9 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 8, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మధురమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఈ చేదు ప్రపంచం నుండి బయటకు తీసి మధురంగా తయారుచేసేందుకు వచ్చారు, అందుకే చాలా-చాలా మధురంగా అవ్వండి’’

ప్రశ్న: -

ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం పట్ల అయిష్టం ఎందుకు కలిగింది?

జవాబు:-

ఎందుకంటే ఈ ప్రపంచం కుంభీపాక నరకంగా అయ్యింది, ఇందులో అందరూ చేదుగా ఉన్నారు. చేదుగా ఉన్నారని పతితులను అంటారు. అందరూ విషయ వైతరణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అందుకే మీకిప్పుడు దీని పట్ల అయిష్టం కలుగుతుంది.

ప్రశ్న: -

మనుష్యులు అడిగే ఒక్క ప్రశ్నలోనే రెండు తప్పులున్నాయి, ఆ ప్రశ్న ఏమిటి మరియు ఆ తప్పులు ఏమిటి?

జవాబు:-

నా మనసుకు శాంతి ఎలా కలుగుతుంది అని మనుష్యులు అడుగుతారు. ఇందులో మొదటి తప్పు ఏమిటంటే- ఎప్పటివరకైతే మనసు శరీరం నుండి వేరవ్వదో, అప్పటివరకు అది శాంతిగా ఎలా అవ్వగలదు. మరియు రెండవ తప్పు ఏమిటంటే – అందరూ ఈశ్వరుని రూపాలేనని, పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, అటువంటప్పుడు శాంతి ఎవరికి కావాలి మరియు ఎవరు ఇవ్వాలి?

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలైన మీకు తెలుసు, శాంతిధామం నుండి తండ్రి వచ్చి ఉన్నారు మరియు ఏ ఆలోచనలో కూర్చున్నారని పిల్లలను అడుగుతున్నారు. తండ్రి మధురమైన ఇల్లు అయిన శాంతిధామం నుండి మనల్ని సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. తండ్రి అడుగుతారు, ఇప్పుడు మీరు మీ మధురమైన ఇంటిని మాత్రమే గుర్తు చేస్తున్నారా లేక ఇంకేదైనా కూడా గుర్తుకొస్తూ ఉంటుందా. ఈ ప్రపంచము మధురంగా ఏమీ లేదు, చాలా చేదుగా ఉంది. చేదు వస్తువు దుఃఖమిచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం మధురమైన ఇంటికి వెళ్తున్నామని పిల్లలకు తెలుసు. మన అనంతమైన తండ్రి చాలా మధురమైనవారు. ఇకపోతే మిగిలిన తండ్రులు ఎవరైతే ఉన్నారో, వారు ఈ సమయంలో చాలా చేదుగా, పతితంగా, ఛీ-ఛీ గా ఉన్నారు. వీరు అందరికీ అనంతమైన తండ్రి. ఇప్పుడు ఎవరి మతంపై నడవాలి. అనంతమైన తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి, దానితో పాటు సుఖధామాన్ని కూడా స్మృతి చేయండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. దీనికి కుంభీపాక నరకము అనేటువంటి చాలా కఠినమైన పేరు ఇవ్వడం జరిగింది, ఇందులో విషయ వైతరణి నది ప్రవహిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ మొత్తం ప్రపంచమంతా విషయ వైతరణి నది. ఈ సమయంలో అందరూ దుఃఖాన్ని పొందుతున్నారు, అందుకే దీని పట్ల అయిష్టం కలుగుతుంది. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము, దీని పట్ల వైరాగ్యం కలగాలి. ఏ విధంగానైతే సన్యాసులకు ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యం కలుగుతుంది, వారు స్త్రీని నాగినిగా భావిస్తారు, ఇంట్లో ఉండడమంటే నరకంలో ఉండడము, మునకలు వేయడము అని భావిస్తారు. ఇలా చెప్తూ వదిలి వెళ్ళిపోతారు. వాస్తవానికి ఇరువురూ నరకానికి ద్వారాలే. వారికి ఇంట్లో బాగా అనిపించదు, అందుకే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలరు, ఇంట్లోనే ఉంటారు. జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇది విషయ వైతరణి నది. అందరూ భ్రష్టాచారులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తారు. అక్కడి నుండి మిమ్మల్ని క్షీరసాగరములోకి పంపిస్తారు. మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగిస్తారు ఎందుకంటే ఈ ప్రపంచంలో శాంతి లేనే లేదు. మనుష్యమాత్రులందరూ శాంతి కోసం ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు. సన్యాసులు మొదలైనవారు ఎవరైనా వచ్చినప్పుడు – మనసుకు శాంతి కావాలి అని అంటారు అనగా ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము అని అంటారు. ఎలాంటి ప్రశ్నను అడుగుతారో చూడండి – ఎప్పటివరకైతే ఆత్మ శరీరం నుండి వేరవ్వదో, అప్పటివరకు మనసు శాంతిగా అవ్వలేదు. ఒకటేమో, ఈశ్వరుడు సర్వవ్యాపి అని, మనమంతా ఈశ్వరుని రూపాలని అంటారు, ఇక అలాంటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? ఈశ్వరునికి శాంతి ఎందుకు కావాలి! తండ్రి అర్థం చేయిస్తారు – శాంతి మీ మెడలోని హారము. మాకు శాంతి కావాలి అని మీరంటారు. మొదట, మీరు ఎవరు అన్నది చెప్పండి. ఆత్మ తన స్వధర్మాన్ని మరియు నివాస స్థానాన్ని మర్చిపోయింది. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు శాంత స్వరూపులు. శాంతి దేశ నివాసులు. మీరు మీ మధురమైన ఇంటిని మరియు మధురమైన తండ్రిని మర్చిపోయారు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. భక్తులు అనేకమంది ఉన్నారు. భక్తులైతే భక్తులే, వారిని భగవంతుడని ఎలా అంటారు. భక్తులు – ఓ భగవంతుడా అని అంటూ సాధనను, ప్రార్థనను చేస్తారు, కానీ భగవంతుడి గురించి కూడా తెలియదు, అందుకే దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు – నిజానికి మేము శాంతిధామ నివాసులము, అక్కడ నుండి సుఖధామంలోకి వెళ్ళాము, ఆ తర్వాత రావణ రాజ్యంలోకి వచ్చాము.

మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు. మొదట మీరు సత్యయుగంలో ఉండేవారు. భారత్ సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. ఆత్మలైన మీరు శాంతిధామంలో ఉంటారు, తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రికి పతితపావనుడు, జ్ఞానసాగరుడు అన్న మహిమ ఉంది. వారు జ్ఞానంతో పావనంగా చేస్తారు. వారు జ్ఞానసాగరుడు, అందుకే వారిని పిలుస్తారు. కావున ఇక్కడ జ్ఞానం లేదని దీనితో ఋజువవుతుంది. జ్ఞానసాగరుడు వచ్చినప్పుడు వారి నుండి జ్ఞాన నదులు వెలువడతాయి, అప్పుడు జ్ఞాన స్నానము చేయగలుగుతారు. జ్ఞానసాగరుడని ఒక్క పరమపిత పరమాత్మను మాత్రమే అంటారు. వారు ఎప్పుడైతే వస్తారో, పిల్లలకు జన్మనిస్తారో, అప్పుడు వారికి జ్ఞానం లభిస్తుంది మరియు సద్గతి కలుగుతుంది. ఎప్పటి నుండైతే రావణ రాజ్యం మొదలవుతుందో, అప్పటి నుండి భక్తి మొదలవుతుంది అనగా పూజారులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతున్నారు. పవిత్రంగా ఉన్నవారిని పూజ్యులని మరియు పతితంగా ఉన్నవారిని పూజారులని అంటారు. సన్యాసులకు పుష్పాలను అర్పిస్తారు, తల వంచి నమస్కరిస్తారు. వారు పావనులు, మేము పతితులము అని భావిస్తారు, తండ్రి అంటారు – ఈ ప్రపంచంలో పావనమైనవారు ఎవరూ ఉండజాలరు. ఇది విషయ వైతరణి నది. క్షీర సాగరమని విష్ణుపురిని అంటారు, అక్కడ మీరు రాజ్యం చేస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయండి. కర్మలైతే చేయాల్సే ఉంటుంది. పురుషులు వ్యాపార-వ్యవహారాలను, మాతలు ఇళ్ళు-వాకిళ్ళను సంభాళించాల్సి ఉంటుంది. మీరు మర్చిపోతూ ఉంటారు, అందుకే అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయంలో స్మృతి చేయండి, అన్నింటికన్నా మంచి సమయము అమృతవేళ. ఆ సమయంలో ఇరువురూ ఫ్రీ గా ఉంటారు. ఆ మాటకొస్తే సాయంత్రం కూడా సమయం లభిస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరైనా అలసిపోయి ఉన్నారనుకోండి, అచ్ఛా, విశ్రాంతి తీసుకోండి, పర్వాలేదు. ఉదయము లేచి స్మృతి చేయండి. ఆత్మలమైన మనల్ని తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు 84 జన్మల పాత్ర పూర్తయ్యింది. ఇటువంటి ఆలోచనలు చేయాలి. మీరు సంపాదించుకునేందుకు అన్నింటికన్నా మంచి సమయము, ఉదయము. ఇప్పటి సంపాదనే సత్యయుగంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. అక్కడ ధనం విషయంలో ఏ కష్టము ఉండదు, ఏ చింతా ఉండదు. తండ్రి మీ జోలిని ఎంతగా నింపుతారంటే ఇక అక్కడ సంపాదన కోసం చింత ఉండదు. ఇక్కడ మనుష్యులకు సంపాదన విషయంలో ఎంత చింత ఉంటుంది. బాబా 21 జన్మల కోసం చింత నుండి విముక్తులుగా చేస్తారు. కావున ఉదయముదయమే లేచి ఈ విధంగా తమతో తాము మాట్లాడుకోండి. ఆత్మలమైన మనము పరంధామ నివాసులము, తండ్రికి పిల్లలము. మొట్టమొదట మనం స్వర్గంలోకి వస్తాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి అంటారు – 5000 సంవత్సరాల క్రితం మీరు ఎంత సుసంపన్నులుగా ఉండేవారు, భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా, దుఃఖధామంగా ఉంది. ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతిదాతగా అవుతారు. ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోవాలి. సత్యయుగంలో కేవలం భారత్ ఉండేది, దానిని స్వర్గమని, జీవన్ముక్తి అని అంటారు. నరకాన్ని జీవన బంధనమని అంటారు. మొదట సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యముండేది, ఆ తర్వాత వైశ్య, శూద్రవంశీయుల రాజ్యం ఏర్పడింది. ఆసురీ బుద్ధి ఉన్న కారణంగా మనుష్యులు పరస్పరంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. ప్రతి లౌకిక తండ్రి కూడా పిల్లలకు సేవకునిగా అవుతారు. వికారాల్లోకి వెళ్ళి పిల్లలకు జన్మనిస్తారు, వారిని సంభాళిస్తారు, తర్వాత వారిని నరకంలోకి తోసేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విషయ వైతరణి నదిలో మునకలు వేయడం మొదలుపెడతారో, అప్పుడు ఆ తండ్రి సంతోషపడతారు. కావున వారు అమాయకులు అయినట్లు కదా. ఈ పారలౌకిక తండ్రి కూడా అమాయకులు, పిల్లలకు సేవకుడు. ఆ లౌకిక తండ్రి పిల్లలను నరకంలో పడేస్తారు, వీరు శాంతిధామానికి, స్వర్గానికి తీసుకువెళ్తారు. శ్రమ అయితే చేస్తారు కదా. వారు ఎంత అమాయకులు. తమ పరంధామాన్ని వదిలి వచ్చారు. ఆత్మలకు ఎంత దుర్గతి కలిగింది అన్నది చూస్తారు. నన్ను నిందిస్తూనే ఉంటారు, నా గురించి తెలియదు. నా రథాన్ని కూడా నిందిస్తారు, ఎన్ని అసత్య కళంకాలను వేసేసారు. మీపై కూడా కళంకాలు వేస్తారు. శ్రీకృష్ణునిపై కూడా కళంకాలు వేస్తారు. కానీ కృష్ణుడు ఎప్పుడైతే తెల్లగా ఉంటారో, అప్పుడు ఏ కళంకాలు వేయలేరు, ఎప్పుడైతే నల్లగా అవుతారో అప్పుడు కళంకాలు వేస్తారు. ఎవరైతే తెల్లగా ఉండేవారో, వారే నల్లగా అయ్యారు, అందుకే కళంకాలు వేస్తారు. తెల్లగా ఉన్నవారిపై కళంకాలు వేయరు. ఆత్మ పవిత్రము నుండి అపవిత్రంగా అయినప్పుడు నిందలపాలవుతుంది. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. పాపం మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది ఏ రకమైన జ్ఞానమో తెలియదు అని చాలా తికమకపడతారు. ఇది శాస్త్రాలలోనైతే లేదు. శివ శక్తి భారత మాతల సైన్యము ఏమి చేసింది అన్నది మర్చిపోయారు. జగదంబను శివ శక్తి అని అంటారు కదా! వారి మందిరాలు కూడా తయారై ఉన్నాయి. దిల్వాడా మందిరము కూడా ఉంది. మనసును దోచుకునేవారైతే ఒక్క శివబాబానే కదా. బ్రహ్మా కూడా ఉన్నారు, అలాగే జగదంబ మరియు కుమారీలైన మీరు కూడా ఉన్నారు. మహారథులు కూడా ఉన్నారు. మీరు ప్రాక్టికల్ గా అదే విధంగా ఉన్నారు. అది మీ జడమైన స్మృతిచిహ్నంగా నిలిచి ఉంది. ఈ జడమైన స్మృతి చిహ్నాలు సమాప్తమైపోతాయి, అప్పుడు మీరు సత్యయుగంలో ఉంటారు. అక్కడ ఈ స్మృతిచిహ్నాలు మొదలైనవి ఉండవు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలా కూర్చుని ఉన్నారు, స్మృతిచిహ్నము తయారైంది. ఆ తర్వాత సత్య-త్రేతాయుగాలలో రాజ్యం చేసారు. మళ్ళీ భక్తి మార్గంలో పూజల కోసము ఈ స్మృతిచిహ్నాలు తయారవుతాయి. బ్రహ్మా-విష్ణు-శంకరుల గురించి కూడా మీరు తెలుసుకున్నారు. విష్ణువే బ్రహ్మాగా అవుతారు, బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు – 84 జన్మలు పడతాయి.

ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థం చేస్తారు, మమ్మా-బాబాను ఫాలో చేయాలి. ఎంత పురుషార్థం చేస్తారో, అంత తెల్లగా అవుతారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు తండ్రి ఎంతటి సహజమైన పురుషార్థాన్ని నేర్పిస్తారు. తండ్రిని మరియు మధురమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఉదయాన్నే లేచి స్మృతి చేసే అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడైతే పక్కాగా అవుతారో, అప్పుడు నడుస్తూ-తిరుగుతూ ఉండగా స్మృతి నిలుస్తుంది. మనము మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానినే స్మృతి చేయాలి. మొదట మనం సతోప్రధానంగా అవుతాము, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తాము, ఇందులో ఎలాంటి సంశయము ఉత్పన్నమవ్వలేదు. తికమకపడే విషయమే లేదు. పవిత్రంగా ఉండాల్సిందే. దేవతల భోజనం కూడా ఎంత పవిత్రంగా ఉంటుంది. కావున మనం కూడా చాలా పథ్యము పాటించాలి. ఇందులో అడగాల్సిన విషయం కూడా ఏమీ లేదు. బుద్ధి అర్థం చేసుకుంటుంది – ఒకటేమో వికారాలు అన్నింటికన్నా చెడ్డవి. రెండవది – మద్య మాంసాలు తీసుకోకూడదు. ఇకపోతే ఉల్లి-వెల్లుల్లి మొదలైనవి మరియు పతితుల చేతి భోజనం వలన ఇబ్బంది కలుగుతుంది. పవిత్రమైన భోజనము బ్రాహ్మణుల వద్ద తప్ప ఇంకెక్కడా లభించదని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి స్మృతిలో ఉండాల్సి ఉంటుంది. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పావనంగా అవుతారు. మనం స్వయాన్ని ఏ యుక్తితో రక్షించుకుంటూ ఉండాలి అన్నది బుద్ధితో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బుద్ధిని ఉపయోగించాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, అందుకే లౌకికం వారితో కూడా సంబంధం ఉంచుకోవాలి. వారి కళ్యాణం కూడా చేయాలి. వారికి కూడా ఈ విషయాలు వినిపించాలి. తండ్రి అంటారు – పవిత్రంగా అవ్వండి, లేదంటే చాలా శిక్షలు తింటారు మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. పాస్ విత్ ఆనర్ గా అయ్యేవారి మాల తయారై ఉంది. ఇప్పుడిది అందరి వినాశన సమయము, అందరి పాపాల లెక్కాచారము సమాప్తం అవ్వాల్సి ఉంది.

స్మృతి ద్వారానే వికర్మలు భస్మమవుతాయని బాబా అర్థం చేయించారు, ఇందులోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సహజము. మొత్తం డ్రామా మరియు వృక్షము బుద్ధిలోకి వస్తుంది. ఇకపోతే మధురమైన తండ్రిని, మధురమైన రాజధానిని మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇక ఇంటికి వెళ్ళాలి. పాత శరీరాన్ని వదిలి అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది పక్కాగా ఉండాలి. ఈ విధంగా స్మృతి చేస్తూ-చేస్తూ శరీరం వదిలిపోతుంది మరియు ఆత్మలైన మీరు వెళ్ళిపోతారు. ఇది చాలా సహజము. ఇప్పుడు మీరు సమ్ముఖంలో వింటారు, మిగిలిన పిల్లలు టేప్ ద్వారా వింటారు. ఒక రోజు టి.వి.లో కూడా ఈ జ్ఞానాన్ని తప్పకుండా వింటారు మరియు చూస్తారు. అంతా జరుగుతుంది. వెనుక వచ్చేవారికి ఇంకా సహజమవుతుంది. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. ఈ ఏర్పాటు కూడా జరుగుతుంది. మంచిగా సేవ చేసేవారు కూడా ఉంటారు. కావున పిల్లల ఉన్నతి కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతాయి. ఈ ఏర్పాట్లను ఎవరు కావాలంటే వారు తీసుకోవచ్చు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ముస్లిమ్ వారు కూడా ఉదయముదయమే పరిక్రమణ చేస్తారు మరియు అందరినీ మేల్కొల్పుతారు – మేల్కొని అల్లాహ్ ను స్మృతి చేయండి, ఇది నిదురించే సమయం కాదు అని అంటారు. వాస్తవానికి ఇది ఇప్పటి విషయమే. అల్లాహ్ ను స్మృతి చేయండి ఎందుకంటే మీకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. స్వర్గాన్ని పుష్పాల తోట అని అంటారు. వారు ఊరికే అలా పాడుతారు. మీరైతే ప్రాక్టికల్ గా తండ్రిని స్మృతి చేయడంతో దేవతలుగా అవుతున్నారు. ఈ విధంగా ఉదయాన్నే లేచే అభ్యాసం మంచిది. ఉదయం వేళ వాయుమండలం చాలా బాగుంటుంది. 12 గంటల తర్వాత ఉదయం ప్రారంభమవుతుంది. ఉదయం 2-3 గంటల సమయాన్ని ప్రభాత సమయము అని అంటారు. ఉదయం మేల్కొని శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతిలో ఉంటూ పవిత్రమైన, శుద్ధమైన భోజనాన్ని తినాలి. అశుద్ధమైనవాటి విషయంలో చాలా-చాలా పథ్యాన్ని పాటించాలి. మమ్మా-బాబాను ఫాలో చేసి పవిత్రంగా అయ్యే పురుషార్థం చేయాలి.

2. ఉదయముదయమే లేచి మధురమైన తండ్రిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి. ఈ వినాశన సమయంలో తండ్రి స్మృతితోనే లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి.

వరదానము:-

ఏ కార్యాన్ని చేస్తున్నా సరే, ‘‘పెద్ద బాబా కూర్చుని ఉన్నారు’’ అని సదా స్మృతిలో ఉండాలి, అప్పుడు స్థితి సదా నిశ్చింతగా ఉంటుంది. ఈ నిశ్చింత స్థితిలో ఉండడం కూడా అన్నింటికన్నా పెద్ద రాజ్యాధికారము. ఈ రోజుల్లో అందరూ చింతలో ఉన్న చక్రవర్తులు మరియు మీరు నిశ్చింత చక్రవర్తులు. చింతించే వారు ఎవరైతే ఉంటారో, వారికి ఎప్పుడూ సఫలత లభించదు ఎందుకంటే వారు చింతలోనే సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకుంటారు. ఏ పని కోసమైతే చింతిస్తారో, ఆ పనిని పాడు చేస్తారు. కానీ మీరు నిశ్చింతగా ఉంటారు, అందుకే సమయానికి శ్రేష్ఠమైన టచింగ్ వస్తుంది మరియు సేవలలో సఫలత లభిస్తుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top