21 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 20, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తెలివైనవారిగా అయి ప్రతి పనిని చేయండి, మాయ ఎటువంటి పాపపు కర్మ చేయించకూడదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి’’

ప్రశ్న: -

తండ్రి పేరును ప్రసిద్ధం చేసేందుకు ఏ ధారణలు కావాలి?

జవాబు:-

పేరు ప్రసిద్ధం చేసేందుకు నిజాయితీపరులుగా, నమ్మకస్థులుగా అవ్వండి. సత్యతతో సేవ చేయండి. ప్రవహిస్తున్న గంగగా అయి అందరికీ తండ్రి సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. తమ కర్మేంద్రియాలపై పూర్తిగా నిగ్రహం ఉంచుకొని, ఆశలు వదిలి నియమానుసారమైన నడవడికను నడుచుకోండి, సోమరులుగా అవ్వకండి. జ్ఞాన-యోగాల ధారణ మొదట స్వయంలో ఉండాలి, అప్పుడు తండ్రి పేరును ప్రసిద్ధం చేయగలరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నేటి మానవునికి ఏమయింది భగవంతుడా.

ఓంశాంతి. ఇది ఈనాటి భారత్ యొక్క పరిస్థితి. ఒక పాటలో భారత్ యొక్క దిగజారిన పరిస్థితిని చూపించారు. మరొక పాటలో భారత్ యొక్క మహిమను కూడా చేస్తారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. పిల్లలైన మీలో కూడా కొందరైతే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు, భారత్ యే ఒకప్పుడు 100 శాతం తెలివైనదిగా ఉండేది మరియు ఇప్పుడు 100 శాతం తెలివితక్కువదిగా ఉంది. 100 శాతం తెలివైనదిగా 2500 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ పూర్తిగా తెలివితక్కువదిగా అయిపోతుంది. తెలివితక్కువదిగా అవ్వడానికి మళ్ళీ పూర్తి అర్ధకల్పము పడుతుంది. పూర్తిగా తెలివతక్కువవారిని మళ్ళీ ఒక్క జన్మలో తెలివైనవారిగా తయారుచేసేది తండ్రినే. ఎవరైనా తెలివితక్కువ పని చేస్తే, మనసు లోపల తింటుంది, చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడైతే అర్థం చేసుకొని పని చేయాలి. తెలివితక్కువతనంతో ఏ పని జరగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ ఎలా దాడి చేస్తుందంటే, తెలియను కూడా తెలియదు. కామం యొక్క సెమీ నషా కూడా కలుగుతుంది. పిల్లలు రాస్తారు, బాబా, తుఫానులు వస్తాయి. కామం యొక్క తుఫాను తక్కువైనది కాదు, అనేక రకాల నషాలు తలను వేడెక్కిస్తాయి. దేహం పట్ల ప్రేమ కూడా ఎలా ఉంటుంది అంటే, బుద్ధి దాని వైపుకు వెళ్తుంది. యోగం పూర్తిగా ఉండని కారణంగా, అవస్థ కచ్చాగా ఉన్న కారణంగా, ఇక వారికి ఎంతో నష్టం కలుగుతుంది. బాబా వద్దకు రిపోర్టులైతే ఎన్నో వస్తాయి. చాలా కఠినమైన తుఫానులు. లోభం కూడా చాలా సతాయిస్తుంది, దాని వలన నియమ విరుద్ధమైన నడవడికను నడుస్తారు. ఆ సన్యాసులు ఎలాగైతే ఉన్నారో, అలా మీరు కూడా సన్యాసులు. వారు హఠయోగులు, మీరు రాజయోగులు. వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. కొందరైతే తమ కుటీరంలో ఉంటారు. భోజనం వారికి అక్కడికే చేరుతుంది లేదా తెప్పించుకుంటారు కూడా. వికారాలను సన్యసిస్తారు కావున ఆ పవిత్రత మనుష్యులను ఆకర్షిస్తుంది. వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. ఇందులో కూడా జ్ఞాన-యోగాల బలం యొక్క శక్తి కావాలి. ఎంతగా యోగంలో ఉంటారో, అంతగా ఇవన్ని విషయాల పట్టింపు ఉండదు. యోగము ఆరోగ్యానికి గుర్తు. అయితే, పాత వికర్మల యొక్క భోగాన్ని అనుభవించాల్సి ఉండవచ్చు, అయినా కూడా యోగంపై ఆధారపడి ఉంటుంది. ఫలానా వస్తువు కావాలి… అని ఉండకూడదు. సన్యాసులు ఏదీ అడగరు. యోగం యొక్క బలం ఉంటుంది. తత్వ యోగులలో శక్తి ఉంది. దిగంబర ఫకీర్లు ఎవరైతే ఉంటారో, వారు మందులతో పని నడుపుతారు. అది కృత్రిమమైనది.

మీ ఆధారమంతా యోగంపై ఉంది. మీ యోగం తండ్రితో ఉంది కావున దీనితో పదవి కూడా భారీ అయినది లభిస్తుంది. మీ దేవీ-దేవతా ధర్మంలో చాలా సుఖముంది. దాని కోసం మీకు శ్రీమతం లభిస్తుంది. వారికి ఈశ్వరీయ మతమేమీ లభించదు. మీకు ఈశ్వరుడు వచ్చి మతం ఇస్తారు. ఎంత భారీ వారసత్వం లభిస్తుంది, 21 జన్మల కోసం ప్రాప్తి ఉంటుంది. పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. కానీ పిల్లలు తండ్రిని కూడా మర్చిపోతారు. యోగం పూర్తిగా జోడిస్తూ ఉన్నట్లయితే, ఈ లోభం, మోహం మొదలైన వికారాలు సతాయించవు. చాలామందిని సతాయిస్తాయి – ఇది కావాలి, ఇది కావాలి… అని. పక్కా సన్యాసులలో ఇది ఉండదు. ఒక కిటకీ ద్వారా ఏది లభిస్తుందో, అది తీసుకుంటారు. ఎవరికైతే కర్మేంద్రియాలపై పూర్తి నిగ్రహం ఉంటుందో, వారు మళ్ళీ ఇంకో వస్తువును ఎప్పుడూ తీసుకోరు. కొందరైతే తీసేసుకుంటారు. ఇక్కడ కూడా అలాంటివారు ఉన్నారు. వాస్తవానికి ఈశ్వరుని భండారము నుండి ఏదైతే నియమానుసారంగా లభిస్తుందో, దాని అనుసారంగా నడుచుకోవడం మంచిది. మనుష్యులకు ఆశలు ఎన్నో ఉత్పన్నమవుతాయి. ఆశలు పూర్తి అవ్వకపోవడంతో సోమరులుగా అయిపోతారు. ఇక్కడ అందరూ నిజాయితీపరులుగా, నమ్మకస్థులుగా అవ్వాలి. అన్ని ఆశలను తొలగించివేయాలి. పిల్లలైన మీరు చాలా శ్రేష్ఠాచారులుగా అవ్వాలి.

తండ్రి అయితే అన్ని విధాలుగా పురుషార్థం చేయిస్తారు, పిల్లలు పేరును ప్రసిద్ధి చేయాలి అని. ఒకటేమో, యోగంలో ఉండాలి మరియు జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి. గంగలు ప్రవహించాలి, సత్యమైన యోగము అని దేనినంటారో అర్థం చేయించాలి. భగవంతుడు అందరికీ తండ్రి, కృష్ణుడు అయితే గాడ్ ఫాదర్ కారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, నేను శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తాను. ఎంత సహజమైన విషయము. కొందరికి బాణం తగలదు ఎందుకంటే ఏవో ఒక లోపాలున్నాయి. సేవ అయితే అపారముగా ఉంది. మనుష్యులకు శ్మశానంలో తీరిక ఉంటుంది. పిల్లలు తెలివైనవారైతే, సేవ యొక్క అభిరుచి ఉన్నట్లయితే, ఏ వికారము లేకపోతే వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఒక్క తండ్రినే స్మృతి చేయండి, దీని ద్వారానే ఫలము అనగా వారసత్వము లభించగలదు అని మీరు అర్థం చేయించాలి. సన్యాసులు, హఠయోగులు. గురువులు మొదలైనవారు ఏమిస్తారు? శిక్షణ మొదలైనవి ఏవైతే ఇస్తారో, అవి అల్పకాలికమైన సుఖమిచ్చేవి. మిగిలినవారందరూ దుఃఖమే ఇస్తారు మరియు ఈ తండ్రి అయితే సదా సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. నన్ను స్మృతి చేసినట్లయితే, స్వర్గం యొక్క యజమానులుగా అవుతారు. పవిత్రంగా అయితే ఉండాలి. ఆహ్వానం అయితే ఇవ్వవలసి ఉంటుంది. రోజు రోజుకు పాయింట్లు సహజం చేయబడతాయి. పెద్ద-పెద్ద నగరాలలో శ్మశానాలకు చాలామంది వస్తారు. శ్మశానాలలో సేవ చాలా జరగగలదు. మాకు ఖాళీ లేదు అని పిల్లలు అంటారు. అచ్ఛా, సెలవు తీసుకొని వెళ్ళండి. సేవలో చాలా లాభం ఉంది. వినాశనమైతే జరిగేదే ఉంది. భూకంపాలు మొదలైనవి వస్తాయి, ఆనకట్టలు మొదలైనవన్నీ తెగిపోతాయి. ఆపదలైతే చాలా రానున్నాయి. ఎవరికైతే జ్ఞానముంటుందో, వారైతే డాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే సర్వీసబుల్ (సేవా యోగ్యులైన) పిల్లలు ఉంటారో, వారే చివర్లో హనుమంతుని వలె స్థిరంగా ఉండగలరు. కొందరైతే ఇలా కూడా ఉన్నారు, వారు బాంబు యొక్క శబ్దానికే మరణిస్తారు. హనుమంతుడు ఒక్కరి ఉదాహరణ మాత్రమే, కానీ ఇటువంటి శక్తివంతులైతే 108 మంది ఉంటారు కదా. ఆ శక్తి సేవ ద్వారా వస్తుంది. తండ్రి అంటారు, పిల్లలూ, సేవ చేసి ఉన్నత పదవిని పొందండి, తర్వాత పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండకూడదు, అందుకే ముందు నుండే చెప్తారు, ఉన్నత పదవిని తీసుకోండి అని. ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. మందిరాలకు కూడా మీరు వెళ్ళి అర్థం చేయించవచ్చు. వీరికి ఈ రాజ్యం ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చారు అని వెంటనే చెప్తారు. మనుష్యులను అడగండి, మీకు ఈ ధనం ఎవరు ఇచ్చారు. అప్పుడు వెంటనే అంటారు, భగవంతుడు అని. లక్ష్మీ-నారాయణులకు భగవంతుడు ఈ ధనం ఎలా ఇచ్చారు – ఇది కూడా అర్థం చేయించాలి. తండ్రిని తెలుసుకోవడంతో మీరు కూడా ఆ పదవిని పొందగలరు. మీరు వచ్చినట్లయితే అర్థం చేయిస్తాము లేకపోతే ఫలానా అడ్రసుకు వచ్చి అర్థం చేసుకోండి. ఇక్కడ డబ్బు మొదలైనవేవీ పెట్టకూడదు. పిల్లలైన మీ బుద్ధిలో అన్ని రహస్యాలు ఉన్నాయి. లక్ష్మీ-నారాయణులకు, సీతా-రాములకు, వారికి ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు? తప్పకుండా భగవంతుడి నుండి లభించింది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతుంది. మీరు సాక్షాత్కారం కూడా చేసుకున్నారు – లక్ష్మీ-నారాయణులు, సీతా-రాములకు రాజ్యాన్ని ఎలా ఇస్తారు అని. లక్ష్మీ-నారాయణులు మళ్ళీ భగవంతుడి నుండి పొందుతారు, అర్థం చేయించగలరు కదా. విషయాలు చాలా సహజమైనవి, మధురమైనవి. చెప్పండి, ఉన్నతోన్నతమైనవారైతే తండ్రి కదా. ఆ పరమపిత పరమాత్మ గురించి తెలుసా? బాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. కృష్ణుడిని బాబా అని అయితే అనరు. కృష్ణుడు ముందు జన్మలో ఈ రాజయోగంతో ఈ పదవిని పొందారు. మళ్ళీ మర్చిపోకుండా ఉండేందుకు ఇలాంటి-ఇలాంటి పాయింట్లను నోట్ చేసుకోవాలి. మనుష్యులకు ఏ విషయాన్ని అయినా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటే ముడి వేసుకుంటారు. మీరు కూడా కేవలం రెండు విషయాల కోసం ముడి వేసుకోండి. ఎవరికైనా కేవలం ఈ రెండు విషయాలను వినిపిస్తూ ఉండండి, తండ్రి అంటారు – మన్మనాభవ, మధ్యాజీభవ. ప్రదర్శనీ ద్వారా కూడా చాలా సేవ చేయవచ్చు, తండ్రి మాకు చెప్పారు, అందరికీ సందేశమివ్వండి – సర్వ ధర్మాలను వదిలేసి… మీరు కేవలం ఆత్మలుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి. అమరలోకానికి వెళ్ళాలంటే నన్ను స్మృతి చేయండి. కేవలం ఇది అర్థం చేయించే వ్యాపారం చేయండి. అర్ధకల్పం భక్తి యొక్క ఎదురుదెబ్బలు తిన్నారు. ఈ జన్మలో ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. బాబా ఏం చెప్తున్నారు అనేది దండోరా కూడా వేయించవచ్చు. బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవాలంటే వచ్చి అర్థం చేసుకోండి. మీరు చాలా సేవ చేయగలరు. ఖర్చంతా లభించగలదు. రొట్టె అయితే తమ చేతులతో కూడా తయారుచేసుకోవచ్చు. సేవ చేయవచ్చు. సేవకు చాలా అవకాశం ఉంది. కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయగలరు. ఆసామిని కూడా చూడడం జరుగుతుంది. బాబా అంటారు, అచ్ఛా – నేను మీకు కిట్ బ్యాగ్ ను తయారుచేసి ఇస్తాను, ఈ కొద్ది రహస్యాన్ని ఎవరికైనా అర్థం చేయించండి. బాబా భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు, వారు అంటారు, పిల్లలూ, ఇప్పుడు అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి, అందుకే నన్ను స్మృతి చేసినట్లయితే మీరు కర్మాతీత అవస్థను చేరుకుంటారు. బాబా గ్యారంటీ ఇస్తారు, మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అనేకులకు సందేశం లభించాలి. మీ-మీ గ్రామాలలో కూడా సేవ చేయవచ్చు లేదా బయటకు వెళ్ళి చేయండి, ఖర్చు అయితే తప్పకుండా లభిస్తుంది. ఎవరైనా సేవ చేసి చూపించాలి. వ్యాపారంలో ఉంటే ఉండండి, అయినా చాలా సేవ జరగగలదు. 8 గంటలు వ్యాపారం చేయండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, అయినా కూడా ఎంతో సమయం ఉంటుంది. సత్యతతో ఎవరైనా ఒక్క గంట సేవ చేసినా కూడా, చాలా మంచి పదవిని పొందగలరు. నలువైపులా తిరుగుతూ ఉండాలి, కానీ ఇందులో నిర్భయత కూడా కావాలి. ముందుగా వారికి చెప్పాలి, నేను బికారిని ఏమీ కాను, నేనైతే ఈశ్వరుని యొక్క మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాను, మాకు ఆజ్ఞ లభించింది – ఒక్క నిమిషం యొక్క మహామంత్రాన్ని ఇచ్చి వెళ్తాము. ఇది సంజీవని మూలిక. మేము బాబా సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. సేవ అయితే చాలా ఉంది కానీ ఎవరైనా స్వయమే దేహాభిమానులుగా ఉన్నట్లయితే, ఎవ్వరికీ బాణం తగలదు. తండ్రితో సత్యంగా ఉండాలి. మిత్ర-సంబంధీకులను స్మృతి చేసుకుంటూ ఉండడం కాదు. ఇది కావాలి, అది కావాలి… మీరు ఏదీ కూడా అడగకూడదు. మీరు ఎవరి నుండి ఏమీ తీసుకోకూడదు. ఎవరి చేతితో తయారుచేసింది తినకూడదు. మనం మన చేతులతో తయారుచేసుకుని తింటాము. తమ స్వహస్తాలతో తయారుచేసుకుని తిన్నట్లయితే ఎంతో శక్తి వస్తుంది. కానీ ఇంత శ్రమ ఎవ్వరూ చేయరు. మాయ చాలా శక్తివంతమైనది. దేహాభిమానం యొక్క వ్యాధి చాలా కష్టం మీద పోతుంది. చాలా శ్రమ ఉంది. యోగంలో ఉండలేకపోతే భోజనం తయారుచేసుకోవడమే మానేస్తారు. అచ్ఛా, యోగంలో ఉంటూ తినవచ్చు. దేహీ-అభిమాని అవస్థను తయారుచేసుకోవడానికి చాలా శ్రమ కావాలి. పెద్ద-పెద్ద సత్సంగాలకు వెళ్ళి ఒకే విషయాన్ని అర్థం చేయించండి – భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఇక స్వర్గంలోకి వచ్చేస్తారు. భారత్ స్వర్గంగా ఉండేది కదా. విశ్వానికి యజమానిగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది, అది ఉన్నతమైన పదవి! ప్రజలలోకి రావడం పెద్ద విషయమేమీ కాదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ పని తెలివితక్కువతనంతో జరగకూడదు, దీని కోసం జ్ఞాన-యోగాల బలాన్ని జమ చేసుకోవాలి. సమయం తీసి సత్యతతో, నిర్భయతతో సేవను తప్పకుండా చేయాలి. సేవతోనే శక్తి వస్తుంది.

2. దేహాభిమానం యొక్క వ్యాధి నుండి రక్షించుకునేందుకు భోజనాన్ని చాలా యోగయుక్తంగా ఉంటూ తినాలి. వీలైతే తమ స్వహస్తాలతో తయారుచేసుకుని శుద్ధమైన భోజనాన్ని స్వీకరించాలి.

వరదానము:-

ఎలాగైతే గులాబి పుష్పము దుర్గంధం కల ఎరువు నుండి సుగంధాన్ని ధారణ చేసి, సుగంధభరితమైన గులాబిగా అవుతుందో, అలా విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మలైన మీరు అశుభమైన, వ్యర్థమైన, సాధారణ భావనను మరియు భావాన్ని శ్రేష్ఠతలోకి, అశుభమైన భావాన్ని మరియు భావనను శుభ భావం మరియు భావనలోకి పరివర్తన చేయండి, అప్పుడు బ్రహ్మాబాబా సమానంగా అవ్యక్త ఫరిశ్తాగా అయ్యేటువంటి లక్షణాలు సహజంగా మరియు స్వతహాగా వస్తాయి. దీని ద్వారానే మాలలోని మణులు ఒకదానికొకటి సమీపంగా వస్తాయి.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

బాప్ దాదాకు పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే, పిల్లలు ప్రతి ఒక్కరు నాకంటే ముందుండాలి అని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరి పట్ల అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో, వారిని తమకంటే ముందుకు తీసుకువెళ్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కావున బాప్ దాదా అంటారు, నా పిల్లలలో ఇప్పుడు ఏ లోపము ఉండకూడదు, అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top