13 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 12, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ ముళ్ళ అడవిని దైవీ పుష్పాల తోటగా తయారుచేయాలి, కొత్త ప్రపంచ నిర్మాణాన్ని చేయాలి’’

ప్రశ్న: -

పిల్లలైన మీరు తండ్రి తో పాటు ఏ సేవ చేస్తారు, అది ఇంకెవ్వరూ చేయరు?

జవాబు:-

మొత్తం విశ్వంలో సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానిని స్థాపన చేసే సేవ పిల్లలైన మీరే తండ్రితో పాటు చేస్తారు, ఇది ఇంకెవ్వరూ చేయలేరు. మీరు ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క పునాది వేస్తున్నారంటే తప్పకుండా ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. దైవీ పుష్పాల పూదోటను తయారుచేయడము, ముళ్ళ అడవిని సమాప్తం చేయడము – ఇది కేవలం తండ్రి పనే.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ..

ఓంశాంతి. ఎప్పుడైనా ఎవరైనా సాధువులు, సత్పురుషులు లేక పండితులు భాషణ చేస్తే, మొదట ఎవరో ఒకరికి నమస్కరిస్తారు. కొందరు శివాయ నమః అని అంటారు, కొందరు కృష్ణాయ నమః అని అంటారు, కొందరు గణేశాయ నమః అని కూడా అంటారు. కానీ నమస్కరించడమైతే ఉన్నతోన్నతమైన ఒక్క తండ్రికి మాత్రమే చేయాలి. ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడు, వారి పేరు శివ అని పిల్లలకు తెలుసు. శివాయ నమః అని పాడుతారు కూడా. శివుడిని ఎప్పుడూ బాబా అని అంటారు. శివబాబా మొట్టమొదట రచనను రచిస్తారు. రచయిత ఒక్కరే, రచన కూడా వాస్తవానికి ఒక్కటే. రచయిత అని తండ్రిని మరియు రచన అని ప్రపంచాన్ని అంటారు. తండ్రి ఏ ప్రపంచాన్ని అయితే రచిస్తారో, అది తప్పకుండా కొత్తదే రచిస్తారు. కానీ తండ్రి తప్పకుండా పాత ప్రపంచంలోనే వస్తారు, అందుకే తండ్రిని పతితపావనా అని అంటారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ, అందులోనూ ముఖ్యంగా భారతవాసులు, తండ్రిని, పతితపావనా రండి అని స్మృతి చేస్తారు. ఎప్పుడైతే అందరూ దుఃఖితులుగా మరియు పతితులుగా అయిపోతారో, అప్పుడే తండ్రిని పిలుస్తారు. కానీ దుఃఖితులుగా ఎప్పుడు అయ్యారు మరియు స్మృతి ఎప్పటి నుండి చేస్తున్నారు, ఇది తెలియదు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – ఇంతకుముందు కూడా అర్థం చేయించారు, ఓ పిల్లలూ, మీకు మీ సుఖ-దుఃఖాల జన్మల గురించి తెలియదు. జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అయిన నేను కూర్చుని మీకు అర్థం చేయిస్తాను. శివబాబా అంటారు, నేను మనుష్య సృష్టి యొక్క బీజరూపుడిని కూడా, నన్ను పతితపావనా అని కూడా అంటారు, అంటే తప్పకుండా పతిత ప్రపంచం కూడా ఉంది, పావన ప్రపంచం కూడా ఉంది. పావన ప్రపంచాన్ని స్వర్గం లేక పూదోట అని అంటారు, మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అవుతుందో, అప్పుడు ముళ్ళ అడవి అని అంటారు. లెక్కలేనంత మంది మనుష్యులుంటారు. మాయా రాజ్యం ప్రారంభమైపోతుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ భగవంతుని పూదోటగా ఉండేది అని ఎవరికైనా అర్థం చేయించాలి. మనుష్యులు చాలా సుఖంగా ఉండేవారు. కొత్త ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే ఉండేది. ఇతర ఏ ఖండాల యొక్క నామ రూపాలు కూడా ఉండేవి కావు. కొత్త భారత్ లో మళ్ళీ కొత్త ఢిల్లీ కూడా ఉండేది, దానిని పరిస్తాన్ అని కూడా అనేవారు. భారత్ వజ్రం వలె ఉండేది, దానినే సుఖధామం అని కూడా అనేవారు. ఇప్పుడైతే భారత్ పాతదిగా ఉంది, దీనినే దుఃఖధామం అని అంటారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు, ఈ విశ్వం కొత్తగా ఎలా అవుతుంది అనేది మనుష్యులకు అర్థం చేయించడానికి ఈ రోజులలో ఢిల్లీలో విశ్వ నవ నిర్మాణ ప్రదర్శనీ చేస్తున్నారు. ఇంకెవ్వరూ ఇలా చిత్రాలను ఎదురుగా పెట్టుకుని అర్థం చేయించలేరు, అలాగే ఇటువంటి విశ్వ నవ నిర్మాణ ప్రదర్శనీని ఇంకెవ్వరూ తెరవలేరు. ఇదే మొదటి సారి, బ్రహ్మాకుమార-కుమారీలు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారత్ కొత్తదిగా ఉండేది, అప్పుడే సుఖంగా ఉండేవారు. లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసేవారు. విష్ణుపురి కొత్త ప్రపంచంగా ఉండేది. కొత్త ప్రపంచం యొక్క నిర్మాణము లేక పునాది వేయడము – ఇది కేవలం పరమపిత పరమాత్మ యొక్క కర్తవ్యమే. భారతవాసులు ఎవరైతే తమను తాము పతితులుగా, భ్రష్టాచారులుగా పిలుచుకుంటారో, వారు కొత్త విశ్వం యొక్క నిర్మాణాన్ని చేయలేరు. ఆ మనుష్యులు ఏ-ఏ పునాదులు వేస్తారో మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను స్వర్గము, కొత్త ప్రపంచం యొక్క పునాదిని వేస్తాను. పాత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది. ఇది ముళ్ళ ప్రపంచము. మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. భారత్ అల్లా యొక్క పూదోటగా ఉండేది. దానిని భగవంతుడు స్థాపన చేసారు. శివాయ నమః అని కూడా అంటారు. శివబాబా ఎలా స్థాపన చేసారు? తప్పకుండా బ్రహ్మా ద్వారా అల్లా యొక్క పూదోట లేక దైవీ పుష్పాల పూదోటను స్థాపన చేస్తూ ఉన్నారు. ముళ్ళ అడవిని మార్చి దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. పిల్లలకు ఆహ్వానాన్ని ఇస్తారు. ఇక్కడ కూడా పిల్లలు ఆహ్వానాన్ని అందించారు, బాబా, కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం ఎలా జరుగుతుంది అనేది మేము చిత్రాలపై ఎలా అర్థం చేయిస్తామో వచ్చి చూడండి అని. మీరు వచ్చి చూడండి మరియు శ్రీమతాన్ని ఇవ్వండి. పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రాలపై ఎవరికైనా అర్థం చేయించడం అయితే చాలా సహజము. పైన పరమపిత పరమాత్మ యొక్క చిత్రం ఉంది. శివాయ నమః, అందరికన్నా ఉన్నతమైనవారు. వారు మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కొత్త భారత్ లో ఈ దేవీ-దేవతల, లక్ష్మీనారాయణుల రాజ్యమే ఉండేది. కావున ఉన్నతోన్నతమైనవారు పరమపిత పరమాత్మ, వారు మళ్ళీ బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీల ద్వారా సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానుల స్థాపన చేస్తారు, వారు సత్యయుగ ఆదిలో ఉండేవారు అంటే స్థాపనను తప్పకుండా కలియుగ అంతిమంలోనే చేసి ఉంటారు. అది ఇప్పుడు మళ్ళీ సంగమయుగంలో చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆత్మలందరూ శివుని యొక్క సంతానము మరియు ప్రజాపిత బ్రహ్మాకు కూడా పిల్లలు. ప్రతి ఒక్క ఆత్మలో పాత్ర అంతా నిశ్చితమై ఉంది. మొదటి పాత్రధారి వీరు – వీరు పూర్తి 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. పునర్జన్మలు తీసుకునే ఆచారమైతే మొదటి నుండి నడుస్తూ వచ్చింది. సతోప్రధానులు, తర్వాత సతో, రజో, తమోగా అయ్యారు. సతోప్రధానులుగా ఉండెటప్పుడు సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. తర్వాత 14 కళల వారిగా అయ్యారు. ఈ రెండు యుగాలను పుష్పాల తోట అని అంటారు. అది సుఖధామము. ఈ చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజము. పైన శివబాబా ఉన్నారు, వారి ద్వారా విశ్వ నవ నిర్మాణం జరుగుతూ ఉంది. బ్రహ్మా, విష్ణు, శంకరులు… వారిని రచించేవారు ఈ శివబాబా. కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది అని పిల్లలు అర్థం చేయించాలి. ఇప్పుడు ఇన్ని ధర్మాలన్నీ ఉన్నాయి – కేవలం ఒక్క దేవీ-దేవతా ధర్మం లేదు. అది ప్రాయః లోపం అయ్యింది. దేవీ-దేవతా ధర్మం వారు ఎవరైతే ఉండేవారో, వారు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటున్నారు ఎందుకంటే సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు, ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. బాబా పేరే పతిత-పావనుడు. ఇప్పుడు, పతితంగా తయారుచేసేవారు ఎవరు? ఇది తండ్రే అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ ఇతర సోదరీ-సోదరులకు అర్థం చేయిస్తారు. పతితంగా తయారుచేసేది రావణుడు, అతడిని సంవత్సరం- సంవత్సరం కాలుస్తారు, రావణుడికి రూపమేమీ లేదు. అతడు గుప్తము. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషునిలోనివి. భారత్ యొక్క అతి పెద్ద శత్రువు ఈ రావణుడు, అతడు భారత్ ను గవ్వ వలె తయారుచేసాడు. ఇప్పుడు నా మతం ద్వారా ఈ రావణుని పై విజయం పొందండి. ఈ సమయంలో అందరూ పతితులుగా అయిపోయారు. అందుకే పరమపిత పరమాత్మ యొక్క శ్రీమతమే కావాలి. శ్రీమతము భగవంతునిది. భగవానువాచ, ఓ పిల్లలూ లేక ఆత్మలు, మీరు పూర్తి సమయమంతా దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఆత్మలైన మీరు అమరులు. మీరే శరీరాన్ని విడిచిపెడతారు మరియు తీసుకుంటారు. తండ్రి అంటారు, ఓ బ్రహ్మా, మీకు మీ గురించి తెలియదు. అర్ధకల్పం బ్రహ్మా యొక్క పగలు, అర్ధకల్పం బ్రహ్మా యొక్క రాత్రి అని మీ గురించే అంటూ ఉంటారు. పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు, అందుకే ప్రదర్శనీని తెరిచారు. ఇప్పుడు ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించండి. ఇప్పుడు ఈ బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీలు పరమపిత పరమాత్మ ద్వారా తమ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే అంధకారం తొలగిపోయింది… అని పాడుతారు. ఇది ఆ సూర్యుని విషయం కాదు. జ్ఞాన సూర్యుడినైన నేను ఈ సమయంలో జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నాను, దీని ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారు. వర్షపు నీరు ఎవ్వరినీ పావనంగా చేయదు. నన్ను పతితపావనా అని అంటారు – పతితుల నుండి పావనులుగా మరియు మళ్ళీ పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారు అనే జ్ఞానం నా వద్ద మాత్రమే ఉంది. పావనమని కొత్త ప్రపంచాన్ని మరియు పతితమని పాత ప్రపంచాన్ని అనడం జరుగుతుంది. పతితంగా తయారుచేసేది రావణుడు. రావణుడిని సైతాను అని మరియు రాముడిని భగవంతుడు అని అంటారు. ఆ రాముడు, సీత యొక్క రాముడు కాదు.

పిల్లలైన మీరు ఈ స్థాపన మరియు వినాశనం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. దీని కోసము ఈ విశ్వ నవ నిర్మాణ ప్రదర్శనీ ఉంది. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సుఖధామం యొక్క స్థాపన చేస్తారని ఏ శాస్త్రములోనూ లేదు. రావణుడు మళ్ళీ దుఃఖధామాన్ని తయారుచేస్తాడు. తండ్రి వచ్చి సుఖధామాన్ని తయారుచేస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము. సత్య-త్రేతాయుగాలు పగలు, ద్వాపర-కలియుగాలు రాత్రి. రాత్రి వేళ ఎదురుదెబ్బలు తింటారు. భగవంతుడిని వెతికేందుకు ఎదురుదెబ్బలు తింటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. అర్ధకల్పం జ్ఞానం, అర్ధకల్పం భక్తి. జ్ఞానసాగరుడు లేక జ్ఞానసూర్యుడు అని పరమపిత పరమాత్మనే అంటారు. భారత్ లోనే శివజయంతిని జరుపుకుంటారు. దీని ద్వారా భారత్ యే శివుని జన్మభూమి అని ఋజువవుతుంది. నేను రావడం కూడా పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది, అప్పుడే వచ్చి పతితులను పావనంగా తయారుచేయగలను. ఎవరైతే పూజ్య లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఆ లక్ష్మీ-నారాయణుల ఆత్మనే, ఎవరైతే 84 జన్మలను అనుభవించాలో, వారు భిన్న-భిన్న నామ-రూపాలలో అనుభవించాలి. కావున ఈ బ్రహ్మా, ఎవరైతే స్థాపన చేస్తారో, వారే మళ్ళీ పాలన చేస్తారు. ఇప్పుడు ఆ ఆత్మ పతితంగా అయింది కావున మళ్ళీ అతని శరీరంలోకే వచ్చి అతని పేరు బ్రహ్మా అని పెడతాను. మొట్టమొదట, పరమపిత పరమాత్మతో మీకు ఏ సంబంధముంది అన్న విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా తండ్రి అని అంటారు. వారు ఆత్మలందరికీ తండ్రి అయినట్లు. శివబాబాకు మీరంతా పిల్లలు. ఈ సమయంలో భక్తులుగా ఉన్నారు, భగవంతుడిని అందరూ స్మృతి చేస్తారు. భక్తులు అంటారు, ఓ భగవంతుడా, మాకు భక్తి ఫలాన్ని ఇవ్వండి, మేము దుఃఖితులుగా ఉన్నాము, జీవన్ముక్తిని ఇవ్వండి. సాధువులు కూడా, మాకు ముక్తి-జీవన్ముక్తిని ఇవ్వండి అని సాధన చేస్తారు. ఈ సమయంలో అందరూ పిలుస్తారు, వచ్చి పతితులను పావనంగా తయారుచేయండి అని. ఇలా-ఇలా అర్థం చేయించండి అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఆత్మలమైన మనం శాంతిధామంలో ఉండేవారము. ఇప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్రను తప్పకుండా అభినయించాలి. వర్ణాలను కూడా దాటవలసి ఉంటుంది. ఈ డ్రామా అవినాశీగా తయారుచేయబడింది. చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఎలా తిరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. పతితపావనుడు ఒక్కరు, రచయిత ఒక్కరు, ప్రపంచం కూడా ఒక్కటే. పావనుల నుండి పతితులుగా ఎలా అయ్యారు అని అడుగుతారు. రావణుని ఆసురీ మతంపై నడుచుకోవడంతో 5 వికారాలు వచ్చేస్తాయి. 5 వికారాలనే రావణ మతము అని అంటారు, అందుకే రావణుడిని కాలుస్తారు. కానీ రావణుడు కాలనే కాలడు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలూ, మీరు ఈ రావణునిపై విజయం పొందాలి, ఎవరైతే గెలుస్తారో వారే రామ రాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది అంతిమ జన్మ అనగా సృష్టి యొక్క అంతిమము. సృష్టి యొక్క ఆదిని కూడా తండ్రే చేస్తారు, అంతిమం యొక్క వినాశనాన్ని కూడా తండ్రే చేస్తారు. తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచం యొక్క పునాదిని కూడా వేయిస్తాను మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా చేయిస్తాను. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు, ఇప్పుడు కేవలం బ్రహ్మా ఒక్కరే ఉండరు. బ్రహ్మాకుమారులు మరియు కుమారీల ద్వారా భారత్ ను దైవీ పుష్పాల తోటగా తయారుచేస్తాను. ఇది ముళ్ళ అడవి. దీనికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది. మీరు ఇప్పుడు మేల్కొన్నారు, మనుష్యులైతే నిద్రించి ఉన్నారు. ఇక్కడైతే దుఃఖము, అశాంతి ఉంది. పిల్లలు ఎప్పుడూ తమ శాంతిధామాన్ని, స్వీట్ హోమ్ ను గుర్తు చెయ్యాలి. అప్పుడు స్వీట్ రాజధాని వారసత్వంగా లభిస్తుంది. ఈ రావణ రాజ్యాన్ని మర్చిపోతూ వెళ్ళండి. భారత్, ఏదైతే పరిస్తాన్ గా ఉండేదో, అది ఇప్పుడు స్మశానవాటికగా అయ్యింది, మళ్ళీ పరిస్తాన్ గా అవుతుంది. ఇది చక్రము. విశ్వం కొత్తగా తయారయ్యింది అంటే పాతదానికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం కోసం తయారవ్వాలి. తర్వాత అక్కడకు వెళ్ళి వజ్ర-వైఢూర్యాల మహళ్ళను తయారుచేస్తారు. ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి. కల్ప-కల్పము పతిత ప్రపంచం పావనంగా అవుతుంది. పావన ప్రపంచం మళ్ళీ పతితంగా అవుతుంది. పతితంగా నెమ్మది-నెమ్మదిగా అవుతారు. కొత్త ఇల్లు త్వరగా తయారవుతుంది, పాతగా అయ్యేందుకు సమయం పడుతుంది. జ్ఞానంతో మీరు కొత్త విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు 16 కళల వారిగా అవుతారు, తర్వాత 14 కళల వారిగా, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కలియుగంలో ఏ కళలు లేవు. భారత్ పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయ్యింది. ఈ ఆట భారత్ పైనే ఉంది. రావణునితో ఓడిపోతే ఓడిపోయినట్లే… ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంగా విజయాన్ని పొందుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతం ఆధారంగా భారత్ ను పావనంగా తయారుచేసే సేవ చేయాలి. రావణుని మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతంపై నడుచుకోవాలి.

2. ఈ దుఃఖధామాన్ని మరచి తమ స్వీట్ హోమ్, శాంతిధామాన్ని గుర్తు చేయాలి. స్వయాన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఒక్కొక్క బ్రాహ్మణాత్మ, శ్రేష్ఠ ఆత్మ ప్రతి కర్మలో బ్రహ్మా తండ్రి యొక్క కర్మకు దర్పణంగా ఉండాలి. బ్రహ్మా తండ్రి యొక్క కర్మలు మీ కర్మల యొక్క దర్పణంలో కనిపించాలి. ఏ పిల్లలైతే ఇంత అటెన్షన్ పెట్టి ప్రతి కర్మను చేస్తారో, వారి మాట్లాడడము, నడవడము, లేవడము, కూర్చోవడము అన్నీ బ్రహ్మా తండ్రి సమానంగా ఉంటాయి. ప్రతి కర్మ వరదాన యోగ్యంగా ఉంటుంది, నోటి నుండి సదా వరదానాలు వెలువడుతూ ఉంటాయి. అప్పుడు సాధారణ కర్మలలో కూడా విశేషత కనిపిస్తుంది. కావున ఈ సర్టిఫికెట్ తీసుకోండి, అప్పుడు తండ్రి సమానము అని అంటారు.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందంటే – సదా, పిల్లలూ, మీరు ఎవరై ఉన్నా, ఎలా ఉన్నా – నా వారు అని అంటారు. ఇలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి, హృదయపూర్వకంగా – బాబా, ఎవరై ఉన్నా అన్నీ మీరే అని అనండి. ఎప్పుడూ అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి రాకండి, తమ సత్య స్వరూపంలో స్థితులై ఉండండి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top