23 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

23 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

22 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - స్మృతి ద్వారా ఆత్మలోని చెత్తను తొలగించుకుంటూ వెళ్ళండి, ఆత్మ పూర్తిగా పావనంగా అయినప్పుడే ఇంటికి వెళ్ళగలదు”

ప్రశ్న: -

ఈ అంతిమ జన్మలో తండ్రి యొక్క ఏ డైరెక్షన్ ను పాటించడంలోనే పిల్లల కళ్యాణముంది?

జవాబు:-

బాబా అంటారు – మధురమైన పిల్లలూ, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయట భ్రమించనివ్వకండి, విషాన్ని వదిలి అమృతాన్ని తాగండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల అలవాట్లను సమాప్తం చేసుకోవాలి. అందుకే, రాత్రింబవళ్ళు శ్రమించి, దేహీ-అభిమానులుగా అవ్వండి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. శాంతిధామం విశ్రామపురి. ఈ ప్రపంచంతో అందరూ అలసిపోయి ఉన్నారు. తమ సుఖధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఈ ప్రపంచం బాగా అనిపించదు. స్వర్గాన్ని చూస్తే నరకం పట్ల మనసు ఎలా కలుగుతుంది. బాబా, త్వరగా చేయండి, ఈ దుఃఖధామం నుండి తీసుకువెళ్ళండి అని అంటారు. ఇది ఛీ-ఛీ ప్రపంచమని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. దీని పేరే డెవిల్ వరల్డ్ (ఆసురీ ప్రపంచము), నరకము. ఇవేమైనా మంచి పేర్లా? దైవీ ప్రపంచమెక్కడ, ఆసురీ ప్రపంచమెక్కడ. ఈ ఆసురీ ప్రపంచముతో అందరూ విసుగు చెంది ఉన్నారు కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. తమోప్రధానత యొక్క మాలిన్యం చేరుకుంది. ఆత్మ నుండి ఆ మాలిన్యం తొలగిపోవాలి, దాని కోసం పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో, వారికి చివర్లో మంచి అవస్థ ఉంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇప్పుడిక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తండ్రి వచ్చి, తిరిగి తీసుకువెళ్ళనంతవరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ప్రపంచంలో దుఃఖముంది కదా. ఇళ్ళల్లో కూడా ఏదో ఒక దుఃఖం ఉంటుంది. బాబా ఇప్పుడు మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వచ్చారని పిల్లలైన మీ హృదయంలో ఉంది. ఎవరైతే మంచి నిశ్చయబుద్ధి కలవారు ఉంటారో, వారు తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోరు. తండ్రిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. వారిని పిల్లలు మాత్రమే గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తించినట్లయితే, ఇంతమంది మనుష్యులు వచ్చి ఎక్కడ కూర్చుంటారు, అలా జరగదు. అందుకే యుక్తి కూడా డ్రామాలో ఆ విధంగా రచించబడింది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తారో, వారే ఉన్నత పదవిని పొందగలరు. ఇది సరైనది. శిక్షలు అనుభవించినా సరే శాంతిధామానికి లేక పావన ప్రపంచంలోకి వెళ్తారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది కదా. రెండవ విషయమేమిటంటే, పావనంగా అవ్వకుండా ఎవరూ పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఫలానావారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, తిరిగి వెళ్ళిపోయారు….. అని ఏదైతే అంటారో అది జరగదు. ఎవరైతే మొట్టమొదట సృష్టి పైకి వచ్చారో, అనగా లక్ష్మీనారాయణులు, వారు కూడా తిరిగి వెళ్ళలేరు అన్నప్పుడు ఇతరులు ఎలా వెళ్ళగలరు. వీరికి కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వెళ్ళేందుకు తపస్య చేస్తున్నారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్, దుఃఖహర్త-సుఖకర్త. కృష్ణుడు మొదలైనవారెవరినీ అలా పిలవరు. క్రిస్టియన్లు అయినా, ముసల్మానులు అయినా, అందరూ ఓ గాడ్ ఫాదర్ అని అంటూ పిలుస్తారు. ఆత్మ తన ఫాదర్ ను పిలుస్తుంది. నేను ఒక ఆత్మను, అని అర్థం చేసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మ కూడా ఒక వస్తువే కదా. ఆత్మ పెద్ద వస్తువేమీ కాదు, అది ఒక నక్షత్రం వంటిది మరియు అతి సూక్ష్మమైనది. బాబా ఎలా ఉంటారో, ఆత్మ స్వరూపం కూడా అలాగే ఉంటుంది. వారు సత్యము, చైతన్యము, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని ఇప్పుడు మీరు తండ్రిని మహిమ చేస్తారు. మీ ఆత్మ కూడా వారి సమానంగా తయారవుతుంది. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం వచ్చేసింది. ఇతర మనుష్యమాత్రులెవ్వరిలోనూ ఈ జ్ఞానం లేదు. మొత్తం భారత్ ను, మొత్తం విదేశాలను వెతకండి, ఎవరికీ తెలియదు. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. 84 లక్షల జన్మలైతే అసంభవము. 84 లక్షల జన్మల గురించైతే ఎవరూ వర్ణించలేరు కూడా. తండ్రి అంటారు – మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను వినిపిస్తాను. ఇదంతా వింటూ కూడా రాతి బుద్ధి కలవారు – 84 లక్షల జన్మల గురించి ఎవరైనా ఎలా వినిపించగలరు అనేది అర్థం చేసుకోరు.

ఇప్పుడు మనం బ్రాహ్మణులమని, మనం 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బ్రహ్మా కూడా 84 జన్మలు తీసుకున్నారు, విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మాయే విష్ణువు, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. లక్ష్మీనారాయణులే 84 జన్మలు తీసుకొని మళ్ళీ బ్రహ్మా, సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి అర్థం చేయిస్తానని తండ్రి అంటారు. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హమ్ సో అర్థాన్ని కూడా తెలుసుకున్నారు – ఆత్మలైన మనమే దేవతలుగా అవుతాము, తర్వాత మనమే క్షత్రియులుగా, మనమే వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇన్ని జన్మలు తీసుకుంటాము, తర్వాత మనమే బ్రాహ్మణులుగా అవుతాము. ఈ ఒక్క జన్మ బ్రాహ్మణ జన్మ. ఇది మీ వజ్ర తుల్యమైన జన్మ.

తండ్రి అంటారు – ఇది మీ ఉత్తమ శరీరము, దీనితో మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు, అందుకే ఇప్పుడు ఇంకెటువైపు భ్రమించకండి. జ్ఞానామృతాన్ని తాగండి. తప్పకుండా 84 జన్మలు తీసుకుంటామని కూడా మీకు అర్థమయ్యింది. మొట్టమొదట, సత్యయుగంలో మీరు సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత సతోగా అయ్యారు. తర్వాత వెండి యొక్క మాలిన్యం చేరుకుంది. పూర్తి లెక్కను తెలియజేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, బంగారంలో మాలిన్యాన్ని కలపండి, 14 క్యారట్ల బంగారాన్ని ధరించండి అని చెప్తుంది. బంగారంలో మాలిన్యం కలపడాన్ని భారతవాసులు అపశకునంగా భావిస్తారు. వివాహం చేయించేటప్పుడు, పూర్తిగా సత్యమైన బంగారాన్ని ధరిస్తారు. భారతవాసులకు బంగారం పట్ల కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకు? భారత్ గురించి ఇక అడగకండి. సత్యయుగంలో బంగారు మహళ్ళు ఉండేవి, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఎలాగైతే ఇటుకలు పేర్చి ఉంటాయో, అక్కడ బంగారం-వెండి అలా పేర్చి ఉంటాయి. మాయా మశ్చింద్రుని ఆటను చూపిస్తారు. అతడు బంగారు ఇటుకలను చూస్తాడు, వీటిని తీసుకువెళ్తాను అని అనుకుంటాడు, కిందకు దిగి చూస్తే ఏమీ ఉండదు. దీని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ స్వర్గంలోకి వెళ్తామని కుమార్తెలు భావిస్తారు, ఒకవేళ పతి మొదలైనవారు విసిగిస్తే, పాపం లోలోపల ఏడుస్తారు. మేమెప్పుడు సుఖధామానికి వెళ్తాము? బాబా, ఇప్పుడు త్వరగా చేయండి అని అంటారు. తండ్రి అంటారు – పిల్లలూ, త్వరగా ఎలా చేయను, ముందు మీరు యోగబలంతో మీలోని చెత్తను తొలగించుకోండి. యోగం యొక్క యాత్రలో ఉండండి. తండ్రి ఓర్పునిస్తారు. ఓ పతిత పావనా రండి, అని కూడా పిలుస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని పాడుతారు కూడా. ఇది ఇక్కడి విషయమే. అకాసురుడు, బకాసురుడు – ఈ విషయాలన్నీ ఈ సంగమ సమయానికి చెందినవే. ఇది ఆసురీ ప్రపంచము. కనుక తండ్రి అర్థం చేయిస్తారు – నేను కల్ప-కల్పము సంగమంలో వస్తాను, ఎప్పుడైతే మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుందో, అప్పుడు వస్తాను.

సత్యయుగంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడుండే పక్షులు, జంతువులు మొదలైనవన్నీ అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద మంచి స్వచ్ఛత ఉంటుంది. వారు నివసించే స్థానం, ఫర్నీచర్ మొదలైనవి చాలా బాగుంటాయి. మీరు కూడా అంతటి ఉన్నతమైన దేవతలుగా అవుతారు. అక్కడ, ఇక్కడుండేటువంటి ఛీ-ఛీ వస్తువులేవీ ఉండవు. ఇక్కడైతే దోమలు మొదలైనవి ఉంటాయి, అనేక రకాల అనారోగ్యాలుంటాయి, ఎంతటి అశుద్ధత ఉంటుంది. పల్లెల్లో ఇంత అశుద్ధత ఉండదు. పెద్ద పెద్ద పట్టణాల్లో చాలా అశుద్ధత ఉంటుంది ఎందుకంటే ఎక్కువమంది మనుష్యులైపోయారు, అందరూ ఉండేందుకు స్థలమే లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఒక్క సెకండులో శివబాబా బ్రహ్మా తనువులో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు, ఒక్క సెకండులో బ్రహ్మాయే విష్ణువుగా మారుతారు, ఒక్క సెకండులో 9 లక్షలమంది ప్రజలు తయారవుతారు….. అని మనుష్యులు పాడుతారు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. విష్ణువుతో పాటు సితారలు కూడా ఉన్నాయి. సత్యయుగంలో వీరు దేవతలుగా అవుతారు, అప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, వృక్షం ముందు చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. సత్యయుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. మధురమైన నదుల తీరాలలో ఉంటారు. ఇక్కడ నదుల నుండి అనేక కాలువలు వెలువడతాయి. అక్కడ కాలువలు మొదలైనవి ఉండవు. గుప్పెడు మంది మనుష్యులుంటారు. వారి కోసం గంగా, యమునా అయితే ఎలాగూ ఉంటాయి. ఆ నదుల చుట్టుప్రక్కలే నివసిస్తారు. 5 తత్వాలు కూడా దేవతలకు బానిసలుగా ఉంటాయి. ఎప్పుడూ అకాల వర్షాలు కురవవు. ఎప్పుడూ నదులు ఉప్పొంగవు. దాని పేరే స్వర్గం, ఇంకేమి ఉండాలి. స్వర్గం ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలని అంటారు. అచ్ఛా, అక్కడ ఎవరు రాజ్యం చేసేవారో చెప్పండి అని అడగండి. ఎన్ని వ్యర్థ ప్రలాపాలు పలుకుతూ ఉంటారు.

మనం కల్పక్రితం వలె ఈ పాత్రను అభినయిస్తున్నామని మీకు తెలుసు. రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక రకాల అసురుల విఘ్నాలు కలుగుతాయి. అసురులు పై నుండి చెత్త, పేడ మొదలైనవి వేసేవారని మనుష్యులు భావిస్తారు. కానీ అలా జరగలేదు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి అనేది మీరు చూస్తున్నారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి, అప్పుడే పాపపు కుండ నిండుతుంది. తండ్రి అంటారు – కొద్దిగా సహించవలసి ఉంటుంది. మీరు, మీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తినే సమయంలో కూడా మీ బుద్ధిలో శివబాబాను స్మృతి చేయండి. మీకైతే బుద్ధిలో జ్ఞానముంది. ఎవరినైనా ఉరి తీసేటప్పుడు, గాడ్ ఫాదర్ ను గుర్తు చేయండి అని ఫాదర్లు అంటారు. క్రీస్తును గుర్తు చేయండి అని అనరు. గాడ్ వైపే సూచిస్తారు. వారు ఎంత ప్రియమైనవారంటే, అందరూ వారినే పిలుస్తారు. ఆత్మయే పిలుస్తుంది. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అర్ధకల్పపు ఆ అలవాటును తొలగించుకోవాలి. దేహీ-అభిమానులుగా అవ్వడం ద్వారా మనం స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత ఉన్నతమైన ప్రాప్తి. కనుక రాత్రింబవళ్ళు ఇదే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మనుష్యులు వ్యాపారాలు మొదలైనవాటి కోసం కూడా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుష్యులకు ఎప్పుడూ కునికిపాట్లు గాని, ఆవలింతలు గాని రావు ఎందుకంటే అందులో సంపాదన ఉంటుంది. ధనం యొక్క సంతోషముంటుంది. అలసిపోవడమనే మాటే ఉండదు. బాబా కూడా అనుభవజ్ఞులు కదా. రాత్రి సమయంలో స్టీమర్లు వచ్చేటప్పుడు, మనుష్యులు వచ్చి సామాను కొనుక్కునేవారు. కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేయనంత వరకు వారిని వదిలేవారు కాదు. బాబా కూడా పూర్తి అనుభవజ్ఞుడినే రథంగా తీసుకున్నారు. వీరు అన్నీ అనుభవం చేసారు. పల్లెటూరి పిల్లవాడిగా కూడా ఉండేవారు. 10 అణాలకు సుమారు 18 కిలోల ధాన్యాన్ని అమ్మేవారు. ఇప్పుడు చూడండి, విశ్వానికి యజమానిగా అవుతున్నారు. పూర్తి పల్లెటూరి పిల్లవాడిగా ఉండేవారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత, పూర్తిగా వజ్రాల వ్యాపారంలో నిమగ్నమైపోయారు. కేవలం వజ్రాల విషయాలే ఉండేవి. ఇవైతే సత్యమైన వజ్రాలు. ఇది రాయల్ వ్యాపారము. బాబా చాలా అనుభవజ్ఞుడు. వైస్రాయ్ మొదలైనవారి ఇళ్ళకు, బాబా తన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్ళేవారు. వీటిని అవినాశీ జ్ఞాన రత్నాలని అంటారు. ఎంతగా వీటిని బుద్ధిలో ధారణ చేస్తారో, అంతగా మీరు పదమపతులుగా అవుతారు. శివబాబాను వ్యాపారస్థుడు, రత్నాకరుడు అని అంటారు. వారి మహిమను కూడా పాడుతారు, మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. మహిమతో పాటు అంత నింద కూడా చేస్తారు. భక్తి మార్గం యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది. తండ్రి అంటారు – భక్తి పూర్తి అయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు అనేది కూడా ఋజువవుతుంది. అందరికన్నా ఎక్కువ భక్తిని మీరే చేస్తారు. వారే ఇక్కడకు వచ్చి, మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు మరియు తండ్రి నుండి మళ్ళీ పూజ్యులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేసాడు, తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవానువాచ. భగవంతుడు ఒక్కరే. 2-3 భగవంతులు ఉండరు. గీత భగవంతుడు వినిపించినది. శివ భగవానువాచకు బదులుగా కృష్ణుని పేరు రాసేసారు కనుక ఎంత తేడా ఏర్పడింది. అయినా డ్రామానుసారంగా, గీత పేరు ఈ విధంగా మారాల్సిందే. ఓ పతితపావనా రండి, అని మళ్ళీ పిలుస్తారు. తండ్రి పావనంగా చేస్తారు, రావణుడు పతితంగా చేస్తాడు. అర్థం చేసుకునేందుకు ఎంత బుద్ధి కావాలి. శ్రీమతమనేది ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. ఈ లక్ష్మీనారాయణులు తండ్రి మతంతోనే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమానపు అలవాట్లను తొలగించుకునే శ్రమను చేయాలి. దేహీ-అభిమానులుగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి.

2. ఈ వజ్ర తుల్యమైన ఉత్తమ జన్మలో ఈ బుద్ధిని భ్రమించనివ్వకూడదు, సతోప్రధానంగా అవ్వాలి. అత్యాచారాలను సహించి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:-

అన్ని శిక్షణల సారమేమిటంటే – చూడడం, లేవడం, కూర్చోవడం, నడవడం, నిదురించడం, ఇలా ఏ కర్మ ద్వారానైనా ఫరిశ్తాతనం కనిపించాలి. ప్రతి కర్మలో అలౌకికత ఉండాలి. కర్మలో గాని, సంస్కారాలలో గాని ఎటువంటి లౌకికత ఉండకూడదు. ఆలోచించడం, చేయడం, మాట్లాడడం అన్నీ సమానంగా ఉండాలి. ఇది చేయకూడదనుకున్నాను కానీ చేసేసాను అని కాదు. మూడూ సమానంగా ఉన్నప్పుడు మరియు అవి తండ్రి సమానంగా ఉన్నప్పుడే శ్రేష్ఠ పురుషార్థులు లేదా సర్వోత్తమ పురుషార్థులు అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top