02 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
1 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి, సుఖమిచ్చేవారిగా కండి, ఈ దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి”
ప్రశ్న: -
దేహీ-అభిమానులుగా ఉండే పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?
జవాబు:-
1. వారికి పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి చాలా-చాలా ఆత్మిక ప్రేమ ఉంటుంది. 2. వారెప్పుడూ ఇతరుల లోపాలను వర్ణించరు. 3. వారు చాలా-చాలా సుఖమిచ్చేవారిగా ఉంటారు. 4. వారి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు. వారు సదా అపారమైన సంతోషంలో ఉంటారు 5. వారు ఎప్పుడూ అభిప్రాయ భేదాలలోకి రారు. 6. మేము ఆత్మలము, పరస్పరంలో సోదరులము అనే స్మృతితో గుణాలను గ్రహించేవారిగా ఉంటారు. వారికి అందరిలోనూ గుణాలే కనిపిస్తాయి. వారు స్వయం కూడా గుణవంతులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా గుణవంతులుగా చేస్తారు. 7. వారికి ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. పిల్లలైన మీరందరూ ఉన్నతాతి-ఉన్నతమైన అనంతమైన తండ్రి సమ్ముఖంగా కూర్చొని ఉన్నారు. ఇటువంటి తండ్రి లభించినందుకు మీరు ఎంతటి భాగ్యశాలి! మీరు జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకోవడానికి, సంపాదన చేసుకోవడానికి జ్ఞాన సాగరుడైన తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి మధురాతి-మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు! తండ్రి అయితే కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు, వారికి ఎవరినీ గుర్తు చేయవలసిన అవసరం లేదు. వీరి (బ్రహ్మా) ఆత్మ అయితే తండ్రిని గుర్తు చేయాలి. మేము ఇరువురము పిల్లలైన మిమ్మల్నే చూస్తాము అని తండ్రి అంటారు. ఆత్మనైన నేను సాక్షిగా చూడవలసిన అవసరం లేదు, కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలానే చూస్తాను. తండ్రితో పాటే ఉంటాను కదా! వారి బిడ్డను కనుక వారితో పాటు చూస్తూ ఉంటాను. నేను విశ్వానికి యజమానిగా అయి తిరుగుతూ ఉంటాను, నేనే ఇది చేస్తున్నట్లుగా భావిస్తాను. నేను దృష్టి ఇస్తాను. దేహ సహితంగా అంతా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇకపోతే, తండ్రి మరియు కొడుకు ఒకటైనట్లుగా ఉంటుంది. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – మధురమైన పిల్లలూ! బాగా పురుషార్థం చేయండి. ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి, సుఖమిచ్చేవారిగా కండి. పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుకోకండి, గొడవపడకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, ఈ దేహాన్ని మర్చిపోతూ వెళ్ళండి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇది కూడా జీవిస్తూనే మరణించే అవస్థ వంటిది, ఈ ప్రపంచం నుండి మరణించినట్లుగా ఉంటారు. మీరు మరణిస్తే, మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు కూడా. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి, శరీర భానాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తూ ఉండండి. ఉదయం ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. చాలా ఉల్లాసంతో తండ్రిని స్మృతి చేయండి – బాబా, ఇప్పుడిక మేము మీ ఒడిలోకి వచ్చేసినట్లే. కేవలం ఒక్కరి స్మృతిలోనే శరీరం అంతమైపోవాలి….. దీనిని ఏకాంతం అని అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఈ శరీరం రూపీ చర్మం వదిలిపోతుంది.
ఈ పాత ప్రపంచం, పాత దేహం సమాప్తమవ్వనున్నాయని మీకు తెలుసు. ఇకపోతే, పురుషార్థం కోసం కొద్దిగా సంగమయుగ సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎప్పటి వరకు కొనసాగుతుంది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు – దైవీ రాజధాని స్థాపన అయ్యేంత వరకు వినిపిస్తూ ఉంటాను, తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరం, ఏదో ఒక కర్మభోగం కూడా ఉంటూ ఉంటుంది, ఇందులో బాబా సహాయం చేయాలి అనే ఆశ పెట్టుకోకూడదు. ఒకవేళ దివాలా తీసినా లేక అనారోగ్యం వచ్చినా – ఇవి మీ లెక్కాచారాలు అని తండ్రి అంటారు. అయితే, యోగంతో ఆయుష్షు పెరుగుతుంది. మీరు కృషి చేయండి, అంతేకానీ కృప చూపమని అడగకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా కళ్యాణముంటుంది. ఎంత వీలైతే అంత యోగబలంతో పని చేయండి. నన్ను కనురెప్పలలో దాచుకోండి….. అని భక్తి మార్గంలో పాడుతారు. ప్రియమైనవారిని కంటి రత్నము, ప్రాణ ప్రియమైనవారని అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు కానీ గుప్తంగా ఉన్నారు. వారి పట్ల ఎంతటి ప్రేమ ఉండాలంటే, ఇక అడగకండి. తండ్రి అయితే పిల్లలను తమ కనురెప్పలలో దాచిపెట్టే ఉంచుతారు. కనురెప్పలు అంటే ఈ కనులకు సంబంధించినవి కాదు, ఇది బుద్ధికి సంబంధించిన విషయము. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి! వారు పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని వజ్ర సమానంగా తయారుచేస్తారు. ఎంత మధురమైన బాబా! ఎంత నిరహంకారిగా అయి పిల్లలైన మీకు సేవ చేస్తారు. కనుక పిల్లలైన మీరు కూడా అంత ప్రేమగా సేవ చేయాలి. శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. ఎక్కడైనా సొంత మతాన్ని అనుసరిస్తే, అదృష్టానికి అడ్డుగీత పడుతుంది.
పిల్లలైన మీకు పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి చాలా-చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి, కానీ దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా పరస్పరంలో ఆ ప్రేమ ఉండటం లేదు. ఫలానావారు ఇలా ఉన్నారు, వారు ఇది చేస్తారు….. అని ఒకరిలో ఒకరు లోపాలనే చూస్తూ ఉంటారు. మీరు దేహీ-అభిమానులుగా ఉండేటప్పుడు ఎవరిలోనూ లోపాలు చూసేవారు కాదు. పరస్పరంలో చాలా ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ అవస్థను ధారణ చేయాలి. ఇంతకుముందు మీరు ఎంత మధురంగా ఉండేవారు! ఇప్పుడు మళ్ళీ అలా మధురంగా, సదా సుఖమిచ్చేవారిగా అవ్వండి. దేహాభిమానంలోకి రావడంతో దుఃఖమిచ్చేవారిగా అయ్యారు, అందుకే మీ ఆత్మిక సంతోషం మాయమైపోయింది. ఆయుష్షు కూడా తక్కువైపోయింది. మిమ్మల్ని సతోప్రధానంగా చేసి, సదా సుఖమిచ్చేవారిగా చేయడానికి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా లోపాలు తొలగిపోతూ ఉంటాయి, అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. మేము సోదరీ-సోదరులము అనేది పక్కాగా గుర్తుండాలి. ఆత్మలను సోదర రూపంలో చూసినట్లయితే ఎల్లప్పుడూ గుణాలే కనిపిస్తాయి. అందరినీ గుణవంతులుగా చేసే ప్రయత్నం చేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. ఎప్పుడూ ఎవరినీ నిందించకండి. కొంతమందిలో ఎటువంటి లోపాలున్నాయంటే, స్వయం వారు కూడా అవి అర్థం చేసుకోలేరు, వారు తమను తాము చాలా మంచివారని భావిస్తారు, కానీ లోపాలున్న కారణంగా అక్కడక్కడ తప్పుడు మాటలు మాట్లాడుతారు. సతోప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలుండవు. తమను తాము చూసుకోండి – నేను ఎంత మధురంగా అయ్యాను? నాకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది? తండ్రి పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలంటే, ఇక పూర్తిగా వారికి అతుక్కుని ఉండాలి. బాబా, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా, తెలివైనవారిగా చేస్తున్నారు, స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు – ఈ విధంగా లోలోపల తండ్రిని మహిమ చేస్తూ పులకరించిపోవాలి. ఆత్మిక సంతోషంలో ఉండాలి. సంతోషానికి మించిన ఔషధం లేదు అని అంటూ ఉంటారు కూడా. తండ్రిని కలుసుకున్న సంతోషం కూడా ఎంత ఉండాలి. సంగమంలోనే పిల్లలైన మీకు 21 జన్మలు సదా సంతోషంగా ఉండే ఔషధం లభిస్తుంది, ఇప్పుడిక ఎవరికీ ఏ విషయంలోను చింత ఉండదు. ఇప్పుడు ఎన్ని చింతలున్నాయి, అందుకే వాటి ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. మీకైతే ఏ విషయంలోను చింత లేదు. మీరు ఈ సంతోషమనే ఔషధాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే ఒకరికొకరు చాలా మర్యాద ఇచ్చుకున్నట్లు. ఇటువంటి మర్యాద మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. మీరు తండ్రి శ్రీమతమనుసారంగా ఈ విధంగా మర్యాద ఇస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే వారి క్షేమ సమాచారాలు అడగడము వంటిది. ఇది జ్ఞానము మరియు యోగము యొక్క ఫస్ట్ క్లాస్ వండర్ ఫుల్ ఔషధం. ఈ ఔషధం ఒకే ఒక్క ఆత్మిక సర్జన్ ద్వారా లభిస్తుంది. ‘మన్మనాభవ’, ‘మధ్యాజీ భవ’ – ఇది కేవలం రెండు మహావాక్యాల ఔషధం. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది, ఇది తక్కువ విషయమేమీ కాదు. ఈ రెండు వాక్యాలే ప్రసిద్ధమైనవి. ఈ రెండు వాక్యాలతో మీరు సదా ఆరోగ్యంగా, సదా సంపన్నంగా అవుతారు. కనుక పిల్లలైన మీరు ఈ విషయాలను స్మరించుకుంటూ హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది – ఈ మహిమ కూడా ఇప్పటిదే. ఎంత వీలైతే అంత ఒకరికొకరు ఈ ఆత్మిక ఔషధాన్ని అందించుకోండి, ఒకరికొకరు ఉన్నతి చేసుకోండి, టైమ్ వేస్ట్ చేయకండి. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేయండి, తమ జీవితాన్ని వజ్ర తుల్యంగా చేసుకోండి.
మధురమైన పిల్లలూ, తండ్రి నుండి ఏ శ్రీమతం అయితే లభిస్తుందో, అందులో పొరపాట్లు చేయకూడదు. తండ్రి సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి సందేశం అందరికీ లభించాలి కదా. సందేశం చాలా సహజమైనది – కేవలం ఇదే విషయం చెప్పండి – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు మనసా-వాచా-కర్మణా కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మ చేయకండి. ఒకానొక రోజు మీ ఈ సైలెన్స్ బలం యొక్క శబ్దం వెలువడుతుంది. రోజు రోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతి చెందుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, మంచి పని చేస్తున్నారు, మార్గం కూడా చాలా సహజమైనది తెలియజేస్తున్నారు అని అందరూ భావిస్తారు. బ్రాహ్మణుల ఈ వృక్షం చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది, ప్రజలు తయారవుతూ ఉంటారు. సెంటర్లు చాలా వృద్ధి చెందుతాయి. మీ ప్రదర్శినీ కూడా ప్రతి గ్రామంలో ఉంటుంది. పిల్లలైన మీరు చాలా భారీ సర్వీస్ చేయాలి. కొత్త-కొత్త సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. అక్కడికి అనేకమంది మనుష్యులు వచ్చి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకుంటూ ఉంటారు. ఎక్కడా పాపం ఎవరి కాలు జారిపోకుండా, మీరు ఒక్కొక్కరినీ చాలా ప్రేమగా సంభాళించాలి. ఎన్ని ఎక్కువ సెంటర్లు ఉంటాయో, అంత ఎక్కువమంది వచ్చి ప్రాణదానాన్ని పొందుతారు. ఎప్పుడైతే పిల్లలైన మీ ప్రభావం వెలువడుతుందో, అప్పుడు చాలామంది పిలుస్తారు – ఇక్కడికి వచ్చి మాకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే రాజయోగాన్ని నేర్పించండి అని. స్వయంగా ఆ భగవంతుడే ఆబూలో విచ్చేసారని మున్ముందు చాలా ఆర్భాటం జరుగుతుంది.
పాత ప్రపంచంలో ఈ సమయంలో అనేక అంతర్జాతీయ గొడవలుండడాన్ని పిల్లలైన మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవలన్నీ సమాప్తమవ్వనున్నాయి, వీటి గురించి మీరు ఏ చింత చేయనవసరం లేదు. మీరు అందరికీ వినిపించండి – వీటిని పట్టించుకోకండి, ఇప్పుడిక ఈ పాత ప్రపంచం సమాప్తమైనట్లే, దీని పట్ల మోహం పెట్టుకోకండి, ఒకవేళ మోహం ఉన్నట్లయితే, హృదయం శుద్ధంగా లేకపోతే, అపారమైన సంతోషం కూడా ఉండదు అని చెప్పండి. పిల్లలకు అపారమైన జ్ఞాన ధనం యొక్క ఖజానా లభిస్తూ ఉంటుంది కనుక అపారమైన సంతోషం ఉండాలి. హృదయం ఎంతగా శుద్ధంగా ఉంటుందో, అంతగా ఇతరులను కూడా శుద్ధంగా తయారుచేస్తారు. యోగం యొక్క స్థితితోనే హృదయం శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగిగా అయ్యే మరియు తయారుచేసే అభిరుచి ఉండాలి. ఒకవేళ దేహం పట్ల మోహముంటే, దేహాభిమానం ఉంటే, మీ అవస్థ చాలా కచ్చాగా ఉందని అర్థం చేసుకోండి. దేహీ-అభిమాని పిల్లలే సత్యమైన డైమండ్ గా అవుతారు. అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానంగా నిరహంకారిగా అయి, చాలా ప్రేమగా అందరి సేవ చేయాలి. శ్రీమతమనుసారంగా నడుచుకోవాలి. స్వయం యొక్క మతం అనుసారంగా నడుచుకుని భాగ్యానికి అడ్డుగీత గీసుకోకూడదు.
2. సంగమంలో తండ్రి ద్వారా సంతోషమనే ఔషధం ఏదైతే లభించిందో, ఆ ఔషధాన్ని తింటూ మరియు తినిపిస్తూ ఉండాలి. మీ టైమ్ ని వేస్ట్ చేసుకోకూడదు. చాలా ఓర్పుతో, గంభీరతతో, తెలివితో తండ్రిని స్మృతి చేస్తూ, తమ జీవితాన్ని వజ్రం వలె తయారుచేసుకోవాలి.
వరదానము:-
ఎప్పుడైతే ‘నేను’ అనేదాని త్యాగం జరుగుతుందో, అప్పుడే సేవాధారి సేవలో సఫలతను అనుభూతి చేయగలరు. నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేసాను – ఇటువంటి సేవా భావాన్ని త్యాగం చేయాలి. నేను చేయలేదు, నేను చేసేవాడిని, చేయించేవారు తండ్రి. ‘నేను’ అనేది బాబా ప్రేమలో కలిసిపోవాలి – ఇటువంటి వారినే సేవలో సదా మైమరచి ఉండే త్యాగమూర్తి, సత్యమైన సేవాధారి అని అంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తుడిని. సేవలో ‘నేను’ అనేది మిక్స్ అవ్వడం అంటే బానిసగా అవ్వడము. ఈ సంస్కారం సత్యమైన సేవాధారిలో ఉండదు.
స్లోగన్:-
*** Om Shanti ***
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – ‘‘జీవితంలోని ఆశలు పూర్తి అయ్యే మనోహరమైన సమయము’’
ఆత్మలమైన మనందరికీ చాలా కాలం నుండి ఈ ఆశ ఉంది, అదేమిటంటే జీవితంలో సదా సుఖ-శాంతులు ఉండాలి అని. అయితే, అనేక జన్మల ఆశ ఎప్పుడో ఒకప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడిది మన అంతిమ జన్మ, ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయము. ఇప్పుడింకా నేను చిన్నగా ఉన్నాను అని ఎవరూ అనుకోకండి. చిన్నవారికి, పెద్దవారికి సుఖం అయితే కావాలి కదా. కానీ దుఃఖమనేది దేని వలన కలుగుతుంది అనే జ్ఞానం కూడా ముందు కావాలి. ఈ పంచ వికారాలలో చిక్కుకున్న కారణంగా ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో, వీటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చేసుకోవాలి, ఇదే కర్మ బంధనాల నుండి విముక్తులయ్యేందుకు సహజమైన ఉపాయము అని ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్ లభించింది. సర్వశక్తివంతుడైన ఈ బాబాను నడుస్తూ-తిరుగుతూ శ్వాస-శ్వాసలో స్మృతి చెయ్యండి. ఇప్పుడు స్వయంగా పరమాత్మ వచ్చి ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయం చేస్తారు. కానీ ఇందులో పురుషార్థం అయితే ఆత్మలు ప్రతి ఒక్కరూ చేయాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచరు, గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు. కనుక ముందు ఆ తండ్రికి చెందినవారిగా అవ్వాలి. తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి. ఈ చదువుతో భవిష్య జన్మ జన్మలకు సుఖం యొక్క ప్రారబ్ధం తయారవుతుంది అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థమనుసారంగా పదవి లభిస్తుంది. మరియు గురువు రూపంలో పవిత్రంగా చేసి ముక్తినిస్తారు. కనుక ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని అటువంటి పురుషార్థం చెయ్యాలి. పాత ఖాతాను సమాప్తం చేసుకొని కొత్త జీవితాన్ని తయారుచేసుకునే సమయమిదే. ఈ సమయంలో ఎంతగా పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో, అంతగానే శుద్ధమైన రికార్డ్ నిండుతుంది, అదే కల్పమంతా కొనసాగుతుంది. కనుక ఈ సమయం యొక్క సంపాదన పైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది. చూడండి, ఈ సమయంలోనే మీకు ఆదిమధ్యాంతాల జ్ఞానం లభిస్తుంది. మనమే దేవతలుగా అవ్వాలి. ఇప్పుడు మనది ఎక్కే కళ, తర్వాత అక్కడికి వెళ్ళి ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము. అక్కడి దేవతలకు, వారు తర్వాత పడిపోతారనే విషయం తెలియదు. సుఖాన్ని అనుభవించిన తర్వాత పడిపోతారని ఒకవేళ తెలిస్తే, పడిపోతారనే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేరు. కనుక ఈశ్వరీయ నియమం రచించబడి ఉంది, అదేమిటంటే – మనుష్యులు సదా ఉన్నతి కొరకు పురుషార్థం చేస్తారు అంటే సుఖం కోసం సంపాదించుకుంటారు. కానీ డ్రామాలో సగం-సగం పాత్ర తయారుచేయబడి ఉంది, ఈ రహస్యం మనకు తెలుసు, కానీ ఈ సమయం సుఖం యొక్క వంతు కనుక పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పురుషార్థం యొక్క విశేషత. పాత్రధారి పని ఏమిటంటే పాత్రను అభినయించే సమయంలో సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించాలి, అది చూసేవారు – మళ్ళీ చేయండి (వాహ్, వాహ్) అని అనాలి. అందుకే హీరో, హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతిచిహ్నాలు కీర్తించబడతాయి మరియు పూజించబడతాయి. నిర్వికారీ ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమాన అవస్థను తయారుచేసుకోవడమే దేవతల విశేషత. ఈ విశేషతను మర్చిపోవడం వలనే భారత్ కు ఇటువంటి దుర్దశ కలిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి జీవితాన్ని తయారుచేసే పరమాత్మ స్వయంగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారి చేతిని పట్టుకోవడంతో జీవితమనే నావ తీరానికి చేరుకుంటుంది. అచ్ఛా – ఓంశాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!