04 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

04 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

3 December 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - దేహాభిమానం మిమ్మల్ని చాలా దుఃఖితులుగా చేస్తుంది, అందుకే దేహీ-అభిమానులుగా అవ్వండి, దేహీ-అభిమానులుగా అవ్వడం ద్వారానే పాపాల భారం సమాప్తమవుతుంది”

ప్రశ్న: -

సత్యయుగంలో షావుకారు పదవి ఏ ఆధారంగా ప్రాప్తిస్తుంది?

జవాబు:-

జ్ఞానం యొక్క ధారణ ఆధారంగా షావుకార్లుగా అవుతారు. ఎవరు ఎంతగా జ్ఞాన ధనాన్ని ధారణ చేస్తారో మరియు దానం చేస్తారో, వారు అంతగా షావుకారు పదవిని పొందుతారు, ఎల్లప్పటికీ ధనవంతులుగా అవుతారు. చదువును చదువుకోవాలి మరియు చదివించాలి. ఇకపోతే, విశ్వ మహారాజుగా అయ్యేందుకు చాలా రాయల్ గా సేవ చేయాలి. లోపాలన్నింటినీ తొలగించి వేయాలి. పూర్తి దేహీ-అభిమానులుగా అవ్వాలి. చాలా ఓర్పుతో మరియు గంభీరతతో తండ్రిని స్మృతి చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓర్పు వహించు మానవా..

ఓంశాంతి. ఇది ఎవరన్నారు? తండ్రి పిల్లలతో అన్నారు – ఓర్పు వహించండి అని. ప్రపంచమంతటికీ చెప్పలేదు. అందరూ పిల్లలే, కానీ అందరూ ఇక్కడ కూర్చోలేదు. నిజంగా ఈ దుఃఖధామం పరివర్తన అవుతూ ఉందని పిల్లలకు మాత్రమే తెలుసు. మనం సుఖధామం కోసం చదువుకుంటున్నాము లేదా శ్రీమతాన్ని అనుసరిస్తున్నాము. పిల్లలకు ఓర్పును కూడా ఇస్తారు. వాస్తవానికి ప్రపంచమంతటికీ గుప్తంగా ఓర్పు లభిస్తూ ఉంది. మనం సమ్ముఖంలో వింటున్నామని మీరు అర్థం చేసుకుంటారు. అందరూ వినరు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖాన్ని హరించి సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మీకు ఎప్పుడైతే సుఖం ఉంటుందో, అప్పుడు దుఃఖం అన్న పేరే ఉండదు. సుఖమయ ప్రపంచాన్ని సత్యయుగం అని, దుఃఖం యొక్క ప్రపంచాన్ని కలియుగం అని అంటారు. ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు. సత్యయుగంలో సంపూర్ణ సుఖముంటుంది, అది కూడా 16 కళల సంపూర్ణము. ఎలాగైతే చంద్రుడు కూడా 16 కళల సంపూర్ణంగా ఉంటాడు, తర్వాత కళలు తగ్గుతూ-తగ్గుతూ అమావాస్యకు ఎంత చిన్న గీత వలె మిగులుతుంది. దాదాపు అంధకారం ఏర్పడుతుంది. 16 కళల సంపూర్ణులు అంటే సంపూర్ణ సుఖం కూడా ఉంటుంది. కలియుగంలో 16 కళా అపూర్ణులు కనుక దుఃఖం కూడా ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచానికి మాయ రూపీ గ్రహణం పట్టుకుంటుంది, అందుకే ఇప్పుడు తండ్రి అంటారు – మీలో ఏదైతే దేహాభిమానముందో, మొట్టమొదట దానిని వదిలేయండి. ఈ దేహాభిమానం మీకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే, తండ్రిని కూడా స్మృతి చేయగలరు. దేహాభిమానంలో ఉండడం వలన తండ్రిని స్మృతి చేయలేరు. ఇది అర్ధ కల్పపు దేహాభిమానము. ఈ అంతిమ జన్మలో దేహీ-అభిమానులుగా అవ్వడం వలన ఒకటేమో పాపాల భారం సమాప్తమైపోతుంది, తర్వాత 16 కళల సంపూర్ణులుగా, సతోప్రధానంగా అవుతారు. చాలామంది దేహాభిమానం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. మనుష్యులను దేహాభిమానమే దుఃఖితులుగా చేస్తుంది. మిగిలిన వికారాలన్నీ తర్వాత. దేహీ-అభిమానులుగా అవ్వడం వలన ఈ వికారాలన్నీ వదిలిపోతూ ఉంటాయి, లేదంటే అవి వదలడం కష్టము. దేహాభిమానం యొక్క అభ్యాసం పక్కాగా అయిపోయింది కనుక తమను తాము దేహీ-అభిమానీ (ఆత్మ)గా అసలు అర్థం చేసుకోరు. ఇందులో అన్ని వికారాలను దానమివ్వాల్సి ఉంటుంది. మొట్టమొదట దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. కామం, క్రోధం మొదలైనవన్నీ తర్వాత వస్తాయి. వారు మీ తండ్రి. దేహాభిమానం కారణంగా లౌకిక తండ్రినే తండ్రిగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం – మనం పావనంగా ఎలా అవ్వాలి. పతిత ప్రపంచంలో అందరూ పతితంగానే ఉన్నారు, పావనమైనవారు ఎవ్వరూ ఉండరు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పావనంగా తయారుచేసి చాలా సంతోషంతో తిరిగి తీసుకువెళ్తారు.

ఇప్పుడు పిల్లలైన మీకు యోగం యొక్క చింతన ఉంది. జీవిస్తూనే మరణించాలి. దేహాభిమానాన్ని తెంచడం అనగా మరణించడము. ఆత్మలైన మనం బాబాను స్మృతి చేసి పతితం నుండి పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యే ఈ యుక్తిని బాబాయే అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. కల్ప-కల్పము మళ్ళీ అర్థం చేయిస్తారు. ప్రపంచమంతటిలో ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ముఖ్యమైన విషయం – శివుడిని స్మృతి చేయాలి. అది కూడా ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి బి.కె ల ద్వారా వింటారో, ఎందుకంటే తాతగారి వారసత్వం లభించాలి. మరి తండ్రి తప్పకుండా కావాలి, వారి ద్వారానే వారసత్వం లభిస్తుంది. సాకారుని ద్వారా డైరెక్షన్ లను తప్పకుండా తీసుకోవాలి. చాలామంది పిల్లలు, మేము శివబాబాతో యోగం జోడిస్తాము, బ్రహ్మాను విడిచిపెడతాము అని భావిస్తారు. కానీ శివబాబా నుండి ఎలా వింటారు? బ్రహ్మా బాబాతో మాకు ఎటువంటి కనెక్షన్ లేదు అని అంటారు. అచ్ఛా, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, శివబాబాను స్మృతి చేయండి. ఇంటికి వెళ్ళి కూర్చోండి. కానీ, సృష్టి చక్రానికి సంబంధించిన ఈ జ్ఞానం ఏదైతే లభిస్తుందో, దానిని ఎలా వింటారు? దీనిని అర్థం చేసుకోకుండా కేవలం స్మృతిని ఎలా చేయగలరు? జ్ఞానమైతే వీరి ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది కదా. మళ్ళీ ఎప్పుడూ జ్ఞానమైతే లభించదు. ప్రతి రోజు కొత్త-కొత్త విషయాలు తండ్రి ద్వారానే లభిస్తాయి. బ్రహ్మా మరియు బ్రహ్మాకుమారీలు లేకుండా ఎలా అర్థం చేసుకోగలరు. ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – ఎవరైతే ఇంట్లో కూర్చుని కర్మాతీత అవస్థను పొందేందుకు పురుషార్థం చేస్తారో, వారు ముక్తిలోకి వెళ్ళవచ్చు. జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. జ్ఞాన ధనాన్ని ధారణ చేసి మరియు దానం చేసినట్లయితే ధనవంతులుగా అవుతారు. లేదంటే సదా ధనవంతులుగా ఎలా అవుతారు. మురళీ యొక్క ఆధారం కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. చదువునైతే చదువుకోవాలి కదా. కేవలం లక్ష్యం తీసుకొని ముక్తిలోకి వెళ్ళేవారు చాలామంది వస్తారు. మీరు మనుష్యమాత్రులందరికీ అర్థం చేయిస్తారు – మీరు కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా, పవిత్రంగా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞాన ధనాన్ని తీసుకుంటారో, అప్పుడు సత్యయుగంలో షావుకార్లుగా అవుతారు. లేదంటే ముక్తిలోకి వెళ్ళి, మళ్ళీ భక్తి మార్గం సమయంలో వచ్చి భక్తి చేస్తారు. ఎవరి కళ్యాణం చేయలేరు ఎందుకంటే మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి జ్ఞానం తప్పకుండా కావాలి. జ్ఞానాన్ని విని మళ్ళీ వినిపించాలి కూడా. ప్రదర్శనీలలో చూడండి, ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు, అయినా ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఆత్మ ఎంత చిన్న బిందువు. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుష్యమాత్రులందరూ పాత్రధారులే. ఇది తయారై తయారైనటువంటి ఆట. పాత ప్రపంచ వినాశనం కూడా జరగనున్నది. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు… అని అంటూ ఉంటారు. ఎవరు వెళ్ళినా కానీ, పిల్లలకు దుఃఖముండదు. మీకు తెలుసు ఇది తయారై తయారవుతున్న డ్రామా, అందరి వినాశనమైతే జరగాల్సిందే. రాజా, రాణి, సాధు, సత్పురుషులు అందరూ మరణిస్తారు. మరి ఎవరు కూర్చుని వారి అస్థికలు తీస్తారు? ఎవరి పేరునైనా ప్రఖ్యాతి చేయడం కోసం ఇవి చేస్తారు, ఇందులో లాభమేమీ ఉండదు. అలాగే, వారి ఆత్మలకేమీ సుఖం కూడా లభించదు. మనుష్యులు భక్తి మార్గంలో ఏవైతే చేస్తారో, అన్నీ అవివేకంతో చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తున్నారు. పదే-పదే వచ్చి ఈ చిత్రాలను చూస్తూ ఉండాలి. బాబా మనల్ని చదివించి ఎలా తయారుచేస్తున్నారు, కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే అమలుపర్చరు. బాబా చాలా విషయాలను అర్థం చేయిస్తారు, వాటిని అమలుపర్చాలి. తండ్రికి పిల్లలుగా అయి కూడా సేవ చేయలేరు. తండ్రి అయితే కళ్యాణకారి. చాలామంది పిల్లలు అనేకులకు ఇంకా అకళ్యాణం చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఇక్కడి కోసం కొంచెం భావన ఉంటుందో, వారి భావనను కూడా పోగొట్టేస్తారు. ఇటువంటి వికర్మలను కూడా చేస్తూ ఉంటారు. భూతాలు ప్రవేశిస్తాయి కదా, అందుకే, సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరని అంటూ ఉంటారు కూడా. ఇందులో బాప్ దాదా ఇరువురూ వచ్చేస్తారు. నిరాకారుడినైతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వారిని ఏమి అనగలరు! భగవంతుడే దుఃఖాన్ని ఇస్తారు… అని భక్తి మార్గంలో అనేవారు. అది కూడా అజ్ఞానం కారణంగా అలా భావించేవారు. అజ్ఞానానికి వశమై తండ్రిని ఎంతగానో తిరస్కరించామని ఇప్పుడు పిల్లలకు తెలుసు. తమోప్రధానంగా ఉన్నవారిని సతోప్రధానంగా చేసేవారు ఎవ్వరూ లేరు. ఇంకా తప్పుడు మతాన్ని ఇస్తారు – పరమాత్మ సర్వవ్యాపి అని. మనుష్యులు ఎంతగా తికమకపడతారు. అప్పుడు, బ్రహ్మా తనువులోకి పరమాత్మ ఎలా రాగలరు అని అంటారు. మరి ఎవరి తనువులోకి రావాలి. కృష్ణుని తనువులోకి రావాలా? మరి బ్రహ్మాకుమార-కుమారీలు ఎలా తయారవుతారు. అప్పుడు వారు దైవీ కుమారులు, కుమారీలు అవుతారు. బ్రాహ్మణులైతే తప్పకుండా బ్రహ్మాకుమారులు మరియు కుమారీలే అవుతారు. బ్రాహ్మణులు లేకుండా బాబా ఏమీ చేయలేరు, అందుకే వీరి చిత్రాన్ని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మా కూడా బ్రాహ్మణుడే. భారత్ లో ప్రజాపిత బ్రహ్మా అయితే కావాలి. రోజు-రోజుకు ఇంట్లో కూర్చుని ఉండగానే చాలా మందికి బ్రహ్మా సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవరి పాత్ర అయితే ఉంటుందో, వారు చాలామంది పరుగెత్తుకొని వస్తారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారని చాలామంది భావిస్తారు. సాక్షాత్కారాలు కూడా పరమపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ చేయించలేరు. శివబాబా బ్రహ్మా ద్వారానే స్థాపన చేస్తారు. జ్ఞానాన్ని ఇస్తారు మరియు బ్రాహ్మణ ధర్మాన్ని కూడా రచిస్తారు. బ్రాహ్మణుల ధర్మం తప్పకుండా కావాలి. వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు. ప్రజాపిత బ్రహ్మా అయితే చాలా ఉన్నతమైనవారు కదా. వారిని నెక్స్ట్ గాడ్ అని అంటారు. సూక్ష్మవతనంలో ఇంకెవ్వరూ లేరు. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది, అంతే. బ్రహ్మా, తర్వాత దేవతగా అవుతారు. 84 జన్మల తర్వాత మళ్ళీ బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. జ్ఞాన-జ్ఞానేశ్వరీ తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు – ఇది చాలా ఫస్ట్ క్లాస్ పాయింట్. దీనిపై మంచి రీతిగా అర్థం చేయించవచ్చు. ఈ జ్ఞానం ఒక్క తండ్రి ద్వారా లభిస్తుంది. ప్రదర్శనీలలో మంచి రీతిగా అర్థం చేయించండి – మీరు బ్రహ్మా విషయంలో ఎందుకు తికమకపడతారు. ఇంతమంది బ్రాహ్మణ బ్రాహ్మణీలున్నారు – మొదట ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో, అప్పుడే విష్ణుపురికి యజమానులుగా, దేవతలుగా అవుతారు. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి ప్రసిద్ధి చెందాయి కదా. ఇప్పుడిది రాత్రి. ఈ విధంగా చిత్రాల ఎదురుగా కూర్చుని అభ్యాసం చేయండి. ఎవరైతే సేవ చేసేది ఉందో, వారికి సేవ తప్ప ఏ ఆలోచన రాదు. సేవ చేసేందుకు పరుగెడుతూ ఉంటారు. బుద్ధిలో జ్ఞానం మెదులుతూ ఉండాలి, మంచి రీతిగా జోలి నిండి ఉండాలి, అప్పుడే ఉత్సాహం వస్తుంది. సేవ చేసేందుకు పరుగెడుతూ ఉంటారు. జ్ఞానం ఉన్నా, కానీ అర్థం చేయించలేకపోవడం అన్నది జరగనే జరగదు. అప్పుడు, జ్ఞానం దేని కోసం తీసుకున్నట్లు? తీసుకోవాలి అంటే దానం చేయాలి. దానం చేయకపోతే, తమ సమానంగా తయారు చేయలేకపోతే అసలు బ్రాహ్మణులు ఎలా అయినట్లు. వారు థర్డ్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ బ్రాహ్మణుల వ్యాపారమే ఇది. బాబా రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు. సర్వీస్ మరియు డిస్ సర్వీస్ – ఇవి పిల్లల ద్వారానే జరుగుతాయి. ఒకవేళ సేవ చేయలేకపోతున్నారు అంటే తప్పకుండా డిస్ సర్వీస్ చేస్తూ ఉంటారు. మంచి-మంచి పిల్లలు ఎక్కడకు వెళ్ళినా కూడా, తప్పకుండా సేవే చేస్తారు. ఎప్పుడైతే జ్ఞానం సంపూర్ణంగా ఉంటుందో, అప్పుడు కొందరు అనన్యమైన పిల్లల ద్వారా తప్పులు జరగవు, అప్పుడే వారు మాలలో పూసలుగా అవుతారు. ముఖ్యమైనవి 8 పూసలు. పరీక్ష కూడా చాలా పెద్దది కదా. పెద్ద పరీక్షలో ఎప్పుడూ కొద్ది మందే పాస్ అవుతారు ఎందుకంటే తర్వాత గవర్నమెంట్ కు ఉద్యోగం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బాబా కూడా విశ్వానికి యజమానులుగా తయారుచేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది మందే పాస్ అవుతారు. ప్రజలైతే లక్షల మంది తయారవుతారు. అందుకే, బాబా అడుగుతారు – మహారాజుగా అవుతారా లేక ప్రజలలో షావుకారుగా అవుతారా? లేక పేదవారిగా అవుతారా? చెప్పండి ఏమవుతారో? మహారాజుల వద్ద దాస-దాసీలు చాలామంది ఉంటారు. వారిని కట్నంగా కూడా ఇస్తారు. పురుషార్థం చేసి మంచి పదవిని పొందాలి. ఎలాంటి తెలివైనవారిగా అవ్వాలంటే, అందరూ పిలిచే విధంగా ఉండాలి. తరచుగా చాలామందిని పిలుస్తూ ఉంటారు. ఇది మీకు తెలుసు కదా. ఇకపోతే, ఎవరిలోనైతే లక్షణాలు ఉండవో, వారిని ఎప్పుడూ ఎవ్వరూ పిలువరు. మేము థర్డ్ క్లాస్ వారిగా ఉన్నామని స్వయం అర్థం చేసుకోరు. కొంతమంది సర్వీసబుల్ గా ఉన్నారు, సేవ చేయడానికి అన్ని చోట్లకు పరుగెడతారు. ఉద్యోగం గురించి కూడా ఆలోచించకుండా సేవ చేయడానికి పరుగెడతారు. కొంతమందికి ఉద్యోగం లేకపోయినా కూడా, సేవ చేయరు, అభిరుచి ఉండదు. భాగ్యంలో లేదు లేదా గ్రహచారం ఉంటుంది. సేవ అయితే చాలా ఉంది, శ్రమ కూడా అనిపిస్తుంది, అలసిపోతారు కూడా. అర్థం చేయిస్తూ-చేయిస్తూ గొంతు కూడా ఎండిపోతుంది. అలాగే, థర్డ్ క్లాస్ వారి గొంతు కూడా ఎండిపోతుంది. దీని అర్థం, వారు చాలా మంచి సేవ చేసారని కాదు. మంచి రాయల్ సేవ చేసేవారు ఎవరో బాబాకు తెలుసు. కానీ చాలామందిలో లోపాలు కూడా ఉంటాయి. నామ-రూపాలలో చిక్కుకుంటూ ఉంటారు. మళ్ళీ శిక్షణనిచ్చి సరిదిద్దడం జరుగుతుంది. నామ రూపాలలో ఎప్పుడూ చిక్కుకోకూడదు, దేహీ అభిమానులుగా అవ్వాలి. ఆత్మ చిన్న బిందువు. తండ్రి కూడా బిందువే. స్వయాన్ని చిన్న బిందువుగా అర్థం చేసుకొని బాబాను స్మృతి చేయడం చాలా శ్రమ ఉంది. శివబాబా, మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తున్నామని పైపైకి అంటూ ఉంటారు. కానీ బుద్ధిలో ఏక్యురేట్ స్మృతి ఉండాలి. చాలా ఓర్పుతో మరియు గంభీరతతో స్మృతి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరో అతికష్టంగా స్మృతి చేస్తారు. ఇందులో చాలా శ్రమ ఉంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకొని దానం చేయాలి. ఈ వ్యాపారంలో బిజీగా ఉంటూ ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణులుగా అవ్వాలి.

2. మీరు కళ్యాణకారీ తండ్రి పిల్లలు కనుక అందరి కళ్యాణం చేయాలి. ఎవరి భావననైనా తెంచడం, తప్పుడు మతాన్ని ఇవ్వడం, ఇటువంటి అకళ్యాణ కర్తవ్యాలను ఎప్పుడూ చేయకూడదు.

వరదానము:-

ఎలాగైతే శరీర నిర్వహణ కోసం అనేక సాధనాలను తమవిగా చేసుకుంటారో, అలాగే ఆత్మిక ఉన్నతి యొక్క సాధనాలను కూడా తమవిగా చేసుకోండి. దీనికోసం సదా అకాలమూర్త స్థితిలో స్థితులయ్యేటువంటి అభ్యాసం చేయండి. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్త్ (ఆత్మ) అని అర్థం చేసుకుని నడుచుకుంటారో వారు అకాల మృత్యువు నుండి, అకాలం నుండి, సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకునేందుకు కేవలం తమ పాత శరీరం యొక్క భానాన్ని సమాప్తం చేస్తూ వెళ్ళండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top