6 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

August 5, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన సాగరుడైన తండ్రి మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క ఈ సంగమము వజ్ర సమానమైనది, ఇక్కడికి పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్రతుల్యంగా అవ్వడానికి వస్తారు’’

ప్రశ్న: -

సత్యయుగీ రాజధాని యొక్క స్థాపన ఎప్పుడు మరియు ఎలా జరుగుతుంది?

జవాబు:-

ఎప్పుడైతే మొత్తం పతిత సృష్టి శుభ్రమవుతుందో అనగా పాత సృష్టి వినాశనమవుతుందో, అప్పుడు సత్యయుగీ రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. దానికన్నా ముందే మీరు తయారవ్వాలి, పావనంగా అవ్వాలి. పతితులు అనేవారు ఒక్కరు కూడా లేనప్పుడు కొత్త రాజధాని యొక్క సమయము ప్రారంభమవుతుంది. ఆ సమయము ఇక్కడ నుండే ప్రారంభమవ్వదు. రాధే-కృష్ణుల జన్మ జరుగుతుంది కానీ ఆ సమయము నుండే సత్యయుగము అని అనరు. ఎప్పుడైతే వారు లక్ష్మీ-నారాయణుల రూపంలో రాజ్య-సింహాసనముపై కూర్చుంటారో, అప్పుడు వారి సమయము ప్రారంభమవుతుంది, అప్పటివరకు ఆత్మలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ విచార సాగర మథనము చేయాల్సిన విషయాలు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఇదే వసంతము… (యహీ బహార్ హై…)

ఓంశాంతి. పిల్లలు ఎక్కడికి వచ్చి ఉన్నారు? జ్ఞాన సాగరుని తీరము వద్దకు వచ్చి ఉన్నారు. మామూలుగా అయితే జ్ఞాన గంగల యొక్క తీరములో ఉంటారు మరియు ఇప్పుడు జ్ఞాన సాగరుని తీరానికి వచ్చారు. ఎవరు వచ్చారు? జ్ఞాన గంగలు. ఎలా తయారయ్యేందుకు? గవ్వ నుండి వజ్రతుల్యంగా లేక నిరుపేదల నుండి కిరీటధారులుగా అయ్యేందుకు వచ్చారు. బ్రహ్మా బ్రహ్మపుత్ర మరియు శివుడు జ్ఞాన సాగరుడు. వీరు బ్రహ్మపుత్ర నది. వీరు బిడ్డ కదా. బ్రహ్మా శివుని కుమారుడు. మీరు మనవలు, మనవరాళ్ళు. కలకత్తాలో సాగరము మరియు నదికి సంబంధించిన భారీ మేళా జరుగుతుంది. అక్కడ గంగ, బ్రహ్మపుత్ర మరియు సాగరము కలుస్తాయి. బ్రహ్మపుత్రలో వేరే నదులు కూడా కలుస్తాయి. ముఖ్యమైనది బ్రహ్మపుత్ర మరియు సాగరము యొక్క సంగమము. దానినే డైమండ్ హార్బర్ అని అంటారు. ఈ పేరును ఆంగ్లేయులు పెట్టారు. అర్థమేమీ తెలుసుకోరు, ఆ పేరును మామూలుగా అలా పెట్టేసారు. తండ్రి అర్థాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో మీరు బ్రహ్మపుత్ర మరియు జ్ఞాన సాగరుని సమ్ముఖంలోకి వచ్చారు. అక్కడ కూడా వజ్రతుల్యంగా అయ్యేందుకు సాగరుని సమ్ముఖములోకి వెళ్తారు. కానీ వజ్రాలకు బదులుగా రాళ్ళ వలె అవుతారు ఎందుకంటే అది భక్తి మార్గము. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క సంగమము. ఇరువురూ కలిసి ఉన్నారు, అది జడమైనది, ఇది చైతన్యమైనది. వీరైతే ఎక్కడికైనా వెళ్ళగలరు. కనుక పిల్లలు ఎల్లప్పుడూ బ్రహ్మపుత్ర మరియు సాగరము ఇరువురూ చైతన్యంలో కలిసి ఉన్నారని భావించాలి. ఇది వజ్రతుల్యంగా తయారయ్యే సంగమము. మీరు వజ్రతుల్యంగా తయారవ్వండి. వీరు బ్రహ్మపుత్ర మరియు మీరు దత్తత తీసుకోబడిన జ్ఞాన గంగలు. ఆ నదులైతే లెక్కలేనన్ని ఉన్నాయి. భారత్ లో ఇన్ని నదులు ఉన్నాయని ఆ నదుల గురించైతే అందరికీ తెలుసు. అవి లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ జ్ఞాన నదుల అంతాన్ని అయితే చేరుకోలేరు. సాగరము నుండి నదులు ఈ సమయంలోనే వెలువడతాయి. మొదట బ్రహ్మపుత్ర వెలువడుతారు, ఆ తర్వాత వారి నుండి చిన్న-చిన్న నదులు వెలువడుతారు. ఇది నంబరువారు పురుషార్థానుసారముగా మీకు తెలుసు. కొందరు పెద్ద నదులు, కొందరు చిన్న నదులు, వీరందరూ మనుష్యులను వజ్ర సమానంగా తయారుచేస్తారు. కేవలం సూర్యవంశీయులు మాత్రమే మహారాజు, మహారాణిగా అవుతారు అని కూడా అనరు. అలా కాదు. యథా రాజా రాణి తథా ప్రజ. మీ అందరి జీవితము వజ్ర సమానంగా అవుతుంది, ఎవరైతే స్వర్గము కోసం కొద్దిగానైనా పురుషార్థము చేస్తారో, వారు వజ్ర సమానంగా అవుతారు. బ్రహ్మపుత్ర నది మరియు సాగరము ఇరువురూ కలిసి ఉంటారు. పిల్లలైన మీరు వచ్చినప్పుడు, మేము బాప్ దాదా వద్దకు వచ్చామని లోలోపల తెలుసు. తండ్రి జ్ఞాన సాగరుడు, వీరు ఈ బ్రహ్మపుత్రలోకి అనగా బ్రహ్మాలోకి ప్రవేశిస్తారు. వీరి ద్వారా మనల్ని వజ్రము వలె తయారుచేస్తారు. ఇప్పుడు ఎవరు ఎంతగా పురుషార్థము చేసి శ్రీమతముపై నడుస్తారో, అంతగా వజ్రం వలె తయారవుతారు. ఎప్పటివరకైతే జీవించి ఉంటామో, అప్పటివరకు పురుషార్థము చేయాలి అని కూడా మీకు తెలుసు. శిక్షణ అయితే లభిస్తూ ఉంటుంది. పరీక్ష యొక్క ఫలితమైతే వినాశన సమయములోనే వెలువడుతుంది. ఒకవైపు ఫలితము వెలువడుతుంది, మరోవైపు వినాశనము ప్రారంభమవుతుంది, ఇక తర్వాత హాహాకారాలు ఎలా జరుగుతాయంటే, ఇక అడగకండి. అందుకే వినాశనం కన్నా ముందే, యుద్ధము కన్నా ముందే తయారవ్వాలి. ఇంకెంత సమయం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన రాజధాని స్థాపన అవుతుందో, అప్పుడు ఇదంతా శుభ్రమవుతుందని కూడా మీకు తెలుసు. మీరు పావనంగా అవుతూ ఉంటారు. వారు పతితంగా ఉన్నారు. ఎప్పుడైతే పతితులందరూ సమాప్తమైపోతారో, లెక్కాచారాలు సమాప్తం చేసుకుని అందరూ తిరిగి వెళ్ళిపోతారో, పతితులు ఒక్కరు కూడా ఉండరో, అప్పుడు పావన ప్రపంచమని అంటారు. ఈ సమయంలో మీరు పావనంగా ఉన్నారు కానీ మొత్తం ప్రపంచమంతా పావనంగా లేదు కదా. కానీ పావనంగా తప్పకుండా అవుతుంది. ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో, అప్పుడు మొత్తం ప్రపంచము పావనంగా అవుతుంది, దానిని కొత్త ప్రపంచమని అంటారు. కొత్త ప్రపంచం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎవరైనా అడిగితే, వారికి ఇలా అర్థం చేయించాలి – ఎప్పుడైతే మహారాజు, మహారాణి సింహాసనముపై కూర్చుంటారో, అప్పుడు కొత్త యుగము ప్రారంభమవుతుంది. ఎప్పటివరకైతే కొత్త యుగము ప్రారంభమవ్వదో, అప్పటివరకు పాతది తప్పకుండా ఉంటుంది. ఆ సమయము ఇక్కడ నుండే ప్రారంభమవ్వదు. బ్రాహ్మణులైన మనము కొత్తవారిగా ఉన్నాము కానీ ప్రపంచము అనగా మొత్తం పృథ్వి కొత్తగా ఏమీ లేదు. ఇప్పుడిది సంగమము. కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. మనం రాధే-కృష్ణులను మొదటి రాకుమారుడు, మొదటి రాకుమార్తె అని అంటాము కానీ వారు ఉన్న ఆ సమయాన్ని సత్యయుగమని అనము. అప్పటికల్లా రాధే-కృష్ణులు ఇక్కడకు వచ్చేస్తారు కానీ, ఎప్పటివరకైతే లక్ష్మీ-నారాయణులు సింహాసనముపై కూర్చోరో, అప్పటివరకు ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇవి విచార సాగర మథనము చేయాల్సిన విషయాలు. ఎప్పుడైతే సత్యయుగము ప్రారంభమవుతుందో, అప్పుడు కొత్త కాలము ప్రారంభమవుతుంది. సూర్యవంశీయులది ఫలానా కాలము అని అంటారు కానీ రాకుమారుడు-రాకుమార్తెల పేరు మీద ఫలానా కాలము అనేది ఎప్పుడూ ఉండదు. ఇకపోతే, ఆ మధ్య సమయంలో రావడము, వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. ఛీ-ఛీ మనుష్యులు కూడా వెళ్ళిపోతారు. ఎంతోకొంత మంది అయితే మిగిలి ఉంటారు కదా. ఎవరైతే మిగిలి ఉంటారో, వారు కూడా తిరిగి వెళ్ళిపోతారు కానీ దానికి సమయము పడుతుంది. ఇది ఎవరు అర్థం చేయిస్తారు? జ్ఞాన సాగరుడు కూడా అర్థం చేయిస్తారు, అలాగే జ్ఞాన నది అయిన బ్రహ్మపుత్ర నది కూడా ఉన్నారు, ఇరువురూ కలిసి అర్థం చేయిస్తారు. ఆ కుంభ మేళా అయితే ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ కుంభ మేళా, సాగరము మరియు జ్ఞాన నదుల మేళా సంగమయుగములోనే జరుగుతుంది. మేము తల్లి-తండ్రి వద్దకు లేక జ్ఞాన సాగరుడు మరియు పెద్ద నది వద్దకు వెళ్తాము అని పిల్లలైన మీరంటారు. బాబా మాకు ఈ పెద్ద నది మరియు మిగతా నదుల ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు అనగా వజ్ర సమానంగా తయారుచేస్తారు. కుంభ మేళాకు చాలా శుద్ధితో ఎంత సంతోషంగా వెళ్తారు మరియు అక్కడ మనసా, వాచా, కర్మణా పవిత్రంగా ఉంటారు. అది జడమైన యాత్ర. యాత్రికులు తమ కళ్యాణము జరగాలని కోరుకుంటారు. యాత్రికుల కళ్యాణము ఎంతగానైతే జరుగుతుందో, అంతగా పండాలది జరగదు. పండాలైతే ధనము సంపాదించుకునేందుకు వెళ్తారు. యాత్రికులకు ఎంతగానైతే భావన ఉంటుందో, పండాలకు అంతగా ఉండదు. యాత్రికులు చాలా శుద్ధమైన భావనతో వెళ్తారు కావున చాలామందికి సాక్షాత్కారము జరుగుతుంది. అమరనాథ్ లో మంచు లింగము తయారై ఉంటుంది. ఎదురుగా వెళ్ళినప్పుడు అంతా మంచే మంచు కనిపిస్తున్నట్లు ఉంటుంది. భావన కలవారు అది చూడగానే సంతోషిస్తారు, ఇది ప్రకృతి యొక్క చమత్కారము అని అనుకుంటారు. మంచులో లింగము తయారవుతుంది, మనుష్యులలో ఈ విధమైన భావన కూర్చుంటుంది కానీ అసలు అదేమీ కాదు. ఇప్పుడు మీది సత్యమైన యాత్ర జరుగుతుంది. భగవంతుడిని కలుసుకునేందుకు భగవంతుని వెనుక చాలా ఎదురుదెబ్బలు తిన్నాము కానీ భగవంతుడు లభించనే లభించలేదు అని మనుష్యులు భావిస్తారు.

భగవంతునికి ఫోటో తీయలేమని బాబా అర్థం చేయించారు. బిందువుకు ఫోటో ఏం ఉంటుంది! అర్థము చేయించేందుకు నక్షత్రము వలె ఉంటారని అంటారు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార ప్రకాశిస్తుంది… చాలామంది పిల్లలు భృకుటి మధ్యలో తిలకము పెట్టుకుంటారు. ఆత్మ నివాసము భృకుటి మధ్యలో ఉంటుందని విన్నారు కదా, అందుకే స్టార్ లా పెట్టుకుంటారు, ఒకవేళ సత్యమైన తిలకము గురించి చెప్పాలంటే అది ఇదే. రాజ్య తిలకము ఇంకాస్త పెద్దదిగా ఉంటుంది. అక్కడ స్థూల రాజ్య తిలకము లభిస్తుంది. ఆత్మలమైన మాకు ఇప్పుడు రాజ్యతిలకము లభిస్తుందని పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇప్పుడు నాకు పరమపిత పరమాత్మ నుండి రాజ్య తిలకము లభిస్తుందని ఆత్మ అర్థము చేసుకుంటుంది. భృకుటి మధ్యలో చాలా మంచి స్టార్ ను దిద్దుకుంటారు. బంగారానిది కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం లభించింది, నక్షత్రము వలె ఉన్న మనము ఇప్పుడు వజ్రము వలె అవుతాము. ఆత్మలమైన మనము నక్షత్రాలము. పరమపిత పరమాత్మ కూడా నక్షత్రము వలె అంతే చిన్నగా ఉంటారు, కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఈ విషయాలు చాలా గుహ్యమైనవి. మీకు జ్ఞానము అనగా ప్రకాశము లభించింది. పరమపిత పరమాత్మ రూపాన్ని కూడా చూసారు, అర్థము చేసుకున్నారు. ఆత్మ సాక్షాత్కారము ఎలాగైతే జరుగుతుందో, అలాగే పరమాత్మది కూడా జరుగుతుంది. మీరు ఎలా ఉన్నారో, నేను కూడా అలాగే ఉన్నాను అని అంటారు. కానీ పిల్లలకు తండ్రి యొక్క సాక్షాత్కారము ఎందుకు కావాలి. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. మీరు ఎలాగైతే ఉన్నారో, తండ్రి కూడా అలాగే ఉన్నారు. కేవలం మహిమ మరియు పాత్ర వేర్వేరు, ఇతరులతో పోలిస్తే వేరుగా ఉంటుంది, ఒకరిది మరొకరితో కలవదు. పాత్రధారులందరి పాత్ర ఒకేలా ఏమైనా ఉంటుందా. దీనినే ఈశ్వరుని అద్భుతము అని అంటారు. వాస్తవానికి డ్రామా యొక్క అద్భుతము అని అనాలి ఎందుకంటే బాబా – నేను డ్రామాను తయారుచేసాను అని అనరు. అలా అంటే, ఎప్పుడు తయారుచేసారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనినే ప్రకృతి యొక్క చమత్కారము అని అంటారు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మ ఒక నక్షత్రము, అందులో ఎంత పెద్ద పాత్ర ఉంది. పరమపిత పరమాత్మ సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఇక్కడ ఎవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనరు. వేద శాస్త్రాలను చదివేవారు శాస్త్రాల జ్ఞానాన్నే వినిపిస్తారు. ఇకపోతే, తండ్రిలో ఏదైతే జ్ఞానం ఉందో, అది ఎవ్వరిలోనూ లేదు. భగవంతుడే వచ్చి సహజ రాజయోగం యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తారు. వారినే జ్ఞాన సాగరుడు అని అంటారు. ఇక్కడ ఈ నదుల మేళా జరుగుతుంది. నదులనేవి సాగరము నుండే వెలువడతాయని కూడా అర్థమవుతుంది. చాలామంది పిల్లలకు ఈ విషయం కూడా తెలియదు. అలాగే మీ విషయాల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరుడు ఎలా వస్తూ ఉండవచ్చు, వారి నుండి జ్ఞాన గంగలు జ్ఞానాన్ని ఎలా పొందుతూ ఉండవచ్చు – ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మనుష్యుల వలన బుద్ధిలో కొన్ని విషయాలు కూర్చున్నాయి కావున సత్యమైన విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఆ సాగరాన్ని మరియు ఈ జ్ఞాన సాగరుడిని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ సాగరము మరియు నదులైతే దుఃఖము ఇస్తూ ఉంటాయి. సాగరము ఉప్పొంగితే ఎంత నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు జ్ఞానసాగరుడిని, పతితపావనుడిని అందరూ తలచుకుంటారు, ఆ సాగరాన్ని మరియు నదులను ఎవ్వరూ తలచుకోరు. పతితపావనుడిని, జ్ఞానసాగరుడిని తలచుకుంటారు. ఆ సాగరము నుండే ఈ నదులు వెలువడ్డాయి. వారి నామ, రూప, దేశ, కాలాల గురించి ఎవ్వరికీ తెలియదు. వారి పేరు శివుడు అని అంటారు కానీ కేవలం లింగానికి మాత్రమే ఆ పేరు పెట్టారు. బాబా పేరు అవినాశీ కదా. రచయిత అయిన శివబాబా ఒక్కరే, వారి రచన కూడా ఒక్కటే మరియు అది అనాది అయినది. అది ఏ విధంగా అనాది అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఈ పండుగలు మొదలైనవేవీ ఉండవు. అన్నీ మాయమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో మొదలవుతాయి.

ఒకప్పుడు స్వర్గము ఉండేదని, మళ్ళీ స్వర్గం వస్తుందని మనుష్యులు భావిస్తారు. కానీ ఈ సమయంలో ఉన్నది నరకము. దీని ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు, ఘోర అంధకారంలో ఉన్నారు. కల్పము ఆయువు గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామా ఏదైతే ఉందో, అది తిరుగుతూ ఉంటుందని అంటారు కూడా. కానీ దాని ఆయువు గురించి తెలియని కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని బ్రహ్మా నోటి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు కావున వారు బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపించారు. వారేమైనా శాస్త్రాలన్నింటినీ చేతుల్లో పట్టుకోగలరా, అలాగే ఎవరైనా బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాలను వినిపిస్తారా. ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవని మీకు తెలుసు. వీటిని చదువుతూ వచ్చారు. ఎప్పటి నుండి చదువుతూ వచ్చారు అన్నది ఏమీ తెలియదు. కేవలం అవి అనాదిగా ఉన్నాయని, వేద వ్యాసుడు రచించారని అంటారు. వేదాలను ఉన్నతమైనవిగా భావిస్తారు. కానీ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ గీత యొక్క రచన అని రాయబడి ఉంది. ఇప్పుడున్న ఈ వేద శాస్త్రాలు మొదలైనవే మళ్ళీ తయారవుతాయని పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ ఆ పేర్లే పెడతారు. ఇప్పుడు మీకు తెలుసు, మనం మళ్ళీ పూజ్యులుగా అవుతున్నాము, తర్వాత ఎప్పుడైతే పూజారులుగా అవుతామో, అప్పుడు మందిరాలు మొదలైనవి తయారుచేస్తాము. రాజా-రాణులు మందిరాలను నిర్మిస్తే ప్రజలు కూడా నిర్మిస్తారు. భక్తి మార్గం మొదలవ్వడంతో మళ్ళీ అందరూ మందిరాలను నిర్మించడము మొదలుపెడతారు. ఇంటింటిలో కూడా నిర్మిస్తారు. లక్ష్మీ-నారాయణుల రాజధానిలో అయితే రాధే-కృష్ణుల మందిరాలు ఉండజాలవు. మందిరాలు భక్తి మార్గంలో తయారవుతాయి. పడిపోయే కొలది మందిరాలను తయారుచేస్తూ ఉంటారు. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల ఆస్తి ఏదైతే ఉందో, దానిని వైశ్య వంశీయులు, శూద్ర వంశీయులు అనుభవిస్తారు. లేదంటే ఈ రాజ్యము ఎక్కడి నుండి వస్తుంది. ఆస్తి కొనసాగుతూ వస్తుంది. పెద్ద-పెద్ద ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అవి చిన్న-చిన్నవిగా అవుతూ ఇక చివరికి ఏమీ మిగలవు. పరస్పరములో పంచుకుంటూ ఉంటారు. కనుక పిల్లలకు ఇప్పుడు, మనము పూజ్యులుగా ఎలా అవుతాము, ఎంత సమయం అలా ఉంటాము, మళ్ళీ పూజారులుగా ఎలా అవుతాము అన్నది అర్థమయ్యింది. పరమపిత పరమాత్మ యొక్క నామ, రూప, దేశ, కాలాలు మరియు వారి పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. భక్తి మార్గంలో కూడా భక్తుల యొక్క శుద్ధ భావనను తండ్రే పూర్తి చేస్తారు. అశుద్ధ భావనను రావణుడు పూర్తి చేస్తాడు. ఇప్పుడు మీకు జ్ఞాన సాగరుడు మొత్తం జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు. అందరూ అయితే అర్థము చేసుకోరు. కల్పక్రితము వారు ఎవరైతే ఉన్నారో, వారే వెలువడుతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటి వరకు పురుషార్థం చేస్తూ ఉండాలి. తండ్రి శిక్షణలను అమలులోకి తీసుకురావాలి. తండ్రి సమానముగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి.

2. ఆత్మిక పండాగా అయి అందరి చేత సత్యమైన యాత్రను చేయించాలి. వజ్ర సమానంగా అవ్వాలి మరియు తయారుచేయాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే తమ బలహీన వృత్తులను తొలగించుకుని శుభమైన మరియు శ్రేష్ఠమైన వృత్తిని ధారణ చేసే వ్రతము చేపడతారో, వారికి ఈ సృష్టి కూడా శ్రేష్ఠంగా కనిపిస్తుంది. వృత్తితో దృష్టికి మరియు కృతికి కూడా కనెక్షన్ ఉంది. ఏదైనా మంచి లేక చెడు విషయము మొదట వృత్తిలో ధారణ అవుతుంది, ఆ తర్వాత వాణి మరియు కర్మలోకి వస్తుంది. వృత్తి శ్రేష్ఠంగా అవ్వడము అనగా వాణి మరియు కర్మ స్వతహాగా శ్రేష్ఠంగా అవ్వడము. వృత్తితోనే వైబ్రేషన్లు, వాయుమండలం తయారవుతాయి. శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చేసేవారు విశ్వ పరివర్తకులుగా స్వతహాగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top