11 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 10, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ అంతిమ జన్మ కావున వికారాలను సన్యసించండి, ఈ అంతిమ జన్మలో రావణుడి సంకెళ్ళ నుండి స్వయాన్ని విడిపించుకోండి’’

ప్రశ్న: -

తండ్రి సహాయం ఏ పిల్లలకు లభిస్తుంది? తండ్రి ఏ పిల్లలతో సదా రాజీగా ఉంటారు?

జవాబు:-

ఎవరైతే సత్యమైన హృదయం కలవారిగా ఉంటారో, తండ్రి సహాయం వారికి లభిస్తుంది. సత్యమైన హృదయంపై సాహెబు రాజీ అవుతారు అని అంటారు. ఎవరైతే తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ ను అమలులోకి తీసుకువస్తారో, బాబా వారితో రాజీగా ఉంటారు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే – స్మృతిలో ఉంటూ పవిత్రంగా అయి అప్పుడు సేవ చేయండి, ఎవరికైనా మార్గాన్ని తెలియజేయండి. శూద్రుల సాంగత్యము నుండి స్వయాన్ని సంభాళించుకోండి. కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ చెడు కర్మ చేయకండి. ఎవరైతే ఈ విషయాలన్నింటినీ ధారణ చేస్తారో, తండ్రి వారితో రాజీగా ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నాకు సహాయాన్ని అందించేవారు… (ముఝ్ కో సహారా దేనేవాలే…)

ఓంశాంతి. పిల్లలు ఇక్కడ జ్ఞానం వింటున్నారు. ఎవరి జ్ఞానము? శాస్త్రాలదా? కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని అయితే మనుష్యమాత్రులందరూ తీసుకుంటారని పిల్లలకు తెలుసు. ఇక్కడ మనకు పరమపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారు. శాస్త్రాలు మొదలైనవాటిని చదివేటువంటి మరియు అధ్యయనం చేసేటువంటి సన్యాసులెవ్వరూ ఇలా అనరు. వారేమీ జ్ఞానాన్ని వినిపించరు. ఏ సత్సంగానికి వెళ్ళినా మనిషి కూర్చొని ఉంటారు. వారిని శాస్త్రిగారు, పండితులు లేక మహాత్మగారు అని అంటారు. మనుష్యులకే పేరుతో సంబంధం ఉంటుంది. మనకు మనుష్యులెవ్వరూ జ్ఞానాన్ని ఇవ్వరు, కానీ మనిషి ద్వారా నిరాకార పరమపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారని ఇక్కడ పిల్లలకు తెలుసు. ఈ విషయాలు ఏ సత్సంగములోనూ వినిపించబడవు. భాషణ ఇచ్చేవారి బుద్ధిలో కూడా ఈ విషయాలు ఉండజాలవు. మనకు కూడా ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో, వారు ఏ మనిషి లేక దేవత కాదు. ఈ సమయంలో దేవీ-దేవతా ధర్మం లేదు, అయినా కూడా సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరుల పేర్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు. లక్ష్మీ-నారాయణులు మొదలైనవారంతా దైవీ గుణాలు కల మనుష్యులు. ఈ సమయంలో అందరూ ఆసురీ గుణాలు కల మనుష్యులు. మేము ఆత్మలము, ఫలానావారి ద్వారా పరమాత్మ మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మనుష్యులెవ్వరూ ఇలా భావించరు. వారు ఏమని భావిస్తారంటే, ఫలానా మహాత్మ, ఫలానా శాస్త్రి మాకు కథను వినిపిస్తున్నారు, వేద శాస్త్రాలు మొదలైనవాటిని వినిపిస్తున్నారు, గీతను వినిపిస్తున్నారు అని. తండ్రి అంటారు, నేను మీకు ఈ విధంగా శాస్త్రాల విషయాలను వినిపించను. మీరైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారు మరియు పతిత పావనా రండి, అని అంటారు. వారు సర్వుల దుఃఖహర్త, సుఖకర్త, వారు సర్వుల శాంతిదాత, వారు సర్వులకు ముక్తి-జీవన్ముక్తి దాత. వారు మనిషి కాలేరు. మనుష్యులు ఉదయముదయాన్నే లేచి ఎంత భక్తి చేస్తారు, కొందరు భజనలు పాడుతారు, కథలను వినిపిస్తారు – దీనిని భక్తి మార్గము అని అంటారు. భక్తి మార్గం వారికి భక్తి మార్గం అంటే ఏమిటి అనేది తెలియదు. ఇక్కడ అన్ని చోట్ల భక్తియే భక్తి ఉంది, జ్ఞానము పగలు, భక్తి రాత్రి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అప్పుడు భక్తి ఉండదు. ఎప్పుడైతే భక్తి ఉంటుందో, అప్పుడు జ్ఞానముండదు. ద్వాపర-కలియుగాలు భక్తి, సత్య-త్రేతా యుగాలు జ్ఞానం యొక్క ఫలము. ఆ జ్ఞానసాగరుడే ఫలాన్ని ఇస్తారు. భగవంతుడు ఏ ఫలాన్ని ఇస్తారు! ఫలము అనగా వారసత్వము. భగవంతుడు ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు, వారితో పాటు ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుష్యులు ఎంత మంది అయ్యారంటే, నివసించేందుకు స్థలము లేదు, ధాన్యము లేదు, అందుకే భగవంతుడికి రావాల్సి వస్తుంది. రావణుడు అందరినీ పతితముగా చేస్తాడు, మళ్ళీ పతిత పావనుడు వచ్చి పావనంగా చేస్తారు. పావనంగా చేసేవారు మరియు పతితంగా చేసేవారు ఇరువురూ వేర్వేరు. ఇప్పుడు మీకు తెలుసు, పావన ప్రపంచాన్ని పతితముగా చేసేది ఎవరు మరియు పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేది ఎవరు. పతితపావనా రండి, అని అంటారు – ఒక్కరినే పిలుస్తారు. సర్వుల పాలనకర్త ఒక్కరే. సత్యయుగంలో వికారులెవ్వరూ ఉండజాలరు. పతితులు అనగా వికారాలలోకి వెళ్ళేవారు. సన్యాసులు వికారాలలోకి వెళ్ళరు, అందుకే వారిని పతితులు అని అనరు. పవిత్రాత్మ అనగా 5 వికారాలను సన్యసించినవారు. నంబరువన్ వికారము కామము. క్రోధమైతే సన్యాసులలో కూడా చాలా ఉంది. స్త్రీని వదిలేస్తారు, ఆమె సాంగత్యంలో మనుష్యులు నిర్వికారులుగా ఉండలేరు అని భావిస్తారు. వివాహం యొక్క ఉద్దేశ్యమే ఇది అని భావిస్తారు. సత్యయుగంలో ఈ నియమం లేదు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, అక్కడ పతితులెవ్వరూ ఉండనే ఉండరు. దేవతల మహిమ ఏమిటంటే, సర్వ గుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు. రావణ రాజ్యం ప్రారంభమయ్యేదే ద్వాపర యుగం నుండి. తండ్రి స్వయంగా అంటారు, కామాన్ని జయించండి. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మరియు పవిత్ర ప్రపంచాన్ని స్మృతి చేసినట్లయితే, మీరు పతితంగా అవ్వరు. నేను పావన ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. మరియు రెండవ విషయం ఏమిటంటే – ఒక్క తండ్రి పిల్లలు, బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మీరు, పరస్పరంలో సోదరీ-సోదరులు అయినట్లు. ఎప్పటివరకైతే ఈ విషయం మంచిరీతిలో ఎవరి బుద్ధిలోనైనా కూర్చోదో, అప్పటివరకు వికారాల నుండి విముక్తులు అవ్వలేరు. ఎప్పటివరకైతే బ్రహ్మా సంతానంగా అవ్వరో, అప్పటివరకు పావనంగా అవ్వడం చాలా కష్టము. సహాయం లభించదు. అచ్ఛా, బ్రహ్మా విషయాన్ని వదిలేయండి. మీరంటారు, మేము భగవంతుని పిల్లలము అని, సాకారంలో అంటారు ఈ లెక్కన సోదరీ-సోదరులుగా అయినట్లు అని. అటువంటప్పుడు వికారాలలోకి వెళ్ళలేరు. మేము ఈశ్వరుని సంతానము అని అందరూ అంటారు మరియు తండ్రి అంటారు, పిల్లలూ, నేను వచ్చేసాను, ఇప్పుడు ఎవరైతే వచ్చి నా వారిగా అవుతారో, వారు పరస్పరంలో సోదరీ సోదరులు అయినట్లు. బ్రహ్మా ద్వారా సోదరీ-సోదరుల రచన జరుగుతుంది అన్నప్పుడు ఇక వికారాలలోకి వెళ్ళలేరు.

తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ. ఒక్క జన్మ కోసమైతే ఈ వికారాలను త్యాగం చేయండి. సన్యాసులు అడవుల్లోకి వెళ్ళేందుకు విడిచిపెడతారు. మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు విడిచిపెడతారు. సన్యాసులకు ఏ టెంప్టేషన్ (ప్రలోభము) ఉండదు. గృహస్థులు వారికి చాలా గౌరవాన్ని ఇస్తారు. కానీ వారేమీ మందిరాలలో పూజించబడేందుకు యోగ్యులుగా ఉండరు. మందిరాలలో పూజించేందుకు యోగ్యులు దేవతలు ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ మనకు పవిత్ర శరీరం లభించజాలదు. ఇదైతే తమోప్రధాన పతిత శరీరము. 5 తత్వాలు కూడా పతితంగా ఉన్నాయి. అక్కడ ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, అలాగే 5 తత్వాలు కూడా సతోప్రధానంగా, పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది, అలాగే తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి, అందుకే వరదలు, తుఫానులు మొదలైనవి ఎన్ని వస్తూ ఉంటాయి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడము – ఇది తమోగుణము. సత్యయుగంలో తత్వాలు కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వవు. ఈ సమయంలో మనిషి బుద్ధి కూడా తమోప్రధానంగా ఉంది. సతో, రజో, తమోలలోకి కూడా తప్పకుండా రావాల్సిందే. లేదంటే కొత్త ప్రపంచంగా మార్చేవారు రావడానికి, ఇది పాత ప్రపంచంగా ఎలా అవుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, పావనంగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో రావణుడి సంకెళ్ళ నుండి స్వయాన్ని విడిపించుకోండి. ఆసురీ మతముపై అర్ధ కల్పము మీరు పతితంగా ఉన్నారు, ఇది చాలా చెడ్డ అలవాటు. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము. చిన్నతనంలో కూడా వికారాలలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే సాంగత్యమే అటువంటిది లభిస్తుంది. సమయమే అలా ఉంది, పతితంగా తప్పకుండా అవ్వాల్సిందే. సన్యాస ధర్మం యొక్క పాత్ర కూడా ఉంది. సృష్టిని కాలిపోయి మరణించడం నుండి ఎంతో కొంత రక్షిస్తారు. ఇప్పుడు డ్రామా గురించి కూడా పిల్లలైన మీకే తెలుసు. క్రిస్టియన్ ధర్మం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది అని అంటారు కానీ క్రిస్టియన్ ధర్మం మళ్ళీ ఎప్పుడు సమాప్తమవుతుంది అనేది తెలియదు! కలియుగం ఇప్పుడింకా 40 వేల సంవత్సరాలు నడవనున్నది అని అంటారు, అలా అయితే క్రిస్టియన్ ధర్మం మొదలైనవి 40 వేల సంవత్సరాల వరకు వృద్ధి చెందుతూ ఉంటాయి! ఇప్పుడు 5 వేల సంవత్సరాలలోనే స్థలము చాలడం లేదంటే 40 వేల సంవత్సరాలకు ఏం జరుగుతుందో తెలియదు. శాస్త్రాలలోనైతే ఎన్నో ప్రలాపాలను రాసేసారు, అందుకే ఎవరో అరుదుగానే ఈ విషయాలను అర్థం చేసుకొని అడుగడుగునా శ్రీమతంపై నడుస్తారు. శ్రీమతంపై నడుచుకోవడము ఎంత కష్టము. లక్ష్మీ-నారాయణులు, ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా పూజిస్తుందో – అలా ఇప్పుడు మీరు తయారవుతున్నారు. ఇది కూడా మీకు తెలుసు కానీ నంబరువారుగా. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. ఇల్లు అయితే త్వరగా గుర్తుకొస్తుంది కదా. మనుష్యులు 8-10 సంవత్సరాలు ప్రయాణాలు చేసి ఇంటికి తిరిగి వస్తే, ఇప్పుడు మేము మా జన్మ స్థలానికి వెళ్తున్నాము అని సంతోషము ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రయాణమైతే కొద్ది సమయం కోసం ఉంటుంది, అందుకే ఇంటిని మర్చిపోరు. ఇక్కడైతే 5 వేల సంవత్సరాలు అయ్యింది, అందుకే ఇంటినైతే పూర్తిగా మర్చిపోయారు.

ఇప్పుడు తండ్రి వచ్చి తెలియజేసారు, పిల్లలూ, ఇది పాత ప్రపంచము – దీనికైతే నిప్పు అంటుకోనున్నది. ఎవ్వరూ మిగలరు. అందరూ మరణించేది ఉంది, అందుకే పాడైపోయిన ప్రపంచము మరియు పాడైపోయిన శరీరాల పట్ల ప్రేమను ఉంచుకోకండి. శరీరాలు మారుతూ-మారుతూ 5 వేల సంవత్సరాలు అయ్యింది. 84 సార్లు శరీరాలు మారుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి, అందుకే నేను వచ్చాను. మీ పాత్ర పూర్తి అయినట్లయితే, అందరిదీ పూర్తి అయినట్లు. ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. తండ్రి ద్వారా జ్ఞాన సంపన్నులుగా అవ్వడంతో ఇక మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు మరియు విశ్వం కూడా కొత్తదిగా అవుతుంది. భక్తి మార్గంలో ఏవైతే కర్మ కాండలకు సంబంధించినవి ఉన్నాయో, వాటన్నింటినీ సమాప్తం చేయాలి. ఇక ఓ ప్రభూ, అని అనేవారు ఒక్కరు కూడా మిగలరు. అయ్యో రామా, ఓ ప్రభూ, ఈ మాటలు దుఃఖంలోనే వెలువడుతాయి. సత్యయుగంలో వెలువడవు ఎందుకంటే అక్కడ దుఃఖం యొక్క విషయం ఉండదు. కావున ఇటువంటి తండ్రిని, ఎవరినైతే స్మృతి చేస్తారో, వారి మతముపై ఎందుకు నడుచుకోకూడదు. ఈశ్వరీయ మతముతో సదా సుఖమయంగా అవుతారు. ఇది అర్థం చేసుకుంటూ కూడా శ్రీమతంపై నడుచుకోకపోతే వారిని మహామూర్ఖులు అని అంటారు. ఈశ్వరీయ మతము మరియు ఆసురీ మతము రెండింటికీ రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మేము ఎటువైపు వెళ్ళాలి అన్నది నిర్ణయించుకోవాలి. మాయ వైపు అయితే దుఃఖమే దుఃఖం ఉంది. ఈశ్వరుని వైపు 21 జన్మలు సుఖం ఉంది. ఇప్పుడు ఎవరి మతముపై నడుచుకోవాలి!

తండ్రి అంటారు, శ్రీమతముపై నడుచుకోవాలనుకుంటే నడుచుకోండి. మొదటి విషయం ఏమిటంటే, కామముపై విజయం పొందండి. దానికన్నా ముందు విషయం, నన్ను స్మృతి చేయండి, ఈ పాత శరీరాన్ని అయితే వదలాల్సిందే. ఇప్పుడు తిరిగి వెళ్ళా్లి. మేము 84 జన్మల పాత శరీరాన్ని వదిలేస్తాము అని ఈ సమయంలో మనకు ఆలోచన ఉంది. అక్కడ సత్యయుగంలో ఇలా అనుకుంటారు – ఈ వృద్ధ శరీరాన్ని వదిలి మళ్ళీ బాల్యంలోకి వెళ్తాము అని. పాత ప్రపంచం యొక్క మహావినాశనం జరగనున్నది. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇవి తండ్రి కూర్చుని సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నీ ధ్యాసలో ఉన్నట్లయితే అహో సౌభాగ్యము, ఎంత సహజము. అయినా కూడా స్వీట్ హోమ్ ను, స్వీట్ రాజధానిని ఎందుకు మర్చిపోతారో తెలియదు. ఎందుకు స్మృతి చేయరో తెలియదు! సాంగత్య దోషంలోకి వచ్చి అశుద్ధంగా అవుతారు. బాబా అంటారు, పిల్లలూ, అశుద్ధమైన వికల్పాలు చాలా వస్తాయి కానీ కర్మేంద్రియాలతో ఏ పని చేయకండి. వికర్మ చేసి, ఆ తర్వాత, బాబా, ఈ వికర్మ జరిగిపోయింది, క్షమించండి అని రాయడం కాదు. వికర్మ చేసారు అంటే దానికి మళ్ళీ 100 రెట్లు దండన లభిస్తుంది. ఒకటేమో చెప్పకపోవడం వలన దండన లభిస్తుంది. అజామిళ్ గా ఎవరు అవుతారు అనేది ఈ సమయంలో తెలుస్తుంది. ఎవరైతే ఈశ్వరుని ఒడి తీసుకుని మళ్ళీ వికారాలలోకి వెళ్తారో, వారు పెద్ద అజామిళ్, పాపాత్మ, వికారాలు లేకుండా ఉండలేరు అని ఋజువు అవుతుంది. బయోస్కోప్ (సినిమా) అందరినీ అశుద్ధంగా చేసేటువంటిది. మీరు ఏ వికారం నుండైనా దూరంగా పారిపోవాలి. బ్రాహ్మణులు నిర్వికారులు కావున సాంగత్యం కూడా బ్రాహ్మణులదే కావాలి. శూద్రుల సాంగత్యంలో దుఃఖితులుగా అవుతారు. శరీర నిర్వహణార్థం అయితే అన్నీ చేయాల్సిందే కానీ కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకూడదు. అయితే, పిల్లలను సరిదిద్దేందుకు వారికి అర్థం చేయించాలి, ఏదో ఒక యుక్తితో తేలికపాటి శిక్ష ఇవ్వాలి. రచనను రచించారు కనుక బాధ్యత కూడా ఉంటుంది. వారి చేత కూడా సత్యమైన సంపాదన చేయించాలి. చిన్న-చిన్న పిల్లలకు కూడా కొద్దో గొప్పో నేర్పించడం మంచిది. శివబాబాను స్మృతి చేయడంతో సహాయం లభిస్తుంది. సత్యమైన హృదయంపై సాహెబు రాజీ అవుతారు. సత్యమైన హృదయం కల పిల్లలకే తండ్రి సహాయం లభిస్తుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ, ఎవ్వరికీ సహాయకులు కారు. సుఖంలోకి తీసుకువెళ్ళే సహాయం లభిస్తుంది. ఒక్క పరమాత్మనే స్మృతి చేస్తారు, వారే వచ్చి అందరికీ శాంతినిస్తారు. సత్యయుగంలో అందరూ సుఖమయంగా ఉంటారు. మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. భారత్ స్వర్గంగా ఉండేది, అందరూ విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అశాంతి, కొట్లాటలు ఏవీ ఉండేవి కావు. తప్పకుండా ఆ కొత్త ప్రపంచాన్ని బాబానే రచించి ఉంటారు. బాబా నుండి వారసత్వం లభించి ఉంటుంది. ఎలా? అది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. అది రామ రాజ్యముగా పిలవబడేది. ఇప్పుడు అలా లేదు. అసలైతే ఒకప్పుడు ఉండేది కదా. ఆ భారత్ ఏదైతే పూజ్యంగా ఉండేదో, పూజారిగా అయ్యింది, మళ్ళీ పూజ్యంగా తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. శివ భగవానువాచ, శ్రీకృష్ణుని ఆత్మ అంతిమ జన్మలో వింటూ ఉంది, మళ్ళీ కృష్ణునిగా అవ్వనున్నది. ఉదయం లేచి బాబాను స్మృతి చేయాలి. ఆ సమయం చాలా మంచిది. వైబ్రేషన్ కూడా శుద్ధంగా ఉంటుంది. ఎలాగైతే ఆత్మ రాత్రికి అలసిపోయినప్పుడు, నేను డిటాచ్ అయిపోతాను అని అంటుంది. మీరు కూడా ఇక్కడ ఉంటూ బుద్ధియోగం అక్కడ జోడించబడి ఉండాలి. అమృతవేళ లేచి స్మృతి చేయడంతో రోజులో కూడా స్మృతి వస్తుంది. ఇది సంపాదన. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మాజీతులుగా అవుతారు, ధారణ జరుగుతుంది. ఎవరైతే పవిత్రంగా అవుతారో, స్మృతిలో ఉంటారో, వారే సేవ చేయగలరు. డైరెక్షన్ పై నడుచుకున్నట్లయితే బాబా రాజీ అవుతారు. ముందు సేవ చేయాలి, అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. యోగం యొక్క మార్గాన్ని తెలియజేసేందుకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు కదా! యోగంలో ఉండడంతో వికర్మలు వినాశనమవుతాయి. దానితో పాటు చక్రాన్ని కూడా తిప్పాలి. రూప్ బసంత్ గా (యోగిగా-జ్ఞానిగా) అవ్వాలి. అప్పుడు పాయింట్లు కూడా వస్తూ ఉంటాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాడైపోయిన ప్రపంచం మరియు పాడైపోయిన శరీరాల పట్ల మమకారాన్ని తొలగించి ఒక్క తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. శూద్రుల సాంగత్యం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. వికర్మాజీతులుగా అయ్యేందుకు అమృతవేళ లేచి స్మృతిలో కూర్చోవాలి. ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము:-

యథార్థంగా జీవిస్తూ మరణించడము అనగా సదా కోసం పాత ప్రపంచము మరియు పాత సంస్కారాల నుండి సంకల్పము మరియు స్వప్నంలో కూడా మరణించడము. మరణించడము అనగా పరివర్తన అవ్వడము. వారిని ఏ ఆకర్షణ కూడా తమ వైపుకు ఆకర్షించలేదు. వారెప్పుడూ ఇలా అనలేరు, ఏం చేయాలి, వద్దు అనుకున్నా కానీ జరిగిపోయింది… అని. చాలామంది పిల్లలు జీవిస్తూ మరణించి మళ్ళీ జీవిస్తారు. రావణుని ఒక శిరస్సును సమాప్తం చేస్తే రెండవది వచ్చేస్తుంది, కానీ పునాదినే సమాప్తం చేసినట్లయితే, మాయ రూపం మార్చుకొని దాడి చేయదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top