళ తప్పుడు నడవడిక నడిస్తే రిపోర్టు చేయండి. దేహాభిమానం కారణంగా వీరు వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు, ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు అని బాబాకు అర్థమవుతుంది. బాబా పిల్లలైన మీకు జ్ఞానం యొక్క అలంకరణ చేయిస్తారు, అయినా మారరు. ఈ సమయంలోనే పరమపిత పరమాత్మ వచ్చి జ్ఞానం యొక్క అలంకరణ చేయించి సత్యయుగ మహారాజా, మహారాణిగా చేస్తారు. ఇందులో చాలా మంచి సహనశీలత కావాలి. దేహం పట్ల అతిగా మోహం ఉండకూడదు. యోగబలంతో పని చేయాలి. బాబా కూడా వృద్ధులే, కానీ యోగంలో దృఢంగా ఉన్నారు. దగ్గు మొదలైనవి ఉంటాయి, అయినా సేవలో ఉంటారు. బుద్ధి యొక్క సేవ ఎంత చేయాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలను సంభాళించడము, అతిథుల కోసం ఏర్పాట్లు చేయడము – ఎంత భారము ఉంటుంది. ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ బిడ్డదైనా చెడు నడవడిక ఉన్నట్లయితే, పేరును అప్రతిష్టపాలు చేస్తారు. వీరు ఇలాంటి బ్రహ్మాకుమార-కుమారీలా! అని అంటారు. అప్పుడు ఆ పేరు బ్రహ్మాకు వస్తుంది కదా, అందుకే గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు… అని అనడం జరుగుతుంది, ఇది సద్గురువు కోసము. ఈ కలియుగీ గురువులు తమ కోసం చెప్పుకున్నారు, అందుకే మనుష్యులు వారికి భయపడతారు, గురువుగారు ఎక్కడా శాపం ఇవ్వకూడదు అని. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. తమ నడవడికతో తమను తామే శపించుకుంటారు. పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, ఇప్పుడు పురుషార్థం చేయకపోతే కల్ప-కల్పాంతరాలు ఇదే పరిస్థితి ఉంటుంది. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, అయినా అశుద్ధతను అస్సలు విడిచిపెట్టనివారు చాలామంది ఉన్నారు, ఇక దూరమైపోతారు అనగా మరణించి నరకంలో పడిపోతారు. చదువును వదిలేస్తారు. కొంతమంది పిల్లలైతే బాగా నడుచుకుంటారు. కొందరైతే ఈశ్వరీయ జన్మ తీసుకున్న 8-10 సంవత్సరాల తర్వాత కూడా మరణిస్తారు అనగా విడాకులు ఇచ్చేస్తారు. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలను చూసి సంతోషిస్తారు. అయినా, నంబరువారుగా అయితే ఉన్నారు కదా! కొంతమంది సెంటర్లలో కూడా విసిగిస్తారు. పెద్ద ముళ్ళుగా అయిపోతారు. ఇంటికి చెందినవారిగా అయి మళ్ళీ నిందింపజేస్తే మహాన్ పాపాత్ములుగా అయిపోతారు, అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, కనుక ఇక్కడకు మీరు అనంతమైన తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు, కావున అన్ని లోపాలను తొలగించివేయాలి. స్కూల్లో పాస్ అయ్యే విద్యార్థులు షరతు పెట్టుకుంటారు, మేము 80 మార్కులతో పాస్ అవుతాము, 90 మార్కులతో పాస్ అవుతాము అని. తర్వాత ఎప్పుడైతే పాస్ అవుతారో, అప్పుడు సంతోషంలో ఒకరికొకరు ఉత్తరాలు పంపించుకుంటారు. ఇది అనంతమైన చదువు. సూర్యవంశీయులుగా అవుతారా లేక చంద్రవంశీయులుగానా, ఇది కూడా తెలిసిపోతుంది. ఎప్పుడైతే చంద్రవంశీ రాజా-రాణిగా అవుతారో, అప్పుడు వారి ముందు సూర్యవంశీయులు సెకండు నంబరు వారి వలె అయిపోతారు. సీతా-రాముల రాజ్యం నడిచేటప్పుడు లక్ష్మీ-నారాయణులు చిన్నవారిగా అయిపోతారు. సూర్యవంశీయుల పేరే సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానం చాలా రమణీకమైనది. ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో, వారికే ధారణ బాగా జరుగుతుంది, వారే మళ్ళీ ఉన్నత పదవిని పొందగలరు. శివబాబాకు భక్తి మార్గంలో కూడా పాత్ర ఉంది మరియు జ్ఞాన మార్గంలో కూడా పాత్ర ఉంది. శంకరుడికి కేవలం వినాశనం యొక్క పనే ఉంది, వారిని ఏమని వర్ణిస్తారు. శివబాబా మరియు బ్రహ్మాబాబా గురించి అయితే చాలా వర్ణన ఉంది. 84 జన్మల చక్రంలో అందరికన్నా నంబరువన్ పాత్ర బాబాది. వారేమో శివుడిని, శంకరుడిని కలిపేసారు. శివబాబాదైతే అందరికన్నా పెద్ద పాత్ర, పిల్లలందరినీ సుఖమయంగా చేయడమనేది ఎంత శ్రమతో కూడిన పని. వారు తర్వాత విశ్రమిస్తారు. వీరిది (బ్రహ్మాది) అయితే 84 జన్మల పాత్ర. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారైతే తర్వాత వస్తారు. వారు ఆల్రౌండ్ పాత్రనేమీ అభినయించరు. ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారికి ఎంత సుఖం ఉంటుంది! మనమే స్వర్గానికి యజమానులుగా అవుతాము. భారత్ స్వర్గంగా పిలవబడుతుంది. ఎంత సంతోషం ఉంటుంది, మనం మన కోసం స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఇతరులకు కూడా అర్థం చేయించాలి, అప్పుడు వారు వచ్చి తమ జీవితాలను తయారుచేసుకుంటారు. పరమపిత పరమాత్మ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవడానికి మీరు వచ్చారు. బుద్ధిలో ఒకవేళ లక్ష్యము-ఉద్దేశ్యము లేకపోతే ఇక్కడ కూర్చుని ఏం చేస్తారు. బ్రాహ్మణులు బ్రహ్మా యొక్క ముఖవంశావళి. అనంతమైన తండ్రి, అనంతమైన పిల్లలను (దత్తత) తీసుకుంటారు. ఎంత మంది పిల్లలున్నారు. బ్రహ్మాకు చెందినవారిగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. భారత్ శ్రేష్ఠాచారిగా ఉండేది, అక్కడ ఏ భూతము ఉండేది కాదు. ఒక్క భూతమున్నా సరే, వ్యభిచారి అని అంటారు. భూతాలనైతే పూర్తిగా పారద్రోలాలి. బాబాకు చాలామంది రాసి పంపిస్తారు – బాబా, కామం యొక్క భూతం వచ్చింది కానీ రక్షింపబడ్డాము అని. బాబా అంటారు, పిల్లలూ, తుఫాన్లు అయితే చాలా వస్తాయి కానీ కర్మేంద్రియాలతో ఎటువంటి కర్మ చేయకండి, భూతాలను పారద్రోలాలి. లేదంటే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవ్వలేరు. ధ్యానంలోకి వెళ్ళడం కూడా మంచిది కాదు ఎందుకంటే మాయ చాలా ప్రవేశిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అప్పుడు భక్తి ఉండదు మరియు ఎప్పుడైతే భక్తి ఉంటుందో, అప్పుడు జ్ఞానముండదు. ఎప్పుడైతే పావన ప్రపంచం ఉంటుందో, అప్పుడు పతితులెవరూ ఉండరు మరియు ఎప్పుడైతే పతిత ప్రపంచం ఉంటుందో, అప్పుడు పావనమైనవారు ఎవరూ ఉండరు… ఇది డ్రామా యొక్క స్థిరమైన నియమము, దీని గురించి మనుష్యులకు తెలియదు.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకూడదు. అనేకుల శాపాలు వెలువడే విధంగా ఎటువంటి నడవడిక నడుచుకోకూడదు. తమ భవిష్యత్తుపై ధ్యాస పెడుతూ పుణ్య కర్మలు చేయాలి.

2. లోపల ఏదైతే అశుద్ధత ఉందో, దేహాభిమానం కారణంగా ఏ భూతాలైతే ప్రవేశించి ఉన్నాయో, వాటిని తొలగించివేయాలి. జ్ఞానంతో స్వయాన్ని అలంకరించుకొని సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి.

వరదానము:-

బ్రాహ్మణ జన్మ ఉన్నదే సదా సేవ కోసము. ఎంతగా సేవలో బిజీగా ఉంటారో, అంతగా సహజంగానే మాయాజీతులుగా అవుతారు. అందుకే బుద్ధికి ఏ మాత్రం తీరిక లభించినా, సేవలో నిమగ్నమైపోండి. సేవలో తప్ప సమయాన్ని పోగొట్టుకోకండి. సంకల్పాలతోనైనా సేవ చేయండి, వాణితోనైనా సరే లేక కర్మలతోనైనా సరే. తమ సంపర్కం మరియు నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు. సేవలో బిజీగా ఉండడమే సహజ పురుషార్థము. బిజీగా ఉన్నట్లయితే యుద్ధం నుండి విడుదల అయి నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top