17 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
17 june 2021 Read and Listen today’s Gyan Murli in Telugu
16 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు పారలౌకిక తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకున్నారు, అందుకే మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి కలవారని లేక ఆస్తికులని అంటారు”
ప్రశ్న: -
తండ్రి భక్తుల రక్షకుడని వారి ఏ కర్తవ్యంతో ఋజువవుతుంది?
జవాబు:-
భక్తులందరినీ రావణుని జైలు నుండి విడిపించడము, నిరుపేదల నుండి సంపన్నులుగా తయారుచేయడము, ఈ కర్తవ్యం ఒక్క తండ్రిది మాత్రమే. పాత భక్తులు ఎవరైతే ఉన్నారో, వారిని బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా తయారుచేయడము – ఇదే వారిచ్చే రక్షణ. తన భక్తులందరికీ ముక్తి-జీవన్ముక్తిని ఇవ్వడానికి భక్తుల రక్షకుడు వచ్చారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)
ఓంశాంతి. పిల్లలు ఎవరి మహిమను విన్నారు? భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారని గాయనం చేయడం జరుగుతుంది మరియు భగవంతుడినే తండ్రి అని అంటారు. వారే ఈ రచన అంతటికీ రచయిత. ఉదాహరణకు లౌకిక తండ్రి కూడా తన రచనకు రచయిత అవుతారు. ముందుగా కన్యను తన స్త్రీగా చేసుకుంటారు, తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు. 5-7 మంది పిల్లలకు జన్మనిస్తారు, వారిని రచన అని అంటారు. తండ్రి రచయిత. అతను హద్దు రచయిత. రచనకు రచయిత అయిన తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని కూడా పిల్లలకు తెలుసు. మనుష్యులకు ఇద్దరు తండ్రులైతే ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. జ్ఞానం మరియు భక్తి వేర్వేరని, వాటి తర్వాత వైరాగ్యమని పిల్లలకు అర్థం చేయించారు. ఈ సమయంలో పిల్లలైన మీరు సంగమంలో కూర్చున్నారు, మిగిలినవారంతా కలియుగంలో కూర్చుని ఉన్నారు. వాస్తవానికి అందరూ పిల్లలే, కానీ మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, వారు రచన అంతటికీ రచయిత. లౌకిక తండ్రి ఉన్నా కానీ, ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యయుగంలో లౌకిక తండ్రి ఉంటారు, పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు ఎందుకంటే అది సుఖధామము. ఆ పారలౌకిక తండ్రిని దుఃఖంలో స్మృతి చేస్తారు. ఇక్కడ చదివించడం జరుగుతుంది, మనుష్యులను తెలివైనవారిగా చేయడం జరుగుతుంది. భక్తి మార్గంలో మనుష్యులకు తండ్రి గురించి కూడా తెలియదు. పరమపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ఓ దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు కూడా. మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. రాళ్ళల్లో, కణ-కణంలో, కుక్క పిల్లి అన్నింటిలో ఉన్నారని అనేస్తారు. తండ్రి అయిన పరమాత్మను నిందించడం మొదలుపెడతారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మీరు ఆస్తికులుగా అయ్యారు. మీకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారందరికీ తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉంది. మహాభారీ యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. పాత ప్రపంచ వినాశనార్థం, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కలియుగీ పతిత ప్రపంచం పూర్తి అయ్యి, తండ్రి ద్వారా సత్యయుగీ పావన ప్రపంచం స్థాపనవుతుంది. వారిని – ఓ పతితపావనా రండి, ఓ నావికుడా, మమ్మల్ని ఈ విషయ సాగరం నుండి బయటకు తీసి, క్షీర సాగరంలోకి తీసుకువెళ్ళండి అని అంటూ స్మృతి చేసుకుంటారు. గాంధీజీ కూడా – పతితపావనా సీతా రామ….. ఓ రామా, సీతలందరినీ పావనంగా చేయండి అని పాడేవారు. మీరంతా సీతలు, భక్తురాళ్ళు. వారు భగవంతుడు, వారిని అందరూ పిలుస్తారు. వారు మిమ్మల్ని పతితం నుండి పావనంగా చేస్తున్నారు. వారు మీకు ఎక్కడా ఎదురుదెబ్బలు తగలనివ్వరు. తీర్థయాత్రలకు వెళ్ళండి, కుంభ మేళాలకు వెళ్ళండి అని చెప్పరు. ఈ నదులు పతిత-పావని ఏమీ కావు. పతితపావనుడు జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే. సాగరాన్ని లేక నదులను ఎవరూ గుర్తు చేయరు. ఓ పతితపావన బాబా, మమ్మల్ని పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. ఇకపోతే, నీటి నదులైతే ప్రపంచమంతటా ఉన్నాయి, అవి పతిత-పావని కావు. పతితపావన అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే పావనంగా చేస్తారు. భారత్ కు చాలా భారీ మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాలకు తీర్థ స్థానము. శివ జయంతి కూడా ఇక్కడ గాయనం చేయడం జరుగుతుంది. సత్యయుగం పావన ప్రపంచం, అక్కడ దేవీ దేవతలుంటారు. సర్వ గుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు….. అని దేవతల మహిమ గాయనం చేయడం జరుగుతుంది. చంద్రవంశీయులను 14 కళలు కలవారని అంటారు. తర్వాత మెట్లు కిందకు దిగుతారు. తండ్రి వచ్చి సెకండులో మెట్లు ఎక్కించి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి మెట్లు దిగుతారు. ఎవరో ఒకరైతే తప్పకుండా 84 జన్మలను తీసుకొని ఉంటారు. ముఖ్యమైనది సర్వశాస్త్రమయీ శిరోమణి గీత. శ్రీమత్ భగవద్ అనగా భగవంతుని ద్వారా వినిపించబడినది. కానీ భగవంతుడని ఎవరినంటారు అనేది పతిత మనుష్యులకు తెలియదు. పతితపావనుడు, సర్వుల సద్గతిదాత, ఒక్క నిరాకార శివుడు మాత్రమే, కానీ వారెప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. తండ్రి వారంతట వారే వచ్చి తమ పరిచయాన్నిస్తారు. ఇప్పుడు చూడండి – ఈ కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ బాబా అనే పిలుస్తారు. మీరే తల్లి-తండ్రి, మీ ఈ రాజయోగాన్ని నేర్చుకోవడంతో అపారమైన సుఖం లభిస్తుంది….. అని గాయనం కూడా చేయడం జరుగుతుంది. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం, స్వర్గ వారసత్వాన్ని పొందడానికి మీరు ఇక్కడకు వస్తారు. ఇప్పుడు శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. రావణుడిని కూడా భారత్ లోనే చూపిస్తారు. కానీ అర్థమేమీ తెలియదు. శివుడు మన అనంతమైన తండ్రి, ఈ విషయం ఒక్కరికి కూడా తెలియదు. కేవలం శివుడిని పూజిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వృక్షమంతా తమోప్రధానమైపోతుందో, అప్పుడు తండ్రి వస్తారు. కొత్త ప్రపంచంలో భారత్ స్వర్గంగా ఉండేది. భారత్ లోనే సత్యయుగముండేది. భారత్ లోనే ఇప్పుడు కలియుగముంది. మీరు మొట్టమొదట స్వర్గానికి యజమానులుగా ఉండేవారని, ఇప్పుడు 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా, పతితం నుండి పావనంగా తయారుచేస్తాను. భక్తి అనగా బ్రహ్మా రాత్రి. జ్ఞానం అనగా బ్రహ్మా పగలు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు పగలులోకి వెళ్తారు. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది, ఇది నిజంగా మహాభారత యుద్ధము. తప్పకుండా ఈ మహాభారత యుద్ధం తర్వాతనే భారత్ స్వర్గంగా అవుతుంది. అనేక ధర్మాల వినాశనం జరిగి, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. పిల్లలైన మీరు బాబాకు సహాయకులుగా అయి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా అయినట్లయితే, ఇక వినాశనం ప్రారంభమైపోతుంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము, శివ అనండి లేక రుద్రుడని అనండి. కృష్ణ జ్ఞాన యజ్ఞమని ఎప్పుడూ అనరు. సత్య-త్రేతా యుగాలలో యజ్ఞాలు ఉండవు. ఎప్పుడైతే ఉపద్రవాలు సంభవిస్తాయో, అప్పుడు యజ్ఞం రచించడం జరుగుతుంది. ధాన్యం లేనప్పుడు లేదా యుద్ధం జరిగిటేప్పుడు, శాంతి కోసం యజ్ఞాన్ని రచిస్తారు. వినాశనం అవ్వకుండా భారత్ స్వర్గంగా అవ్వలేదని పిల్లలైన మీకు తెలుసు. భారతమాత శివశక్తి సైన్యము అన్న మహిమ ఉంది. పవిత్రమైనవారికే వందనం చేయడం జరుగుతుంది. మాతలైన మిమ్మల్ని వందేమాతరం అని అంటారు ఎందుకంటే మీరు శ్రీమతాన్ని అనుసరించి భారత్ ను స్వర్గంగా చేసారు. ఇప్పుడు తండ్రి అంటారు – మృత్యువైతే అందరి తలలపై నిలబడి ఉంది, అందుకే ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి, తర్వాత దేవతలుగా అవుతారు, ఇది కొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, నరకం నుండి స్వర్గంగా అవుతుంది. పతిత ప్రపంచంలో మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో, అవి వికర్మలగానే అవుతాయి. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయించాను, ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. నేను పరమపిత పరమాత్మను, నిరాకారుడిని, మీ తండ్రిని. నేను ఏ శరీరాన్ని అయితే ఆధారంగా తీసుకున్నానో, వారు భగవంతుడేమీ కారు. మనుష్యులను దేవతలని కూడా అనరు. అటువంటప్పుడు మనుష్యులను భగవంతుడు అని ఎలా అనగలరు. మీరు 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారని, పైకి ఎవరూ వెళ్ళలేరని తండ్రి అర్థం చేయిస్తారు. అందరూ పతితంగా అయ్యే మార్గాన్నే తెలియజేస్తారు, స్వయం వారు కూడా పతితంగా అవుతూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు – వారిని కూడా ఉద్ధరించేందుకు నేను రావలసి ఉంటుంది. ఇది రావణ రాజ్యము. ఇప్పుడు మీరు రావణ రాజ్యం నుండి బయటకు వచ్చారు. ఈ విషయం నెమ్మది-నెమ్మదిగా అందరికీ తెలుస్తుంది. బ్రాహ్మణులుగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రులు ఇద్దరు. ఒకరు నిరాకారీ తండ్రి, ఒకరు సాకారీ తండ్రి. వారసత్వమనేది ఒకటి సాకారీ తండ్రి నుండి సాకారీ పిల్లలకు లభిస్తుంది, తర్వాత, నిరాకారీ అనంతమైన తండ్రి నుండి నిరాకారీ ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. మనం మధురాతి మధురమైన శివబాబా నుండి 21 జన్మల కోసం సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇక్కడ ఆయుధాలు మొదలైనవేవీ లేవు. కనుక తండ్రితో యోగం జోడించి, వికర్మలను వినాశనం చేసుకొని, విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళడానికి అమరకథను వింటున్నారు. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ సంభవించవు. దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు. పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ అనంతమైన తండ్రి ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. ఇది శాస్త్రాల జ్ఞానమేమీ కాదు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వచ్చినట్లుగా చూపిస్తారు. వారి చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. తండ్రి అంటారు – నేను బ్రహ్మా ద్వారా మీకు మొత్తం రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. నేనే జ్ఞాన సాగరుడను. జ్ఞాన సూర్యుడు ఉదయించినప్పుడు….. అజ్ఞాన అంధకారం వినాశనమవుతుందని పాడుతారు కూడా. సత్యయుగంలో అజ్ఞానముండదు. అది సత్యఖండంగా ఉన్నప్పుడు, భారత్ వజ్ర సమానంగా ఉండేది, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు తయారయ్యేవి. ఇప్పుడైతే మనుష్యులకు తినడానికి కూడా సరిపడా లేదు. నిరుపేదగా ఉన్న విశ్వాన్ని మళ్ళీ సంపన్నంగా ఎవరు తయారుచేస్తారు! ఈ పని తండ్రిది మాత్రమే. తండ్రికే దయ కలుగుతుంది. వారంటారు – మీకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను, నరుడిని నారాయణునిగా, నారిని లక్ష్మిగా చేస్తాను. భక్తుల రక్షకుడు భగవంతుడు. మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించి సుఖధామానికి తీసుకువెళ్తాను. ఈ ప్రపంచమంతటిలో ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా అని బ్రహ్మా పేరు కూడా ప్రసిద్ధమైనది. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు, మీరు భారత్ కు సత్యమైన ఆత్మిక సేవను చేస్తున్నారు. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనులుగా అవ్వడానికి ఇంకే మార్గము లేదు. స్మృతితోనే మాలిన్యం భస్మమవుతుంది. సత్యమైన బంగారం, కల్తీ బంగారంగా ఎలా అవుతుంది అనేది కంసాలికి తెలుసు. అందులో వెండి, రాగి, ఇనుము కలుపుతారు. మీరు కూడా ముందు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత మీలో మాలిన్యం చేరుకుంది, తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే సత్యయుగంలోకి వెళ్ళగలరు. దేహధారులెవరినీ గుర్తు చేయకండి అని తండ్రి అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరినీ గుర్తు చేయకండి, అప్పుడు మీరు స్వర్గపురికి యజమానులుగా అయిపోతారు. స్వర్గం అనగా విష్ణుపురి ఉండేది, ఇప్పుడిది రావణపురి. మళ్ళీ తప్పకుండా విష్ణుపురిగా అవుతుంది. నేను సాధు-సత్పురుషులు మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. అందుకే, యదా యదాహి ధర్మస్య….. అని అంటారు. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. సర్వుల సద్గతిదాత తండ్రినైన నేనొక్కడినే, శివుడిని. శివుడు, రుద్రుడు ఇవన్నీ వారి పేర్లే, ఎన్నో పేర్లు పెట్టేసారు. తండ్రి అంటారు – నా అసలు పేరైతే ఒక్కటే, శివ. నేను శివుడిని, పిల్లలైన మీరు సాలిగ్రామాలు. మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని తెలుసుకోవడంతో, తండ్రి ద్వారా మీరు అంతా తెలుసుకుంటారు. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయిపోతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతమనుసారంగా నడుచుకొని, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవతలుగా అవ్వాలి. విశ్వమంతటికీ సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపనలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.
2. ఆత్మను సత్యమైన బంగారంగా తయారుచేసుకునేందుకు, ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహధారినీ గుర్తు చేయకూడదు. పారలౌకిక తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి.
వరదానము:-
ఏదైనా కొత్త శక్తిశాలి ఆవిష్కరణ చేసేటప్పుడు, అండర్ గ్రౌండ్ లో చేస్తారు. మీరు కూడా ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో అనగా అండర్ గ్రౌండ్ లో ఉంటారో, అంతగా వాయుమండలం నుండి రక్షించబడతారు, మనన శక్తి పెరుగుతుంది మరియు మాయ విఘ్నాల నుండి కూడా సురక్షితంగా ఉంటారు. బాహ్యముఖతలోకి వస్తూ కూడా, అంతర్ముఖులుగా, హర్షితముఖులుగా, ఆకర్షణా మూర్తులుగా ఉండండి. కర్మలు చేస్తూ కూడా ఈ అభ్యాసం చేసినట్లయితే, సమయం పొదుపు అవుతుంది మరియు సఫలతను కూడా అధికంగా అనుభవం చేస్తారు.
స్లోగన్:-
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు - “మనుష్యులు సాక్షాత్కారాలలోకి ఎలా వెళ్తారు”
ఈ సాక్షాత్కారాలలోకి వెళ్ళే విషయంలో, దీని ఫిలాసఫీ చాలా సూక్ష్మమైనది. ఈ అంతఃవాహక శరీరంతో వెళ్ళి తిరిగి వస్తారు. ఎలాగైతే ఎవరైనా విహరించేందుకు బయటకు వెళ్తారు కదా, అక్కడ విహరించడానికి వెళ్ళారంటే మరణించారని కాదు, వారు విహరించి మళ్ళీ తిరిగి వస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా, ఆత్మ ఈ శరీరం నుండి బయటకు వచ్చి అంతఃవాహక శరీరంతో విహరించేందుకు వెళ్తుంది. కొద్ది సమయం కోసం వారి ఆత్మ ఎగిరే పక్షి వలె ఉంటుంది. వారి దారాన్ని (బుద్ధిని) ఆకర్షించి, దివ్యదృష్టితో వారికి సాక్షాత్కారం కలిగించే పని పరమాత్మదే. ఎలాగైతే మనం రాత్రి శరీరం నుండి అతీతంగా, ఆత్మగా అయి, సుఖమయ మార్గంలోకి అనగా స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాము. ఆ సమయంలో శరీరం శాంతిగా ఉంటుంది, అప్పుడు దేహం మరియు దేహ ధర్మాలను మర్చిపోతాము. అలాగని శరీరం మరణించిందనేమీ కాదు. మళ్ళీ జాగృతిలోకి వచ్చినప్పుడు, ఆ రాత్రి వచ్చిన కల యొక్క అవస్థను వర్ణించి వినిపిస్తారు. అదే విధంగా, పరమాత్మతో యోగం జోడించడంతో, పరమాత్మ దివ్యదృష్టితో ఆత్మను విహరించేలా చేస్తారు. తర్వాత ధ్యానం నుండి లేచినప్పుడు, మేము ఇది చూసి వచ్చాము అని వారు చూసిన సాక్షాత్కారాన్ని వర్ణించి వినిపిస్తారు. ఆ స్వప్నాలు రజోగుణిగా, తమోగుణిగా కూడా ఉంటాయి. ఈ ధ్యానం సతోగుణ అవస్థ కలది. కనుక ధ్యానంలో శరీరమేమీ మరణించదు, కానీ శరీరం యొక్క అనుభూతి మాయమైపోతుంది. ఎలాగైతే క్లోరోఫాం ఇవ్వడంతో శరీరం యొక్క స్పృహను మర్చిపోతారు. చూడండి, డాక్టర్ ఏ అవయవాన్ని అయినా డెడ్ చేసేటప్పుడు, ఇంజెక్షన్ ఇచ్చి డెడ్ చేస్తారు. కానీ ఇతర ఇంద్రియాలైతే పని చేస్తాయి. కనుక ధ్యానం కూడా ఇటువంటిదే. ఆత్మ ఎగిరి వెళ్ళి విహరించి వస్తుంది కానీ శరీరం మరణించదు. ఇప్పుడు ఈ దారాన్ని ఆకర్షించే శక్తి కూడా పరమాత్మలోనే ఉంది, మనుష్యాత్మలో లేదు. అచ్ఛా. ఓంశాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!