11 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris

10 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన రాజయోగులు, మిమ్మల్ని రాజఋషులని కూడా అంటారు, రాజఋషులంటేనే పవిత్రమైనవారు”

ప్రశ్న: -

పిల్లలైన మీరు, మనుష్యులను మాయా రూపీ రావణుని ఊబి నుండి ఎప్పుడు బయటకు తీయగలరు?

జవాబు:-

ఎప్పుడైతే స్వయం మీరు ఆ ఊబి నుండి బయటపడతారో, అప్పుడే బయటకు తీయగలరు. ఊబి నుండి బయటపడిన వారి గుర్తు ఏమిటంటే, వారు ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటారు, ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాదు. మంచి వస్త్రాలు ధరించాలి, మంచి పదార్థాలు తినాలి….. అనేటువంటి లోభం ఉండకూడదు. మీరు పూర్తిగా వనవాహంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయారు. నాదంటూ ఏమీ లేదు, నేను ఒక ఆత్మను….. ఇటువంటి ఆత్మాభిమానులైన పిల్లలే, రావణుని ఊబి నుండి మనుష్యులను బయటకు తీయగలరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు….. (తూ ప్యార్ కా సాగర్ హై…..)

ఓంశాంతి. అప్పుడప్పుడు పాట వేసినప్పుడు, పిల్లలను పాట అర్థాన్ని కూడా అడిగేవారు. ఇప్పుడు చెప్పండి – మీరు ఎప్పటి నుండి మార్గాన్ని మర్చిపోయారు? (కొందరు ద్వాపరం నుండి అని చెప్పారు, కొందరు సత్యయుగం నుండి అని చెప్పారు) ద్వాపరం నుండి మార్గాన్ని మర్చిపోయామని ఎవరైతే చెప్పారో, వారు రాంగ్. సత్యయుగం నుండి మార్గాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీకు మార్గాన్ని తెలియజేసేవారు లభించారు. సత్యయుగంలో మార్గాన్ని తెలియజేసే తండ్రి గురించి తెలియదు. అక్కడ ఎవరికీ తండ్రి గురించి తెలియదు, అంటే వారిని మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్గాన్ని తెలియజేసేందుకు వారు వచ్చారు. ప్రభూ, మార్గాన్ని తెలియజేయండి అని అంటారు కదా. మనం సత్యయుగం మొదలైనప్పటి నుండి తండ్రిని మర్చిపోయాము. పిల్లల బుద్ధిని నడిపించేందుకు బాబా ప్రశ్నలు అడుగుతారు. ఈ జ్ఞానము ప్రత్యేకమైనది కదా, జ్ఞాన సాగరుడు తండ్రి మాత్రమే. తండ్రి సమ్ముఖంగా అర్థం చేయిస్తారు – నేనే జ్ఞాన సాగరుడను, సుఖ సాగరుడను. తప్పకుండా పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమేనని మీకు కూడా తెలుసు. ఈ విషయాన్ని భక్తి మార్గం వారు కూడా నమ్ముతారు. పావన ప్రపంచాలు అంటేనే శాంతిధామం మరియు సుఖధామం. సుఖధామం మరియు దుఃఖధామం, రెండూ సగం-సగం ఉంటాయి. ఈ విషయం పిల్లలకు మంచి రీతిగా తెలుసు. తండ్రి ప్రేమ సాగరుడు, అందుకే అందరూ వారిని ఫాదర్ అని పిలుస్తారు కానీ వారెవరు, ఎలా వస్తారు అనేది మర్చిపోతారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయం, తప్పకుండా ఈ దేవీ-దేవతల రాజ్యముండేది. సత్యయుగంలో సద్గతి ఉంటుంది, మరి దుర్గతి ఎలా జరుగుతుంది అనేది ఎవరు చెప్తారు. ద్వాపరం నుండి మీ దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు అని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి కల్ప-కల్పము వస్తారు. ఇప్పుడు నిరాకార తండ్రి, ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎవరికీ తమ ఆత్మ గురించి తెలియదు. నా ఆత్మలో మొత్తం పాత్ర అంతా నిండి ఉందని ఎప్పుడూ ఎవరూ అనరు. నేను అనేక సార్లు ఈ విధంగా తయారై, పాత్రను అభినయించానని ఎప్పుడూ అనరు. వారికి డ్రామా గురించి అసలు తెలియదు. లక్షల, వేల సంవత్సరాలని చెప్పినా కూడా, ఇది డ్రామాయే అవుతుంది కదా. డ్రామా రిపీట్ అవుతుంది అనైతే అంటారు కదా. ఈ జ్ఞానాన్ని తండ్రియే పిల్లలకు సమ్ముఖంగా ఇస్తారు. వారు నోటి ద్వారా మాట్లాడుతున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా మమ్మల్ని తమవారిగా చేసుకొని, బ్రాహ్మణులుగా చేసారని మీకు తెలుసు. వీరు (బ్రహ్మా) శివబాబాకు కొడుకు కూడా, పత్ని కూడా. ఎంతమంది పిల్లలను సంభాళించడం జరుగుతుందో చూడండి. పురుషుడు ఒక్కరే ఉన్న కారణంగా, పిల్లలను సంభాళించమని సరస్వతిని సహాయకులుగా చేసారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఇవి ప్రాక్టికల్ విషయాలు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు, ఎవరికైతే రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు, 84 జన్మలలోకి వచ్చారు. బైబిల్, ఖురాన్, వేద-శాస్త్రాలు మొదలైనవాటిని చాలామంది చదువుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు తత్వయోగులేమీ కారు. మీకు తండ్రితో యోగం ఉంది అనగా తండ్రి స్మృతి ఉంది. మీరిప్పుడు రాజయోగులు, రాజఋషులు అనగా యోగీ రాజ్. పవిత్రమైనవారిని యోగులని అంటారు. మీరు స్వర్గ రాజ్యాన్ని తీసుకునేందుకు యోగులుగా అయ్యారు. తండ్రి మొట్టమొదటగా, పవిత్రంగా అవ్వండి అని చెప్తారు. పవిత్రమైనవారికే యోగి అన్న పేరు ఉంటుంది. మీరందరూ రాజయోగులు. ఇది బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు సంబంధించిన విషయము. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కనుక మీరు విద్యార్థులైనట్లే కదా. విద్యార్థులు టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. కానీ మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. మీరు మిమ్మల్ని చదివించే టీచరును మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారని అర్థం చేసుకున్నప్పుడే నషా ఎక్కుతుంది. స్కూల్లో ఐ.సి.యస్ చదువుకునేటప్పుడు ఎంత నషా ఉంటుంది. పిల్లలైన మీరు 21 జన్మల కోసం ఈ రాజయోగ చదువును చదువుకుంటారు. మళ్ళీ స్వర్గంలో కూడా చదువుకోవాల్సి ఉంటుంది. రాజవిద్యను కూడా చదువుకోవాల్సి ఉంటుంది, భాష మొదలైనవి నేర్చుకోవాల్సి ఉంటుంది.

మనం సత్యయుగం నుండి ఈ మార్గాన్ని మర్చిపోతామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతారు. మనం ఎలా ఎక్కుతాము, ఎలా దిగుతాము అనేది ఇప్పుడు మీకు అంతా గుర్తుంది. ఈ మెట్ల వరుసను బాగా గుర్తుంచుకోండి. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మనం వెళ్ళాలి కావున సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఎంత చిన్నది. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ ఆత్మ అలసిపోతుంది. అప్పుడు, బాబా, మార్గాన్ని తెలియజేసినట్లయితే మేము విశ్రాంతి పొందుతాము, సుఖ-శాంతులను పొందుతాము అని అంటారు. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు, మీ కోసం అక్కడ సుఖ-శాంతులు కూడా ఉంటాయి. అక్కడ హంగామాలేవీ ఉండవు. ఆత్మకు శాంతి ఉంటుంది. శాంతికి సంబంధించిన స్థానాలు రెండు – శాంతిధామము మరియు సుఖధామము. దుఃఖధామంలో అశాంతి ఉంటుంది. ఇది చదువు, బాబా మనల్ని వయా శాంతిధామం, సుఖధామానికి తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చామని, మళ్ళీ వెళ్ళాలని మీకు తెలుసు. మీకు ఈ సంతోషం ఉంటుంది. శాంతి గురించి సంతోషం ఉండదు. పాత్రను అభినయించడంలో మనకు మజా వస్తుంది, సంతోషం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవుతాయని మనకు తెలుసు. మాకు మనశ్శాంతి కావాలి అని కొంతమంది అంటారు. ఈ మాట రాంగ్. మనం వికర్మలు వినాశనమవ్వాలని తండ్రిని స్మృతి చేస్తాము. మనస్సు శాంతిగా ఉండలేదు, ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు. ఇకపోతే, మేము తండ్రి నుండి పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వాన్ని తీసుకుంటున్నామని రియలైజ్ అవుతారు కనుక ఆ సంతోషం ఉండాలి. ఇది దుఃఖధామం, ఇక్కడ సుఖముండదు. మనుష్యులు శాంతిధామాన్ని, సుఖధామాన్ని మర్చిపోయారు. అందుకే, ఎవరి వద్దనైతే చాలా ధనముందో, వారు మేము సుఖంగా ఉన్నామని భావిస్తారు. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్తారు, అక్కడ హంగామాలేవీ ఉండవు కనుక వారు శాంతిగా అయిపోతారు కానీ అది అల్పకాలానికే జరుగుతుంది. ఆత్మ స్వధర్మము శాంతి, అందులో స్థితులైనప్పుడు మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడైతే ప్రవృత్తిలోకి రావాల్సిందే, పాత్రను అభినయించాల్సిందే. ఇక్కడకు కర్మలు చేసేందుకే వస్తారు. ఆత్మకు తప్పకుండా కర్మలోకి రావాల్సి ఉంటుంది. ఈ వివరణ అనంతమైన తండ్రి ఇస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. నిరాకార భగవానువాచ – నేను ఒక ఆత్మను, నా తండ్రి పరమ ఆత్మ అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఆత్మ వారిని పిలుస్తుంది. ఆ తండ్రియే సర్వుల సద్గతిదాత. ఇప్పుడు తండ్రి అంటారు – పిల్లలూ, దేహీ అభిమానులుగా అవ్వండి, ఇదే శ్రమ. అర్ధకల్పం నుండి ఏదైతే మాలిన్యం చేరుకుందో, అది ఈ స్మృతితోనే తొలగుతుంది. మీరు సత్యమైన బంగారంగా అవ్వాలి. ఎలాగైతే సత్యమైన బంగారంలో మాలిన్యాన్ని కలిపిన తర్వాత ఆభరణాలను తయారుచేస్తారో, అలా వాస్తవానికి మీరు సత్యమైన బంగారంగా ఉండేవారు, తర్వాత మీలో మాలిన్యం చేరుకుంటుంది. మేము పాత్రను అభినయించామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం పుట్టింటికి వెళ్తాము. విదేశాల నుండి పుట్టింటికి తిరిగి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాగే, మీకు కూడా సంతోషంగా ఉంది, బాబా మా కోసం స్వర్గాన్ని తీసుకువచ్చారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఇచ్చే కానుక – అనంతమైన రాజ్యాధికారం అనగా సద్గతి. సన్యాసులు, ముక్తి యొక్క కానుకను ఇష్టపడతారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా స్వర్గస్థులయ్యారని అంటారు. సన్యాసులు, జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని, ఆత్మలన్నీ అందులోనే కలిసిపోతాయని అంటారు. కానీ అది ఆత్మలైన మనం నివసించే స్థానము, అంతేకానీ, అందులో అందరూ కలిసిపోయేందుకు ఆ స్థానమేమీ జ్యోతి లేక అగ్ని కాదు. అది బ్రహ్మ మహాతత్వము, అక్కడ ఆత్మలుంటాయి. తండ్రి కూడా అక్కడ ఉంటారు. వారు కూడా బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోలేరు. చాలామంది పిల్లలంటారు – బాబా, స్మృతి చేయడం కష్టమనిపిస్తుంది, బిందు రూపాన్ని ఎలా స్మృతి చేయాలి, అర్ధకల్పంగా పెద్ద లింగం రూపాన్ని స్మృతి చేసాము. తండ్రి అర్థం చేయిస్తారు – బిందువుకైతే పూజ జరగదు, బిందువుకు మందిరం ఎలా నిర్మిస్తారు, బిందువైతే కనిపించను కూడా కనిపించదు, అందుకే పెద్ద శివలింగాన్ని తయారుచేస్తారు. ఇకపోతే, ఆత్మలకు గుర్తుగా సాలిగ్రామాలనైతే చాలా చిన్న-చిన్నవిగా తయారుచేస్తారు. వాటిని అండాకారంలో తయారుచేస్తారు. పరమాత్మ బిందువు వలె ఉంటారని ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. ఆ సమయంలో ఈ మాట చెప్పే పాత్రయే లేదని తండ్రి అంటారు. అరే, మీరు ఐ.సి.యస్ ను, ముందు నుండే ఎందుకు చదువుకోరు? చదువుకు కూడా నియమాలున్నాయి కదా. ఎవరైనా ఇటువంటి విషయాలను అడిగితే, మీరిలా చెప్పవచ్చు – అచ్ఛా, బాబాను అడుగుతాము లేదా మా కన్నా పెద్ద టీచరున్నారు, వారికి రాసి అడుగుతామని చెప్పండి. బాబాకు చెప్పవలసి ఉంటే చెప్తారు లేదా మున్ముందు అర్థం చేసుకుంటారులే అని అంటారు. ఒకేసారి అన్ని వినిపించరు. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేద శాస్త్రాలలో ఏముంది అన్న సారాన్ని తండ్రి కూర్చుని తెలియజేస్తారు. ఇవి కూడా భక్తి మార్గంలో నిశ్చయించబడి ఉన్నాయి, మీరు వాటిని మళ్ళీ చదవాల్సి ఉంటుంది, ఈ భక్తి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాలి. భక్తి యొక్క ఊబిలో చిక్కుకుపోయారని బాబా అంటారు, భక్తి బాహ్యంగా చాలా సుందరంగా ఉంటుంది. ఎండమావులను ఉదాహరణగా చెప్తారు. భక్తి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఎండమావుల వంటిదని తండ్రి అంటారు. ఆ ఊబిలో చిక్కుకుపోతారు. ఇక బయటకు రావడం కష్టమైపోతుంది, పూర్తిగా చిక్కుకుపోతారు. ఇతరులను బయటకు తీసేందుకు వెళ్తారు కానీ వారే స్వయం చిక్కుకుపోతారు. ఈ విధంగా చాలామంది చిక్కుకుపోయారు, ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, ఇతరులను బయటకు తీస్తారు, నడుస్తూ-నడుస్తూ మళ్ళీ స్వయం చిక్కుకుపోతారు. ఎంత మంచి-మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలుండేవారు. అటువంటివారిని బయటకు తీయడం చాలా కష్టమైపోతుంది. తండ్రిని మర్చిపోతే వారిని ఊబి నుండి బయటకు తీయడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. ఎంత అర్థం చేయించినా సరే, బుద్ధిలో కూర్చోదు. మీరు మాయ రూపీ రావణుని ఊబి నుండి ఎంత బయటపడ్డారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఎంతెంతగా బయటకొస్తూ ఉంటారో, అంత సంతోషం కలుగుతుంది. ఎవరైతే స్వయం బయటపడ్డారో, వారి వద్ద ఇతరులను బయటకు తీసే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారిలో కొందరు చురుకుగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుడి ఉదాహరణ కూడా ఉంది కదా. అర్జునుడు గురువుతో పాటు ఉండేవారు. అర్జునుడు అంటే ఒక్కరు కాదు, ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి, తండ్రితో పాటు ఉంటారో, వారిని అర్జునుడు అని అంటారు. తోడుగా ఉండేవారికి మరియు బయట ఉండేవారికి మధ్యన రేస్ పెట్టడం జరుగుతుంది. ఏకలవ్యుడు అనగా బయట ఉండేవారు, చురుకుగా ముందుకు వెళ్ళిపోయారు. ఉదాహరణగా ఒక్కరి గురించి చెప్పడం జరుగుతుంది కానీ ఇది అనేకులకు సంబంధించిన విషయము. బాణమనగా ఈ జ్ఞానము. ప్రతి ఒక్కరు తమను తాము అర్థం చేసుకోగలరు – నేను ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఇంకెవరి స్మృతి రావడం లేదు కదా, మంచి వస్త్రాలు ధరించాలని గాని, మంచి పదార్థాలు తినాలని గాని లోభమైతే కలగడం లేదు కదా! ఇక్కడ మంచివి ధరించినట్లయితే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ మనం వనవాహంలో ఉండాలి. మీరు మీ శరీరాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటారు. ఇది పాత తమోప్రధాన శరీరము. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉండాలి.

ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవాటిని కూడా ధరించకండి అని తండ్రి అంటారు. ఇలా ఎందుకంటారు? దీనికి కూడా అనేక కారణాలున్నాయి. ఎవరి ఆభరణాలైనా పోతే, అక్కడ బి.కె.లకు ఇచ్చి వచ్చారని అంటారు లేదా మార్గంలో వెళ్ళేటప్పుడు దొంగలు కూడా దోచుకుంటారు. ఈ రోజుల్లో స్త్రీలలో కూడా దొంగతనాలు చేసేవారు చాలామంది వెలువడ్డారు. స్త్రీలు కూడా దోపిడీలు చేస్తున్నారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి? ఈ ప్రపంచం పూర్తిగా వేశ్యాలయంగా ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం శివబాబాతో పాటు శివాలయంలో కూర్చున్నాము. వారు సత్యము, చైతన్యము, ఆనంద స్వరూపుడు. మహిమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంటు అయ్యాను, నేను ఫలానా అని ఆత్మయే అంటుంది. మేము బ్రాహ్మణులమని, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీ ఆత్మ అంటుంది. ఆత్మాభిమానిగా ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. వారు నాకు ఫలానా, ఇది నాది….. ఇవన్నీ గుర్తుంటాయి. ఆత్మలైన మనం పరస్పరంలో సోదరులము అనేది మర్చిపోతారు. ఈ నాది-నాది అనేది వదలాల్సి ఉంటుంది. నేను ఒక ఆత్మను, వీరి (బ్రహ్మా) ఆత్మకు కూడా తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను కూడా వింటూ ఉంటాను. నేనే ముందు వింటాను, నేను కూడా వినిపించగలను కానీ పిల్లల కళ్యాణార్థము చెప్తాను – మీరు సదా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. విచార సాగర మథనం చేయడం పిల్లల పని. మీరు ఏదైతే చేస్తారో, అది నేను కూడా చేస్తాను. లేదంటే మొదటి నంబరులోకి ఎలా వెళ్ళగలను. కాకపోతే వారు స్వయాన్ని గుప్తంగా ఉంచుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నాది-నాది అన్నదంతా వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మాభిమానులుగా ఉండే శ్రమను చేయాలి. ఇక్కడ పూర్తిగా వనవాహంలో ఉండాలి. ఏదైనా ధరించాలి, తినాలి అనేటువంటి కోరికల విషయంలో ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి.

2. పాత్రను అభినయిస్తూ, కర్మలు చేస్తూ తమ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి.

వరదానము:-

ఎవరైతే ప్రతి వస్తువును పూర్తిగా సంభాళిస్తారో, వారిని సంపూర్ణ నమ్మకస్థులని అంటారు. వారు ఏ వస్తువునూ వ్యర్థంగా పోనివ్వరు. జన్మ తీసుకున్నప్పటి నుండి సంకల్పం, సమయం మరియు కర్మ, అన్నీ ఈశ్వరీయ సేవార్థమే ఉండాలి. ఒకవేళ ఈశ్వరీయ సేవకు బదులుగా, ఇంకెటువైపైనా సంకల్పం లేక సమయం వెళ్ళినట్లయితే, వ్యర్థమైన మాటలు వెలువడినట్లయితే లేదా తనువు ద్వారా వ్యర్థ కార్యం జరిగినట్లయితే, వారిని సంపూర్ణ నమ్మకస్థులని అనరు. ఒక్క సెకండు లేదా ఒక్క పైసా వ్యర్థంగా పోతే అదేమంత పెద్ద విషయము అని అనుకోకూడదు. సంపూర్ణ నమ్మకస్థులనగా అంతా సఫలం చేసుకునేవారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top