14 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 13, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరిప్పుడు సత్యాతి-సత్యమైన సత్సంగంలో కూర్చొన్నారు, సత్యమైన తండ్రి మీకు సత్య ఖండంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తున్నారు”

ప్రశ్న: -

ఏ నిశ్చయం ఆధారంగా పావనంగా అయ్యే శక్తి స్వతహాగా వస్తుంది?

జవాబు:-

ఈ మృత్యులోకంలో ఇప్పుడిది మన అంతిమ జన్మ, ఈ పతిత ప్రపంచం వినాశనం అయ్యేది ఉంది. తండ్రి శ్రీమతం ఉంది – పావనంగా అయినట్లయితే, పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ విషయం పట్ల నిశ్చయం ఉంటే పావనంగా అయ్యే శక్తి స్వతహాగా వస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి ఆ రోజు రానే వచ్చింది.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మీకు వజ్ర తుల్యమైనది, ఈ పాటను తయారుచేసిన వారికి ఇది గవ్వ సమానమైనది. వారైతే చిలుక వలె పాడుతూ ఉంటారు. అర్థమేమీ తెలియదు. మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కలియుగం మారి సత్యయుగం లేదా పతిత ప్రపంచం మారి పావన ప్రపంచంగా అయ్యే రోజు వచ్చింది. ఓ పతితపావనా రండి, అని మనుష్యులు పిలుస్తారు కూడా. పావన ప్రపంచంలో ఎవ్వరూ పిలవరు. మీకు ఈ పాట యొక్క అర్థం మంచి రీతిగా తెలుసు, వారికి తెలియదు. భక్తి యొక్క సంస్కృతి అర్ధకల్పం నడుస్తుందని మీకు తెలుసు. ఎప్పటినుండైతే రావణరాజ్యం మొదలవుతుందో, అప్పటి నుండి భక్తి మొదలవుతుంది. మెట్లు దిగాల్సి వస్తుంది. ఈ రహస్యం పిల్లల బుద్ధిలో కూర్చొని ఉంది. భారతవాసులు ఎవరైతే 16 కళా సంపూర్ణులుగా ఉండేవారో, వారే 14 కళలు ఉన్నవారిగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా 16 కళా సంపూర్ణులుగా ఎవరైతే అయ్యి ఉంటారో, వారే 14 కళలు ఉన్నవారిగా అవుతారు. లేదంటే ఎవరు అవుతారు! మీరు 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా అవుతున్నారు. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. ప్రపంచం యొక్క కళ కూడా తగ్గుతూ వస్తుంది. భవనం మొదట సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత తప్పకుండా తమోప్రధానంగా అవుతుంది. సతోప్రధాన ప్రపంచమని సత్యయుగాన్ని, తమోప్రధాన ప్రపంచమని కలియుగాన్ని అనడం జరుగుతుంది. సతోప్రధానంగా ఉన్నవారే తమోప్రధానంగా అవుతారు ఎందుకంటే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. అందుకే కొత్త ప్రపంచం, కొత్త రాజ్యం కావాలని కోరుకుంటారు. కొత్త ప్రపంచంలో ఎవరి రాజ్యం ఉండేదో ఎవ్వరికీ తెలియదు. మీకు ఈ సత్సంగం ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి. సత్యాతి-సత్యమైన సత్సంగం ఈ సమయంలో ఇదే, తర్వాత భక్తి మార్గంలో దీని గాయనం నడుస్తుంది. కనుక ఇది పరంపరగా నడుస్తూ వస్తుందని అంటారు కదా. కానీ సత్యాతి-సత్యమైన సత్సంగం ఇదేనని మీకు తెలుసు. ఇక మిగిలినవన్నీ అసత్యపు సాంగత్యాలు. వాస్తవానికి అవి సత్సంగాలే కావు. వాటి వలన పడిపోవడమే జరుగుతుంది. ఈ సత్సంగమే అన్నింటికంటే పెద్ద పండుగ. ఒక్క సత్యమైన తండ్రితో సాంగత్యం ఏర్పడుతుంది. మిగిలిన వారెవ్వరూ సత్యం మాట్లాడనే మాట్లాడరు. ఇది అసత్యమైన ఖండము, అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము… ఈశ్వరుడు సర్వావ్యాపి అని మొట్టమొదట ఈశ్వరుని గురించే అసత్యం చెప్తారు. అల్ఫ్ నే అసత్యంగా చేసేసారు. కనుక మీరు మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అక్కడ అసత్యమైన పరిచయాన్ని ఇస్తారు. అసత్యమే అసత్యముంది, ఏ మాత్రం సత్యం లేదు. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. అంతేకానీ, నీటిని నీరు అని అనడం అసత్యం కాదు. ఇవి జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క విషయాలు. జ్ఞానం ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. సత్యయుగంలో అసత్యం ఉండదు. రావణుడు వచ్చి సత్య ఖండాన్ని అసత్య ఖండంగా చేస్తాడు. తండ్రి అంటారు – నేను ఏమి సర్వవ్యాపిని కాను, నేనే సత్యాన్ని తెలియజేస్తాను, నేనే వచ్చి సత్యమైన మార్గాన్ని అనగా సత్య ఖండంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తాను, నేనే ఉన్నతాతి ఉన్నతమైన మీ తండ్రిని. మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకే వస్తాను. పిల్లలైన మీ కోసం నేను బహుమతి తీసుకొస్తాను. నా పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ రచయిత). అరచేతిలో స్వర్గాన్ని తీసుకొస్తారు. స్వర్గంలో స్వర్గవాసులైన దేవతల రాజ్యాధికారం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారు. సత్యమైన వారైతే ఒక్క తండ్రి మాత్రమే. అందుకే తండ్రి అంటారు – చెడు వినకండి, చెడు చూడకండి… వీరందరూ మరణించే ఉన్నారు. ఇది శ్మశానవాటిక, దీనిని చూస్తూ కూడా చూడకండి. కొత్త ప్రపంచం కోసం మీరు యోగ్యులుగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు, అనగా స్వర్గానికి యోగ్యులుగా లేరు. తండ్రి అంటారు – రావణుడు మిమ్మల్ని అయోగ్యులుగా చేసాడు. అర్ధకల్పం కోసం మళ్ళీ తండ్రి వచ్చి యోగ్యులుగా తయారుచేస్తారు. మరి వారి శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది, తర్వాత బాధ్యత అంతా వారిదే అవుతుంది. తండ్రి మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారుచేసే బాధ్యతను తీసుకున్నారు. వారు ఇచ్చే మతము కల్పక్రితానికి చెందినదే, ఇందులో తికమకపడకూడదు. ఏదైతే గతించిందో, అది డ్రామానుసారంగా జరిగిందని అంటారు. విషయం అక్కడితో సమాప్తమవుతుంది. ఇది చేయండి అని శ్రీమతం చెప్తే అది చేయాలి. స్వయం వారే బాధ్యులు, ఎందుకంటే వారే కర్మలకు శిక్షలను ఇప్పిస్తారు. కనుక వారి మాటను అంగీకరించాలి. వారంటారు – మధురమైన పిల్లలూ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఈ మృత్యులోకంలో ఇది మన అంతిమ జన్మ. ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడే పావనంగా అవ్వగలరు.

పతిత ప్రపంచ వినాశనం అవ్వవలసి ఉన్నప్పుడే తండ్రి వస్తారు. మొదట స్థాపన తర్వాత వినాశనం అన్న పదాలను కూడా అర్థ సహితంగా రాయవలసి ఉంటుంది. అంతేకానీ, స్థాపన, పాలన, వినాశనం అని రాయకూడదు. మనం చదువుకొని ఉన్నతమైన పదవిని పొందుతామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. దీనిని బుద్ధిలో దృఢంగా ఉంచుకోవాలి. చాలామంది పిల్లలు బాగా అర్థం చేయిస్తారు, కానీ ఎవ్వరికీ ఆ లోతైన సుఖం లేదు. చిలుకలాగా స్మృతి చేస్తూ ఉంటారు కదా. మీ బుద్ధిలో కూడా దృఢమైన ధారణ జరగాలి. శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అవి భక్తి మార్గానికి చెందినవని మీకు తెలుసు. అందుకే, ఇప్పుడు సత్యం ఏమిటో మీరే నిర్ణయించుకోండి అని అర్థం చేయించడం జరుగుతుంది. సత్యనారాయణ కథను మీకు ఒక్కసారి తండ్రే వినిపిస్తారు. తండ్రి ఎప్పుడూ అసత్యం చెప్పలేరు. తండ్రియే సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు, సత్యమైన కథను వినిపిస్తారు. ఇందులో అసత్యం ఉండదు. మనం ఎవరితో కూర్చొన్నాము అని పిల్లలకు నిశ్చయముండాలి. తండ్రి మనకు తమతో యోగాన్ని జోడించడం నేర్పిస్తారు. సత్యమైన అమరకథను లేదా సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. దీని ద్వారా మనం నరుని నుండి నారాయణునిగా తయారవుతున్నాము. తర్వాత భక్తి మార్గంలో దీని గురించే మహిమ నడుస్తుంది. ఇది బుద్ధిలో ఉండాలి – మనల్ని మనుష్యులెవ్వరూ చదివించడం లేదు. ఆత్మలైన మనల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. ఆత్మల తండ్రి అయిన శివబాబా మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మనం శివబాబా సమ్ముఖంలో కూర్చొన్నాము. మధుబన్ కు వచ్చినప్పుడు నషా ఎక్కుతుంది. ఇక్కడ మీకు రిఫ్రెష్మెంట్ లభిస్తుంది, మీరు రియలైజ్ అవుతారు, కనుక ఇక్కడకు కొద్ది సమయం కోసం వచ్చినా రిఫ్రెష్ అవుతారు. బయట అయితే చిక్కు పనులు మొదలైనవి ఉంటాయి. తండ్రి ఓ ఆత్మలూ, అని అంటారు. తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. తండ్రి కూడా నిరాకారుడు, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరులను గురించి కూడా తెలియదు. చిత్రాలైతే అందరి వద్దా ఉన్నాయి. కాగితపు చిత్రాలను చూసి కొందరు చింపేస్తారు. కొందరినైతే చూడండి, ఎంత దూర-దూరాలకు వెళ్ళి ఎన్ని పూజలు మొదలైనవి చేస్తారు. చిత్రాలనైతే ఇంట్లో కూడా పెట్టుకుంటారు కదా! మరి అంత దూరం వెళ్ళి భ్రమించడం వలన లాభమేమిటి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది, అందుకే, అది వ్యర్థమని అనిపిస్తుంది. ఇక్కడ కూడా కృష్ణుడిది నల్లని లేదా సుందరమైన రాతి విగ్రహం తయారవ్వగలదు. మరి జగన్నాథపురికి ఎందుకు వెళ్తారు? ఈ విషయాల గురించి కూడా మీకు తెలుసు, మరి కృష్ణుడిని శ్యామసుందరుడని ఎందుకంటారు? ఆత్మ తమోప్రధానంగా అవ్వడం వలన నల్లగా అయిపోతుంది. తర్వాత ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన సుందరంగా అయిపోతుంది. ఈ భారత్ యే స్వర్ణిమ యుగంగా ఉండేది, 5 తత్వాలకు కూడా సహజమైన సౌందర్యం ఉంటుంది. శరీరాలు కూడా అలాగే సుందరంగా తయారవుతాయి. ఇప్పుడు తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్న కారణంగా శరీరాలు కూడా అదే విధంగా నల్లగా, కొందరివి వంకరగా, కొందరివి వికలాంగుల వలె తయారవుతూ ఉంటాయి. దీనిని నరకమని అంటారు. ఇది మాయా ఆర్భాటము. విదేశాలలో లైట్లు ఎలా ఉంటాయంటే, ప్రకాశముంటుంది, కానీ లైట్లు కనిపించవు. అక్కడ కూడా అలాంటి ప్రకాశముంటుంది. విమానాలు మొదలైనవి అక్కడ కూడా ఉంటాయి. సైన్సు గర్వం కలవారు కూడా ఇక్కడకు వస్తారు. తర్వాత అక్కడ కూడా విమానాలు మొదలైనవన్నీ తయారవుతాయి. మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా మీకు అన్నీ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. కరెంటు పని చేసేవారు మొదలైనవారంతా వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు. కొద్దిగా జ్ఞానము తీసుకున్నా ప్రజలలోకి వస్తారు. నైపుణ్యాన్ని తమతో పాటు తీసుకువెళ్తారు, అంత మతి సో గతి ఏర్పడుతుంది. మీ లాగ కర్మాతీత అవస్థనైతే పొందరు. ఇకపోతే, ఆత్మ నైపుణ్యాన్ని అయితే తీసుకువెళ్తుంది కదా. టెలివిజన్ మొదలైన వాటి ద్వారా దూరంగా కూర్చొనే చూస్తూ ఉంటారు. రోజు-రోజుకు ప్రయాణాలు చేయడం కష్టమవుతుంది. ప్రపంచంలో ఏవేవో పరిశోధనలు చేసి వస్తువులను కనిపెడతారు. ప్రకృతి వైపరీత్యాలలో కూడా ఎంతోమంది మరణిస్తారు, వరదలు మొదలైనవి సంభవిస్తాయి. సముద్రం కూడా ఉప్పొంగుతుంది. సముద్రాన్ని కూడా ఎండబెట్టారు కదా.

ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు – ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, తర్వాత కొత్త ప్రపంచంలో ఏమేమి ఉంటాయి అని. కేవలం భారత ఖండం మాత్రమే ఉంటుంది. అది కూడా చిన్నదిగా ఉంటుంది. మిగిలిన వారంతా పరంధామానికి వెళ్ళిపోతారు. ఇంకా ఎంత సమయం మిగిలి ఉంటుంది, ఇవేమీ ఇక ఉండవు. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మీ కోసం పాత ప్రపంచ వినాశనం ముందు నుండే నిశ్చితమై ఉంది. ఈ ఛీ-ఛీ ప్రపంచంలో మీరు ఇంకా కొద్ది రోజులే ఉంటారు. తర్వాత తమ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. కేవలం మీరు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నా, సంతోషంలో ఉంటారు. ఇదంతా సమాప్తం అవ్వనున్నదని మీ బుద్ధిలో ఉంది. ఇన్ని ఖండాలు ఉండవు. ప్రాచీన భారత ఖండం ఒక్కటే ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉండండి, పనులు మొదలైనవి చేస్తూ ఉండండి, బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే కోర్సును తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఉద్యోగం చేసుకుంటూ తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయండి. ఏకాంతంలో కూర్చొని విచార సాగర మథనం చేయండి. ప్రాకృతిక ఆపదలు వస్తాయి, వాటితో మొత్తం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. అక్కడ కాలువలు మొదలైనవాటి అవసరం ఉండదు. ఇక్కడైతే ఎన్ని కాలువలను తవ్వుతారు. నదులైతే అనాదిగా ఉన్నాయి. సత్యయుగంలో యమునా నది తీరం ఉంటుంది. అక్కడ అన్నీ తియ్యని నదీ తీరాలలో మహళ్ళు ఉంటాయి. ఈ బొంబాయి ఉండదు. దీనిని ఎవ్వరూ కొత్త బొంబాయి అని అనరు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి – మనం స్వర్గం కోసం రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, తర్వాత ఈ నరకం ఉండనే ఉండదు. రావణపురి సమాప్తమైపోతుంది, రామపురి స్థాపనవుతుంది. తమోప్రధాన పృథ్వి పైన దేవతలు పాదం మోపలేరు. ఎప్పుడైతే పరివర్తన జరుగుతుందో, అప్పుడే పాదాన్ని మోపుతారు. అందుకే లక్ష్మిని ఎప్పుడైతే పిలుస్తారో, అప్పుడు శుభ్రం చేస్తారు. లక్ష్మీని ఆహ్వానిస్తారు, చిత్రాన్ని ఉంచుతారు. కానీ వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. అందుకే విగ్రహారాధకులు అని అంటారు. రాతి విగ్రహాన్ని భగవంతుడు అని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. పరమాత్మయే కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మ, ఆత్మకు అర్థం చేయించలేదు. ఆత్మ ఏ విధంగా మరియు ఏ-ఏ పాత్రలను అభినయిస్తుందో అది కూడా మీరిప్పుడు అర్థం చేయించగలరు. ఆత్మ అంటే ఏమిటో తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు. మనుష్యులకైతే ఆత్మ గురించి గానీ, పరమాత్మ గురించి గానీ తెలియదు. మరి వారిని ఏమంటారు. మనుష్యులై ఉండి కూడా నడవడిక జంతువుల వలె ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మెట్ల చిత్రంపై ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. అది కూడా హృదయపూర్వకంగా అర్థం చేయించాలి. భారతవాసులైన మనము, ఎవరైతే దేవీ-దేవతా ధర్మం వారిగా ఉండేవారమో, వారు సతోప్రధానంగా ఎలా అయ్యారు, తర్వాత సతో, రజో, తమోలలోకి ఎలా వచ్చారు – ఈ విషయాలన్నీ ధారణ చేయాల్సి ఉంటుంది, అప్పుడే విచార సాగర మథనం జరుగుతుంది. ధారణయే జరగకపోతే, విచార సాగర మథనం జరగదు. విన్నారు, మళ్ళీ కార్య-వ్యవహారాలలో నిమగ్నమైపోతారు. విచార సాగర మథనం చేసేందుకు సమయం లేదు. లేదంటే పిల్లలైన మీరు రోజూ చదువుకోవాలి మరియు దానిపై విచార సాగర మథనం చేయాలి. మురళీ అయితే ఎక్కడైనా లభించగలదు. విశాలబుద్ధి కలవారిగా అయితే పాయింట్లను అర్థం చేసుకుంటారు. బాబా రోజూ అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. గంగా గురించి కూడా మీరు వెళ్ళి అర్థం చేయించవచ్చు – సర్వుల సద్గతిదాత బాబానా లేక నీటి గంగనా, మీరెందుకు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఒకవేళ గంగా స్నానాల ద్వారా పావనంగా అవ్వగలిగితే గంగా తీరంలో కూర్చుండిపోండి. బయటకు రావడం ఎందుకు! తండ్రి అయితే అంటారు – శ్వాస-శ్వాసలో నన్ను స్మృతి చేయండి. ఇదే యోగాగ్ని, యోగము అనగా స్మృతి. వివరణ అయితే చాలా ఉంది. కానీ సతోప్రధాన బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు. కొందరు రజో, కొందరు తమో బుద్ధి కలవారిగా కూడా ఉన్నారు. ఇక్కడ క్లాసులో నంబరు వారుగా కూర్చోబెట్టడం జరగదు. లేదంటే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. డ్రామా ప్లాను అనుసారంగా మొత్తం రాజధాని అంతా స్థాపనవుతుంది. తర్వాత సత్యయుగంలో ఏమైనా తండ్రి చదివిస్తారా. తండ్రి చెప్పే చదువు ఈ ఒక్క సమయంలోనే ఉంటుంది. తర్వాత భక్తి మార్గంలో అసత్యపు విషయాలను తయారుచేస్తారు. అద్భుతమేమిటంటే – ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, వారి పేరును గీతలో రాసేసారు మరియు ఎవరైతే పునర్జన్మ రహితులుగా ఉన్నారో, వారి పేరునే మాయం చేసేసారు. కనుక 100 శాతం అసత్యమైనట్లే కదా.

పిల్లలు చాలామంది కళ్యాణం చేయాలి. మీదంతా గుప్తము. ఇక్కడ బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు మీ కోసం స్వర్గం యొక్క సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానులను స్థాపన చేస్తున్నారు. ఇది కూడా ఎవరి బుద్ధిలోకీ రాదు. మీలో కూడా మర్చిపోతూ ఉంటారు, మరి ఇతరులు ఏం తెలుసుకుంటారు. మీరు ఇది మర్చిపోకుండా ఉంటే, సదా సంతోషంగా ఉంటారు. మర్చిపోవడం వలనే గుటకలు మింగుతూ ఉంటారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోతైన సుఖాన్ని అనుభవం చేసేందుకు తండ్రి ఏదైతే చదివిస్తారో, దానిని బుద్ధిలో ధారణ చేయాలి. విచార సాగర మథనం చేయాలి.

2. ఈ శ్మశానవాటికను చూస్తూ కూడా చూడకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి… కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవ్వాలి.

వరదానము:-

కేవలం శబ్దం ద్వారా సేవ చేయడంతో ప్రజలు తయారవుతూ ఉన్నారు. కానీ శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితులై తర్వాత శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి తర్వాత శబ్దము – ఇలాంటి కంబైండ్ రూపం యొక్క సేవ వారసులను తయారుచేస్తుంది. శబ్దం ద్వారా ప్రభావితమైన ఆత్మలు, అనేక ఇతర శబ్దాలు వినడం వలన రాకపోకలలోకి వచ్చేస్తారు, కానీ కంబైండ్ రూపధారులుగా అయి కంబైండ్ రూపం యొక్క సేవ చేసినట్లయితే, వారిపై ఏ విధమైన ప్రభావము పడలేదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top