10 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 9, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఏ భగవంతుడినైతే మొత్తం ప్రపంచమంతా గుర్తు చేస్తుందో, వారు మీ సమ్ముఖంలో కూర్చున్నారు, మీరు ఇటువంటి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి, మర్చిపోకండి’’

ప్రశ్న: -

తండ్రి శ్రీమతంపై యథార్థంగా నడుచుకునే శక్తి ఏ పిల్లలలో ఉంటుంది?

జవాబు:-

ఎవరైతే తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని తండ్రికి వినిపించి ప్రతి అడుగులో తండ్రి నుండి సలహా తీసుకుంటారో వారికి. తండ్రి నుండి సలహా తీసుకున్నట్లయితే దానిపై నడుచుకునే శక్తి కూడా లభిస్తుంది. తండ్రి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు – పిల్లలూ, ఆ సంపాదన వెనుక ఈ సంపాదనను మిస్ చేసుకోకండి ఎందుకంటే ఎందుకూ కొరగాని ఆ సంపాదన అంతా సమాప్తమవ్వనున్నది. ప్రతి విషయంలోనూ శ్రీమతాన్ని తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి, సంభాళించుకుంటూ నడుచుకోవాలి. తమ మతాన్ని నడిపించకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదలి రా… (ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్…)

ఓంశాంతి. ఇప్పుడు పిల్లలు సమ్ముఖంలో కూర్చున్నారు, ఎవరికి? అనంతమైన తండ్రి మరియు దాదాకు. ఇది చాలా అద్భుతమైన విషయము. అనంతమైన తండ్రి పరమపిత పరమాత్మ మరియు అనంతమైన దాదా ప్రజాపిత బ్రహ్మా, ఇరువురూ సమ్ముఖంలో కూర్చున్నారు. ఎవరికి? పిల్లలకు. కనుక ఇది ఒక ఈశ్వరీయ కుటుంబము (పరివారము) కూర్చున్నట్లు మరియు అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు మరియు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసం కూడా ఎక్కుతుంది. పాటలో కూడా అంటారు, బాబా రండి, ఈ సమయంలో చాలా దుఃఖం ఉంది అని. వారిని ఆహ్వానిస్తూ ఉంటారు మరియు ఇక్కడ వారు మీ సమ్ముఖంలో కూర్చున్నారు. అనంతమైన తండ్రి ఈ దాదా ద్వారా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. పిల్లలలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా బుద్ధిలో నిశ్చయముంది. బ్యారిష్టరీ చదువుకునేటప్పుడు, తప్పకుండా నిశ్చయముంటుంది కదా, వీరు మాకు బ్యారిష్టరీ చదివిస్తున్నారు! ఫలానా సర్జన్ మాకు సర్జరీ నేర్పిస్తున్నారు అని. ఇది ఎటువంటి అద్భుతమైన విషయమంటే, ఇప్పుడిప్పుడే అంటారు, మాకు పక్కా నిశ్చయముంది, అనంతమైన తండ్రి నిరాకారుడు మమ్మల్ని చదివిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు అని. ఇప్పటికిప్పుడే ఎక్కడికైనా బయటకు దూరంగా వెళ్ళారు అంటే, నిశ్చయం తెగిపోతుంది. ఇది అద్భుతం కదా! భగవంతుడు, ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా గుర్తు చేస్తుందో, వారే పిల్లల సమ్ముఖంలో కూర్చుని అంటారు – పిల్లలూ, ఇప్పుడు మంచి రీతిలో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి. అర్థం చేసుకుంటారు కూడా, మళ్ళీ సెకెండులో మర్చిపోతారు. మీరు అనంతమైన తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు మరియు అడుగడుగునా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. కానీ ఎవరిదైతే పూర్తి సమాచారం తండ్రికి తెలిసి ఉంటుందో, వారే నడుస్తారు. పిల్లల యొక్క జీవనశైలి మొదలైనవాటి పూర్తి సమాచారం తండ్రి వద్దకు రావాలి. అప్పుడు తండ్రికి కూడా తెలుస్తుంది మరియు దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు సలహాలనిస్తూ ఉంటారు. అడుగడుగునా శ్రీమతం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము), ఇందులో మంచి రీతిలో చదువుకోవాలి. అంతేకానీ, ఈ రోజు చదువుకున్నారు, మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా పని పడితే చదువును మిస్ చేయడం కాదు. ఆ పనులన్నీ ఎందుకూ కొరగానివి. ఈ ప్రపంచంలో మనుష్యులు ఏదైతే సంపాదన చేసుకుంటారో, అదేమీ ఉండేటువంటిది కాదు. అంతా సమాప్తం అవ్వబోతుంది. తండ్రి పిల్లల కోసం సంపాదిస్తాడు. కొడుకులు, మనవలు, మునిమనవలు తింటూ ఉంటారని భావిస్తారు. మళ్ళీ కొడుకు ఎప్పుడైతే తండ్రిగా అవుతాడో, అతడు తన పిల్లల కోసం ప్రయత్నిస్తాడు. ఇప్పుడైతే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. కనుక తండ్రికి ఎప్పుడైతే పిల్లల యొక్క లెక్కాపత్రం గురించి తెలుస్తుందో, అప్పుడు మతాన్ని ఇస్తారు. అడుగడుగులోనూ అడగాల్సి ఉంటుంది. వికర్మలు జరిగేటట్లు ఉండకూడదు. ఇది అనంతమైన ఇల్లు. ఎలాగైతే హద్దు ఇంటిలో లౌకిక తండ్రి అర్థం చేయిస్తారో, అలాగే ఇక్కడ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనం బ్రాహ్మణులము అని పిల్లలందరికీ తెలుసు. భగవంతుడు మీకు ఏమవుతారు అని ఎవరినైనా అడగండి. అప్పుడు, వారైతే అందరికీ తండ్రి అని చెప్తారు. తర్వాత, వారు ఎక్కడుంటారు? అని అడగండి. అప్పుడు సర్వవ్యాపి అని చెప్తారు. అనంతమైన తండ్రి గురించి తెలియదు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి గురించి యథార్థ రీతిగా తెలుసు కనుక మీరు దైవీ మతంపై నడుచుకోవాలి. తండ్రి దేవీ-దేవతలుగా తయారుచేయడానికి వచ్చారు. అడుగడుగునా శ్రీమతంపై నడుచుకోవాల్సి ఉంటుంది. పండాలు యాత్రలకు తీసుకువెళ్ళినప్పుడు, హెచ్చరిస్తూ ఉంటారు, జాగ్రత్తగా నడవండి అని చెప్తారు. తీర్థ స్థానాలు మొదలైనవాటిని నమ్మనివారు కూడా చాలా మంది ఉన్నారు. తీర్థము అనగా భక్తి. తీర్థమును నమ్మలేదు అంటే భక్తినే నమ్మడం లేదు. భక్తి మార్గం అర్ధకల్పం నడుస్తుంది. భగవంతుడిని వెతుకుతూ ఉంటారు. చాలా భావన పెడతారు. శివుని ఎదుటికి చాలా మంది వెళ్తారు. భగవంతుని సాక్షాత్కారం జరగాలి అని భావిస్తారు, ఇది భావన. తర్వాత సాక్షాత్కారం జరిగితే చాలా సంతోషిస్తారు. మాకు భగవంతుడు లభించేసారు, కృష్ణుడు లభించారు, హనుమంతుడు లభించారు, ఇప్పుడిక మాకు ముక్తి లభించింది అని భావిస్తారు. కానీ ముక్తి అయితే ఎవ్వరికీ లభించదు.

ఇప్పుడు తండ్రి కూర్చుని మంచిరీతిలో అర్థం చేయిస్తారు, మధురమైన పిల్లలూ, ఇప్పుడు మొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు, మీరు కూడా అనాథులుగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు అంతా అర్థం చేసుకుంటూ ఉంటారు. మేము నీచులము, పాపులము అని అంటారు కదా. అయితే, అలా నీచులుగా ఎవరు తయారుచేసారు? ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ స్వయాన్ని మూర్ఖులుగా భావించరు. ఇది అనాదిగా తయారైన డ్రామా, అందరూ కిందకు వెళ్ళాల్సిందే, భ్రష్టాచారులుగా అవ్వాల్సిందే. కనుక ఈ ఆలోచన చేయాలి, మేము భగవంతుని ఫ్యామిలీ. భగవంతుడు మా తండ్రి కావున తప్పకుండా మేము విశ్వానికి యజమానులుగా ఉండాలి. మరి మనకు ఇటువంటి దుర్గతి ఎందుకు ఏర్పడింది? ఎవరి బుద్ధి ఇలా నడవదు. ఒకవైపు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, ఇంకొక వైపు శాంతి ఎలా స్థాపన అవుతుంది అని అంటారు! తికమకలో ఉన్నారు. కాన్ఫరెన్స్ లు చేస్తూ ఉంటారు. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు, వారు అంతిమంలో అర్థం చేసుకోనున్నారు. పిల్లలైన మీరు యోగంలో ఉంటూ కర్మాతీతులుగా అవ్వాలి. మీరే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, మళ్ళీ అలా తయారవ్వాలి. మిగిలిన ఇన్ని ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అవి సత్యయుగంలో ఉండవు. ఎవరైతే సత్యయుగంలో ఉండేవారో, వారే చాలాకాలం నుండి వేరయ్యారు. వారి కోసమే, చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైనవారు అని అంటారు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు… ఏ ఆత్మలు మొట్టమొదట పరంధామము నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు! మొట్టమొదట దేవీ-దేవతా ధర్మం యొక్క ఆత్మలు పాత్రను అభినయించడానికి వస్తారు. వారినే తమ ధర్మంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, వారి కోసమే రావాల్సి ఉంటుంది. వారితో పాటు అందరి కోసం కూడా తప్పకుండా రావాల్సి ఉంటుంది ఎందుకంటే అందరికీ ముక్తినివ్వాలి. ఇప్పుడు దేవతా ధర్మం లేదు. వారిదే అంటు కట్టాలి. ఒకరు ఒక ధర్మంలోకి, ఇంకొకరు ఇంకొక ధర్మంలోకి వెళ్ళిపోయారు. వారే బయటకు వస్తారు. ఈ ధర్మ స్థాపన ఎంత అద్భుతమైనది. అందుకే అంటారు, ఓ ప్రభూ, గతి సద్గతి యొక్క మీ శ్రీమతము చాలా అద్భుతమైనది, దానిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. దేవీ-దేవతా ధర్మ స్థాపన ఎలా జరుగుతుంది! ఇంత సమయం ఎవరైతే పతితులుగా, దేహాభిమానులుగా అయిపోయారో, వారికి మళ్ళీ దేహీ-అభిమానులుగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది. ఘడియ-ఘడియ మర్చిపోతారు. బాబా అంటారు, లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి. వికర్మల భారం మీపై చాలా ఉంది. సుఖాన్ని కూడా మీరు చాలా చూసారు, దుఃఖాన్ని కూడా మీరు చాలా చూసారు. ఇప్పుడు మళ్ళీ దుఃఖం నుండి మిమ్మల్ని సుఖంలోకి తీసుకువెళ్తున్నాను. కనుక శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, మళ్ళీ ఇతరులకు కూడా స్మృతినిప్పిస్తారు. సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించడం చాలా సహజము. వారినే త్రికాలదర్శులు అని అంటారు.

బాబా అర్థం చేయించారు – చెప్పండి, భగవంతుడికైతే మీరు పిల్లలు కదా. భగవంతుడు స్వర్గ రచయిత కావున భగవంతుడి నుండి తప్పకుండా స్వర్గ వారసత్వం లభించాలి. ఈ విషయం మీకే తెలుసు మరియు మీరే అడగగలరు. ఈశ్వరుడు పుట్టించారని అంటారు కావున మీరు ఈశ్వరునికి వారసులు అవ్వాలి కదా! తండ్రి అయిన ఈశ్వరుడు స్వర్గ రచయిత, మరి మీరు నరకంలో ఎందుకు ఉన్నారు! మనం మొదట స్వర్గంలో ఉండేవారమని మీకు తెలుసు. రావణుడు మనల్ని నరకంలోకి తోసేసాడు. రావణుడంటే ఎవరు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు స్మృతినిప్పించవచ్చు, భారత్ యే ప్రాచీన స్వర్గంగా ఉండేది మరియు భారతవాసులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడే భారత్ నరకంగా తయారయ్యింది. ఈ ఆట తయారుచేయబడి ఉంది. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము సగము-సగము ఉంటాయి. ఇదే ఆట. అయితే, ఆ రెండింటికీ మధ్యన ఏం జరుగుతుంది అనేది కూడా కూర్చుని వివరంగా అర్థం చేయిస్తారు. కొంతమంది పిల్లలు నిశ్చయబుద్ధి కలవారు, మేము తండ్రి ఎదురుగా కూర్చున్నామని వారు భావిస్తారు. బాబా త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి, బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా రచయిత. త్రిమూర్తి శివునికి బదులుగా త్రిమూర్తి బ్రహ్మా అన్న పేరును పెట్టారు. ఇప్పుడు బ్రహ్మా, త్రిమూర్తి రచయిత ఎలా అవ్వగలరు? బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము అని పాడుతారు కూడా కావున రచయిత తప్పకుండా వేరే ఎవరో ఉంటారు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. శివబాబా బ్రహ్మా ద్వారా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, ఇంకేం ఇస్తారు! విష్ణుపురిని ఎవరు స్థాపన చేస్తారు? తండ్రి విష్ణుపురిని అనగా లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. విష్ణువుకు వేరే చిత్రాన్ని తయారుచేసి దానిని నర నారాయణుడు అని అంటారు మరియు లక్ష్మీ-నారాయణులది మళ్ళీ వేరేగా తయారుచేసారు. చిత్రాలు ఎంత అద్భుతంగా తయారుచేయబడ్డాయి.

పిల్లలైన మీరు ప్రదర్శినీలో అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రదర్శినీలు జరుగుతూ ఉండగా, పిల్లలు తమ వ్యాపారంలోనే నిమగ్నమై ఉన్నట్లయితే, వీరు బాబాను గుర్తించారు అని ఏమైనా అనుకుంటారా. బాబాకు అర్థమవుతుంది, వీరు స్వయమే పూర్తిగా అర్థం చేసుకోలేదు, అందుకే సేవకు పరిగెత్తడం లేదు, లేదంటే వెంటనే సేవకు పరుగెత్తాలి. అంధులకు చేతికర్రగా అవ్వకపోతే స్వయమే అంధులుగా ఉన్నట్లు. బాబా గురించి తెలియదు. మీరు సేవకు వెళ్ళండి అని ఎవరికైనా చెప్పాలా. తమంతట తామే రావాలి, బాబా, మేము సేవకు వెళ్ళగలము, మీరు అనుమతినివ్వండి. ఎవరెవరు సేవ చేయగలరు అనేది బాబాకు తెలుసు. బాబా, మేము రెడీగా ఉన్నాము అని ఎవరూ రాయరు. మనుష్యులను గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారుచేయాలి. ఒకవేళ 10-20-50 రూపాయలు సంపాదించకపోతే ఏమవుతుంది? చాలా మంది కళ్యాణం చేయాలి. కానీ పూర్తి పరిచయం లేదు. కోట్లలో కొందరికే తెలుసు. మా వద్ద కూడా కొద్దిమంది సర్వీసబుల్ పిల్లలు ఉన్నారు, వారికి టెలిగ్రామ్ పంపించి పిలిపించాల్సి ఉంటుంది. బాబా, మేము తయారుగా ఉన్నాము అని వారంతట వారే అనరు. ఎవరికి సేవ పట్ల అభిరుచి ఉంది అనేది బాబా చూస్తారు. జంతువుల వలె తయారైన మనుష్యులను దేవతలుగా తయారుచేయాలి.

పిల్లలైన మీరు నిరంహంకారులుగా అవ్వాలి. హెడ్ లోనైతే చాలా నమ్రత కావాలి. తండ్రి ఎంత నిరహంకారి, కొంతమంది పిల్లల్లో చాలా అహంకారముంది. ఎలాంటి కర్మ నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. దానికి దండన ఏమిటంటే, వారి అవస్థ పడిపోతుంది. బాబా అంటారు, పిల్లలూ, మీరు అంతా మీ చేతులతోనే చేసుకోవాలి. బాబా ఎలా సాధారణ రీతిలో చదివిస్తారు. వారు సర్వశక్తివంతుడు, వారేమి చేయలేరు! అని మనుష్యులు భావిస్తారు. కానీ బాబా అంటారు, – నేనైతే సర్వెంట్ గా అయి రావాల్సి ఉంటుంది. ఓ జ్ఞాన సాగరా, పతితపావనా రండి, సుఖసాగరా రండి, వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని అంటారు కూడా. తండ్రి వచ్చి ఇటువంటి సేవను చేయవలసి ఉంటుంది. ఎక్కడకు వచ్చి ఉండాల్సి ఉంటుంది! ఎలాంటి-ఎలాంటి విఘ్నాలు కలుగుతాయి. లక్క భవనానికి నిప్పంటించారు, అంతా ప్రాక్టికల్ గా జరుగుతుంది. బాబాకైతే మొత్తం పాత్ర గురించి తెలుసు, మనకు తెలియదు. తండ్రి అంటారు, నేను రావాల్సి ఉంటుంది. భగవంతుడు స్వయంగా అంటారు, నేను నిందలు పడవలసి ఉంటుంది. అందరికన్నా ఎక్కువ నిందలు నేనే ఎదుర్కొంటాను. భక్తి మార్గంలో కూడా నిందలే చేసేవారు. 3 అడుగుల నేల కూడా లభించదు. అయినా, ఎంతటి నిరహంకారితనంతో పాత్రను అభినయిస్తున్నారు. మమ్మా, బాబా పిల్లలకు నేర్పించేందుకు అన్నీ చేస్తారు. ఎంతగా కిందకు రావాల్సి ఉంటుంది. పతితులను పావనంగా చేయాలి. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేయాలి కావున చాకలివాడు కూడా, కంసాలిగా కూడా. అందరినీ కరిగించి-కరిగించి సత్యమైన బంగారంగా చేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా నిరహంకారులుగా, నమ్రచిత్తులుగా అవ్వాలి. తమ సేవను తమ చేతులతోనే చేసుకోవాలి. ఏ విషయంలోనూ అహంకారాన్ని చూపించకూడదు.

2. సేవ కోసం సదా తయారుగా ఉండాలి. సేవ కోసం స్వయాన్ని తమంతట తామే ఆఫర్ చేసుకోవాలి. గవ్వలాంటి మనుష్యులను వజ్రం వలె తయారుచేసే సేవ చేయాలి.

వరదానము:-

ఎవరైతే సదా నిండుగా మరియు సంపన్నంగా ఉంటారో, వారు తృప్తిగా ఉంటారు. ఎవరు ఎంతగా అసంతుష్టం చేసే పరిస్థితులను వారి ముందుకు తీసుకువచ్చినా, సంపన్నమైన తృప్త ఆత్మలు అసంతుష్టంగా చేసేవారికి కూడా సంతుష్టతా గుణాన్ని సహయోగం రూపంలో ఇస్తారు. ఇటువంటి ఆత్మలే దయార్ద్రహృదయులుగా అయి శుభభావన మరియు శుభకామనల ద్వారా వారిని కూడా పరివర్తన చేయడానికి ప్రయత్నిస్తారు. ఆత్మిక రాయల్ ఆత్మల శ్రేష్ఠ కర్మ ఇదే.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top