08 June 2021 TELUGU Murli Today – Brahma Kumari

7 June 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన తెలివైన పిల్లలూ - నేను ఒక అవినాశీ ఆత్మనని, నేనిప్పుడు తండ్రితో పాటు మొదటి అంతస్థులోకి వెళ్ళాలని సదా గుర్తుంచుకోండి”

ప్రశ్న: -

ఏ శ్రమను పిల్లలైన మీలో ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి?

జవాబు:-

బాబా మీకు ఇచ్చే ఈ నాలెడ్జ్ అంతటినీ మీ హృదయంలో పెట్టుకోండి. దానిని లోలోపల మననం చేస్తూ జీర్ణం చేసుకోండి, అప్పుడు శక్తి లభిస్తుంది. ఈ శ్రమను ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి. ఎవరైతే ఇటువంటి గుప్తమైన శ్రమ చేస్తారో, వారు సదా హర్షితంగా ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు, మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అనే నషా వారికి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఎవరు చెప్పారు? ఓం శాంతి, ఓం శాంతి అని రెండు సార్లు చెప్తారు. ఒకసారి శివబాబా చెప్పారు, ఇంకొకసారి బ్రహ్మాబాబా చెప్పారు. ఈ బాప్ దాదాలు కలిసి ఉన్నారు. కావున ఓం శాంతి, ఓం శాంతి అని ఇరువురూ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు ఎవరు చెప్పారు, తర్వాత ఎవరు చెప్పారు? ముందుగా శివబాబా, ఓం శాంతి, నేను శాంతి సాగరుడను అని చెప్పారు. తర్వాత ఎవరు చెప్పారు? దాదా ఆత్మ చెప్పారు. పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు – ఓం శాంతి, నేను సదా దేహీ-అభిమానిగా ఉంటాను, ఎప్పుడూ దేహాభిమానంలోకి రాను అని. ఒక్క తండ్రి మాత్రమే సదా దేహీ-అభిమానిగా ఉంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు ఇలా చెప్పరు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా సూక్ష్మ రూపం ఉంటుందని మీకు తెలుసు. కావున ఓం శాంతి అని చెప్పేవారు శివబాబా ఒక్కరే, వారికి శరీరమంటూ ఏదీ లేదు. తండ్రి మీకు మంచి రీతిగా అర్థం చేయిస్తారు మరియు తండ్రి అంటారు – నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను సదా దేహీ-అభిమానిగా ఉంటాను. నేను పునర్జన్మలలోకి రాను, అందుకే నా మహిమయే అతీతమైనది. నన్ను నిరాకార పరమపిత పరమాత్మ అని అంటారు. భక్తి మార్గంలో కూడా శివుడిని, నిరాకార పరమపిత పరమాత్మ అని అంటారు. నిరాకారునికి పూజ జరుగుతుంది. వారెప్పుడూ దేహంలోకి రారు అనగా దేహాభిమానిగా అవ్వరు. అచ్ఛా, అక్కడి నుండి కిందకు సూక్ష్మవతనానికి రండి, అక్కడ బ్రహ్మా-విష్ణు-శంకరులుంటారు. శివుని నామ-రూపాలు కంటికి కనిపించవు. వారి చిత్రాలు తయారవుతాయి కానీ వారు నిరాకారుడు, వారెప్పుడూ సాకారునిగా అవ్వరు. పూజ కూడా నిరాకారునికే జరుగుతుంది. పిల్లల బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది. భక్తి అయితే చేసారు. పిల్లలు చిత్రాలను చూసారు. సత్య-త్రేతా యుగాలలో చిత్రాలకు భక్తి జరగదు, అలాగే విచిత్రుడికి భక్తి జరగదని పిల్లలకు తెలుసు. పరమపిత పరమాత్మ విచిత్రుడని బుద్ధిలోకి వస్తుంది. వారికి సూక్ష్మ చిత్రము ఉండదు, స్థూల చిత్రము ఉండదు. దుఃఖహర్త-సుఖకర్త, పతితపావనా అని వారి మహిమను పాడుతారు. మీరు ఇంకెవరి చిత్రాన్నీ పతితపావనా అని అనరు. ఈ విషయాలు బుద్ధిలో ఉన్నటువంటి మనుష్యులెవరూ లేవు. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనవాసులు. మొదటి అంతస్థు, ఆ తర్వాత రెండవ అంతస్థు ఉంటాయి. ఉన్నతాతి ఉన్నతమైనది మూలవతనము, ఆ అంతస్థులో ఉండేవారు పరమపిత పరమాత్మ. సెకండు నంబరు అంతస్థులో సూక్ష్మ శరీరధారులుంటారు. మూడవ అంతస్థులో స్థూల శరీరధారులుంటారు, ఇందులో తికమకపడకూడదు. ఈ విషయాలు పరమపిత పరమాత్మ తప్ప ఎవరూ అర్థం చేయించలేరు. పైన ఆత్మల సృష్టి ఉంది, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. ఆత్మలైన మనందరి ప్రపంచము నిరాకారీ ప్రపంచము. తర్వాత ఆత్మలైన మనం సాకారీ ప్రపంచంలోకి వస్తాము. అక్కడ ఆత్మలుంటాయి, ఇక్కడ జీవాత్మలుంటారు. ఈ విషయం బుద్ధిలో ఉండాలి. వాస్తవానికి మనం నిరాకారీ బాబాకు పిల్లలము. మనం కూడా ముందు నిరాకార తండ్రి వద్ద ఉండేవారము. ఆత్మలు నిరాకారీ ప్రపంచంలోనే ఉంటాయి. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఇప్పటికీ సాకారంలోకి వస్తూ ఉంటాయి. అది నిరాకార తండ్రి నివసించే వతనము. నేను ఒక ఆత్మను అనే నషా ఉండాలి. అవినాశీ వస్తువు యొక్క నషా ఉండాలి, వినాశీ వస్తువుల నషా ఉండకూడదు. దేహం యొక్క నషా కలవారిని దేహాభిమానులని అంటారు. దేహాభిమానులు మంచివారా లేక ఆత్మాభిమానులు మంచివారా? వివేకవంతులు ఎవరు? ఆత్మాభిమానులు. ఆత్మయే అవినాశీ, దేహమైతే వినాశీ. నేను 84 దేహాలు తీసుకుంటానని ఆత్మ అంటుంది. ఆత్మలైన మనం పరంధామంలో తండ్రితో పాటు ఉండేవారము. అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఓ బాబా, అని ఆత్మ అంటుంది. సాకార సృష్టిలో సాకార బాబా ఉంటారు. నిరాకార సృష్టిలో నిరాకార బాబా ఉంటారు. ఇది పూర్తిగా సహజమైన విషయము. ఇప్పుడు బ్రహ్మాను ప్రజాపిత బ్రహ్మా అని అంటారు. వారు ఇక్కడే ఉన్నారు కదా. అక్కడ ఆత్మలైన మనమందరము ఒక్క తండ్రి పిల్లలము, సోదరులము. తండ్రి అయిన శివునితో పాటు ఉండేవారము. పరమాత్ముని పేరు శివ. ఆత్మ పేరు సాలిగ్రామము. ఆత్మకు కూడా రచయిత ఉండాలి కదా. మనస్సులో సదా మాట్లాడుకుంటూ ఉండండి. ఏ జ్ఞానమైతే లభించిందో, దానిని తమ హృదయంలో పెట్టుకోవడానికి శ్రమించండి. ఆత్మయే ఆలోచిస్తుంది. మొట్టమొదట ఆత్మనైన నేను తండ్రితో పాటు ఉండేవాడినని నిశ్చయం చేసుకోండి. మనం వారి పిల్లలము కనుక తప్పకుండా వారసత్వం లభించాలి. ఈ ఆత్మల వృక్షం ఏదైతే ఉందో, దానికి తప్పకుండా బీజం ముందు ఉంటుందని కూడా మీకు తెలుసు. వంశ వృక్షాన్ని తయారుచేస్తారు కదా. తండ్రి పెద్దవారు, తర్వాత వారి నుండి 2-4 మంది పిల్లలు వస్తారు, ఆ పిల్లల నుండి మళ్ళీ ఇంకా వస్తారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వృద్ధి చెందుతూ-చెందుతూ వృక్షం పెద్దదవుతుంది. ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు….. అని వంశం యొక్క మ్యాప్ ఉంటుంది.

మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఆ చిత్రం కూడా ఉంది. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. బాబా ఈ శరీరంలోకి వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మిక తండ్రి వీరిలోకి వచ్చి ఆత్మలను చదివిస్తారు. సూక్ష్మవతనంలో చదివించరు. సత్యయుగంలో ఈ నాలెడ్జ్ ఎవరికీ ఉండదు. తండ్రియే ఈ సంగమయుగంలో వచ్చి ఈ నాలెడ్జ్ ను ఇస్తారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క నాలెడ్జ్ ఎవరికీ లేదు. కల్పం ఆయువును చాలా ఎక్కువగా రాసేసారు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఇప్పుడిక మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అది ఆత్మల ఇల్లు. అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు, అందరూ సోదరులు. ఇక్కడ శరీరాన్ని ధారణ చేసినప్పుడు, బ్రదర్ మరియు సిస్టర్ అని అంటారు. ఆత్మలైన మనమందరం పరస్పరంలో సోదరులము. సోదరునికి తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. వారు పరమపిత పరమాత్మ. ఆత్మలందరూ శరీరంలో ఉంటూ వారిని స్మృతి చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో ఎవరూ స్మృతి చేయరు. పతిత ప్రపంచంలో అందరూ వారిని స్మృతి చేస్తారు ఎందుకంటే అందరూ రావణుని జైలులో ఉన్నారు. ఓ రామా, అని సీత పిలుస్తూ ఉండేది. రాముడంటే త్రేతాయుగపు రాముడేమీ గుర్తు రారని తండ్రి అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మను రామునిగా భావిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆత్మ పిలుస్తుంది. ఇక అర్ధకల్పం మళ్ళీ మనం ఎవరినీ పిలువమని మీకిప్పుడు తెలుసు ఎందుకంటే సుఖధామంలో ఉంటారు. ఈ సమయంలో తండ్రియే అర్థం చేయిస్తారు, ఇతరులెవరికీ తెలియదు. ఆత్మయే పరమాత్మ అని, ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని వారంటారు. ఆత్మ అవినాశీ అని తండ్రి అర్థం చేయిస్తారు. ఒక్క ఆత్మ కూడా వినాశనం చెందదు. తండ్రి ఎలాగైతే అవినాశీగా ఉన్నారో, అదే విధంగా ఆత్మ కూడా అవినాశీగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ పతితంగా, తమోప్రధానంగా అవుతుంది. అప్పుడు తండ్రి సతోప్రధానంగా, పవిత్రంగా చేస్తారు. ప్రపంచమంతా తమోప్రధానంగా అవ్వాల్సిందే, మళ్ళీ సతోప్రధానంగా అవుతుంది. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి రావాల్సి ఉంటుంది. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి కూడా అవినాశీ, ఆత్మలమైన మనం కూడా అవినాశీ, ఈ డ్రామా కూడా అవినాశీ. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. మన పాత్ర ఈ నాలుగు యుగాలలో నడుస్తుంది. సూర్యవంశీయులైన మనం తర్వాత చంద్రవంశీయులుగా అవుతాము. చంద్రవంశీయులనగా సెకండ్ గ్రేడ్ లోకి వస్తారు. 14 కళలున్న వారిని సూర్యవంశీయులని అనలేము. వాస్తవానికి వారిని దేవీ దేవతలని కూడా అనలేరు. దేవీ దేవతలు అని సంపూర్ణ నిర్వికారులను, 16 కళా సంపూర్ణులను అంటారు. రాముడిని 14 కళల సంపన్నులు అని అంటారు. మీకు మాత్రమే 84 జన్మల లెక్క అర్థం చేయించడం జరుగుతుంది. కొత్త వస్తువు పాతదిగా అయినప్పుడు ఆ మజా ఉండదు. ముందు సంపూర్ణంగా పవిత్రంగా ఉంటారు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొద్దిగా పాతవారని అంటారు. భవనం యొక్క ఉదాహరణను కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వస్తువు అలా అవుతుంది. ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద రంగస్థలము. ఈ ఆకాశ తత్వం చాలా పెద్దది, దీనికి అంతమంటూ ఏమీ లేదు. దీని అంతం ఎక్కడ ఉంది అనేది చెప్పలేరు. ఆకాశంలో అలా వెళ్తూ ఉన్నా సరే, దానికి అంతం ఉండదు. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంతమేమీ ఉండదు. సైన్సు వారు అంతాన్ని చూడాలని ఎంతగా ప్రయత్నిస్తారు కానీ అక్కడకు వెళ్ళలేరు, అంతాన్ని పొందలేరు. బ్రహ్మతత్వం చాలా పెద్దది, అనంతమైనది. ఆత్మలైన మనం చాలా కొద్ది స్థలంలో ఉంటాము. ఇక్కడ బిల్డింగ్ మొదలైనవాటిని ఎంత పెద్ద-పెద్దవిగా నిర్మిస్తారు. భూమిపైనున్న స్థలం చాలా ఎక్కువ. పొలాలు మొదలైనవి కూడా కావాలి కదా. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఆత్మ శరీరం లేకుండా ఎలా తింటుంది? అక్కడ ఆత్మలు అభోక్తగా ఉంటాయి, అక్కడ తినేటువంటివి లేక అనుభవించేటువంటి వస్తువులేమీ ఉండవు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుందని, పిల్లలైన మీకు మళ్ళీ కల్పం తర్వాత ఇవ్వడం జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. కనుక ఈ నషా ఉండాలి. మనం దేవతా ధర్మానికి చెందినవారము. మీరంటారు – బాబా, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ మేము మీ వద్దకు వచ్చాము. వారు నిరాకారుడైన కారణంగా, మేము దాదా వద్దకు వచ్చామని మీరంటారు. తండ్రి వీరిలో ప్రవేశించారు. తండ్రి అంటారు – ఎలాగైతే మీరు కర్మేంద్రియాలను తీసుకొని పాత్రను అభినయిస్తారో, అలాగే నేను కూడా కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుంటాను. లేకపోతే నేను పాత్రను ఎలా అభినయించగలను? శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివుడైతే నిరాకారుడు. మరి వారికి జయంతి ఎలా ఉంటుంది? మనుష్యులైతే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. తండ్రి అంటారు – నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి. మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను మాత్రమే పతితపావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. నాకు వృక్షం యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు.

బాబా వీరిలో ప్రవేశించి మాకు నాలెడ్జ్ అంతా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్రలను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి పతిత పావనుడని మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మహిమ వేర్వేరుగా ఉంటుంది, కర్తవ్యం వేర్వేరుగా ఉంటుంది. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారిగా అవుతారు. ఇది నా శరీరము, నేను ప్రైమ్ మినిస్టర్ ను అని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరంతో పాటు లేకపోతే మాట్లాడలేదు. శివబాబా కూడా నిరాకారుడే. వారికి కూడా మాట్లాడేందుకు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది, అందుకే, నోటి నుండి గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. కానీ శివుడైతే ఒక బిందువు. వారికి నోరు ఎక్కడ నుండి వచ్చింది? కావున వీరిలోకి (బ్రహ్మా) వచ్చి కూర్చుంటారు, వీరి నుండి జ్ఞాన గంగను ప్రవహింపజేస్తారు. అందరూ తండ్రినే స్మృతి చేస్తారు – ఓ పతితపావనా రండి, మమ్మల్ని ఈ దుఃఖం నుండి విడిపించండి అని అంటారు. వారే అత్యంత గొప్ప సర్జన్. వారిలోనే పతితులను పావనంగా చేసే జ్ఞానం ఉంది. ఈ ఒక్క సర్జన్ మాత్రమే సర్వ పతితులను పావనంగా చేసేవారు. సత్యయుగంలో అందరూ నిరోగులుగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగ యజమానులు. అలా నిరోగులుగా అయ్యేటువంటి కర్మలను వీరికి ఎవరు నేర్పించారు. తండ్రియే వచ్చి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. ఇక్కడైతే కర్మల గురించి పశ్చాత్తాపపడుతూ ఉంటారు. సత్యయుగంలో తమ కర్మలు ఇలా ఉన్నాయని అనుకోరు. అక్కడ ఎటువంటి దుఃఖం, రోగం ఉండదు. ఇక్కడైతే ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది కర్మభోగము అని అనడానికి సత్య, త్రేతా యుగాలలో దుఃఖమనే మాటే ఉండదు. కర్మ, అకర్మ, వికర్మల అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ప్రతి వస్తువు ముందు సతోప్రధానంగా తర్వాత సతో, రజో, తమోగా అవుతుందని మీకు తెలుసు. సత్యయుగంలో 5 తత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. మన శరీరం కూడా సతోప్రధాన ప్రకృతితో తయారైనదిగా ఉంటుంది, తర్వాత ఆత్మలో 2 కళలు తగ్గడంతో శరీరం కూడా అలాగే తయారవుతుంది. సృష్టిలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు, ఇతరులెవరూ అర్థం చేయించలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పటి నుండే తండ్రి శ్రీమతాన్ని అనుసరించి ఎలాంటి శ్రేష్ఠ కర్మలను చేయాలంటే, ఇక తర్వాత ఎప్పుడూ ఆ కర్మలకు పశ్చాత్తాపపడవలసిన అవసరం రాకూడదు అనగా కర్మలకు శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాకూడదు.

2. ఏ వినాశీ వస్తువుల యొక్క నషాను పెట్టుకోకూడదు. ఈ దేహం కూడా వినాశీ, దీని పట్ల కూడా నషా పెట్టుకోకూడదు, తెలివైనవారిగా అవ్వాలి.

వరదానము:-

అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు దినచర్య కోసం ఏ ఆజ్ఞలైతే లభించాయో, వాటి అనుసారంగా తమ వృత్తిని, దృష్టిని, సంకల్పాలను, స్మృతిని, సేవను మరియు సంబంధాలను చెక్ చేసుకోండి. ఎవరైతే ప్రతి సంకల్పంలో, ప్రతి అడుగులో ఆజ్ఞను పాటిస్తారో, వారి కోరికలన్నీ సమాప్తమైపోతాయి. ఒకవేళ మీ లోపల, పురుషార్థం లేక సఫలత యొక్క కోరిక ఉన్నట్లయితే, తప్పకుండా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఆజ్ఞ యొక్క పాలన జరగడం లేదు. కనుక ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే, నలువైపుల నుండి చెక్ చేసుకోండి – దీనితో స్వతహాగా మాయా ప్రూఫ్ గా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top