07 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 6, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి, తండ్రిని స్మృతి చేసినట్లయితే తనువు యొక్క కలహ-క్లేశాలు తొలగిపోతాయి, మీరు నిరోగులుగా అయిపోతారు’’

ప్రశ్న: -

ఈ సమయంలో పిల్లలైన మీరు యుద్ధ స్థలంలో ఉన్నారు, గెలుపు లేక ఓటమి యొక్క ఆధారమేమిటి?

జవాబు:-

 శ్రీమతంపై నడుచుకోవడంతో గెలుపు, తమ మతం లేక ఇతరుల మతంపై నడుచుకోవడంతో ఓటమి. ఒకవైపు రావణ మతం వారు ఉన్నారు, మరొకవైపు రాముని మతం వారు ఉన్నారు. తండ్రి అంటారు, పిల్లలూ, రావణుడు మిమ్మల్ని చాలా సతాయించాడు. ఇప్పుడు మీరు నాతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే, విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా, తమ మతంపై నడుచుకుని లేక ఘర్షణలోకి వచ్చి, చదువును వదిలేసినట్లయితే, మాయ ముఖం తిప్పేస్తుంది, ఓడిపోతారు. అందుకే చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో, చూడు భగవంతుడా… (దేఖ్ తేరే సంసార్ కీ హాలత్…)

ఓంశాంతి. మానవుడు ఎంతగా మారవలసి ఉంటుంది. ఇది కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకోగలరు. మానవుడు ఎంత ఉన్నతోన్నతంగా అవ్వగలడు, అదే మానవుడు మళ్ళీ నీచాతి-నీచంగా అవుతాడు. మనుష్యులు సత్యయుగీ సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవ్వగలరు మరియు మనుష్యులే తమోప్రధానంగా, పైసకు కొరగాని వారిగా అవుతారు. ఇదంతా మీరు అనంతమైన తండ్రి ద్వారా తెలుసుకున్నారు. వారొక్కరే పతితపావనుడు, సద్గతిదాత. వారే పావనంగా తయారుచేస్తారు. రావణుడు మళ్ళీ పతితంగా చేస్తాడు. మళ్ళీ పరమపిత పరమాత్మ వచ్చి ఎంత ఉన్నతంగా చేస్తారు, అందుకే ఈశ్వరుని గతి-మతము అతీతమైనది అని అంటూ ఉంటారు. వారి మహిమ కూడా అందరికన్నా అతీతమైనది. తండ్రి మహిమ అంతులేనిది, ఎందుకంటే వారి వంటి మతము ఇంకెవ్వరిదీ ఉండనే ఉండదు. దానిని శ్రీమత్ భగవత్ అని అంటారు. మతమైతే అందరిదీ ఉంటుంది. బ్యారిష్టరు మతము, సర్జన్ మతము, చాకలివాని మతము, సన్యాసుల మొదలైనవారి మతము. అయినా కూడా, ఓ ఈశ్వరా, మీ గతి-మతము అందరికన్నా అతీతమైనది అని అంటూ ఉంటారు. పరమపిత పరమాత్మనే ఉన్నతాతి ఉన్నతమైనవారు, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. ఇది ఏమీ మనుష్య మతం లేక దేవతల మతం కాదు. మీలో కూడా ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో, వారే ఈ విషయాన్ని అర్థము చేసుకొగలరు మరియు అర్ధం చేయించగలరు. మేము బాబా శ్రీమతంతో ఎంత శ్రేష్ఠంగా అవుతున్నాము అనేది వారికి తెలుసు. బాబా లవ్ ఫుల్ (ప్రేమ స్వరూపుడు), పీస్ ఫుల్ (శాంతి స్వరూపుడు). వారు ప్రతి విషయంలోనూ ఫుల్ గా ఉన్నారు కనుక మీరు కూడా తండ్రి నుండి ఫుల్ (పూర్తి) వారసత్వాన్ని తీసుకోవాలి. పూర్తి వారసత్వము అంటే ఏమిటి? నంబర్ వన్ విశ్వానికి యజమానిగా అవ్వడము. తక్కువలో తక్కువ సూర్యవంశీయుల మాలలోనైతే కూర్చబడాలి. మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. మొత్తం ప్రపంచం వారి మాలను తిప్పుతూ ఉంటుంది. మాలను తప్పకుండా స్మరిస్తారు. కానీ దాని అర్థమేమీ తెలియదు. స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి అనగా ఒక్కరినే స్మరించాలి. మరి వీరంతా అందరినీ ఎందుకు స్మరిస్తారు. తండ్రి అంటారు, అందరినీ స్మరించకండి, కేవలం నన్నొక్కరినే స్మరించండి. తండ్రినైన నన్ను బాగా స్మృతి చేయండి, నన్ను స్మృతి చేస్తూ-చేస్తూ మీరు నా వద్దకు చేరుకుంటారు. నేను డైరెక్షన్ ఇస్తున్నాను, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇది ఎంత సహజమైన ఉపాయము. స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని అంటారు అనగా జీవన్ముక్తి పదవిని పొందండి. తనువు యొక్క కలహ-క్లేశాలన్నీ తొలగిపోతాయి. అక్కడ మీ శరీరాలకు ఏ రోగమూ ఉండదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు సమ్ముఖంలో వినిపిస్తున్నారు, మీరు విని ఇతరులకు వినిపిస్తారు. అందరికన్నా బాగా ఈ టేప్ రికార్డర్ వినిపిస్తుంది. కొద్దిగా కూడా మిస్ చేయదు. ఇకపోతే, హావ-భావాలనైతే చూడలేరు. బాబా ఇలా-ఇలా అర్థం చేయిస్తూ ఉండి ఉండవచ్చు అని బుద్ధితో అర్థం చేసుకుంటారు. ఈ టేప్ మెషీన్ అయితే ఖజానాల గని వంటిది. మనుష్యులైతే శాస్త్రాలను దానం చేస్తారు. గీతను ముద్రించి దానం చేస్తారు. ఈ టేప్ ఎంత అద్భుతమైన వస్తువు. కొద్దిగా సున్నితంగా ఉంటుంది, అందుకే జాగ్రత్తగా నడిపించాల్సి ఉంటుంది. ఇది హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ. అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము యొక్క వారసత్వాన్ని ఇస్తుంది. మురళీ ద్వారానే అంతా లభిస్తుంది. కానీ మాయా మోహిని ఎటువంటిది అంటే అది అంతటినీ మరిపింపజేస్తుంది. అయితే రావణుడు మోహితులుగా చేస్తాడు లేక రాముడు మోహితులుగా చేస్తాడు. రాముడు ఒక్కసారి మోహితులుగా చేస్తాడు, రావణుడు అర్ధకల్పం నుండి లాగుతూ-లాగుతూ పూర్తిగా మట్టితో కలుషితము చేసేసాడు. ఇక్కడ ప్రతి వస్తువు తమోప్రధానంగా ఉంది. 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. సత్యయుగంలో 5 తత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. ఇది ఎంత గొప్ప భారీ సంపాదన. తీసుకునేది ఎవరు! కోట్లలో కొందరు. కోతి బుద్ధి కలవారిని మందిర బుద్ధి కలవారిగా చేయడానికి ఎంత శ్రమ అవుతుంది. మొత్తం ప్రపంచం వేశ్యాలయంగా అయిపోయింది. మళ్ళీ నేనే వచ్చి శివాలయంగా చేస్తాను. భారత్ శివాలయంగా ఉండేది, ఇప్పుడు రావణుడు వేశ్యాలయంగా చేసాడు. సగం సగం సమయం ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు బాగా సేవ చేయండి. వారైతే నామ మాత్రంగా పతిత పావనా రండి, అని అంటారు కానీ వారి గురించి తెలియదు. అనేక మత-మతాంతరాలు ఉన్నాయి. భగవంతుడు స్వయంగా అంటారు, ఇది భ్రష్టాచారీ ప్రపంచము. మనుష్యులు విషం వలన భ్రష్టులుగా అవుతారు. కామం అన్నింటికన్నా మహా శత్రువు. అక్కడ ఈ వికారాలు ఉండనే ఉండవు. ఈ భారత్ అత్యంత ప్రియమైన తండ్రి యొక్క జన్మ స్థలము. శత్రువైన రావణుడిని కాలుస్తారు. దేవీల చిత్రాలను తయారుచేసి, పూజించి మళ్ళీ ముంచేస్తారు. ఇదంతా అంధ శ్రద్ధ. క్రిస్టియన్ ఫాదర్లు కూడా ఇటువంటి విషయాలను వినిపించి చాలా మందిని కన్వర్ట్ చేస్తారు. వాస్తవానికి ఇది డ్రామా యొక్క విధి. కానీ వారు చాలా శ్రమ చేస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యముంది. ఈ సమయంలో అందరూ రావణుడి యొక్క ఛీ-ఛీ మతముపై ఉన్నారు. పరమపిత పరమాత్మ పతిత పావనుడు, వారికి అందరికన్నా ఎక్కువ మహిమ ఉంది, వారిని సర్వవ్యాపి అని అనేసారు. మనుష్యులకు వేరే శత్రువులు ఎవ్వరూ లేరు, మాయతోనే మనుష్యులు పీడించబడుతున్నారు. దాని నుండి అయితే ఒక్క తండ్రినే వచ్చి విడిపిస్తారు, ఇంకెవ్వరూ విడిపించలేరు. నేను నీ శరణులోకి వచ్చాను, ప్రభూ, నా పరువును కాపాడండి… ఇటువంటి పాట కూడా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని రావణుడి నుండి రక్షిస్తారు. రావణుడు ఎంత సతాయించాడు. తండ్రి ఒకటి చెప్తారు, రావణుడు ఇంకొక వైపుకు తీసుకువెళ్తాడు. తండ్రి అంటారు, నా మతముపై నడుచుకోండి, రావణుడు మళ్ళీ మరపింపజేస్తాడు. తండ్రి విశ్వానికి యజమానులుగా చేయడానికి వస్తారు. రక్తంతో కూడా రాసి ఇస్తారు, అయినా కూడా మాయ మరపింపజేసి ముఖాన్ని తిప్పేస్తుంది. ఇదంతా బుద్ధి యొక్క విషయము. తండ్రి అంటారు, పిల్లలూ, ఇప్పుడు తిరిగి వెళ్ళా్లి, అందుకే నన్ను స్మృతి చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు.

తండ్రి అంటారు – పిల్లలూ, శ్రీమతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ ఏదో ఒక కారణం చేత, తమ మతము వలన లేక ఏదో ఒక గొడవ వలన తండ్రిని వదిలేస్తారు. దీనిని యుద్ధ స్థలము అని అంటారు. ఒకవైపు రావణ మతము వారున్నారు, మరోవైపు రాముని మతము వారున్నారు. అరే, మీరు భగవంతుడి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి కదా. ఇంతమంది తీసుకుంటున్నారు, వీరు మూర్ఖులా ఏమిటి! మీరు కూడా భగవంతుని సంతానము, మీరు కూడా వారసత్వాన్ని తీసుకోండి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు. విష్ణువు ద్వారా దేవతలను రచించారని కాదు. బ్రహ్మా ద్వారా విష్ణుపురిని రచించారు. తప్పకుండా ఇది నిజమే, విష్ణువు రాజధానిలో మేము రాజ్యం తీసుకుంటాము అని అంటారు. కూర్చుని-కూర్చుని మళ్ళీ మాయమైపోతారు. ఏదో ఒక కారణం చేత అభిప్రాయ భేదాలలోకి వచ్చేస్తారు. ఏదైనా బంధనం పడినా లేక ఎవరైనా ఏదైనా అన్నా, మర్చిపోతారు. చూడండి, ఇక్కడ అనేకమంది బి.కె.లున్నారు, పరమపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మంచి రీతిలో చదువుకుంటున్నారు కానీ బయటకు వెళ్ళినట్లయితే మర్చిపోతారు. మాయ భ్రష్ట బుద్ధి కలవారిగా చేసేస్తుంది. అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించడం జరుగతుంది. పిల్లలు ఘడియ-ఘడియ వ్యాపార-వ్యవహారాలకు సెలవు తీసుకుని వెళ్తారు. అందరిపైన దయ చూపించాలని అనుకుంటారు ఎందుకంటే వీరంతటి దుఃఖితులు, పైసాకు కొరగాని వారు ప్రపంచంలో ఎవరూ లేరు. అందరి ధనము, సంపద మట్టిలో కలసిపోతుంది. ఇకపోతే, మీది సత్యమైన సంపాదన. మీరు నిండు చేతులతో వెళ్తారు. మిగిలినవారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. వినాశనం తప్పకుండా అవ్వనున్నది అని అయితే అందరికీ తెలుసు. ఇది అదే మహాభారత మహాభారీ యుద్ధం యొక్క సమయము, అందరినీ కాలుడు కబళించేస్తాడు అని అందరూ అంటారు. కానీ ఏం జరగనున్నది, ఇది అర్థం చేసుకోరు. తండ్రి స్వయంగా అంటారు, నేను మిమ్మల్ని అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. నన్నే కాలుడు, మహాకాలుడు అని అంటారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, అందుకే ఇప్పుడు మీరు నా మతముపై నడుచుకోండి మరియు పదవి కూడా ఉన్నతమైనది తీసుకోండి. జీవన్ముక్తిలో కూడా పదవులు ఉంటాయి. ముక్తిలోనైతే ధర్మ స్థాపకులందరూ కూర్చుండిపోతారు. వారు కూడా మొదట ఎప్పుడైతే వస్తారో అప్పుడు సతోప్రధానంగా ఉంటారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. ఉన్నతులు మరియు నీచులు, బికారులు మరియు రాకుమారులు. భారత్ ఈ సమయంలో అన్నింటికన్నా నీచంగా పతితంగా ఉంది. రేపు రేపు మళ్ళీ పావన రాకుమారునిగా అవుతుంది. దేవీ-దేవతా ధర్మం చాలా సుఖము ఇచ్చేటువంటిది. ఇంతటి సుఖము ఇంకే ధర్మంలోనూ ఉండజాలదు. పిల్లలైన మీరు సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు నరకానికి యజమానులుగా అయ్యారు, మళ్ళీ మీరు మొదటి జన్మను సత్యయుగంలో తీసుకుంటారు. హం సో యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. జీవాత్మలమైన మేము ఈ సమయంలో బ్రాహ్మణులుగా ఉన్నాము, దీనికి ముందు శూద్రులుగా ఉండేవారము. రేపు మేమే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా అవుతాము. మళ్ళీ వైశ్య వంశములోకి, శూద్ర వంశములోకి వస్తాము. ఇప్పుడు మనది ఎక్కే కళ. సత్యయుగంలో ఈ జ్ఞానముండదు, దాని కన్నా ముందు మనం దిగే కళలో ఉండేవారము. బాబా ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. కానీ ఎవరి బుద్ధిలోనూ ఈ జ్ఞానం నిలవదు ఎందుకంటే బుద్ధి యోగము నాతో లేదు, అందుకే బంగారు యుగపు పాత్రలు తయారవ్వనే అవ్వవు.

తండ్రి అంటారు – కేవలం నోటితో బాబా-బాబా అని అనకండి. కానీ బాబాను లోలోపల ఎలా స్మృతి చేయాలంటే, అంత మతి సో గతి ఏర్పడాలి. దేహ భానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎంతగా స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా మీ వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయమూ లేనే లేదు. భగవానువాచ – మీరు అందరికీ అర్థం చేయించాలి, మీరు ఈ యజ్ఞ తపాదులు, దానాలు ఏవైతే చేస్తున్నారో, వీటి ద్వారా నన్ను కలవలేరు. ఇప్పుడైతే మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. ఒక్కరు కూడా నా వద్దకు రాలేదు. నాటకంలో చివరి వరకు పాత్రధారులందరూ ఉండాలి. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో, అప్పుడు అందరూ తిరిగి వెళ్ళా్లి. ఆత్మలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మధ్యలో నుండి బయటకు రాలేవు. స్థాపన చేసేవారే ఇక్కడ కూర్చొన్నారు. 84 జన్మలు తీసుకోవాలి. వృక్షం శిథిలావస్థను చేరుకోవాలి. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి విషయాలు. మాయ ఎక్కడా మోసం చేయకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మీ ముఖాన్ని పైకి ఉంచుకోవాలి, సంతోషంగా వెళ్ళా్లి (శవం యొక్క ముఖం తిప్పుతారు). బాబా అంటారు, మీ ముఖాన్ని స్వర్గం వైపు పెట్టండి, కాళ్ళను నరకం వైపు ఉంచండి. అందుకే కృష్ణుని చిత్రం అలా తయారుచేసారు. శ్యామసుందర్ గా అవుతారు. మీరు కూడా నంబర్ వన్ తెల్లగా అవుతారు, అందుకే మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు అని అంటారు. అనగా కలియుగాన్ని సత్యయుగంగా చేయడం అనేది తండ్రి పని. మనము శ్రీమతంపై విశ్వ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, అక్కడికి వచ్చి రాజ్యం చేస్తాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో యజ్ఞ-తపాదులు చేయాల్సిన అవసరం లేదు. నన్ను స్మృతి చేయండి అని బాబా వీరి ద్వారా మతాన్ని ఇస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందులో ఏ పదవి కావాలనుకుంటే, అది తీసుకోండి. ఎలాగైతే ఈ మమ్మా ఇప్పుడు జ్ఞాన-జ్ఞానేశ్వరి, వెళ్ళి రాజ-రాజేశ్వరిగా అవుతారు. ఇది ఉన్నదే రాజయోగం యొక్క జ్ఞానము. మరి ఇటువంటి కాలేజిలో ఎంత మంచి రీతిలో చదువుకోవాలి. తండ్రి అంటారు, ఈ రోజు చాలా మంచి-మంచి పాయింట్లు వినిపిస్తాను, అందుకే పూర్తి శ్రద్ధ పెట్టండి. మిత్ర-సంబంధీకుల కళ్యాణము కూడా చేయండి. ఎవరి అదృష్టంలో ఉంటే, వారు మేల్కొంటారు. శివుని మందిరాలకి వెళ్ళి భాషణ చేయండి. శివబాబా నరకాన్ని స్వర్గంగా చేయడానికి వచ్చారు. అలా తయారవ్వడానికి చాలా మంది వస్తారు. మీకు మాయతో చాలా జబర్దస్త్ యుద్ధం నడుస్తుంది. మంచి-మంచి పిల్లలకు ఈ రోజు నషా ఎక్కుతుంది, రేపు మాయమైపోతారు. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. మనం ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళి పాదం మోపుతాము. ఈ ఢిల్లీ పరిస్తాన్ గా అవుతుంది. ఇప్పుడు పరిస్తాన్ లోకి వెళ్ళడానికి పుష్పాలుగా అవ్వండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానాన్ని వదిలి బాబాను లోలోపలే ఎలా స్మృతి చేయాలంటే అంత మతి సో గతి ఏర్పడాలి. బుద్ధిని స్మృతి ద్వారా బంగారు యుగపు బుద్ధిగా చేసుకోవాలి.

2. ఎప్పుడూ కూడా మన్మతము లేక అభిప్రాయ భేదాలలోకి వచ్చి చదువును వదలకూడదు. తమ ముఖాన్ని స్వర్గం వైపుకు పెట్టాలి. నరకాన్ని మర్చిపోవాలి.

వరదానము:-

మనం సర్వ శ్రేష్ఠ ఆత్మలము, ఉన్నతోన్నతమైన భగవంతుని పిల్లలము – ఈ గౌరవం సర్వ శ్రేష్ఠమైన గౌరవము. ఎవరైతే ఈ శ్రేష్ఠ నషా యొక్క సీటుపై కూర్చుంటారో, వారెప్పుడూ ఆందోళన చెందజాలరు. దేవతల గౌరవము కన్నా కూడా ఉన్నతమైనది ఈ బ్రాహ్మణుల గౌరవము. సర్వ ప్రాప్తుల లిస్టును ఎదురుగా పెట్టుకున్నట్లయితే, తమ శ్రేష్ఠ గౌరవం సదా స్మృతిలో ఉంటుంది, మరియు పొందాల్సిందేదో పొందేసాము… అనే పాటను పాడుతూ ఉంటారు. సర్వ ప్రాప్తుల స్మృతితో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్థితి సహజంగా తయారవుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top