07 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 6, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మనసున్న తండ్రి వచ్చారు పిల్లలైన మీ యొక్క మనసును గెలుచుకోవడానికి, అందుకే శుద్ధమైన మనసు గలవారిగా అవ్వండి”

ప్రశ్న: -

సత్యయుగపు పదవి ముఖ్యంగా ఏ విషయంపై ఆధారపడి ఉంటుంది?

జవాబు:-

పవిత్రతపైన. ముఖ్యమైనది పవిత్రత. సెంటరుకు ఎవరైతే వస్తారో, వారికి – పవిత్రంగా అవ్వకపోతే జ్ఞానం బుద్ధిలో నిలవదు అని అర్థం చేయించాలి. యోగం నేర్చుకుంటూ-నేర్చుకుంటూ ఒకవేళ పతితంగా అయినట్లయితే, అంతా మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండలేకపోతే, వారు క్లాసుకు రాకపోయినా ఫర్వాలేదు. ఎవరు ఎంతగా చదువుకుంటారో, పవిత్రంగా అవుతారో, అంత ధనవంతులుగా అవుతారు

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి ఆ రోజు రానే వచ్చింది..

ఓంశాంతి. ఇప్పుడు ఆ రోజు మళ్ళీ వచ్చిందని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఏ రోజు? భారత్ లో మళ్ళీ స్వర్గం యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుందని అనగా లక్ష్మీ-నారాయణుల రాజ్యం స్థాపనవుతుందని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మరి పిల్లలకు ఎంత సంతోషముండాలి! ఏ పతితపావనుడైన తండ్రినైతే మనం పిలుస్తూ ఉన్నామో, వారు వచ్చి ఉన్నారు. వారే లిబరేటర్, గైడ్ మరియు దుఃఖహర్త-సుఖకర్త. ఒకసారి లిబరేట్ చేసారు, మళ్ళీ ఎలా చిక్కుకున్నాము. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇటువంటి రాతిబుద్ధి కల మనుష్యులకు అర్థం చేయించడానికి ఎంత శ్రమ అనిపిస్తుంది. డ్యూటీ కూడా ఎటువంటిది ఇచ్చారో చూడండి, వచ్చి మురికిపట్టిన వస్త్రాలను శుభ్రం చేయండి. దేవతలకు మాత్రమే ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. రావణ రాజ్యంలో ఎవ్వరి శరీరము పవిత్రంగా ఉండదు. శరీరమైతే పతితమైనదే. ఈ విషయాలన్నీ ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఒకవేళ ఆత్మ కొంత పవిత్రంగా ఉన్నా, ప్రభావమైతే వెలువడుతుంది కానీ తర్వాత పతితంగా అయితే అవ్వాల్సిందే కదా. అనంతమైన తండ్రి, పతితపావనుడు వచ్చి అంటారు – ఈ 5 వికారాలు సైతానులు, వీటిని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు నా మాట అంగీకరించకపోతే ధర్మరాజు మిమ్మల్ని విసిగిస్తాడు. మీరు ఆల్మైటీ అథారిటీ మాటను అంగీకరించకపోతే ధర్మరాజు చాలా కఠినమైన శిక్షలు విధిస్తారు. తండ్రి వచ్చారు పావనంగా తయారుచేయడానికి. మనమే పావనమైన దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మనమే పతితంగా అయ్యామని మీకు తెలుసు, కావున ఇప్పుడు వెంటనే దానిని విడిచిపెట్టాలి. దేహాభిమానం కూడా సైతాను యొక్క మతం, దానిని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. మొదటి నంబరు వికారం ఏదైతే ఉందో, దానిని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. తండ్రితో పాటు ఈ సభలో పతితులెవ్వరూ కూర్చోలేరు, ఎవ్వరికీ అనుమతినివ్వరు – అటువంటి రోజు కూడా వస్తుంది. మురికిపట్టిన వస్త్రాల వంటి వారిని బయటకు పంపించేయండి. ఇంద్రసభలోకి రానివ్వరు. ఎవరు ఎంత కోటీశ్వరులైనా సరే, ఎంతటి వారైనా సరే, సభలోకి రాలేరు. వారికి బయట అర్థం చేయించడం జరుగుతుంది. కానీ తండ్రి యొక్క సభలోకి అనుమతిని ఇవ్వడం జరగదు. ఇప్పుడు వారిలో ఆశను నింపడానికి అనుమతినివ్వడం జరుగుతుంది, తర్వాత అనుమతించరు. ఇప్పుడు కూడా, ఎవరైనా పతితులు వచ్చి కూర్చొన్నారని బాబా విన్నట్లయితే, బాబాకు మంచిగా అనిపించదు. ఇలా దాక్కొని వచ్చి కూర్చొనే వారు చాలా మంది ఉంటారు. అలాంటివారికి చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. మందిరాలకు, ధార్మిక స్థలాలకు స్నానం చేసి వెళ్తారు, స్నానం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. అది స్థూల స్నానము, ఇది జ్ఞాన స్నానము. దీనితో కూడా శుద్ధంగా అవ్వాల్సి ఉంటుంది. మాంసాహారులు కూడా ఎవ్వరూ రాలేరు. సమయం వచ్చినప్పుడు బాబా చాలా స్ట్రిక్ట్ అవుతారు. ప్రపంచంలో భక్తి యొక్క జోరు ఎంత ఉందో చూడండి. ఎవరైతే శాస్త్రాలను ఎక్కువగా చదువుతారో, వారు శాస్త్రి అనే బిరుదును తీసుకుంటారు. ఇప్పుడు మీరు సంస్కృతం మొదలైనవి నేర్చుకొని ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి అంటారు – అవన్నీ మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే, మీరు పవిత్రంగా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని మంచి రీతిగా అర్థం చేసుకుంటారో, అప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవాటిని మర్చిపోతారు. ఏదైతే ఇక్కడ చదువును చదువుకుని బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతారో, వాటి అన్నింటికంటే ఇది ఉన్నతమైన చదువు. దీనిని నాలెడ్జ్ ఫుల్ పరమాత్మయే వచ్చి చదివిస్తారు. ‘ఓ పతితపావనా రండి’ అని వారినే అంటారు. కానీ మేము పతితంగా ఉన్నామని వారికి తెలియదు. బాబా ఇది అర్థం చేయిస్తూ ఉంటారు – సత్యయుగాన్ని రామ రాజ్యమని అంటారు, కలియుగాన్ని రావణ రాజ్యమని అంటారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పావన దేవీ-దేవతలు మందిరాలలో పూజించబడతారు. మరియు పతితులు వారి ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కావున పవిత్రతలో వారు అందరికన్నా ఉన్నతమైనవారని ఋజువు అవుతుంది, సన్యాసుల కంటే ఉన్నతమైనవారు. సన్యాసులకు మందిరాలు తయారవ్వవు. ఎప్పుడైతే తమోప్రధాన భక్తిలోకి వెళ్ళిపోయారో, అప్పుడిక వారి చిత్రాలను కూడా పెడతారు. దీనిని తమోప్రధాన భక్తి అని అంటారు – మనుష్యుల యొక్క పూజ, 5 తత్వాల యొక్క పూజ. ఎప్పుడైతే సతోప్రధాన భక్తి ఉండేదో, అప్పుడు పూజ ఒక్కరికి మాత్రమే జరిగేది. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. దేవతలను కూడా ఆ విధంగా వారే తయారు చేసారు. అందుకే పూజ కూడా ఆ ఒక్కరికే జరగాలి. కానీ ఇది కూడా డ్రామా తయారై ఉంది. సతోప్రధానము, సతో, రజో, తమోలోకి రావాల్సిందే. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కొంతమంది సతోప్రధానంగా అవుతారు, కొంతమంది సతో, కొంతమంది రజో, కొంతమంది తమోగా అవుతారు.

సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ శుభ్రత ఉంటుంది. అక్కడ శరీరానికేమీ విలువ ఉండదు. కరెంటు పెట్టగానే సమాప్తం అయిపోతుంది. అంతేకానీ, అస్థికలను నది మొదలైనవాటిలో వేయడమనేది ఉండదు. అలాగని, శరీరాన్ని ఎక్కడికీ తీసుకొని వెళ్ళడం కూడా ఉండదు. ఇటువంటి కష్టమైన విషయం ఉండదు. కరెంటులో వేయగానే సమాప్తమైపోతుంది. ఇక్కడ శరీరం వెనుక మనుష్యులు ఎంతగా ఏడుస్తారు, గుర్తు చేసుకుంటారు, బ్రాహ్మణులకు తినిపిస్తారు. అక్కడ ఇటువంటి విషయాలేవీ ఉండవు. బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. అక్కడ ఏమేం ఉంటాయి? స్వర్గమంటే ఏమిటి! ఇదైతే నరకం, అసత్య ఖండము. అందుకే అసత్యమైన శరీరం, అసత్యమైన మాయ… అని అంటూ ఉంటారు. గవర్నమెంట్ గోహత్యను ఆపండి అని అంటుంది. కానీ మొదట ఈ హత్య చాలా పెద్దది అని వారికి వ్రాయాలి. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని నడిపించడం – ఈ హత్యను ఆపండి. ఈ కామం మహాశత్రువు, ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. దానిపై విజయం పొందండి. మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అక్కడ దేవతలది కొత్త రక్తము. వారంటారు – పిల్లలది కొత్త రక్తం అని. కానీ ఇక్కడ కొత్త రక్తం ఎక్కడ నుండి వస్తుంది? ఇక్కడ పాత రక్తం ఉంటుంది. సత్యయుగంలో ఎప్పుడైతే కొత్త శరీరం లభిస్తుందో, అప్పుడు కొత్త రక్తం కూడా ఉంటుంది. ఈ శరీరం కూడా పాతది, కావున రక్తం కూడా పాతదే. ఇప్పుడు వీటిని విడిచిపెట్టాలి మరియు పావనంగా తయారవ్వాలి. అది కూడా, తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. అందరి ధర్మాలు వేర్వేరు. మరియు ప్రతి ఒక్కరు తమ ధర్మ శాస్త్రాన్ని చదవాలి. సంస్కృతంలో ముఖ్యమైనది గీత. బాబా అంటారు – నేను సంస్కృతం నేర్పించను, ఏ భాష అయితే బ్రహ్మాకు తెలుసో, నేను ఆ భాషలోనే అర్థం చేయిస్తాను. ఒకవేళ నేను సంస్కృతంలో వినిపిస్తే, ఈ పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు. ఇదేమీ దేవతల భాష కాదు. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి, అక్కడి భాష ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు. ఈ భాషలు నేర్చుకోవడం వలన శరీర నిర్వహణార్థం కొంతమంది లక్షలు, కొంతమంది కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎంత సంపాదన చేసుకుంటున్నారు! సత్యయుగంలో మనం మహారాజా-మహారాణిగా అవుతామని మీకు తెలుసు. ఎంత ఎక్కువగా చదువుకుంటారో, అంత ఎక్కువ ధనవంతులుగా అవుతారు. పేదవారికి మరియు షావుకార్లకు తేడా అయితే ఉంటుంది కదా. పవిత్రతపైనే అంతా ఆధారపడి ఉంది. సేవాకేంద్రానికి ఎవరైతే వస్తారో, వారికి – ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే, ఈ జ్ఞానం బుద్ధిలో నిలవదని అర్థం చేయించాలి. 5-7 రోజులు వచ్చి మళ్ళీ పతితంగా అయినట్లయితే జ్ఞానమంతా సమాప్తమైపోతుంది. యోగం నేర్చుకుంటూ-నేర్చుకుంటూ ఒకవేళ పతితంగా అయినట్లయితే, అంతా మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా అవ్వలేకపోతే, రాకండి. వారి గురించి చింతించకూడదు. జన్మ-జన్మల పాపాల భారం తలపై ఉంది. మరి స్మృతి లేకుండా అది ఎలా తొలగుతుంది! సెకండులో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. తండ్రి ఏదైతే చెప్తారో, అది చేయాలి. ఓ పతితపావనా, రండి, మేము పతితంగా ఉన్నాము అని ప్రపంచమంతా పిలుస్తుంది, కానీ పావనంగా ఎవ్వరూ తయారవ్వరు. కనుక ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. వారు బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తూ గుర్తు చేస్తారు. పరమాత్మ ఎవరు అన్న జ్ఞానమే ఎవ్వరికీ లేదు. బ్రహ్మతత్వమేమీ పరమాత్మ కాదు. అలాగని, బ్రహ్మతత్వంలో ఎవ్వరూ లీనం అవ్వలేరు. అయినా, పునర్జన్మలలోకైతే అందరూ రావాల్సిందే, ఎందుకంటే ఆత్మ అవినాశీ. బుద్ధుడు తిరిగి వెళ్ళిపోయారని వారు భావిస్తారు. కానీ వారు దేనినైతే స్థాపన చేసారో, దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు, లేదంటే అప్పుడు ఎవరు పాలన చేస్తారు? వారు తిరిగి ఎలా వెళ్ళగలరు? మేము ముక్తిధామానికి వెళ్ళి కూర్చొంటామని మీరు అనరు. మీకు తెలుసు -మనం మన ధర్మ స్థాపన చేస్తున్నాము, తర్వాత పాలన కూడా చేస్తాము. అది పావన ధర్మంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఈ ధర్మానికి చెందినవారు మాత్రమే వస్తారు. ఇప్పుడు అంటు కట్టబడుతుంది. ఈ దేవీ-దేవతా ధర్మం యొక్క వృక్షమే అన్నింటికంటే మధురాతి-మధురమైనది. దీని స్థాపనా కార్యం జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో, అవన్నీ భక్తి మార్గం కోసము. మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు అని ఒక్క బాబాకు మాత్రమే గాయనముంది. మరి ఆ విధంగా తయారుచేసే తండ్రిని ఎంత మంచి రీతిగా స్మృతి చేయాలి. డ్రామానుసారంగా భక్తి మార్గం కూడా నడవాల్సిందేనని మీకు తెలుసు. వాస్తవానికి సర్వుల సద్గతిదాత ఒక్కరే. కావున పూజ కూడా ఒక్కరికే చేయాలి. దేవీ-దేవతలు, ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో, వారే 84 జన్మలు అనుభవించి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా తయారవ్వాలి. తండ్రి స్మృతి లేకుండా ఆ విధంగా తయారవ్వలేరు. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ తయారుచేసేటువంటి శక్తి లేదు. స్మృతి కూడా ఒక్కరినే చేయాలి. ఇది అవ్యభిచారీ స్మృతి. అనేకులను స్మృతి చేయడం – వ్యభిచారీతనము. శివుడు మన తండ్రి అని ఆత్మలందరికీ తెలుసు, అందుకే అన్నివైపులా ఎక్కడ చూసినా శివుడినే పూజిస్తారు. దేవీ-దేవతల ఎదురుగా కూడా శివుడిని పెట్టారు. వాస్తవానికి దేవతలైతే పూజలు చేయరు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరని గాయనం కూడా ఉంది. మరి దేవతలు ఎలా పూజిస్తారు? అది రాంగ్. అసత్యమైన మహిమను చూపించకూడదు. వారిని స్మృతి చేయడానికి శివబాబా గురించి వారికి ఏం తెలుసు. కావున ఆ చిత్రాన్ని తీసేయాలి. ఇకపోతే, పూజ చేసే సింగిల్ కిరీటం ఉన్నవారిని చూపించాలి. సాధు-సత్పురుషులకు ఎవ్వరికీ ప్రకాశ కిరీటం లేదు. అందుకే బ్రాహ్మణులకు కూడా ప్రకాశ కిరీటాన్ని చూపించలేరు. ఎవరికైతే జ్ఞానం వైపు పూర్తి అటెన్షన్ ఉంటుందో, వారు కరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. తప్పులు చేయనివారిగా ఎవ్వరూ తయారవ్వలేదు. తప్పులు జరుగుతూ ఉంటాయి. త్రిమూర్తి చిత్రం ఎంత బాగుంది! వీరు తండ్రి, వీరు దాదా. బాబా అంటారు – మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ విధంగా తయారవుతారు. దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మ అంటుంది – నాకు ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరి పైనా మమకారం లేదు. మనం ఇక్కడ ఉంటున్నా కూడా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తాము. ఇప్పుడు దుఃఖధామాన్ని విడిచిపెట్టాలి. కానీ ఎప్పటివరకైతే మన కొత్త ఇల్లు తయారవ్వదో అప్పటివరకు పాత ఇంటిలోనే ఉండాలి. కొత్త ఇంట్లోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఎంత సహజమైనది. పరమాత్మ ఎవరు మరియు ఈ దాదా ఎవరు అనేదే అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయము. తండ్రి వీరి ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బాబా అంటారు – పిల్లలూ, మన్మనాభవ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సత్యయుగంలో పావన దేవతలుగా అయిపోతారు. మిగిలినవారంతా ఆ సమయంలో ముక్తిధామంలో ఉంటారు. ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఎంత సహజమైనది. పిల్లలకు చాలా సంతోషముండాలి. మనసు చాలా స్వచ్ఛంగా ఉండాలి. మనసు స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామనలు నెరవేర్తాయి అని అంటారు. మనస్సు అనేది ఆత్మలో ఉంటుంది. తండ్రే ఆత్మలందరికీ సత్యమైన ప్రియుడు. మనసును గెలుచుకునేవారు అని మనసున్న తండ్రినే అంటారు. అందరి మనసులను గెలుచుకునేందుకే వారు వస్తారు. సంగమయుగంలో వచ్చి అందరి మనసులను గెలుచుకుంటారు. ఆత్మల మనసులను గెలుచుకొనేవారు పరమాత్మ. మనుష్యుల మనసులను గెలుచుకొనేవారు మనుష్యులు. రావణ రాజ్యంలో అందరూ ఒకరి మనసులను ఒకరు పాడు చేసుకునేవారు.

పిల్లలైన మీకు కల్పక్రితం కూడా ఈ త్రిమూర్తి చిత్రం గురించి అర్థం చేయించారు. అందుకే ఇప్పుడు కూడా వెలువడింది కదా. కావున తప్పకుండా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు అర్థం చేయించడానికి ఎన్ని చిత్రాలు వెలువడ్డాయి. మెట్ల చిత్రం ఎంత బాగుంది, అయినా కూడా అర్థం చేసుకోరు. ఓ భారతవాసులారా, మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడిది అంతిమ జన్మ. మనమైతే శుభమే మాట్లాడుతాము. మేము 84 జన్మలు తీసుకోలేదని మీరు ఎందుకిలా అంటారు? అలా అంటున్నారంటే, మీరు స్వర్గంలోకి రారు, మళ్ళీ నరకంలోకే వస్తారు. స్వర్గంలోకి రావాలని కూడా కోరుకోరు. భారత్ యే స్వర్గంగా అయ్యేది ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన లెక్క. మహారథులు మంచి రీతిగా అర్థం చేయించగలరు. సేవ చేయాలనే ఉత్సాహం ఉండాలి – మనం వెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వాలి అని. ధనమే లేకపోతే దానం చేయాలి అన్న ఆలోచన కూడా రాదు. మీరు ఏది ఆశించి వచ్చారని మొదట అడగండి. ఇక్కడ దర్శనం యొక్క విషయమే లేదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖాన్ని తీసుకోవాలి. ఇద్దరు తండ్రులున్నారు కదా. అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుంది అన్నది వచ్చి అర్థం చేసుకోండి. ఇది కూడా అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. రాజ్యం తీసుకునేవారుంటే, వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు – ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి, స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పుడూ ఒకరి మనసును ఒకరు పాడు చేసుకోకూడదు. సేవ చేయాలన్న ఉత్సాహముంచుకోవాలి. జ్ఞాన ధనముంటే తప్పకుండా దానం చేయాలి.

2. కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. స్మృతి బలంతో ఆత్మను పావనంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఎవరైతే అలంకారిగా ఉంటారో, వారు ఎప్పుడూ దేహ-అహంకారిగా అవ్వలేరు. నిరాకారిగా మరియు అలంకారిగా ఉండడము – ఇదే మన్మనాభవ, మధ్యాజీభవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదా స్థితులై ఉంటారో, అప్పుడు సర్వ పరిస్థితులను సహజంగానే దాటేస్తారు. దీని ద్వారా అనేక పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూసినట్లయితే, భావ-స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి మరియు ఎదుర్కునేందుకు సర్వ శక్తులు స్వయంలో వచ్చేస్తాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top