04 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 3, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - సాంగత్య దోషం చాలా నష్టపరుస్తుంది, కనుక సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా సంభాళించుకుంటూ ఉండండి, అది చాలా చెడ్డది”

ప్రశ్న: -

మూడు రకాల బాల్యాలు ఏమిటి? ఏ బాల్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు?

జవాబు:-

మొదటి రకం బాల్యము – లౌకిక తల్లిదండ్రుల వద్ద జన్మించగానే లభిస్తుంది. రెండవ బాల్యము – గురువుకు శిష్యులుగా అయినప్పటిది, మూడవ బాల్యము – లౌకిక తల్లిదండ్రులను వదిలి అలౌకిక తలిదండ్రులకు చెందినవారిగా అయినప్పటిది. అలౌకిక బాల్యము అనగా ఈశ్వరుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలుగా అవ్వడము. ఈశ్వరుని పిల్లలుగా అవ్వడము అనగా మరజీవాగా అయినట్లు. ఈ అలౌకిక బాల్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయినట్లయితే చాలా ఏడ్వవలసి ఉంటుంది. ఏడ్వడము అనగా మాయ దెబ్బ తగలడము అని అర్థము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చిన్ననాటి రోజులను మర్చిపోకండి… (బచ్ పన్ కే దిన్ భులా న దేనా…)

 
 
 

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాట అర్థాన్ని తెలుసుకున్నారు. బాల్యం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి – లౌకిక బాల్యము, రెండవది – నివృత్తి మార్గానికి చెందిన బాల్యము, వారు కూడా ఇళ్ళు-వాకిళ్ళు వదిలి, జీవిస్తూ మరణించి గురువుకు చెందినవారిగా లేక సన్యాసులకు చెందినవారిగా అవుతారు. ఆ గురువు వారికి తండ్రి కాదు, వారు గురువుకు చెందినవారిగా అవుతారు, వారితో పాటు ఉంటారు. వారు కూడా జీవిస్తూ మరణించి గురువుకు చెందినవారిగా అవుతారు, అడవులకు వెళ్ళిపోతారు. మూడవది – మీ ఈ అద్భుతమైన మరజీవా జన్మ. ఒక్క తల్లిదండ్రులను వదిలి మరొక తల్లిదండ్రులకు చెందినవారిగా అవుతారు. వీరు ఆత్మిక తల్లిదండ్రులు. ఇది మీ మరజీవా జన్మ. ఈశ్వరీయ ఒడిలో ఇది మీ ఆత్మిక జన్మ. ఇప్పుడు మీతో ఆత్మిక తండ్రి మాట్లాడుతున్నారు. వారంతా శారీరిక తండ్రులు. వీరు ఆత్మిక తండ్రి, అందుకే తండ్రికి చెందినవారిగా, మరజీవాగా అయ్యి దీనిని (బాల్యాన్ని) మర్చిపోకూడదు అని పాడుతారు. శివబాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఎప్పుడైనా ఎవరైనా గీత మొదలైన వాటి గురించి వాదించారంటే, మొట్టమొదట – ఉన్నతోన్నతమైన భగవంతుడు ఎవరు అని వారిని అడగండి. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, తర్వాత శివ పరమాత్మాయ నమః… అని అంటారు. వారు సర్వ ధర్మాల వారికి తండ్రి. ఉన్నతోన్నతమైన తండ్రి వారొక్కరే అన్న విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. బ్రహ్మా-విష్ణువులను ఎవ్వరూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ ఒక్కరే, వారు నిరాకారుడు, వారిని రచయిత, పతితపావనుడని కూడా అంటారని ముందు పక్కా చేయించండి. తండ్రి నుండి అయితే తప్పకుండా వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎవరికి లభించింది అని ఆలోచించండి. తండ్రి కొత్త ప్రపంచాన్ని రచించేవారు. వారి పేరు ‘శివ’. శివ పరమాత్మాయ నమః అని అంటారు. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. వారే పతితపావనుడు, రచయిత, జ్ఞానసాగరుడు, కనుక సర్వవ్యాపి అనే మాటే ఉండదు. వారి కర్తవ్యం అనుసారంగా వారి మహిమ ఉంటుంది. గతంలో ఏ కర్తవ్యాలను చేసి ఉంటారో, వాటికి గాయనం చేయబడుతుంది. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. వారిని ముక్తిదాత అని కూడా అంటారు, వారిని దయా హృదయుడు, దుఃఖహర్త-సుఖకర్త, మార్గదర్శకుడు అని కూడా అంటారు. ఏదైనా కొత్త స్థానాలకు వెళ్ళినప్పుడు మార్గదర్శకుడిని తమతో పాటు తీసుకువెళ్తారు. విదేశాల నుండి ఎవరైనా వస్తే వారికి అంతా చూపించేందుకు ఇక్కడున్న గైడ్ ను నియమిస్తారు. తీర్థ యాత్రలకు తీసుకువెళ్ళే పండాలు ఉంటారు. మరి తండ్రిని గైడ్ అని అంటున్నారంటే, వారు తప్పకుండా మార్గాన్ని చూపించి ఉంటారు. సర్వవ్యాపి అన్న కారణంగా విషయమంతా సమాప్తమైపోతుంది. అందరి తండ్రి ఒక్కరేనని మొట్టమొదట అర్థం చేయించండి. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత, అది భగవంతుని ద్వారా గాయనం చేయబడింది. దీనిని నిరూపించగలిగితే, దాని నుండి వెలువడిన ఇతర శాస్త్రాలన్నీ అసత్యము అని నిరూపించబడుతుంది. మొట్టమొదట సత్యమైన గీతా సారాన్ని వినిపించాలి. శివ భగవానువాచ, ఇప్పుడు శివబాబా యొక్క దివ్య కర్తవ్యం ఏమిటి? నేను ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని, పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని మీకు తెలియజేస్తానని మాత్రమే వారు అంటారు. నేను పిల్లలకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను, దీని గురించి దివ్య కర్తవ్యాల అవసరమేముంది? ఇతను వృద్ధుడు. వచ్చి కేవలం పిల్లలను చదివిస్తారు. పతితులను పావనంగా చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు సత్యయుగంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. మీకు వారసత్వం లభిస్తుంది, మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో, నిరాకార ప్రపంచంలో ఉంటారు. ఇది చాలా సహజమైన విషయము. భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేది, ఒకే ధర్మముండేది. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుష్యులున్నారు, అక్కడ చాలా కొద్దిమంది ఉంటారు. పరమపిత పరమాత్మ ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం చేయించేందుకు వస్తారు. మిగిలినవారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అపవిత్ర ఆత్మలెవ్వరూ ఉండరు. వారి పేరే పతితపావన, సర్వుల సద్గతిదాత. ఇది పాత ప్రపంచము, ఇనుప యుగము. సత్యయుగాన్ని బంగారు యుగమని అంటారు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో, వారు అన్నీ సహజంగా అర్థం చేసుకుంటారు. పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. కావున మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి – మనము వారి పిల్లలము, దీనిని మర్చిపోకండి. మర్చిపోతే ఏడ్వవలసి వస్తుంది. ఎంతో కొంత మాయ దెబ్బలు తగులుతాయి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మలమైన మనం తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇంతమంది మనుష్యులు మరణిస్తే, ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? భారత్ లో చాలా ఎక్కువగా ఏడుస్తారు. మొదట 12 నెలలు యా హుస్సేన్, యా హుస్సేన్ (అయ్యో భగవంతుడా-అయ్యో భగవంతుడా)… అని అంటారు. గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఇవి మృత్యులోకం యొక్క ఆచార-వ్యవహారాలు. ఇప్పుడు మీకు అమరలోకానికి సంబంధించిన ఆచార-వ్యవహారాలను నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు మొత్తం పాత ప్రపంచం పట్ల వైరాగ్యముంది. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇవన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము, నాటకం పూర్తి అవుతుంది. నాటకంలో అందరూ పాత్రధారులే, అటువంటప్పుడు మోహం ఎవరి పట్ల పెట్టుకుంటారు? వారు వెళ్ళి మరొక పాత్ర అభినయించాల్సి ఉంటుందని భావిస్తారు. ఏడ్వవలసిన అవసరమేముంది. ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది. తండ్రి ఎలాగైతే జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, ప్రేమసాగరుడో, అలా తండ్రిని అనుసరించి ఆ విధంగా తయారవ్వాలి. సాగరం నుండి నదులు వెలువడతాయి. అందరూ నంబరువారుగా ఉన్నారు. కొందరు బాగా వర్షిస్తారు, చాలామందిని తమ సమానంగా తయారుచేస్తారు. అంధులకు చేతికర్రగా అవుతారు. తండ్రికి చాలామంది సహాయకులు కావాలి. తండ్రి అంటారు – మీరు అంధులకు చేతికర్రగా అవ్వండి. అందరికీ మార్గాన్ని తెలియజేయండి. కేవలం ఒక్క బ్రాహ్మణి మాత్రమే అంధులకు చేతికర్రగా అవ్వాలని కాదు, మీరందరూ అలా తయారవ్వాలి. మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది, దీనిని ‘మూడవ నేత్రం లభించే కథ’ అని అంటారు. ఆత్మకు దివ్య నేత్రముంది. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. పూర్తి తుచ్ఛ బుద్ధి కలవారిగా అయిపోయారు. తమ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అనేది భారతవాసులకు తెలియదు. తండ్రి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. శివజయంతిని కూడా జరుపుకుంటారు. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు. తండ్రి గురించి మరియు రచన గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. ఋషులు-మునులు అందరూ నేతి-నేతి అని అంటూ ఉంటారు. పరమాత్మను సర్వవ్యాపి అని అనడమే వారు చేసిన పెద్ద పొరపాటు. వారు సర్వుల తండ్రి, పతితపావనుడు, ముక్తిదాత అని మీరు ఋజువు చేసి చూపించండి. వారు మనల్ని పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. శాస్త్రాలలో ఏమేమో రాసేశారు. లక్ష్మీనారాయణుల గురించి కూడా – అక్కడ వారికి వికారాలు లేకుండా పిల్లలు జన్మిస్తారా అని అడుగుతారు. అరే, వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము, దీనిని వికారీ ప్రపంచమని అంటారు, మరి అక్కడ కూడా వికారాలుంటాయని ఎలా అంటారు. మొట్టమొదట తండ్రిని అర్థం చేసుకోనంత వరకు ఏమీ అర్థం చేసుకోలేరు. సర్వవ్యాపి అని చాలా పెద్ద పొరపాటు చేసారు. తండ్రిని తెలుసుకున్నప్పుడే ఆ తప్పును సరిదిద్దుకుంటారు. బాబా, మీ నుండి రాజ్యభాగ్యం తీసుకునేందుకు మళ్ళీ మేము మీ వారిగా అయ్యామని నిశ్చయం చేసుకోవాలి. శాస్త్రాలలో ఏమేమో రాసేశారు. లక్ష్మీనారాయణులను సత్యయుగంలో చూపిస్తారు, బాల్యంలో ఉన్న రాధా-కృష్ణులను ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు కృష్ణుడు స్వర్గం యొక్క రాకుమారుడు. తర్వాత కృష్ణుని రూపురేఖలు జన్మ-జన్మకు మారిపోతూ ఉంటాయి. ఒకేలాంటి రూపురేఖలు ఎప్పుడూ ఉండవు. కృష్ణుడు మళ్ళీ అవే రూపురేఖలతో ద్వాపరంలోకి వస్తారని కాదు, అది అసంభవము.

మనం వాస్తవానికి అక్కడి (మూలవతన) నివాసులము, అది మన స్వీట్ సైలెన్స్ హోమ్, దీని కోసమే భక్తి చేస్తారు. మాకు శాంతి కావాలని అంటారు. ఆత్మకు పాత్రను అభినయించేందుకు కర్మేంద్రియాలు లభించాయి, మరి శాంతిగా ఎలా ఉండగలదు. శాంతి కోసమే హఠయోగం నేర్చుకుంటారు, గుహలలోకి వెళ్తారు. ఒక నెల ఎవరైనా గుహలో కూర్చొంటే వారి కోసం అది శాంతిధామం అయినట్లా. మీకు తెలుసు – ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్ళి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు సుఖధామంలోకి వస్తాము. సుఖంగా ఉన్నవారి కోసం ఇది స్వర్గము, దుఃఖితులుగా ఉన్నావారి కోసం ఇది నరకమని వారు అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, పాత ప్రపంచాన్ని నరకము అని అంటారని మీకు తెలుసు. భగవానువాచ – ఈ భక్తి, యజ్ఞాలు, తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవి చేయడం అనేది భక్తి మార్గము. ఇందులో ఎలాంటి సారము లేదు. సత్య-త్రేతా యుగాలను బ్రహ్మా పగలు అని అంటారు. బ్రహ్మా పగలు అంటే బ్రాహ్మణులైన మీకు కూడా పగలు అని అర్థము, తర్వాత మీ రాత్రి ప్రారంభమవుతుంది. మీరు మొట్టమొదట సత్యయుగంలోకి వెళ్తారు, తర్వాత మీరే చక్రంలోకి వస్తారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా మీరే అవుతారు. మీరు శివ భగవానువాచ అని అంటారు, వారు కృష్ణ భగవానువాచ అని అంటారు. చాలా తేడా ఉంది. వారు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. వారితో పాటు మొత్తం సూర్యవంశ సంప్రదాయం వారంతా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ అంతిమంలో రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఏ పిల్లలైతే అర్థం చేసుకుంటారో, వారికే ఆనందం కలుగుతుంది. కొత్త వారికి ఆనందం కలగదు. మీరు ఎవ్వరినీ నిందించరు, తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఇక్కడ మీరు బాబా సాంగత్యంలో కూర్చొని ఉన్నారు కనుక బాగా అర్థం చేసుకుంటారు. బయటకు వెళ్తూనే సాంగత్యం కారణంగా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. సాంగత్య దోషం చాలా చెడ్డది. స్వర్గంలో ఇలాంటి విషయాలుండవు, దాని పేరే స్వర్గం, వైకుంఠం, సుఖధామము. అక్కడ కూడా అసురులు ఉండేవారని శాస్త్రాలలో రాసేశారు. ఇప్పుడు మీకు తెలిసింది – మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారము, అక్కడ భూమి, ఆకాశం ఎందులోనూ విభజనలు ఉండేవి కావు. ఇప్పుడు ఎన్ని విభజనలున్నాయి. తమ-తమ హద్దులను ఏర్పర్చుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎన్ని గొడవలు జరుగుతాయి. కనుక ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట – తండ్రి ఎవరు, భగవంతుడు అని ఎవరిని అంటారో వారికి అర్థం చేయించండి. బ్రహ్మా, విష్ణు, శంకరులు దేవతలు. భగవంతుడు ఒక్కరే ఉంటారు, 10 మంది ఉండరు. కృష్ణుడు భగవంతుడు కాలేరు. భగవంతుడు హింసను ఎలా నేర్పిస్తారు. భగవానువాచ – కామం మహాశత్రువు. దానిపై విజయం పొందేందుకు ప్రతిజ్ఞ చేయండి. రాఖీ కట్టుకోండి. ఇది ఇప్పటి విషయమే. ఏదైతే గడిచిపోయిందో, అది మళ్ళీ భక్తి మార్గంలో జరుగుతుంది. దీపావళి రోజున మహాలక్ష్మిని పూజిస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురూ కలిసి ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. లక్ష్మికి ధనం ఎక్కడ నుండి లభిస్తుంది? సంపాదన చేసేవారు పురుషులు కదా, కానీ లక్ష్మి యొక్క పేరు గాయనం చేయబడింది. మొదట లక్ష్మీ తర్వాత నారాయణుడు. వారు మహాలక్ష్మిని వేరుగా భావిస్తారు. మహాలక్ష్మికి 4 భుజాలు ఉన్నట్లు చూపిస్తారు. రెండు స్త్రీవి, రెండు పురుషునివి. కానీ వారికి ఈ విషయాల గురించి తెలియదు. ఇప్పుడు మీకు వివరంగా తెలుసు.

చిన్ననాటి రోజులను మర్చిపోకండి… (బచ్ పన్ కే దిన్ భులా నా దేనా…) అనే పాటను విన్నారు. బాబా, నాకిప్పుడు గుర్తొచ్చింది అని ఆత్మ అంటుంది. ఉదయాన్నే లేచి తండ్రితో మాట్లాడాలి. అమృతవేళ తండ్రిని స్మృతి చేయడం మంచిదే కదా. సంధ్యా సమయంలో ఏకాంతంలోకి వెళ్ళి కూర్చోండి. పరస్పరంలో స్త్రీ-పురుషులు కలిసి ఉన్నప్పటికీ ఈ విషయాలను మాట్లాడుకోవచ్చు. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా ఏం చెప్తారు. మనం పూజ్యులుగా ఉన్నప్పుడు బాబాను స్మృతి చేసేవారము కాదు, పూజారులుగా అయినప్పుడు తండ్రిని స్మృతి చేస్తాము. ఇటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి, ఈ మాటలు ఎవరైనా విని ఆశ్చర్యపోవాలి. అర్ధకల్పం మనం కామచితిపై కూర్చొని కాలి భస్మమైపోయాము, శ్మశానగ్రస్థులుగా అయిపోయాము. ఇప్పుడు మనం జ్ఞాన చితిపై కూర్చోవాలి, స్వర్గంలోకి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచము. ఇది స్వర్గమని భారతవాసులు భావిస్తారు. అరే, స్వర్గం సత్యయుగంలో ఉంటుంది. స్వర్గంలో దేవీ-దేవతల రాజ్యముండేది. ఇక్కడ మాయ ఆర్భాటం ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు – సాంగత్య దోషంలోకి వచ్చి ఎక్కడా మరణించకండి, లేదంటే చాలా పశ్చాత్తాపపడతారు. పరీక్ష ఫలితాలు వెలువడినప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి – వీరు రాణిగా అవుతారు, వీరు దాసిగా అవుతారు అని అంతా వినిపించేవారు. తర్వాత బాబా దీనిని ఆపించేసారు. చివర్లో – మేము తండ్రి సేవ ఎంత చేసాము, ఎంతమందిని తమ సమానంగా తయారుచేసాము అని అంతా తెలిసిపోతుంది. అవన్నీ గుర్తొస్తాయి, సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారం చేయించకుండా ధర్మరాజు కూడా శిక్షించరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకు పదే-పదే అర్థం చేయించారు. బాబా వచ్చి మధురాతి-మధురమైన వృక్షం యొక్క అంటు కడతారు. ఆ ప్రభుత్వం వృక్షాలకు అంటు కడుతుంది, ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇక్కడ కొత్త ప్రపంచం యొక్క అంటు కట్టడం జరుగుతుంది. కనుక ఇటువంటి తండ్రిని మర్చిపోకండి. తండ్రి సేవలో నిమగ్నమవ్వండి లేదంటే చివర్లో చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఇప్పుడు వారసత్వం తీసుకోలేదంటే, కల్ప-కల్పం కోసం లెక్క తయారవుతుంది. అందుకే పురుషార్థం పూర్తిగా చేయాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, ప్రేమసాగరుడో, అలా తండ్రి సమానంగా తయారవ్వాలి మరియు తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి. అందరికీ జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వాలి.

2. పశ్చాత్తాపపడాల్సి వచ్చే విధంగా ఎలాంటి సాంగత్యము చేయకూడదు. సాంగత్య దోషము చాలా చెడ్డది. కనుక స్వయాన్ని రక్షించుకోవాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి.

వరదానము:-

ఎలాగైతే దీపావళి రోజున శ్రీలక్ష్మిని ఆహ్వానిస్తారో, అలా పిల్లలైన మీరు స్వయంలో దివ్య గుణాలను ఆహ్వానించండి, అప్పుడు ఆహుతి రూపంలో అవగుణాలు సమాప్తమైపోతాయి. తర్వాత కొత్త సంస్కారాలనే కొత్త వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు పాత వస్త్రాల పట్ల కొంచెం కూడా ప్రీతి ఉండకూడదు. ఏ-ఏ బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఇంకా మిగిలి ఉన్నాయో – ఆ పాత ఖాతాలన్నింటినీ ఈ రోజు నుండి సదాకాలం కోసం సమాప్తం చేయండి. అప్పుడు దివ్య గుణధారులుగా అవుతారు మరియు భవిష్యత్తులో పట్టాభిషేకం జరుగుతుంది. దాని స్మృతి చిహ్నమే ఈ దీపావళి పండుగ.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top