15 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 14, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఈ దాదా అద్భుతమైన పోస్ట్ ఆఫీసు, వీరి ద్వారానే మీకు శివబాబా డైరెక్షన్లు లభిస్తాయి’’

ప్రశ్న: -

బాబా పిల్లలను ఏ విషయంలో అప్రమత్తం చేస్తారు మరియు ఎందుకు?

జవాబు:-

బాబా అంటారు, పిల్లలూ అప్రమత్తంగా ఉండండి – మాయ ద్వారా ఎక్కువ దెబ్బలను తినకండి, ఒకవేళ మాయ దెబ్బలు తింటూ ఉన్నట్లయితే ప్రాణాలు పోతాయి మరియు పదవి లభించజాలదు. ఈశ్వరుని వద్ద జన్మ తీసుకొని మళ్ళీ ఎవరైనా మాయ దెబ్బతో ఒకవేళ మరణిస్తే, ఆ మృత్యువు అన్నింటికన్నా చెడ్డది. ఎప్పుడైతే మాయ పిల్లలతో తప్పుడు పనులు చేయిస్తుందో, అప్పుడు బాబాకు చాలా దయ కలుగుతుంది, అందుకే అప్రమత్తం చేస్తూ ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుంది..

ఓంశాంతి. ఎప్పుడైతే మనుష్యమాత్రులు దుఃఖితులుగా అవుతారో, అప్పుడు అదే తండ్రిని పిలిచేటువంటి సమయము ఎందుకంటే వికారులుగా అయిపోతారు. దుఃఖితులుగా దేని ద్వారా అవుతారు? ఇది కూడా తమోప్రధాన మనుష్యులకు తెలియదు. 5 వికారాల రూపీ రావణుడు దుఃఖితులుగా చేస్తాడు. అచ్ఛా, అతడి రాజ్యం ఎంత వరకు నడుస్తుంది? తప్పకుండా ప్రపంచం అంతిమం వరకు రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది అని అంటారు. రామ రాజ్యము, రావణ రాజ్యము అనే పేర్లు అయితే ప్రసిద్ధమైనవి. రావణ రాజ్యం గురించి భారత్ లోనే తెలుసు. అతడు భారత్ యొక్క శత్రువే అన్నది కనిపిస్తుంది. భారత్ ను రావణుడే పడేసాడు, ఎప్పటి నుండైతే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారో అనగా వికారులుగా అయ్యారో, అప్పుడు రావణుడే భారత్ ను పడేసాడు. భారత్ ఏదైతే నిర్వికారిగా ఉండేదో, అది వికారీగా ఎలా అయ్యింది అనేది ప్రపంచానికి తెలియదు. భారత్ కే మహిమ ఉంది. భారత్ శ్రేష్ఠాచారిగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. ఎప్పటి నుండి అయితే పతితంగా అవ్వడం మొదలు పెట్టారో, అప్పటి నుండి భక్తులుగా, పూజారులుగా అయ్యారు. అప్పటి నుండే భగవంతుడిని గుర్తు చేసుకుంటూ వచ్చారు. ప్రతి కల్పం యొక్క సంగమయుగంలో తండ్రి వస్తారు అని అయితే అర్థం చేయించడం జరిగింది. కల్పంలో 4 యుగాలు ఉన్నాయి, ఇక మిగిలిన 5వ సంగమయుగం గురించి ఎవరికీ కూడా తెలియదు. వారు సంగమయుగాలు చాలా ఉన్నాయి అని అంటారు. యుగే-యుగే అని అన్నట్లయితే, మరి ఎన్ని సంగమాలు ఉన్నట్లు – సత్యయుగం నుండి త్రేతా, త్రేతా నుండి ద్వాపరము, ద్వాపరం నుండి కలియుగము. కానీ తండ్రి అంటారు, కల్పం యొక్క సంగమయుగంలో తండ్రికి రావాల్సే ఉంటుంది. ఎప్పుడైతే మనుష్యులు పతితం నుండి పావనంగా అవుతారో, దానిని కళ్యాణకారీ పురుషోత్తమ యుగము అని అంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. సత్యయుగం తర్వాత మళ్ళీ ఏం వస్తుంది? త్రేతా వస్తుంది. సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఏదైతే ఉంటుందో, అది తర్వాత చంద్రవంశీయులదిగా అవుతుంది. త్రేతాలో రామరాజ్యం ఉంటుంది, సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల తర్వాత సీతా-రాముల రాజ్యం వస్తుంది. సత్య-త్రేతాయుగాలకు మధ్యన తప్పకుండా సంగమం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఇబ్రహీమ్ వస్తారు, వారు అటువైపు ఉంటారు, వారికి ఇక్కడితో సంబంధం లేదు. ద్వాపరంలో మళ్ళీ చాలా మందే ఉంటారు. ఇస్లాములు, బౌద్ధులు మరియు క్రిస్టియన్లు మొదలైనవారు ఉంటారు. క్రిస్టియన్ ధర్మ స్థాపన జరిగి 2 వేల సంవత్సరాలు అయ్యింది. కొంతమంది ఎంతో కొంత లెక్క తీస్తారు. ఇప్పుడు సంగమం తర్వాత సత్యయుగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చరిత్ర-భౌగోళికము బుద్ధిలో ఉండాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అని అంటూ ఉంటారు కూడా. వారినే త్వమేవ మాతాశ్చ పితా… అని అంటారు. ఇది ఉన్నతోన్నతమైన భగవంతుని మహిమ. మీరు మాతా, పిత అని ఎవరిని అంటారు? ఇది ఎవరికీ తెలియదు. ఈ రోజులలో ఏ విగ్రహం ముందుకైనా వెళ్ళి – నీవే తల్లివి తండ్రివి… అని అంటారు. ఇప్పుడు మాతా, పిత అని ఎవరిని అనాలి? లక్ష్మీ-నారాయణులనా? బ్రహ్మా-సరస్వతులనా? శంకర-పార్వతీలనా? వీరిని యుగళులుగా చూపిస్తారు. మరి మాతా, పిత అని ఎవరిని అనాలి? ఒకవేళ పరమాత్మ తండ్రి అయితే తప్పకుండా తల్లి కూడా కావాలి. మాత అని ఎవరిని అనాలి అనేది తెలియదు. వీటిని గుహ్యమైన విషయాలు అని అంటారు. రచయిత ఉన్నప్పుడు మరి మళ్ళీ స్త్రీ కూడా కావాలి. మహిమ అయితే ఒక్కరికే చేస్తారు కదా. అంతేకానీ, ఒక్కోసారి బ్రహ్మాకు చేయడము, ఒక్కోసారి విష్ణువుకు చేయడము, ఒక్కోసారి శంకరుడికి చేయడము కాదు. అలా కాదు, మహిమ ఒక్కరికే చేస్తారు. పతిత-పావనా రండి, అని పాడుతారు కూడా, వారు తప్పకుండా అంతిమంలో వస్తారు. యుగ-యుగానికి ఎందుకు వస్తారు? పతితులుగా అంతిమంలోనే అవుతారు. పతితులను పావనంగా తయారుచేసేవారు తండ్రి, వారికి తప్పకుండా పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది, అప్పుడే వచ్చి పావనంగా తయారుచేస్తారు. అక్కడ కూర్చొని ఏమైనా తయారుచేస్తారా. సత్యయుగం పావన ప్రపంచము, కలియుగం పతిత ప్రపంచము. పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడము తండ్రి పనే. కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనము. బ్రహ్మా ద్వారా దేనిని స్థాపన చేయిస్తారు? విష్ణుపురిని. బ్రహ్మా మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞం రచించడం జరుగుతుంది కావున బ్రాహ్మణులనే తప్పకుండా చదివిస్తూ ఉండవచ్చు. బాబా, బ్రహ్మా మరియు బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులకు రాజయోగం యొక్క చదువు చదివిస్తారు అని మీరు రాస్తారు. అందులో సరస్వతి కూడా వచ్చేసారు. ఈ బ్రాహ్మణుల కులం అద్భుతమైనది. సోదరీ-సోదరులు ఎప్పుడూ వివాహం చేసుకోలేరు. ఎవరైనా వచ్చినప్పుడు, పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అంటూ మనం వారికి పరిచయమిస్తాము. పితా అని అయితే అంటారు కనుక వారు తండ్రి అయినట్లు, వీరు దాదా అయినట్లు, వారసత్వం వారి నుండి లభిస్తుంది, వారు జ్ఞానసాగరుడు, అనంతమైన తండ్రి. బ్రహ్మా ద్వారా ఇస్తారు. ఇది ఈశ్వరీయ ఒడి. తర్వాత దైవీ ఒడి లభిస్తుంది. ఇది అర్థం చేయించడం కూడా సహజము. నాలుగు యుగాల లెక్క కూడా ఖచ్చితంగా ఉంది. పావనం నుండి పతితంగా కూడా అవ్వాలి. 16 కళల నుండి 14 కళలు, ఆ తర్వాత 12 కళలలోకి రావాలి. మీరు మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబాను కొత్తవారు ఎవరైనా కలిస్తే, ఏమీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఇక్కడ బాప్ దాదా కంబైండ్ గా ఉన్నారు, ఇది అద్భుతము. మేము ఎవరితో మాట్లాడుతున్నాము అనేది పిల్లలు కూడా పదే-పదే మర్చిపోతారు! బుద్ధిలో శివబాబానే గుర్తుకు రావాలి. మేము శివబాబా వద్దకు వెళ్తాము. మీరు ఈ బాబాను ఎందుకు గుర్తు చేస్తారు? శివబాబాను స్మృతి చేయడంతో మీ వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ ఫోటో తీస్తున్నారనుకోండి, అప్పుడు కూడా బుద్ధి శివబాబా వైపు ఉండాలి – బాప్ దాదా ఇరువురూ ఉన్నారు అని. శివబాబా ఉన్నారు కావుననే ఈ దాదా కూడా ఉన్నారు. బాప్ దాదాతో పాటు ఫోటో తీసుకుంటారు. శివబాబా వద్దకు, ఈ దాదా ద్వారా కలుసుకునేందుకు వచ్చారు. వీరు పోస్ట్ ఆఫీసు వంటి వారు. వీరి ద్వారా శివబాబా డైరెక్షన్లు తీసుకోవాలి. ఇది చాలా అద్భుతమైన విషయము. ఎప్పుడైతే ప్రపంచం పాతదిగా అవుతుందో, అప్పుడు భగవంతుడు రావాల్సి ఉంటుంది. ద్వాపరం నుండి మొదలుకొని ప్రపంచం పతితంగా అవ్వడం మొదలవుతుంది. అంతిమంలో మొత్తం ప్రపంచం పతితంగా అయిపోతుంది. చిత్రాలపై అర్థం చేయించాలి. సత్య-త్రేతాయుగాలను స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. కొత్త ప్రపంచమైతే సదా ఉండదు. ప్రపంచం ఎప్పుడైతే సగం పూర్తి అవుతుందో, అప్పుడు దానిని పాతది అని అంటారు. ప్రతి వస్తువు యొక్క లైఫ్ సగం పాతగా, సగం కొత్తగా ఉంటుంది. కానీ ఈ సమయంలోనైతే శరీరంపై భరోసా లేదు. ఇదైతే అర్ధకల్పం యొక్క పూర్తి లెక్క, ఇందులో మార్పు జరగజాలదు. సమయం కన్నా ముందు ఏదీ మారజాలదు. ఇతర వస్తువులైతే మధ్యలో విరిగిపోవచ్చు కానీ ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన ముందు-వెనుక అవ్వజాలదు. ఇల్లు అయితే ఏ సమయంలోనైనా కూలిపోవచ్చు, నమ్మకం లేదు. ఈ చక్రమైతే అనాది, అవినాశీ. సమయమనుసారంగా నడుస్తుంది. పాత ప్రపంచానికి పూర్తిగా ఖచ్చితమైన జీవితకాలం ఉంటుంది. అర్ధకల్పం రామ రాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము, అంతకన్నా ఎక్కువగా ఉండజాలదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం మూడు లోకాలు వచ్చేసాయి. మీరు మూడు లోకాల యజమాని ద్వారా జ్ఞానం తీసుకుంటున్నారు. మీ పదవి ఈ సమయంలో చాలా ఉన్నతంగా ఉంది. ఈ సమయంలో మీరు మూడు లోకాలకు నాథులు ఉన్నారు ఎందుకంటే మీకు మూడు లోకాల జ్ఞానం గురించి తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాలను సాక్షాత్కారం చేసుకుంటారు, పిల్లల బుద్ధిలో పూర్తి పరిచయం ఉంది. బాబా మూడు లోకాలకు నాథుడు, మూడు లోకాల గురించి తెలిసినవారు. మీకు జ్ఞానాన్ని ఇస్తారు కావున మీరు కూడా మాస్టర్ త్రిలోకనాథులుగా అయినట్లు. ఏ జ్ఞానమైతే బాబాలో ఉందో, అది ఇప్పుడు మీలో కూడా ఉంది, నంబరువారు పురుషార్థానుసారంగా. తర్వాత సత్యయుగంలో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడ మిమ్మల్ని త్రిలోకాలకు నాథులు అని అనరు. లక్ష్మీ-నారాయణులకు మూడు లోకాల జ్ఞానం ఉండదు, సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉండదు. మీరు నాలెడ్జ్ ఫుల్ భగవంతుని యొక్క పిల్లలు. వారు చదివించి మిమ్మల్ని తమ సమానంగా తయారుచేసారు. మేము మళ్ళీ విష్ణుపురికి యజమానులుగా అవుతాము అని మీకు తెలుసు. ఏదైతే గతించిపోయిందో, ఆ జ్ఞానం కూడా ఈ సమయంలో మీ వద్ద ఉంది. మనుష్యులకు హద్దు యొక్క చరిత్ర-భౌగోళికముల గురించి తెలుసు, మీకు అనంతమైన చరిత్ర-భౌగోళికములు మీ బుద్ధిలో ఉంది. వారికి బాహుబలం యొక్క యుద్ధం గురించి తెలుసు. యోగ బలం యొక్క యుద్ధం గురించి ఎవరికీ తెలియదు. యోగ బలంతో మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. నేర్పించేవారు తండ్రి, వారు త్రిలోక నాథుడు. ఈ సమయంలో మీ పదవి చాలా ఉన్నతమైనది. మీరు నాలెడ్జ్ ఫుల్ తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్. వారు ఏ విధంగా జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు అనేది కూడా మీకు తెలుసు. వారిని సత్-చిత్-ఆనంద స్వరూపుడు అని అంటారు. ఈ సమయంలో ఆనందాన్ని మీరు అనుభవం చేస్తారు ఎందుకంటే మీరు చాలా దుఃఖితులుగా ఉండేవారు. మీరు సుఖాన్ని మరియు దుఃఖాన్ని పోల్చగలరు. ఆ లక్ష్మీ-నారాయణులకైతే ఈ విషయాలు తెలియవు. వారు కేవలం రాజ్యం చేస్తారు. అది వారి ప్రారబ్ధము. మీరు కూడా వెళ్ళి స్వర్గంలో రాజ్యం చేస్తారు. అక్కడ చాలా మంచి మహళ్ళను తయారుచేస్తారు. అక్కడ చింత యొక్క విషయమేదీ ఉండదు. ఇది కూడా బుద్ధిలో స్థిరంగా ఉండాలి అప్పుడు సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. తుఫానులైతే అనేక రకాలవి వస్తాయి, సంపూర్ణంగా అయితే ఎవరూ అవ్వలేదు. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు చాలా స్థిరంగా ఉండాలి. వారు అమరనాథ్ కు వెళ్తారు, అయినా కూడా వారు తప్పకుండా దిగాల్సిందే. మీరు తండ్రి వద్దకు వెళ్తారు, తర్వాత కొత్త ప్రపంచమైన సత్యయుగంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ దిగడం మొదలవుతుంది. ఇది మన అనంతమైన యాత్ర. మొదట బాబా వద్ద విశ్రాంతిగా ఉంటారు, ఆ తర్వాత రాజధానిలో రాజ్యం చేస్తారు, ఆ తర్వాత ఒకొక్క జన్మ దిగుతూనే వస్తారు. దీనిని చక్రం అని అనండి లేక ఎక్కడం దిగడం అని అనండి, విషయం ఒక్కటే. కింద నుండి పైకి వెళ్ళిపోతారు, మళ్ళీ దిగడం మొదలవుతుంది. ఈ విషయాలన్నింటినీ, ఎవరైతే తెలివైన బుద్ధి కలవారు ఉంటారో, వారు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించగలుగుతారు కూడా. ఈ బాబాకు కూడా ఇంతకుముందు తెలియదు. ఒకవేళ వీరికి ఎవరైనా గురువు ఉండి ఉంటే, ఆ గురువుకు ఇంకా ఫాలోవర్స్ (అనుచరులు) ఉంటారు. కేవలం ఒక్క ఫాలోవర్ మాత్రమే ఉంటారా. శాస్త్రాలలోనైతే భగవానువాచ, ఓ అర్జునా, అని ఉంది, ఒక్కరి పేరే రాసేసారు. అర్జునుడి రథంలో కూర్చున్నారు అంటే, వారు మాత్రమే విన్నట్లు. ఇతరులు కూడా ఉంటారు కదా, సంజయుడు కూడా ఉంటారు. ఈ అనంతమైన స్కూల్ ఒక్కసారి మాత్రమే తెరవబడుతుంది. ఆ స్కూళ్ళు అయితే నడుస్తూనే ఉంటాయి, ఎలాంటి రాజునో, అలాంటి భాష. అక్కడ సత్యయుగంలో కూడా స్కూలుకు వెళ్తారు కదా. భాష, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ నేర్చుకుంటారు. అక్కడ కూడా అన్నీ తయారవుతూ ఉండవచ్చు. అన్నింటికంటే మంచి వస్తువు ఏదైతే ఉంటుందో, అది స్వర్గంలో ఉంటుంది. తర్వాత అవన్నీ పాతవిగా అయిపోతాయి. అన్నింటికన్నా మంచి వస్తువులు దేవతలకు లభిస్తాయి. ఇక్కడేం లభిస్తుంది? కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తవే లభిస్తాయి అని మీరు అనుభవం చేస్తారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని మళ్ళీ మనుష్యులకు అర్థం చేయించాలి. ఇప్పుడు మనం సంగమంలో ఉన్నాము, మన కోసం ఇప్పుడు ప్రపంచం మారుతుంది. డ్రామానుసారంగా నేను మళ్ళీ వచ్చాను – మిమ్మల్ని పతితం నుండి పావన దేవీ-దేవతలుగా తయారుచేయడానికి. ఈ చక్రం తిరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా తప్పకుండా బ్రాహ్మణులనే రచించి ఉంటారు. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచించారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, అందుకే విరాట రూప చిత్రం కూడా తప్పనిసరి, దీని ద్వారా బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు అని నిరూపించబడుతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. దేవతల నుండి క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఈ సంగమయుగము ప్రసిద్ధమైనది. ఆత్మ పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు… ఎక్కే కళ తర్వాత దిగే కళ… ఇది కూడా అర్థం చేయించాలి. మొదట ఈశ్వరీయ సంతానము, తర్వాత దైవీ సంతానము, తర్వాత కొద్ది-కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. దుఃఖహర్త, సుఖకర్త అని ఎవరిని అంటారు అని మీరు అడగవచ్చు. తప్పకుండా పరమపిత పరమాత్మను అని అంటారు. ఎప్పుడైతే ప్రపంచం యొక్క దుఃఖం అంతమైపోతుందో, అప్పుడు విష్ణుపురి తయారైపోతుంది. బ్రాహ్మణుల దుఃఖం అంతమైపోతుంది, సుఖం లభిస్తుంది. ఇది సెకెండు యొక్క విషయము. లౌకిక తండ్రి ఒడి నుండి బయటకు వచ్చి పారలౌకిక తండ్రి ఒడిలోకి వచ్చేసారు, ఇది సంతోషకరమైన విషయము.

ఇది అన్నింటికంటే పెద్ద పరీక్ష. రాజులకే రాజులుగా అవుతారు. రాజయోగాన్ని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ నేర్పించలేరు. ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. నాకు పరమపిత పరమాత్మతో ఏ సంబంధము లేదు అని ఇలా ఎవరు అంటారు. ఇటువంటి నాస్తికులతో మాట్లాడకూడదు. నడుస్తూ-నడుస్తూ మాయ పిల్లల చేత కూడా అప్పుడప్పుడు తప్పుడు పనులు చేయించేస్తుంది. బాబాకైతే దయ కలుగుతుంది. అప్పుడు అర్థం చేయిస్తారు – అప్రమత్తంగా ఉండండి, ఎక్కువగా దెబ్బలు తినకండి, లేదంటే పదవిని పొందలేరు. మాయ అయితే చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది, దానితో ఇక ప్రాణమే పోతుంది. మరణించారు అంటే మళ్ళీ పుట్టినరోజును జరుపుకోలేరు. బిడ్డ మరణించాడు అని అంటారు. ఈశ్వరుని వద్ద జన్మ తీసుకొని మళ్ళీ మరణించినట్లయితే – ఈ మృత్యువు అన్నింటికంటే చెడ్డది. ఏ విషయమైనా రైట్ అనిపించకపోతే వదిలేయండి. సంశయం కలిగితే దానిని చూడకండి. బాబా అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఆనందాన్ని అనుభవం చేయాలి.

2. అనేక రకాల తుఫానులలో ఉంటూ స్వయాన్ని స్థిరంగా తయారుచేసుకోవాలి. మాయ దెబ్బల నుండి రక్షించుకోవడానికి చాలా-చాలా అప్రమత్తంగా ఉండాలి.

వరదానము:-

దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రభు ప్రసాదము. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి, ఎలాగైతే పరస్పరంలో స్నేహానికి గుర్తుగా స్థూలమైన టోలీని తినిపిస్తారో, అలా ఈ గుణాల యొక్క టోలీని తినిపించండి. ఏ ఆత్మకు ఏ శక్తి యొక్క అవసరముందో, దానిని తమ మనసా అనగా శుద్ధ వృత్తి, వైబ్రేషన్ల ద్వారా శక్తుల దానమివ్వండి మరియు కర్మల ద్వారా గుణ మూర్తులుగా అయి, గుణాలను ధారణ చేయడంలో సహయోగాన్ని ఇవ్వండి. కావున ఈ విధి ద్వారా సంగమయుగం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ‘‘ఫరిశ్తా సో దేవత’’, ఇది సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

పరమాత్మ-ప్రేమ యొక్క అనుభవంలో సహజయోగులుగా అయి ఎగురుతూ ఉండండి. పరమాత్మ-ప్రేమ ఎగిరించేందుకు సాధనము. ఎగిరేవారు ఎప్పుడూ ధరణి యొక్క ఆకర్షణలోకి రాలేరు. మాయ ఎంత ఆకర్షణీయమైన రూపంలో ఉన్నా కానీ, ఆ ఆకర్షణ ఎగిరే కళలో ఉన్నవారి వద్దకు చేరుకోలేదు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top