09 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 9, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీకు రాజయోగాన్ని నేర్పించడానికి తండ్రి వచ్చారు, తండ్రి తప్ప దేహధారులెవ్వరూ మీకు రాజయోగాన్ని నేర్పించలేరు”

ప్రశ్న: -

తీవ్ర భక్తి చేయడం వలన ఏ ప్రాప్తి కలుగుతుంది, ఏది కలగదు?

జవాబు:-

ఎవరైనా తీవ్ర భక్తి చేసినట్లయితే సాక్షాత్కారం జరుగుతుంది. ఇకపోతే, సద్గతి అయితే ఎవ్వరికీ లభించదు. ఎవ్వరూ కూడా తిరిగి వెళ్ళలేరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. మీకు ఈ తయారై-తయారవుతున్న డ్రామా గురించి తెలుసు. మీకు ఆత్మకు సంబంధించిన యథార్థ జ్ఞానముంది. ఆత్మయే స్వర్గవాసిగా మరియు నరకవాసిగా అవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఓం శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేయించారు. ‘ఓం’ ను అహమ్ అనగా ‘నేను’ అని కూడా అంటారు. నేను ఆత్మ, ఇది నా శరీరం, రెండు విషయాలు అయ్యాయి. ‘ఓం శాంతి’ అని ఆత్మ అన్నది అనగా శాంతి నా స్వధర్మము. ఆత్మ నివాస స్థానం శాంతిధామము లేక పరంధామము. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ మనుష్యుల ప్రపంచము. మనుష్యులలో ఆత్మ ఉంటుంది మరియు ఈ శరీరం 5 తత్వాలతో తయారుచేయబడింది. ఆత్మ అవినాశీ, అది ఎప్పుడూ మరణించదు. ఇప్పుడు ఆత్మకు తండ్రి ఎవరు? శరీరానికి తండ్రి అయితే ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటారు. ఇకపోతే, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, పరమపిత పరమాత్మ. వారి అసలు పేరు ‘శివ’. మొట్టమొదట – శివ పరమాత్మాయ నమః అని అంటారు, తర్వాత బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. వారిని భగవంతుడు అని అనలేరు. అందరికంటే ఉన్నతమైనవారు నిరాకార పరమాత్మ. తర్వాత సూక్ష్మ దేవతలు, ఇక్కడ అందరూ మనుష్యులే. ఆత్మ రూపం ఏమిటి అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. భారత్ లో శివుడిని పూజిస్తారు. శివకాశీ, శివకాశీ అని అంటూ ఉంటారు. వారు లింగాన్ని తయారుచేస్తారు, కొంతమంది పెద్దదిగా తయారుచేస్తారు, కొంతమంది చిన్నదిగా తయారుచేస్తారు, కానీ ఆత్మ రూపం ఎలా ఉంటుందో, పరమాత్మ రూపం కూడా అలాగే ఉంటుంది. పరమ ఆత్మ – ఈ రెండింటినీ కలిపి పరమాత్మ అని అంటారు. కొంతమంది పరమాత్మ కోసం, వారు అఖండ జ్యోతి స్వరూపమని అంటారు, కొంతమంది బ్రహ్మము అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – ఎలాగైతే ఆత్మలైన మీరు బిందువో, అలాగే నా రూపం కూడా బిందువే. ఎప్పుడైతే రుద్ర పూజ చేస్తారో, దానిలో లింగాన్నే తయారుచేస్తారు. శివుడిని పెద్ద లింగంగా, మిగిలిన సాలిగ్రామాలను చిన్న-చిన్నవిగా తయారుచేస్తారు. మనుష్యులకు యథార్థమైన ఆత్మ జ్ఞానం లేదు, పరమాత్మ జ్ఞానం కూడా లేదు. మరి ఆ మనుష్యులు ఎలా అయినట్లు. అందరిలో 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేహాభిమానంలోకి వచ్చి ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. ఈ వికారాలు ఉన్నవే దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. ఎవరైనా మరణిస్తే దుఃఖం కలుగుతుంది. ఇది కూడా ముళ్ళు గుచ్చుకోవడమే. మనుష్యులెవ్వరికీ ఆత్మ గురించి గానీ, పరమాత్మ గురించి గానీ రియలైజేషన్ లేదు. ముఖాలు మనుష్యుల వలె ఉన్నాయి, గుణాలు వికారీగా ఉన్నాయి. అందుకే రావణ సంప్రదాయమని అంటారు. ఎందుకంటే ఇది ఉన్నదే రావణ రాజ్యము. మాకు రామరాజ్యం కావాలి అని అందరూ అంటారు కూడా. గీతలో కూడా కౌరవ సంప్రదాయం, పాండవ సంప్రదాయం మరియు యాదవ సంప్రదాయం అన్న పదాలున్నాయి. పిల్లలైన మీరిప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. రాజయోగాన్ని శ్రీకృష్ణుడు నేర్పించలేరు. వారు సత్యయుగ రాకుమారుడు. వారి మహిమ – సర్వగుణ సంపన్నులు… ప్రతి ఒక్కరి కర్తవ్యం, మహిమ వేర్వేరు. ప్రెసిడెంటు కర్తవ్యం వేరు, ప్రైమ్ మినిష్టరు కర్తవ్యం వేరు. ఇప్పుడు వీరు ఉన్నతాతి ఉన్నతమైన అనంతమైన తండ్రి. వీరి కర్తవ్యాల గురించి కూడా మనుష్యులే తెలుసుకుంటారు, జంతువులేమైనా తెలుసుకుంటాయా. మనుష్యులు ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతారో, అప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది ఉన్నదే పాత ప్రపంచం, కలియుగం – దీనిని నరకమని అంటారు. వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా అంటుంది – మాకు రామరాజ్యం కావాలి, ఓ పతితపావనా, మీరు వచ్చి పావనంగా తయారుచేయండి, శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని. తండ్రి అర్థం చేయిస్తారు – సుఖ-దుఃఖాల ఆట తయారుచేయబడింది. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లు, మాయను జయిస్తే జయించినట్లు. ఎవరినైతే పూజిస్తారో, వారి కర్తవ్యం గురించి తెలియనే తెలియదు. దీనిని అంధ శ్రద్ధ లేక బొమ్మల పూజ అని అంటారు. ఎలాగైతే పిల్లలు బొమ్మలను తయారుచేసి, ఆడుకొని తర్వాత విరిచేస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు, కానీ దాని అర్థం తెలియదు. శివుడు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. బ్రహ్మాను కూడా ప్రజాపిత అని అంటారు. ప్రజలు అంటేనే మనుష్య సృష్టి. శివుడు ఆత్మలకు తండ్రి. అందరికీ ఇద్దరు తండ్రులుంటారు. కానీ, ఆత్మలందరికీ తండ్రి శివుడు. వారిని దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, కళ్యాణకారి అని కూడా అంటారు. దేవతల మహిమను పాడుతారు – మీరు సర్వగుణ సంపన్నులు… మేము నీచులము, పాపులము… మాలో ఏ గుణాలు లేవు. పూర్తి తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. దేవతలు స్వచ్ఛ బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇక్కడ అందరూ వికారులు పతితులు, అందుకే గురువులను ఆశ్రయిస్తారు. ఎవరైతే సద్గతినిస్తారో, వారినే గురువు అని అంటారు. వానప్రస్థంలో గురువులను ఆశ్రయించడం జరుగుతుంది. మేము భగవంతుని వద్దకు వెళ్ళాలనుకుంటున్నాము అని అంటారు. సత్యయుగంలో ‘వానప్రస్థ అవస్థ’ అని అనరు. అక్కడ వారికి, మేము ఒక శరీరాన్ని విడిచి మరొకదానిని తీసుకోవాలి అని తెలుస్తుంది. ఇక్కడ మనుష్యులు ముక్తిలోకి వెళ్ళేందుకు, గురువులను ఆశ్రయిస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళరు. ఈ గురువులందరూ భక్తి మార్గానికి సంబంధించినవారు. శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్కరే, వారే భగవంతుడు. మనుష్యులను భగవంతుడు అని ఎలా అనగలరు. ఇక్కడైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. సాయి బాబా కూడా భగవంతుడు, మేము కూడా భగవంతుడు, మీరు కూడా భగవంతుడు. రాయి, రప్పలు అన్నింటిలో భగవంతుడు ఉన్నాడని అంటారు. కావున రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. మీరు కూడా ఇంతకుముందు రాతిబుద్ధి కలవారిగా, నరకవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. మహిమ అంతా సంగమయుగానిదే. పురుషోత్తమ మాసాన్ని జరుపుకుంటారు కదా. కానీ అందులో ఎవ్వరూ ఉత్తమ పురుషులుగా అవ్వరు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా ఎంత ఉత్తమ పురుషులుగా అవుతారు. తండ్రి అంటారు – నేను కల్పం యొక్క సంగమయుగంలో భారత్ ను పురుషోత్తమంగా తయారుచేయడానికి వస్తాను. ఆత్మ ఎలాగైతే బిందువో, అలా పరమపిత పరమాత్మ కూడా బిందువే అన్న విషయాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. భృకుటి మధ్య ప్రకాశించే అద్భుతమైన నక్షత్రం అని అంటారు. ఆత్మ సూక్ష్మమైనది. దానిని బుద్ధి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కనుల ద్వారా చూడలేము. దివ్య దృష్టి ద్వారా చూడగలము. ఎవరైనా తీవ్ర భక్తి చేసారనుకోండి, దాని వలన సాక్షాత్కారం జరుగుతుంది. కానీ దాని వలన ఏం లభిస్తుంది? ఏమీ లేదు. సాక్షాత్కారం వలన సద్గతి జరగదు. సద్గతిదాత, దుఃఖహర్త- సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. ఈ ప్రపంచమే వికారీగా ఉంది. సాక్షాత్కారం ద్వారా ఎవ్వరూ స్వర్గంలోకి వెళ్ళరు. శివుడికి భక్తి చేసారు, సాక్షాత్కారం అయ్యింది, తర్వాత ఏం జరిగింది? తండ్రి తప్ప ఎవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. ఇది తయారైనటువంటి డ్రామా. ఇది తయారై తయారవుతున్న డ్రామా అని అంటారు, కానీ అర్థం కొంచెం కూడా తెలియదు. ఆత్మ యొక్క జ్ఞానం కూడా లేదు. వారంటారు – ప్రతి ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుంది, అందులో ఒక్క మనుష్య జన్మ దుర్లభమైనది. కానీ అటువంటి విషయమేమీ లేదు. మనిషికైతే పెద్ద పాత్ర నడుస్తుంది. మనుష్యులే స్వర్గవాసులుగా మరియు మనుష్యులే నరకవాసులుగా అవుతారు. భారత్ యే అన్నింటికంటే ఉన్నత ఖండంగా ఉండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. అక్కడైతే చాలా కొద్ది మంది మనుష్యులు ఉండేవారు, ఒకే ధర్మం, ఒకే మతం ఉండేది. భారత్ విశ్వమంతటికీ యజమానిగా ఉండేది. ఇంకే ధర్మమూ ఉండేది లేదు. ఇది చదువు. దీనిని ఎవరు చదివిస్తారు? భగవానువాచ – నేను ఈ రాజయోగం ద్వారా మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. భగవంతుడు గీతను ఎవరికి వినిపించారు, గీత ద్వారా ఏం జరిగింది – ఇది ఎవ్వరికీ తెలియదు. గీత తర్వాతనే మహాభారతము. గీతలో రాజయోగముంది. భగవానువాచ – నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. తండ్రి అంటారు – ఎవరైతే సూర్య వంశీయులుగా పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ శూద్ర వంశీయులుగా పూజారులుగా అయ్యారు – మన్మనాభవ అర్థం కూడా ఇదే. విరాట రూపం యొక్క అర్థం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విరాట రూపంలో ఏదైతే చూపిస్తారో, దానిలో బ్రాహ్మణులను మాయం చేస్తారు. బ్రాహ్మణులు ఎంతో మహిమ చేయబడతారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానం కదా. తండ్రి బ్రహ్మా ద్వారానే రచనను రచిస్తారు. దత్తత తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్నతమైన బ్రాహ్మణులు, మిమ్మల్ని రచించేవారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మాకు కూడా వారే తండ్రి. రచన అంతటికీ వారు తండ్రి, రచన అంతా సోదరులు అవుతారు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది, సోదరుని నుండి కాదు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం బ్రహ్మా తనువులోకి శివబాబా వచ్చారు. దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. బ్రాహ్మణులే రాజయోగాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు అది నేర్చుకుంటున్నారు. భారత్ మొదట శివాలయంగా ఉండేది. శివబాబా శివాలయాన్ని (స్వర్గాన్ని) రచించారు. మరియు భారతవాసులే స్వర్గంలో రాజ్యం చేసేవారు. ఇప్పుడు ఎక్కడ రాజ్యం చేస్తున్నారు? ఇప్పుడిది పతిత ప్రపంచం, నరకము. మేము నరకవాసులమని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఫలానావారు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటున్నారంటే స్వయాన్ని నరకవాసులుగా భావించాలి కదా.

తండ్రి అంటారు – నేను పిల్లలైన మిమ్మల్ని 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా చేసాను. మొదట మీరు చాలా షావుకార్లుగా ఉండేవారు, మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారు. ఈ విధంగా తప్పకుండా భగవంతుడే తయారుచేసి ఉంటారు. భగవానువాచ – నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను కావున తప్పకుండా రాజులుగా కూడా అవుతారు. ప్రజలుగా కూడా అవుతారు. అర్ధకల్పం పగలు అనగా స్వర్గం, అర్ధకల్పం రాత్రి అనగా నరకము. ఇప్పుడు బ్రహ్మా అయితే ఒక్కసారే వస్తారు కదా. తండ్రి అందరికీ ఆత్మిక పండా, వారు అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ మృత్యులోకానికి రారు. అంధులకు చేతికర్ర ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఈ రావణ రాజ్యం వినాశనం అవ్వనున్నది. ఇది అదే మహాభారత యుద్ధము. మనుష్యులు ఏమీ అర్ధం చేసుకోరు. భారతవాసులు తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అవుతారు. మెట్లు దిగుతూ-దిగుతూ వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు పూజారులుగా అయిపోతారు. మొదట మనమందరమూ పూజ్య సూర్య వంశీయులుగా ఉండేవారము. తర్వాత రెండు కళలు తగ్గి చంద్ర వంశీయులుగా అయ్యాము, తర్వాత దిగుతూ-దిగుతూ పూజారులుగా అయ్యాము. మొట్టమొదట పూజ శివునికి జరుగుతుంది. దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు – ఒక్క నిరాకార తండ్రిని స్మృతి చేయండి, ఇంకే దేహధారినీ స్మృతి చేయకండి. ఓ పతితపావనా, వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు. నేను తప్ప ఇంకెవరైనా పావనంగా ఎలా తయారుచేయగలరు. మెట్ల చిత్రంలో కలియుగాంతంలో ఏముంటుందో చూపించారు. 5 తత్వాలకు భక్తితో పూజిస్తారు, సాధు-సన్యాసులు బ్రహ్మము యొక్క సాధన చేస్తారు, స్వర్గంలో వీరెవ్వరూ ఉండరు. ఈ డ్రామా అంతా భారత్ పైనే తయారయ్యింది. 84 జన్మలు తీసుకుంటారు. ఇక్కడ భక్తి మార్గం యొక్క కట్టు కథలేవీ లేనే లేవు, ఇది చదువు. ఇక్కడ ఒక్క తండ్రిని స్మృతి చేయండి అనే శిక్షణ మీకు లభిస్తుంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా స్మృతి చేయకూడదు. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని పిల్లలైన మీరు కూడా అంటారు. తండ్రి కూడా అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. పతితపావనుడు అని తండ్రినైన నన్నొక్కడిని మాత్రమే అంటారు. మరి మనుష్యులు గురువులుగా ఎలా అవ్వగలరు? వారే స్వయం తిరిగి వెళ్ళలేనప్పుడు, ఇతరులను ఎలా తీసుకువెళ్తారు? ఎవ్వరి జ్యోతి కూడా జ్యోతిలో కలిసిపోదు. పాత్రను అభినయించేవారంతా ఇక్కడే పునర్జన్మలలో ఉన్నారు. మీరందరూ ప్రేయసులు. ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. వారు దయాహృదయుడు, లిబరేటర్. ఇక్కడ దుఃఖముంది అందుకే వారిని స్మృతి చేస్తారు. సత్యయుగంలో ఎవ్వరూ స్మృతి చేయరు. తండ్రి అంటారు – నా పాత్ర ఉండేది సంగమయుగంలోనే. ఇకపోతే, యుగే-యుగే అనే పదాన్ని తప్పుగా రాసారు. ఈ కళ్యాణకారీ పురుషోత్తమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. మొదటి ముఖ్యమైన విషయం – తండ్రిని తెలుసుకోవడము. తెలుసుకోలేదంటే తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? రచన ద్వారా వారసత్వం లభించదు. తండ్రి బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. ఇంతమంది పిల్లలు ఎలా జన్మిస్తారు అన్నది మనుష్యులకు తెలియదు. ప్రజాపిత ఉన్నారు కదా. సరస్వతి తల్లా లేక కుమార్తెనా – ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. మీ తల్లి గుప్తంగా ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. ఇప్పుడు మీరు రాజఋషులు. ఋషి అనే పదం పవిత్రతకు గుర్తు. సన్యాసులు హఠయోగులు, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు ఏ గీతనైతే వినిపిస్తారో, అది భక్తి మార్గానికి చెందినది. ఎన్ని గీతలను తయారుచేస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, నేను సంస్కృతంలో ఏమీ చదివించను, అలాగే శ్లోకాలు మొదలైనవాటి విషయమే లేదు. నేను వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈ రాజయోగంతో మీరు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు – ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి.

2. తండ్రి సమానంగా ఆత్మిక పండాగా అయి అందరికీ ఇంటి యొక్క మార్గాన్ని తెలియజేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.

వరదానము:-

సంపూర్ణ కర్మాతీతులుగా అవ్వడంలో వ్యర్థ సంకల్పాల తుఫానులే విఘ్నాలు కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసేందుకు మీ మనసును ప్రతి సమయం బిజీగా పెట్టుకోండి, సమయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. మొత్తం రోజంతటిలో మనసును ఎక్కడెక్కడ బిజీ పెట్టుకోవాలి – ఈ ప్రోగ్రామ్ ను తయారు చేసుకోండి. రోజు మీ మనసును 4 విషయాలలో బిజీ పెట్టుకోండి: 1. మిలనం (ఆత్మిక సంభాషణ) 2. వర్ణన (సేవ) 3. మగ్నము 4. లగన్. దీనితో సమయం సఫలమవుతుంది మరియు వ్యర్థం యొక్క ఫిర్యాదు సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top