17 April 2021 TELUGU Murli Today – Brahma Kumaris

April 16, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి వద్ద ఏ సామాగ్రి అయితే ఉందో, అది మీకు పూర్తిగా లభించింది, మీరు దానిని ధారణ చేయండి మరియు చేయించండి”

ప్రశ్న: -

త్రికాలదర్శీ తండ్రికి డ్రామా ఆదిమధ్యాంతాలు తెలిసినా కూడా, రేపటి విషయం ఈ రోజు చెప్పరు, ఎందుకు?

జవాబు:-

తండ్రి అంటారు – పిల్లలూ, ఒకవేళ నేను ముందే చెప్తే, డ్రామాలో ఉన్న మజా పోతుంది. అలా చెప్పడం నియమం కాదు. అన్నీ తెలిసినా కానీ, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను, ముందే వినిపించలేను. అందుకే మీరు ఏమి జరుగుతుంది అన్న చింతను వదిలేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ దారిలోనే మరణించాలి….. (మర్నా తేరీ గలీమే…..)

ఓంశాంతి. వీరు ఆత్మల పారలౌకిక తండ్రి, ఆత్మలతోనే మాట్లాడుతారు. వీరికి పిల్లలూ, పిల్లలూ, అని పిలిచే అలవాటుంటుంది. శరీరం కుమార్తెది కావచ్చు కానీ ఆత్మలందరూ కొడుకులే. ఆత్మలు ప్రతి ఒక్కరూ వారసులు అనగా వారసత్వం తీసుకునేందుకు అధికారులు. తండ్రి వచ్చి, పిల్లలూ, వారసత్వం తీసుకునే హక్కు మీలోని ప్రతి ఒక్కరికీ ఉందని అంటారు. అనంతమైన తండ్రిని చాలా స్మృతి చేయాలి, ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. సాధు సన్యాసులైతే తమ ఇళ్ళ నుండి వస్తారు లేదా ఏవైనా గ్రామాల నుండి వస్తారు. బాబా అయితే మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వారు అనంతమైన తండ్రి, వారే పతితపావనుడు, గాడ్ ఫాదర్. వారిని ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ (జ్ఞాన సాగరుడు) అని కూడా అంటారు, వారు అథారిటీ కదా. అది ఏ జ్ఞానము? ఈశ్వరీయ జ్ఞానము. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు. సత్-చిత్-ఆనంద స్వరూపుడు. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారి వద్ద ఈ సామాగ్రి ఉంది. ఎవరికైనా దుకాణముంటే, మా దుకాణంలో ఫలానా-ఫలానా వెరైటీలున్నాయని చెప్తారు. తండ్రి కూడా అంటారు – నేను జ్ఞాన సాగరుడను, ఆనంద సాగరుడను, శాంతి సాగరుడను. నా వద్ద ఈ సామాగ్రి అంతా ఉంది. నేను సంగమంలో డెలివరీ చేసేందుకు వస్తాను. నా వద్ద ఉన్నదంతా డెలివరీ చేస్తాను, ఇక ఎవరు ఎంతగా ధారణ చేస్తారో లేదా ఎవరెంతగా పురుషార్థం చేస్తారో, అంత పొందుతారు. తండ్రి వద్ద ఏమేమి ఉన్నాయి అనేది పిల్లలకు తెలుసు, అది కూడా ఏక్యురేట్ గా తెలుసు. ఈ రోజుల్లో ఎవరూ, తమ వద్ద ఏమేమి ఉంది అనేది చెప్పరు. కొందరిది మట్టిలో పూడ్చుకుపోతుంది….. అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఇప్పటి విషయాలే. నిప్పు అంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. రాజుల వద్ద లోలోపల చాలా పెద్ద దృఢమైన గుహలుంటాయి. భూకంపాలు వచ్చినా, మంటలు తీవ్రంగా అంటుకున్నా సరే, ఆ గుహల నుండి బయటకు రాగలరు. ఇక్కడి వస్తువేదీ అక్కడ ఉపయోగపడదని పిల్లలైన మీకు తెలుసు. గనులన్నీ మళ్ళీ కొత్తగా నిండుతాయి. సైన్సు కూడా రిఫైన్ అయ్యి మీకు ఉపయోగపడుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానమంతా ఉంది. మాకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసని పిల్లలకు తెలుసు. ఇకపోతే చివరిగా కొద్ది భాగం మిగిలి ఉంది, దానిని కూడా తెలుసుకుంటారు. బాబా ముందే అంతా ఎలా వినిపిస్తారు. బాబా అంటారు – నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను, ఇప్పటివరకు ఏ జ్ఞానమైతే లభించిందో, అది మాత్రమే డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఏ క్షణం అయితే గడిచిందో, దానిని డ్రామా అని భావించాలి. ఇకపోతే, రేపు ఏమి జరగబోతుంది అనేది చూద్దాము. రేపటి విషయం ఈ రోజు వినిపించను. ఈ డ్రామా రహస్యాన్ని మనుష్యులు అర్థం చేసుకోరు. కల్పం ఆయువును ఎంతగా పెంచేసారు. ఈ డ్రామాను అర్థం చేసుకునే ధైర్యం కూడా కావాలి. అమ్మ మరణించినా హల్వా తినాలి….. మరణించిన తర్వాత వెళ్ళి మరొక జన్మ తీసుకున్నారు కనుక మనమెందుకు ఏడ్వాలి అని భావిస్తారు. బాబా అర్థం చేయించారు – ఈ ప్రదర్శినీ నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఇదే తేదీన, ఇదే స్థానంలో, ఇదే విధంగా జరిగింది అని మీరు వార్తా పత్రికలలో రాయవచ్చు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతున్నాయి అని రాయాలి. ఈ ప్రపంచం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనం పురుషార్థం చేసి వికర్మాజీతులుగా అవుతాము, మళ్ళీ ద్వాపరం నుండి విక్రమ శకం అనగా వికర్మలు జరిగే శకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు వికర్మలపై విజయాన్ని పొందుతారు కనుక వికర్మాజీతులుగా అవుతారు. శ్రీమతంతో పాప కర్మలను జయించి వికర్మాజీతులుగా అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ దేహాభిమానం ఉండదు. కలియుగంలో దేహాభిమానం ఉంటుంది. సంగమంలో మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. పరమపిత పరమాత్మను కూడా తెలుసుకుంటారు. ఇది శుద్ధ అభిమానము. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కుల భూషణులు. ఈ నాలెడ్జ్ కేవలం మీకు మాత్రమే లభిస్తుంది, ఇతరులెవరికీ లభించదు. ఇది మీ సర్వోత్తమమైన కులము. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుని పిల్లలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. ఇప్పుడు మీకు లాటరీ లభిస్తుంది. ఏదైనా వస్తువు మామూలుగా లభిస్తే, అంత సంతోషముండదు. పేదవారి నుండి షావుకార్లుగా అయినప్పుడు సంతోషముంటుంది. మనం ఎంతగా పురుషార్థం చేస్తామో, అంతగా తండ్రి నుండి రాజధాని యొక్క వారసత్వం తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఎవరెంత పురుషార్థం చేస్తారో, అంత పొందుతారు. పిల్లలూ, తమ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి అన్న ముఖ్యమైన విషయాన్ని తండ్రి చెప్తారు. వారు అందరికీ ప్రియమైన తండ్రి. వారే వచ్చి అందరికీ సుఖ శాంతులనిస్తారు. ఇప్పుడు దేవీదేవతల రాజధాని స్థాపనవుతుంది. అక్కడ రాజు-రాణి ఉండరు. అక్కడ మహారాజు-మహారాణి అని అంటారు. ఒకవేళ భగవాన్-భగవతి అని అంటే, యథా రాజా రాణి తథా ప్రజా అందరూ భగవాన్-భగవతీలుగా అయిపోతారు, అందుకే భగవాన్-భగవతి అని అనరు. భగవంతుడు ఒక్కరే. మనుష్యులను భగవంతుడని అనరు. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. స్థూల వతనవాసులను మనం భగవాన్-భగవతి అని ఎలా అంటాము. ఉన్నతాతి ఉన్నతమైనది మూలవతనము, తర్వాత సూక్ష్మవతనము, ఇది (స్థూలవతనం) మూడవ నంబరులో ఉంది. ఈ విషయం మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మలైన మన తండ్రి శివబాబాయే, వారు శిక్షకుడు కూడా, గురువు కూడా. వారు కంసాలి, బ్యారిస్టరు మొదలైనవారు కూడా. అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. శివబాబా ఎంత పెద్ద బ్యారిస్టరు. మరి ఇటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి. బాబా, మేము మర్చిపోతున్నాము అని ఎందుకంటారు. మాయ తుఫానులు చాలా వస్తాయి. బాబా అంటారు – అవి వస్తాయి, ఎంతోకొంత శ్రమించాలి. ఇది మాయతో యుద్ధము. పాండవులైన మీకు కౌరవులతో ఎటువంటి యుద్ధము జరగడం లేదు. పాండవులు ఎలా యుద్ధం చేస్తారు. అలా చేస్తే, వారు హింసకులైపోతారు. తండ్రి ఎప్పుడూ హింసను నేర్పించరు. ఏమీ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి మనకు యుద్ధాలేవీ ఉండవు. నన్ను స్మృతి చేయండి, అప్పుడు మాయ దాడి జరగదు అని బాబా కేవలం యుక్తిని తెలియజేస్తారు. దీని గురించి కూడా ఒక కథ ఉంది – ముందు సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని అడిగితే, సుఖం కావాలని చెప్పారు. సత్యయుగంలో దుఃఖం ఉండజాలదు.

సీతలందరూ ఈ సమయంలో రావణుని శోక వాటికలో ఉన్నారని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా సాగరం మధ్యలో ఉన్న లంక వంటిది. ఇప్పుడందరూ రావణుని జైలులో ఉన్నారు. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరూ శోక వాటికలో ఉన్నారు. స్వర్గంలో సుఖముంటుంది, నరకంలో దుఃఖముంటుంది. దీనిని శోక వాటిక అని అంటారు. అది శోకము లేని స్వర్గము. రెండింటికీ మధ్యన చాలా తేడా ఉంటుంది. పిల్లలైన మీరు ప్రయత్నం చేసి తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. తండ్రి సలహాను అనుసరించకపోతే, సవతి పిల్లలు అయినట్లు. అటువంటివారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోకి వస్తారు. రాజధానిలోకి రావాలనుకుంటే శ్రీమతాన్ని అనుసరించాలి. కృష్ణుడి నుండి మతము లభించదు. మతములు రెండే ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని తీసుకుంటారు, దీని ఫలితాన్ని సత్యయుగంలో అనుభవిస్తారు. తర్వాత ద్వాపరంలో రావణుని మతం లభిస్తుంది. అందరూ రావణుని మతాన్ని అనుసరించి అసురులుగా అయిపోతారు. మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. మతమునిచ్చే వారు ఒక్క తండ్రి మాత్రమే, వారు ఈశ్వరుడు. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరించి ఎంత పవిత్రంగా అవుతారు. విషయసాగరంలో మునకలు వేయడం మొదటి పాపము. దేవతలు విషయసాగరంలో మునకలు వేయరు. అక్కడ పిల్లలు ఉండరా, అని అడుగుతారు. పిల్లలెందుకు ఉండరు! కానీ అది నిర్వికారీ ప్రపంచము, సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ ఈ వికారాలేవీ ఉండవు. దేవతలు కేవలం ఆత్మాభిమానులుగా ఉంటారని, పరమాత్మ-అభిమానులుగా ఉండరని తండ్రి అర్థం చేయించారు. మీరు ఆత్మాభిమానులుగానూ ఉన్నారు, పరమాత్మ అభిమానులుగానూ ఉన్నారు. ఇంతకుముందు ఈ రెండు విధాలు గానూ లేరు. సత్యయుగంలో పరమాత్మ గురించి తెలియదు. వారికి ఆత్మ గురించి తెలుసు, ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటానని తెలుసు. ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి, కొత్త దానిని తీసుకోవాలని ముందే తెలిసిపోతుంది. కొడుకు జన్మించేటప్పుడు కూడా ముందే సాక్షాత్కారమవుతుంది. యోగబలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, అటువంటప్పుడు యోగబలంతో పిల్లలు జన్మించలేరా. యోగబలంతో మీరు దేనినైనా పావనంగా చేయగలరు. కానీ మీరు స్మృతిని మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసమైపోతుంది. చాలామంది సన్యాసులకు కూడా భోజనం పట్ల గౌరవముంటుంది, కావున వారు ఆ సమయంలో చాలా మంత్రాలను పఠించి, అప్పుడు భోజనం చేస్తారు. మీకు కూడా పథ్యం చెప్పారు. మాంసము-మద్యము ఏవీ తీసుకోకూడదు. మీరు దేవతలుగా అవుతారు కదా. దేవతలు ఎప్పుడూ అశుద్ధమైనవి తినరు. కనుక ఆ విధంగా పవిత్రంగా అవ్వాలి. తండ్రి అంటారు – మీరు నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో అంతా తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవలసినదేమీ మిగలదు. సత్యయుగంలో చదువు కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడిది మృత్యులోకపు చదువు యొక్క అంతిమము. మృత్యులోకపు వ్యవహారాలన్నీ సమాప్తమై, అమరలోకపు వ్యవహారాలు ప్రారంభమవుతాయి. పిల్లలకు ఇంతగా నషా ఎక్కాలి. మీరు అమరలోకానికి యజమానులుగా ఉండేవారు, పిల్లలైన మీరు అతీంద్రియ సుఖము, పరమ సుఖములో ఉండాలి. మనము పరమపిత పరమాత్మునికి పిల్లలము మరియు విద్యార్థులము. పరమపిత పరమాత్మ ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు, దీనినే పరమానందము అని అంటారు. సత్యయుగంలో ఈ విషయాలేవీ ఉండవు. ఇవి మీరు ఇప్పుడే వింటారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. అతీంద్రియ సుఖం గురించి గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఇప్పటిదే. పరంధామంలో నివసించే తండ్రి వచ్చి మనకు తండ్రిగా, టీచరుగా, గురువుగా అవుతారు. ముగ్గురూ సర్వెంట్లే (సేవకులే). ఎటువంటి అభిమానము ఉండదు. నేను మీకు సేవ చేసి, మీకు సర్వస్వాన్ని ఇచ్చి నిర్వాణధామంలో కూర్చుంటానని అంటారు. కనుక వారు సర్వెంట్ అయినట్లే కదా. వైస్రాయ్ మొదలైనవారు సంతకం చేసినప్పుడు, ఎప్పుడూ, విధేయుడైన సర్వెంట్ అని రాస్తారు. బాబా కూడా నిరాకారుడు, నిరహంకారి. ఎలా కూర్చొని చదివిస్తున్నారో చూడండి. ఇంత ఉన్నతమైన చదువును ఇతరులెవరూ చదివించలేరు. ఇన్ని పాయింట్లను ఎవరూ ఇవ్వలేరు. వీరికి గురువు ఎవరూ నేర్పించలేదని మనుష్యులు తెలుసుకోలేరు. గురువు అనేవారు ఉన్నట్లయితే, ఎంతో మందికి గురువుగా ఉంటారు. ఒక్కరికే గురువుగా ఉంటారా ఏమిటి. ఈ తండ్రి మాత్రమే పతితులను పావనంగా చేస్తారు, ఆదిసనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు – నేను కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. బాబా, మేము కల్పక్రితం కూడా కలిసాము అని అంటారు కదా. తండ్రియే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. 21 జన్మల కోసం పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. కనుక ఇవన్నీ ధారణ చేయాలి, అప్పుడు బాబా ఏమి అర్థం చేయించారు అనేది చెప్పాలి. మనం తండ్రి నుండి భవిష్య 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాము. ఇది గుర్తున్నట్లయితే సంతోషంగా ఉంటారు. ఇది పరమానందము. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్, ఈ వరదానాలన్నీ మీకు తండ్రి నుండి ఇప్పుడు లభిస్తాయి. సత్యయుగంలో ఏమీ తెలియని వారిగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులకు ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. వీరికి నాలెడ్జ్ ఉండి ఉంటే, అది పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మీకు ఉన్నంత పరమానందము దేవతలకు కూడా ఉండజాలదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేవతలుగా అయ్యేందుకు ఆహార-పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. చాలా పథ్యంతో నడుచుకోవాలి. యోగబలంతో భోజనానికి దృష్టినిచ్చి, దానిని శుద్ధంగా చేసుకొని స్వీకరించాలి.

2. మేము పరమపిత పరమాత్ముని పిల్లలము మరియు విద్యార్థులము. వారు ఇప్పుడు మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తారు, ఈ నషాలో ఉంటూ పరమ సుఖాన్ని, పరమానందాన్ని అనుభవం చేయాలి.

 

ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్ పెట్టినప్పుడు, మీ లోపల టెన్షన్ ఏర్పడుతుంది. అందుకే విస్తారం చేసేందుకు బదులుగా సార స్వరూపంలో స్థితులవ్వండి. క్వాంటిటీ కల సంకల్పాలను ఇముడ్చుకొని, క్వాలిటీ కల సంకల్పాలను చేయండి. ముందు స్వయం యొక్క టెన్షన్ పై అటెన్షన్ పెట్టండి, అప్పుడు విశ్వంలో ఉన్న అనేక రకాల టెన్షన్లను సమాప్తం చేసి, విశ్వకళ్యాణకారులుగా అవ్వగలరు. ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి, స్వయం యొక్క సేవ ఫస్ట్. స్వయం యొక్క సేవ చేసుకున్నట్లయితే, ఇతరుల సేవ స్వతహాగా జరిగిపోతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top