01 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

October 31, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీ నడవడిక చాలా-చాలా మధురంగా, రాయల్ గా ఉండాలి, క్రోధమనే భూతం అసలు ఉండకూడదు”

ప్రశ్న: -

21 జన్మల ప్రారబ్ధాన్ని పొందేందుకు ఏ విషయం పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి?

జవాబు:-

ఈ ప్రపంచంలో ఉంటూ, అన్నీ చేస్తూ, బుద్ధి యోగం ఒక్క సత్యమైన ప్రియతమునితో ఉండాలి. తండ్రి గౌరవం పోగొట్టే విధంగా ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. ఇంట్లో ఉంటూ కూడా ఎంత ప్రేమగా ఉండాలంటే, వీరిలో చాలా మంచి దైవీ గుణాలున్నాయని ఇతరులు భావించాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. పాట అర్థాన్ని కూడా పిల్లలు తప్పకుండా అర్థం చేసుకొని ఉంటారు. తండ్రి వచ్చి కొత్త-కొత్త విషయాలను వినిపిస్తారు. కొత్త ప్రపంచము, కొత్త యుగానికి సంబంధించిన ఈ విషయాలను పిల్లలు 5 వేల సంవత్సరాల క్రితం విన్నారు. ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. ఇకపోతే మధ్యలో కేవలం భక్తి మార్గానికి సంబంధించిన విషయాలను మాత్రమే విన్నారు. సత్యయుగంలో ఈ విషయాలు ఉండవు. అక్కడ జ్ఞాన మార్గం యొక్క ప్రారబ్ధం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కోసం సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. నాలెడ్జ్ ను సోర్స్ ఆఫ్ ఇన్ కమ్ (జ్ఞానం సంపాదనకు ఆధారం) అని అంటారు. చదువు ద్వారా కొందరు బ్యారిస్టర్లుగా, కొందరు ఇంజినీర్లు మొదలైనవారిగా అవుతారు. సంపాదన కూడా జరుగుతుంది. మీరు ఈ చదువు ద్వారా రాజులకే రాజులుగా తయారవుతారు. ఇది ఎంత గొప్ప సంపాదన. ఒకవేళ కొద్దిగా సంశయమున్నా సరే, మున్ముందు నిశ్చయం ఏర్పడుతూ ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయముంది. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనముంది. తండ్రికి చెందినవారిగా అవ్వడమంటే వారసత్వానికి యజమానులుగా అవ్వడము. స్వర్గ రచయిత అయిన తండ్రి మనల్ని యజమానులుగా తయారుచేసేందుకు వచ్చారు అని పిల్లలకు నిశ్చయముండాలి. ఇద్దరు తండ్రులున్నారని కూడా మీకు తెలుసు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, వారిని – పరమపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ‘పరమపిత’ అని అనరు. ఆ ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే సర్వుల సుఖదాత, శాంతిదాత. సత్యయుగంలో అందరూ సుఖంగా ఉంటారు, మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. సత్యయుగంలో మీకు సుఖం, శాంతి, ధనం, సంపద, నిరోగి శరీరం అన్నీ ఉండేవి. అటువంటి అతి ప్రియమైన తండ్రిని అందరూ పిలుస్తారు. సాధువు-సత్పురుషులు కూడా సాధన చేస్తారు, కానీ ఎవరి గురించి సాధన చేస్తున్నారు అనేది వారికి తెలియదు. వారు బ్రహ్మతత్వం కోసం సాధన చేస్తారు, బ్రహ్మతత్వంలో లీనమవ్వాలని అనుకుంటారు కానీ లీనమవ్వరు. బ్రహ్మాతత్వాన్ని స్మృతి చేస్తే పాపాలు తొలగవు. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. సర్వశక్తివంతుడను నేనా లేక నివసించే స్థానమైన బ్రహ్మతత్వమా? బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలన్నీ నివసిస్తాయి. వారు బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావించారు. ఎలాగైతే భారతవాసులు హిందుస్థాన్ లో ఉన్న కారణంగా తమది హిందు ధర్మమని భావించారో, అలా నివసించే స్థానమైన బ్రహ్మ తత్వాన్ని పరమాత్మ అని భావించారు. అది బ్రహ్మాండము. అక్కడ జ్యోతిర్బిందువు అయిన ఆత్మలు, అండాకారంలో ఉంటాయి, అందుకే దానిని ‘బ్రహ్మాండము’ అని అంటారు. ఇది మనుష్య సృష్టి. బ్రహ్మాండము వేరు, మనుష్య సృష్టి వేరు. ఆత్మ అంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది… అని అంటారు. మళ్ళీ, ఆత్మ అంగుష్ఠాకారంలో ఉంటుందని మరికొందరు అంటారు. కానీ తండ్రి అంటారు – ఆత్మ పూర్తిగా సూక్ష్మమైన బిందువు, దానిని ఈ నేత్రాలతో చూడలేరు. ఆత్మను చూసేందుకు, పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు – ఇప్పుడు భారత్ ను స్వర్గంగా తయారుచేయడంలో తండ్రికి సహాయకులుగా కూడా అవ్వాలి. తండ్రి భారత్ లోనే వస్తారు. శివజయంతిని భారత్ లోనే జరుపుకుంటారు. క్రీస్తు వచ్చి వెళ్ళారు కనుక క్రైస్తవులు క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు. క్రీస్తు ఎప్పుడు వచ్చారు అనేది కూడా వారికి తెలుసు. కానీ భారతవాసులకు తండ్రి ఎప్పుడు వచ్చారు, కృష్ణుడు ఎప్పుడు వచ్చారు అనేది అసలు తెలియదు. ఎవరి గురించి వారికి తెలియదు. అందరూ కృష్ణుడి మహిమనే చేస్తారు. అతడిని ఊయలలో ఊపుతారు, ప్రేమిస్తారు కానీ అతని జన్మ ఎప్పుడు జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. ద్వాపర యుగంలో గీతను వినిపించారని అంటారు. కానీ, కృష్ణుడు ద్వాపరంలోకి రానే రారు. లీల అంతా ఒక్క తండ్రిదే. అందుకే వారి గురించి – మీ గతి-మతి… అని అంటారు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. యోగ బలం ద్వారా పుత్రుడు జన్మిస్తాడని ముందు నుండే తల్లికి సాక్షాత్కారం జరుగుతుంది. అక్కడ శరీరాన్ని కూడా అలాగే వదులుతారు, సర్పం వలె ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. వాస్తవానికి సన్యాసులు ఈ ఉదాహరణను ఇవ్వలేరు. మీరు కూర్చొని వికారీ మనుష్యులకు జ్ఞానాన్ని భూ-భూ చేసి, తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారుచేస్తారు. భూ-భూ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేయడం మీ వ్యాపారము. తాబేలు మొదలైన ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవి. కర్మలు చేసిన తర్వాత ఎంత సమయం దొరికితే, అంత సమయం తండ్రిని స్మృతి చేయాలి. ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు. ఇప్పుడు నాటకం పూర్తవ్వనున్నది. ఇది పాత శరీరము. దీనికి సంబంధించిన కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలి. సతోప్రధానంగా అయినప్పుడు కర్మాతీత స్థితి వస్తుంది. తర్వాత మనం ఈ శరీరంలో ఉండలేము. కర్మాతీత అవస్థకు చేరుకోగానే, ఇక మనం ఈ శరీరంలో ఉండలేము. కర్మాతీత అవస్థకు చేరుకోగానే ఇక ఈ శరీరాన్ని విడిచిపెడతాము, తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. దోమల వలె శరీరాలన్నీ సమాప్తమై ఆత్మలు వెళ్ళిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది రావణుడు స్థాపించిన దుఃఖధామము, మరియు రాముడు స్థాపించినది శివాలయము. వాస్తవానికి పరమాత్ముని పేరు ‘శివ’, అంతేకానీ రాముడు కాదు. సత్యయుగంలో, శివాలయంలో అందరూ దేవతలే ఉంటారు. తర్వాత భక్తి మార్గంలో శివుని విగ్రహం కోసం మందిరాలను, శివాలయాలను నిర్మిస్తారు. ఇప్పుడిది శివబాబా సింహాసనము. ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంది. తండ్రి కూడా ఇక్కడ వీరి పక్కకు వచ్చి విరాజమానమవుతారు మరియు చదివిస్తారు. సదా ఉండరు. స్మృతి చేయగానే తండ్రి వస్తారు. తండ్రి అంటారు – నేను మీ అనంతమైన తండ్రిని, నా నుండి మీకు వారసత్వం లభిస్తుంది, బ్రహ్మా అనంతమైన తండ్రి కాదు, అందుకే మీరు నన్ను స్మృతి చేయండి. బాబా జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు అని మధురమైన పిల్లలకు తెలుసు. కావున పిల్లలైన మీరు కూడా ప్రేమ సాగరులుగా తయారవ్వాలి. స్త్రీ-పురుషులు ఒకరినొకరు సత్యంగా ప్రేమించుకోరు, వారు కామ వికారాన్నే ప్రేమ అని భావిస్తారు, కానీ కామం మహాశత్రువని బాబా అంటారు. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు, అందుకే కృష్ణుని వంటి కొడుకు లభించాలని, కృష్ణుని వంటి పతి లభించాలని అంటారు. కృష్ణపురిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి కృష్ణపురిని స్థాపన చేస్తున్నారు. మీరు స్వయంగా శ్రీకృష్ణుని వలె లేక మోహనుని వలె తయారవ్వవచ్చు. రాకుమార-రాకుమారీలు కూడా ఉండవచ్చు. అంటే వీరంతా ఇక్కడే తయారవుతున్నారు. వారి లిస్టు కూడా ఉంటుంది. మాలలో 8 పూసలు ఉన్నాయి, అలాగే 108 పూసలు కూడా ఉన్నాయి. మనుష్యులు 9 రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఈ 8 మంది ఎవరు? మధ్యలో ఎవరున్నారు? మధురాతి-మధురమైన తండ్రి ద్వారా మనం రత్నాలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు – పిల్లలూ, పరస్పరంలో చాలా ప్రేమగా నడుచుకోవాలి లేదంటే బాబా పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. సద్గురువు యొక్క నింద చేసేవారికి నిలవడానికి నీడ కూడా లభించదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మాలిన్యం తొలగిపోతుంది అనే మంత్రాన్ని అందరికీ చెప్పాలి. ఇంట్లో కూడా ఎంత ప్రేమగా నడుచుకోవాలంటే – వీరిలో క్రోధమే లేదు, చాలా ప్రేమ ఉందని ఇతరులకు అనిపించాలి. మద్యం, సిగరెట్ మొదలైనవి తాగడమనేది చాలా చెడ్డ అలవాటు, ఇటువంటి చెడు అలవాట్లు అన్నింటినీ వదిలేయాలి. దైవీగుణాలను ఇక్కడే ధారణ చేయాలి. రాజధాని స్థాపన చేయడానికి శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇతర ధర్మాలవారు రాజధానిని స్థాపన చేయరు. వారు పై నుండి పూర్తిగా చివర్లో వస్తారు. మీరు 21 జన్మల ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు, ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి. అయినప్పటికీ పురుషార్థం చేసి దైవీ గుణాలను ధారణ చేయాలి. ఒకవేళ కోపంగా మాట్లాడితే వీరిలో భూతముందని మనుష్యులంటారు. అంటే అనంతమైన తండ్రి గౌరవాన్ని పోగొట్టినట్లే. మరి అటువంటప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? చాలా మధురంగా, అనాసక్తులుగా తయారవ్వాలి. ఇక్కడ ఉంటూ, అన్ని చేస్తూ యోగం ప్రియునితో ఉండాలి. బాబా అంటారు – నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి అని, దీనినే ‘యోగాగ్ని’ అని అంటారు. ఇక్కడ హఠయోగం అవసరం లేదు. తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఇది చాలా విలువైన శరీరము. శుద్ధమైన భోజనాన్ని తినాలి. దేవతలకు భోగ్ (నైవేద్యం) ఎలా పెడతారు అని శ్రీనాథ ద్వారానికి వెళ్ళి చూడండి. బెంగాల్ లో కాళీ కు మేకను భోగ్ గా (నైవేద్యంగా) పెడతారు. వారు తమ పిత్రులకు కూడా చేపలు తినిపిస్తారు. అలా చేయకపోతే పిత్రులు కోపగించుకుంటారని వారు భావిస్తారు. ఎవరో ఈ పద్ధతిని తయారుచేసారు, అదే కొనసాగుతూ ఉంటుంది. దేవీ-దేవతల రాజ్యంలో ఏ పాపము జరగదు. అది రామరాజ్యము. ఇక్కడి కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడి కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు హరిద్వార్ కు వెళ్ళి కూర్చొంటారు. ‘హరి’ అని కృష్ణుడిని అంటారు. కానీ కృష్ణుడు సత్యయుగంలో ఉంటారు. వాస్తవానికి ‘హరి’ అన్న పేరు శివునిది. అంటే దుఃఖాన్ని హరించేవారు అని అర్థము. కానీ గీతలో కృష్ణుని పేరు వేసి, హరి అంటే కృష్ణుడని అనుకున్నారు. వాస్తవానికి దుఃఖాన్ని హరించేవారు శివబాబా. హరి ద్వారమని సత్యయుగాన్ని అంటారు. భక్తి మార్గంలో ఏది తోస్తే అది అంటూ ఉంటారు.

తండ్రి అంటారు – పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడానికి నేను సంగమయుగంలో వస్తాను. రావణుడు పాత శత్రువు. ప్రతి సంవత్సరం రావణుడిని కాలుస్తారు. ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్టే ఆఫ్ మనీ (సమయము, ధనము అంతా వ్యర్థమైనట్లే). బెంగాల్ లో ఎంతమంది దేవీలను తయారుచేస్తారు, వారికి తినిపించి, తాగించి, పూజ చేసి, తర్వాత వెళ్ళి ముంచేస్తారు. దీని గురించి ఒక పాట ఉంది. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ఎప్పుడూ కోపంగా మాట్లాడకూడదు. తండ్రిపై ఎప్పుడూ అలగకూడదు. అలిగి, చదువును వదలడం అంటే తమ కాళ్ళను తామే గొడ్డలితో నరుక్కోవడం అని అర్థము. ఇక్కడ మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు. శ్రీ నారాయణుడిని మహారాజు అని, శ్రీలక్ష్మిని మహారాణి అని అంటారు. ఇక శ్రీ శ్రీ అనేది శివబాబా యొక్క టైటిల్. శ్రీ అని దేవతలను అంటారు. శ్రీ అనగా శ్రేష్ఠము.

ఇప్పుడు మీరు ఆలోచించండి – మనం ఎలా ఉండేవారము, మాయ మన తలను తిప్పి మనల్ని ఎలా తయారుచేసింది అని. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. తర్వాత నిరుపేదగా ఎలా అయ్యింది? ఏం జరిగింది? అసలేమీ అర్థం చేసుకోరు. మనమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత క్షత్రియులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మనే పరమాత్మ అని వారు అంటారు. లేదంటే ‘హమ్ సో’ యొక్క అర్థము ఎంత సహజము. మనిషి జన్మ ఒక్కటే ఉంటుందని వారు అంటారు. కానీ తండ్రి అర్థం చేయిస్తారు – మనుష్యుల జన్మలు 84 ఉంటాయి. ఆ 84 జన్మలలో, సంగమయుగంలోని ఈ ఒక్క జన్మ అతి విలువైనది. ఈ జన్మలో మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. మీరు చాలా రాయల్ తండ్రి పిల్లలు, కనుక మీలో ఎంత రాయల్టీ (హుందాతనం) ఉండాలి. రాయల్ మనుష్యులు ఎప్పుడూ గట్టిగా మాట్లాడరు. ప్రపంచంలో ఇంటింటా ఎంత హంగామా జరుగుతుంది. స్వర్గంలో ఇలాంటి విషయాలేవీ ఉండవు. ఈ బాబా కూడా వల్లభాచారి కులానికి చెందినవారిగా ఉండేవారు. అయినా కూడా – ఆ సత్యయుగ దేవతలెక్కడ, నేటి వైష్ణవులు ఎక్కడ! అలాగని వారు వైష్ణవులు కనుక వికారాలలోకి వెళ్ళరని కాదు. రావణ రాజ్యంలో అందరూ వికారాలతోనే జన్మిస్తారు. సత్యయుగంలో అందరూ సంపూర్ణ నిర్వికారులు. ఇప్పుడు మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నారు మరియు యోగబలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ నడవడిక చాలా మధురంగా, రాయల్ గా ఉండాలి. మీరు ఎవ్వరితోనూ వాదించకూడదు, శాస్త్రవాదము చేయకూడదు. ఎప్పుడైనా వారు శాస్త్రాల గురించి వాదించేందుకు కూర్చొన్నప్పుడు, పరస్పరం ఒకరినొకరు కర్రలతో కూడా కొట్టుకుంటారు. పాపం వారి దోషమేమీ లేదు. వారికి ఈ జ్ఞానం గురించి తెలియనే తెలియదు. ఇది ఆత్మిక జ్ఞానము. ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. వారు జ్ఞానసాగరుడు. వారికి శారీరిక పేరు లేదు, వారు అవ్యక్తమూర్తి. వారు అంటారు – నా పేరు శివ, నేను స్థూల శరీరాన్ని గానీ, సూక్ష్మ శరీరాన్ని గానీ తీసుకోను. జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు అని నన్నే అంటారు. శాస్త్రాలలో ఏమేమి రాసేశారు. హనుమంతుడు పవనపుత్రుడు, అంటే గాలి నుండి పిల్లలు ఎలా జన్మిస్తారు! తర్వాత పరమాత్మ గురించి చేప అవతారం, తాబేలు అవతారం అని అంటూ ఎంతగా నిందించారు. బాబా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు – మీరు ఆసురీ మతం అనుసారంగా నన్ను ఇంతగా నిందించారు, 24 అవతారాలతో కడుపు నిండలేదు, మళ్ళీ కణ-కణంలో, రాళ్ళు-రప్పలలో నన్ను పడేసారు. ఈ శాస్త్రాలన్నీ ద్వాపరం నుండి మొదలయ్యాయి. మొట్టమొదట కేవలం శివునికి మాత్రమే పూజ జరిగేది. గీతను కూడా తర్వాత తయారుచేసారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు – ఇదంతా అనాది ఆట. ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చాను. కనుక తండ్రిని పూర్తిగా అనుసరించాలి. లక్షణాలు కూడా చాలా బాగా ఉండాలి. కలియుగ అంతిమంలో ఏముంది, తర్వాత సత్యయుగంలో ఏం చూస్తారు అనేది కూడా అద్భుతం కదా. కలియుగంలో భారత్ బికారిగా ఉంది, సత్యయుగంలో భారత్ సంపన్నంగా ఉంటుంది. ఆ సమయంలో వేరే ఖండాలేవీ ఉండవు. ఇప్పుడు గీతా అధ్యాయం రిపీట్ అవుతుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనం రాయల్ తండ్రి పిల్లలము కనుక మన నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. గట్టిగా మాట్లాడకూడదు. చాలా మధురంగా తయారవ్వాలి.

2. ఎప్పుడూ తండ్రిపై గానీ, పరస్పరంలో గానీ అలగకూడదు. అలిగి, చదువును ఎప్పుడూ వదలకూడదు. చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని వదిలేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే పరమాత్మ స్నేహీలుగా ఉంటారో, వారు స్నేహీని సదా తోడుగా పెట్టుకుంటారు, అందుకే వారి ఎదురుగా ఎలాంటి సమస్య రాదు. ఎవరితో పాటు అయితే స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, వారి ముందు సమస్యలు నిలవవు. సమస్య రాగానే, దానిని అక్కడే సమాప్తం చేస్తారు కనుక అది వృద్ధి చెందదు. ఇప్పుడు సమస్యల బర్త్ కంట్రోల్ ను చేయండి. సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలని, సమస్యలను దూరంగా పారద్రోలాలని సదా గుర్తుంచుకోండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top