03 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 2, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

ఏ కాంట్రాక్టును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకోలేరు?

ప్రశ్న: -

ఏ కాంట్రాక్టును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకోలేరు?

జవాబు:-

పావన ప్రపంచాన్ని తయారుచేసే కాంట్రాక్టు ఒక్క తండ్రికి చెందినది. ఈ కాంట్రాక్టును ఇంకెవ్వరూ తీసుకోలేరు. సన్యాసులు పావనంగా అయి, ఈ ప్రపంచాన్ని తప్పకుండా కాపాడుతారు కానీ వారు పావన ప్రపంచాన్ని తయారుచేసే కాంట్రాక్టును తీసుకోరు. పావనంగా అయ్యే యుక్తిని తండ్రి పిల్లలకు తెలియజేస్తారు. పిల్లలూ, వ్యాపార-వ్యవహారాలు చేస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు..

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఒకవేళ శివ భగవానువాచ అని అన్నా, ‘శివ’ అనే పేరుతో చాలా మంది మనుష్యులున్నారు, అందుకే ముందుగా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు ఇస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రాతః సమయంలో ముందుగా ‘గుడ్ మార్నింగ్’ అని చెప్తారు. మీరు కూడా ‘గుడ్ మార్నింగ్’ అని విన్నారు. ఉదయాన్నే ఎవరు వచ్చి ‘గుడ్ మార్నింగ్’ చెప్తారు? తండ్రి తెల్లవారుజామున వస్తారు. ఇది అనంతమైన పగలు మరియు రాత్రి. దీని గురించి మనుష్య మాత్రులెవ్వరికీ తెలియదు. పిల్లలకు కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా తెలుసు. పిల్లలుగా అయితే అయ్యారు కానీ ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయరు. ఉదయమే లేచి మొట్టమొదటగా శివబాబాకు ‘గుడ్ మార్నింగ్’ చెప్పాలి అనగా వారిని స్మృతి చేస్తే చాలా సంతోషం కూడా ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు ఉదయం లేచి బాబాను అసలు స్మృతియే చేయరు. భక్తి మార్గంలో కూడా మనుష్యులు ఉదయమే లేచి భక్తి చేస్తారు, పూజలు చేస్తారు, మాలను తిప్పుతారు, మంత్రాలను జపిస్తారు. వారు సాకారంలో ఉన్నవారికి భక్తి చేస్తారు. రూపం వారి ముందుకు వస్తుంది. శివుని పూజారులు ఎవరైతే ఉన్నారో, వారికి కూడా తయారుచేయబడిన పెద్ద శివలింగం యొక్క విగ్రహం గుర్తొస్తుంది. అది తప్పు. పిల్లలైన మీరు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని, ఉదయమే లేచి – ‘బాబా, గుడ్ మార్నింగ్’ అని బాబాతో మాట్లాడాలి. కానీ ఈ అలవాటు ఎవ్వరికీ లేదని బాబాకు తెలుసు. తండ్రి అంటారు – పిల్లలూ, మీ తల పై అర్ధ కల్పం యొక్క భారముంది. ఆ భారం తొలగడం లేదు ఎందుకంటే మీరు స్మృతి చేయడం లేదు. కొంతమంది పాపాలు అయితే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఎలాగైతే ఎలుక ఊది తర్వాత కొరుకుతుందో, అదే విధంగా మాయ కూడా ఎలుక వలె కొరుకుతూ ఉంటుంది. తలపై వెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటుంది కానీ తెలియనే తెలియదు. కొంతమంది తమను తాము జ్ఞానులుగా భావిస్తారు, కానీ స్మృతిలో చాలా అపరిపక్వంగా ఉన్నారని బాబాకు తెలుసు. మేము ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేస్తున్నామా అని మీ మనసును ప్రశ్నించుకోండి. అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతమైన పగలులో వచ్చి కలుసుకున్నారు. సన్యాసులు కూడా లేచి బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. మనుష్యులు లేస్తూనే మిత్ర-సంబంధీకులు, స్నేహితులు మొదలైనవారిని గుర్తు చేసుకుంటారు. ఎవరైనా భక్తులు ఉంటే వారు దేవతలను గుర్తు చేసుకుంటారు. పాపాత్ములు పాపాత్ములకు ‘గుడ్ మార్నింగ్’ చెప్తారు అనగా వారిని గుర్తు చేసుకుంటారు. ఉదయం వేళ గుర్తు చేసుకోవాలి. భక్తి కూడా ఉదయమే చేస్తారు కానీ ఎవ్వరూ భగవంతుడిని భక్తి చేయరు, ఎందుకంటే భగవంతుడు ఎవరు అనేది తెలియనే తెలియదు. భక్తికి ఫలాన్నిచ్చేవారు భగవంతుడు అని అయితే అంటారు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఇలా ఆత్మ అంటుంది కానీ పరమాత్మ గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు. భగవంతుడు స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చినప్పుడు ఇది తెలుసుకోగలరు. లేదంటే అందరూ నేతి-నేతి అని అంటారు అనగా మాకు తెలియదు అని అర్థము. కావున ఈ సమయంలోనే పరమాత్మ వచ్చి వారు ఎవరు అనేది చెప్తారు. కానీ పిల్లలలో కూడా చాలా మంది పెద్ద-పెద్ద మహారథులు ఎవరైతే సెంటర్లను సంభాళిస్తారో, వారికి కూడా తండ్రి గురించి పూర్తిగా తెలియదు. ఆ ప్రేమతో తండ్రిని స్మృతి చేయరు. ఉదయమే లేచి ప్రేమగా ‘గుడ్ మార్నింగ్’ చెప్పడం, జ్ఞాన చింతనలో ఉండడం కూడా చేయరు. స్మృతి చేస్తే సంతోషపు పాదరసం పెరుగుతుంది కానీ మాయ దానిని పెరగనివ్వదు. ఒకవేళ తండ్రిని అగౌరవపరిచినట్లయితే, మాయ ఒక్కసారిగా బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. అప్పుడు అనవసరమైన వ్యర్థ మాటలలో బుద్ధి చిక్కుకుని ఉంటుంది. స్వర్గానికి యజమానిగా అవ్వడం అంత సులభమేమీ కాదు. ప్రజలుగా అవ్వడం సహజమే. మున్ముందు 30-40 సంవత్సరాలు ఉన్నవారు కూడా బాబాను విడిచిపెట్టి వెళ్ళిపోవడాన్ని మీరు చూస్తారు. మాయ ఒక్కసారిగా ఎగిరిపోయేలా చేస్తుంది. రాజ్య పదవిని పొందలేరు. ముందే మరణిస్తే, రాజ్యం ఎక్కడి నుండి లభిస్తుంది. ఈ రహస్యాన్ని బాబా చెప్పరు. మాయ కూడా – ‘అర్ధ కల్పం నేను రాజ్యం చేసాను, వీరు నా పై విజయం పొందుతారా’ అని చూస్తుంది. అప్పుడిక శివబాబాను పూర్తిగా మర్చిపోతారు. అక్కడక్కడ కొంతమంది వీరి (బ్రహ్మాబాబా) నామ రూపాలలో కూడా చిక్కుకుపోతారు. శివబాబాను స్మృతి చేయరు. ఎవరిలోనైతే క్రోధం, లోభం, మోహం అనే భూతాలుంటాయో, వారు బాబాను ఏం స్మృతి చేస్తారు. నామ రూపాలలో ఎంతగా చిక్కుకుంటారో, ఇక అడగకండి. దేహాభిమానంలో వేలాడుతూ ఉంటారు. శివబాబా అంటారు – గృహస్థంలో ఉంటూ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది, ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి చేయకుండా సతోప్రధానంగా అవ్వలేరు, ఉన్నత పదవిని పొందలేరు. బుద్ధి యోగం వేరే వైపు భ్రమిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా ప్రాణప్రదంగా, ప్రియాతి ప్రియంగా తండ్రిని స్మృతి చేస్తారు. బాబాకు ‘గుడ్ మార్నింగ్’ చెప్పిన తర్వాత ఇలా అనాలి – బాబా, మేము మీ స్మృతిలో ఉంటాము ఎందుకంటే తలపై పాపాల భారం చాలా ఉంది. ఒకవేళ తండ్రి స్మృతిలో లేకపోతే, పాపాల భారం ఎలా తొలుగుతుంది. దేహాభిమానం అర్ధ కల్పం ఉంది కనుక అది వెళ్ళడం లేదు. దేవతలు అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి పరమాత్మ గురించి తెలియదు కానీ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అర్థం చేసుకుంటారు. ఒకవేళ రచయిత గురించి తెలిసినట్లయితే, రచనను గురించి మరియు తండ్రి ఇచ్చే ఆస్తిని గురించి కూడా తెలుస్తుంది. అక్కడ ఈ జ్ఞానముండదు. తండ్రి అంటారు – నేను మీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను. తర్వాత ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. ఈ జ్ఞానం ఏమీ తరతరాలుగా కొనసాగదు. ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలియదు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర ఎలా లభించింది అనేది ఇప్పుడు మీకు తెలుసు. చాలా మంచి పాత్రధారులు – మీరు. ఈ సమయంలో మీరు ఈ విశ్వమంతటినీ మీ రాజ్యంగా చేసుకుంటారు. మీది హీరో-హీరోయిన్ పాత్ర. బాబాను స్మృతి చేయడమనేది ముఖ్యమైన విషయము. ప్రదర్శనీలలో చాలా మంది చాలా బాగా సేవ చేస్తారని బాబాకు తెలుసు, కానీ స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు. ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలనే తెలివి కూడా లేదు. టాపిక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదైతే కామన్. రోజు-రోజుకు కొత్త టాపిక్స్ గురించి అర్థం చేయించవచ్చు, కానీ తండ్రిని ప్రేమగా స్మృతి చేయడమనేది ముఖ్యమైన విషయం, అప్పుడే పాపాలు తొలుగుతాయి.

పిల్లల అవస్థ ఇంకా అలా లేదు అని బాబాకు తెలుసు. పేర్లు అయితే బాబా చెప్పరు. ఒకవేళ బాబా పేర్లు చెప్పారంటే, పైసకు విలువైన అవస్థ ఏదైతే ఉందో, అది పడిపోయి అందులో పావు వంతు అయిపోతుంది. ఈ జ్ఞానంలో వివేకం కావాలి. ఎవరైనా మీరు పేలగా కనిపిస్తున్నారు, అనారోగ్యంగా ఉన్నారు అని అంటే, అది వినగానే జ్వరం రాకూడదు. అంత అపరిపక్వంగా ఉండకూడదు. ధైర్యం కావాలి. సేవాధారి పిల్లలు వదిలి వెళ్ళరు. వారు నషాలో ఉంటారు. వ్యాపార-వ్యవహారాలు చేస్తూ బాబా స్మృతి ఉండాలి. బాబాకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉండాలి. ఇది చాలా గొప్ప గమ్యము. రాజ్య పదవి పొందాలంటే శ్రమ కూడా చేయాలి. ఎవరైతే కల్పక్రితం తయారయ్యారో వారికి మున్ముందు తెలుస్తూ ఉంటుంది. ఎవ్వరూ దాగి ఉండరు. స్కూలులో టీచరుకు విద్యార్థి గురించి తెలుస్తుంది, రిజిస్టరు కూడా పెడతారు. దాని ద్వారా కూడా తెలిసిపోతుంది. ఆ చదువులో ముఖ్యమైన సబ్జెక్టు – భాష. ఇక్కడ ముఖ్యమైన సబ్జెక్టు – స్మృతి. జ్ఞానమైతే సహజము. పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు. చిన్నతనంలో ధారణ చేసేందుకు బుద్ధి చురుకుగా ఉంటుంది. వృద్ధ మాతలు అంతగా అర్థం చేయించలేరు. ఇక్కడ కూడా కుమారీలను బాబా చాలా గౌరవిస్తారు. వారు నామ రూపాలలో చిక్కుకోకుండా, తలక్రిందులుగా వేలాడకుండా, మూర్ఖులుగా అవ్వకుండా ఉంటే చాలు. ఈ సమయంలో మనుష్యులందరూ గుడ్లగూబ వలె తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నారు. మళ్ళీ తిరిగి సరైన రీతిలో ఉన్నట్లయితే అల్లాకు పిల్లలుగా అవుతారు. పరమాత్మను సర్వవ్యాపి అన్న కారణంగానే మనుష్యులందరూ పరమాత్మ నుండి విముఖులుగా అయిపోయారు. సన్యాసులు స్వయంగా వారి పూజ చేయించుకుంటారు. లేకపోతే, మీరు నా పైన పుష్పాలు ఎందుకు అర్పిస్తారని అడగాలి. అందరూ సన్యాసులను గురువులుగా చేసుకుంటారు. వారు సన్యాసులు, వీరు గృహస్థులు. అటువంటప్పుడు, వారు ఫాలోవర్స్ ఎలా అవ్వగలరు? సన్యాసులుగా అయినప్పుడే వారిని ఫాలోవర్స్ (అనుసరించేవారు) అని అనవచ్చు. తమను తాము ఫాలోవర్స్ అనలేరని కూడా ఎవ్వరూ వారికి అర్థం చేయించలేరు. మీరు ఫాలోవర్ అని బాబా ఎవ్వరికీ చెప్పరు. పావనంగా అవుతామని గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ మాట అనగలరు. ప్రతిజ్ఞ చేసినప్పుడు స్వయంగా రాసి పంపిస్తారు. కానీ పడిపోయినప్పుడు, నల్ల ముఖం చేసుకున్నప్పుడు బాబాకు రాయరు ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది. ఇది చాలా పెద్ద దెబ్బ. తర్వాత బాబాతో బుద్ధియోగం జోడించబడదు. పతితుల పట్ల మనకు ద్వేషం కలుగుతుంది. బాబా అంటారు – విషం తినేవారు (వికారాలలోకి వెళ్ళేవారు) చాలా చెడ్డవారు. పవిత్రంగా అవ్వడం మంచిది కదా, నేను వచ్చి పవిత్రంగా చేసే కాంట్రాక్టు తీసుకుంటాను – నేను పవిత్ర ప్రపంచాన్ని తయారుచేసి చూపిస్తాను. కల్ప-కల్పం కాంట్రాక్టర్ అయిన నన్నే – ఓ పతిత పావనా రండి అని పిలుస్తారు. ఇలాంటి కాంట్రాక్టరు ఇంకెవ్వరూ ఉండరు. నాకు ఒక్కడికి మాత్రమే ఈ కాంట్రాక్టు లభించింది, నేనే పావన ప్రపంచాన్ని తయారుచేస్తాను. నేను కల్ప-కల్పం వచ్చి ఈ కాంట్రాక్టును పూర్తి చేస్తాను. సన్యాసులకు – పవిత్రంగా ఉంటూ భారత్ ను నిలబెట్టే కాంట్రాక్టు లభించింది, ఎందుకంటే అన్నింటికంటే పవిత్రంగా భారత్ యే ఉండేది, దానినే స్వర్గమని అంటారు. అక్కడ దేవతలు సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. వారి మహిమను గాయనం చేస్తారు. ఈ గాయనం ఇతర దేశాలలో లేదు. అక్కడ చిత్రాలైతే లేవు. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. లక్ష్మీనారాయణులను గాడ్-గాడెస్ (భగవాన్-భగవతి) అని అంటారు. చాలా ప్రేమగా పాత చిత్రాలను కొంటారు. లార్డ్ కృష్ణుని చిత్రం కూడా అందరూ అడుగుతారు. అందరికంటే ఎక్కువగా లార్డ్ కృష్ణుడినే ఇష్టపడతారు.

మేము సతోప్రధానంగా అవ్వాలనే చింత పిల్లలైన మీకు ఉండాలి. మాయ చాలా సతాయిస్తుంది. పూర్తిగా నామ రూపాలలో చిక్కుకుంటారు. శివబాబాను అసలు స్మృతియే చేయరు. బాబా పదే-పదే అర్థం చేయిస్తారు – ఈ విషయాలు మాకు శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి అని. ఈ బ్రహ్మా ఏమీ చెప్పరు. అయినా సరే శివబాబాను మర్చిపోయి నామ-రూపాలను స్మృతి చేస్తూ ఉంటారు. అటువంటివారు ఏ పదవిని పొందుతారు! ముందుగా శ్రీమతాన్ని అనుసరించాలి. శివబాబా అంటారు – భూతాలను పారద్రోలండి, దేహాభిమానాన్ని పారద్రోలండి అని. ఆత్మనైన నేను చాలా మధురంగా తయారవ్వాలి. బాబా అంటారు – దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోతూ ఉండండి, నన్ను స్మృతి చేయండి. చేతులతో పని చేస్తూ కూడా మనసు మాత్రం ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండాలి… నేను పాత ప్రియుడిని. ఈ విధంగా అర్థం చేయించడం ఇంకెవ్వరికీ రాదు. ఈ సమయంలో తండ్రియే వచ్చి మిమ్మల్ని ఆత్మిక ప్రేయసులుగా చేస్తారు. ఇప్పుడు – మా ప్రియుడు శివబాబా అని, వారి నుండి స్వర్గ వారసత్వం పొందాలని మీ ఆత్మకు తెలుసు. ఇలాంటి శివబాబాకు ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పండి, వారిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి. దేహాభిమానం తొలుగుతూ ఉంటుంది. ఇలా అభ్యాసం చేస్తూ-చేస్తూ ఆ అవస్థ ఏర్పడుతుంది. స్మృతిలో కూర్చొని ఉంటారు కానీ కస్టమర్లు వచ్చినప్పటికీ బుద్ధి అటువైపుకు వెళ్ళదు. అప్పుడు వారికి కూడా చెప్తారు – నేను స్మృతిలో ఉన్నాను, చాలా సంతోషం కలుగుతుంది అని. కస్టమర్లకు కావలసినవి ఇచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి స్మృతిలో కూర్చొంటారు. మీరు కర్మాతీతులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. బాబా చాలా యుక్తులను తెలియజేస్తారు. వీరి గురించి (బ్రహ్మా గురించి) ఇలా అంటారు – వీరికి చాలా వ్యవహారాలున్నాయి, మీకు స్మృతి చేసేందుకు చాలా తీరిక దొరుకుతుంది. బాబా తమ ఉదాహరణను చెప్తారు – భోజనం చేసినప్పుడు శివబాబాను స్మృతి చేసి కూర్చొంటారు, మనమిద్దరము కలిసి తింటాము, తర్వాత మళ్ళీ మర్చిపోతాను అని. అందరికంటే ఎక్కువ చిక్కులు ఈ తండ్రికే ఉన్నాయి. మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. రాత్రి 12 గంటల తర్వాత ఎ.ఎమ్ (ఉదయం) ప్రారంభమవుతుంది. రాత్రి వేళ త్వరగా నిదురించండి – త్వరగా మేల్కొని స్మృతి చేయండి. లేస్తూనే – బాబా, గుడ్ మార్నింగ్ అని చెప్పండి, ఇక వేరే వైపులకు బుద్ధి వెళ్ళకూడదు. బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మీ సంపాదన భవిష్యత్తు కోసము, అది చాలా గొప్పది. కల్ప-కల్పం కోసం ఈ సంపాదన పనికి వస్తుంది. ఏ భూతము రాకూడదు. క్రోధం కూడా తక్కువేమీ కాదు. మోహం కూడా చెడ్డదే. ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో కూర్చొని పావనంగా అవ్వాలి. ఎలాగైతే బాబా జ్ఞానసాగరుడో, పిల్లలు కూడా అలా తయారవ్వాలి. కానీ సాగరం ఒక్కటే ఉంటుంది కదా. మిగిలినవాటి అన్నింటినీ నదులని అంటారు. క్రోధమనేది రెండవ నంబరు శత్రువు. చాలా నష్టపరుస్తుంది. పరస్పరం హృదయాలను కాల్చేస్తుంది. లోభీ వ్యక్తులు కూడా పరస్పర హృదయాలను కాల్చుకుంటారు. మోహమనే భూతమైతే సర్వనాశనం చేస్తుంది. మోహం కారణంగా శివబాబా స్మృతిని మర్చిపోయి తమ పిల్లలను స్మృతి చేస్తూ ఉంటారు. నష్టోమోహులుగా ఉన్నవారు స్థిరమైన అవస్థలో ఉంటారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల నంబరువారు పురుషార్థం అనుసారంగా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మంచి సేవ చేయడంతో పాటు ప్రాణప్రదంగా తండ్రిని స్మృతి చేయాలి. ఉదయం లేస్తూనే ప్రేమగా బాబాకు ‘గుడ్ మార్నింగ్’ చెప్పాలి. కర్మలు చేస్తూ కూడా స్మృతి చేసే అభ్యాసం చేయాలి.

2. ఏ దేహధారుల నామ-రూపాలలో చిక్కుకోకూడదు. జ్ఞాన చింతనలో ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు.

వరదానము:-

అలలలో తేలియాడుతున్న లేక మునిగిపోతున్న ఆత్మ ఒక గడ్డిపరక అంతటి ఆధారాన్ని వెతుకుతుంది. అలాగే ఒక దుఃఖపు అల వచ్చిందంటే, అప్పుడు సుఖశాంతుల కోసం అనేకమంది బికారి ఆత్మలు తపిస్తూ మీ ముందుకు రావడాన్ని చూస్తారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖం మరియు సర్వ శక్తులతో, సర్వ ఖజానాలతో నిండుగా చేసుకోండి. సర్వ ఖజానాలు ఎంతగా జమ అవ్వాలంటే, మీ స్థితి కూడా స్థిరంగా ఉండాలి మరియు ఇతర ఆత్మలను కూడా సంపన్నంగా చేయగలగాలి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top