11 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 10, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరిప్పుడు అద్భుతమైన ఆత్మిక యాత్రికులు, మీరు ఈ యాత్ర ద్వారా 21 జన్మల కోసం నిరోగులుగా అవ్వాలి”

ప్రశ్న: -

సత్యయుగంలో ఏ వస్తువు ఉపయోగపడదు, అది భక్తి మార్గంలో తండ్రికి ఉపయోగపడుతుంది?

జవాబు:-

దివ్య దృష్టి యొక్క తాళంచెవి. సత్యయుగంలో ఈ తాళంచెవి అవసరం ఉండదు. భక్తి మార్గం మొదలైనప్పుడు, భక్తులను సంతోషపరిచేందుకు సాక్షాత్కారాలు చేయించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఈ తాళంచెవి తండ్రికి ఉపయోగపడుతుంది. అందుకే తండ్రిని దివ్య దృష్టి దాత అని అంటారు. తండ్రి పిల్లలైన మీకు విశ్వ రాజ్య భాగ్యాన్ని ఇస్తారు, కానీ దివ్య దృష్టి తాళం చెవిని కాదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మరణించినా నీ దారిలోనే..

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలను ఇంగ్లీషులో ‘స్పిరీచ్యుల్ చిల్డ్రన్’ అని అంటారు. స్పిరీచ్యుల్ ఫాదర్ మరియు స్పిరీచ్యుల్ చిల్డ్రన్. ఆత్మలైన మనకు అక్కడ శరీరముండదని, అందుకే అక్కడ ఎటువంటి ఆత్మిక సంభాషణ జరగదని ఆత్మిక పిల్లలకు ఇప్పుడు తెలుసు. ఆత్మతో ఆత్మిక సంభాషణ అనగా మాట్లాడడం అనేది ఇరువురికీ శరీరాలు ఉన్నప్పుడే జరుగుతుంది. ఆత్మలకు ఇక్కడైతే తమ-తమ శరీరాలున్నాయి. ఇకపోతే, నాలెడ్జ్ ఫుల్ అయిన ఆత్మిక తండ్రికి తమకంటూ శరీరం లేదు. వారు ఉన్నదే నిరాకారుడు. శాంతిధామంలో ఆత్మలైన మనం అశరీరిగా ఉంటామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే తండ్రి కూడా అశరీరి లేక విచిత్రుడో, అలాగే ఆత్మలైన మీరు కూడా శరీరాలు లేకుండానే అక్కడ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. వివస్త్రలుగా వచ్చాము, వివస్త్రలుగా వెళ్ళాలి అని అంటారు కూడా అనగా ఈ శరీరం రూపీ వస్త్రం అక్కడ ఉండదు. ఆత్మ శాంతిధామంలో ఉన్నప్పుడు అశరీరిగా, ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మొత్తం ప్రపంచంలో ఆత్మిక తండ్రి ఇంకెవ్వరూ లేరు. మిగిలినవారంతా దైహిక తండ్రులు. ఆత్మిక తండ్రి స్వయంగా చెప్తున్నారు – నేను అశరీరిని, మాట్లాడే సమయంలో శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి ఉంటుందని శాస్త్రాలలో పదాలున్నాయి. కానీ తండ్రి అర్థం చేయిస్తారు – ప్రకృతితో శరీరం తయారుచేయబడి ఉంది. నేను సాధారణ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను.

ఆత్మిక తండ్రిని ఆత్మిక సర్జన్ అని అంటారు ఎందుకంటే స్మృతిని లేదా యోగాన్ని నేర్పిస్తారు, దీనితో మన ఆత్మ సదా నిరోగిగా అయిపోతుంది. 21 జన్మలు ఎప్పుడూ రోగులుగా అవ్వరు. తర్వాత మాయ రాజ్యం ఉన్నప్పుడు మనం రోగులుగా అయిపోతాము. తండ్రి వచ్చి మనల్ని 21 జన్మల కోసం నిరోగులుగా తయారుచేస్తారు. తండ్రిని యాత్రను నేర్పించే పండా అని కూడా అంటారు. మనం అద్భుతమైన ఆత్మిక యాత్రికులము. ఈ ఆత్మిక యాత్ర గురించి ప్రపంచంలోని మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ముఖ్యంగా భారత్ మరియు మొత్తం ప్రపంచం, అని ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. విశేషంగా మనకు ఈ ఆత్మిక యాత్రను నేర్పించడం జరుగుతుంది. ఎవరు నేర్పిస్తారు. స్పిరీచ్యుల్ ఫాదర్. భౌతిక యాత్రలనైతే మనుష్యులు జన్మ-జన్మలుగా చేస్తూనే వచ్చారు. కొంతమందైతే ఒక్క జన్మలో 2-4 యాత్రలను కూడా చేస్తారు. దానిని జీవాత్మల యాత్ర అని అంటారు మరియు ఇది ఆత్మల యాత్ర. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో బాబాను గుర్తు చేసినట్లయితే, అంత మతి సో గతి అవుతుంది. మనం బాబా స్మృతిలో బాబా వద్దకు వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఈ యాత్రను నేర్పిస్తారు. గీతలో మన్మనాభవ అనే పదం ఉంది కానీ దాని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోరు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే, మీ పాపాలు భస్మమైపోతాయి. తర్వాత ఏం జరుగుతుంది? మనం స్మృతి ద్వారా తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. వృక్షమంతా శిథిలావస్థగా అయిపోయింది. ఇప్పుడు ఆత్మ సతోప్రధానంగా ఎలా అవుతుంది? తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడైతే పవిత్రాత్మలే ఉంటాయి. తర్వాత ఇక్కడ శరీరాలను ధారణ చేస్తూ రజో, తమోలలోకి వస్తాయి. ప్రతి వస్తువుకు దశలుంటాయి. ప్రపంచం మారుతుంది అని పాడుతారు కూడా. దీనిని పాత ప్రపంచం ఇనుప యుగము, కొత్త ప్రపంచాన్ని స్వర్ణిమ యుగం, సత్యయుగం అని అంటారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఈ విషయం ఉండాలి. సత్యయుగం ఉన్నప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు ఆ ధర్మం లేదు. దైవీ ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం… ఇవి ముఖ్యమైనవి. 4 ముఖ్యమైన యుగాలు ఉంటాయని యుగాల గురించి కూడా అర్థం చేయించారు. ఇకపోతే, ఈ బ్రాహ్మణుల సంగమయుగం గుప్తమైనది. పరమపిత పరమాత్మయే వచ్చి బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు. ఈ విషయాలన్నింటినీ పిల్లలు గుర్తుంచుకోవాలి మరియు తమ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. వికర్మాజీతులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. నిజంగా మనం సతోప్రధానంగా పవిత్రంగా ఉండేవారము. నిజానికి 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారము. తర్వాత సతోలోకి వచ్చాము, 22 క్యారెట్లుగా అయ్యాము. ఆ తర్వాత రజోలో 18 క్యారెట్లు, తమోలో 9 కారెట్లు కలవారిగా అయ్యాము. బంగారానికి డిగ్రీలుంటాయి. ఇది ఆత్మకు సంబంధించిన విషయము. ఎలాగైతే, భ్రమరీ ఛీ-ఛీ పేడ పురుగులను తీసుకొస్తుంది, కూర్చుని వాటిని తన సమానంగా తయారుచేస్తుంది. మీరు కూడా భూ-భూ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు. భ్రమరం పేడ పురుగులను తీసుకొచ్చి ఇంట్లో ఏకాంతంలో కూర్చోబెడుతుంది, వాటికి కూడా ఎంత తెలివి ఉంది. డ్రామానుసారంగా మీ ఆత్మలో కూడా పాత్ర నిశ్చియించబడి ఉంది.

కల్పక్రితం కూడా మనం ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక జ్ఞానాన్ని విన్నామని మీకు తెలుసు. కల్ప-కల్పం వింటూ ఉంటారు. నథింగ్ న్యూ కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని కూడా తండ్రియే అర్థం చేయించగలరు. వృక్షం గురించి బీజానికే తెలుస్తుంది కదా! మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేయడానికి తండ్రి వస్తారు. మూడు కాలాల జ్ఞానాన్ని ఇస్తారు కదా! జీవించి ఉండగానే మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. ఎలాగైతే కన్యను కూడా జీవిస్తూనే దత్తత తీసుకుంటారు – ఈమె నా స్త్రీ అని అంటారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మాకు స్త్రీ లేనే లేదు, అందుకే వీరు దత్తత తీసుకోబడతారు, పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. వీరు మా బాబా అని మీరు కూడా అంటారు. పరమపిత పరమాత్మ తండ్రి కూడా – మీరు నా పిల్లలు అని అంటారు. ఆ శివబాబా ఆత్మికమైనవారు, ప్రజాపిత బ్రహ్మా దాదా దైహికమైనవారు. ఆత్మిక తండ్రి శరీరంలోకి రానంతవరకు జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు. పరమపిత పరమాత్మనే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఏ విధమైన జ్ఞానమైనా ఎల్లప్పుడూ ఆత్మలోనే ఉంటుంది. దైహిక జ్ఞానం కూడా ఆత్మయే చదువుతుంది కదా! కానీ తమోప్రధానంగా ఉన్న కారణంగా ఆత్మాభిమానులుగా ఎవ్వరూ ఉండనే ఉండరు. ఆత్మాభిమానులుగా మీరు ఇప్పుడు అవుతారు. సత్యయుగంలో ఈ విషయాలను అర్థం చేయించడం జరగదు. ఈ సమయంలో తండ్రి అంటారు – మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే ఈ సమయంలో పాపాల భారం తలపై ఉంది, దానిని దించుకోవాలి. మీరు వచ్చి పతితులను పావనంగా తయారుచేయండి అని తండ్రిని పిలవడం కూడా ఈ సమయంలోనే పిలుస్తారు. ఆత్మయే అపవిత్రంగా తమోప్రధానంగా అయ్యింది, అందుకే తండ్రిని స్మృతి చేస్తుంది. పరమపిత పరమాత్మ బిందువు అని భక్తులెవ్వరికీ తెలియదు. బిందువుకైతే మందిరాన్ని నిర్మించలేరు, అసలు శోభించదు. ఒకవైపు లింగాన్ని తయారుచేస్తారు, మళ్ళీ సాక్షాత్కారాల విషయానికొస్తే – వేల సూర్యుల కంటే తేజోమయుడు అని అంటారు. లింగం అంత తేజోవంతంగా ఉంటుందా! అర్జునుడి కోసం చూపిస్తారు కదా. అతనికి తేజోమయ రూపం యొక్క సాక్షాత్కరం జరిగింది, నేను ప్రకాశాన్ని సహించలేను అని అన్నారు. ఈ పదాలను విని ఉంటారు కదా. ఇక్కడ కూడా ప్రారంభంలో చాలామందికి సాక్షాత్కారాలు జరిగాయి. ఇక ఆపండి, మేము సహించలేకపోతున్నామని అనేవారు. కళ్ళు ఎర్రగా అయిపోయేవి. మాకు పరమాత్మ సాక్షాత్కారం జరిగిందని భావించారు. ఎవరు చేయించారు? కృష్ణుడైతే చేయించలేదు. శివబాబాయే సాక్షాత్కారం చేయించారు. వారిని దివ్య దృష్టి దాత అని అంటారు. తండ్రి అంటారు – నేను పిల్లలైన మీకు తాళం చెవిని ఇవ్వలేను. ఈ వస్తువు భక్తి మార్గంలో నాకే ఉపయోగపడుతుంది. సత్యయుగంలో దీని అవసరం ఉండదు. మీరు పూజారుల నుండి పూజ్యులుగా అయిపోతారు. తండ్రి అంటారు – నేను మీకు విశ్వ రాజ్య భాగ్యాన్నిచ్చి నా పరంధామానికి వెళ్ళి కూర్చొంటాను. నేను పూజ్యుడను, పూజారిగా అవ్వను.

పిల్లలైన మీరిప్పుడు తెలివైనవారిగా అయ్యారు. నడవడిక ద్వారా కూడా అర్థమవుతుంది – వీరు ఎంత మధురమైనవారు, వీరికి ధారణ చాలా బాగా జరుగుతుంది అని. ఎన్ని టాపిక్స్ ను తయారుచేస్తారు. బాబా ఏ టాపిక్ నైతే వినిపిస్తారో, దానిని నోట్ చేసుకోవాలి. ఈ రోజు యాత్ర గురించి అర్థం చేయిస్తాను. యాత్ర రెండు రకాలుగా ఉంటుంది. ఇది నంబర్ వన్ టాపిక్. భక్తి మార్గంలో మనుష్యులందరూ దైహిక యాత్రలు చేయిస్తారు. జ్ఞాన మార్గంలో దైహిక యాత్రలు ఉండవు. మీది ఆత్మిక యాత్ర. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు ఈ యాత్రతో తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవ్వకుండా వాపసు ఇంటికి వెళ్ళలేదు. ఆత్మలందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. ఎవ్వరూ వెళ్ళరు. గవర్నమెంట్ కు కూడా మీరు అర్థం చేయించవచ్చు – సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యమున్నప్పుడు ఒక కొడుకు, ఒక కూతురు ఉండేవారు, అది కూడా యోగబలం ద్వారా జరుగుతుంది. సత్యయుగంలో ఎంత తక్కువమంది మనుష్యులుంటారో ఇప్పుడు ఆలోచించండి. మరియు సంపూర్ణ నిర్వికారీ లక్ష్మీనారాయణుల సింహాసనం కొనసాగింది. మరి తప్పకుండా కొడుకు కూడా ఉంటాడు. యోగబలంతో మనం విశ్వానికి యజమానులుగా అవుతున్నప్పుడు, యోగబలంతో పిల్లలకు జన్మను ఇవ్వలేమా. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. పవిత్రంగా ఉన్న కారణంగా కొడుకు జన్మించబోతున్నాడని సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సంతోషం ఉంటుంది. వికారాల విషయమేమీ ఉండదు. పిల్లలు ఎలా జన్మిస్తారు అని మిమ్మల్ని అడుగుతారు. వారికి చెప్పండి – బొప్పాయి ఆడ చెట్టు, మగ చెట్టు ఒక దాని పక్కన ఒకటి ఉండడం ద్వారా ఫలాలు ఉత్పన్నమవుతాయి. ఒకవేళ రెండూ పక్క పక్కన లేకపోతే ఫలాలు రావు. అద్భుతం కదా! మరి అక్కడ యోగబలంతో పిల్లలు ఎందుకు జన్మించలేరు? ఆడ నెమలి, మగ నెమలి ఉదాహరణ కూడా ఉంది. దానిని జాతీయ పక్షి అని అంటారు. ప్రేమ యొక్క కన్నీరుతో గర్భధారణ జరుగుతుంది. ఇది వికారం కానట్లే కదా! ఈ భారత్ శివాలయంగా ఉండేది, శివబాబా తయారుచేసారు. ఇప్పుడు రావణుడు వేశ్యాలయంగా తయారుచేసాడు. శివ జయంతినైతే జరుపుకుంటారు కానీ రావణ జయంతి ఎప్పుడు అన్నది ఎవ్వరికీ తెలియదు. రావణుడి గురించి ఎవ్వరికీ తెలియదు. అతని దిష్టిబొమ్మను తయారుచేసి దసరా రోజున హతమారుస్తారు. 5 వికారాల రావణుడిని ఈ టపాసులు మొదలైనవాటితో కాల్చకూడదని పిల్లలైన మీకు తెలుసు. యోగబలంతో వాటిపై విజయాన్ని పొందాలి, ఆ యోగాన్ని బాబాయే వచ్చి నేర్పిస్తారు. యోగీ భవ, హోలీ భవ అని అంటారు. గీతలో ఈ పదాలున్నాయి – మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి, ఈ యాత్ర ద్వారానే మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. తర్వాత అమరలోకంలోకి వచ్చేస్తారు. మనుష్యులు యాత్రలకు వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉంటారు. కాశీకి వెళ్ళేవారు పవిత్రంగా ఉంటారు కానీ కాశీలో ఉండేవారు పవిత్రంగా ఏమీ ఉండరు. ఇక్కడ రావణ రాజ్యంలో పతితులకు పతితులతోనే వ్యవహారం ఉంది. అక్కడైతే పావనమైనవారికి పావనమైనవారితోనే వ్యవహారం ఉంటుంది. అయినా కింద కు దిగాల్సిందే.

అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా బ్రాహ్మణులకు సంబంధించిన విషయము. బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. కొత్త ప్రపంచంలో లక్ష్మీ నారాయణులు ఎక్కడ నుండి వచ్చారు? ఏ యుద్ధము చేయలేదు. మహాభారత యుద్ధాన్ని చూపిస్తారు తర్వాత దాని ఫలితాన్ని ఏమీ చూపించరు. 5 పాండవులు ఉండేవారని అంటారు. మీరు ఎంతమంది పాండవులున్నారు. మీరు ఆత్మిక పండాలు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. బాబా అందరినీ తీసుకువెళ్ళేందుకే వస్తారు. వారు సుప్రీమ్ పండా లేక గైడ్, లిబరేటర్, మాయ నుండి ముక్తులుగా చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. తమతో పాటు తీసుకువెళ్ళే గైడ్ అయితే తప్పకుండా కావాలి. ఈ విషయాలు బుద్ధిలో మంచి రీతిగా గుర్తుండాలి. ఆ శాస్త్రాలైతే ముద్రించబడి ఉంటాయి. ఎవరైనా వెళ్ళి చదవవచ్చు. ఈ జ్ఞానమైతే తండ్రియే ఇస్తారు. ఇక శాస్త్రాలు చదవాల్సిన మాటే లేదు. తండ్రి ద్వారా విని ధారణ చేయాలి. స్మృతి యాత్రయే నంబర్ వన్, దీని ద్వారానే పవిత్రంగా అవుతారు. చరిత్ర-భూగోళాలనైతే ఎవ్వరూ అర్థం చేయించలేరు. యాత్రలో చాలా కచ్చాగా ఉన్నారు. స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి. జ్ఞానమైతే చాలా సహజము.

తండ్రి అర్థం చేయిస్తారు – ఇది డ్రామా చక్రము. దీనికి 4 సమాన భాగాలున్నాయి. లక్షల సంవత్సరాల ఆయువు ఉన్నట్లయితే, మనుష్యులు ఎంతగా వృద్ధి చెందుతారు. జనాభా వృద్ధి అవ్వకూడదని గవర్నమెంట్ కూడా ఎంతగా చెప్తుంది. ఇదైతే తండ్రి యొక్క పని. వారంతా భౌతిక యుక్తులను రచిస్తూ ఉంటారు. బాబాది ఆత్మిక యుక్తి. తండ్రి అంటారు – అనేక ధర్మాలను వినాశనం చేసి ఒకే ధర్మాన్ని స్థాపన చేయడానికే నేను వస్తాను. ఒకే మతం సత్యయుగంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉండదు. తమను తాము సోదరులమని ఎవ్వరూ భావించరు. తండ్రి పిల్లలకు చాలా యుక్తులను అర్థం చేయిస్తూ ఉంటారు. మీ వద్ద టాపిక్స్ లిస్ట్ ను ఉంచుకోవాలి. ఒక్కొక్క టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. బాబా అంటారు – పిల్లలైన మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. కేవలం ఇదే చెప్పాలి – శివబాబా చెప్తున్నారు – నేను ఆత్మలందరికీ తండ్రిని, నేను పరమ ఆత్మను, నన్నే భగవంతుడు అని అంటారు. మనుష్యులెవ్వరినీ భగవంతుడు అని అనలేరు. ఆత్మిక యాత్ర మరియు దైహిక యాత్ర – ఈ టాపిక్ చాలా బాగుంది. దైహిక యాత్ర మృత్యులోకంలో ఉంటుంది. ఇది మృత్యులోకము, అది అమరలోకము. పిల్లలైన మీరు కల్ప-కల్పం తండ్రికి సహాయకులుగా అవుతారు. అందుకే మీరు ఆత్మిక స్వీట్ చిల్డ్రన్. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయం తెలివైనవారిగా అయి ఇతరులను కూడా తయారుచేయాలి. తమ నడవడికను చాలా రాయల్ గా మరియు మధురంగా ఉంచుకోవాలి.

2. ఆత్మిక యాత్రలో తత్పరులై ఉండాలి. మంచి టాపిక్స్ ను తమ వద్ద నోట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక్కొక్క టాపిక్ పై విచార సాగర మథనం చేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే సదా ఆంతరిక స్థితిలో లేక ఆంతరిక స్వరూపంలో స్థితులై ఉంటూ అంతర్ముఖులుగా ఉంటారో, వారెప్పుడూ ఏ విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండరు. అల్పకాలికమైనవి మరియు ఆర్భాటం కోసం ఉన్న ఈ పాత ప్రపంచం, సంబంధాలు, సంపద, పదార్థాలు – వీటి ద్వారా మోసపోలేరు. ఆంతరిక స్వరూపం యొక్క స్థితిలో ఉండడంతో, గుప్తంగా ఉన్న స్వయం యొక్క శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది మరియు ఈ స్వరూపంతో తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. కనుక ఇటువంటి శ్రేష్ఠమైన కర్తవ్యాన్ని చేసేవారే సత్యమైన స్నేహీలు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top