17 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

17 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

17 November 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు సైలెన్స్ లో ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో గంటలు మొదలైనవి మ్రోగించే అవసరం లేదు”

ప్రశ్న: -

ఏ విషయంలో తండ్రి సమానంగా అయినట్లయితే అన్ని పనులు సిద్ధిస్తాయి?

జవాబు:-

ఎలాగైతే తండ్రి ప్రేమసాగరుడో, అలా చాలా-చాలా ప్రియమైనవారిగా అవ్వండి. కోపం వలన పనులు పాడవుతాయి కానీ బాగవ్వవు, కనుక కన్నెర్ర చేయడం, గట్టిగా మాట్లాడడం, వేడెక్కడం – వీటి అవసరం లేదు. శాంతిగా ఉండడం చాలా-చాలా మంచిది. ప్రేమతో చాలా పనులు సిద్ధిస్తాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి తండ్రివి..

ఓంశాంతి. ఇది ఒక్కరి మహిమనే, కానీ భక్తి మార్గంలో కేవలం ఒక్కరి మహిమ చేసినట్లయితే భక్తి యొక్క షో జరగదు, అందుకే భక్తిలో అనేకుల మహిమ చేస్తారు. అక్కడ శబ్దం కూడా చాలా ఉంటుంది. గంటలు మ్రోగించడం, పాటలు-భజనలు, ఏడ్వడం-పెడబొబ్బలు పెట్టడం మొదలైనవి భక్తి మార్గంలో ఎన్నో జరుగుతాయి. రకరకాల శబ్దాలు, మంత్ర-తంత్రాలు, కీర్తనలు మొదలైనవి ఉంటాయి మరియు జ్ఞాన మార్గంలో సైలెన్స్ ఉంటుంది. కేవలం సూచన ఇవ్వడం జరుగుతుంది, శబ్దమేమీ ఉండదు. భక్తిలో ఎంత ఆర్భాటం ఉంటుంది. అందరికంటే ఎక్కువగా శివుని మందిరాలలో గంటలు మ్రోగుతాయి. ఎక్కడ చూస్తే అక్కడ గంటలే గంటలుంటాయి. ఎవరినైనా నిద్ర నుండి మేల్కొల్పేందుకు గంటలను మ్రోగించడం జరగదు. శివబాబా వచ్చి మనుష్యులను కుంభకర్ణుని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలిపారు, కానీ గంటలు మ్రోగించలేదు. పూర్తి శాంతిగా రెండు పదాలలోనే అర్థం చేయిస్తారు. బుద్ధివంతులుగా ఎవరైతే ఉంటారో, వారు రెండు పదాలతోనే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు – పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. ఓ పతితపావనా రండి అని మీరే నన్ను పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను, మీకు మార్గం చూపిస్తాను. ఇప్పటికీ మీరు పతితులుగా ఉంటూ ఈ ప్రపంచంలోనే ఉంటారా ఏమిటి! మీరైతే పావన ప్రపంచంలో ఉండాలనుకుంటున్నారు కదా. పావన ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. తండ్రిని పతితపావనుడని అంటారు, అంటే పతితపావనుడు వచ్చి ఏం చేస్తారు అనేది అర్థం చేసుకోవాలి. తప్పకుండా నరకం నుండి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. అర్థం చేసుకోకుండా అలాగే పిలుస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ తండ్రి వచ్చి ఏం చేస్తారు అనేది వారికి తెలియదు. వాస్తవానికి ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే విశ్వవిద్యాలయము కూడా. అందుకే మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు… అని పాడుతారు. ఇందులో శాస్త్రాలు మొదలైనవేవీ చదవాల్సిన పని లేదు. భక్తి మార్గంలో చాలా శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, ఎన్నో ప్రవచనాలు మొదలైనవి జరుగుతాయి. ప్రతి నెల మండపాన్ని తయారుచేసి, కూర్చొని శబ్దం చేస్తారు. ఇక్కడ తండ్రి ఎంత శాంతిగా కూర్చొని అర్థం చేయిస్తారు. చూడండి, తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేసి పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు. చదువు కూడా ఎంత సహజమైనది. మీరు మొట్టమొదట పావనంగా ఉండేవారు, బంగారు యుగంలో ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇనుప యుగంలో తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి, అందుకే నన్ను స్మృతి చేయండి. స్మృతి కూడా నిరంతరం చేయాలి. కన్యకు వివాహం జరిగినప్పుడు ఆమె ఏమని జపం చేస్తారు? స్మృతిలో ఉంటారు. మీరందరూ కూడా పత్నులే, ఈ శివబాబా పతులకే పతి. మీకు పరమాత్మతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత, ఇక బుద్ధిలో స్మృతి కూర్చుండిపోతుంది. మేము నిశ్చితార్థం చేసుకున్నామని భరోసా ఉంటుంది. తర్వాత ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. మీతో కూడా తండ్రి చెప్తారు – మేమంతా ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరంలో సోదరులమని మీరు నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యారు. సోదరులకు ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది, అందుకే తండ్రిని పిలుస్తారు. మనుష్య తనువులోకి వచ్చి సోదరీ-సోదరులుగా అవుతారు. కానీ పిలిచేది ఆత్మనే కదా. ఓ పతితపావన బాబా రండి – అని సోదరులే పిలుస్తారు. బాబా అంటారు – నన్ను స్మృతి చేస్తే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. పావనంగా ఉన్నవారిని సతోప్రధానులని, పతితంగా ఉన్నవారిని తమోప్రధానులని అంటారు. ఈ విషయాలను తండ్రి సంగమంలోనే అర్థం చేయిస్తారు. ఇది గీతా పాఠశాల. ఈ పాఠశాలలో తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తారు, నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. అక్కడైతే టీచరు ఎదురుగా కూర్చొని చదివిస్తారు, అది కనిపిస్తుంది. ఇది గుప్తమైనది. కనుక ఈ టీచరును కూడా బుద్ధియోగం ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారు నిరాకారుడు, పతితపావనుడైన తండ్రి. కల్పక్రితం కూడా నేను మీకు రాజయోగాన్ని నేర్పించానని వారే స్మృతిని ఇప్పిస్తారు. అందుకే మన్మనాభవ అని అంటూ ఉంటారు. పవిత్రంగా అయినట్లయితే ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇక్కడ గంటలు మొదలైనవి మ్రోగించాల్సిన అవసరం లేదు. తండ్రి స్వయంగా వచ్చి మేల్కొలుపుతారు. మన్మనాభవ అంటే అర్థము – సైలెన్స్. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, అంతే! ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని దుఃఖం నుండి విడిపించి ముక్తులుగా చేయండి అని అందరూ తండ్రితోనే అంటారు. సన్యాసులు కేవలం బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మ తత్వమంటే ఇల్లు. వారు ఇంటిని స్మృతి చేస్తారు, ఇక్కడ తండ్రిని స్మృతి చేయాలి. కేవలం ఇంటిని స్మృతి చేసారంటే సన్యాసుల వలె అయినట్లు. బ్రహ్మ తత్వం అంటే భగవంతుడు కాదు.

తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – నన్ను స్మృతి చేస్తే మీరు నిర్వాణధామంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ నుండి స్వర్గంలోకి వస్తారు. ఇక్కడ నుండి నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. మిడతల గుంపు ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు. అన్నీ ఐకమత్యంగా ఉంటాయి. మొదట ఉన్న మిడత ముందుగా కూర్చుందంటే, మిగిలినవన్నీ కూర్చుండిపోతాయి. తేనెటీగలు కూడా ఇలాగే ఉంటాయి. రాణి ఈగ ఇల్లు వదిలిందంటే, మిగిలినవన్నీ దాని వెనుక పరుగెడతాయి. అది వాటికి ప్రియుని వంటిది. వాటిలో ప్రేయసియే తమ తోటి వారిపై రాజ్యం చేస్తుంది. ఆత్మలన్నీ దోమల వలె పరుగెడతాయని శాస్త్రాలలో కూడా ఉంది. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. ఆ తేనెటీగలు ప్రతి సీజన్ లో తమ రాణి వెనుక పరుగెడతాయి. మీరైతే ఒక్కసారి మాత్రమే పరుగెత్తాలి. ఇప్పుడు ఆత్మలందరూ మూలవతనానికి వెళ్ళాలి. మీరు ఏ శబ్దము చేయరు, అందుకే ఆవగింజల వలె నలిగిపోతారని తండ్రి ఉదాహరణ ఇస్తారు. బాబా కూడా బిందువు, వారు ఆవగింజ వలె ఉంటారు. గసగసాల గింజ కూడా చిన్నదిగా ఉంటుంది. పరమాత్మ కూడా బిందువే. వారిని దివ్యదృష్టి లేకుండా చూడలేరు. పూర్తిగా చిన్న నక్షత్రం వలె ఉంటారు. అఖండ జ్యోతి సాక్షాత్కారం జరిగిందని గీతలో చూపించారు. కనుక ఇక్కడ కూడా అఖండ జ్యోతి సాక్షాత్కారం జరిగినప్పుడు, సాక్షాత్కారం జరిగిందని భావిస్తారు. ఒకవేళ బిందువు యొక్క సాక్షాత్కారం జరిగిందంటే, వీరు పరమాత్మ కాదు అని అనుకుంటారు. అర్జునుడికి చాలా తేజోమయమైన సాక్షాత్కారం జరిగిందని గీతలో రాసి ఉంది. భక్తి విషయాలు బుద్ధిలో కూర్చొని ఉన్నాయి. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. 63 జన్మలు మనం శరీరంతో ఎంతగా నాట్యం చేస్తాము అనేది మీకు తెలుసు. 63 జన్మలు భక్తి మార్గంలో ఎన్ని హంగామాలు చూస్తారు. అందులో కూడా మొదట సతోప్రధాన భక్తి ఉన్నప్పుడు, ఒక్క శివబాబాకు భక్తి చేసేవారు. ఈ గంగా స్నానాలు మొదలైనవి తర్వాత ప్రారంభమవుతాయి. ముందుగా అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత అది వృద్ధి చెందుతుంది. ఇక్కడ పూర్తిగా శాంతి ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మమ్మా పైసా లేకుండా వచ్చారు, విశ్వ మహారాణిగా అయ్యారు. వారు చాలా సాధారణంగా ఉండేవారు. పూర్తిగా పేద ఇంటికి చెందినవారు, పైసా ఖర్చు లేకుండా ఎలా తయారవుతారో చూడండి. మమ్మా చాలా సేవ చేసేవారు. వారు వెళ్ళి బాబా ఇలా అంటారని ఇతరులకు అర్థం చేయించేవారు – నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సతోప్రధానంగా అవుతారు. ఇందులో ఖర్చుకు సంబంధించిన విషయమేమీ లేదు. ఒకవేళ ఏ మాత్రం ఖర్చు చేసినా, అది మీ కోసమే చేసుకుంటారు. ఎలాగైతే పొలంలో రెండు పిడికెళ్ళ ధాన్యం వేయడంతో ఎంత ధాన్యం వస్తుంది, పంట వృద్ధి చెందుతుంది, అలాగే ఇక్కడ కూడా 21 జన్మల కోసం మీకు ఎంత సంపాదన జరుగుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం ఎంత సహజము. ఇది ఒక్క సెకెండు యొక్క విషయము. ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కూర్చోలేకపోతే, పడుకొని అయినా (జారబడి అయినా) మురళి వినండి అని బాబా అంటారు. ఇది ధారణ చేయాల్సిన విషయము. లోలోపల తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతేకానీ నోటిలో గంగా జలం వేసే విషయమేమీ లేదు. మీరు ఈ నియమం తప్పినా, భక్తి చేయకపోయినా ఇలా జరుగుతుందని గురువులు, సత్పురుషులు చాలా భయపెడతారు. ఎవరిదైనా కాలు విరిగినా లేక ఏదైనా నష్టం కలిగినా, మీరు భక్తిని వదిలేసారు, దానికి ప్రతిఫలం ఇది అని అంటారు, అప్పుడు వారు చాలా భయపడతారు. ఇక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. తండ్రి స్మృతిని ఇప్పించాలి, సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి. ఇప్పుడు కలియుగం తర్వాత సత్యయుగం రావాలి. వినాశనం తప్పకుండా జరగాలి, అందుకే ఈ మహాభారీ యుద్ధము నిలబడి ఉంది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. ఇది రాజయోగము, ప్రజా యోగం కాదు. శుభమే మాట్లాడాలి. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. బాబా మధురమైనవారు కదా. క్రోధం మొదలైనవన్నీ దానంగా తీసుకుంటారు. తండ్రి అంటారు – నేను ప్రేమ సాగరుడను, మీరు కూడా అలా అవ్వండి. తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే పిల్లలు చాలా హంగామా చేస్తారు. ఎందుకంటే మాయ తలను పాడు చేస్తుంది. అందుకే, ఎప్పుడూ ఎవ్వరినీ ఏమీ అనకూడదు, ప్రేమగా అర్థం చేయించాలనే ఆలోచన కలుగుతుంది. కన్నెర్ర చేయడం, వేడెక్కడం, గట్టిగా మాట్లాడడం – వీటి అవసరం లేదు. ఇలా చేస్తే పని పాడైపోతుంది. శాంతిగా ఉండడం మంచిది. వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకున్నారంటే, తమ పదవిని కోల్పోతారు. బాబాకు చెందినవారిగా అయ్యారంటే 5 వికారాలను దానమిచ్చినట్లు. దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని అంటారు. తండ్రి మార్గదర్శకుడు కదా. మార్గదర్శకులుగా బ్రాహ్మణులు ఉంటారు. శివబాబా కూడా ఆత్మిక మార్గదర్శకుడు. మీరు కూడా మార్గదర్శకులే. తండ్రి బ్రహ్మా తనువులోకి వచ్చారు కనుక వీరు కూడా బ్రాహ్మణులు అయినట్లు. బాబా ఇతనిలో కూర్చొని ఉన్నారు. నీవే తల్లివి తండ్రివి…. అని వారి మహిమను చేస్తారు. ఇంకెవ్వరికీ ఈ మహిమ ఉండదు. వారి కర్తవ్యం కూడా అలాంటిదే. ఇది పాఠశాల. తండ్రి చదివిస్తున్నారు అనేది పిల్లలకు గుర్తుండాలి. విశ్వ రాజ్యాన్ని పొందడమే మీ లక్ష్యం-ఉద్దేశ్యము. కనుక మిమ్మల్ని చదివించేవారిని పూర్తిగా స్మృతి చేయాలి. స్కూలులో విద్యార్థులు బాగా పాస్ అయ్యారంటే, ప్రతి సంవత్సరం టీచరుకు కానుకలను పంపిస్తూ ఉంటారు. ఈ పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే కానీ వీటి మహత్వం గురించి ఎవ్వరికీ తెలియదు.

బాబా నాలెడ్జ్ ఫుల్ జ్ఞానసాగరుడు. వారు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేందుకే వస్తారు. రాయి-రప్పలలో ఎలా వస్తారు? ప్రతి వస్తువులోనూ ఆత్మ ఉందని ఒక డాక్టరు ఋజువు చేసారు. పరమాత్మ ఉన్నారని అనలేదు. మరి వారిని సర్వవ్యాపి అని అంటారు. ఆ డాక్టరు అందరిలో ఆత్మ ఉందని అన్నారు, సన్యాసులేమో అందరిలో పరమాత్మ ఉన్నారని అన్నారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు అనంతమైన తండ్రి. అందరి నుండి బుద్ధియోగాన్ని తెంచి తమతో జోడించుకుంటారు. ఆత్మ బుడగ వంటిది, సాగరం నుండి వెలువడింది, సాగరంలోనే లీనమవుతుందని వారంటారు. బ్రహ్మ జ్ఞానులు – చిన్న జ్యోతి, పెద్ద జ్యోతిలో లీనమవుతుంది, మళ్ళీ కొత్తది ఉత్పన్నమవుతుంది అని భావిస్తారు. బాబా అర్థం చేయిస్తారు – ఈ భక్తి కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. నేను కూడా డ్రామాలో నిర్ణయించబడినట్లుగా వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. 84 జన్మల చక్రంలో తిరగడం కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఏదైతే జరుగుతుందో, అంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కొందరు మహిమ చేస్తారు, కొందరు విఘ్నాలను కూడా కలిగిస్తారు.

పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వారు ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకే వస్తారు. శరీరం యొక్క పేరు కూడా తీసుకోరు. శరీర సహితంగా తీసుకువెళ్ళేందుకు నేనేమీ రాలేదు. నన్ను – ఓ ముక్తిదాతా రండి, మమ్మల్ని దుఃఖం నుండి విడిపించి నిశ్చింతత, సుఖ-శాంతులను పొందే చోటుకు తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. కనుక అందరి శరీరాలను విడిపించి ఆత్మలను తీసుకువెళ్తాను. కనుక కాలుడికే కాలుడు అయినట్లు కదా. నేను అందరినీ కలిపి తీసుకువెళ్తాను. ఎంత అద్భుతమైన విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎక్కడైనా, ఏదైనా విషయం అర్థం కాకపోతే, ఆ విషయాన్ని తండ్రి ఇంకా మాకు అర్థం చేయించలేదని చెప్పండి. వారు అర్థం చేయించినప్పుడు మీకు వినిపిస్తామని చెప్పి, ఈ విధంగా మిమ్మల్ని మీరు విడిపించుకోవాలి. తండ్రి జ్ఞానసాగరుడు, కొత్త-కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారని పిల్లలకు తెలుసు. ఈ ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను అర్థం చేయించేవారు రచయిత అయిన తండ్రి, వారు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరు లైట్ హౌస్ కూడా, స్వదర్శన చక్రధారులు కూడా. కానీ మాయ మరపింపజేస్తుంది, గుటకలు మింగుతారు. ఏదో ఒక ప్రభావం పడుతుంది. కర్మల లెక్కాచారముంది కదా. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి తయారవ్వదో, అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. లెక్కాచారం పూర్తవ్వగానే శరీరాన్ని వదిలేస్తారు. యుద్ధం ప్రారంభమౌతుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకోకూడదు. నోటి ద్వారా శుభమే మాట్లాడాలి. చాలా మధురంగా తయారవ్వాలి. తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అయి ఉండాలి.

2. సైలెన్స్ లో ఉంటూ పైసా ఖర్చు లేకుండా విశ్వ రాజ్యాన్ని తీసుకోవాలి. తండ్రి స్మృతిలో ఉంటూ, కొద్దిగా ఖర్చు చేసి 21 జన్మలకు సంపాదన చేసుకోవాలి.

వరదానము:-

ఫరిశ్తాల జీవితంలో లైట్ మరియు మైట్ రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే లైట్ మరియు మైట్ రూపంగా అయ్యేందుకు మనన శక్తి మరియు సహన శక్తి అవసరము. మనసుకు మనన శక్తి మరియు వాచా-కర్మణాల కోసం సహన శక్తిని ధారణ చేయండి, తర్వాత ఏ మాటలు మాట్లాడినా, ఏ కర్మలు చేసినా అవి దాని అనుసారంగానే జరుగుతాయి. ఒకవేళ ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి కోసం పురుషార్థ మార్గం సహజమవుతుంది మరియు స్పష్టమవుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top