06 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 5, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - దానంగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ కూడా తిరిగి తీసుకోకూడదు, తిరిగి తీసుకున్నట్లయితే ఆశీర్వాదాలకు బదులుగా శాపం లభిస్తుంది”

ప్రశ్న: -

ఏ నిశ్చయం పక్కా అయినట్లయితే ఎటువంటి విరోధాన్ని అయినా ఎదుర్కోగలరు?

జవాబు:-

ఒకవేళ – మాకు భగవంతుడు లభించారు, వారిని స్మృతి చేసి మేము వికర్మలను వినాశనం చేసుకోవాలి, విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి అని నిశ్చయం ఏర్పడినట్లయితే విరోధం అంతా సమాప్తమైపోతుంది. ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది. నిశ్చయం లోపించినట్లయితే తికమకపడతారు. అప్పుడు జ్ఞానాన్ని విడిచిపెట్టి భక్తిలో నిమగ్నమైపోతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము..

ఓంశాంతి. ఈ పాటను ఎవరు వింటారు? పిల్లలు వింటారు. వారే అర్థాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా ఎవరైతే వింటారో, వారే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎలాగైతే భారతవాసులంతా, మా భారత్ అని అంటారో, అలాగే అక్కడ కూడా యథా రాజా-రాణి, తథా ప్రజా అందరూ, విశ్వానికి యజమానులము అని అర్థం చేసుకుంటారు. ఎలాగైతే, యూరోప్ వాసులు వచ్చినప్పుడు, వారు కూడా, మేము హిందుస్థాన్ కు యజమానులము అనేవారు. ఆ సమయంలో ఉన్న హిందుస్థానులు – మేము హిందూస్థాన్ కు యజమానులము అని అనలేదు. వారు బానిసలుగా ఉండేవారు. రాజ్యమంతా వారి చేతిలోనే ఉండేది. తర్వాత మన రాజ్య భాగ్యాన్ని రావణుడు లాక్కున్నాడు. ఇప్పుడు మనకు మన రాజ్యం కావాలి, ఇది పరాయి రాజ్యము. దూరదేశంలో ఉండేవారు అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎవరి కోసము యుద్ధం చేయరు. మీర మీ కోసమే అంతా చేస్తారు. ఆ సైన్యం, తమ ప్రెసిడెంటు లేదా ప్రైమ్ మినిస్టర్ కోసం యుద్ధం చేస్తుంది. గొప్ప వ్యక్తులుగా వారే అవుతారు కదా. వారికి నషా మంచిగా ఉంటుంది. అయినా ఇప్పుడు కూడా – భారత్ మాది అనే అంటారు కదా. కానీ భారతవాసులకు, ఇది మన రాజ్యం కాదని, ఇది రావణ రాజ్యమని, ఇందులో మనం ఉంటున్నామని తెలియదు. రామరాజ్యంలో ఇది పరాయిది అని అనరు. ఇప్పుడు భారత్ పై పూర్తిగా రావణ రాజ్యముంది. ఒకప్పుడు రామ రాజ్యముండేది, దేవతల రాజ్యముండేది, ఇప్పుడు లేదు. 5 వేల సంవత్సరాల తర్వాత మనం రాజ్యం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరి ద్వారా? పరమాత్మ తండ్రి ద్వారా. ‘రామ’ అనే పదం అన్నట్లయితే మనుష్యులు తికమకపడతారు, అందుకే ‘అనంతమైన తండ్రి’ అనడం సరైనది. తండ్రి అనే పదం చాలా మధురమైనది. తండ్రియే వారసత్వాన్ని గుర్తు తెప్పిస్తారు. ఒక్క తండ్రిని తప్ప మిగిలినదంతా మర్చిపోవాలి. ఆత్మలైన మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి వచ్చి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. మనం ఆత్మలము. ఆత్మ ఎంత చిన్నది, సూక్ష్మమైనది. దానిలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇది మందబుద్ధి గల మనుష్యులకు తెలియదు, అర్థం చేయించలేరు. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము, ఇది ఎంత సహజము. కానీ మాయ మరపింపజేస్తుంది, అందుకే పిల్లలు శ్రమ చేయవలసి ఉంటుంది. ఇందులో ఆయుధాలు, తుపాకుల విషయమేమీ లేదు. డ్రిల్ మొదలైనవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, శాస్త్రాలు మొదలైనవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం బాబాను స్మృతి చేయాలి. బాబా ఏదైతే వినిపిస్తారో, దానిని ధారణ చేయాలి. మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. ఎలాగైతే, నాటకంలో పాత్రధారులు పాత్రను అభినయించిన తర్వాత, వస్ర్తాలు మార్చుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు, అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది – ఇప్పుడు నాటకం పూర్తి అవ్వనున్నది, ఇప్పుడు అశరీరిగా అయి ఇంటికి వెళ్ళాలి. మనం ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తాము. అర్ధకల్పం రాజ్యం చేస్తారు, అర్ధకల్పం బానిసలుగా అయిపోతారు. పిల్లలకు ఎక్కువ కష్టాన్ని ఏమీ ఇవ్వరు. బుద్ధిలో కేవలం స్మృతి ఉండాలి. పురుషార్థం చేసి, ఎంత వీలైతే అంత దీనిని మర్చిపోకూడదు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇంకా కొంత సమయమే ఉంది. మనం వెళ్ళాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ- మాట్లాడుకుంటూ పావనంగా అయి తిరిగి వెళ్ళిపోతారు. పిల్లలు ప్రతి ఒక్కరు తెలుసుకోగలరు – నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని. ఎవరైనా చార్టు వ్రాసినా, వ్రాయకపోయినా, కానీ బుద్ధిలోనైతే ఉంటుంది కదా – రోజంతటిలో నేను ఏమేమి చేసాను? అని. ఎలాగైతే వ్యాపారస్థులు రాత్రికి తమ ఖాతాను సంభాళించుకుంటారో, అలాగే ఇది కూడా వ్యాపారమే కదా. రాత్రి పడుకునే సమయంలో చెక్ చేసుకుంటారు – రోజంతటిలో తండ్రిని ఎంత స్మృతి చేసాను, ఎంతమందికి తండ్రి పరిచయాన్ని ఇచ్చాను అని. ఎవరైతే తెలివైనవారిగా ఉంటారో, వారి వ్యాపారం బాగా నడుస్తుంది. మందబుద్ధికలవారిగా ఉంటే వ్యాపారం కూడా అలాగే నడుస్తుంది. ఇక్కడ తమ సంపాదనను చేసుకోవాలి. తండ్రి కేవలం అంటారు – నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తీ రాజుగా అవుతారు. ఇందులో ఆశలు ఎక్కువగా ఉండకూడదు. గ్రామంలో ఉండేవారికి ఆశలు తక్కువగా ఉంటాయి, షావుకార్లకు ఎక్కువగా ఉంటాయి. వారు తమ పేదరికంలోనే సంతోషంగా ఉంటారు. ఎండిపోయిన రొట్టెలు తినడం అలవాటు అయిపోతుంది. షావుకార్లకు కోరికలు చాలా ఉంటాయి, తల్లిదండ్రులనే విసిగించేస్తారు. బాబా అనుభవజ్ఞులు. పేదవారిపై దయ కూడా కలుగుతుంది. పేదవారు చూస్తారు – ఇంత గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని వింటున్నారంటే, మేము కూడా వినాలి. చిత్రాలనైతే బాబా చాలా తయారుచేయించారు. కొంతమంది – మాకు సేవ కావాలి అని అంటారు. బాబా అంటారు – ముందు మీరు తెలివైనవారిగా అవ్వండి, తర్వాత సేవకు వెళ్ళండి, ఎందుకంటే ఈ రోజులలో భక్తి జోరు కూడా ఉంది. ఒకవైపు అర్థం చేయించండి, మరోవైపు గురువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు భయపెడతారు – ఒకవేళ మీరు భక్తి చేయకపోతే మీకు ఫలం ఎలా లభిస్తుంది? భక్తితో భగవంతుడు లభిస్తారు అని. ఎప్పటివరకైతే ఈ జ్ఞానంలో పక్కాగా అవ్వరో, పూర్తి నిశ్చయం ఏర్పడదో, మాకు భగవంతుడు లభించారు, వారు మాతో చెప్తున్నారు – నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి, ఎప్పుడైతే ఈ నిశ్చయం పక్కాగా ఏర్పడుతుందో, అప్పుడే ఎవ్వరినైనా ఎదుర్కోగలరు. మీతోనే విరోధం ఉంటుంది. మీరు ఒక విషయం చెప్తే, వారు మరొక విషయం చెప్తారు. ప్రపంచంలో చాలా మఠాలు, మార్గాలు ఉన్నాయి. మనుష్యులు అక్కడకు వెళ్ళి ఏదో ఒకటి విని వస్తూ ఉంటారు. గీతకు కూడా భిన్న-భిన్న అర్థాలను వినిపిస్తారు. కనుక మనుష్యులు చిక్కుకుపోతారు. సన్యాసులు ఎప్పుడూ గృహస్థులకు – వికారాలలోకి వెళ్ళకండి అని చెప్పరు. ఒకవేళ వారు నిర్వికారులుగా అవ్వండి అని చెప్పినా కూడా ఏం జరుగుతుంది? లక్ష్యం-ఉద్దేశ్యం అయితే ఏమీ లేదు. తప్పుడు మార్గాన్ని తెలియజేసేవారైతే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సత్యమైన మార్గాన్ని తెలియజేసేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారిపై కూడా మాయ దాడి చాలా ఉంటుంది. పవిత్రంగా అవ్వాలి అని మనసు చెప్తుంది కానీ మాయ బుద్ధిని తిప్పేస్తూ ఉంటుంది. చాలా చెడు ఆలోచనలను తీసుకొస్తూ ఉంటుంది. మాయ యొక్క యుద్ధం చాలా ఉంటుంది. నడుస్తూ-నడుస్తూ తుఫాన్లు చాలా వస్తాయి. ఒకవేళ ఏదైనా వికారాల యొక్క భూతం లోపల ఉన్నట్లయితే, మనసు తింటూ ఉంటుంది. ఎవరికైనా క్రోధాన్ని దానమివ్వమని చెప్పి, స్వయం వారే క్రోధం చేసిన్నట్లయితే, మనుష్యులు అంటారు – స్వయం మీరు క్రోధం చేస్తున్నారు, మళ్ళీ మాకెలా చెప్తారు? కావున క్రోధాన్ని కూడా వదలవలసి ఉంటుంది. ఎవ్వరికీ తెలియకుండా క్రోధం చేయడం జరగదు. క్రోధంలోనైతే చాలా శబ్దం ఉంటుంది. పరస్పరంలో కొట్లాడుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. బాబా చూస్తారు – క్రోధం యొక్క భూతం తొలగడమే లేదు అని. ఇక్కడ బాబా సమ్ముఖంగా ఉన్నపుడు కూడా కొంతమంది క్రోధం చేస్తారు. చాలామందిలో క్రోధమనే భూతం వచ్చేస్తుంది, ఇది చాలా చెడ్డది, వారు విసిగిస్తారు. బాబా అయితే మళ్ళీ ప్రేమగా అర్థం చేయిస్తారు. ఒకవేళ పేరును అప్రతిష్టపాలు చేసినట్లయితే, తర్వాత పదవి కూడా భ్రష్టపర్చుకుంటారు. వారికి అర్థం చేయించాలి – మీరు బాబాకు 5 వికారాలను దానమిచ్చేసారు, తిరిగి మళ్ళీ ఎందుకు తీసుకుంటారు. ఒకవేళ మళ్ళీ క్రోధం చేసారంటే, గ్రహణం వదిలిపోదు, అది ఇంకా వృద్ధి చెందుతుంది. తండ్రి ఆశీర్వాదాలకు బదులుగా శాపం లభిస్తుంది, ఎందుకంటే తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. క్రోధం చేయడం – ఇది కూడా పాపము. ఎవరిలోనైతే 5 వికారాలున్నాయో, వారిని పాపాత్ములని అంటారు. సత్యయుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు. అక్కడ ఎవ్వరూ పాపమూ చేయరు. ఇప్పుడు జన్మ-జన్మల పాపాల భారం తలపై చాలా ఉంది. ముందు దానిని యోగబలంతో తొలగించుకోవాలి. మాయ చాలా చెడ్డది. లోభం చాలా మందిలో ఉంది. వస్త్రాల కోసం, చెప్పుల కోసం, చిన్న-చిన్న విషయాల కోసం లోభముంది. కనుక అసత్యం చెప్తూ ఉంటారు. ఇవన్నీ లోభానికి గుర్తులు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. బయట అయితే ప్రతి ఇంట్లో అశాంతి ఉంది. సాంగత్యం కూడా చాలా చెడుగా ఉంది. పతి బ్రాహ్మణుడు అయితే, స్త్రీ శూద్రులు. స్త్రీ బ్రాహ్మణి అయితే, పతి శూద్రులు. ఇంట్లోనే హంస మరియు కొంగ, చాలా గొడవలు జరుగుతాయి. తమను తాము శాంతిగా ఉంచుకునే యుక్తిని పెట్టుకోవాలి. ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పెట్టేందుకు కూడా బాబా అనుమతినివ్వరు. పిల్లా-పాపల సహితంగా వెళ్ళి ఉండే ఆశ్రమాలు చాలా ఉంటాయి. అయినా గొడవలైతే అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, శాంతి ఎక్కడా లేదు. పిల్లలైన మీకు సత్యాతి-సత్యమైన శాంతి, సుఖం, పవిత్రత 21 జన్మల కోసం ఇప్పుడు లభిస్తుంది. ఇటువంటి మతాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు.

బాబా అంటారు – నేను సేవ చేసేందుకు ఎంత దూరదేశం నుండి వస్తాను. మీరు కూడా సేవ చేయాలి. ప్రదర్శినీలు, మేళాలలో చాలామంది అర్థం చేసుకోలేరు. గవర్నర్ ప్రారంభోత్సవం చేస్తారు, కానీ ఈ విషయం వారి బుద్ధిలోకి రాదు – వీరిని బ్రహ్మా ద్వారా పరమాత్మ చదివిస్తున్నారు, దీనితో విశ్వ వారసత్వం లభిస్తుంది అని. కేవలం ‘బాగుంది’ అని అంటారు. మాతలు మంచి కర్తవ్యం చేస్తున్నారు, శ్రేష్ఠాచారిగా తయారుచేస్తున్నారు. గీతను భగవంతుడే చెప్పారని నేను అంగీకరిస్తున్నాను అని కూడా రాస్తారు. రాసేసారు, కానీ బుద్ధిలో కూర్చోదు, అర్థం చేసుకునేందుకు పురుషార్థం కూడా నడవదు. నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని శివబాబా బ్రహ్మా ద్వారా చెప్తున్నారని మీ బుద్ధిలో ఉంది. ఈ సందేశాన్ని అందరికీ వినిపించాలి. మీరు సందేశకుని పిల్లలు, ఇక ఎవరైతే వస్తారో వారు ధర్మస్థాపకులు. మీరు అందరికీ ఈ సందేశాన్ని వినిపించండి – బాబా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు – ఒకవేళ మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మరియు పవిత్రంగా అయినట్లయితే మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. పదే-పదే ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. అవస్థ కచ్చాగా ఉన్న కారణంగా వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళగానే అన్ని విషయాలను మర్చిపోతారు. అయినా ఏ మహావాక్యాలనైతే విన్నారో, అవేమీ వ్యర్థంగా పోవు. ఒక్కొక్క రత్నం తక్కువేమీ కాదు. ఒక్క రత్నం కూడా స్వర్గానికి యజమానులుగా తయారుచేయగలదు. మా భారత్ చాలా ఉన్నతమైన దేశం అని పాడుతూ ఉంటరు కూడా. ఒకప్పుడు స్వర్గంగా ఉన్న మన భారత్ ఇప్పుడు నరకంగా అయిపోయిందని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా అంటారు – నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. సేవాకేంద్రాలు తెరవబడుతూ ఉంటాయి. తండ్రి కూడా – గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయండి అని అంటారు. అందరూ కలిసి క్లాసు చేసుకునే గ్రామాలు కూడా చాలా ఉంటాయి. బాబాకు ఉత్తరాలు కూడా వ్రాస్తారు.

బ్రాహ్మణ ధర్మాన్ని వృద్ధి చేయడమే పిల్లలైన మీ యొక్క పని. దాని వలన మనుష్యులందరూ దేవతలుగా తయారవ్వాలి. ఇక్కడకు చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు ఇతర సత్సంగాలలో చిక్కుకోరు. ఇక్కడ ముఖ్యమైన విషయం – పవిత్రత. దీనిపైనే తండ్రి-పిల్లలకు, స్త్రీ-పురుషునికి, పురుషుడు-స్త్రీకి శత్రువులుగా అయిపోతారు. గవర్నమెంట్ కూడా, వీరు ఏమి చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది? అని అంటుంది. కానీ ధర్మంలో జోక్యం చేసుకోలేరు. స్వరాజ్యాన్ని అయితే తప్పకుండా స్థాపన చేసేదే ఉంది. ఒకప్పుడు జరిగిన యుద్ధానికి ఇప్పటి యుద్ధానికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఈ బాంబులు మొదలైనవి ఇంతకుముందు లేవు. మన రాజ్యంలో యుద్ధం యొక్క పేరు కూడా ఉండదని మీకు తెలుసు. సత్య-త్రేతా యుగాలలో సుఖం, ద్వాపర-కలియుగాలలో దుఃఖం ఉంటుంది. అది కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. ప్రపంచమైతే ఒక్కటే. కేవలం కొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై కొత్త ప్రపంచం తయారవ్వనున్నది. ఈ పాత ప్రపంచం దేనికీ పనికిరానిదిగా ఉంది, మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి. ఢిల్లీలో ఎన్నిసార్లు కొత్త మహళ్ళు తయారై ఉండవచ్చు! ఎవరైతే వస్తారో, వారు వాటిని పడగొట్టి తమ అనుసారంగా కొత్తవి తయారుచేస్తారు, స్మృతిచిహ్నం కోసం. ఎప్పుడైతే పెద్ద యుద్ధం జరుగుతుందో, అప్పుడు ఇవన్నీ పడిపోతాయి. మళ్ళీ కొత్త ప్రపంచంలో కొత్త మహళ్ళు తయారుచేస్తారు. ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువగా చదువుకుంటారు. ఇది నడుస్తూనే ఉంటుంది.

పిల్లలైన మీరు ఇది పక్కాగా గుర్తుంచుకోండి – మేము ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేసాము, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి మేము మా ఇంటికి వెళ్ళాలి. ఇటువంటి పక్కా అవస్థ ఏర్పడితే అంతకన్నా ఇంకేం కావాలి. ఇటువంటి అవస్థలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే చాలా ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ సంపాదనను జమ చేసుకోవడానికి తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. మాయ యొక్క చక్రంలోకి ఎప్పుడూ రాకూడదు. ఎక్కువ ఆశలు ఉంచుకోకూడదు.

2. మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి మన బ్రాహ్మణ ధర్మాన్ని వృద్ధి చేయాలి. గ్రామ-గ్రామానికి వెళ్ళి సేవ చేయాలి.

వరదానము:-

స్వయాన్ని సదా విజయీ రత్నముగా భావిస్తూ ప్రతి సంకల్పం మరియు కర్మ చేసినట్లయితే ఎప్పుడూ ఓటమిని పొందరు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ పదే-పదే ఓడిపోతూ ఉన్నట్లయితే, ధర్మరాజు యొక్క శిక్షలు తినవలసి వస్తుంది. మరియు ఓటమిని పొందేవారు భవిష్యత్తులో మాలలు తయారుచేయాల్సి వస్తుంది. ద్వాపరం నుండి అనేక మూర్తులకు మాలలు వేయాల్సి వస్తుంది. అందుకే ఓటమిని పొందేందుకు బదులుగా బలిహారమవ్వండి. తమ సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లయితే విజయులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top