20 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
19 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ సభలో బాహ్యముఖులుగా అయి కూర్చోకూడదు, తండ్రి స్మృతిలో ఉండాలి, మిత్ర-సంబంధీకులు, వ్యాపారం మొదలైనవి స్మృతి చేసినట్లయితే వాయుమండలంలో విఘ్నాలు ఏర్పడతాయి”
ప్రశ్న: -
పిల్లలైన మీరు చేసే ఆత్మిక డ్రిల్, దేనినైతే మనుష్యులు చేయలేరో, ఆ డ్రిల్ యొక్క విశేషత ఏమిటి?
జవాబు:-
మీ ఆత్మిక డ్రిల్ బుద్ధికి సంబంధించినది. దీని విశేషత ఏమిటంటే – మీరు ప్రేయసులుగా అయి మీ ప్రియుడిని స్మృతి చేస్తారు. దీని గురించే గీతలో కూడా సూచించడం జరిగింది – మన్మనాభవ. కానీ మనుష్యులకు తమ ప్రియుడైన పరమాత్మ గురించి తెలియనే తెలియనప్పుడు ఇక డ్రిల్ ఎలా చేయగలరు. వారు ఒకరికొకరు దైహిక డ్రిల్ ను నేర్పిస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. పిల్లలు (యోగం చేయించేవారు) ఇక్కడ ఏమి చేస్తున్నారు అనేది పిల్లలకు కూడా అర్థమవుతుంది, తండ్రికి కూడా అర్థమవుతుంది. స్మృతి యాత్ర యొక్క డ్రిల్ చేయిస్తున్నారు. నోటితో చెప్పేది ఏమీ లేదు. ఎవరి స్మృతి ఉంది? పరమపిత పరమాత్మ అయిన శివబాబా స్మృతి ఉంది. వారి స్మృతిలో ఉండడంతో మన వికర్మలు ఏవైతే ఉన్నాయో, అవి భస్మమైపోతాయి మరియు ఎవరెంతగా స్మృతి యొక్క డ్రిల్ చేస్తారో, అంతగా వికర్మాజీతులుగా అవుతారు. ఇది ఆత్మ చేసే డ్రిల్, శరీరానికి సంబంధించింది కాదు. భారత్ లో నేర్పించే డ్రిల్ లు అన్నీ దైహికమైనవి, ఇది ఆత్మిక డ్రిల్. ఈ ఆత్మిక డ్రిల్ గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు.
ఆత్మిక డ్రిల్ కు సంబంధించిన సూచన గీతలో తప్పకుండా ఉంది. భగవానువాచ మరియు భగవంతుని పిల్లల యొక్క వాచా కూడా. మీరిప్పుడు భగవంతుడైన శివబాబాకు పిల్లలుగా అయ్యారు కదా. నన్నొక్కరినే స్మృతి చేయండి అని పిల్లలకు ఆజ్ఞ లభించింది. తండ్రి కూడా డ్రిల్ నేర్పిస్తారు. పిల్లలు కూడా ఇదే డ్రిల్ నేర్పిస్తారు. కల్పక్రితం కూడా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. ఇది పదే-పదే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చొని ఎవరైనా తమ మిత్ర-సంబంధీకులను, వ్యాపారం మొదలైనవాటిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వాయుమండలంలో విఘ్నాలను కలిగిస్తారు. ఎలాగైతే ఇక్కడ మీరు స్మృతిలో కూర్చొని ఉన్నారో, అలా నడుస్తూ-తిరుగుతూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండాలి అని తండ్రి అంటారు. ఉదాహరణకు ప్రేయసి-ప్రియుడు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. వారి స్మృతి దేహానికి సంబంధించినది. మీది ఆత్మిక స్మృతి. ఆత్మలు భక్తి మార్గంలో కూడా ప్రియుడైన పరమపిత పరమాత్మకు ప్రేయసులుగా ఉంటారు. కానీ ప్రియుని కోసము తెలియదు, తమ ఆత్మ గురించి కూడా తెలియదు. ప్రియుడైన తండ్రి వచ్చి ఉన్నారు. భక్తి మార్గం నుండి మొదలుకొని ఆత్మలు ప్రేయసులుగా అయ్యారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మకు సంబంధించిన విషయము. ప్రేయసులైన మీరు ప్రియుడినైన నన్ను – బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపించి మీతో పాటు శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారని తండ్రి పిల్లలతో సమ్ముఖంగా అంటారు. ఇప్పుడు ఈ దుఃఖధామం, మృత్యులోకం వినాశనం కానుందని మీకు తెలుసు. అమరలోకం జిందాబాద్, మృత్యులోకం ముర్దాబాద్. ఇప్పుడు మీరు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. ఇప్పుడు మనం 21 జన్మల కోసం నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతామని పిల్లలైన మీకు పూర్తి నిశ్చయముండాలి. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు కానీ ఎంత సమయం కోసం స్వర్గవాసులుగా అయ్యారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ నిశ్చయం కలిగించేది ఎవరు! వారు గీతా భగవంతుడు. కానీ వారు ఆ నిరాకారుడు ఒక్కరే. నిరాకారుడు నిరాకారుడే, వారు ఇక్కడకు ఎలా వచ్చి నేర్పిస్తారని మనుష్యులు అనుకుంటారు. తండ్రి గురించి తెలియని కారణంగా, డ్రామానుసారంగా, కృష్ణుని పేరును పొరపాటుగా వేసేసారు. ఈ సమయంలో కృష్ణుడికి మరియు శివునికి మధ్యన సంబంధం దగ్గరగా ఉంది. శివజయంతి సంగమంలో జరుగుతుంది. తర్వాత, రేపు కృష్ణ జయంతి జరుగుతుంది. శివజయంతి రాత్రి సమయంలో, కృష్ణ జయంతి ఉదయాన్నే జరుగుతుంది, దానిని ప్రభాత సమయమని అంటారు. శివరాత్రి పూర్తి అయిన తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి జరుగుతుంది. ఈ విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ సభలో ఎవరూ బాహ్యముఖులుగా ఉండకూడదు, తండ్రి స్మృతిలో ఉండాలి అనే నియమం ఉంది. ఓ పతితపావనా రండి, వచ్చి పావనంగా చేయండి అని మనుష్యులు పిలుస్తారు కూడా. కానీ డ్రామానుసారంగా రాతిబుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థమైతే ఇతరులకు చెప్పేవారు. ఇప్పుడిది కలియుగ అంతిమమని, మళ్ళీ తండ్రి వచ్చినప్పుడు ఆది ప్రారంభమవుతుందని కూడా వారికి తెలియదు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. కలియుగానికి ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని మనుష్యులు భావిస్తారు. హద్దు తండ్రి ఎప్పుడూ పతితపావనుడిగా అవ్వలేరని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. బాపూ అనే పేరునైతే చాలామందికి పెట్టేసారు. వృద్ధులను కూడా బాపూ లేదా పితాజీ అని అంటారు. ఈ ఆత్మిక పితాశ్రీ ఒక్కరే, వీరే పతితపావనుడు, జ్ఞానసాగరుడు. పిల్లలకు పావనంగా అయ్యేందుకు జ్ఞానం కావాలి. నీటిలో స్నానం చేయడంతో ఎవరూ పావనంగా అవ్వరు. శివబాబా ఈ తనువులో మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారని మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు అర్జునుడి పట్ల భగవానువాచ అని అంటారు, బ్రాహ్మణుల నామ-రూపాలు లేవు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని అంటూ ఉంటారు. బ్రహ్మా ద్వారానే స్థాపన చేస్తారు, అంతేకానీ విష్ణువు ద్వారానో లేక శంకరుని ద్వారానో కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వివరణ లభించింది. తండ్రికి ఇక్కడకు రావాల్సి వస్తుంది, ఏ ఆత్మ కూడా తిరిగి వెళ్ళలేదు. ఎవరు వచ్చినా సరే, వారు సతో, రజో, తమోలను తప్పకుండా దాటాల్సిందే. కృష్ణుడు కూడా పూర్తి 84 జన్మలను తీసుకుంటారు మరియు పూర్తి 5 వేల సంవత్సరాలు పాత్రను అభినయించారు. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా జన్మ ఉన్నట్లే కదా. కృష్ణుని ఆత్మ సత్యయుగంలోకి వచ్చినప్పుడు, గర్భంలోకి ప్రవేశించినప్పటి నుండి 5 వేల సంవత్సరాలలో 84 జన్మల పాత్రను అభినయించాలి. ఉదాహరణకు, శివజయంతిని జరుపుకుంటున్నారంటే, వారు ఇతనిలో కూర్చొని ఉన్నారు కదా. కృష్ణుని ఆత్మ కూడా గర్భంలోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి, ఆ సమయం నుండి మొదలుకొని 5 వేల సంవత్సరాల లెక్క ప్రారంభమవుతుంది. ఒకవేళ అటు ఇటు అయితే, 5 వేల సంవత్సరాల లెక్కలో తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కృష్ణుని ఆత్మ మళ్ళీ శ్రీకృష్ణునిగా తయారయ్యేందుకు జ్ఞానం తీసుకుంటుందని పిల్లలకు తెలుసు. మీరు కూడా కంసపురి నుండి కృష్ణపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు.
మాయ చాలా శక్తివంతమైనదని, మంచి-మంచి మహారథులను కూడా ఓడిస్తుందని తండ్రి అంటారు. జ్ఞానాన్ని తీసుకుంటూ-తీసుకుంటూ ఎక్కడో గ్రహచారం కూర్చొంటుంది. ఆశ్చర్యకరంగా నా వారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు….. అహో మాయ, అయినా కూడా పారిపోతారు. సంపాదనలో గ్రహచారం కూర్చొంటుంది. అందరికీ రాహు గ్రహణం పట్టి ఉంది. ఇప్పుడు మీపై బృహస్పతి దశ కూర్చొంది, తర్వాత నడుస్తూ-నడుస్తూ కొందరిపై రాహు గ్రహణం కూర్చొంటుంది, అప్పుడు – ఈ ప్రపంచంలో మహాన్ మూర్ఖులను చూడాలంటే ఇక్కడే చూడండి అని అంటారు. మీ ఆత్మ అంటుంది – మేము తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము, బాబా, కల్పక్రితం కూడా మీ నుండి ఈ వారసత్వాన్ని తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాము. తండ్రి అర్థం చేయించారు – అక్కడ మీ సెంటర్లకు చాలామంది అర్థం చేసుకునేందుకు వస్తారు. ఇక్కడ ఇది ఇంద్ర సభ. శివబాబా ఇంద్రుడు కదా, వారే జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. కావున ఇలాంటి సభలోకి పతితులు ఎవరూ రాలేరు. సబ్జపరి, పుఖరాజ్ పరి బ్రాహ్మణీలు ఎవరైతే పండాలుగా అయి వస్తారో, వారు వికారాల్లోకి వెళ్ళేవారెవరినీ తమతో పాటు తీసుకురాకూడదని వారికి చెప్పడం జరుగుతుంది. లేదంటే ఇద్దరూ బాధ్యులు అవుతారు. వికారులు ఎవరినైనా తమతో పాటు తీసుకొస్తే, ఆ బ్రాహ్మణీపై చాలా పెద్ద మచ్చ ఏర్పడుతుంది. అప్పుడు, చాలా భారీ శిక్ష లభిస్తుంది. దేవకన్యలపై చాలా బాధ్యత ఉంది. మానస సరోవరంలో స్నానం చేస్తే దేవకన్యలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరము. తండ్రి మనుష్య తనువులోకి వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. వారు జ్ఞానసాగరుడు కదా. మీరు నది కూడా, సరోవరం కూడా, జ్ఞానసాగరుడు వీరిలో కూర్చొని పిల్లలను స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు. స్వర్గంలో శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజ్యముంది. ఇది ప్రవృత్తి మార్గం యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము. మేము ఇద్దరము జ్ఞాన చితిపై కూర్చొని లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు. ఉన్నత పదవిని పొందాలి కదా. అర్ధకల్పం ఆత్మలు తపిస్తూ ఉంటాయి. బాబా రండి, మీరు వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించి పావనంగా చేయండి అని అంటారు. తండ్రి సూచనను ఇస్తారు. దేవీ-దేవతలను నమ్మే భారతవాసులు తప్పకుండా 84 జన్మలను అనుభవించారు. తండ్రి వచ్చి 3 ధర్మాలను ఎలా స్థాపన చేస్తారు అనేది దేవీ-దేవతల భక్తులకు ప్రయత్నించి అర్థం చేయించండి. బ్రాహ్మణ, సూర్య వంశం, చంద్ర వంశం, 3 ధర్మాలను తండ్రి స్థాపన చేస్తారు. అర్ధకల్పం ఇక ఏ ధర్మ స్థాపన జరగదు. ఆ తర్వాత, మిగతా అర్ధకల్పంలో ఎన్ని మఠాలు, మార్గాలు మొదలైన అనేక ధర్మాలు స్థాపనవుతాయి. అర్ధకల్పము ఒకే ధర్మముంటుంది, అది కూడా సంగమయుగంలో భవిష్యత్తు కోసం రాజధానిని స్థాపన చేస్తారు. వారందరూ పాత ప్రపంచంలోనే తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇక్కడ, తండ్రి అర్ధకల్పం కోసం ఏక ధర్మ స్థాపనను చేస్తారు. ఇంకెవరిలోనూ శక్తి లేదు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకొని సూర్య, చంద్ర వంశాలను స్థాపన చేసి, మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం చేయిస్తారు. ఆత్మలందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. మీరు సుఖంలోకి వస్తారు, ఆ సమయంలో భగవంతుడిని స్మృతి చేయడానికి ఏ దుఃఖము లేదు. ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. సాగరుడైతే ఒక్కరే. మీరు స్వయాన్ని సాగరమని చెప్పుకోలేరు. మీరు వారికి సహాయకులుగా అవుతారు కావున మీకు జ్ఞాన గంగలు అనే పేరు ఉంది. మిగిలినవన్నీ నీటి నదులు. సాగరుడినైన నా పిల్లలైన మీరు కామ చితిపై కూర్చొని కాలి మరణించారని అనగా పతితులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని తండ్రి అంటారు. ఈ సృష్టి చక్రం 5 వేల సంవత్సరాలది. ఇది కూడా ఎవరికీ తెలియదు. సృష్టి చక్రం 4 భాగాలుగా ఉంది. 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ సంగమయుగం కళ్యాణకారి యుగము. కుంభము అని అంటారు కదా. కుంభము అని మేళాను అంటారు. నది వచ్చి సాగరంలో కలుస్తుంది. ఆత్మ వచ్చి పరమాత్మను కలుస్తుంది, దీనినే కుంభమని అంటారు. ఆత్మ మరియు పరమాత్మల మేళా కూడా మీరు చూస్తారు. మీరు పరస్పరంలో కలుసుకుంటారు, సెమినార్లు చేస్తారు, వీటిని కుంభమని అనరు. సాగరుడైతే తమ స్థానంలోనే కూర్చొని ఉన్నారు. ఈ తనువులో ఉన్నారు కదా. వీరి తనువు ఎక్కడ ఉంటుందో, అక్కడ జ్ఞాన సాగరుడు ఉంటారు. ఇకపోతే, జ్ఞాన గంగలైన మీరు పరస్పరంలో కలుసుకుంటారు. చిన్న-పెద్ద నదులు ఉంటాయి కదా. అక్కడకు స్నానాలు చేసేందుకు వెళ్తారు. గంగ, యమున, సరస్వతి మొదలైనవి ఉండనే ఉన్నాయి. యమునా నది తీరంలో ఉన్న ఢిల్లీ – స్వర్గము. కృష్ణపురి ఉంటుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేదని అంటారు. కృష్ణుని రాజ్యముండేదని అనరు. రాధా-కృష్ణులు యుగల్ గా అయినప్పుడు రాజ్యం చేయగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. మాయ తుఫాన్లు అయితే చాలా వస్తాయి. ఇది అనంతమైన బాక్సింగ్. ప్రతి ఒక్కరికీ 5 వికారాలతో యుద్ధం జరుగుతుంది. మనం తండ్రిని నిరంతరం స్మృతి చేయాలని కోరుకుంటాము. మాయ మన యోగాన్ని తెంచేస్తుంది. ఒక ఆటను కూడా చూపిస్తారు – పరమాత్మ తమ వైపుకు ఆకర్షిస్తారు, మాయ తన వైపుకు ఆకర్షిస్తుంది, ఇలాంటి నాటకాన్ని ఒకటి తయారుచేసారు. సినిమాల ఫ్యాషన్ ఇప్పుడు వచ్చింది. డ్రామానుసారంగా మీరు సినిమా యొక్క ఉదాహరణ తీసుకుని అర్థం చేయించవలసి ఉంది. నాటకంలోనైతే మార్పు-చేర్పులు జరుగుతాయి. ఇది తయారై తయారవుతున్న అనాది, అవినాశి డ్రామా. తయారై ఉన్నది, తయారవుతుంది… ఫలానావారు మరణించారంటే, వారి పాత్ర అంతే ఉంది, మనమెందుకు చింతించాలి. ఇది డ్రామా కదా. శరీరాన్ని వదిలేసారు, ఇక మళ్ళీ రాలేరు. ఏడవడంతో లాభమేముంది? దీని పేరే దుఃఖధామము. సత్యయుగంలో మోహజీత్ రాజులుంటారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. సత్యయుగంలో మోహమనే మాట ఉండదు. ఇక్కడైతే మనుష్యులకు ఎంత మోహముంది. ఎవరికైనా ఏడుపు రాకపోయినా, ఏడ్చి-ఏడ్చి అయినా సరే వారిని ఏడిపిస్తారు. అప్పుడు వారు బాధపడుతున్నారని భావిస్తారు, లేదంటే నిందిస్తారు. ఈ ఆచారాలన్నీ భారత్ లోనే ఉన్నాయి. భారత్ లోనే సుఖము, భారత్ లోనే చాలా దుఃఖము ఉంటుంది. భారత్ లో దేవి-దేవతలు రాజ్యం చేసేవారు. విదేశీయులు పాత చిత్రాలను చాలా సంతోషంగా తీసుకుంటారు. పాత వస్తువులకు గౌరవముంటుంది. అందరికన్నా పాతవారైన శివుడు ఇక్కడకు వచ్చారు కదా, వారిని ఎంతగా పూజిస్తారు. ఇప్పుడు శివబాబా వచ్చారు కానీ మీరు పూజించరు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కావున వారిని పూజిస్తూ ఉంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నిశ్చింతగా అవ్వాలి. ఏ రకమైన చింత చేయకూడదు ఎందుకంటే ఇది తయారై ఉన్నది తయారవుతుంది…. అని తెలుసు. నిర్మోహులుగా అవ్వాలి.
2. తండ్రి ద్వారా ఇప్పుడు బృహస్పతి దశ కూర్చొని ఉంది కావున రాహు గ్రహణం పట్టకుండా సంభాళించుకోవాలి. ఏదైనా గ్రహచారం ఉన్నట్లయితే దానిని జ్ఞాన దానంతో సమాప్తం చేసుకోవాలి.
వరదానము:-
అనుభవాలను పెంచుకునేందుకు ఆధారం మనన శక్తి. మననం చేసేవారు స్వతహాగా మగ్నమై ఉంటారు. మగ్నావస్థలో యోగం జోడించాల్సిన అవసరం ఉండదు, కానీ నిరంతరం జోడించబడే ఉంటుంది, కృషి చేయాల్సిన అవసరం ఉండదు. మగ్నం అనగా ప్రేమ సాగరంలో ఇమిడి ఉండడం, ఎవరూ వేరు చేయలేని విధంగా ఇమిడి ఉండడం. కనుక శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి, మీరు సాగరుని పిల్లలు కావున అనుభవాల కొలనులో స్నానం చేయకండి, సాగరంలో ఇమిడిపోండి, అప్పుడు అనుభవీ మూర్తులని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!