19 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

19 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu 

June 18, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు మహాన్ సౌభాగ్యశాలి ఎందుకంటే భగవంతుడు మీకు ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే, ఆ చదువును ఇప్పటి వరకు ఋషులు-మునులు కూడా చదువుకోలేదు”

ప్రశ్న: -

డ్రామా యొక్క ఏ రాతను పిల్లలైన మీరు తెలుసుకున్నారు కానీ ప్రపంచంలోని మనుష్యులకు తెలియదు?

జవాబు:-

ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. ఈ రాతను ఎవరూ తప్పించలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమంటే, ఇందులో మొత్తం సామాగ్రి స్వాహా అవుతుంది, ఇక మళ్ళీ మనం ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని రాత అని అనరు, డ్రామా యొక్క రాత అని అంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీహూ…..)

ఓంశాంతి. పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఇది మనుష్య సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణనిస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని – అని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథము. తండ్రి ఎలాగైతే ఈ రథంలోకి వచ్చి స్వారీ చేస్తున్నారో, అదే విధంగా మీ ఆత్మ కూడా రథంపై స్వారీ చేస్తుంది. ఆత్మ కేవలం ఈ జ్ఞానాన్ని మర్చిపోయింది – ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, నా నివాస స్థానం మూలవతనం, నాకు ఈ శరీరం ఇక్కడ లభిస్తుంది అని. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటారు – ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. నేను శాంతిగా కూర్చోవాలి – అని ఒకవేళ మీరనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శాంతిధామ నివాసిగా భావించండి. అప్పుడు కొంత సమయం కోసం శాంతిగా కూర్చోగలరు. మనుష్యులు శాంతినే కోరుకుంటారు. మనసుకు శాంతి కావాలని ఆత్మ అంటుంది. కానీ నేను ఆత్మను – అనే విషయం మనుష్యులకు తెలియదు. ఈ విషయం మర్చిపోయారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది – రాణి హారం మెడలోనే ఉంది కానీ బయట వెతుకుతూ ఉన్నారు. కనుక శాంతి మీ స్వధర్మమని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. ఆత్మలైన మేము శాంతి స్వరూపులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల నుండి అతీతమైనప్పుడు శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపైనా కూర్చోగలదు. మనం ఈ శరీరంతో పని చేయాలనుకోకపోతే, శాంతిగా కూర్చుండిపోవాలి. ఇది సత్యమైన శాంతి. దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మం శాంతి. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. మనం 84 జన్మల పాత్రను అభినయించామని తండ్రి ద్వారా తెలిసింది. ఈ 84 జన్మల చక్రం గురించి ఎవరికీ తెలియదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ముందు మనం సూర్యవంశీ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా, ఆ తర్వాత వైశ్యవంశీయులుగా, ఆ తర్వాత శూద్ర వంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనం సూర్య వంశీయులుగా అవ్వాలి.

పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు, మీరు ఎంతటి సౌభాగ్యశాలి. తండ్రి అయితే యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది సద్గతి మార్గము. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి 21 జన్మల కోసం మనకు సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారని ఇప్పుడు తెలుసుకున్నారు. బయట మనుష్యులకు ఈ విషయాల గురించి అసలు తెలియదు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీకు మాత్రమే తెలుసు. బి.కె.లైన మీకు ఏమి తెలుసు అని కొంతమంది అడుగుతారు. బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలేనా కాదా అనే పరీక్ష అయితే ఉండాలి. ఒకవేళ మీరు బ్రహ్మా పిల్లలైతే, సృష్టి చక్రం గురించి తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి గురించి తెలుసా? ఋషులు, మునులు మొదలైనవారికైతే, రచయిత మరియు రచనల గురించి అసలు తెలియదు, అంటే వారు నాస్తికులైనట్లు. మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు కూడా రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. స్కూలుకు మొదట చదువు రానివారే వస్తారు. తర్వాత ఇవి-ఇవి స్కూల్లో చదువుకున్నామని చెప్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో ఉన్నారు. పరమపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి. రచయిత అయితే ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారన్న విషయం శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడికి మరియు శివ పరమాత్మకు తేడా అయితే ఏమీ లేదు. రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల వెలువడిందని కూడా అంటూ ఉంటారు. కేవలం రుద్రుడైన శివుని స్థానంలో కృష్ణుని పేరు వేసేసారు. గీత అయితే అదే. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైందని అంటారు. కావున ఈ జ్ఞాన యజ్ఞం స్వరాజ్యం కోసము. ఇందులో పాత ప్రపంచం స్వాహా అవ్వనున్నది. యజ్ఞంలో అంతా ఆహుతి చేస్తారు అనగా సామాగ్రినంతా వేస్తారు, అంతా స్వాహా చేసేస్తారు. కనుక ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ పతిత ప్రపంచంలోకి మళ్ళీ రాము. ఇక ఈ ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంభవిస్తాయని మీకు తెలుసు. ఈ నాలెడ్జ్ అంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. నా బుద్ధిలోనే జ్ఞానమంతా ఉందని శివబాబా అంటారు. తండ్రి సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞాన సాగరుడు. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని ఋషులు, మునులు అంటారు. మీకు ఏమి లభిస్తుంది అని కొంతమంది మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి – పెద్ద-పెద్ద ఋషులు-మునులు మొదలైనవారు, మాకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అంటారు, దాని గురించి మాకు తెలుసు అని. రచయిత అయిన తండ్రి తప్ప రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ అర్థం చేయించలేరు. రచయితయే అర్థం చేయిస్తారు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనుక మిగతా ఈగలన్నీ వెళ్తాయి. రాణితో అనగా తల్లితో వాటికి ఎంతటి సంబంధముంటుంది. అనంతమైన తండ్రి కూడా వచ్చి, పిల్లలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. బాబా వచ్చి ఉన్నారని, ఆత్మలైన మనల్ని తమతో పాటు శాంతిధామానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మళ్ళీ మన సత్యయుగ పాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాత్రను అభినయించేందుకు మీరు ఈ దేవీ దేవతా పదవిని పొందుతున్నారు. మనుష్యుల నుండి దేవతల పదవి పొందడానికి మీరు ఇక్కడకు వస్తారు. అన్ని గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి. వీరిని దివ్య దృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. మనం సూర్యవంశీ దేవతలుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. స్వర్గం యొక్క రాజధాని ఎలా స్థాపనవుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సత్యయుగంలో దేవతల రాజ్యం మాత్రమే ఉండేది కానీ దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు మొదలైనవారిని చూపించారు. ఈ విషయం అసలు ఎవరికీ తెలియదు. భారత్ ఎంత పవిత్రంగా ఉండేది, సర్వగుణ సంపన్నులు….. అని మహిమను కూడా పాడుతారు. వారి ఎదురుగా తల వంచి కూడా నమస్కరిస్తారు. అనేక మందిరాలను కూడా నిర్మించారు. కానీ సత్యయుగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు మరియు ఎలా స్థాపన అయ్యింది అనేది వారికి తెలియదు. ఇంత ఉన్నతంగా ఉండే భారత్, నీచంగా ఎలా అయ్యింది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ రాత అలా తయారై ఉందని అంటారు. దేని రాత? అది కూడా అర్థం చేసుకోరు. డ్రామా రాతను అర్థం చేసుకున్నట్లయితే, డ్రామాను రచించిన క్రియేటర్, డైరెక్టర్ ఎవరు అనేది అర్థమవుతుంది. కేవలం ఈశ్వరుని రాత అని అంటారు. డ్రామా అని అంటున్నప్పుడు డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. ఎవరైనా వెళ్ళి డ్రామాను చూడనంతవరకు, కేవలం పుస్తకాలు చదవడంతో డ్రామా గురించి తెలియదు. ఒకసారి వార్తాపత్రికలలో కూడా, కృష్ణుని చరిత్ర గురించి ఒక డ్రామా తయారయిందని ప్రకటించారు. కానీ చూడకుండా ఎవరూ అర్థం చేసుకోలేరు. చూసినప్పుడే డ్రామాలో ఇదంతా జరుగుతుందని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర-భూగోళాల ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని మనుష్యులంటారు. కానీ ఎలా తిరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. సత్య-త్రేతాయుగాలు, ద్వాపర-కలియుగాలు, తర్వాత సంగమయుగమని పేర్లు కూడా రాసి ఉన్నాయి. కానీ ప్రతి యుగంలో వస్తారని మనుష్యులు అనుకున్నారు. సత్య-త్రేతా యుగాల మధ్యన కూడా సంగమం ఉంటుంది. కానీ ఆ సంగమానికి మహత్వమేమీ లేదు. అక్కడేమీ జరగదు. సత్యయుగీ సూర్యవంశీయులు, చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు అనే విషయాలు మీకు తెలుసు. అలాగని చంద్రవంశీయులు సూర్యవంశీయులపై విజయం పొందారని కాదు. చంద్రవంశీ రాజు ఎవరైతే ఉంటారో, అతనికి సూర్యవంశీ రాజా-రాణి రాజ్య భాగ్యం యొక్క తిలకాన్ని దిద్ది సింహాసనంపై కూర్చోబెడతారు. రాజా రామా, రాణి సీత అని టైటిల్స్ లభిస్తాయి. ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు రాజ్యం చేయండి అని చెప్తూ, సూర్యవంశీయులు ట్రాన్స్ఫర్ చేసారని అంటారు. ఈ దృశ్యాన్ని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూసారు. ఇకపోతే యుద్ధమేమీ జరగదు. ఏదైనా రాజ్యాన్ని ఎలా అప్పగిస్తారో, అక్కడ కూడా అలాగే ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య తిలకాన్ని దిద్దుతారు. అక్కడ గురువులు మొదలైనవారెవరూ ఉండరు. ఇప్పుడు మనము దైవీ స్వభావం కలవారిగా అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీయుల రాజ్యంలో మనం ఎంత సుఖవంతంగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖం నుండి బయటకు తీసి సుఖంలోకి తీసుకువెళ్తారు. ఇతరులెవరూ సుఖవంతులుగా చేయలేరు. స్వయంగా సాధు-సన్యాసులు కూడా, మేము శాంతిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. తండ్రి అంటారు – నేను ఈ సాధువులు మొదలైనవారిని కూడా ఉద్ధరించి అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను. సన్యాసులైతే ద్వాపరంలోనే వస్తారు. స్వర్గంలో దేవతలైన మనం మాత్రమే ఉంటాము. అక్కడ కూడా వేర్వేరు సెక్షన్లు ఉంటాయి. సూర్యవంశీయులది వేరుగా, చంద్రవంశీయులది వేరుగా ఉంటాయి, తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, సన్యాసులు మొదలైనవారు ఎవరైతే వస్తారో అందరి సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి. మనం రాజ్యం చేసేటప్పుడు ఇతరులెవరూ ఉండేవారు కాదు. మూలవతనంలో కూడా ఇటువంటి నంబరువారు మాల తయారుచేయబడి ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంవారి వంశం మొదటిది. తర్వాత వేరే వంశాలు వెలువడతాయి. ఈ వంశం అన్నింటికన్నా గొప్పది. ఇక మిగతా ధర్మ స్థాపకులు ఎవరైతే వస్తారో, అందరూ దీని నుండి వెలువడినవారు. ఇస్లామ్ వారిది సెకండ్ నంబర్ వంశమని మీరంటారు. తర్వాత బౌద్ధుల వంశం థర్డ్ నంబర్. మనది ఫస్ట్, ఇకపోతే హద్దుకు చెందిన చిన్న చిన్న వంశాలైతే లక్షల్లో ఉంటాయి. ఇక్కడైతే ముఖ్యమైనవి నాలుగు వంశాలు. మొట్టమొదట మనం వస్తాము, తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు వస్తారు. ఇప్పుడు మనం కిందకు పడిపోయాము. మనమే 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు లాస్ట్ లో ఉన్నారో, వారే మళ్ళీ ఫస్ట్ లో ఉంటారు. దేవీ దేవతలు ఇప్పుడు పతితంగా ఉన్న కారణంగా, తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. దేవతలనైతే పూజిస్తారు, అంటే వారి వంశంవారేనని ఋజువవుతుంది. సిక్కులు గురునానక్ ను నమ్ముతారు, వారు అతని వంశానికి చెందినవారు. సత్యయుగంలో మొదటి నంబరు వంశం మనదే. దాని కన్నా ఉన్నతమైన వంశం ఇంకేదీ ఉండదు. మనం ఉన్నతాతి ఉన్నతమైన వంశానికి చెందినవారము. మనం అందరికన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాము, మళ్ళీ మనమే నిరుపేదలుగా అవుతాము. అందరికన్నా ఎక్కువ దుఃఖితులు వీరే. అప్పులు కూడా వీరే తీసుకుంటూ ఉంటారు. ఎంత షావుకార్లుగా ఉండేవారు, ఇప్పుడు ఎంత నిరుపేదలుగా ఉన్నారు. అంతా పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది దుఃఖధామము. ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తారు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు, మిగిలినవారంతా శాంతిలో ఉంటారు. మేము ముక్తిలోకి వెళ్ళాలని కోరుకుంటారు కూడా. సుఖం కాకి రెట్ట సమానమైనదని భావిస్తారు. వారికి సుఖధామం యొక్క అనుభవమే లేదు. మీకు అనుభవం ఉంది. మహిమను కూడా పాడుతారు కానీ పతితంగా అయిన కారణంగా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు – ఓ భారతవాసులారా, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపరం నుండి పేరు మార్చేసుకున్నారు. దేవతా ధర్మంవారే పతితులుగా అయిపోయారు. ఓ పతిత పావనా రండి, అని కూడా పాడుతూ ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండేవారు, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారు అనేది తండ్రి తెలియజేసారు. ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది పాఠశాలలకే పాఠశాల, యజ్ఞాలకే యజ్ఞము. మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తమవ్వనున్నది. హోలికను కాలుస్తారు, ఈ పండుగలన్నీ ఇప్పటివే. ఆత్మ వెళ్ళిపోతుంది, ఇకపోతే శరీరం సమాప్తమైపోతుంది. ఈ నాలెడ్జ్ సన్యాసులు మొదలైనవారెవరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానముంది కానీ అది పిండిలో ఉప్పు అంత మాత్రమే ఉంది. ఈ జ్ఞానం ప్రాయఃలోపమైపోతుంది. శివబాబా అంటారు – నేను ఈ యజ్ఞాన్ని రచించాను, ఇందులో తనువు, మనసు, ధనం అంతా స్వాహా చేస్తారు. జీవిస్తూనే మరణిస్తారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుఖధామానికి వెళ్ళేందుకు తమ స్వభావాన్ని దైవీ స్వభావంగా తయారుచేసుకోవాలి. డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని హర్షితంగా ఉండాలి. అందరికీ ఇదే రహస్యాన్ని అర్థం చేయించాలి.

2. స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవిస్తూనే తమ తనువు, మనసు, ధనములను స్వాహా చేయాలి. తమదంతా కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే వర్తమాన సమయంలో సర్వాత్మల హృదయాలపై స్నేహంతో రాజ్యం చేస్తారో, వారే భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు ఎవరిపైనా ఆర్డర్ చేయకూడదు. ఇప్పటి నుండే విశ్వమహారాజుగా అవ్వకూడదు. ఇప్పుడు విశ్వ సేవాధారిగా అవ్వాలి, స్నేహాన్నివ్వాలి. తమ భవిష్య ఖాతాలో స్నేహాన్ని ఎంత జమ చేసుకున్నారు అనేది చూసుకోవాలి. విశ్వ మహారాజుగా అయ్యేందుకు కేవలం జ్ఞాన దాతగా అవ్వడమే కాదు, దీని కోసం అందరికీ స్నేహాన్ని అనగా సహయోగాన్ని ఇవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top