16 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 15, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘ఆత్మిక నషాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు అత్యంత పెద్ద తండ్రి పిల్లలకు అలౌకిక దివ్య సంగమయుగంలోని ప్రతి రోజుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రపంచం వారి కోసం విశేషంగా ఒక్క పెద్ద రోజు ఉంటుంది మరియు ఆ పెద్ద రోజున ఏం చేస్తారు? వారు పెద్ద మనసుతో జరుపుకుంటున్నాము అని భావిస్తారు కానీ వారు జరుపుకోవడం అంటే ఏమిటి అనేది మీకు తెలుసు! వారు జరుపుకోవడము మరియు అత్యంత పెద్ద తండ్రి యొక్క పెద్ద మనసు కల పిల్లలైన మీరు జరుపుకోవడము – ఎంత అతీతముగా మరియు ప్రియముగా ఉంది! ఎలాగైతే ప్రపంచంలోని వారు పెద్ద రోజున సంతోషంతో నాట్యం చేస్తారు, పాడుతారు, ఒకరికొకరు ఆ రోజు యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు. అలా పిల్లలైన మీ కోసం సంగమయుగమే పెద్ద యుగము. ఆయువులో చిన్నది కానీ విశేషతలలో మరియు ప్రాప్తిని అందించడంలో అన్నింటికంటే పెద్ద యుగము. కనుక సంగమయుగం యొక్క ప్రతి రోజు మీ కొరకు పెద్ద రోజు ఎందుకంటే అత్యంత పెద్ద తండ్రి పెద్ద యుగమైన ‘‘సంగమయుగము’’ లోనే లభిస్తారు. వీటితో పాటు తండ్రి ద్వారా అత్యంత పెద్ద ప్రాప్తి కూడా ఇప్పుడే కలుగుతుంది. బాప్ దాదా పిల్లలందరినీ అత్యంత పెద్ద ‘‘పురుషోత్తములు’’ గా ఇప్పుడు తయారుచేస్తారు. ఈ రోజు యొక్క విశేషత ఏమిటంటే, సంతోషాలు జరుపుకోవడము మరియు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకోవడము, శుభాకాంక్షలు ఇచ్చుకోవడము మరియు తండ్రి ద్వారానే కానుక లభించే రోజును జరుపుకుంటారు. మీ అందరికీ తండ్రి సంగమయుగంలోనే అత్యంత పెద్ద కానుక ఏమిచ్చారు? బాప్ దాదా సదా అంటారు, నేను పిల్లలైన మీ కోసం అరచేతిలో స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకొచ్చాను. మరి అందరి అరచేతిలో స్వర్గం యొక్క రాజ్య భాగ్యం ఉంది కదా. దీనినే అరచేతిలో స్వర్గము అని అంటారు. దీని కన్నా పెద్ద కానుకను ఇంకెవ్వరైనా ఇవ్వగలరా? ఎంత పెద్ద వ్యక్తి, పెద్ద కానుకను ఇచ్చినా కానీ తండ్రి కానుక ముందు అది ఏపాటిది? సూర్యుని ముందు దీపం వంటిది. అలా, సంగమయుగం యొక్క స్మృతిచిహ్న గుర్తులు ఇతర ధర్మాలలో కూడా ఉండిపోయాయి. మీ పెద్ద యుగంలో పెద్ద తండ్రి అత్యంత పెద్ద కానుకనిచ్చారు. అందుకే నేటి ఈ పెద్ద రోజున ఈ విధితో జరుపుకుంటారు. వారు క్రిస్మస్ ఫాదర్ అని అంటారు. ఫాదర్ అనేవారు సదా పిల్లలకు ఇచ్చేటువంటి ‘‘దాత’’. లౌకిక రీతిలో కూడా చూడండి – ఫాదర్ పిల్లలకు దాతగా ఉంటారు. వీరు అనంతమైన ఫాదర్. అనంతమైన ఫాదర్ కానుకను కూడా అనంతమైనది ఇస్తారు. వేరే ఏ కానుక అయినా ఎంత కాలం ఉంటుంది? శుభాకాంక్షల యొక్క ఎన్ని మంచి-మంచి కార్డులు కానుకగా ఇస్తారు! కానీ ఈ రోజు గడిచిపోయిన తర్వాత ఆ కార్డును ఏం చేస్తారు? కొంత కాలమే నడుస్తుంది కదా! తినేందుకు, తాగేందుకు మధురమైన పదార్థాలు కూడా ఇస్తారు, అవి కూడా ఎంత సమయం నడుస్తాయి! ఎంత సమయం సంతోషం జరుపుకుంటారు! ఒక రాత్రి కోసం నాట్యం చేస్తారు, పాడుతారు. కానీ ఆత్మలైన మీకు తండ్రి ఎలాంటి కానుకను ఇస్తారంటే – అది ఈ జన్మలో మీతో పాటు ఉండనే ఉంటుంది, అంతేకాక జన్మ-జన్మలు మీతో పాటు ఉంటుంది. ప్రపంచంవారు అంటారు, ఖాళీ చేతులతో వచ్చాము మరియు ఖాళీ చేతులతో వెళ్ళాలి అని. కానీ మీరు ఏమంటారు? మీరు నషాతో అంటారు, ఆత్మలమైన మేము తండ్రి ద్వారా లభించిన ఖజానాలతో నిండుగా అయి వెళ్తాము మరియు అనేక జన్మలు నిండుగా ఉంటాము. 21 జన్మల వరకు ఈ కానుక తోడుగా ఉంటుంది. ఇటువంటి కానుకను ఎప్పుడైనా చూసారా? ఏ ఫారెన్ దేశం యొక్క రాజు లేక రాణి అయినా సరే, ఇటువంటి కానుకను ఇవ్వగలరా? మొత్తం సింహాసనం ఇచ్చినా, ఈ సింహాసనాన్ని మీరు తీసేసుకోండి అని ఆఫర్ చేసినా, మీరు ఏం చేస్తారు, ఎవరైనా తీసుకుంటారా? తండ్రి హృదయ సింహాసనం ముందు ఈ సింహాసనం కూడా ఏపాటిది! అందుకే మీరందరూ నషాలో ఉంటారు, నషా అనగా ఆత్మిక నషా. ఈ ఆత్మిక నషాలో ఉండేటువంటివారు ఏ విషయం యొక్క చింత చేయరు, నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. ఇప్పుడు కూడా చక్రవర్తులే మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు, అందుకే అన్నింటికన్నా పెద్దది మరియు అన్నింటికన్నా మంచిది ఈ నిశ్చింత రాజ్యము. ఏదైనా చింత ఉందా? మరియు ప్రవృత్తిలో ఉండేవారికి పిల్లల యొక్క చింత ఉందా? కుమారులకు భోజనం తయారుచేసుకునే చింత ఎక్కువ ఉంది, కుమారీలకు ఏం చింత ఉంటుంది? మంచి ఉద్యోగం లభించాలి అని ఉద్యోగం యొక్క చింత. చింత ఉందా? నిశ్చింతులు కదా! ఎవరికైతే చింత ఉంటుందో, వారు నిశ్చింత రాజ్యం యొక్క ఆనందాన్ని తీసుకోలేరు. విశ్వం యొక్క రాజ్యమైతే 20 జన్మలుంటుంది, కానీ ఈ నిశ్చింత రాజ్యము మరియు హృదయ సింహాసనము – ఇవి కేవలం ఈ ఒక్క జన్మ కోసమే ఈ యుగంలోనే లభిస్తాయి. కావున ఒకటి అనేదానికి మహత్వముంది కదా!

బాప్ దాదా సదా పిల్లలకు ఇదే చెప్తారు – ‘‘బ్రాహ్మణ జీవితం అనగా నిశ్చింత చక్రవర్తి’’. బ్రహ్మాబాబా నిశ్చింత చక్రవర్తిగా అయ్యారు, అప్పుడు ఏ పాట పాడారు – పొందాల్సినదంతా పొందేసాను, ఇంకేమి మిగిలి ఉంది. మీరు ఏమంటారు? సేవ యొక్క పని ఇంకా మిగిలి ఉంది, కానీ అది కూడా, చేయించేటువంటి తండ్రి చేయిస్తూ ఉన్నారు మరియు చేయిస్తూ ఉంటారు. మేము చెయ్యాలి – దీని వలన భారమైపోతుంది. తండ్రి మా ద్వారా చేయిస్తున్నారు – అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు. ఈ శ్రేష్ఠ కార్యం జరగాల్సిందే మరియు జరిగే ఉంది అనే నిశ్చయముంది, అందుకే నిశ్చయ బుద్ధి కలవారిగా, నిశ్చింతులుగా, చింతలేని వారిగా ఉంటారు. కేవలం పిల్లలు బిజీగా ఉండేందుకు సేవ యొక్క ఒక ఆటను ఆడిస్తున్నారు. నిమిత్తులుగా చేసి వర్తమానం మరియు భవిష్య సేవల ఫలానికి అధికారులుగా తయారుచేస్తున్నారు. పని తండ్రిది, పేరు పిల్లలది. ఫలాన్ని పిల్లలకు తినిపిస్తారు, స్వయం తినరు. మరి నిశ్చింతులుగా అయ్యారు కదా. సేవలో సఫలత యొక్క సహజ సాధనమే ఇది, చేయించేవారు చేయిస్తున్నారు. ఒకవేళ ‘‘నేను చేస్తున్నాను’’ అని అనుకున్నట్లయితే ఆత్మ శక్తి అనుసారంగా సేవ యొక్క ఫలం లభిస్తుంది. తండ్రి చేయిస్తున్నారు అంటే తండ్రి సర్వశక్తివంతుడు, కర్మ యొక్క ఫలం కూడా అంతే శ్రేష్ఠమైనది లభిస్తుంది. కావున సదా తండ్రి ద్వారా ప్రాప్తించిన నిశ్చింత రాజ్యం లేక అరచేతిలో స్వర్గ రాజ్య భాగ్యం యొక్క ఈశ్వరీయ కానుకను స్మృతిలో ఉంచుకోండి. తండ్రి మరియు కానుక, ఈ రెండింటి స్మృతితో ప్రతి రోజే కాదు, ప్రతి ఘడియ అత్యంత పెద్ద ఘడియ, పెద్ద రోజు అనేటువంటి అనుభూతిని చేస్తారు. ప్రపంచంలోని వారైతే కేవలం శుభాకాంక్షలు ఇస్తారు. ఏమంటారు? సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలి… అని అంటారు. కానీ అలా అయిపోరు కదా! తండ్రి అయితే ఎటువంటి శుభాకాంక్షలను ఇస్తారంటే, సదా కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము – వరదానాల రూపంలో తోడుగా ఉంటాయి. కేవలం నోటి ద్వారా చెప్పి సంతోషపరచరు, అలా తయారు చేస్తారు మరియు అలా తయారవ్వడమే జరుపుకోవడము ఎందుకంటే అవినాశీ తండ్రి యొక్క శుభాకాంక్షలు కూడా అవినాశీగా ఉంటాయి కదా. కనుక శుభాకాంక్షలు వరదానంగా అవుతాయి.

మీరు కాండం నుండి వెలువడ్డారు. ఇవన్నీ శాఖలు. ఈ ధర్మాలన్నీ మీ శాఖలు కదా! కల్పవృక్షం యొక్క శాఖలు. అందుకే వృక్షం యొక్క గుర్తుగా క్రిస్మస్ ట్రీ ని చూపిస్తారు. అలంకరించి ఉన్న క్రిస్మస్ ట్రీ ని ఎప్పుడైనా చూసారా? అందులో ఏం చేస్తారు? (స్టేజిపైన రెండు అలంకరించిన క్రిస్మస్ ట్రీ లను పెట్టారు) ఇందులో ఏం చూపించారు? విశేషంగా మెరుస్తూ ఉన్న, వెలుగుతున్న బల్బులను చూపిస్తారు. చిన్న-చిన్న బల్బులతోనే అలంకరిస్తారు. దీని అర్థమేమిటి? కల్పవృక్షంలో మీరు మెరుస్తూ ఉన్న ఆత్మలు మరియు ఏ-ఏ ధర్మ పితలైతే వస్తారో, వారు కూడా తమ లెక్కలో సతోప్రధానంగా ఉంటారు, అందుకే బంగారు యుగపు ఆత్మ మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ కల్పవృక్షం యొక్క గుర్తును ఇతర ధర్మాల శాఖలు కూడా ప్రతి సంవత్సరం గుర్తుగా జరుపుకుంటూ ఉంటారు. మొత్తం వృక్షం యొక్క గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కదా. ఏ తండ్రి గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్? తండ్రి బ్రహ్మాను ముందుంచారు. సాకార సృష్టి యొక్క ఆత్మలకు ఆదిపిత, ఆదినాథుడు బ్రహ్మా, అందుకే గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆదిదేవ్ తో పాటు మీరు కూడా ఉన్నారు, అంతేకానీ ఆదిదేవ్ ఒక్కరే లేరు. ఆది ఆత్మలైన మీరు ఇప్పుడు ఆదిదేవ్ తో పాటు ఉన్నారు మరియు మున్ముందు కూడా వారితో పాటు ఉంటారు, ఇంతటి నషా ఉందా? సంతోషం యొక్క పాటలను సదా పాడుతూ ఉంటారా లేక కేవలం ఈ రోజే పాడుతారా?

ఈ రోజు విశేషంగా డబల్ విదేశీయుల రోజు. మీ కొరకు ప్రతి రోజు పెద్ద రోజా లేక ఈ రోజేనా? నలువైపులా దేశ విదేశాలలోని పిల్లలు కల్పవృక్షంలో మెరుస్తున్న సితారులుగా కనిపిస్తున్నారు. సూక్ష్మ రూపంలోనైతే అందరూ మధుబన్ కు చేరుకుని ఉన్నారు. వారందరూ కూడా ఆకారీ రూపంలో జరుపుకుంటున్నారు. మీరు సాకారీ రూపంలో జరుపుకుంటున్నారు. అందరి మనసు తండ్రి యొక్క ఈశ్వరీయ కానుకను చూసి సంతోషంలో నాట్యం చేస్తుంది. బాప్ దాదా కూడా సర్వ సాకార రూపంలోని వారికి మరియు ఆకార రూపధారీ పిల్లలకు, సదా హర్షిత భవ అనే శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా దిల్ ఖుష్ మిఠాయి తింటూ ఉండండి మరియు ప్రాప్తి యొక్క పాటలను పాడుతూ ఉండండి. డ్రామానుసారంగా భారత్ వారికి విశేష భాగ్యము లభించి ఉంది. అచ్ఛా.

టీచర్లు అందరూ పెద్ద రోజును జరుపుకున్నారా లేక ప్రతి రోజూ జరుపుకుంటారా? పెద్ద తండ్రి మరియు మీరు కూడా పెద్దవారు, అందుకే ప్రపంచంవారి పెద్ద రోజులు ఏవైతే ఉన్నాయో, వాటికి మహత్వమిస్తారు. ఇందులో కూడా పెద్దవారైన మీరు చిన్న సోదరులకు ఉత్సాహాన్ని కలిగిస్తారు. టీచర్లు అందరూ నిశ్చింత చక్రవర్తులా? చక్రవర్తి అనగా సదా నిశ్చయం మరియు నషాలో స్థితులై ఉండేవారు ఎందుకంటే నిశ్చయం విజయులుగా చేస్తుంది మరియు నషా సంతోషంలో సదా పైకి ఎగిరేలా చేస్తుంది. కనుక నిశ్చింత చక్రవర్తులుగానే ఉంటారు కదా! ఏదైనా చింత ఉందా? సేవ ఎలా పెరుగుతుంది, మంచి-మంచి జిజ్ఞాసువులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పటి వరకు సేవ చేయవలసి ఉంటుంది – ఇలా అయితే ఆలోచించడం లేదు కదా? ఆలోచన రహితంగా అవ్వడం ద్వారానే సేవ పెరుగుతుంది, ఆలోచించడంతో పెరగదు. ఆలోచన రహితంగా అయి బుద్ధిని ఫ్రీ గా పెట్టుకున్నట్లయితే, అప్పుడు తండ్రి యొక్క శక్తిని సహాయం రూపంలో అనుభవం చేస్తారు. ఆలోచించడంలోనే బుద్ధిని బిజీగా పెట్టుకున్నట్లయితే, తండ్రి టచింగ్ ను, తండ్రి శక్తిని గ్రహించలేకపోతారు. బాబా మరియు మేము – కంబైండుగా ఉన్నాము. వారు చేయించేవారు మరియు చేసేందుకు నిమిత్తము నేను ఆత్మను. దీనినే ఆలోచనా రహితము అని అంటారు అనగా ఒక్కరి స్మృతి. శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడూ చింత ఉండదు. ఎక్కడైతే చింత ఉంటుందో, అక్కడ శుభచింతన ఉండదు మరియు ఎక్కడ శుభచింతన ఉంటుందో అక్కడ చింత ఉండదు. అచ్ఛా!

నలువైపులా కల ఈశ్వరీయ కానుక యొక్క అధికారులకు, అత్యంత పెద్ద తండ్రి యొక్క అత్యంత పెద్ద భాగ్యవాన్ ఆత్మలకు, ఆది పితకు సదా సహచరులైన ఆది ఆత్మలకు, సదా అత్యంత పెద్ద తండ్రి ద్వారా ప్రేమ యొక్క శుభాకాంక్షలను, అవినాశీ వరదానాలను ప్రాప్తి చేసుకునే సర్వ సాకారీ రూపధారులు మరియు ఆకారీ రూపధారులు – పిల్లలందరికీ దిల్ ఖుష్ మిఠాయితో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.

పూణే-బీదర్ గ్రూప:- రోజూ అమృతవేళ దిల్ ఖుష్ మిఠాయి తింటారా? ఎవరైతే రోజూ అమృతవేళ దిల్ ఖుష్ మిఠాయి తింటారో, వారు స్వయం కూడా మొత్తం రోజంతా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా వారిని చూసి సంతోషిస్తారు. ఇది ఎటువంటి ఔషధమంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఈ దిల్ ఖుష్ ఔషధం పరిస్థితిని చిన్నదిగా చేసేస్తుంది, పర్వతాన్ని దూదిలా చేసేస్తుంది. ఇంతటి శక్తి ఉంది ఈ ఔషధంలో! ఎలాగైతే శరీరం లెక్కలో కూడా, ఎవరైతే ఆరోగ్యంగా లేక శక్తిశాలిగా ఉంటారో, వారు ప్రతి పరిస్థితిని సహజంగా దాటేస్తారు మరియు ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు చిన్న విషయంలో కూడా గాబరా పడిపోతారు. బలహీనంగా ఉన్నవారి ముందు పరిస్థితి పెద్దదిగా అయిపోతుంది మరియు శక్తిశాలిగా ఉన్నవారి ముందు పరిస్థితి పర్వతం నుండి దూదిలా అయిపోతుంది. కావున రోజూ దిల్ ఖుష్ మిఠాయి తినడం అనగా సదా హృదయం సంతోషంగా ఉండడము. ఈ అలౌకిక సంతోషం యొక్క రోజులు ఎంత తక్కువగా ఉన్నాయి! దేవతల సంతోషం మరియు బ్రాహ్మణుల సంతోషంలో కూడా తేడా ఉంది. ఈ బ్రాహ్మణ జీవితంలోని పరమాత్మ-సంతోషము, అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి దేవతల జీవితంలో కూడా ఉండదు, అందుకే ఈ సంతోషాన్ని ఎంత కావాలంటే అంత జరుపుకోండి. రోజూ అనుకోండి – ఈ రోజు సంతోషాన్ని జరుపుకునే రోజు అని. ఇక్కడికి రావడంతో సంతోషం పెరిగిపోయింది కదా! ఇక్కడి నుండి కిందకు వెళ్ళినట్లయితే తగ్గిపోదు కదా? ఎగిరే కళ ఇప్పుడు ఉంది, ఇక తర్వాత ఎవరు ఎంత పొందారో, అంత తింటూ ఉంటారు. కనుక సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, మేము దిల్ ఖుష్ మిఠాయిని తినేవారము మరియు ఇతరులకు తినిపించేవారము ఎందుకంటే ఎంతగా ఇస్తారో, అంతగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. చూడండి, సంతోషం యొక్క ముఖం అందరికీ బాగా అనిపిస్తుంది మరియు ఎవరికైనా దుఃఖం, అశాంతితో గాబరా పడిన ముఖం ఉంటే అది బాగా అనిపించదు కదా! మరి ఇతరులది బాగా అనిపించదు అన్నప్పుడు, స్వయానిది కూడా బాగా అనిపించకూడదు. కావున సదా సంతోషం యొక్క ముఖంతో సేవ చేస్తూ ఉండండి. మాతలు ఇటువంటి సేవను చేస్తున్నారా? ఇంట్లో వారు మిమ్మల్ని చూసి సంతోషించాలి. ఎవరికైనా జ్ఞానం చెడుగా అనిపించినా కానీ సంతోషకరమైన జీవితాన్ని చూసి మనసుతో తప్పకుండా అనుభవం చేస్తారు, వీరు సంతోషంగా ఉన్నారు అంటే ఏదో లభించింది అని. అభిమానం వలన బయటకు చెప్పకపోయినా కానీ లోపల అనుభవం చేస్తారు మరియు చివరికి వారు వంగాల్సిందే. ఈ రోజు నిందిస్తారు, రేపు చరణాలపై వంగుతారు. ఎక్కడ వంగుతారు? ‘‘అహో ప్రభూ’’ అని అంటూ తప్పకుండా వంగేది ఉంది. మరి అటువంటి స్థితి ఉన్నప్పుడే వంగుతారు కదా! ఎవరైనా, ఎవరి ముందు అయినా వంగారు అంటే, వారిలో ఏదో పెద్దతనం ఉంటుంది, ఏదో విశేషత ఉంటుంది. ఆ విశేషతకు వంగుతారు. ఊరకే ఎవరూ వంగరు కదా! వీరి వంటి జీవితం ఎవరికీ లేనే లేదు, సదా సంతోషంగా ఉంటారు అనేది కనిపించాలి. ఏడ్చే పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండాలి, మనసు సంతోషంగా ఉండాలి. అలాగని కేవలం నవ్వుతూ ఉండడం కాదు, కానీ మనసు సంతోషంగా ఉండాలి. పాండవులు ఏమనుకుంటున్నారు? ఇటువంటి అనుభూతి ఇతరులకు కలుగుతుందా లేక ఇప్పుడింకా తక్కువగా అవుతుందా?

ప్రసన్నచిత్తులుగా ఉండేవారు తమ ముఖం ద్వారా చాలా సేవ చేస్తారు. నోటితో మాట్లాడినా, మాట్లాడకపోయినా కానీ, మీ ముఖం, జ్ఞానం యొక్క గుణాన్ని స్వతహాగా ప్రత్యక్షం చేస్తుంది. కనుక ఇదే గుర్తుంచుకోవాలి, దిల్ ఖుష్ మిఠాయిని తినాలి మరియు ఇతరులకు కూడా తినిపించాలి. ఎవరైతే స్వయం తింటారో, వారు తినిపించకుండా ఉండలేరు. అచ్ఛా!

బెల్గామ్షోలాపూర్ గ్రూప:- మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని చూసి హర్షిస్తున్నారా? ఎందుకంటే ఈ జీవితం వజ్ర తుల్యమైన జీవితము. వజ్రానికి విలువ ఉంటుంది కదా! కనుక ఈ జీవితాన్ని ఇంత అమూల్యమైనదిగా భావించి ప్రతి కర్మ చేయండి. బ్రాహ్మణ జీవితము అనగా అలౌకిక జీవితము. అలౌకిక జీవితంలో సాధారణ నడవడిక ఉండజాలదు. ఏ కర్మ చేసినా అది అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. ఎప్పుడైతే అలౌకిక స్వరూపం యొక్క స్మృతి ఉంటుందో, అప్పుడు అలౌకిక కర్మ జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో, అటువంటి స్థితి ఉంటుంది. స్మృతిలో ఉండాలి – ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. కావున తండ్రి స్మృతి సదా సమర్థంగా చేస్తుంది, అందుకే కర్మ కూడా శ్రేష్ఠంగా, అలౌకికంగా ఉంటుంది. ఎలాగైతే అజ్ఞానీ జీవితంలో రోజంతా నాది-నాది అని అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ నాది అనేదానిని తండ్రి వైపు పెట్టేసారు కదా! ఇప్పుడు ఇతర నాది-నాది అనేవన్నీ సమాప్తమైపోయాయి. బ్రాహ్మణులుగా అవ్వడము అనగా అంతా నీది గా చేసేసారు. ఈ పొరపాటు అయితే చేయరు కదా – నాదిని నీదిగా, నీదిని నాదిగా అయితే చేయరు కదా? ఏదైనా అవసరముంటే నాది అని అంటారు మరియు అవసరం ఏదీ లేకపోతే నీది అని అంటారు. నాది అని అంటే అనండి కానీ ఇప్పుడు ‘‘నా బాబా’’ అని అనండి. మిగిలిన అన్ని నాది-నాది అనే వాటిని వదిలి, ఒక్కరే నా వారు. ఒక్కరే నా వారు అని అనడంతో శ్రమ నుండి విడుదల అయిపోతారు, బరువు దిగిపోతుంది. లేదంటే గృహస్థ జీవితంలో ఎంత బరువు ఉంది! ఇప్పుడు తేలికగా, డబల్ లైట్ గా అయిపోయారు, అందుకే సదా ఎగిరే కళ కలవారిగా ఉన్నారు. ఎగిరే కళ ఉండాలే తప్ప ఆగే కళలో ఆగిపోవద్దు. సదా ఎగురుతూనే వెళ్ళండి. తండ్రి తమ వారిగా చేసుకున్నారు – సదా ఇదే సంతోషంలో ఉండండి.

వరదానము:-

వర్తమాన సమయంలో పరస్పరంలో విశేషంగా కర్మల ద్వారా గుణ దాతగా అయ్యే అవసరముంది, అందుకే జ్ఞానంతో పాటుగా గుణాలను ఇమర్జ్ చేయండి. ఇదే సంకల్పం చేయండి, నేను సదా గుణ మూర్తిగా అయి అందరినీ గుణ మూర్తులుగా తయారుచేసే విశేష కర్తవ్యం చేయాల్సిందే. అప్పుడు వ్యర్థాన్ని చూసేందుకు, వినేందుకు లేక చేసేందుకు తీరికే ఉండదు. ఇతరులను చూసేందుకు బదులుగా బ్రహ్మా బాబాను ఫాలో చేస్తూ ప్రతి సెకెండు గుణాలను దానం చేస్తూ వెళ్ళండి, అప్పుడు సర్వగుణ సంపన్నులుగా అయ్యేందుకు మరియు తయారుచేసేందుకు ఉదాహరణగా అయి నంబరువన్ గా అయిపోతారు.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

ఈ పరమాత్మ ప్రేమ ఎటువంటి సుఖదాయకమైన ప్రేమ అంటే, ఈ ప్రేమలో ఒక క్షణం మైమరచిపోయినా, అనేక దుఃఖాలను మర్చిపోతారు మరియు సదా కోసం సుఖం యొక్క ఊయలలో ఊగడం మొదలుపెడతారు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top