25 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
25 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu
24 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ సమయంలో మీరు తండ్రిపై బలిహారమైనట్లయితే 21 జన్మలు మీరు సదా సుఖమయంగా అవుతారు”
ప్రశ్న: -
జ్ఞానీ పిల్లలు తమ అవస్థను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి?
జవాబు:-
ఉదయాన్నే లేచే అలవాటును పక్కా చేసుకోవాలి. ఉదయాన్నే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి – ఇది చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకుంటారో మరియు త్వరగా లేస్తారో, వారి అవస్థ రోజంతా బాగుంటుంది. అజ్ఞానుల నిద్రతో పోలిస్తే జ్ఞానీ పిల్లల నిద్ర సగమే ఉండాలి. 10 గంటలకు నిద్రపోండి, 2 గంటలకు లేచి కూర్చోండి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నాకు ఆధారాన్నిచ్చేవారు….. (ముఝ్ కో సహారా దేనే వాలా…..)
ఓంశాంతి. పిల్లలందరూ సమ్ముఖంగా కూర్చున్నారు, మేము జీవాత్మలమని పిల్లలకు తెలుసు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఆత్మకు శరీరం లేనప్పుడు వివస్త్రగా ఉంటుంది, అప్పుడు అశరీరి అని అంటారు. మీరైతే శరీరంతో పాటు కూర్చున్నారు. ఆత్మ మరియు పరమాత్మ శరీరంలోకి రానంతవరకు మాట్లాడలేరు. ఇప్పుడు తండ్రి సమ్ముఖంగా కూర్చున్నామని జీవాత్మలైన మీకు తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం వలె యథావిధిగా సమ్ముఖంగా వచ్చారు. పిల్లలు తప్పకుండా తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. మేము మా అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ సమ్ముఖంగా కూర్చున్నామని మీకు తెలుసు. ఎందుకు కూర్చున్నారు? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు. స్కూల్లో, మేము టీచర్ ద్వారా ఇంజనీరింగ్, బ్యారిస్టరీ నేర్చుకుంటున్నామని భావిస్తారు. ఈ లక్ష్యం-ఉద్దేశ్యం ఉంటుంది. పరమపిత పరమాత్మ బ్రహ్మా తనువులో కూర్చొని మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. భగవానువాచ – భగవంతుడు అని నిరాకారుడిని అంటారని పిల్లలకు అర్థం చేయించారు. జీవాత్మలు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటాయి. మనుష్యులు పునర్జన్మలు తీసుకుంటారా అని మీరు ఏ సన్యాసినైనా మీరు అడగండి. తీసుకోరు అని చెప్పరు. లేదంటే 84 లక్షల జన్మలని ఎలా అంటారు? మీరు పునర్జన్మలను నమ్ముతారా అని అడగండి. ఇది నిశ్చితము, ఆత్మ సంస్కారాలనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. కొంతమంది మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మల మాటే లేదు. మొదటి జన్మ తప్పకుండా చాలా మంచిగా, సతోప్రధానంగా ఉంటుంది. లాస్ట్ జన్మ ఛీ-ఛీగా తమోప్రధానంగా ఉంటుంది. 16 కళల నుండి 14 కళలుగా, తర్వాత 12 కళలుగా అవుతూ ఉంటాయి, పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. అచ్ఛా, పరమపిత పరమాత్మ పునర్జన్మలు తీసుకుంటారా లేక పునర్జన్మ రహితుడా అని అడగాలి. చూడండి, ఈ పాయింటు చాలా సూక్ష్మమైనది. ఒకవేళ జనన-మరణ రహితుడు అని అంటే, ఇక శివుని జయంతి ఋజువు కాదు. శివ జయంతిని జరుపుకుంటారని అంటారు. అయితే, శివ జయంతి ఉంటుంది కానీ జన్మతో పాటు మరణం ఉంటుందని అంటారు కదా, అలా జరగదని అర్థం చేయించడం జరుగుతుంది. ఒకవేళ మరణించినట్లయితే, మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. వారు ఒక్కసారి మాత్రమే ఈ తనువులోకి వస్తారు, అంతే, మళ్ళీ పునర్జన్మల్లోకి రారు. పరమపిత పరమాత్మ పునర్జన్మ రహితుడు. వారెప్పుడూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవ్వరు. ఆత్మలన్నీ జనన-మరణాలలోకి వస్తూ-వస్తూ పతితంగా అయిపోతాయి, అప్పుడు పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మయే పతితంగా అవుతుందని దీనితో ఋజువవుతుంది. ఇంటి నుండి ఆత్మ పావనంగా వస్తుంది, తర్వాత మాయ పతితంగా చేసేస్తుంది. తండ్రి ఎప్పుడూ పతితంగా చేయరు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు అశుద్ధమైన మతాన్ని ఇవ్వలేరు. ఈ సమయంలోని మనుష్యులు పతిత మతాన్నే ఇస్తారు. ఇప్పుడు పావనుడైన తండ్రి, పతితంగా అవ్వకండి అనగా వికారాలలో వెళ్ళకండి అని చెప్తారు. రావణుని మతంతో దుఃఖధామంగా తయారయ్యింది. ముందు సుఖధామంగా ఉండేది. తండ్రియే సుఖం-దుఃఖం ఇస్తారని కాదు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖమునిచ్చే మతాన్ని ఇవ్వలేరు. మాయే దుఃఖాన్నిస్తుంది. ఆ మాయపై విజయాన్ని పొందడంతో మీరు జగత్ జీతులుగా అవుతారు. మనుష్యులకు మాయ అంటే అర్థం తెలియదు. వారు ధనాన్ని మాయ అని అంటారు. వీరికి మాయ నషా చాలా ఉందని అంటారు కదా. కానీ మాయ నషా అంటూ ఉండదు. అక్కడ స్వర్గంలో రావణుని దిష్టిబొమ్మను తయారుచేసి కాల్చరు. శత్రువుల దిష్టి బొమ్మను తయారుచేయడం జరుగుతుంది. అర్ధ కల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేహ అహంకారం రావడంతో మిగతా వికారాలు వచ్చేస్తాయి. దేవతలు వామ మార్గంలోకి అనగా వికారాలలోకి వెళ్తారని శాస్త్రాలలో రాసి ఉంది. మాయకు వశమవ్వడంతో పరవశమైపోతారు, పరమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరిస్తున్నారు. పరమతం అనగా మాయ యొక్క మతము. శ్రీ అనగా తండ్రి యొక్క శ్రేష్ఠ మతము. ఇప్పుడున్నది రావణుని మతము, పరమతము. అందుకే, ఆసురీ సంప్రదాయం వారిగా అయి అందరూ రావణుని సంకెళ్ళలో బంధించబడి దుఃఖితులుగా ఉన్నారని తండ్రి అన్నారు.
మనుష్యులు సత్యయుగం ఆయువును లక్షల సంవత్సరాలని భావించారు. 5 వేల సంవత్సరాలు ఆయువు ఎలా అనే లెక్కను మీరు తెలియజేస్తారు. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలయ్యింది, బుద్ధుడు వచ్చి 2250 సంవత్సరాలయ్యింది, తర్వాత ఇస్లాములు వచ్చి 2500 సంవత్సరాలయ్యింది. అందరిదీ కలిపి అర్ధ కల్పం అయ్యింది. దానికి ముందు దేవతల రాజ్యముండేది, మరి దేవతలు వచ్చి లక్షల సంవత్సరాలు అయ్యిందని ఎలా అనగలరు. ఇంతమంది మనుష్యులు ఉన్నారు, ఒకవేళ లక్షల సంవత్సరాలైతే ఇప్పటికి చాలామంది మనుష్యులు అయిపోతారు. కానీ అంతమంది లేరు. 5 వేల సంవత్సరాలలోనే కోట్లాది మంది మనుష్యులైపోతారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం, భారత్ లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేదని అంటారు కూడా. 5 వేల సంవత్సరాలు పూర్తి అయిపోతాయి, నాటకం పూర్తి అయిపోతుంది కదా. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. నేను ఎవరు, ఎలా ఉంటాను, ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఎవరూ తెలుసుకోలేరు. ఇది గీతా అధ్యాయమని తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. ఇది చాలా సహజమైన విషయమని బాబా వృద్ధ మాతలకు కూడా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. కొడుకు జన్మించాడంటే, వారసుడు జన్మించినట్లు. మేము బాబా వారసులమని మీరు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇది చాలా గుప్తమైన విషయము. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని బాబా అడుగుతారు. అవును బాబా, అని అంటారు. మేము 5 వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిసామని, మీరు ఈ తనువు ద్వారా శిక్షణ ఇవ్వడానికి వచ్చారని ఆత్మ ఈ నోటి ద్వారా అంటుంది. ఎవరైతే పక్కా పిల్లలుంటారో, వారు మేము బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి కూర్చున్నామని అర్థం చేసుకుంటారు. మనం బ్రహ్మా ద్వారా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము. తండ్రి అంటారు – నన్ను గుర్తించారా, నేను మీ తండ్రిని. మీరంటారు – అవును బాబా, ఆత్మలైన మాకు మీరు పరమపిత పరమాత్మ తండ్రి. తండ్రి కూడా అంటారు – నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, వారసత్వాన్నిచ్చాను, దానిని మాయ లాక్కుంది, మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను. మాయ వారసత్వాన్ని లాక్కుంటుంది, తండ్రి ఇప్పిస్తారు. ఈ ఆట అనేక సార్లు జరిగింది, జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతం ఉండదు. తండ్రికి చెందినవారిగా అవుతారు, కొంతమంది సొంత పిల్లలుగా, కొంతమంది సవతి పిల్లలుగా అవుతారు. కొందరు పక్కాగా, కొందరు కచ్చాగా ఉంటారు కదా. అప్పుడప్పుడు పక్కాగా ఉన్నవారిపై కూడా మాయ ఒక్కసారిగా గెలుస్తుంది. పిల్లలంటారు – బాబా, మేము జీవించి ఉన్నంతవరకు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటాము. తలపై వికర్మల భారం చాలా ఉంది. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా ఆ యోగాగ్ని ద్వారా మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతూ ఉంటారు. అగ్ని, వస్తువులను పవిత్రంగా చేస్తుంది. మీది యోగాగ్ని. ఇది అనంతమైన యజ్ఞము. అనంతమైన సేఠ్ అనంతమైన యజ్ఞాన్ని రచించారు. ఏ యజ్ఞము ఇన్ని సంవత్సరాలు నడవదు. 7-8 రోజులు లేక ఒక నెల కోసం యజ్ఞాన్ని రచిస్తారు. మీ ఈ యజ్ఞం ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. తండ్రి అయితే వినిపిస్తూనే ఉంటారు. వారంటారు – మర్చిపోకూడదు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మల వికర్మల భారం తొలగిపోతూ ఉంటుంది. భగవానువాచ – తండ్రినైన నన్ను స్మృతి చేయండి. వారు తప్పకుండా వచ్చి ఉన్నారు, కావుననే చెప్తారు కదా.
తండ్రి అంటారు – ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. ఈ సమయంలో మీ ఆత్మ చాలా పతితంగా ఉంది. యోగంతో మనం పావనంగా అవుతూ ఉంటామని మీకిప్పుడు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇతర సాంగత్యాలను తెంచి మీతో సాంగత్యాన్ని జోడిస్తామని, మీపై బలిహారమవుతామని మీరు ప్రతిజ్ఞ చేసారు. స్త్రీ పురుషునిపై మరియు పురుషుడు స్త్రీపై బలిహారమవుతారు. ఇక్కడ తండ్రిపై బలిహారమవ్వడం ఉంటుంది. వివాహంలో ఒకరిపై ఒకరు బలిహారమవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు – మీరు మనుష్యులపై బలిహారమవ్వకూడదు. నాపై బలిహారమవుతారని మీరు ప్రతిజ్ఞ చేసారు. మీరు నాపై బలిహారమైనట్లయితే, 21 జన్మలు మిమ్మల్ని సదా సుఖమయంగా చేస్తాను. ఇది ఎంత భారీ వారసత్వము. మీరు శ్రీమతం ద్వారా శ్రేష్ఠంగా అవుతారు, ఇది మర్చిపోకండి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా ఇంట్లో పెట్టుకోండి. మనం తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి పరంధామం నుండి వచ్చి ఉన్నారు. కానీ మాయ అనే డేగ కూడా తక్కువైనది కాదు. ఇది అందరి విషయం కాదు, నంబరువారుగా ఉన్నారు. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నషా ఎక్కుతుంది. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మర్చిపోతారు, మళ్ళీ ఉదయాన్నే రిఫ్రెష్ అవుతారు, తర్వాత రోజంతా మర్చిపోతారు. చూడండి, 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసినవారు కూడా ఈ రోజు లేరు. ఎక్కడో ఆజ్ఞ ఉల్లంఘన చేసారు కనుక మాయ గట్టిగా చెంపదెబ్బ వేసింది, ఇక వెళ్ళిపోయారు. బాబా అంటారు – పైకి ఎక్కితే ప్రేమ రసాన్ని అనుభవం చేస్తారు, పడిపోతే చూర్ణమైపోతారు. ఎలా చూర్ణమైపోతారు అనేది చూస్తారు. వైకుంఠంలోకైతే తప్పకుండా వెళ్తారు. కానీ పదవులైతే నంబరువారుగా ఉంటాయి కదా. అక్కడ అందరూ సుఖమయంగానే ఉంటారు కానీ పదవులైతే ఉంటాయి కదా. స్కూల్ లో పదవిని పొందేందుకే పురుషార్థం చేస్తారు. ప్రజలుగా అయినా ఫర్వాలేదులే, భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది అని అనుకోకూడదు. దానిని తమోప్రధాన పురుషార్థమని అంటారు. ఎవరైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే ప్రతిజ్ఞ చేస్తారో, వారిది సతోప్రధాన పురుషార్థమని అని అంటారు. ఇది గుర్రపు పందెం వంటిది. అందరూ నంబరువన్ లోకి వెళ్ళలేరు. ఇది హ్యూమన్ (మనుష్యుల) రేస్. మేము త్వరగా శివబాబాకు కంఠహారంలో కూర్చబడాలని మీరు కోరుకుంటారు కనుక వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది. మాయ ఎటువంటి విఘ్నాలను కలిగిస్తుందంటే, ఇక పూర్తిగా రేస్ నుండి తొలగించేస్తుంది. మీది హ్యూమన్ (మనుష్యుల) రేస్. నేను చాలా దుఃఖితముగా ఉన్నానని, శరీరాలను తీసుకుంటూ-తీసుకుంటూ చాలా విసిగిపోయానని ఆత్మ అంటుంది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలని అంటుంది. బాబా యుక్తులనైతే తెలియజేసారు. బాబా, నేను మీ స్మృతిలోనే ఉంటానని అంటారు. ఎంతగా సమయం తీయగలిగితే అంత మంచిది. గవర్నమెంట్ సర్వీసుకు కూడా 8 గంటలు ఇస్తారు, అదే విధంగా స్మృతిలో కూడా 8 గంటలు ఉండండి. సృష్టిని స్వర్గంగా చేయడమనేది ఎంత భారీ సర్వీసు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అంతే, 8 గంటలు ఈ సర్వీసును చేసినట్లయితే మీరు పూర్తి వారసత్వాన్ని పొందుతారు. ఈ విధంగా స్మృతి చేస్తూ-చేస్తూ మీ వికర్మలు వినాశనమైపోతాయి. 8 గంటలు ఈ సర్వీసుకు ఇవ్వండి, మిగిలిన 16 గంటలు మీరు ఫ్రీ. ఎంత వీలైతే అంత, మీరు పదే-పదే స్మృతి చేయండి. స్మృతినైతే ఎక్కడ కూర్చొనైనా చేయవచ్చు. అన్నింటికన్నా మంచి సమయం మీకు ఉదయాన్నే లభిస్తుంది. సింధీలో ఒక సామెత కూడా ఉంది – త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి….. అటువంటి మనుష్యులే చాలా గుణవంతులు అని. ఈ గాయనం కూడా ఇప్పటిదే. తండ్రి అంటారు – రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ ఉదయాన్నే లేవండి. అజ్ఞానులు 8 గంటలు నిదురిస్తారు, మీ నిద్ర సగమే ఉండాలి. 4-5 గంటల నిద్ర సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా. రాత్రి 10 గంటలకు పడుకోండి, 2 గంటలకు లేవండి. శివబాబాను స్మృతి చేయడంతో మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యం, సంపద రెండూ లభిస్తాయి. అచ్ఛా, 2 గంటలకు కాకపోతే 3 గంటలకు లేవండి, 4 గంటలకు లేవండి. అది ఫస్ట్ క్లాస్ సమయం. ఆ సమయంలో శాంతి ఉంటుంది, అందరూ అశరీరులుగా అయిపోతారు. ఆ సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అమృతవేళ యొక్క స్మృతి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. బాబా చాలా వరకు రాత్రుళ్ళు మెలుకువగా ఉంటూ ఉంటారు. సూక్ష్మ సేవలో అలసట ఉండదు. సంపాదనతో సంతోషం కలుగుతుంది. పిల్లలైన మీరు ఉదయాన్నే లేచి మీ అవినాశీ సంపాదనను చేసుకుంటూ ఉండండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. 21 జన్మలకు సదా సుఖమయంగా అయ్యేందుకు ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. శ్రీమతం ద్వారా శ్రేష్ఠంగా అవ్వాలి. మన్మతాన్ని మరియు పరమతాన్ని త్యాగం చేయాలి. ఏ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.
2. ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గంగా చేసే సేవను తక్కువలో తక్కువ 8 గంటలు తప్పకుండా చేయాలి.
వరదానము:-
ఎవరైతే దేహాభిమానాన్ని అర్పణ చేస్తారో, వారి ప్రతి కర్మ దర్పణంగా అయిపోతుంది. ఎలాగైతే, ఏదైనా వస్తువును అర్పణ చేస్తే, ఆ అర్పణ చేయబడిన వస్తువును తమదిగా భావించడం జరగదు. కనుక దేహ భానాన్ని కూడా అర్పణ చేయడంతో, ఎప్పుడైతే నాది అనేది తొలగిపోతుందో, అప్పుడు మోహం కూడా తొలగిపోతుంది. వారినే సంపూర్ణ సమర్పణ అయినవారు అంటారు. ఇలా సమర్పణ అయ్యేవారు సదా యోగయుక్తులుగా మరియు బంధనముక్తులుగా ఉంటారు. వారి ప్రతి సంకల్పం, ప్రతి కర్మ యుక్తియుక్తంగా ఉంటుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!