13 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
12 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - శివబాబాకు, పిల్లలు పెద్దవారైతే నా సేవ చేస్తారు అనే ఆశ కూడా లేదు, వారెప్పుడూ వృద్ధునిగా అవ్వరు. తండ్రి నిష్కామ సేవాధారి”
ప్రశ్న: -
భోళానాథ్ శివబాబా పిల్లలైన మనందరికి చాలా పెద్ద కస్టమర్ – ఎలా?
జవాబు:-
బాబా అంటారు – నేను ఎంతటి అమాయకపు కస్టమర్ ను అంటే, మీ వద్దనున్న పాత వస్తువులన్నింటినీ కొంటాను మరియు వాటికి రిటర్నులో అన్నీ కొత్త-కొత్త వస్తువులను ఇస్తాను. బాబా, ఈ తనువు, మనస్సు, ధనం అన్నీ మీవే అని మీరంటారు. కనుక వాటికి రిటర్నులో మీకు సుందరమైన తనువు లభిస్తుంది, అపారమైన ధనం లభిస్తుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)
ఓంశాంతి. భక్తి మార్గంలో ఈ పాటను పాడుతారు. పాటలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి, వాటి అర్థాన్ని కూడా తండ్రి తెలియజేస్తారు. భోళానాథుడని అని ఎవరిని అంటారు అనేది పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. దేవతలను భోళానాథ్ అని అనరు. సుదాముడు రెండు పిడికెళ్ళ అన్నాన్ని ఇస్తే మహళ్ళు లభించాయని గాయనం ఉంది. అది కూడా ఎంత కాలం కోసము? 21 జన్మల కోసము. తండ్రి వచ్చి భారతవాసులకు తప్పకుండా వజ్ర-వైఢూర్యాల మహళ్ళను ఇస్తారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. దేనికి రిటర్నులో ఇస్తారు? బాబా, ఈ తనువు-మనస్సు-ధనం అన్నీ మీవే, ఇవన్నీ మీరిచ్చినవే అని పిల్లలంటారు. ఎవరికైనా కొడుకు పుడితే భగవంతుడు ఇచ్చారని అంటారు. ధనం గురించి కూడా భగవంతుడు ఇచ్చారని అంటారు. అలా అంటుంది ఎవరు? ఆత్మ. భగవంతుడు ఇచ్చారు అనగా తండ్రి ఇచ్చారు. ఇప్పుడు మీరు అంతా ఇవ్వాల్సి ఉంటుందని తండ్రి అంటారు. దానికి రిటర్నులో నేను మీకు చాలా సుందరమైన తనువును ట్రాన్స్ఫర్ చేస్తాను, అపారమైన ధనాన్ని ఇస్తాను. కానీ ఎవరికిస్తారు ? తప్పకుండా పిల్లలకే ఇస్తారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలానికి ధనం లభించింది. అనంతమైన తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. జ్ఞానానికి మరియు భక్తికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తిలో అల్పకాలానికి లభిస్తుంది. ధనముంటే సుఖముంటుంది. ధనం లేకపోతే మనుష్యులు ఎంత దుఃఖితులవుతారు! బాబా మాకు అపారమైన ధనాన్నిస్తున్నారని పిల్లలకు తెలుసు, అందుకే సంతోషం కలుగుతుంది. సుఖధామంలోనైతే సుఖానికి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఒక్కరికీ తమ-తమ రాజధాని ఉంటుంది. దానిని పవిత్ర గృహస్థాశ్రమమని అంటారు. కావున తండ్రి ఎంతటి అమాయకుడు, ఏమి తీసుకుంటారు మరియు ఏమి ఇస్తారు! తండ్రి ఎంత మంచి కస్టమర్! ఎలాగూ తండ్రి అనేవారు పిల్లలకు కస్టమర్ గా ఉంటారు. కొడుకు పుట్టగానే మొత్తం ఆస్తి అంతా ఇక అతనిదే. వారు హద్దు కస్టమర్లు, వీరు అనంతమైన భోళానాథుడు, అనంతమైన పిల్లలకు కస్టమర్. తండ్రి అంటారు – నేను పరంధామం నుండి వచ్చాను, మీ నుండి పాతదంతా తీసుకొని కొత్త ప్రపంచంలో మీకు అన్నీ ఇస్తాను. అందుకే వారిని దాత అని అంటారు. వీరి వంటి దాత ఇంకెవ్వరూ లేరు. నిష్కామ సేవ చేస్తారు. తండ్రి అంటారు – నేను నిష్కాముడిని, నాకు ఎటువంటి ఆశ లేదు. వృద్ధుడైన తండ్రిని సంభాళించడం పిల్లల పని, ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను కదా అని నేను అనను. తండ్రి వృద్ధుడైతే అతడిని పిల్లలు సంభాళించాలి – అనే నియమం ఉంటుంది. ఈ తండ్రి అయితే ఎప్పుడూ వృద్ధునిగా అవ్వరు. సదా యువకునిగానే ఉంటారు. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. లౌకిక తండ్రి – నేను వృద్ధుడినైతే నా పిల్లలు నాకు సేవ చేస్తారు అని పిల్లల పట్ల ఆశ పెట్టుకుంటారని మీకు తెలుసు. పిల్లలకు అంతా ఇచ్చేసినా కూడా, తండ్రికి సేవ అయితే జరుగుతుంది. నేను అభోక్తనని శివబాబా అంటారు. నేను ఎప్పుడూ తినను. నేను కేవలం పిల్లలకు నాలెడ్జ్ ఇవ్వడానికి వస్తాను. పరమాత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే వింటుంది, ప్రతీది ఆత్మయే చేస్తుంది. సంస్కారాలను కూడా ఆత్మయే తీసుకువెళ్తుంది, వాటి ఆధారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ మనుష్యులకు అనేక మతాలున్నాయి. కొందరు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మకు ఏమీ అంటదు, ఆత్మ నిర్లేపి అని అంటారు. ఒకవేళ ఆత్మ నిర్లేపి అయితే పాపాత్మ, పుణ్యాత్మ అని ఎందుకంటారు. ఒకవేళ ఆత్మ నిర్లేపి అయితే పాప శరీరం, పుణ్య శరీరం అని అనాలి. ఆత్మలందరి ఆత్మిక తండ్రి ఆత్మలైన మనల్ని ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మను పిలుస్తారు కూడా కదా. మా తండ్రి ఆత్మ వచ్చింది, రుచి చూసింది అని అంటారు. ఆత్మయే రుచి చూస్తుంది. బాబా అయితే అలా అనరు. వారు అభోక్త. బ్రాహ్మణులకు తినిపిస్తారు, ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ఎక్కడో విరాజమానమై ఉండవచ్చు. బ్రాహ్మణులు మొదలైనవారికి తినిపించడం భారత్ లో కామన్ విషయము. ఆత్మను పిలుస్తారు, వారిని అడుగుతారు, వారు చెప్పే చాలా విషయాలు నిజమవుతాయి కూడా. ఈ శ్రాద్ధం మొదలైనవి తినిపించడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఏమీ ఆశ్చర్యపడకూడదు. తండ్రి డ్రామా రహస్యాలను సారంలో తెలియజేస్తారు. డ్రామా గురించి అంత విస్తారంగా వివరించలేరు. ఒకొక్కరి గురించి వివరించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. పిల్లలైన మీకు చలా సహజమైన శిక్షణ లభిస్తుంది. ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పాడుతారు కూడా. వారి పేరే పతితపావనుడు. బ్రహ్మా, విష్ణు, శంకరులను పతితపావనులని అనలేము. తండ్రినే పతితపావనుడు, ముక్తిదాత అని అంటారు. దుఃఖహర్త-సుఖకర్త అని కూడా వారినే అంటారు. వారు నిరాకారుడు. శివుని మందిరాలకు వెళ్ళి చూస్తే, అక్కడ శివ లింగాన్ని పెడతారు. తప్పకుండా చైతన్యములో ఉండేవారు కావుననే పూజ చేస్తారు. ఈ దేవతలు కూడా ఎప్పుడో చైతన్యములో ఉండేవారు, కనుకనే వారికి మహిమ ఉంది. నెహ్రూ చైతన్యములో ఉండేవారు, అందుకే వారి ఫోటో పెట్టుకుని మహిమ చేస్తారు. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే, వారి జడ చిత్రాలను తయారుచేసి మహిమ చేస్తారు. పవిత్రులను మాత్రమే పూజిస్తారు. మనుష్యులెవ్వరినీ పూజించలేము. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కదా, అందుకే వారికి పూజ జరగదు. సదా పవిత్రంగా ఉండే దేవతలకే పూజ జరుగుతుంది. తండ్రి వచ్చేసారని మీకు తెలుసు, స్వర్గ స్థాపన చేసేందుకు ఇప్పుడు మళ్ళీ సంగమంలో వచ్చారు. తర్వాత ద్వాపరం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభమవ్వడంతో వెంటనే శివుని మందిరాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు వారు చైతన్యంలో నాలెడ్జ్ వినిపిస్తున్నారు. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారి మహిమనే పాడుతారు. నిరాకారునికి శరీరమైతే కావాలి కదా. కనుక తండ్రియే వచ్చి విశ్వాన్ని హెవెన్ గా తయారుచేస్తారు. ఆ హెవెన్ లో రాజ్యం చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. కానీ వారెలా వినిపించాలి? తండ్రి అంటారు – నేను ఈ శరీరంలోకి వచ్చాను, డ్రామాలో నాకు ఈ పాత్ర ఉంది, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. మొదటి నంబరుకు చెందినవారి అనేక జన్మల అంతిమంలో వచ్చి, నేను ప్రవేశిస్తాను మరియు వీరికి బ్రహ్మా అని పేరు పెడతాను. ముందు వీరంతా భట్టీలో ఉండేవారు, అప్పుడు చాలా మందికి పేర్లు పెట్టారు. కానీ చాలామంది తర్వాత వదిలిపెట్టేసారు, కావున పేరు పెట్టడం వలన లాభమేముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు. ఒకేసారి ఎన్ని రమణీకమైన పేర్లు వచ్చాయి. సందేశీ పేర్లు తీసుకొని వచ్చేవారు. ఆ లిస్టు కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యాసం తీసుకున్నప్పుడు, వారి పేర్లు కూడా మారిపోతాయి. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. మీరు వదలరు. మీరు వచ్చి బ్రహ్మాకు చెందినవారిగా అవుతారు. మీరు ఎలాగూ శివునికి చెందినవారే. మీరు బాప్ దాదా అని అంటారు. సన్యాసులది అలా ఉండదు. పేరు మారుతుంది కానీ బాప్ దాదా లభించరు. వారికి కేవలం గురువు లభిస్తారు. హద్దు సన్యాసులైన హఠయోగులకు, అనంతమైన సన్యాసులైన రాజయోగులకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని గాయనం చేయడం కూడా జరుగుతుంది. సన్యాసులకు కూడా వైరాగ్యముంది కానీ వారికి ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యము. మీకు మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యముంది. సృష్టి మారుతుందని వారికి అసలు తెలియదు. మీది అనంతమైన వైరాగ్యము. ఈ సృష్టి సమాప్తమవ్వనున్నది. మీ కోసం కొత్త ప్రపంచం తయారవుతుంది. అక్కడకు వెళ్ళాలి కానీ పావనంగా అవ్వకుండా అక్కడకు వెళ్ళలేరు. తప్పకుండా కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యముండేదని మనసుకు అనిపిస్తుంది, దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయడంతో మీరు పుణ్యాత్ములుగా అవుతారని మీకు తెలుసు. ఇది చాలా సహజము కానీ స్మృతిని మర్చిపోతారు. భక్తి మార్గంలోని ఆచారాలు, పద్ధతులు పూర్తిగా వేరు. తిరిగి తమ ఇంటికి ఎవరూ వెళ్ళలేరు. అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాలి. ఇంటికి వెళ్ళే సమయం అందరికీ ఒక్కటే. ఫలానావారు మోక్షం పొందారని అనడము వ్యర్థ ప్రలాపము. తండ్రి అంటారు – ఏ ఆత్మ కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేదు. లేదంటే మొత్తం ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరు సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. మోక్షం కోసం చాలామంది వస్తారు. మోక్షమనేది లభించదని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఇది అనాదిగా తయారై-తయారవుతున్న డ్రామా. ఇది ఎప్పటికీ మారదు. ఈగ ఇక్కడి నుండి వెళ్ళిందంటే, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇలాగే వెళ్తుంది. బాబా ఎంతటి అమాయకులో మీకు తెలుసు. పతితపావనుడైన తండ్రి పాత్రను అభినయించేందుకు తమ పరంధామం నుండి వస్తారు. ఈ డ్రామా ఎలా తయారుచేయబడింది, ఇందులో ముఖ్యమైనవారు ఎవరెవరు అనేది వారే అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో అందరికన్నా షావుకార్లు ఎవరు అని అడుగుతారు కదా. దీని కోసం నంబరువారుగా పేర్లు తీస్తారు. అందరికన్నా షావుకార్లు ఎవరు అనేది మీకు తెలుసు. వారు అమెరికా అని అంటారు. కానీ స్వర్గంలోని ఈ లక్ష్మీనారాయణులే అందరికన్నా షావుకార్లుగా అవుతారని మీకు తెలుసు. భవిష్యత్తు కోసం, అందరికన్నా గొప్ప షావుకారుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తారు. ఇది ఒక రేస్. ఈ లక్ష్మీనారాయణుల వంటి షావుకార్లు ఇంకెవరైనా ఉంటారా! అల్లా అవల్దీన్ కథను కూడా తయారుచేస్తారు. దీపాన్ని రుద్దగానే కుబేర ఖజానా వెలువడింది. రకరకాల నాటకాలను చాలా తయారుచేస్తారు. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు అపారమైన ఖజానా లభిస్తుంది. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే, మాయ ఒక్కసారిగా పారిపోతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఇక మాయ విసిగిస్తుంది. బాబా, మాకు మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు. అచ్ఛా, తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసినట్లయితే, తుఫాన్లు మాయమైపోతాయి. ఇకపోతే నాటకాలు మొదలైనవి కూర్చుని తయారుచేసారు. అటువంటి విషయాలేవీ ఉండవు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు – కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే, మీలో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుంది, ఇంకే కష్టము ఇవ్వరు. పవిత్రంగా, సత్యమైన బంగారంగా ఉండే ఆత్మ, ఇప్పుడు అసత్యంగా అయిపోయింది, మళ్ళీ ఈ స్మృతి అనే అగ్నితోనే సత్యంగా అవుతుంది. అగ్నిలో వేయకుండా బంగారం పవిత్రంగా కాలేదు, దీనిని కూడా యోగాగ్ని అని అంటారు. అయితే ఇది స్మృతి యొక్క విషయము. వారు అనేక రకాల హఠయోగాలను నేర్పిస్తారు. మీరు లేస్తూ కూర్చుంటూ స్మృతి చేయండి అని తండ్రి అంటారు. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకని చేస్తారు. ఇక్కడ నడుస్తూ-తిరుగుతూ, పనులు చేసుకుంటూ స్మృతిలో ఉండాలి. అనారోగ్యం ఉన్నా కానీ, ఇక్కడ పడుకుని కూడా తండ్రిని స్మృతి చేయవచ్చు. శివబాబాను స్మృతి చేయండి మరియు చక్రాన్ని తిప్పండి, అంతే. దీని గురించే వారు గంగా తీరంలో ఉండాలి, అమృతం నోటిలో ఉండాలి అని రాసారు. గంగా తీరంలో గంగా జలమే లభిస్తుంది, అందుకే మనుష్యులు హరిద్వార్ కు వెళ్ళి కూర్చుంటారు. తండ్రి అంటారు – మీరు ఎక్కడైనా కూర్చోండి, అనారోగ్యంగా ఉన్నా కేవలం తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణం తనువు నుండి వెళ్ళిపోవాలి. ఈ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఆ భక్తి మార్గపు విషయాలకు మరియు ఈ జ్ఞాన మార్గపు విషయాలకు, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి స్మృతితో మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో, వారు స్వర్గంలోకి వెళ్తారని యుద్ధం చేసేవారికి చెప్తారు. వాస్తవానికి ఇదే యుద్ధము. వారేమో కౌరవులు, పాండవుల సైన్యాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏమయ్యింది? ఫలితం ఏమీ లేదు. పూర్తిగా ఘోరమైన అంధకారం ఉంది. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే అజ్ఞానాంధకారం అని అంటారు. తండ్రి మళ్ళీ వెలుగును ఇచ్చేందుకు వచ్చారు. వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీకు కూడా జ్ఞానమంతా లభించింది. అది మూలవతనము, ఆత్మలైన మీరు అక్కడ నివసిస్తారు, దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. ఇక్కడ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు, తండ్రితో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ చేస్తారు, ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణం చేస్తారు. మీరు విశేషంగా భారత్ కు మరియు ప్రపంచమంతటికీ తండ్రితో పాటు ఆత్మిక సేవ చేస్తారు. అందుకే తండ్రితో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయా తుఫాన్లను పారద్రోలేందుకు, తండ్రిని చాలా-చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మను యోగాగ్నితో సత్యాతి-సత్యమైన బంగారంలా తయారుచేసుకోవాలి.
2. అనంతమైన వైరాగులుగా అయి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచం మారుతుంది, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కనుక దీని నుండి సన్యాసాన్ని తీసుకోవాలి.
వరదానము:-
జ్ఞానం యొక్క పాయింట్లు ఏవైతే డైరీలలో లేక బుద్ధిలో ఉంటాయో, వాటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి మరియు వాటిని అనుభవంలోకి తీసుకురండి. అప్పుడు ఏ రకమైన సమస్యనైనా సహజంగానే సమాధానపరచగలరు. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్యలనే రాళ్ళను పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ‘డ్రామా’ అనే పదం యొక్క స్మృతితో హైజంప్ చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు ఈ పాత సంస్కారాలు మీకు దాసులుగా అయిపోతాయి. కానీ ముందు చక్రవర్తిగా అవ్వండి, సింహాసనాధికారిగా అవ్వండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!