21 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

20 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీ జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపడానికి వచ్చారు, ఈ ఒక్కొక్క జ్ఞాన రత్నం లక్షల రూపాయల విలువైనది”

ప్రశ్న: -

గుప్త దానానికి ఇంత ఎక్కువ మహత్వం ఎందుకుంది?

జవాబు:-

ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీకు జ్ఞాన రత్నాలను గుప్తంగా దానం ఇస్తున్నారు, ఈ విషయం గురించి ప్రపంచానికి తెలియదు, తర్వాత, పిల్లలైన మీరు ఈ జ్ఞాన రత్నాలను దానం చేయడంతో విశ్వ రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తంగా జరుగుతుంది, ఇందులో ఏ యుద్ధము లేదు, ఏ తుపాకులు మొదలైనవి లేవు, ఏ ఖర్చూ లేదు. తండ్రి మీకు రాజ్యాన్ని దానం రూపంలో గుప్తంగా ఇచ్చారు, అందుకే గుప్త దానానికి చాలా మహత్వముంది.

♫ వినండి ఆడియో (audio)➤

డబల్ ఓంశాంతి. ఒకటి శివబాబా చెప్తారు, మరొకటి బ్రహ్మా దాదా చెప్తారు. ఇరువురి స్వధర్మము శాంతి. ఇరువురూ శాంతిధామ నివాసులు. పిల్లలైన మీరు కూడా శాంతిధామ నివాసులే. మీరు నిరాకార దేశంలో నివసించేవారు, పాత్రను అభినయించేందుకు సాకార దేశంలోకి వచ్చారు, ఎందుకంటే ఇది డ్రామా కదా. పై నుండి మొదలుకొని కింద వరకు డ్రామా ఆదిమధ్యాంతాల జ్ఞానం పిల్లల బుద్ధిలో నిండి ఉంది. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోండి. మీలో తప్ప ఇంకెవరిలోనూ ఈ జ్ఞానం లేదు. మీరు ఈశ్వరీయ స్కూలులో చదువుకుంటున్నారు. భగవానువాచ – భగవంతుడైతే ఒక్కరే. 10-20 మంది భగవంతులేమీ ఉండరు. ఎన్ని ధర్మాల వారైతే ఉన్నారో, ఆ ధర్మాలకు చెందిన ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. తర్వాత తండ్రి సృష్టి రచిస్తారు, అప్పుడు ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. శివుడిని ప్రజాపిత అని అనరు. ప్రజలైతే జనన-మరణాలలోకి వస్తారు. ఆత్మ సంస్కారాల ఆధారంగా జనన-మరణాలలోకి వస్తుంది. తర్వాత ప్రజాపిత బ్రహ్మా కావాలి. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారని అంటూ ఉంటారు. వారిని పతితపావనా రండి, అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అవుతుందో మరియు అంతిమానికి చేరుకుంటుందో, అప్పుడే పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారని, ఇంకెప్పుడూ రారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పూర్తి నాలెడ్జ్ లభించింది. మీరు డ్రామాలోని పాత్రధారులు కదా. డ్రామాలోని పాత్రధారులకు, ఎవరి పాత్ర ఏమిటి అని అందరి పాత్రల గురించి తప్పకుండా తెలియాలి. అవి చిన్న హద్దు పాత్రలు (డ్రామా), వాటి గురించి అందరికీ తెలుస్తుంది. మీరు కూడా చూసి వస్తారు. ఒకవేళ వాటి గురించి రాయాలంటే రాయగలరు, గుర్తు చేసుకోగలరు. అవి చిన్న డ్రామాలు. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా, సత్యయుగం నుండి మొదలుకొని కలియుగాంతము వరకు దీని గురించి మీకు తెలుసు. మాకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తర్వాత హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం, హద్దు ప్రాపర్టీ లభిస్తుంది. బాబా అర్థం చేయించారు – ఎవరైతే రాజులుగా అవుతారో, వారు ముందు జన్మలో దాన-పుణ్యాలు మొదలైనవి చేయడంతో ఒక్క జన్మ కోసం రాజులుగా అవుతారు, వారు తర్వాత జన్మలో కూడా రాజులుగా అవుతారని కాదు. సత్యయుగంలో మీరు రాజులుగా, మహారాజులుగా ఉండేవారు కానీ మీ రాజ్యం మాయమైపోతుందని ఏమీ భావించకండి. తర్వాత భక్తి మార్గంలో, వేరే రాజులు ఎక్కువ దాన-పుణ్యాలను చేస్తారు కనుక వారు కూడా రాజ్యం చేస్తారు. కానీ వారు వికారీ రాజులుగా ఉంటారు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అయ్యారు. అది అల్పకాలిక సుఖము. దుఃఖము కేవలం ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు తమోప్రధానతలో కూడా మీకు సుఖముంది, ఎటువంటి గొడవలు-కొట్లాటల విషయం లేదు. అవి తర్వాత జరుగుతాయి. జనాభా లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు యుద్ధం మొదలైనవి ప్రారంభమవుతాయి. పిల్లలైన మీకు సత్య, త్రేతా, ద్వాపర యుగాలలో కూడా సుఖముంటుంది. తమోప్రధానత ప్రారంభమైనప్పుడు కొద్దిగా దుఃఖముంటుంది. ఇప్పుడైతే అంతా తమోప్రధానంగా ఉంది. ఇది తమోప్రధాన ప్రపంచమని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది అనంతమైన డ్రామా అని, దీని నుండి ఎవరూ విముక్తులవ్వలేరని మీకు తెలుసు. మనుష్యులు దుఃఖంతో విసిగిపోయినప్పుడు, భగవంతుడు ఇలాంటి ఆటను ఎందుకు రచించారని అంటారు. ఒకవేళ భగవంతుడు రచించకపోయి ఉంటే, ఇక ప్రపంచమే ఉండదు, అసలేమీ ఉండదు. రచయిత మరియు రచన అయితే ఉన్నారు కదా. సత్యయుగం నుండి కలియుగాంతము వరకు రచన గురించిన వివరణ ఉంది. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. మీరు కూడా ప్రాక్టికల్ గా చూస్తారు. ముందు నుండే చూపించరు. 5 వేల సంవత్సరాల చక్రంలో ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. దానిని ఇప్పుడే చూపించరు, అది గడుస్తున్నప్పుడు దానిని కూడా సాక్షీగా అయి చూస్తారు. ఏదైతే జరగనున్నదో అది కల్ప క్రితం వలె జరుగుతుంది. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని మీరు చూస్తున్నారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది డ్రామాలో ముందు నుండే నిశ్చయించబడి ఉంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తమోప్రధానంగా తయారైన మీ ఆత్మను కూడా ఇక్కడే సతోప్రధానంగా చేసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.

తండ్రి గుప్తంగా వస్తారని, గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీరు విశ్వ రాజ్యాన్ని గుప్తంగా తీసుకుంటారు, ఎటువంటి శబ్దము కలగదు. దీనిని పూర్తిగా గుప్తమైన దానమని అంటారు కదా. తండ్రి వచ్చి పిల్లలకు అవినాశీ జ్ఞాన రత్నాల యొక్క గుప్త దానాన్ని ఇస్తారు. తండ్రి కూడా ఎంత గుప్తమైనవారు, వారి గురించి ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మాకుమార-కుమారీలంతా ఎక్కడికి వెళ్తారు, ఏమి చేస్తారు అనేది ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎంత గుప్తమైనవారు అనేది పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మిమ్మల్ని గుప్తంగా విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏ యుద్ధము లేదు, ఏ తుపాకులు లేవు, ఏ ఖర్చూ లేదు. ఇక్కడైతే ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా ఎన్ని గొడవలు, ఎంత మారణహోమం జరుగుతుంది. కనుక తండ్రి వచ్చి గుప్త దానాన్నిస్తారు. అవినాశీ జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుతారు. జోలిని నింపండి, శివ భోళా భండారీ అని అంటారు.

శివబాబా మా జోలిని అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుతున్నారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. మీరు ఎన్ని రత్నాలను ఇస్తారు, మీరు ఎంత దానం చేస్తారు. ఇదంతా గుప్తంగా జరుగుతుంది. దేవతలకు ఎన్ని ఆయుధాలు, భుజాలు మొదలైనవి చూపించారు. వాస్తవానికి అటువంటిదేమీ లేదు. సత్యయుగంలో దేవతలకు ఇన్ని భుజాలు మొదలైనవి ఉండవు. కలియుగంలో అనేక రకాల ఆయుధాలను చూపించారు. వినాశనం కోసం బాంబులున్నప్పుడు ఇక ఖడ్గాలు, బాణాలు మొదలైనవాటిని ఏమి చేస్తారు. మీరు జ్ఞాన ఖడ్గము అని అంటారు, దీనిని వారు ఆయుధముగా అర్థం చేసుకున్నారు. కానీ అలాంటిదేమీ కాదు. మీకు గుప్త దానం లభిస్తుంది, మీరు మళ్ళీ అందరికీ గుప్త దానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు, శ్రీమతం భగవంతునిది. మనము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, దైవీ గుణధారులని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ-దేవతల్లోనే ఉంటాయి, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. పౌర్ణమి చంద్రుని ప్రకాశం బాగుంటుంది, అది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది, అలా తగ్గిపోతూ-తగ్గిపోతూ ఒక సన్నని రేఖ మాత్రమే మిగులుతుంది. అంతా మాయమవ్వదు, ఒక రేఖ తప్పకుండా ఉంటుంది, దానినే అమావాస్య అని అంటారు. ఇప్పుడు మీది అనంతమైన విషయము. మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. కృష్ణుని నోటిలో మాతలు చంద్రుడిని చూసేవారన్నట్లు చూపిస్తారు. ఇవి సాక్షాత్కారం యొక్క విషయాలు. వీటి గురించి తండ్రి కూర్చుని వివరిస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణమవ్వాలి. మాయ యొక్క సంపూర్ణ గ్రహణం పట్టి ఉంది. చివరికి ఒక సన్నని రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ వచ్చారు. అందరూ మెట్లు దిగాల్సిందే, అప్పుడే మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. చదువులో ఎక్కువ మంది పాస్ అవ్వరు. మీ సెంటర్లు కూడా నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. అప్పుడు, మీలో ఏముంది అనేది అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు మనుష్యులంటారు – ఈ సెంటర్లు ఎప్పటి వరకు నడుస్తాయి, ఇవి సమాప్తమైపోతాయని మేము ఒకప్పుడు అనుకున్నాము. ప్రారంభంలో ఈ భయం వల్ల చాలా మంది పారిపోయారు. ఏమవుతుందో తెలియదు అనుకున్నారు! అటుకి ఇటుకి కాకుండా అయిపోతాము, దీనికంటే పారిపోవడమే మేలు అని అనుకున్నారు. అలా పారిపోయారు, మళ్ళీ అందులో కొందరు తిరిగి వస్తూ ఉన్నారు. తండ్రి కూర్చుని ఎంత సహజమైన రీతిలో అర్థం చేయిస్తారు! ఈ అబలలకు, అహల్యలకు ఏ కష్టాన్ని ఇవ్వరు. వీరి ఉద్ధరణ కూడా జరగాలి. బాబా, మేమైతే ఏమీ చదువుకోలేదు అని అంటారు. తండ్రి అంటారు – ఏమీ చదువుకోకపోతే చాలా మంచిది. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుకున్నారో, వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఎక్కువగా ఏమీ చదివించను. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే, ఇక రాజ్యాధికారం మీదే అని చెప్తాను. అంతే, అప్పుడిక మీ నావ తీరానికి చేరుకుంటుంది. బిడ్డ జన్మించగానే బాబా అని అంటాడు. అంతే, వారసత్వానికి హక్కుదారుడిగా అయిపోతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అవుతారు. బాప్ దాదాను స్మృతి చేసారంటే ఇక రాజధాని మీదే. అందుకే సెకండులో జీవన్ముక్తి అని గాయనం చేయడం జరుగుతుంది. షావుకార్ల పాత్ర చివరిలో ఉంటుంది. ముందు పేదవారి వంతు. వారు మీ వద్దకు వారంతట వారే వస్తారు. దళితుల ఉద్ధరణ కూడా జరగాలి. కొండజాతి స్త్రీల గురించి కూడా గాయనం ఉంది. రాముడు కొండజాతి స్త్రీ ఇచ్చిన పండ్లను తిన్నాడని అంటారు. వాస్తవానికి అలా తిన్నది రాముడు కాదు, శివబాబా కూడా కాదు. ఈ బ్రహ్మా తినాల్సి వచ్చి ఉండవచ్చు. కొండజాతి స్త్రీ మొదలైనవారు వస్తారు. వారు టోలీ మొదలైనవి తీసుకొచ్చారనుకోండి, బ్రహ్మా ఎలా నిరాకరించగలరు? కొండజాతి స్త్రీలు, వేశ్యలు తీసుకొస్తే మీరు కూడా తింటారు. నేనైతే తినను, నేను అభోక్తను అని శివబాబా అంటారు. మీ వద్దకు అందరూ వస్తారు. వీరిని ఉద్ధరించండి అని గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. మీకు కూడా స్వతహాగా ప్రేరణ లభిస్తుంది. బాబా పేదల పెన్నిధి కనుక మేము కూడా పేదవారికి అర్థం చేయించాలి. కొండజాతి స్త్రీల నుండి కూడా వెలువడుతారు. ఇంత పెద్ద వృక్షముంది, ఇందులో ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మం వారిగా లేరు. వేరే ధర్మాలన్నింటిలోకి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు – ఎవరైతే భక్తి చేసేవారు ఉంటారో, వారికి అర్థం చేయించండి. అంటు ఎలా కట్టబడుతుంది, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారు అనేది మీరు చూస్తున్నారు. ఎవరైతే సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారుంటారో, వారే వస్తూ ఉంటారు. ఒక్కసారి విన్నా కూడా, స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీలోని కత్తుల బావిలోకి దూకే ఉదాహరణ కూడా వినిపించారు. శివునిపై బలి అయ్యేవారు. వారికి కూడా ఏదో ఒకటి లభించాలి. మీరు కూడా బలి అవుతారు, రాజ్యం కోసం పురుషార్థం చేస్తారు. భక్తి మార్గంలో రాజ్యమైతే ఉండదు. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అప్పుడు ఏమి జరుగుతుంది, వారు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో, వాటికి శిక్షలు అనుభవించి సమాప్తం చేసుకుంటారు. తర్వాత కొత్త జన్మ లభిస్తుంది. కొత్తగా పాపాలు మొదలవుతాయి. ఇకపోతే, ఉండడమైతే అందరూ ఇక్కడే ఉండాలి. నంబర్ వన్ లో మీరే ఉన్నారు. మీరే 84 జన్మలు అనుభవిస్తారు. అందరూ సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం మనుష్య సృష్టి యొక్క వృక్షం శిథిలావస్థలో ఉందని తండ్రి అంటారు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో, కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. కుంభకర్ణుడు అంటే ఒక్కరే కాదు, అనేకమంది ఉన్నారు. మీరెంతగా అర్థం చేయించినా సరే, అసలు వినరు. ఎవరి పాత్ర ఉంటే, వారు పురుషార్థం చేస్తారు మరియు వారే తల్లిదండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారు. సింహాసనాధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, పిల్లలను తిట్టాల్సి వస్తుందని ఎంతమంది మాతలు అడుగుతారు. తండ్రి అంటారు – దానికి అంత శిక్ష ఏమీ ఉండదు. పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు పిలుస్తారు. కామము మహాశత్రువని తండ్రి కూడా అంటారు. క్రోధం శత్రువని అనరు. మాతలలో క్రోధం అంతగా ఉండదు, పురుషులు చాలా గొడవపడతారు. ఇప్పుడు తండ్రి మాతలైన మిమ్మల్ని ముందు పెట్టారు. వందేమాతరం. లేదంటే, నీ పతి గురువు, ఈశ్వరుడు, వారి మతమనుసారముగా నడుచుకోవాలని మాతలకు చెప్తారు. ముడి వేసిన వెంటనే పతితంగా అవుతారు. ఇటువంటి ఈశ్వరుడా ఆమెకు లభించింది! ఇప్పుడు రామ రాజ్యం స్థాపన అవుతుంది. మిగిలినవారంతా మరణిస్తూ ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి అని బాబా అర్థం చేయించారు. మీకు పరమపిత పరమాత్ముని పట్ల ప్రీతి బుద్ధి ఉంది. శివబాబా వీరిలోకి వస్తారని, వీరి ద్వారా మనము వింటున్నామని మీ ఆత్మకు తెలుసు. ఆత్మ ఎంత చిన్న బిందువు. ఇది శివబాబా యొక్క తాత్కాలిక రథము. వీరి ద్వారా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల ఒక్కొక్క నీటి బిందువుతో కొలను నిండుతూ ఉంటుంది. పిల్లలు తమది సఫలం చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుందని, ఏమీ మిగలదని వారికి తెలుసు. ఈ మాత్రం అయినా సఫలమవ్వాలని భావిస్తారు. సుదాముని ఉదాహరణ కూడా ఉంది కదా. కుమార్తెలు పిడికెడు బియ్యాన్ని లేక 6-8 రూపాయలను బాబాకు పంపిస్తారు. వాహ్ పిల్లలూ! తండ్రి పేదల పెన్నిధి కదా. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడింది, మళ్ళీ అలాగే జరుగుతుంది. బంధనంలో ఉన్నవారు ఉన్నారు. బాబా అంటారు – మీరు భాగ్యశాలి ఎందుకంటే శివబాబా చేయి అయితే లభించింది కదా. ఆర్య సమాజం వారు మొదలైనవారంతా ఇక్కడకు వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ముక్తి-జీవన్ముక్తులు లభించే దుకాణమైతే ఒక్కటే. శిక్షలు అనుభవించి అందరూ ముక్తిలోకి వెళ్ళాలి. ఇది వినాశన సమయము. అందరూ తిరిగి వెళ్తారు. ఇది ప్రియుని ఊరేగింపు. ఊరేగింపు ఎలా వెళ్తుంది అనేది కూడా సాక్షాత్కారమవుతుంది. మీరు తప్ప వేరెవ్వరూ చూడలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ద్వారా జ్ఞానము యొక్క గుప్త దానం ఏదైతే లభించిందో, దాని విలువను అర్థం చేసుకొని, జ్ఞాన రత్నాలతో తమ జోలిని నింపుకోవాలి. అందరికీ గుప్త దానాన్ని ఇస్తూ వెళ్ళాలి.

2. ఈ వినాశన సమయంలో తిరిగి వెళ్ళాలి కనుక తమదంతా సఫలం చేసుకోవాలి. ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వాలి. ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియజేయాలి.

వరదానము:-

ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి-విధాతలుగా అవుతారో, అప్పుడు ప్రకృతి సతోప్రధానంగా అయిపోతుంది, యుగం సత్యయుగంగా అయిపోతుంది. సర్వాత్మలు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారుచేసుకుంటారు. మీ సత్యత పారసముతో సమానమైనది. ఎలాగైతే పారసము ఇనుమును పారసముగా చేస్తుందో, అలా సత్యతా శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార-వ్యవహారాలను సతోప్రధానంగా చేస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top