09 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 8, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత దేహ భానాన్ని మర్చిపోండి, దీని పట్ల మమకారాన్ని తొలగించండి, అప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది, ఈ శరీరమైతే సమాప్తమయ్యేదే ఉంది’’

ప్రశ్న: -

ఈ డ్రామాలో మనుష్యులకు తెలియని స్థిరమైన నియమం ఏమిటి?

జవాబు:-

ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అప్పుడు భక్తి ఉండదు మరియు ఎప్పుడైతే భక్తి ఉంటుందో, అప్పుడు జ్ఞానముండదు. ఎప్పుడైతే పావన ప్రపంచం ఉంటుందో, అప్పుడు పతితులెవరూ ఉండరు మరియు ఎప్పుడైతే పతిత ప్రపంచం ఉంటుందో, అప్పుడు పావనమైనవారు ఎవరూ ఉండరు… ఇది డ్రామా యొక్క స్థిరమైన నియమము, దీని గురించి మనుష్యులకు తెలియదు.

ప్రశ్న: -

సత్యమైన కాశీ కల్వట్ (కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణ త్యాగము చేసుకొనే ఆచారము) అని దేనినంటారు?

జవాబు:-

అంతిమంలో ఎవ్వరి స్మృతి రాకూడదు. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి, ఇదే సత్యమైన కాశీ కల్వట్ చేయడము. కాశీ కల్వట్ చేయడము అనగా పాస్ విత్ ఆనర్ గా అవ్వడము (గౌరవప్రదంగా ఉత్తీర్ణులవ్వడము), ఇందులో ఏ మాత్రం శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ప్రతిజ్ఞ చేసి గడప వద్దకు వచ్చాము… (దర్ పర్ ఆయే హై కసమ్ లే…)

ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకున్నారు మరియు తండ్రి పిల్లలను తమవారిగా చేసుకున్నారు ఎందుకంటే దుఃఖధామం నుండి విడిపించి శాంతిధామం మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతున్నారు. పతిత మనుష్యులెవ్వరూ పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. నియమమే లేదు. ఈ నియమం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులైతే ఈ సమయంలో పతితులుగా, వికారులుగా ఉన్నారు. ఎలాగైతే మీరు పతితులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు అన్ని అలవాట్లను తొలగించి సర్వగుణ సంపన్నులైన దేవీ-దేవతలుగా అవుతున్నారు. పాటలో అన్నారు – మేము జీవిస్తూనే మరణించడానికి అనగా మీకు చెందినవారిగా అవ్వడానికి వచ్చాము, ఇక మీరు మాకు ఏ మతమును ఇస్తే అది, ఎందుకంటే మీ మతమైతే సర్వోత్తమమైనది. ఇక అనేక మతాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆసురీ మతాలు. మనం ఆసురీ మతంపై నడుస్తున్నామని ఇంతకాలం మనకు కూడా తెలియదు. మనం ఈశ్వరీయ మతంపై నడవడం లేదని, రావణుని మతంపై ఉన్నామని ప్రపంచంలోని వారు అర్థం చేసుకోరు. బాబా అంటారు, పిల్లలూ, అర్ధకల్పం నుండి మీరు రావణుని మతంపై నడుస్తూ వచ్చారు. అది భక్తి మార్గము, రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని జ్ఞాన కాండము అని, రావణ రాజ్యాన్ని భక్తి కాండము అని అంటారు. కనుక జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము. దేని పట్ల వైరాగ్యము? భక్తి పట్ల మరియు పాత ప్రపంచం పట్ల వైరాగ్యము. రాత్రి తర్వాత పగలు వస్తుంది. వైరాగ్యము, భక్తి పట్ల మరియు పాత ప్రపంచం పట్ల. ఇది అనంతమైన న్యాయబద్ధమైన వైరాగ్యము. సన్యాసుల వైరాగ్యము వేరు. వారికి కేవలం ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యం ఉంటుంది. అది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. హద్దు వైరాగ్యం అనగా ప్రవృత్తి యొక్క సన్యాసము. మీరు అనంతమైన సన్యాసం ఎలా చేయాలి అనేది తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు, భక్తిలో ఆత్మ జ్ఞానం గాని, పరమాత్మ జ్ఞానం గాని ఉండదు. ఆత్మలమైన మనం ఎవరిమి, ఎక్కడ నుండి వచ్చాము, ఏ పాత్రను అభినయించాలి, ఏమీ తెలియదు. ఆత్మలమైన మనం ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటామని సత్యయుగంలో కేవలం ఆత్మ జ్ఞానం ఉంటుంది. పరమాత్మ జ్ఞానం అక్కడ అవసరం లేదు, అందుకే పరమాత్మను స్మృతి చేయరు. ఈ డ్రామా ఈ విధంగా తయారై ఉంది. తండ్రి జ్ఞానస్వరూపుడు. సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం తండ్రి వద్దనే ఉంది. తండ్రి మీకు ఆత్మ, పరమాత్మల జ్ఞానాన్ని ఇచ్చారు. ఆత్మ రూపం ఏమిటి అని మీరు ఎవరినైనా అడగండి. వారు జ్యోతి స్వరూపము అని అంటారు. కానీ అదేమిటి అనేది ఏమీ తెలియదు. ఆత్మ పూర్తిగా చిన్న బిందువని, నక్షత్రమని మీకిప్పుడు తెలుసు. బాబా కూడా నక్షత్రము వలె ఉంటారు. కానీ వారికి చాలా మహిమ ఉంది. మీరు ముక్తి-జీవన్ముక్తిని ఎలా పొందగలరు అనేది ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు. శ్రీమతంపై నడవడంతో మీరు ఉన్నత పదవిని పొందగలరు. మనుష్యులు దాన-పుణ్యాలు, యజ్ఞాలు మొదలైనవి చేస్తారు. భగవంతుడు దయ చూపి మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్తారు అని భావిస్తారు. ఎలాగో తెలియదు కానీ ఏదో ఒక రూపంలో లభిస్తారు. ఎప్పుడు లభిస్తారు? అని అడగండి. అప్పుడు అంటారు, ఇప్పుడింకా చాలా సమయముంది, చివర్లో లభిస్తారు అని. మనుష్యులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. మీరిప్పుడు గుప్త రూపంలో పతితులను పావనంగా చేయడానికి నిమిత్తులుగా అయ్యారు. మీరు చాలా శాంతిగా పని చేయాలి. ప్రేమతో ఎలా అర్థం చేయించండి అంటే మనుష్యుల నుండి దేవతలుగా అనగా గవ్వ నుండి వజ్రతుల్యంగా చిటికెలో తయారైపోవాలి. ఇప్పుడు తండ్రి అంటారు, కల్ప-కల్పము నేను వచ్చి పిల్లలైన మీ సేవలో ఉపస్థితమవ్వాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది అర్థం చేయించాలి. అక్కడ దేవతలు చాలా ఆనందంగా ఉంటారు. బాబా వారసత్వం లభించి ఉంటుంది. ఎటువంటి చింత లేక వ్యాకులత యొక్క విషయం ఉండదు. గార్డెన్ ఆఫ్ అల్లా (భగవంతుని పూదోట) అని అంటూ ఉంటారు. అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, చాలా ధనవంతులుగా ఉండేవారు. ఈ సమయంలో బాబా మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో చాలా ధనవంతులుగా చేస్తున్నారు. తర్వాత మీకు శరీరం కూడా ఫస్ట్ క్లాస్ ది లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటారు, దేహాభిమానాన్ని విడిచి దేహీ-అభిమానులుగా అవ్వండి. ఈ దేహం మరియు దేహ సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ భౌతికమైనవి. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, 84 జన్మల జ్ఞానం బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, ఇప్పుడు మన ఇంటికి పదండి. బుద్ధిలో ఇదే ఉండాలి, ఇప్పుడిక ఈ భౌతికమైనవాటిని వదిలేసినట్లే, అప్పుడే బుద్ధియోగము తండ్రితో పాటు ఉంటుంది మరియు వికర్మలు వినాశనమవుతాయి. గృహస్థ వ్యవహారంలో కమలపుష్ప సమానంగా ఉండాలి. ఉపరామంగా ఉండండి. వానప్రస్థంలో ఉన్నవారు, ఇళ్ళు-వాకిళ్ళ నుండి బయటకు వచ్చి సాధువుల వద్దకు వెళ్ళి కూర్చుండిపోతారు. కానీ మాకు ఏం లభించనున్నది అన్న జ్ఞానం లేదు. వాస్తవానికి ఎప్పుడైతే ప్రాప్తి గురించి కూడా తెలుస్తుందో, అప్పుడే మమకారం తొలుగుతుంది. అంతిమ సమయంలో పిల్లా పాపలు గుర్తుకు రాకూడదు, అందుకే దూరంగా వెళ్తారు. ఈ పాత ప్రపంచం పట్ల మమకారం తొలగిపోవడంతో మనం విశ్వానికి యజమానులుగా అయిపోతామని ఇక్కడ మీకు తెలుసు. ఇక్కడ ఇది చాలా భారీ సంపాదన. మిగిలినవారు ఏదైతే చేస్తారో, అది అల్పకాలికమైన సుఖం కోసం చదువుతారు. అల్పకాలికమైన సుఖం కోసం భక్తి చేస్తారు. మీరా కు సాక్షాత్కారం జరిగింది కానీ రాజ్యాన్ని అయితే తీసుకోలేరు.

బాబా మతంపై నడవడం వలన భారీ బహుమతి లభిస్తుందని మీకు తెలుసు. పవిత్రత, శాంతి, సంపన్నతను స్థాపన చేసినందుకు మీకు ఎంత ప్రైజ్ లభిస్తుంది. తండ్రి అంటారు, ఇప్పుడు దేహ భానాన్ని తొలగిస్తూ ఉండండి. మేము మీకు సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ దేహాన్ని మరియు దేహ సంబంధాలను ఇస్తాము. అక్కడ దుఃఖం నామరూపాలు ఉండవు, అందుకే ఇప్పుడు నా మతముపై ఏక్యురేట్ (ఖచ్చితం)గా నడుచుకోండి. మమ్మా-బాబా నడుస్తారు, అందుకే మొదట రాజ్యము వారికే లభిస్తుంది. ఈ సమయంలో జ్ఞాన-జ్ఞానేశ్వరిగా అవుతారు, సత్యయుగంలో రాజ-రాజేశ్వరిగా అవుతారు. ఈశ్వరుని జ్ఞానంతో మీరు రాజులకే రాజులుగా అయినప్పుడు, ఈ జ్ఞానం అక్కడ ఉండదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు ఉంది. దేహ భానాన్ని ఇప్పుడు తెంచాలి. నా స్త్రీ, నా కొడుకు, ఇవన్నీ మర్చిపోవాలి. వీరంతా మరణించే ఉన్నారు. మన శరీరం కూడా మరణించే ఉంది. మనమైతే తండ్రి వద్దకు వెళ్ళా్లి. ఈ సమయంలో ఆత్మ జ్ఞానం కూడా ఎవరికీ లేదు. ఆత్మ జ్ఞానం సత్యయుగంలో ఉంటుంది. అది కూడా, అంతిమ సమయంలో ఎప్పుడైతే శరీరం వృద్ధాప్యానికి చేరుకుంటుందో, అప్పుడు ఆత్మ అంటుంది – ఇప్పుడు నా శరీరం వృద్ధాప్యానికి చేరుకుంది, ఇప్పుడు నేను కొత్తది తీసుకోవాలి అని. మొదట మీరు ముక్తిధామానికి వెళ్ళా్లి. ఇంటికి వెళ్ళాలి అని సత్యయుగంలో ఇలా అనరు. ఇంటికి తిరిగి వెళ్ళే సమయమిది. ఇక్కడ సమ్ముఖంలో ఎంతగా కొట్టి-కొట్టి మీ బుద్ధిలో కూర్చోబెడతారు. సమ్ముఖంలో వినడంలో మరియు మురళీ చదవడంలో రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మకు ఇప్పుడు పరిచయం లభించింది, దీనిని జ్ఞాన చక్షువు (నేత్రము) అని అంటారు. ఎంతటి విశాల బుద్ధి కావాలి. చిన్న నక్షత్రం వంటి ఆత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది. ఇప్పుడు బాబా వెనుక మనం కూడా పరుగెడతాము. శరీరాలైతే అందరివి సమాప్తం కానున్నాయి. ప్రపంచ చరిత్ర-భూగోళాలు మళ్ళీ రిపీట్ అవ్వనున్నాయి. ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెట్టకూడదు. కేవలం మమకారాన్ని తొలగించాలి మరియు పవిత్రంగా అవ్వాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. మొదట జ్ఞానం యొక్క మథనం చేయండి, తర్వాత అందరికీ ప్రేమగా జ్ఞానాన్ని వినిపించండి. శివబాబా అయితే విచార సాగర మథనం చేయరు. వీరు పిల్లల కోసం చేస్తారు. అయినా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. నేను వినిపిస్తున్నాను అనేది వీరికి ఉండదు. శివబాబా వినిపిస్తున్నారు. దీనిని నిరహంకారితనము అని అంటారు. స్మృతి ఒక్క శివబాబాను చేయాలి. తండ్రి ఏదైతే విచార సాగర మథనం చేస్తారో, దానిని వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలు కూడా ఫాలో చేయాలి. ఎంత వీలైతే అంత, మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి, రాత్రి మేల్కొని కూడా ఆలోచించాలి. పడుకొని కాదు, లేచి కూర్చోవాలి. నేను ఆత్మను, ఎంత చిన్న బిందువును. బాబా ఎంతటి జ్ఞానాన్ని అర్థం చేయించారు – సుఖాన్ని ఇచ్చేటువంటి తండ్రి యొక్క అద్భుతము! తండ్రి అంటారు, నిద్రను జయించేటువంటి పిల్లలూ, దేహ సహితంగా దేహం యొక్క మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ మర్చిపోవాలి. వీరంతా సమాప్తమవ్వనున్నారు. మనం బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి మరియు అందరి నుండి మమకారాన్ని తొలగించి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. శరీరాన్ని వదిలినప్పుడు కూడా ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. ఇప్పుడు సత్యాతి-సత్యమైన కాశీ కల్వట్ ను కూడా చేయాలి. స్వయం కాశీనాథుడైన శివబాబా అంటారు, నేను మీ అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను. కాశీ కల్వట్ ఇప్పుడు చేయాల్సే ఉంటుంది. ప్రాకృతిక వైపరీత్యాలు కూడా ఇప్పుడు రానున్నాయి. ఆ సమయంలో మీరు కూడా స్మృతిలో ఉండాలి. వారు కూడా స్మృతిలో ఉంటూ బావిలో దూకేవారు. కానీ బావిలో దూకడంతో ఏమీ జరగదు. ఇక్కడైతే మీరు ఎలా తయారవ్వాలంటే, శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాకూడదు. లేదంటే ఇంతటి పదవిని పొందలేరు. బాబా స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. దానితో పాటు, మనం మళ్ళీ 84 జన్మల చక్రం తిరుగుతాము అన్న జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని ధారణ చేయడంతో మనం చక్రవర్తీ రాజులుగా అవుతాము. ఎటువంటి వికర్మ చేయకూడదు. ఏదైనా అడగాలనుకుంటే బాబాను సలహా అడగవచ్చు. సర్జన్ అయితే నేనొక్కడినే కదా. సమ్ముఖంలోనైనా అడగవచ్చు, ఉత్తరంలోనైనా అడగవచ్చు, బాబా మార్గాన్ని తేలియజేస్తారు. బాబా ఎంత చిన్న నక్షత్రము మరియు మహిమ ఎంత భారీగా ఉంది. కర్తవ్యము చేసారు కావుననే మహిమను పాడుతారు. ఈశ్వరుడే అందరి సద్గతిదాత, వీరికి కూడా జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడైన ఆ పరమపిత పరమాత్మ.

తండ్రి అంటారు, పిల్లలూ, ఒక్క బాబాను స్మృతి చేయండి మరియు అతి మధురంగా తయారవ్వాలి. శివబాబా ఎంతటి మధురమైనవారు. ప్రేమగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా ప్రేమ సాగరుడు కనుక తప్పకుండా ప్రేమిస్తారు. తండ్రి అంటారు, మధురాతి-మధురమైన పిల్లలూ, ఎవ్వరికీ మనసా-వాచా-కర్మణా దుఃఖాన్ని ఇవ్వకండి. ఎవరికైనా మీ పట్ల శత్రుత్వం ఉన్నా కూడా, మీ బుద్ధిలో దుఃఖమివ్వాలనే ఆలోచన రాకూడదు. అందరికీ సుఖం యొక్క విషయాలనే చెప్పాలి. లోపల ఎవరి పట్ల కోపం పెట్టుకోకూడదు. చూడండి, ఆ శంకరాచార్యులు మొదలైనవారిని ఎంత పెద్ద-పెద్ద వెండి సింహాసనాలపై కూర్చోబెడతారు. ఇక్కడ శివబాబా, ఎవరైతే మిమ్మల్ని గవ్వ నుండి వజ్రంలా తయారుచేస్తారో, వారికైతే వజ్రాల సింహాసనం ఉండాలి, కానీ శివబాబా అంటారు, నేను పతిత శరీరంలో మరియు పతిత ప్రపంచంలో వస్తాను. చూడండి, బాబా ఎలాంటి కుర్చీని తీసుకున్నారు. వారు నివసించేందుకు కూడా ఏమీ అడగరు. ఎక్కడైనా సరే నివాసం చేయించవచ్చు. రజాయిలో సృష్టికర్తను చూసాను… అని పాడుతారు కూడా. భగవంతుడు వచ్చి పాత రజాయిలో కూర్చున్నారు. ఇప్పుడు తండ్రి బంగారు యుగపు విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చారు. వారంటారు, నాకు ఈ పతిత ప్రపంచంలో 3 అడుగుల భూమి కూడా లభించదు. విశ్వానికి యజమానులుగా కూడా మీరే అవుతారు. డ్రామాలో నా పాత్రే ఇది. భక్తి మార్గంలో కూడా నేను సుఖాన్ని ఇవ్వాలి. మాయ చాలా దుఃఖితులుగా చేస్తుంది. తండ్రి దుఃఖం నుండి విముక్తులుగా చేసి శాంతిధామం మరియు సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఈ ఆట గురించే ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో ఒకటి భక్తి యొక్క ఆడంబరము, రెండవది మాయ యొక్క ఆడంబరము. చూడండి, సైన్సుతో ఏమేమి తయారుచేసారు. మనుష్యులు, మేము స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు. తండ్రి అంటారు, ఇది సైన్సు యొక్క ఆడంబరము. ఇదంతా సమాప్తమైపోయినట్లే. ఇంత పెద్ద-పెద్ద భవనాలు మొదలైనవన్నీ పడిపోతాయి, తర్వాత సత్యయుగంలో ఈ సైన్సు మీకు సుఖాన్నిచ్చే పనుల్లో ఉపయోగపడుతుంది. ఈ సైన్సుతోనే వినాశనం జరుగుతుంది. తర్వాత దీనితోనే చాలా సుఖాన్ని అనుభవిస్తారు. ఇది ఆట. పిల్లలైన మీరు చాలా-చాలా మధురంగా అవ్వాలి. మమ్మా బాబా ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. అర్థం చేయిస్తూ ఉంటారు – పిల్లలూ, పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుకోకండి-గొడవపడకండి. ఎక్కడా తల్లిదండ్రుల గౌరవాన్ని పోగొట్టకండి. ఈ భౌతిక స్థూల దేహం పట్ల మమకారాన్ని తొలగించండి. ఒక్క బాబాను స్మృతి చేయండి. అన్నీ సమాప్తమయ్యే వస్తువులే, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళా్లి. బాబాకు సేవలో సహాయం చేయాలి. సత్యాతి-సత్యమైన ముక్తిదళం మీరు, ఈశ్వరీయ సేవాధారులు, విశ్వమనే నావ ఏదైతే మునిగిపోయిందో, దానిని మీరు తీరానికి చేరుస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. ఉదయం 3-4 గంటలకు లేచి కూర్చుని చింతన చేసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది మరియు పక్కాగా అయిపోతారు. రివైజ్ చేయకపోతే మాయ మరపింపజేస్తుంది. ఈ రోజు బాబా ఏమి అర్థం చేయించారు అని మథనం చేయండి. ఏకాంతంలో కూర్చుని విచార సాగర మథనం చేయాలి. ఇక్కడ కూడా ఏకాంతం బాగుంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అప్పుడు భక్తి ఉండదు మరియు ఎప్పుడైతే భక్తి ఉంటుందో, అప్పుడు జ్ఞానముండదు. ఎప్పుడైతే పావన ప్రపంచం ఉంటుందో, అప్పుడు పతితులెవరూ ఉండరు మరియు ఎప్పుడైతే పతిత ప్రపంచం ఉంటుందో, అప్పుడు పావనమైనవారు ఎవరూ ఉండరు… ఇది డ్రామా యొక్క స్థిరమైన నియమము, దీని గురించి మనుష్యులకు తెలియదు.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరి విషయాన్ని మనసులో పెట్టుకోకూడదు. తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి.

2. ఏకాంతంలో కూర్చుని విచార సాగర మథనం చేయాలి. మథనం చేసి తర్వాత ప్రేమగా అర్థం చేయించాలి. బాబా సేవలో సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-

ఆత్మిక రాయల్టీ యొక్క పునాది సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రతనే రాయల్టీ. ఈ ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు పవిత్ర ఆత్మ స్వరూపం ద్వారా కనిపిస్తుంది. ఈ ప్రకాశం ఎప్పుడూ దాగి ఉండలేదు. ఎవరు ఎంతగా స్వయాన్ని గుప్తంగా ఉంచుకున్నా కానీ వారి మాట, వారి సంబంధ-సంపర్కము, ఆత్మిక వ్యవహారం యొక్క ప్రభావం వారిని ప్రత్యక్షం చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు జ్ఞానం యొక్క దర్పణంలో చూసుకోండి, నా ముఖంలో, నడవడికలో ఆ రాయల్టీ కనిపిస్తుందా లేక సాధారణ ముఖం, సాధారణ నడవడిక ఉందా?

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top