14 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen BK Murli Of 14 June 2021 in Telugu Murli Today | Daily Murli Online

13 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం ఉన్నప్పుడే తండ్రితో పాటు వెళ్ళగలుగుతారు”

ప్రశ్న: -

భగవంతుడు సమర్థుడు అయినప్పటికీ వారి ద్వారా రచించబడిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి?

జవాబు:-

ఎందుకంటే రావణుడు భగవంతుని కన్నా చురుకైనవాడు. అతని రాజ్యాన్ని లాక్కున్నప్పుడు, అతను తప్పకుండా విఘ్నాలను కలిగిస్తాడు. ప్రారంభం నుండి మొదలుకొని, డ్రామానుసారంగా, ఈ యజ్ఞంలో విఘ్నాలు కలుగుతూనే వచ్చాయి, అవి కలగాల్సిందే. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాము కావున తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలను కలిగిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓ దూరపు బాటసారీ….. (ఓ దూర్ కే ముసాఫిర్…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైను విన్నారు. ఎలాగైతే వేద శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గపు దారిని తెలియజేస్తాయో, అలాగే పాట కూడా కొద్దిగా దారిని తెలియజేస్తుంది. వారైతే ఏమీ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలు మొదలైనవి వినడమనేది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. దూరదేశపు బాటసారి అని ఎవరిని అంటారనేది ఇప్పుడు పిల్లలకు తెలుసు. నేను కూడా దూరపు బాటసారిని, నా ఇల్లు శాంతిధామము – అని ఆత్మకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాలు అర్థం కాకపోతే ఏమీ అర్థం కానట్లే. తండ్రిని తెలుసుకోకపోతే ఎవరూ సృష్టి చక్రాన్ని తెలుసుకోలేరు. నేను టెంపరరీగా జీవాత్మగా అవుతాను, మీరు స్థిరమైన జీవాత్మలు అని శివబాబా చెప్పారని – ఆత్మ అర్థం చేసుకుంటుంది. నేను కేవలం సంగమంలోనే టెంపరరీ జీవాత్మగా అవుతాను, అది కూడా మీరు అయినట్లుగా అవ్వను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు ఈ జీవంలో ప్రవేశిస్తాను. లేకపోతే మీకు నా పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరేనని, వారిని శివబాబా లేదా భగవంతుడని అంటారని తండ్రి అర్థం చేయించారు. వారి గురించి ఇతరులెవరికీ తెలియదు. ఇక్కడ పవిత్రత యొక్క బంధనం కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించడమనేది అన్నింటి కన్నా పెద్ద బంధనము. ఆ దూరపు బాటసారి అయిన పతితపావనుడిని భక్తి మార్గంలో గుర్తు చేసుకుంటారు. నేను అందరినీ తీసుకువెళ్తాను, ఎవరినీ వదిలి వెళ్ళను, అందరూ తిరిగి వెళ్ళాల్సిందే అని ఆ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. ప్రళయం కూడా జరగదు. భారత ఖండమైతే తప్పకుండా ఉంటుంది. భారత ఖండం ఎప్పుడూ వినాశనం అవ్వదు. సత్యయుగం ఆదిలో కేవలం భారత ఖండం మాత్రమే ఉంటుంది. కల్పం యొక్క సంగమంలో తండ్రి వచ్చినప్పుడు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చెయ్యాల్సి ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అవ్వనున్నాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడంలో సహాయం చేస్తున్నారు. కావున – బాబా, మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండని అంటారని పాటలో విన్నారు. ఎప్పటివరకైతే పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలగదో, అప్పటివరకు ఎవరూ ఈ విధంగా నాతో పాటు వెళ్ళలేరని తండ్రి అంటారు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, పాతదాని నుండి మనసు తెగిపోతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. సతోప్రధానంగా అవ్వనంత వరకు సతోప్రధాన దేవీ-దేవతలుగా కాలేరు, అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండమని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. సద్గతిని ఇచ్చే దూరపు బాటసారి ఒక్కరే, వారు వచ్చి ఉన్నారు, వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేసారు. మనం శివబాబా సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు – మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు, అంటే ఇది ఫ్యామిలీ అయినట్లు. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఎవరికైనా చాలా మంది పిల్లలుంటే, అది ఒక పెద్ద సైన్యమైపోతుంది. శివబాబా పిల్లలైన, ఇంతమంది బి.కె సోదరీ-సోదరులు ఎవరైతే ఉన్నారో, వీరందరిదీ కూడా ఒక పెద్ద సైన్యమైపోతుంది. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము – అని బ్రహ్మాకుమార-కుమారీలందరికీ తెలుసు. పాండవులు-కౌరవులు జూదమాడారని, సామ్రాజ్యాన్ని పణంగా పెట్టారని శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు రాజ్యమనేది కౌరవులకు లేదు, పాండవులకు లేదు. కిరీటం మొదలైనవేవీ కూడా లేవు. వారిని రాజ్యం నుండి బహిష్కరించారని, వారు వెళ్ళి ఆయుధాలు మొదలైనవి దాచిపెట్టారని చూపిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. పాండవుల రాజ్యము లేదు, కౌరవుల రాజ్యము లేదు. వారికి పరస్పరంలో యుద్ధం కూడా జరగలేదు. రాజుల మధ్యన యుద్ధం జరుగుతుంది, వీరైతే పరస్పరంలో సోదరులు. కౌరవులకు మరియు యవనులకు మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇకపోతే సోదరులు ఒకరినొకరు ఎలా అంతం చేసుకుంటారు. పాండవులు, కౌరవులు యుద్ధం చేసుకున్నారని, 5 పాండవులు మరియు ఒక కుక్క మిగిలారని, వారంతా కూడా పర్వతాల పైకి వెళ్ళి కరిగిపోయారని చూపిస్తారు. ఇక ఆట సమాప్తమైపోయినట్లే. అలా అయితే రాజయోగానికి అర్థమే లేనట్లు.

తండ్రి కల్ప-కల్పము వచ్చి ఏక ధర్మ స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. హే పతిత పావన బాబా రండి, వచ్చి పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని పిలుస్తారు కూడా. సత్యయుగంలో సూర్యవంశ రాజధాని మాత్రమే ఉంటుంది. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున వారి డైరెక్షన్లపై నడుచుకోవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండమని కన్యలకు చెప్పరు. వారు ఎలాగూ పవిత్రమైనవారు. ఈ మాట గృహస్థులకు చెప్పడం జరుగుతుంది. కుమారులు మరియు కుమారీలైతే అసలు వివాహమే చేసుకోకూడదు. లేకపోతే వారు కూడా గృహస్థులుగా అయిపోతారు. అక్కడక్కడ గంధర్వ వివాహాల గురించి వర్ణన ఉంది. ఒకవేళ కన్యను కొడుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో గంధర్వ వివాహం చేయించడం జరుగుతుంది. వాస్తవానికి దెబ్బలను కూడా సహించాలి కానీ అధర్ కుమారీలుగా అవ్వకూడదు. బాల బ్రహ్మాచారులకు చాలా మంచి పేరుంటుంది. వివాహం చేసుకుంటే హాఫ్ పార్ట్నర్ అయిపోతారు. మీరు పవిత్రంగా ఉండండి అని కుమారులకు చెప్పడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉన్నవారికి – గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా తయారవ్వండి అని చెప్పడం జరుగుతుంది. వారికే శ్రమ ఉంటుంది. వివాహం చేసుకోకపోతే బంధనాలుండవు. కన్యలైతే చదువుకోవాలి మరియు జ్ఞానంలో చాలా దృఢంగా ఉండాలి. ఇక్కడ మైనర్ గా ఉన్న చిన్న కుమారీలను తీసుకోలేము. వారు తమ ఇంట్లో ఉంటూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉన్నట్లయితే, మైనర్ కుమారీలను తీసుకోగలము. ఇది స్కూళ్ళకే స్కూలు, ఇళ్ళకే ఇల్లు మరియు సత్సంగాలకే సత్సంగము. సత్ అంటే ఒక్క తండ్రి, వారినే ఓ దూరపు బాటసారి అని అంటారు. ఆత్మ సుందరంగా అవుతుంది. తండ్రి అంటారు – బాటసారినైన నేను సదా సుందరంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా, సుందరంగా తయారుచేస్తాను, ఇటువంటి బాటసారి ఇంకెవరూ ఉండరు. నేను రావణ రాజ్యంలోకి వచ్చానని, ఈ శరీరం కూడా పరాయిదని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది నా శరీరమని మీ ఆత్మ అంటుంది. తండ్రి అంటారు – ఇది నా శరీరం కాదు, ఇది ఇతని శరీరం, ఈ పతిత శరీరం నాది కాదు. వీరి అనేక జన్మల అంతిమ జన్మలో వస్తారు. ఎవరైతే నంబర్ వన్ పావనంగా ఉండేవారో, వారే లాస్ట్ నంబర్ గా అవుతారు అనగా అంతిమంలో వికారీగా అవుతారు. మొదటి నంబర్ వారు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు, ఇప్పుడు ఏ కళ మిగలలేదు. అందరూ పతితంగానే ఉన్నారు. కనుక తండ్రి దూరదేశపు బాటసారి అయినట్లే కదా. ఆత్మలైన మీరు కూడా బాటసారులే. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఈ సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. ఎవరు ఎన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా కానీ ఈ జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు. నేను ఈ తనువులో ప్రవేశించి, ఈ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. అక్కడ మనుష్యులు, మనుష్యులకు శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. వారు భక్తులు. సద్గతిదాత అయితే ఒక్కరే. వారే జ్ఞాన సాగరుడు, వారి గురించి తెలియని కారణంగా దేహాభిమానం వచ్చేస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని వారెవరూ అర్థం చేయించరు. ఆత్మ చదువుకుంటుంది. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు ఎందుకంటే దేహాభిమానం ఉంది. ఇప్పుడు దూరదేశపు బాటసారి అని శివబాబానే అంటారు. మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసామని మీకు తెలుసు.

తండ్రి అంటారు – పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదని 5 వేల సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించాను. గీతలో పిండిలో ఉప్పు అంత మాత్రమే నిజం ఉందని నాకు తెలుసు. ఇది అదే గీతా అధ్యాయము, అదే మహాభారత యుద్ధము, అదే మన్మనాభవ-మధ్యాజీభవ యొక్క జ్ఞానము. నన్నొక్కడినే స్మృతి చేయండి. యుద్ధం కూడా తప్పకుండా జరిగింది. పాండవులకు విజయం లభించింది. విష్ణువు యొక్క విజయ మాల గాయనం చేయబడుతుంది. పాండవులు కరిగిపోయారని శాస్త్రాలలో చూపించారు. మరి మాల ఎక్కడ నుండి తయారయ్యింది. మనం విష్ణు మాలగా తయారయ్యేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పైన పతితపావనుడైన తండ్రి ఉన్నారు. వారి స్మృతిచిహ్నం కావాలి కదా. భక్తి మార్గంలో స్మృతిచిహ్నాలు గాయనం చేయబడతాయి. 8 మణుల మాలను, 108 మణుల మాలను, 16,108 మణుల మాలను తయారుచేసారు. మీ ఎక్కే కళ ద్వారా సర్వులకు మేలు జరుగుతుందని పాడుతారు. మనది ఎక్కే కళ అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనం మన సుఖధామానికి వెళ్ళిపోతాము, మళ్ళీ అక్కడి నుండి మనం కిందకు ఎలా దిగుతాము, 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనే జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు. మన దుఃఖాలన్నింటినీ దూరం చేసి, శాపాన్ని తొలగించి, సుఖపు వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారు. రావణుని శాపంతో అందరికీ దుఃఖం కలుగుతుంది. కనుక ఇప్పుడు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. సూర్యవంశీయులైన మనం భారత్ లో రాజ్యం చేసామని మీకు తెలుసు. భారత్ లోనే శివబాబా వస్తారు. భారత్ యే స్వర్గంగా ఉండేదని పదే-పదే బుద్ధితో గుర్తుచేసుకోవాలి. ఎవరైతే 84 జన్మల చక్రంలో తిరిగి ఉండరో, వారు ధారణ చేయరు, చేయించరు. అటువంటివారు 84 జన్మలు తీసుకోలేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది, వారు ఆలస్యంగా వస్తారు, స్వర్గంలోకి రారు. ముందుగా వెళ్ళడం మంచిది కదా. కొత్త ఇంట్లో ముందు స్వయం ఉంటారు, తర్వాత అద్దెకిస్తారు. అప్పుడది సెకండ్ హ్యాండ్ అయినట్లు కదా. సత్యయుగం కొత్త ప్రపంచము. త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. కనుక, మనం కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలని ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. పురుషార్థం చేయాలి, ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు కూర్చబడతారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా నేరుగా, నీవు మాలలోకి రావు అని చెప్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే పురుషార్థం చేయమని చెప్పడం జరుగుతుంది. నా బుద్ధి యోగం భ్రమించడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మీకు శివబాబా పట్ల ఎంతో ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. మేము బాప్ దాదా వద్దకు వెళ్తామని, శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వం తీసుకోవడానికి వెళ్తామని అంటారు. ఇటువంటి తండ్రి వద్దకు చాలా సార్లు వెళ్ళాలి. కానీ గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. కొందరు చాలా ధనవంతులుగా ఉంటారు కానీ అంత తీరిక ఉండదు, పూర్తి నిశ్చయం ఉండదు. లేదంటే నెలకొకసారి, రెండు నెలలకొకసారి వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. వారికి పదే-పదే ఆకర్షణ కలుగుతుంది. సూదికి తుప్పు పట్టి ఉన్నట్లయితే అయస్కాంతం అంతగా ఆకర్షించదు. ఎవరి యోగమైతే పూర్తిగా ఉంటుందో, వారికి వెంటనే ఆకర్షణ కలుగుతుంది, పరుగు పరుగున వస్తారు. ఎంతగా తుప్పు తొలగుతూ ఉంటుందో, అంతగా మేము అయస్కాంతాన్ని కలుసుకోవాలనే ఆకర్షణ కలుగుతుంది. మీరు కొట్టండి, ఏమైనా చేయండి….. మేము మీ ద్వారం నుండి ఎప్పటికీ వెళ్ళము….. అని పాట ఉంది. కానీ ఆ అవస్థ చివర్లో ఉంటుంది. తుప్పు తొలగి ఉంటే ఆ అవస్థ ఉంటుంది. తండ్రి అంటారు – ఓ ఆత్మలారా, మన్మనాభవ, మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి. పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చుండిపోవాలని కాదు. మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు సాగరం వద్దకు రావాలి. మళ్ళీ సేవ కోసం వెళ్ళాలి. బంధనాలు సమాప్తమైనప్పుడు సేవ కోసం వెళ్ళగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించాలి. తండ్రి స్మృతిలో ఉండాలి, పవిత్రంగా అవ్వాలి.

జ్ఞాన యజ్ఞంలో అనేక రకాల విఘ్నాలు కలుగుతాయని తండ్రి అర్థం చేయించారు. ఈశ్వరుడు సమర్థుడు కదా, మరి విఘ్నాలు ఎందుకు వస్తాయి అని అడుగుతారు. రావణుడు భగవంతుని కన్నా చురుకైనవాడని మనుష్యులకు తెలియదు. అతడి రాజ్యాన్ని లాక్కోవడం జరుగుతుంది కనుక అనేక రకాల విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభం నుండి మొదలుకొని పతితుల విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. శాస్త్రాలలో కూడా కృష్ణునికి 16,108 మంది పట్టపు రాణులు ఉండేవారని, సర్పం కాటేసిందని, రాముని సీత అపహరించబడ్డారని రాసేసారు. రావణుడు స్వర్గంలోకి ఎక్కడి నుండి వస్తాడు. చాలా అసత్యాలున్నాయి. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. ఎవరైతే వారసత్వం తీసుకునేవారు ఉంటారో, వారు మాత్రమే వచ్చి అర్థం చేసుకుంటారని మనుష్యులకు తెలియదు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు కలుగుతాయి. పతితులను అసురులని అంటారు. ఇది రావణ సంప్రదాయము. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. రావణ రాజ్యం నుండి దూరంగా వచ్చేసారు కానీ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. మేము వెళ్తున్నామనే జ్ఞానం బుద్ధిలో ఉంది. కూర్చోవడం ఇక్కడే కూర్చొని ఉన్నారు. బుద్ధిలో జ్ఞానముంది. ఇక్కడే కూర్చున్నారు కానీ దీని పట్ల మీకు వైరాగ్యం ఉంది. ఈ ఛీ-ఛీ ప్రపంచం శ్మశానవాటికగా అవ్వనున్నది. రకరకాల పాయింట్లతో అర్థం చేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఒకటే పాయింట్ ఉంది – మన్మనాభవ. బాబా, మేము బంధనంలో ఉన్నామని ఎంతోమంది నుండి ఉత్తరాలు వస్తాయి. ద్రౌపది అనేవారు ఒక్కరే కాదు, వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఎవరైతే కల్పక్రితం పుష్పాలుగా అయ్యారో, వారే వెలువడుతారు. గార్డెన్ ఆఫ్ అల్లా (భగవంతుని పూదోట) యొక్క స్థాపన ఇక్కడ జరుగుతుంది. కొంతమంది ఎటువంటి మంచి-మంచి పుష్పాలుగా ఉంటారంటే, వారిని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ (పుష్పాల రాజు) అనే పేరు ఉంది. వాటిని 5 రోజులుంచినా కూడా వికసించే ఉంటాయి, సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో మరియు స్మృతినిప్పిస్తారో, వారి సుగంధం వ్యాపిస్తుంది. వారు సదా సంతోషంగా ఉంటారు. అటువంటి మధురాతి-మధురమైన పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు. వారి ఎదురుగా బాబా యొక్క జ్ఞాన డ్యాన్స్ చాలా బాగా జరుగుతుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన-యోగాలలో దృఢంగా అవ్వాలి. ఒకవేళ ఏ బంధనము లేకపోతే, తెలిసి-తెలిసి బంధనాలలో చిక్కుకోకూడదు. బాల బ్రహ్మాచారులుగా ఉండాలి.

2. ఇప్పుడు మనది ఎక్కే కళ, బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేయడానికి, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. నా బుద్ధి యోగం ఎక్కడా భ్రమించడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే స్వమానంలో స్థితులై ఉంటారో, వారే తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను సహజంగా పాలన చేయగలరు. స్వమానమనేది రకరకాల దేహాభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది. కానీ స్వమానంలో స్వ అనే పదాన్ని మర్చిపోయినప్పుడు మరియు గౌరవం-ప్రతిష్టలలోకి వచ్చినప్పుడు, ఒక్క పదం యొక్క పొరపాటుతో అనేక పొరపాట్లు మొదలవుతాయి. అందుకే శ్రమ ఎక్కువ మరియు ప్రత్యక్ష ఫలం తక్కువగా లభిస్తుంది. కానీ సదా స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే, పురుషార్థంలో మరియు సేవలో సహజంగానే సఫలతా మూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top