14 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
13 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మొత్తం ప్రపంచమంతటకీ శాంతినివ్వడము ఒక్క తండ్రి పని మాత్రమే, అందుకే వారిని ఓ శాంతి దేవా, అని అంటారు. కనుక ప్రైజ్ (శాంతి బహుమతి) కూడా తండ్రికే లభించాలి”
ప్రశ్న: -
ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలరు?
జవాబు:-
ఎవరైతే తండ్రి సమానంగా పావనంగా అవుతారో – వారే పూర్తిగా ఫాలో చేయగలరు. 2. ఎవరైతే పక్కా ప్రేయసులుగా అయ్యారో, వారే ప్రియుడినైన నన్ను ఫాలో చేయగలరు. అటువంటి ప్రేయసులనే నేను నాతో పాటు తీసుకువెళ్తాను. అందుకే శాస్త్రాలలో, ఆవు తోకను పట్టుకుంటే తీరం దాటేస్తారని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం గానీ, తోక విషయం గానీ లేదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవు ప్రేమ సాగరుడవు….. (తూ ప్యార్ కా సాగర్ హై…..)
ఓంశాంతి. బాప్ దాదా ఇరువురూ ఉన్నారు కదా. ఆత్మల తండ్రి శివబాబా అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. నేను పతిత పావనుడిని, నిరాకారుడను అని కూడా మీకు తెలుసు. మీరు కూడా నిరాకారి, శాంత స్వరూపులు. నిరాకార తండ్రి కూడా శాంత స్వరూపుడే, ఆత్మ కూడా శాంత స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. మీ నివాస స్థానం శాంతిధామము. యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతిదేవా అని అంటారు, ఎందుకంటే ఆ పరమాత్మయే శాంతి సాగరుడు. మొత్తం ప్రపంచానికి శాంతినిచ్చేవారు ఆ తండ్రియే. శాంతి విషయంలో బహుమతులు అందుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా బహుమతి లభించినప్పుడు, వీరు శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులయ్యారని అంటారు. ఇందులో పెద్ద-పెద్ద వారి పేర్లు తీసుకుంటారు. ఇప్పుడు శాంతి అనేది మొత్తం ప్రపంచానికి కావాలి. లేదంటే అశాంతిగా ఉండేవారు, ఇతరులను కూడా అశాంతిగా చేస్తారు. ఇది రావణ రాజ్యము. రావణుడు శత్రువు కదా, రాముడిని శత్రువు అని అనరు. రాముని చిత్రాన్ని ఎప్పుడూ కాల్చరు. త్రేతాయుగపు రాముని చిత్రాన్ని గానీ, పరమపిత పరమాత్ముని చిత్రాన్ని గానీ కాల్చరు. రామ రాజ్యాన్ని అయితే అందరూ కోరుకుంటారు, కానీ రామ రాజ్యమని దేనినంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు. కేవలం కొత్త ప్రపంచం ఉండాలని, కొత్త ఢిల్లీలో రామ రాజ్యం ఉండాలని అంటూ ఉంటారు. కొత్త ఢిల్లీ అని అంటారు, దానికి చాలా పేర్లు పెడుతూ ఉంటారు. ఢిల్లీ అన్నింటికీ రాజధానిగా ఉంటుంది. ఢిల్లీయే పరిస్తాన్ గా ఉండేది. రాధా-కృష్ణులను కూడా అక్కడే ఉన్నట్లుగా చూపిస్తారు. వీరిరువురే ముఖ్యమైన రాకుమారుడు మరియు రాకుమారి. కేవలం వీరిరువురే ఉండరు, తప్పకుండా వేరేవారు కూడా ఉంటారు. 8 రాజ్యాలు గాయనం చేయబడతాయి, బుద్ధిని ఉపయోగించాలి. సత్యయుగంలో తప్పకుండా వేరే రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలున్నాయో చూడండి, వృద్ధి చెందుతూ-చెందుతూ అనేక రాజ్యాలు తయారవుతాయి. ఫలానా గ్రామానికి మహారాజు అని అంటారు, చిన్న-చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా. సత్యయుగంలో ఇన్ని ఉండవు. అక్కడ లక్ష్మీనారాయణుల పేరే ప్రసిద్ధమైనది. 2500 సంవత్సరాలు వీరి రాజ్యం నడిచింది. లక్షల సంవత్సరాలయ్యిందని మనుష్యులు అంటారు, ఇది ఆలోచించవలసిన విషయము. ఈ విషయాలు ఆత్మలకు భోజనం వంటివి. తండ్రి ఆత్మలైన మీకు, మీ బుద్ధికి ఈ ఆత్మిక భోజనాన్ని ఇస్తారు. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు, మునులు మొదలైనవారంతా అనేవారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఇలా అనరు. మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మీరు మీ 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. ఆదిలో దేవీ దేవతలైన మీరు ఉండేవారు, మధ్యలో రావణుడు ప్రవేశించడంతో వికారులుగా అయిపోయారు. ఇప్పుడిది అంతిమము. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై, మళ్ళీ మొదలవుతుందని మీకు తెలుసు. ఆదిలో రామ రాజ్యం ఉంటుంది. మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తి అయ్యి, మళ్ళీ రామ రాజ్యం ప్రారంభమవుతుంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి కదా. ఇది సత్య నారాయణ కథ. సర్వ శాస్త్రమయీ శిరోమణి శ్రీమత్ గీత అని మీకు తెలుసు. శ్రేష్ఠంగా తయారయ్యేందుకే శ్రీమతం లభిస్తుంది. శ్రీ అని శ్రేష్ఠమైన వారినే అంటారు. ఒక్క గీతా శాస్త్రాన్ని మాత్రమే, దేవీ దేవతా ధర్మ శాస్త్రమని అంటారని పిల్లలకు తెలుసు. దీని ద్వారా సంగమంలో దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో పావనంగా తయారుచేసేందుకు ఎవరూ పతితులుగా ఉండరు. గీతను పతిత-పావని అని అనలేమని ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు. గీత ద్వారా పావనంగా అవ్వలేరు. గీతా భగవంతుడిని పతిత పావనుడని అంటారు. దీనిని మంచి రీతిగా గుర్తుంచుకోండి. గీత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ శాస్త్రము. గీతా సమయంలోనే మహాభారీ మహాభారత యుద్ధం కూడా జరిగింది, దీనితో అనేక ధర్మాల వినాశనం జరిగింది మరియు ఏక ధర్మ స్థాపన జరిగింది. దేవీ-దేవతా ధర్మ శాస్త్రమని గీత గురించే అంటారు. దీనిని బ్రాహ్మణుల శాస్త్రమని అనరు. బ్రాహ్మణుల పేరు గీతలో లేనే లేదు. పరమపిత పరమాత్మయే వచ్చి బ్రహ్మా ద్వారా ఈ వేద శాస్త్రాలు మొదలైనవాటన్నింటి సారాన్ని తెలియజేస్తారు. సత్యయుగంలో బ్రాహ్మణులుండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ లక్ష్మీ నారాయణులు, దేవతలు ఉంటారు. బ్రహ్మా తర్వాత విష్ణువు ఉంటారు. బ్రహ్మా ద్వారా విష్ణుపురి స్థాపన అని చిత్రాలలో కూడా చూపించారు. బ్రహ్మా మరియు విష్ణువులు ఒకే సమయంలో కలిసి ఉండరు. బ్రహ్మా ద్వారా దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇవి విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు హక్కుదారులు కదా. ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు నాలుగు, శ్రీమద్భగవద్గీత నంబర్ వన్ శాస్త్రము, దీని ద్వారా నంబర్ వన్ ధర్మ స్థాపన జరుగుతుంది. తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. ఒక్క గీతలో మాత్రమే శ్రీమత్ భగవద్గీత అని రాయబడి ఉంది. ఇంకే శాస్త్రాలలోనూ శ్రీమతం లేదు. శ్రీమత్ ఇస్లామ్ లేక శ్రీమత్ బౌద్ధ అనే శాస్త్రాలేవీ లేవు. శ్రీమత్ భగవద్గీత ఒక్కటే. దీని ద్వారా ఏ ధర్మాన్ని స్థాపన చేసారు? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన ఇదివరకు జరిగింది మరియు మళ్ళీ అంతిమంలో జరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు బాబా మనల్ని టీచరు రూపంలో చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. బాబా మన తండ్రి కూడా మరియు టీచరు కూడా. బాబా చదువు ద్వారా సర్వుల సద్గతి చేస్తారు కనుక వారు సద్గురువు కూడా. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు గీతలో కృష్ణుని పేరు వేసేసారు. వారేమీ జ్ఞాన సాగరుడు కాదు. జ్ఞాన సాగరుడైన తండ్రి వారిని అలా తయారుచేసారు కనుక బాబా టీచరుగా కూడా అయినట్లు. ఇక్కడ మీరు కొత్త విషయాలను వింటారు, శాస్త్రాలు మొదలైనవైతే చాలా చదువుతూ, వింటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా డైరెక్టుగా వింటారు. ఇంతకుముందు అందరూ శరీరధారి మనుష్యుల ద్వారా విన్నారు. వాస్తవానికి ఆత్మలైన మనం అశరీరులుగా ఉండేవారమని, తర్వాత శరీరాన్ని ధరించామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా కూడా అశరీరియే. శివలింగాన్ని తయారుచేస్తారు కదా. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. ఓ పరమపిత పరమాత్మ, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. లింగాన్ని పూజిస్తారు కానీ మేము ఎవరినైతే పిలుస్తున్నామో, వారు పతితపావనుడైన తండ్రి అని అర్థం చేసుకోరు. శివుడు భగవంతుడు, ఈశ్వరుడు. కేవలం ఇలా అనుకుంటూ స్మృతి చేస్తారు. వారిని తండ్రి అని అంటున్నప్పుడు, తండ్రి నుండి వారసత్వం లభించాలని బుద్ధిలోకి రావాలి. మనకు వారసత్వం లభించింది, అందుకే మనం పూజిస్తాము. భారతవాసులకు తప్పకుండా వారసత్వం లభించింది కానీ ఎప్పుడు లభించింది అనేది మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము బాబా వద్దకు వచ్చామని పిల్లలంటారు. శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి అనే పేరు ప్రసిద్ధమైనది. త్రిమూర్తి మార్గమనే పేరు కూడా పెట్టారు. తండ్రికి చాలా మహిమ ఉంది. ప్రేమ సాగరుడు….. అని పాటలో కూడా విన్నాము. వారు సర్వుల సద్గతిదాత, సర్వులకు సుఖ-శాంతులనిచ్చేవారు, సర్వుల దుఃఖహర్త-సుఖకర్త. వారు చాలా ప్రియమైనవారు కదా. వారి కన్నా ప్రియమైన వస్తువు మరేదీ ఉండదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా చేసారో, వారు తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా. వారు అనంతమైన తండ్రి. పిల్లలూ, నా నుండి స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది కదా అని అంటారు. ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరులు. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. బాబా పావనంగా చేసేందుకు వచ్చి ఉన్నారని ఇప్పుడు ఆత్మ అంటుంది. పిల్లలూ, 5 వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను అని అంటారు. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ఓ పతితపావనా, రండి అని పిలుస్తారు కూడా మరియు పతితపావన సీతా-రామా….. అని భజన చేస్తూ, మొరపెట్టుకుంటూ ఉంటారు. అంటే స్వయం పతితులుగా ఉన్నారనే కదా. ఇది నరకము, దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది చేయడం వలన ఇలా అవుతారు, ఇలా జరుగుతుంది….. అని గరుడ పురాణంలో, చెవులకు ఇంపైన విషయాలు రాసారు. ఇంకా, ఆవు తోక పట్టుకుంటే స్వర్గంలోకి వెళ్ళిపోతామని అంటారు. ఇలాంటివేవో రాసి ఉన్నాయి. ఇప్పుడిది జంతువు విషయమేమీ కాదు. మీరు గోమాతలు కదా. ఎప్పటివరకైతే మీ తోకను అనగా మిమ్మల్ని పట్టుకోరో, అప్పటివరకు మార్గం లభించదు. ఇక్కడ తోకేమీ లేదు. మీ తోక పట్టుకొని దాటేస్తామని అంటూ ఉంటారు. ఇప్పుడిక్కడ తోక పట్టుకోవాలని కాదు, కానీ ఫాలో చేయాలి. సన్యాసుల ఫాలోవర్స్ అయితే చాలా మంది ఉన్నారు. కానీ ఫాలో చేయడం అనగా పవిత్రంగా అవ్వడము. మీరు సత్యాతి-సత్యమైన ఫాలోవర్స్. శివబాబా అంటారు – నేను మిమ్మల్నందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే, మీ పాపాలు భస్మమైపోతాయి. పావనంగా అవ్వకుండా ఫాలో చేయలేరు. శివబాబాను పూర్తిగా ఫాలో చేయాలి. ఫాలో చేయడానికే మీరు ఇక్కడ కూర్చున్నారు. భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మలు ప్రేయసులని, పరమాత్మ ప్రియుడని మీకు తెలుసు. ఆత్మలు వారిని స్మృతి చేస్తారు మరియు వారు తీసుకువెళ్ళేందుకు వచ్చారు. నన్ను ఫాలో చేసినట్లయితే, మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని అంటారు. ఎలా ఫాలో చేయాలి అనేది కూడా అర్థం చేయిస్తారు. నేను పావనుడిని, మీరు పతితులు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది, తప్పకుండా ఫాలో చేయాల్సి ఉంటుంది. వికారులైతే ఫాలో చేయలేరు. ఫాలో చేసేందుకు నా సమానంగా పవిత్రంగా అవ్వండి. నేను పతితులను నాతో పాటు శాంతిధామానికి తీసుకువెళ్తానా. ముక్తిని పొందేందుకు మనుష్యులందరూ భక్తి, తపము, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖముంది. మేము మా ఇంటికి తిరిగి వెళ్ళాలి – అని కోరుకుంటారు. తండ్రి అంటారు – పవిత్రంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. నేను పావనుడిని కావుననే మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను రావడం కూడా బ్రహ్మా తనువులోకి వస్తాను. నేను రచయితను, నేను ఈ బ్రహ్మా తనువులోకి వస్తాను. తండ్రి బ్రహ్మా ద్వారా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని చూపిస్తారు కూడా. మీరు బి.కె.లు. శివబాబాను ఫాలో చేయాలని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే, పావన ప్రపంచానికి తీసుకువెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంకే ఉపాయము లేదు. పతితపావనా….. అని అంటారు, అప్పుడు దృష్టి పైకి వెళ్తుంది లేదా నీటి వైపుకు చూస్తారు. గంగ అయితే పతితపావని కాదు. ఇవి సాగరం నుండి వెలువడిన నదులు. ఇప్పుడు మీ తోకను పట్టుకోవాలి.
తండ్రి అంటారు – మీరు పావనంగా అవ్వాలి, నన్ను ఫాలో చేయాలి, అప్పుడే నాతో పాటు రాగలరు. తండ్రి అంటారు – మీరు నాతో పాటే ఉండేవారు, ఇప్పుడు 84 జన్మల చక్రం తిరిగి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే, పావనంగా అవుతారు. సన్యాసులు కూడా గృహస్థులతో అంటారు – మమ్మల్ని ఫాలో చేయాలంటే ఇళ్ళు-వాకిళ్ళను వదలండి. తండ్రి అంటారు – నేను పరంధామంలో ఉంటాను, మరి మీరు కూడా వస్తారా లేక ఇక్కడే విషయ సాగరంలో ఉండడం మంచిగా అనిపిస్తుందా. ఓ పతితపావనా, రండి అని మీరు పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, తమతో పాటు తీసుకువెళ్తారు. కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. తర్వాత సత్యయుగంలో మీరు చాలా సుఖమయంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. వీరికి ఇంతటి సుఖాన్నిచ్చినవారు ఎవరు? హెవెన్లీ గాడ్ ఫాదర్. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు – మీరు నా జయంతిని జరుపుకుంటారు. పరమపిత పరమాత్ముని జయంతిని భారతవాసులందరూ జరుపుకుంటారు. ఇది నా జన్మ స్థలము. క్రిస్టియన్లు నమ్మరు. వారు క్రీస్తును నమ్ముతారు. శివజయంతిని భారతవాసులే జరుపుకుంటారు. ఇది సర్వుల పతితపావనుడైన తండ్రి జన్మ స్థలము. తండ్రి అందరికీ సుఖాన్నిచ్చేవారు. సర్వులకు ముక్తినిచ్చేవారు. కనుక భారత్ ఎంత ఉన్నతమైనది.
డ్రామానుసారంగా తమ పిల్లలు చాలా దుఃఖితులైనప్పుడు, వారు వారసత్వాన్నిచ్చేందుకు వస్తారని తండ్రికి తెలుసు. తండ్రి జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు….. పిల్లలకు వారసత్వాన్నిస్తున్నారు. నన్ను ఫాలో చేయండి అని అంటారు. ఆత్మలైన మనము వికారులమని మీకు తెలుసు, అందుకే శరీరం కూడా వికారీదే ఉంటుంది. సత్యయుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. పిల్లలూ, పావనంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటారు. స్మృతితోనే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు, ఆత్మలైన మేము పరస్పరంలో సోదరులము అనేది పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. తండ్రి ఎలాగైతే ప్రియాతి ప్రియమైనవారో, అలా ప్రియమైనవారిగా అవ్వాలి.
2. తండ్రి సమానంగా పావనంగా అయి, తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రితో పాటు ఇల్లు అయిన శాంతిధామానికి తిరిగి వెళ్ళేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి.
వరదానము:-
ఎలాంటి విషయం మీ ముందుకు వచ్చినా సరే, కేవలం తండ్రిపైన వదిలేయండి. హృదయపూర్వకంగా ‘బాబా’ అని అనండి. అప్పుడిక విషయం సమాప్తమైపోతుంది. ‘బాబా’ అనే ఈ పదాన్ని హృదయపూర్వకంగా అనడమే ఇంద్రజాలము. మాయ మొట్టమొదట తండ్రినే మరపింపజేస్తుంది. అందుకే, కేవలం ఈ విషయం పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే, స్వయాన్ని కమలపుష్ప సమానంగా అనుభవం చేస్తారు. స్మృతి యొక్క ఆధారంతో, మాయ యొక్క సమస్యలు అనే చెత్త నుండి సదా అతీతంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడిలోకి రారు, సదా ఒకటే మూడ్ ఉంటుంది – చియర్ ఫుల్ (హర్షతము).
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!