12 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
11 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - సూర్యవంశీ రాజ్య పదవిని తీసుకునేందుకు తమదంతా తండ్రికి స్వాహా చేయండి, సూర్యవంశీ రాజ్య పదవి అనగా ఎయిర్ కండిషన్ టికెట్”
ప్రశ్న: -
ఈ ప్రపంచంలో పిల్లలైన మీ కన్నా గొప్ప అదృష్టవంతులు ఎవరూ లేరు – ఎలా?
జవాబు:-
అనంతమైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖంలో ఉన్నారు. వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఈ సమయంలో మీరు అనంతమైన తండ్రి, టీచరు మరియు సద్గురువుకు చెందినవారిగా అయ్యి, వారి నుండి అనంతమైన ప్రాప్తిని పొందుతారు. ప్రపంచంలోని వారికి ఆ అనంతమైన తండ్రి గురించి తెలియను కూడా తెలియదు, అటువంటప్పుడు వారు మీ అంతటి అదృష్టవంతులుగా ఎలా అవ్వగలరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
గొప్ప అదృష్టవంతులము….. ( బడా ఖుష్ నసీబ్ హై…..)
ఓంశాంతి. ఇప్పుడు మనం బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారమని, తర్వాత దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతామని బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలకు తెలుసు. పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – అనంతమైన తండ్రి మీ సమ్ముఖంగా ఉన్నప్పుడు మరియు వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తున్నప్పుడు, ఇంకేమి కావాలి. భక్తి మార్గం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. భక్తి మార్గపు భక్తులు భగవంతుడిని మరియు వధువులు వరుడిని స్మృతి చేస్తారు. కానీ విచిత్రమేమిటంటే, వారి గురించి తెలియదు. ప్రేయసికి ప్రియుడి గురించి తెలియకపోవడమనేది ఎప్పుడైనా చూసారా. తెలియనే తెలియనప్పుడు, స్మృతి ఎలా చేయగలరు. భగవంతుడైతే అందరికీ తండ్రి. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. కానీ పరిచయం లేకుండా స్మృతి చేస్తే అంతా వృథా అయిపోతుంది, అందుకే ఈ విధంగా స్మృతి చేయడం వలన లాభమేమీ ఉండదు. ఈ విధంగా స్మృతి చేస్తూ ఆ లక్ష్యం-ఉద్దేశ్యాన్ని ఎవరూ చేరుకోరు. భగవంతుడు ఎవరు, వారి నుండి ఏమి లభిస్తుంది అనేది ఏమీ తెలియదు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన గురువులను అనగా అన్ని ధర్మాలలో ధర్మ స్థాపన చేసినవారిని, వారి ఫాలోవర్స్ గుర్తు చేస్తారు, కానీ వారిని గుర్తు చేయడంతో మాకు ఏమి లభిస్తుంది అనేది ఏమీ తెలియదు. దీని కన్నా దైహిక చదువు మంచిది. అక్కడ లక్ష్యం-ఉద్దేశ్యం అయితే బుద్ధిలో ఉంటాయి కదా. తండ్రి నుండి ఏమి లభిస్తుంది, టీచరు నుండి ఏమి లభిస్తుంది మరియు గురువు నుండి ఏమి లభిస్తుంది అనేది ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ మీరు తండ్రికి చెందినవారిగా, తర్వాత టీచరుకు చెందినవారిగా, తర్వాత సద్గురువుకు చెందినవారిగా అవుతారు. తండ్రి మరియు టీచరు కన్నా గురువు ఉన్నతంగా ఉంటారు. మేము తండ్రికి చెందినవారిగా అయ్యామని, ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం కలిగింది. బాబా 5 వేల సంవత్సరాల క్రితం వలె వచ్చి, మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు మరియు శాంతిధామానికి యజమానులుగా చేస్తారు. తండ్రి అంటారు – గారాబాల పిల్లలూ, మీరు నా నుండి మీ వారసత్వాన్ని తీసుకుంటారు కదా! అప్పుడు పిల్లలందరూ – అవును బాబా, ఎందుకు తీసుకోము అని అంటారు. అచ్ఛా, చంద్రవంశీ రాముని పదవి పొందితే సంతృప్తి కలుగుతుందా? మీకేమి కావాలి? తండ్రి కానుక తీసుకొని వచ్చారు. మీరు సూర్యవంశీ లక్ష్మిని వరిస్తారా లేక చంద్రవంశీ సీతను వరిస్తారా? మీరు మీ ముఖాన్ని చూసుకోండి. శ్రీ నారాయణుడిని లేక శ్రీ లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా ఉన్నారా? యోగ్యులుగా అవ్వకుండా ఎలా వరించగలరు? ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – కల్పక్రితం ఎలాగైతే అర్థం చేయించారో, యథావిధిగా మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ వచ్చి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడమే మీ లక్ష్యం-ఉద్దేశ్యం. అది సూర్యవంశీ రాజ్య పదవి, సెకండ్ గ్రేడ్ చంద్రవంశీయులు. ఉదాహరణకు ఎయిర్ కండిషన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయి కదా. సత్యయుగ రాజధాని అంతా ఎయిర్ కండిషన్ అనుకోండి. ఎయిర్ కండిషన్ కన్నా ఉన్నతమైనది ఇంకేదీ ఉండదు. తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది. కావున ఇప్పుడు తండ్రి అంటారు – మీరు ఎయిర్ కండిషన్ సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకుంటారా లేక చంద్రవంశీ ఫస్ట్ క్లాస్ పదవిని తీసుకుంటారా? దాని కన్నా తక్కువగా అంటే సెకండ్ క్లాసులో నంబరువారుగా వారసులుగా అవ్వండి, అప్పుడు మీరు చివర్లో వచ్చి రాజ్యాన్ని పొందుతారు. లేదంటే థర్డ్ క్లాస్ ప్రజలుగా అవుతారు, వాళ్ళకు కూడా టికెట్ రిజర్వ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ రిజర్వ్, సెకండ్ క్లాస్ రిజర్వ్, ఇలా పదవులు నంబరువారుగా ఉంటాయి కదా. ఇకపోతే అక్కడ సుఖము ఎలాగూ ఉంటుంది. వేర్వేరు కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా. షావుకారు వ్యక్తి ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకుంటారు. మీలో షావుకార్లుగా ఎవరు అవుతారు? ఎవరైతే తమదంతా తండ్రికి ఇచ్చేస్తారో, వారు. బాబా, ఇదంతా మీదే అని అంటారు. భారత్ లోనే మహిమ గాయనం చేయబడింది – వ్యాపారస్థుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అనే ఈ మహిమ తండ్రిది, కృష్ణుడిది కాదు. కృష్ణుడైతే వారసత్వాన్ని తీసుకున్నారు, సత్యయుగంలో ప్రారబ్ధాన్ని పొందారు. అతను కూడా బాబాకు చెందినవారిగా అయ్యారు. ప్రారబ్ధాన్ని ఎక్కడో ఒక చోట నుండైతే పొంది ఉంటారు కదా. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. వీరు తప్పకుండా గతంలో ప్రారబ్ధాన్ని తయారుచేసుకొని ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. నెహ్రూ ప్రారబ్ధం ఎంత బాగుండేది, వారు తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. భారత్ కు కిరీటం లేని చక్రవర్తి వలె ఉండేవారు. భారత్ కు చాలా మహిమ ఉంది. భారత్ వంటి ఉన్నతమైన దేశం ఇంకేదీ ఉండదు. భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము. ఈ రహస్యం ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పరమాత్మయే అర్ధకల్పానికి అందరికీ సుఖ-శాంతులను ఇస్తారు. భారత్ యే నంబరువన్ తీర్థ స్థానము. కానీ డ్రామానుసారంగా ఒక్క తండ్రిని మర్చిపోవడంతో సృష్టి పరిస్థితి ఎలా అయిపోయింది, అందుకే శివబాబా మళ్ళీ వస్తారు. ఎవరో ఒకరు నిమిత్తులు అవుతారు కదా.
ఇప్పుడు తండ్రి అంటారు – అశరీరి భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైన నేను ఎవరి సంతానాన్ని అనేది ఎవరికీ తెలియదు. ఇది విచిత్రం కదా. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటారు కూడా. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారెప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. తండ్రియే వచ్చి కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. సత్యయుగం ఆయువు లక్షల సంవత్సరాలైతే కాదు. ఘోర అంధకారం ఉంది కదా. గీతోపదేశాన్ని ఎంతమంది వచ్చి వింటారు. కానీ చదివించేవారు గాని, చదువుకునేవారు గాని, ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సులభం చేసి అర్థం చేయిస్తారు, కేవలం తండ్రిని స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వండి. విష్ణువుకే అన్ని అలంకారాలను ఇచ్చారు, శంఖాన్ని కూడా ఇచ్చారు, పుష్పాన్ని కూడా ఇచ్చారు. వాస్తవానికి ఇవి దేవతలకు ఇవ్వడం జరగదు. ఇవి ఎంతటి గుహ్యమైన గంభీరమైన విషయాలు. వాస్తవానికి ఇవి బ్రాహ్మణుల అలంకారాలు. కానీ బ్రాహ్మణులకు ఎలా ఇవ్వాలి, నేడు బ్రాహ్మణులుగా ఉంటారు, రేపు శూద్రులుగా అయిపోతారు. బ్రహ్మాకుమారులే శూద్ర కుమారులుగా అయిపోతారు. మాయ ఆలస్యం చేయదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసారంటే, బాబా శ్రీమతాన్ని అనుసరించలేదంటే, బుద్ధి పాడైపోయిందంటే మాయ గట్టిగా చెంపదెబ్బ వేసి ముఖం తిప్పేస్తుంది. మనుష్యులు కోపంలో అంటూ ఉంటారు కదా – చెంపదెబ్బ వేసి ముఖం తిప్పేస్తాను అని. మాయ కూడా అలాంటిదే. తండ్రిని మర్చిపోయారంటే, మాయ ఒక్క సెకండులో చెంపదెబ్బ వేసి ముఖం తిప్పేస్తుంది. ఒక్క సెకండులో జీవన్ముక్తిని పొందుతారు, మాయ సెకండులో జీవన్ముక్తిని సమాప్తం చేసేస్తుంది. ఎంత మంచి-మంచి పిల్లలను మాయ పట్టుకుంటుంది. ఎక్కడైనా పొరపాటు చేస్తూ ఉండడం చూసిందంటే, వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి ముఖం తిప్పేస్తారు. పాత కుటీరంలో ఉండే నిరుపేద లౌకిక తండ్రి, కొత్త ఇంటిని నిర్మిస్తున్నప్పుడు, ఆ పిల్లల బుద్ధిలో కూర్చుండిపోతుంది – ఇప్పుడిక కొత్త ఇల్లు తయారవుతుంది, మేము వెళ్ళి అక్కడ ఉంటాము, ఈ పాత ఇంటిని పడగొట్టేస్తారు అని. ఇప్పుడు తండ్రి మీ కోసం అరచేతిలో బహిష్త్ ను అనగా వైకుంఠాన్ని తీసుకువచ్చారు. గారాబాల పిల్లలూ – అని అంటారు. ఆత్మలతో మాట్లాడుతారు. ఈ కళ్ళ ద్వారా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు – నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. డ్రామాలో లేకపోయినా సరే ఏమైనా చేయగలనని కాదు. పిల్లలు అనారోగ్యం పాలైతే, నేను సరి చేస్తానని కాదు. ఆపరేషన్ చేయడం నుండి తప్పిస్తానని కాదు. కర్మభోగాన్ని అయితే అందరూ అనుభవించాల్సిందే. మీపైనైతే చాలా భారం ఉంది ఎందుకంటే మీరు అందరికన్నా పాతవారు. సతోప్రధానం నుండి పూర్తి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు కనుక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కల్ప-కల్పము డ్రామానుసారంగా మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. ఎవరైతే సూర్యవంశానికి, చంద్రవంశానికి చెందినవారు ఉంటారో, వారు తప్పకుండా వస్తారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారే శూద్రులుగా అయిపోయారు. మళ్ళీ వారే బ్రాహ్మణులుగా అయ్యి, దైవీ సంప్రదాయులుగా అవుతారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఎవరూ అర్థం చేయించలేరు.
తండ్రికి పిల్లలైన మీరు ఎంత మధురంగా అనిపిస్తారు. మీరు నా ఆ కల్పక్రితపు పిల్లలే అని అంటారు. నేను కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. నిరాకార భగవానువాచ. శరీరం ద్వారానే మాట్లాడుతారు కదా. ఆత్మ శరీరం నుండి వేరైతే, ఇక మాట్లాడలేదు. ఆత్మ అతీతమైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు – అశరీరి భవ. దీని అర్థం ప్రాణాయామం మొదలైనవి చేయమని కాదు. నేను ఆత్మను, అవినాశీ అని భావించాలి. నా ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. తండ్రి స్వయంగా అంటారు – నా ఆత్మ కూడా ఏ పాత్రనైతే అభినయిస్తుందో, ఆ పాత్ర అంతా నాలో నిండి ఉంది. నా పాత్ర అక్కడ భక్తి మార్గంలోనూ నడుస్తుంది, మళ్ళీ జ్ఞాన మార్గంలో ఇక్కడకు వచ్చి జ్ఞానాన్ని ఇస్తాను. భక్తి మార్గం వారికి జ్ఞానం గురించి అసలు తెలియదు. మద్యం తాగనంతవరకు దాని రుచి గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది. అలాగే జ్ఞానాన్ని తీసుకున్నప్పుడే, దాని గురించి తెలుస్తుంది. జ్ఞానంతో సద్గతి కలుగుతుంది కనుక తప్పకుండా జ్ఞాన సాగరుడే సద్గతిని ఇవ్వగలరు. నేను సర్వుల సద్గతిదాతను అని తండ్రి అంటారు. సర్వోదయ లీడర్ ఉంటారు కదా, ఎన్ని రకాల వారు ఉంటారు. వాస్తవానికి సర్వులపై దయ చూపించేవారు తండ్రి. ఓ భగవంతుడా, దయ చూపించండి అని తండ్రితో అంటారు. కనుక అందరిపై దయ చూపించేవారు వారు, మిగిలినవారంతా హద్దు దయను చూపేవారు. తండ్రి అయితే మొత్తం ప్రపంచాన్ని సతోప్రధానంగా చేస్తారు. అప్పుడు తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. ఈ పని అయితే పరమాత్మదే. కనుక సర్వోదయ అన్న మాటకు ఎంత పెద్ద అర్థం ఉంది. అందరిపై పూర్తి దయను చూపిస్తారు. స్వర్గ స్థాపనలో ఎవరూ దుఃఖితులుగా అవ్వరు. అక్కడ నంబరువన్ ఫర్నీచర్, వైభవాలు మొదలైనవి లభిస్తాయి. దుఃఖాన్నిచ్చే జంతువులు, ఈగలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ కూడా, గొప్పవారి ఇళ్ళల్లో ఎంత శుభ్రత ఉంటుంది. అక్కడ మీరెప్పుడూ ఈగలను చూడరు, దోమలు మొదలైనవేవీ ప్రవేశించలేవు. స్వర్గంలోకి ప్రవేశించే శక్తి ఎవరికీ లేదు. అశుద్ధి చేసే వస్తువులేవీ ఉండవు. పుష్పాలు మొదలైనవాటి సహజ సుగంధం ఉంటుంది. సూక్ష్మవతనంలో బాబా మీకు శూబీ రసాన్ని తాగిస్తారు. వాస్తవానికి సూక్ష్మవతనంలోనైతే ఏమీ లేవు. అవన్నీ సాక్షాత్కారాలు. వైకుంఠంలో ఎంత మంచి-మంచి పుష్పాలు, తోటలు మొదలైనవి ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవి ఉండవు. అవన్నీ సాక్షాత్కారాలు. ఇక్కడ కూర్చొని ఉండగానే మీకు సాక్షాత్కారం కలుగుతుంది.
పాట కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. మీకు తండ్రి లభించారని మీకు తెలుసు, ఇంకేమి కావాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు కనుక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మతం ప్రసిద్ధమైనది. శ్రీమతం ద్వారా మనం శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అవుతాము. మిగిలినవారందరివీ ఆసురీ మతాలు. అందుకే సత్యయుగంలో సదా సుఖముండేదని వారికి తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. బాల్యంలో వారే రాధా-కృష్ణులు, వారి చరిత్ర మొదలైనవేవీ లేవు. స్వర్గంలోనైతే అందరు పిల్లలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటారు. అల్లరి అనే మాటే ఉండదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచం నుండి ముఖం తిప్పేసుకున్నప్పుడు, మళ్ళీ మాయ తన వైపుకు ముఖాన్ని తిప్పే విధంగా ఏ పొరపాటు చేయకూడదు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.
2. తండ్రికి తమదంతా స్వాహా చేసి పక్కా వారసులుగా అయి సత్యయుగీ ఎయిర్ కండిషన్ టికెట్ ను తీసుకోవాలి. లక్ష్యం-ఉద్దేశ్యాలను బుద్ధిలో ఉంచుకొని పురుషార్థం చేయాలి.
వరదానము:-
స్నేహీలు స్నేహంలో తమదంతా బలిహారం చేస్తారు అనగా అర్పణ చేస్తారు. స్నేహీలకు దేనినైనా సమర్పించేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కనుక ఏవైతే మర్యాదలు మరియు నియమాల గురించి వింటారో, వాటిని ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు అనగా సర్వ బలహీనతల నుండి ముక్తి పొందేందుకు సహజమైన యుక్తి – సదా ఒక్క తండ్రికి స్నేహీగా అవ్వండి. ఎవరికైతే స్నేహీలుగా ఉంటారో, నిరంతరం వారి సాంగత్యంలో ఉన్నట్లయితే ఆత్మికత యొక్క రంగు అంటుకుంటుంది మరియు ఒక్క సెకండులో మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు ఎందుకంటే స్నేహీకి తండ్రి సహయోగం స్వతహాగా లభిస్తుంది.
స్లోగన్:-
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు – మనుష్య-లోకం, దేవ-లోకం, భూత-ప్రేతాల ప్రపంచం యొక్క విస్తారము
చాలా మంది మనుష్యులు ప్రశ్నిస్తారు – అశుద్ధ జీవాత్మలు, వేటినైతే భూతాలని అంటారో, అవి నిజంగా ఉన్నాయా లేక ఊహనా? లేదా కేవలం అనుమానమా? దీని గురించి ఈ రోజు స్పష్టంగా అర్థం చేయించబడుతుంది – మనుష్యాత్మలు వికర్మలు చేసినప్పుడు, వారికి తప్పకుండా అనేక రకాలుగా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది, అది కూడా మనుష్య జన్మలోనే అనుభవించవలసి ఉంటుంది, అంతేకానీ జంతువులు, పశు పక్ష్యాదుల యోనులలో కాదు. మనుష్యులు మనుష్యులుగానే అవుతారు. మనుష్యాత్మ వేరు మరియు జంతువు ఆత్మ వేరు. మనిషి ఎప్పుడూ జంతువుగా అవ్వడు, అలాగే జంతువు ఎప్పుడూ మనిషిగా అవ్వలేదు. వాటి ప్రపంచం వాటిది, ఈ మనుష్యాత్మల ప్రపంచం మనది. సుఖ-దుఃఖాలను అనుభవించే శక్తి మనుష్యులలో ఎక్కువ ఉంది, జంతువులలో కాదు. మనం శుద్ధ కర్మలు చేసినప్పుడు, ఆ సుఖాన్ని కూడా మనుష్య తనువులోనే పొందుతాము, కనుక దుఃఖాన్ని కూడా తప్పకుండా మనుష్య తనువులోకే వచ్చి అనుభవించాలి. మరియు ఈ జ్ఞానాన్ని వినే బుద్ధి కూడా మనుష్య తనువులోనే ఉంటుంది, జంతువులలో ఉండదు. కనుక ఈ సృష్టి ఆటలో ముఖ్యమైన పాత్ర మనుష్యులదే. ఈ జంతువులు పక్షులు మొదలైనవి ఈ సృష్టి డ్రామాకు శోభ వంటివి. మొత్తం కల్పంలో, సత్యయుగం ఆది నుండి కలియుగాంతం వరకు మనుష్యాత్మలకు 84 జన్మలుంటాయి. ఇకపోతే ఈ 84 లక్షలు అనే మాట జంతువులు, పక్షులు మొదలైనవాటి వెరైటీలు కావచ్చు. ఇప్పుడు ఈ రహస్యాలన్నింటినీ పరమాత్మ తప్ప ఎవరూ అర్థం చేయించలేరు. ఆత్మల నివాస స్థానం బ్రహ్మ తత్వము అనగా నిరాకారీ ప్రపంచము. ఇకపోతే ఈ జంతువుల ఆత్మలు బ్రహ్మ తత్వంలోకి వెళ్ళలేవు. అవి ఈ ఆకాశ తత్వంలోనే పాత్రను అభినయిస్తాయి. వాటికి కూడా మర్జ్, ఇమర్జ్ పాత్ర మరియు సతో, రజో, తమోలలోకి వచ్చే పాత్ర ఉంటుంది. అందుకే మనం ప్రకృతి గురించి చాలా విస్తారంలోకి వెళ్ళకుండా, ముందు మన ఆత్మ కళ్యాణం చేసుకోవాలి అనగా మన్మనాభవ. ఇప్పుడు మనుష్యాత్మల గురించి తెలుసుకుందాము. ఏ ఆత్మలైతే అశుద్ధ కర్మలు చేయడంతో వికర్మలు తయారుచేసుకుంటారో, వారు తమ అశుద్ధ సంస్కారాలనుసారంగా జనన-మరణ చక్రంలోకి వచ్చి, ఆదిమధ్యాంతాలు అనగా మరణించే సమయం వరకు తాము చేసిన వికర్మల సాక్షాత్కారం పొంది, సూక్ష్మంగా శిక్షలు అనుభవిస్తారు. ఈ కొద్ది సమయంలో అనేక జన్మల దుఃఖం అనుభవమవుతుంది, తర్వాత శరీరాన్ని వదిలి గర్భ జైలులో దుఃఖం అనుభవిస్తారు. తర్వాత సంస్కారాలనుసారంగా అటువంటి తల్లిదండ్రుల వద్ద జన్మ తీసుకొని, అక్కడ కూడా తమ జీవితంలో సుఖ-దుఃఖాలను అనుభవిస్తారు. దీనినే ఆదిమధ్యాంతము అని అంటారు. కానీ కొన్ని ఆత్మలు శరీరాన్ని ధరించకుండా ఆకారీ రూపంలో ఈ ఆకాశ తత్వంలో భూతాలుగా అయి భ్రమిస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక శిక్ష అనగా అనుభవించడము. ఆ అశుద్ధ జీవాత్మతో ఎవరికైనా లెక్కాచారమున్నట్లయితే, అది వారిలో ప్రవేశించి వారికి దుఃఖాన్నిస్తుంది, అనగా లెక్కాచారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళి తన శరీరాన్ని ధారణ చేస్తుంది. కొన్ని జీవాత్మలైతే, ఎవరిలోనైతే ప్రవేశిస్తాయో, వారిని చాలా కొడతాయి కూడా, చాలా కష్టం కలిగిస్తాయి. కానీ ఇదంతా లెక్కాచారాలలో శిక్షలు అనుభవించే ఒక విధానము. కావున అందరికీ మనుష్య తనువులోనే సుఖ-దుఃఖాలు అనుభవమవుతాయి. ఈ విషయం మీకు అర్థం చేయించడం జరిగింది – ఏ ఆత్మ అయితే ముక్తిధామం నుండి ఈ సాకారీ ఆటలోకి వస్తుందో, అది మధ్యలో తిరిగి ముక్తిధామానికి వెళ్ళలేదు. కానీ తాను చేసుకున్న అశుద్ధ, శుద్ధ కర్మలనుసారంగా, సంస్కారాలను తీసుకొని సుఖ-దుఃఖాల చక్రంలోకి వస్తుంది. ఆత్మలన్నింటికీ పునర్జన్మలుంటాయి, కేవలం ఒక్క పరమాత్మకు మాత్రం ఉండవు. అచ్ఛా. ఓం శాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!