28 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 27, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“స్వమానం ద్వారానే గౌరవం యొక్క ప్రాప్తి”

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న స్వమానధారి పిల్లలను చూస్తున్నారు. స్వమానధారి పిల్లలకే పూర్తి కల్పమంతా గౌరవం లభిస్తుంది. ఒక్క జన్మ స్వమానధారి, పూర్తి కల్పమంతా గౌరవనీయమైనవారిగా అవుతారు. తమ రాజ్యంలో కూడా రాజ్యాధికారులుగా ఉన్న కారణంగా ప్రజల ద్వారా గౌరవం ప్రాప్తిస్తుంది మరియు అర్ధకల్పం భక్తుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు మీ అంతిమ జన్మలో కూడా భక్తుల ద్వారా దేవాత్మలకు మరియు శక్తి రూపాలకు లభించే గౌరవాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు. ఎంత హృదయపూర్వకమైన ప్రేమతో ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారు! ఇంతటి శ్రేష్ఠమైన భాగ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు! ముఖ్యంగా కేవలం ఒక్క విషయాన్ని త్యాగం చేయడం వలన ఈ భాగ్యం లభించింది. ఏమి త్యాగం చేసారు? దేహాభిమానాన్ని త్యాగం చేసారు ఎందుకంటే దేహాభిమానాన్ని త్యాగం చేయకుండా స్వమానంలో అస్సలు స్థితులవ్వలేరు. ఈ త్యాగానికి ప్రతిఫలంగా భాగ్యవిధాత భగవంతుడు ఈ భాగ్యాన్ని వరదానంగా ఇచ్చారు. రెండవ విషయము – తండ్రి స్వయంగా పిల్లలైన మీకు స్వమానాన్ని ఇచ్చారు. తండ్రి పిల్లలను చరణ దాసులు లేక చరణ దాసీల నుండి తమ శిరోకిరీటంగా తయారుచేసారు. ఎంత గొప్ప స్వమానాన్ని ఇచ్చారు! ఇలాంటి స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే పిల్లలను తండ్రి కూడా గౌరవిస్తారు. తండ్రి పిల్లలను సదా తమ కన్నా ముందు పెడతారు. సదా పిల్లల గుణాలను గాయనం చేస్తారు. ప్రతి రోజు హృదయపూర్వకమైన ప్రేమతో ప్రియస్మృతులు ఇచ్చేందుకు పరంధామం నుండి సాకార వతనంలోకి వస్తారు. అక్కడి నుండి పంపించడం లేదు కానీ ఇక్కడికి వచ్చి ఇస్తారు. ప్రతిరోజు ప్రియస్మృతులు లభిస్తాయి కదా. ఇంతటి శ్రేష్ఠ గౌరవాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వయంగా తండ్రియే గౌరవాన్ని ఇచ్చారు కనుక అవినాశీ గౌరవానికి అధికారులుగా అయ్యారు. ఇలాంటి శ్రేష్ఠతను అనుభవం చేస్తున్నారా? స్వమానం మరియు గౌరవం – రెండింటికీ పరస్పరంలో సంబంధముంది.

స్వమానధారులు తమకు ప్రాప్తించిన స్వమానంలో ఉంటూ, స్వమానం యొక్క గౌరవంలో కూడా ఉంటారు, ఇతరులను కూడా గౌరవంతో చూస్తారు, మాట్లాడుతారు మరియు సంపర్కంలోకి వస్తారు. స్వ గౌరవం అంటేనే స్వయాన్ని గౌరవించుకోవడము అని అర్థము. ఉదాహరణకు తండ్రి విశ్వంలోని సర్వాత్మల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకుంటారు, ప్రతి ఒక్కరు వారికి గౌరవాన్ని ఇస్తారు. కానీ తండ్రికి ఎంతైతే గౌరవం లభిస్తుందో, అంతగా వారు పిల్లలందరికీ గౌరవాన్ని ఇస్తారు. ఎవరైతే ఇవ్వరో, వారు దేవతలుగా అవ్వరు. మీరు అనేక జన్మలు దేవతలుగా అవుతారు మరియు అనేక జన్మలు దేవతా రూపానికే పూజ జరుగుతుంది. ఒక్క జన్మ బ్రాహ్మణులుగా అవుతారు కానీ అనేక జన్మలు దేవతా రూపంలో రాజ్యం చేస్తారు మరియు పూజ్యులుగా అవుతారు. దేవతలు అనగా ఇచ్చేవారు. ఒకవేళ ఈ జన్మలో గౌరవం ఇవ్వలేదంటే దేవతలుగా ఎలా అవుతారు, అనేక జన్మలు గౌరవాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించండి). సాకార స్వరూపంలో బ్రహ్మాబాబాను చూసారు – సదా స్వయాన్ని వరల్డ్ సర్వెంట్ (విశ్వ సేవాధారి) గా భావించారు. పిల్లలకు సేవాధారిగా పిలవబడ్డారు మరియు పిల్లలను యజమానులుగా చేసారు. సదా మాలేకమ్ సలామ్ చేసారు (నమస్కరించారు). చిన్న పిల్లలకు కూడా సదా గౌరవంతో కూడిన స్నేహాన్ని ఇచ్చారు, కాబోయే విశ్వకళ్యాణకారుల రూపంలో చూసారు. కుమారీలు, కుమారులు, యువావస్థలో ఉన్న వారిని సదా విశ్వంలో ప్రసిద్ధి చెందిన మహాన్ ఆత్మలను ఛాలెంజ్ చేసేవారిగా, అసంభవాన్ని సంభవం చేసేవారిగా, మహాత్ముల శిరస్సును వంచేవారిగా – ఇలాంటి పవిత్ర ఆత్మలు అనే గౌరవంతో చూసారు. సదా తమ కన్నా అద్భుతం చేసే మహాన్ ఆత్మలుగా భావించి గౌరవాన్ని ఇచ్చారు కదా! అలాగే వృద్ధులను సదా అనుభవీ ఆత్మలు, హమ్ జీన్స్ (తమ తోటివారు) అనే గౌరవంతో చూసారు. బంధనంలో ఉన్న వారిని నిరంతరం స్మృతిలో ఉండే నంబరువన్ ఆత్మలు అనే గౌరవంతో చూసారు అందుకే నంబరువన్ అవినాశీ గౌరవానికి అధికారిగా అయ్యారు. రాజ్య గౌరవంలో కూడా నంబరువన్ – విశ్వ మహారాజు. పూజ్య రూపంలో కూడా తండ్రి పూజ తర్వాత మొదటి పూజ్యులుగా లక్ష్మి నారాయణులే తయారవుతారు. కనుక రాజ్య గౌరవం మరియు పూజ్య గౌరవం – రెండింటిలో నంబరువన్ గా అయ్యారు ఎందుకంటే సర్వులకు స్వమానాన్ని, గౌరవాన్ని ఇచ్చారు. ఇతరులు గౌరవాన్ని ఇస్తే, నేను గౌరవాన్ని ఇస్తాను అని అనుకోలేదు. గౌరవం ఇచ్చేవారు నిందించేవారిని కూడా తమ మిత్రులుగా భావిస్తారు. కేవలం గౌరవాన్ని ఇచ్చేవారిని మాత్రమే తమవారిగా భావించరు, కానీ నిందించేవారిని కూడా తమవారిగా భావిస్తారు ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మన పరివారమే. సర్వాత్మలకు బ్రాహ్మణులైన మీరు కాండము వంటి వారు. ఈ శాఖలన్నీ అనగా భిన్న-భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలు కూడా మూల కాండము నుండే వెలువడ్డారు. కనుక అందరు మనవారు అయినట్లే కదా. ఇలాంటి స్వమానధారులు సదా స్వయాన్ని మాస్టర్ రచయితలుగా భావించి సర్వులకు గౌరవాన్ని ఇచే దాతలుగా అవుతారు. సదా స్వయాన్ని ఆదిదేవ బ్రహ్మా యొక్క ఆది రత్నాలము, ఆది పాత్రధారి ఆత్మలము అని భావిస్తున్నారా? అంత నషా ఉందా? అందరూ విన్నారు కదా – పిల్లల గౌరవం ఏమిటి, వృద్ధుల గౌరవం ఏమిటి, యువకుల గౌరవం ఏమిటి? ఆదిపిత అయిన బ్రహ్మా మనల్ని ఇలాంటి గౌరవంతో చూసారు. ఎంత నషా ఉంటుంది! కనుక ఆది ఆత్మ ఏ శ్రేష్ఠ దృష్టితో చూసారో, అలాంటి శ్రేష్ఠ స్థితి యొక్క సృష్టిలోనే ఉంటాము అని సదా స్మృతిలో ఉంచుకోండి. తమతో తాము ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకోండి. ప్రతిజ్ఞలైతే చేస్తూ ఉంటారు కదా. మాటల ద్వారా కూడా ప్రతిజ్ఞ చేస్తారు, మనసు ద్వారా కూడా చేస్తారు మరియు వ్రాసి కూడా చేస్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు కూడా. అందుకే ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని తీసుకోలేకపోతారు. గుర్తుంచుకుంటే లాభం కూడా తీసుకుంటారు. అందరూ తమను తాము చెక్ చేసుకోండి – ఎన్ని సార్లు ప్రతిజ్ఞ చేసాము మరియు ఎన్నిసార్లు నిలబెట్టుకున్నాము? నిలబెట్టుకోవడం వచ్చా లేక కేవలం ప్రతిజ్ఞ చేయడం మాత్రమే వచ్చా? లేక అప్పుడప్పుడు ప్రతిజ్ఞ చేసేవారిగా, అప్పుడప్పుడు నిలబెట్టుకునేవారిగా మారుతూ ఉంటారా?

టీచర్లు ఏమని భావిస్తున్నారు? నిలబెట్టుకునేవారి లిస్టులో ఉన్నారు కదా. బాప్ దాదా టీచర్లను సదా తోటి శిక్షకులు అని అంటారు. కనుక తోడుగా ఉండేవారి విశేషత ఏముంటుంది? తోడుగా ఉండేవారు సమానంగా ఉంటారు. బాబా ఎప్పుడైనా మారుతారా ఏమిటి? టీచర్లు కూడా ప్రతిజ్ఞ మరియు లాభము – రెండింటి బ్యాలెన్స్ పెట్టేవారు. ప్రతిజ్ఞలు ఎక్కువ, లాభం తక్కువ – ఇలా ఉంటే బ్యాలెన్స్ అవ్వదు. ఎవరైతే రెండింటి బ్యాలెన్స్ పెడతారో, వారికి వరదాత తండ్రి ద్వారా ఈ వరదానం లేక ఆశీర్వాదం లభిస్తుంది. వారు సదా దృఢ సంకల్పం ద్వారా కర్మలో సఫలతా మూర్తులుగా అవుతారు. తోటి శిక్షకుల విశేషమైన కర్మ ఇదే. సంకల్పం మరియు కర్మ సమానంగా ఉండాలి. సంకల్పం శ్రేష్ఠంగా మరియు కర్మ సాధారణంగా ఉంటే దీనిని సమానత అని అనరు. కనుక టీచర్లు సదా తమను తాము ‘‘సాథీ శిక్షకులు’’ అనగా ‘‘తండ్రి సమానమైన శిక్షకులు’’ గా భావించి, ఈ స్మృతి ద్వారా సమర్థులుగా అయి నడవండి. బాప్ దాదాకు టీచర్ల ధైర్యం చూసి సంతోషమనిపిస్తుంది. ధైర్యముంచి సేవకు నిమిత్తంగా అయితే అయ్యారు కదా. కానీ ఇప్పుడు సదా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి – ‘‘ధైర్యం గల టీచర్లే తండ్రి సమానమైన శిక్షకులు’’. ఇది ఎప్పుడూ మర్చిపోకండి. కనుక స్వతహాగానే, సమానంగా అయ్యేటటువంటి లక్ష్యము – ‘‘బాప్ దాదా’’, మీ ఎదురుగా ఉంటారు అనగా తోడుగా ఉంటారు.

నలువైపులా ఉన్న స్వమానధారి మరియు గౌరవనీయులైన పిల్లలను బాప్ దాదా తమ నయనాల ఎదురుగా చూస్తూ గౌరవనీయమైన దృష్టితో ప్రియస్మృతులను ఇస్తున్నారు. సదా రాజ్య గౌరవం మరియు పూజ్య గౌరవంలో సమానమైన సాథీ పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

బీహార్ గ్రూపు – అందరూ స్వయాన్ని స్వరాజ్య అధికారులుగా భావిస్తున్నారా? స్వ రాజ్యం లభించిందా లేక ఇంకా లభించనుందా? స్వరాజ్యం అనగా ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించగలగాలి. కర్మేంద్రియజీతులు అనగా స్వరాజ్య అధికారులు. ఇలాంటి అధికారులుగా అయ్యారా లేదా అప్పుడప్పుడు కర్మేంద్రియాలు మిమ్మల్ని నడిపిస్తాయా? అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనసును నడిపిస్తారా? మనసు ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు చేస్తుందా లేక చేయడం లేదా? ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే ఆ సమయంలో స్వరాజ్య అధికారులని అంటారా? ‘రాజ్యము’ అనేది చాలా గొప్ప సత్తా (శక్తి). రాజ్య సత్తా ఏది కావాలంటే అది చేయగలదు, ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించగలదు. ఈ మనసు, బుద్ధి, సంస్కారాలు ఆత్మ యొక్క శక్తులు. ఆత్మ, ఈ మూడింటికీ యజమాని. ఒకవేళ ఎప్పుడైనా సంస్కారాలు తమ వైపుకు ఆకర్షిస్తున్నట్లయితే యజమాని అని అంటారా? కనుక స్వరాజ్య సత్తా అంటే కర్మేంద్రియజీతులు. ఎవరైతే కర్మేంద్రియజీతులుగా ఉన్నారో, వారు విశ్వ రాజ్య సత్తాను ప్రాప్తి చేసుకోగలరు. స్వరాజ్య అధికారులే విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. కనుక ‘స్వరాజ్యము బ్రాహ్మణ జీవితానికి జన్మ సిద్ధ అధికారము’ అనేది బ్రాహ్మణాత్మలైన మీ యొక్క స్లోగన్. స్వరాజ్య అధికారి యొక్క స్థితి సదా మాస్టర్ సర్వశక్తివాన్ గా ఉంటుంది, ఏ శక్తి తక్కువగా ఉండదు. స్వరాజ్య అధికారులు సదా ధర్మము అనగా ధారణామూర్తులుగా కూడా ఉంటారు మరియు రాజ్యము అనగా శక్తిశాలురుగా కూడా ఉంటారు. ఇప్పుడు రాజ్యంలో అలజడి ఎందుకు ఉంది? ఎందుకంటే ధర్మ సత్తా వేరుగా అయిపోయింది మరియు రాజ్య సత్తా వేరుగా అయిపోయింది. అంటే కుంటిది అయిపోయింది కదా. ఒక్క సత్తానే ఉంది కనుక అలజడి ఉంది. అదే విధంగా ఒకవేళ మీలో కూడా ధర్మము మరియు రాజ్యము – రెండు శక్తులు లేవు అంటే విఘ్నాలు వస్తాయి, అలజడిలోకి తీసుకొస్తాయి, యుద్ధం చేయవలసి వస్తుంది. రెండు శక్తులు ఉన్నాయంటే సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు, ఎలాంటి విఘ్నము రాదు. మరి ఇలాంటి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారా? లేక కొద్ది కొద్దిగా శరీరం గురించి, సంబంధాల గురించి… చింత ఉంటుందా? పాండవులకు సంపాదించాలనే చింత, పరివారాన్ని నడిపించాలనే చింత ఉంటుందా లేక నిశ్చింతగా ఉన్నారా? నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు – ఇలా నిమిత్తులుగా అయి చేసేవారు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ‘‘నేను చేస్తున్నాను’’ అనే భానం వచ్చిందంటే నిశ్చింతగా ఉండలేరు. ‘తండ్రి ద్వారా నిమిత్తంగా అయి ఉన్నాను’ అనే స్మృతి ఉన్నట్లయితే నిశ్చింతగా ఉంటారు మరియు నిశ్చింత జీవితాన్ని అనుభవం చేస్తారు. ఏ చింతా ఉండదు. రేపు ఏమవుతుంది అనే చింత కూడా ఉండదు. ఎప్పుడైనా, రేపు ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే చింత కొద్దిగా అయినా ఉంటుందా? వినాశనం ఎప్పుడవుతుందో, ఏమవుతుందో తెలియదు? పిల్లలకు ఏమవుతుందో? మనుమలు, మునిమనవలకు ఏమవుతుందో అనే చింత ఉంటుందా? నిశ్చింత చక్రవర్తులకు సదా ఈ నిశ్చయం ఉంటుంది – ఏదైతే జరుగుతుందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిదే జరుగుతుంది ఎందుకంటే చేయించేవారు మంచివారి కంటే మంచివారు కదా! ఇలాంటి వారినే నిశ్చయబుద్ధి విజయులు అని అంటారు. ఇలా అయ్యారా లేక ఆలోచిస్తున్నారా? అలా అవ్వాల్సిందే కదా. ఇంత గొప్ప రాజ్యం లభిస్తున్నప్పుడు ఆలోచించే విషయం ఏముంది? తమ అధికారాన్ని ఎవరైనా విడిచిపెడతారా? గుడిసె ఉన్నవారు అయినా, కొద్దిగా ఆస్తి ఉన్నవారు అయినా, దానిని వదలరు. ఇది ఎంత గొప్ప ప్రాప్తి! కనుక ‘నా అధికారము’ అనే స్మృతితో సదా అధికారిగా అయి ఎగురుతూ ఉండండి. ‘‘స్వరాజ్యము మా జన్మ సిద్ధ అధికారము’’ అనే వరదానాన్ని గుర్తుంచుకోండి. శ్రమ చేసి పొందేవారు కాదు, మీకు అధికారముంది. అచ్ఛా. బీహార్ అనగా సదా బహార్ లో (వసంత ఋతువులో) ఉండేవారు. శిశిర ఋతువులోకి (ఆకులు రాలే ఋతువులోకి) వెళ్ళకండి. ఎప్పుడూ గాలి-వానలు, తుఫాన్లు రాకూడదు, సదా వసంత ఋతువు ఉండాలి. అచ్ఛా.

2. స్వయాన్ని ఆత్మిక దృష్టితో సృష్టిని మార్చేవారిగా అనుభవం చేస్తున్నారా? దృష్టితో సృష్టి మారుతుందని వినేవారు కానీ ఇప్పుడు అనుభవీలుగా అయ్యారు. ఆత్మిక దృష్టితో సృష్టి మారిపోయింది కదా! ఇప్పుడు మీకు బాబాయే ప్రపంచము కనుక సృష్టి మారిపోయింది. ఇంతకుముందు ఉన్న సృష్టి అనగా ముందు ఉన్న ప్రపంచానికి మరియు ఇప్పటి ప్రపంచానికి తేడా ఉంది కదా. ఇంతకు ముందు ప్రపంచంలో బుద్ధి భ్రమిస్తూ ఉండేది, ఇప్పుడు బాబాయే ప్రపంచంగా అయిపోయారు కనుక బుద్ధి భ్రమించడం సమాప్తమై ఏకాగ్రంగా అయిపోయింది ఎందుకంటే మునుపటి జీవితంలో ఒకసారి దేహ సంబంధాలు, ఒకసారి దేహ పదార్థాలు అనే అనేక విషయాలలో బుద్ధి భ్రమించేది. ఇప్పుడు ఇదంతా మారిపోయింది. ఇప్పుడు దేహం గుర్తుంటుందా లేక దేహీ (ఆత్మ) గుర్తుంటుందా? ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి దేహం వైపు వెళ్ళిందంటే అది తప్పుగా భావిస్తారు కదా! మళ్ళీ పరివర్తన చేసేస్తారు, స్వయాన్ని దేహానికి బదులుగా ఆత్మగా భావించే అభ్యాసం చేస్తారు. కనుక ప్రపంచం మారిపోయింది కదా! స్వయం కూడా మారిపోయారు. తండ్రియే ప్రపంచమా లేక ఇప్పుడు కూడా ప్రపంచంలో ఏమైనా మిగిలి ఉందా? వినాశీ ధనము లేక వినాశీ సంబంధాల వైపు బుద్ధి వెళ్ళడం లేదు కదా? ఇప్పుడు ‘నాది’ అన్నది ఏదీ లేదు. ‘‘నా వద్ద చాలా ధనం ఉంది’’ అనే భావం సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఉండదు ఎందుకంటే అంతా తండ్రికి సమర్పించారు. ‘నాది’ అన్న దానిని ‘నీది’ గా చేసేసారు కదా! లేక ‘నాది నాదే మరియు బాబాది కూడా నాదే’ – ఇలా అయితే భావించడం లేదు కదా. ఈ వినాశీ తనువు, ధనము, పాత మనసు నావి కాదు, తండ్రికి ఇచ్చేసాను. పరివర్తన అయ్యేందుకు మొట్టమొదటగా – ‘అంతా నీదే’ అనే సంకల్పమే చేసారు అంతేకాక ‘నీది’ అని అనడంలోనే లాభముంది. ఇందులో తండ్రికి లాభం లేదు, మీకు లాభముంది ఎందుకంటే ‘నాది’ అని అంటే చిక్కుకుంటారు, ‘నీది’ అని అంటే అతీతులుగా అవుతారు. ‘నాది’ అని అంటే భారమున్నవారిగా అవుతారు, మరియు ‘నీది’ అని అంటే డబల్ లైట్ ‘ట్రస్టీలుగా’ అవుతారు. కనుక ఏది మంచిది? తేలికగా అవ్వడం మంచిదా లేక భారంగా అవ్వడం మంచిదా? ఈ రోజుల్లో ఎవరైనా శరీరం ద్వారా కూడా బరువుగా ఉండడం ఇష్టపడరు. అందరూ తమను తాము తేలికగా చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే భారీగా అవ్వడంలో నష్టముంది, తేలికగా అవ్వడంలో లాభముంది. అలాగే ‘నాది-నాది’ అని అనడం ద్వారా బుద్ధి పై బరువు పడుతుంది, ‘నీది-నీది’ అని అనడం ద్వారా బుద్ధి తేలికగా అవుతుంది. తేలికగా అవ్వనంతవరకు ఉన్నతమైన స్థితికి చేరుకోలేరు. ఎగిరే కళయే ఆనందానుభూతిని చేయిస్తుంది. తేలికగా ఉండడంలోనే మజా ఉంటుంది. అచ్ఛా.

తండ్రి లభించినప్పుడు, మాయ వారి ముందు ఏమిటి? మాయ ఏడిపించేది, తండ్రి వారసత్వాన్ని ఇచ్చేవారు, ప్రాప్తి చేయించేవారు. పూర్తి కల్పమంతటిలో ఇటువంటి ప్రాప్తి చేయించే తండ్రి లభించరు! స్వర్గంలో కూడా లభించరు. కనుక వారిని ఒక్క సెకండు కూడా మర్చిపోకూడదు. హద్దు ప్రాప్తి చేయించేవారినే మర్చిపోరు, అటువంటప్పుడు అనంతమైన ప్రాప్తి చేయించేవారిని ఎలా మర్చిపోగలరు! కనుక సదా ‘ట్రస్టీలము’ అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ మీపై బరువును ఉంచుకోకండి. దీని ద్వారా సదా నవ్వుతూ, పాడుతూ, ఎగురుతూ ఉంటారు. జీవితంలో ఇంకేం కావాలి! నవ్వడం, పాడడం మరియు ఎగరడము. ప్రాప్తి కలిగినప్పుడే నవ్వుతారు కదా. లేదంటే ఏడుస్తారు. కనుక ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి – మేము నవ్వుతూ, పాడుతూ మరియు ఎగిరేవారము, సదా తండ్రి యొక్క ప్రపంచంలోనే ఉండేవారము. బుద్ధి వెళ్ళేందుకు ఇక ఏది లేనే లేదు. స్వప్నంలో కూడా ఏడవకూడదు. మాయ ఏడ్పించినా సరే ఏడవకండి. కేవలం కళ్ళతో మాత్రమే ఏడవరు, మనసుతో కూడా ఏడుస్తారు. కనుక మాయ ఏడ్పిస్తుంది, తండ్రి నవ్విస్తారు. సదా బీహార్ అనగా సంతోషంగా ఉండేవారు – ఖుష్ బహార్. బెంగాల్ అనగా సదా మధురంగా ఉండేవారు. బెంగాల్ లో మిఠాయిలు బాగుంటాయి కదా, చాలా వెరైటీలు ఉంటాయి. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. కనుక సదా మధురంగా ఉండేవారు మరియు సదా ఖుష్ బహార్ గా ఉండేవారు. అచ్ఛా. టీచర్లు కూడా ఖుష్ బహార్ను చూస్తూ సదా వసంతంలోనే (బహార్ లోనే) ఉంటారు కదా. అచ్ఛా.

వరదానము:-

ఒకవేళ తండ్రికి సమీపంగా ఉండడం ఇష్టమైతే, ఎప్పుడూ ఎలాంటి సాంగత్య దోషం నుండైనా దూరంగా ఉండండి. చాలా రకాల ఆకర్షణలు పరీక్షల రూపంలో వస్తాయి కానీ ఆకర్షితులుగా అవ్వకండి. సాంగత్య దోషం చాలా రకాలుగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు లేక మాయా ఆకర్షణల యొక్క సంకల్పాల సాంగత్యము, సంబంధీకుల సాంగత్యము, వాణి యొక్క సాంగత్యము, అన్నదోషం యొక్క సాంగత్యము, కర్మల సాంగత్యము… ఈ సాంగత్య దోషాల అన్నింటి నుండి తమను తాము రక్షించుకునేవారే పాస్ విత్ ఆనర్ గా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top