24 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

23 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - 21 జన్మల కోసం సదా సుఖమయంగా అయ్యేందుకు ఈ కొద్ది సమయంలో దేహీ-అభిమానులుగా అయ్యే అలవాటు చేసుకోండి’’

ప్రశ్న: -

దైవీ రాజధానిని స్థాపన చేసేందుకు ప్రతి ఒక్కరికీ ఏ అభిరుచి ఉండాలి?

జవాబు:-

సేవ యొక్క అభిరుచి. జ్ఞాన రత్నాల దానం ఎలా చేయాలి అనేటువంటి అభిరుచిని పెట్టుకోండి. మీ ఈ మిషన్ పతితులను పావనంగా తయారుచేసేటువంటిది, అందుకే పిల్లలు రాజ్యాన్ని వృద్ధి చేసేందుకు చాలా సేవ చేయాలి. ఎక్కడెక్కడైతే మేళాలు మొదలైనవి పెడతారో, మనుష్యులు స్నానాలు చేయడానికి వెళ్తారో, అక్కడ కరపత్రాలు ముద్రించి పంచాలి. దండోరా వేయించాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము జగత్తునే పొందాము.

ఓంశాంతి. నిరాకార శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలూ, దేహీ-అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. మేము ఆత్మ, మమ్మల్ని తండ్రి చదివిస్తారు. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి అని బాబా అర్థం చేయించారు. ఎప్పుడైతే మాయా రావణుడి రాజ్యం ఉంటుందో అనగా భక్తి మార్గం మొదలవుతుందో, అప్పుడు దేహాభిమానులుగా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం యొక్క అంతం అవుతుందో, అప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు – ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని చెప్తారు. మీరు ఏవైతే జప-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేసారో, వాటి వలన లాభమేమీ కలగలేదు. 5 వికారాలు మీలో ప్రవేశించడంతో మీరు దేహాభిమానులుగా అయిపోయారు. రావణుడే మిమ్మల్ని దేహాభిమానులుగా చేస్తాడు. వాస్తవానికి మీరు అసలైతే దేహీ-అభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించండి అనేటువంటి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. మనం ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్తది తీసుకోవాలి. సత్యయుగంలో ఈ 5 వికారాలు ఉండవు. దేవీ-దేవతలు, ఎవరినైతే శ్రేష్ఠులు, పావనులు అని అంటారో, వారు సదా ఆత్మాభిమానులుగా ఉన్న కారణంగా 21 జన్మలు సదా సుఖమయంగా ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో, అప్పుడు మీరు మారిపోయి దేహాభిమానులుగా అయిపోతారు. దీనిని ఆత్మాభిమానము మరియు దానిని దేహాభిమానము అని అంటారు. నిరాకారీ ప్రపంచంలోనైతే దేహాభిమానము మరియు ఆత్మాభిమానము యొక్క ప్రశ్నే తలెత్తదు, అది ఉన్నదే సైలెన్స్ ప్రపంచము. ఈ సంస్కారాలు ఈ సంగమయుగంలోనే ఉంటాయి. మిమ్మల్ని దేహాభిమానుల నుండి దేహీ-అభిమానులుగా తయారుచేయడం జరుగుతుంది. సత్యయుగంలో మీరు దేహీ-అభిమానులుగా ఉన్న కారణంగా దుఃఖం పొందరు ఎందుకంటే మేము ఆత్మ అనే జ్ఞానం ఉంటుంది. ఇక్కడైతే అందరూ స్వయాన్ని దేహముగా భావిస్తారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అప్పుడు మీరు వికర్మాజీతులుగా అయిపోతారు. శరీరం కూడా ఉంది, రాజ్యం కూడా చేస్తారు, ఆత్మాభిమానులుగా ఉంటారు. మీకు శిక్షణ ఏదైతే లభిస్తుందో, దీని ద్వారా మీరు ఆత్మాభిమానులుగా అయిపోతారు. సదా సుఖమయంగా ఉంటారు. ఆత్మాభిమానులుగా అవ్వడంతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి, అందుకే బాబా అర్థం చేయిస్తారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. వారు వెళ్ళి గంగా స్నానాలు చేస్తూ ఉంటారు, కానీ అది పతిత-పావని ఏమీ కాదు. అలాగే వికర్మలు భస్మం అవ్వడానికి యోగాగ్ని కూడా ఏమీ లేదు. ఇలాంటి-ఇలాంటి సందర్భాలలో పిల్లలైన మీకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఎటువంటి సమయమో, అటువంటి సేవ. ఎంతమంది మనుష్యులు స్నానాలు చేయడానికి వెళ్తూ ఉండవచ్చు. కుంభ మేళాలలో అన్ని చోట్ల స్నానాలు చేస్తారు. కొంతమంది సాగరం వద్దకు, కొంతమంది నదులలోకి కూడా వెళ్తారు. కావున అందరికీ పంచేందుకు ఎన్ని కరపత్రాలు ముద్రించాల్సి ఉంటుంది. చాలా పంచాలి. కేవలం ఈ పాయింటే ఉండాలి – సోదరీ-సోదరులారా, ఆలోచించండి, పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన నదుల ద్వారా మీరు పావనంగా అవ్వగలరా లేక ఈ నీటి సాగరము మరియు నదుల ద్వారా మీరు పావనంగా అవ్వగలరా? ఈ చిక్కు ప్రశ్నను పరిష్కరించినట్లయితే సెకెండులో మీరు జీవన్ముక్తిని పొందగలరు. రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని కూడా పొందగలరు. ఇలాంటి-ఇలాంటి కరపత్రాలను ప్రతి ఒక్క సెంటరు ముద్రించాలి. నదులైతే అన్ని చోట్ల ఉన్నాయి. నదులు చాలా దూరం నుండి వెలువడతాయి. నదులైతే ఎక్కడికక్కడ చాలా ఉన్నాయి. మరి ఈ నదిలో స్నానం చేస్తేనే పావనంగా అవుతారు అని ఎందుకంటారు? ప్రత్యేకంగా ఒక్క చోటుకే ఇంత ఖర్చు పెట్టి కష్టపడి ఎందుకు వెళ్తారు! కేవలం ఒక రోజు స్నానం చేయడంతో పావనంగా అయిపోతారు అని కాదు. స్నానము జన్మ-జన్మాంతరాలుగా చేస్తారు. సత్యయుగంలో కూడా స్నానం చేస్తారు. అక్కడ ఉన్నదే పావనమైనవారు. ఇక్కడైతే చలిలో ఎంత కష్టపడి స్నానం చేయడానికి వెళ్తారు. కావున వారికి అర్థం చేయించాలి, అంధులకు చేతి కర్రగా అవ్వాలి. జాగృతము చేయాలి. పతిత-పావనుడు వచ్చి పావనంగా తయారుచేస్తారు. కావున దుఃఖితులకు మార్గం తెలియజేయాలి. ఈ చిన్న-చిన్న కరపత్రాలు అన్ని భాషలలోను ముద్రించబడి ఉండాలి. లక్ష, రెండు లక్షలు ముద్రించాలి. ఎవరి బుద్ధిలోనైతే జ్ఞానం యొక్క నషా ఎక్కి ఉందో, వారి బుద్ధి పని చేస్తుంది. ఈ చిత్రాలు 2-3 లక్షలు అన్ని భాషలలోను ఉండాలి. అన్ని చోట్ల సేవ చేయాలి. ఒకటే పాయింటు ముఖ్యమైనది, సెకెండులో ముక్తి-జీవన్ముక్తి ఎలా లభిస్తుందో వచ్చి అర్థం చేసుకోండి. ముఖ్యమైన సెంటర్ల అడ్రసులు వేయండి, ఇక తర్వాత వారు చదివినా, చదవకపోయినా వారి ఇష్టము. బ్రహ్మా ద్వారా తప్పకుండా స్థాపన జరగనున్నది అని పిల్లలైన మీరు త్రిమూర్తి చిత్రంపై అర్థం చేయించాలి. తప్పకుండా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని రోజు-రోజుకు మనుష్యులు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ గొడవలు మొదలైనవి పెరుగుతూనే ఉంటాయి. ఆస్తి విషయంలో కూడా ఎంత జంజాటం నడుస్తుంది. కొందరైతే కొట్లాడుకుంటారు కూడా. వినాశనమైతే తప్పకుండా ఎదురుగా ఉంది. ఎవరైతే మంచి రీతిలో గీతా, భాగవతం మొదలైనవి చదివి ఉంటారో, వారు, తప్పకుండా ఇదైతే ఇంతకుముందు కూడా జరిగింది అని అర్థం చేసుకుంటారు. కావున, నీటిలో స్నానం చేయడంతో మనుష్యులు పతితం నుండి పావనంగా అవుతారా లేక యోగాగ్నితో పావనంగా అవుతారా అని పిల్లలైన మీరు మంచి రీతిలో అర్థం చేయించాలి. భగవానువాచ – నన్ను స్మృతి చేయడంతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఎక్కడెక్కడైతే మీ సెంటర్లు ఉన్నాయో, అక్కడ విశేషమైన సందర్భంలో ఇటువంటి కరపత్రాలు విడుదల చేయాలి. మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి, అక్కడకు ఎంతోమంది మనుష్యులు వెళ్తారు. కానీ ఎవరో కష్టం మీద అర్థం చేసుకుంటారు. కరపత్రాలు పంచేందుకు కూడా చాలామంది కావాలి, వారు మళ్ళీ అర్థం చేయించగలగాలి. అటువంటి స్థానంలో నిలబడాలి. ఇవి జ్ఞాన రత్నాలు. సేవ పట్ల చాలా అభిరుచి పెట్టుకోవాలి. మనం మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము కదా. ఇది మనుష్యులను దేవతలుగా అనగా పతితులను పావనులుగా తయారుచేసే మిషన్. తండ్రి, మన్మనాభవ అని అర్థం చేయించారు అని కూడా మీరు రాయవచ్చు. పతిత-పావనుడు, అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. యాత్ర గురించిన పాయింటు కూడా పిల్లలైన మీకు పదే-పదే అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రిని పదే-పదే స్మృతి చేయండి. స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి, తద్వారా తనువు యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి అనగా మీరు సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. తండ్రి, నన్ను స్మరించండి అనగా స్మృతి చేయండి అన్న మంత్రాన్ని ఇచ్చారు. అలాగని, కూర్చొని శివ-శివ అని స్మరించడం కాదు. శివుని భక్తులు ఇలా శివ-శివ అంటూ మాల జపిస్తారు. వాస్తవానికి అది రుద్రమాల. శివుడు మరియు సాలిగ్రామము, పైన శివుడు ఉంటారు. మిగిలినవి చిన్న-చిన్న పూసలు అనగా ఆత్మలు. ఆత్మ ఎంత చిన్న బిందువు. నల్లని పూసల మాల కూడా ఉంటుంది. కావున శివుని మాల కూడా తయారుచేయబడి ఉంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇకపోతే, నోటితో శివ, శివ అని అనకూడదు. శివ-శివ అని అనడంతో బుద్ధియోగం మళ్ళీ మాల వైపుకు వెళ్ళిపోతుంది. అర్థాన్ని అయితే ఎవరూ తెలుసుకోరు. శివ-శివ అని జపించడం వలన వికర్మలు ఏమైనా వినాశనమవుతాయా. ఎప్పుడైతే సంగమంలో డైరెక్టుగా శివబాబా వచ్చి, నన్నొక్కడినే స్మృతి చేయండి అనే మంత్రాన్ని ఇస్తారో, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి, ఈ జ్ఞానం మాల తిప్పేవారి వద్ద లేదు. ఇకపోతే, ఎవరు ఎంతగా కూర్చుని శివ-శివ అని అన్నా సరే, వికర్మలు వినాశనమవ్వవు. కాశీకి కూడా వెళ్ళి ఉంటారు. అప్పుడు శివకాశీ, శివకాశీ అని అంటూ ఉంటారు. కాశీలో శివుని ప్రభావం ఉంది అని అంటారు. శివుని మందిరాలైతే చాలా వైభవోపేతంగా నిర్మించబడి ఉన్నాయి. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి.

నాతో యోగం జోడించడం ద్వారానే మీరు పావనంగా అవుతారని అనంతమైన తండ్రి చెప్తున్నట్లుగా మీరు అర్థం చేయించవచ్చు. పిల్లలకు సేవ పట్ల అభిరుచి ఉండాలి. తండ్రి అంటారు, నేను పతితులను పావనంగా చేయాలి. పిల్లలైన మీరు కూడా పావనంగా తయారుచేసే సేవ చేయండి. కరపత్రాలను తీసుకువెళ్ళి అర్థం చేయించండి. వారికి చెప్పండి, వీటిని బాగా చదవండి, మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఇది దుఃఖధామము. ఇప్పుడు జ్ఞాన స్నానం ఒక్కసారి చేయడంతోనే సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. ఇక నదులలో స్నానం చేయాల్సిన, భ్రమించాల్సిన అవసరం ఏముంది. మనకు సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది, అందుకే దండోరా వేయిస్తాము. లేదంటే ఎవరైనా ఈ విధంగా కరపత్రాలను ముద్రించగలరా. పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. చిక్కు ప్రశ్నలు కూడా ఏవైతే తయారుచేయబడ్డాయో, అవి సేవ కోసము. సేవ పట్ల అభిరుచి లేనివారు చాలామంది ఉన్నారు. ఎలా సేవ చేయాలి అన్నది ధ్యానంలోకి కూడా రాదు, దీని కోసం చాలా మంచి చమత్కార బుద్ధి కావాలి. ఎవరి కాళ్ళకైతే దేహాభిమానం యొక్క సంకెళ్ళు పడి ఉన్నాయో, వారు దేహీ-అభిమానిగా అవ్వలేరు. వారు వెళ్ళి ఏం పదవిని పొందుతారు అని అనుకుంటారు. దయ కలుగుతుంది. ఎవరెవరు పురుషార్థంలో చురుకుగా ముందుకు వెళ్తున్నారు అని అన్ని సెంటర్లలోనూ చూడడం జరుగుతుంది. కొంతమంది జిల్లేడు పుష్పాలుగా కూడా ఉన్నారు, కొంతమంది గులాబి పుష్పాలుగా కూడా ఉన్నారు. మేము ఫలానా పుష్పాలము. మేము బాబా సేవ చేయకపోతే మేము వెళ్ళి జిల్లేడు పుష్పంగా అవుతామని అర్థం చేసుకోవాలి. తండ్రి అయితే చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. మీరు వజ్రంలా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు. కొంతమంది సత్యమైన వజ్రంలా ఉన్నారు, కొంతమంది నల్లగా, మసకగా కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వయం గురించి ఆలోచించాలి. మేము వజ్రంలా తయారవ్వాలి. మేము వజ్రంలా తయారయ్యామా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానం యొక్క సంకెళ్ళను తెంచి దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మాభిమానిగా ఉండేటువంటి సంస్కారాన్ని ఏర్పరచుకోవాలి.

2. సేవ పట్ల చాలా అభిరుచి పెట్టుకోవాలి. తండ్రి సమానంగా పతితం నుండి పావనంగా తయారుచేసే సేవ చేయాలి. సత్యమైన వజ్రంలా అవ్వాలి.

వరదానము:-

కర్మాతీతము అనగా అతీతము మరియు ప్రియము. కర్మ చేసారు మరియు చేసిన తర్వాత అనుభవం ఎలా ఉండాలి అంటే, అసలేమీ చేయనే లేదు, చేయించేవారు చేయించారు. ఇటువంటి స్థితిని అనుభవం చేయడంతో సదా తేలికదనం ఉంటుంది. కర్మ చేస్తూ తనువు ద్వారా కూడా తేలికదనము, మనసు యొక్క స్థితిలో కూడా తేలికదనము, ఎంతగా కార్యం పెరుగుతూ ఉంటుందో, అంతగా తేలికదనం కూడా పెరుగుతూ ఉండాలి. కర్మ తన వైపుకు ఆకర్షించకూడదు, యజమానిగా అయి కర్మేంద్రియాలతో కర్మ చేయించడము మరియు సంకల్పంలో కూడా తేలికదనాన్ని అనుభవం చేయడము – ఇదే కర్మాతీతులుగా అవ్వడము.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘అదృష్టాన్ని తయారుచేసేవారు పరమాత్మ, అదృష్టాన్ని పాడు చేసుకునేవారు స్వయంగా మనుష్యులు’

ఇప్పుడు ఇదైతే మనకు తెలుసు, మనుష్యాత్మల అదృష్టాన్ని తయారుచేసేవారు ఎవరు? మరియు అదృష్టాన్ని పాడు చేసేవారు ఎవరు? అదృష్టాన్ని తయారుచేసేది, అదృష్టాన్ని పాడు చేసేది ఆ పరమాత్మనే అని మనం అనము. అయితే, తప్పకుండా అదృష్టాన్ని తయారుచేసేవారైతే పరమాత్మ మరియు అదృష్టాన్ని పాడు చేసేవారు స్వయం మనుష్యులు. ఇప్పుడు ఈ అదృష్టం తయారయ్యేది ఎలా? మరియు మళ్ళీ పడిపోయేది ఎలా? దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది. మనుష్యులు ఎప్పుడైతే స్వయాన్ని తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో, అప్పుడు పాడైపోయిన ఆ అదృష్టాన్ని మళ్ళీ తయారుచేసుకుంటారు. ఇప్పుడు మనం పాడైపోయిన అదృష్టం అని అంటున్నామంటే, ఏదో ఒక సమయంలో మన అదృష్టం తయారై ఉండేది, అది మళ్ళీ పాడైపోయింది అని దీని బట్టి ఋజువు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పాడైపోయిన అదృష్టాన్ని పరమాత్మ స్వయంగా వచ్చి బాగుచేస్తారు. ఇప్పుడు ఎవరైనా, పరమాత్మ స్వయం నిరాకారుడు, వారు అదృష్టాన్ని ఎలా తయారుచేస్తారు అని అంటే, వారికి ఇలా అర్థం చేయించడం జరుగుతుంది – నిరాకార పరమాత్మ ఎలా తమ సాకార బ్రహ్మా తనువు ద్వారా, అవినాశీ జ్ఞానం ద్వారా మన పాడైపోయిన అదృష్టాన్ని బాగుచేస్తారు అని. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వడము పరమాత్మ పని, ఇకపోతే మనుష్యాత్మలు ఒకరి అదృష్టాన్ని ఒకరు మేల్కొల్పలేరు. అదృష్టాన్ని మేల్కొల్పేవారు ఒక్క పరమాత్మనే, అందుకే వారి స్మృతిచిహ్న మందిరాలు నిలిచి ఉన్నాయి. అచ్ఛా.

లవలీన స్థితిని అనుభవం చేయండి

ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో, ఆ సంబంధంతోనే భగవంతుడిని తమవారిగా చేసుకోండి. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు బాబా, నా పిల్లలూ, అని అంటారు. ఈ స్నేహ సాగరంలోనే ఇమిడిపోండి. ఈ స్నేహం ఛత్రఛాయలా పని చేస్తుంది, దీని లోపలకు మాయ రాలేదు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top