20 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 19, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు ఏదైతే వింటారో దానిపై విచార సాగర మథనం చేసినట్లయితే, బుద్ధిలో రోజంతా ఈ జ్ఞానం మెదులుతూ ఉంటుంది’’

ప్రశ్న: -

ఇక్కడకు చెందిన ఏ నైపుణ్యం కొత్త ప్రపంచ స్థాపన కోసం పనికొస్తుంది?

జవాబు:-

ఇక్కడ ఉన్న సైన్సు నైపుణ్యం – దేనితోనైతే విమానాలు, ఇళ్ళు మొదలైనవి తయారుచేస్తారో, ఈ సంస్కారాలను అక్కడకు కూడా తమతో పాటు తీసుకువెళ్తారు. ఇక్కడ జ్ఞానం తీసుకోకపోయినా కానీ ఈ నైపుణ్యం అక్కడకు తమతో పాటు వెళ్తుంది. ఇప్పుడు మీకు సత్యయుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు గల చరిత్ర-భూగోళాల గురించి తెలుసు. ఈ కళ్ళ ద్వారా పాత ప్రపంచానికి చెందినవి ఏవైతే చూస్తారో, అవన్నీ ఇప్పుడు సమాప్తం అవ్వనున్నాయని మీకు తెలుసు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మీరు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నారు.

ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. యథావిధిగా ఎలాగైతే 5 వేల సంవత్సరాల క్రితం అర్థం చేయించారో, అలాగే ఇప్పుడు కూడా – పాత ప్రపంచ వినాశనం మరియు కొత్త ప్రపంచం, సత్యయుగం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు, ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమయుగము. తండ్రి అర్థం చేయించారు – కొత్త ప్రపంచం, సత్యయుగం నుండి మొదలుకొని ఇప్పుడు కలియుగ అంతిమం వరకు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి సామగ్రి ఉన్నాయి, ఏమేమి చూస్తారు, యజ్ఞాలు, తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవి ఏమేమి చేస్తారు అని. ఇదంతా ఏదైతే కనిపిస్తుందో, ఇవేవీ ఉండవు. పాత వస్తువేదీ కూడా ఉండదు. ఉదాహరణకు పాత ఇంటిని పడగొట్టినప్పుడు, అందులో మార్బల్ రాళ్ళు మొదలైన మంచి వస్తువులు ఏవైతే ఉంటాయో, వాటిని ఉంచేస్తారు. మిగిలినవాటిని పడగొడతారు. ఈ పాతదంతా సమాప్తమవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇకపోతే ఈ సైన్సు నైపుణ్యం ఏదైతే ఉందో, అది నిలిచి ఉంటుంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, సత్యయుగం నుండి కలియుగ అంతిమం వరకు ఏమేమి జరుగుతాయి అనేది మీ అందరికీ తెలుసు. ఈ సైన్సు కూడా ఒక విద్య, దాని ద్వారా విమానాలు, కరెంటు మొదలైనవన్నీ తయారయ్యాయి. ముందు ఇవి ఉండేవి కావు, ఇప్పుడు తయారయ్యాయి. ప్రపంచమైతే నడుస్తూనే ఉంటుంది. భారత్ అవినాశీ ఖండము, ప్రళయమైతే జరగదు. ఏ సైన్సు ద్వారానైతే ఇప్పుడు ఇంత సుఖం లభిస్తుందో, ఆ నైపుణ్యం కూడా అక్కడ ఉంటుంది. నేర్చుకున్న విషయాలు మరుసటి జన్మలో కూడా ఉపయోగపడతాయి. ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కడైనా భూకంపం సంభవించినప్పుడు, వెంటనే మళ్ళీ అన్నీ కొత్తవి తయారుచేస్తారు. అక్కడ కొత్త ప్రపంచంలో విమానాలు మొదలైనవి తయారుచేసేవారు కూడా ఉంటారు. సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది. ఇవి తయారుచేసేవారు మళ్ళీ వస్తారు. అంత మతి సో గతి అవుతుంది. అయితే వారిలో ఈ జ్ఞానం లేనప్పటికీ, వారు తప్పకుండా వస్తారు మరియు వచ్చి కొత్త-కొత్త వస్తువులను తయారుచేస్తారు. ఈ ఆలోచనలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇవన్నీ సమాప్తమైపోతాయి, కేవలం భారత ఖండం మాత్రమే మిగిలి ఉంటుంది. మీరు యోధులు. మీ కోసం మీరు యోగబలంతో స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అంతా కొత్తదిగా ఉంటుంది. తమోప్రధానంగా ఉన్న తత్వాలు కూడా అక్కడ సతోప్రధానంగా అవుతాయి. మీరు కూడా కొత్త, పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు. మీకు తెలుసు – పిల్లలైన మేము ఇది నేర్చుకొని చాలా వివేకవంతులుగా అవుతాము, చాలా మధురమైన పుష్పాలుగా తయారవుతాము. ఎవరికైనా మీరు ఈ విషయాలను వినిపిస్తే, వారు చాలా సంతోషపడతారు. ఎవరెంత బాగా అర్థం చేయిస్తారో, వారిని చూసి అంత ఎక్కువగా సంతోషపడతారు. వీరు చాలా బాగా అర్థం చేయిస్తారని అయితే అంటారు, కానీ అభిప్రాయం రాయమని అన్నప్పుడు, ఆలోచిస్తాము అని అంటారు. ఇంతలోనే మేము ఎలా రాయాలి. ఒకసారి వినడంతోనే తండ్రితో యోగం ఎలా జోడించాలి, ఇది మేము నేర్చుకోలేము. మంచిగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం జరగనున్నదని మీరు తప్పకుండా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. తలపై పాపాల భారం చాలా ఉంది. ఇది పతిత ప్రపంచం, ఎన్నో పాపాలు చేసి ఉన్నారు. రావణ రాజ్యంలో అందరూ పతితులే, అందుకే పతితపావనుడైన తండ్రిని పిలుస్తారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకుంది. సత్యయుగంలో ఎవ్వరికీ తెలియదు దీని తర్వాత త్రేతాయుగం వస్తుంది అని. అక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత తెలివైనవారిగా అవుతారు, మనల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు), వారు శాస్త్రాల అథారిటీ. ఆ శాస్త్రాలను చదివేవారిని ఆల్మైటీ (సర్వశక్తివంతులు) అని అనరు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన శాస్త్రాలు. ఇకపోతే, బాబా మీకేదైతే చదివిస్తున్నారో, ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. బుద్ధిలో రోజంతా ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. విద్యార్థులు ఏదైతే చదువుతారో, దానిని మళ్ళీ రివైజ్ కూడా చేస్తారు. దీనినే విచార సాగర మథనమని అంటారు. బాబా మనకు అనంతమైన చదువు అనగా సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యమంతా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, దీనిని మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అందుకే మీకు చాలా సంతోషముండాలి. మీరు చాలా గొప్ప వ్యక్తులు. మిమ్మల్ని చదివించేవారు కూడా ఉన్నతోన్నతమైన తండ్రి. కావున మీకు ఎల్లప్పుడూ సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలి. ఎల్లప్పుడూ బుద్ధిలో ఈ విషయాలను రివైజ్ చేయండి – మొట్టమొదట మేము పావనంగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యాము, ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారంగా బాబా పావనంగా తయారుచేస్తున్నారు. సాధువులు-సత్పురుషులు అందరూ మాకు రచయిత అయిన తండ్రి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అంటారు. క్రైస్టు మళ్ళీ తమ సమయానికి వస్తారని మీకు తెలుసు. ఏ విధంగా అయితే క్రిస్టియన్స్ ది మొత్తం ప్రపంచం ఉండేదో, ఇప్పుడు అందరూ వేర్వేరు అయిపోయారు, పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతున్నారు. ఇప్పుడు అంటారు – ఒకే రాజ్యం, ఒకే భాష ఉండాలి. అభిప్రాయ బేధాలు ఉండకూడదు, ఇది ఎలా జరగగలదు? ఇప్పుడైతే పరస్పరం కొట్లాడుకొని ఇంకా పక్కా అయిపోయారు. అందరిదీ ఒకే దేవతా మతం ఏర్పడడం అనేది ఇప్పుడు వీలు కాదు. రామ రాజ్యం కావాలని అయితే అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మన యుగమే వేరు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సంగమయుగంలో బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ ధర్మం స్థాపనవుతుంది. బ్రాహ్మణులైన మీరు రాజఋషులు. మీరు పవిత్రంగా కూడా ఉన్నారు మరియు శివబాబా నుండి రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. వారు బ్రహ్మతత్వంతో యోగం జోడిస్తారు, ఒక్క తండ్రితో యోగం జోడించరు. కొందరు ఒక దానితో, కొందరు మరొక దానితో యోగం జోడిస్తారు. కొందరు ఒకరికి, ఇంకొందరు వేరొకరికి పూజారులుగా ఉంటారు. ఉన్నతోన్నతమైనవారు ఎవరు అనేది ఎవరికీ అసలు తెలియదు. అందుకే తండ్రి అంటారు – ఇదంతా ఆసురీ సంప్రదాయం, తుచ్ఛ బుద్ధి, రావణుడికి బానిసలు. ఇప్పుడు మీరు శివబాబాకు చెందినవారిగా అయ్యారు. మీకు తండ్రి నుండి కొత్త ప్రపంచం, సత్యయుగం యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – ఓ ఆత్మలూ, ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి, అందుకు కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఇది ఎంత సహజమైన విషయము. గీతలో కృష్ణుని పేరు వేసేశారు, మళ్ళీ వారిని ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. చాలా పెద్ద పొరపాటు చేసారు, కానీ ఎవరైతే స్థిరంగా ఇక్కడకు వస్తూ ఉంటారో, వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చొంటాయి. మేళాలకు చాలా మంది వస్తారు, వారిలో చూడండి – ఎలా అంటు కట్టడం జరుగుతుందో. అనేక ధర్మాల వారు వస్తారు, అందులో కూడా దేవీ-దేవతల పూజారులు అయిన హిందూ ధర్మం వారు ఎక్కువగా వస్తారు. తామే పూజ్యులు, తామే పూజారులు. దీని అర్థం కూడా వివరించాల్సి ఉంటుంది. మేళాలు, ప్రదర్శనీలలో అంత ఎక్కువగా అర్థం చేయించలేము. కొంతమంది 4-5 నెలలు వస్తారు, అర్థం చేసుకుంటారు, కొందరు బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఎంతగా ప్రదర్శనీలు, మేళాలు మొదలైనవి చేస్తారో, అంత ఎక్కువగా వస్తారు. ఈ జ్ఞానం చాలా బాగుంది, వెళ్ళి అర్థం చేసుకోవాలని భావిస్తారు. సెంటర్లలో ఇన్ని చిత్రాలు ఉండవు. ప్రదర్శనీలో చాలా చిత్రాలుంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు వారికి బాగుందని కూడా అనిపిస్తుంది, కాని బయటకు వెళ్ళడంతోనే మాయ యొక్క వాయుమండలం ఉంటుంది, తమ వ్యాపార-వ్యవహారాలలో నిమగ్నమైపోతారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమై, కొత్తదిగా అవుతుంది మరియు బాబా మన కోసం స్వర్గ రాజ్యాధికారాన్ని స్థాపన చేస్తున్నారు. కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళి కొత్త మహళ్ళను తయారుచేస్తాము. అంతేకానీ కింద నుండి మహళ్ళు వెలువడతాయని కాదు. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయం పై నిశ్చయముండాలి – వారు మనకు తండ్రి కూడా, టీచరు కూడా. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అందుకే జ్ఞానసాగరుడు… అని వారి మహిమను చేస్తారు. ఆ బీజం జడమైనది, అది మాట్లాడలేదు. వీరు చైతన్యమైనవారు. తండ్రి మీకు మొత్తం జ్ఞానమంతా ఇచ్చారు, దానిని మీరు ఇతరులకు బాగా అర్థం చేయించాలి. మేళాలకు, ప్రదర్శనీలకు చాలా మంది వస్తారు. కోట్లలో కొందరు మాత్రమే వెలువడతారు. 7-8 రోజులు వచ్చి తర్వాత మాయమైపోతారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఎవరో ఒకరు తప్పకుండా వెలువడతారు. సమయం తక్కువగా ఉంది, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. కర్మాతీత అవస్థను తప్పకుండా పొందాలి. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు స్మృతి చాలా అవసరము. తమను తాము సంభాళించుకోవాలి. నేను సతోప్రధానంగా అవ్వాలి అనే చింత ఎల్లప్పుడూ ఉండాలి ఎందుకంటే తలపై జన్మ-జన్మాంతరాల భారముంది. రావణ రాజ్యమైన కారణంగా మెట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు యోగబలంతో పైకి ఎక్కాలి. నేను సతోప్రధానంగా అవ్వాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో ఉండాలి. స్కూలులో కూడా మేము ఫలానా-ఫలానా సబ్జెక్టులో పాసవ్వాలని ఉంటుంది, ఇందులో ముఖ్యమైన సబ్జెక్టు – స్మృతి. సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలకు సంబంధించిన జ్ఞానం కూడా అవసరము. మీ బుద్ధిలో మొత్తం మెట్ల యొక్క జ్ఞానముంది – ఇప్పుడు మేము బాబా స్మృతితో సత్యయుగం, సూర్యవంశం యొక్క మెట్లు ఎక్కుతాము అని. 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ వచ్చాము, ఇప్పుడు వెంటనే పైకి ఎక్కాలి. సెకెండులో జీవనముక్తి అనే గాయనముంది కదా. ఈ జన్మలోనే తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకొని, మీరే దేవతలుగా అవుతారు. బాబా అంటారు – పిల్లలూ, మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశీయులు, వైశ్యవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. బ్రాహ్మణులు పిలక వంటివారు. ఉన్నతోన్నతమైన పరమపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ, దేవత, క్షత్రియ – ఈ మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణంలో ఉన్నామని, తర్వాత దేవతా వర్ణంలోకి వస్తామని మీకు తెలుసు. పిల్లలకు రోజూ ఎంతగా బుద్ధిలో జ్ఞానాన్ని నింపుతూ ఉంటారు, దానిని ధారణ చేయాలి. లేదంటే తమ సమానంగా ఎలా తయారుచేస్తారు. సూర్యవంశంలోకి చాలా కొద్ది మంది వస్తారు, ఎవరైతే మంచి రీతిలో చదువుతారో మరియు చదివిస్తారో వారే అందులోకి వస్తారు.

ఈ సమయంలో మీ గతి-మతి ప్రపంచానికి పూర్తిగా అతీతంగా ఉంది. ఈశ్వరుని గతి-మతి అతీతము అని అంటారు. మీరు తప్ప తండ్రితో ఎవ్వరూ యోగం జోడించరు. ప్రదర్శనీలకు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వారు ప్రజలుగా అవుతారు. ఎవరైతే మంచి రీతిగా చదువుతారో, చదివిస్తారో, వారు మంచి పదవి పొందుతారు. తర్వాత మీ ఈ మిషనరీ (సంస్థ) కూడా జోరు పుంజుకుంటుంది. చాలా మందికి ఆకర్షణ కలుగుతుంది, వస్తూ ఉంటారు. కొత్త విషయం వ్యాపించేందుకు సమయమైతే పడుతుంది కదా. చిత్రాలు కూడా వెంటనే చాలా తయారవుతాయి. రోజురోజుకూ మనుష్యులు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు.

ఈ బాంబులు మొదలైనవాటితో యుద్ధం జరిగిందంటే, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో మీకు తెలుసు. రోజురోజుకు దుఃఖం పెరుగుతూ ఉంటుంది. చివరికి ఈ దుఃఖపు ప్రపంచం సమాప్తమవుతుంది. పూర్తిగా వినాశనమవ్వదు. శాస్త్రాలలో, ఈ భారత్ అవినాశీ ఖండము అనే గాయనముంది. మన స్మృతి చిహ్నము అచ్చంగా అలాగే అబూలో ఉందని మీకు తెలుసు. దాని గురించి అర్థం చేయించాలి, అవి జడమైన స్మృతిచిహ్నాలు. ఇక్కడ ప్రాక్టికల్ గా స్థాపన జరుగుతుంది. వైకుంఠం కోసం రాజయోగం నేర్చుకుంటున్నారు. దిల్వాడా మందిరం ఎంత బాగా నిర్మించబడి ఉంది. మనం కూడా ఇక్కడకు వచ్చి కూర్చొన్నాము. ముందు నుండే మన స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి. మీరు స్వర్గ రాజ్యాధికారాన్ని పొందేందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు. బాబా, మేము మీ నుండి రాజ్యం తీసుకునే తీరుతాము అని అంటారు. ఎవరైతే రోజంతా బాగా స్మరణ చేస్తారో మరియు చేయిస్తారో, వారికే సంతోషం కూడా ఉంటుంది. విద్యార్థులు స్వయం అర్థం చేసుకుంటారు – మేము పాస్ అవుతామా, లేదా అని. లక్షలు, కోట్లాది మందిలో స్కాలర్షిప్ ఎంత కొద్ది మందికి లభిస్తుంది. ముఖ్యమైనవి 8 బంగారంవి, తర్వాత 108 వెండివి, తర్వాత మిగిలిన 16 వేలు రాగివి. ఉదాహరణకు పోప్ మెడల్స్ ఇచ్చినప్పుడు అందరికీ బంగారంవి ఏమీ ఇవ్వరు. కొంతమందికి బంగారంవి, కొంతమందికి వెండివి ఇస్తారు. మాల కూడా అదే విధంగా తయారవుతుంది. మీరు గోల్డెన్ ప్రైజ్ తీసుకోవాలని అనుకుంటారు. వెండిది తీసుకుంటే చంద్రవంశంలోకి వచ్చేస్తారు. బాబా అంటారు – నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఉపాయము లేదు. పాస్ అవ్వాలి అనే చింత పెట్టుకోండి. యుద్ధం యొక్క హంగామా ఇంకొంచెం పెరిగిందంటే, ఇక తీవ్రంగా పురుషార్థం చేయడం మొదలుపెడతారు. పరీక్షల సమయంలో విద్యార్థులు కూడా వేగంగా ముందుకు వెళ్ళేందుకు పురుషార్థంలో నిమగ్నమవుతారు. ఇది అనంతమైన స్కూల్, ప్రదర్శనీ పై బాగా ప్రాక్టీసు చేస్తూ ఉండండి. ఎంతగా అయితే ప్రదర్శనీ చూసి ఆశ్చర్యపోతారో, అంతగా ప్రొజెక్టర్ ద్వారా ప్రభావితులవ్వరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాత ప్రపంచం వినాశనమవ్వక ముందే తమ కర్మాతీత అవస్థను తయారుచేసుకోవాలి, స్మృతిలో ఉంటూ సతోప్రధానంగా అవ్వాలి.

2. మమ్మల్ని చదివించేవారు స్వయం ఉన్నతోన్నతమైన తండ్రి అనే సంతోషం సదా ఉండాలి. మంచి రీతిగా చదువుకోవాలి మరియు చదివించాలి. విన్న తర్వాత విచార సాగర మథనం చేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే ఆత్మాభిమానులుగా అవుతారో, వారు సహజంగానే నిర్వికారులుగా అవుతారు. ఆత్మాభిమాని స్థితి ద్వారా మనసులో కూడా నిర్వికారితనపు స్థితి అనుభవమవుతుంది. ఇటువంటి నిర్వికారులు, ఎవరినైతే ఎలాంటి రకమైన అపవిత్రత లేక 5 తత్వాల ఆకర్షణ ఆకర్షించదో, వారే ఫరిస్తాలని పిలవబడతారు. దీని కోసం సాకారంలో ఉంటూ తమ నిరాకారి, ఆత్మాభిమాని స్థితిలో స్థితులై ఉండండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top