5 August 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
4 August 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - సమయం చాలా కొద్దిగా ఉంది, అందుకే ఆత్మిక వ్యాపారము చేయండి, అన్నింటికన్నా మంచి వ్యాపారము - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడము, మిగిలినవన్నీ తప్పుడు వ్యాపారాలు’’
ప్రశ్న: -
పిల్లలైన మీలో ఏ ఉత్సుకత ఉండాలి?
జవాబు:-
మేము పాడైపోయిన ఆత్మలను ఎలా సరిదిద్దాలి, అందరినీ దుఃఖం నుండి విడిపించి 21 జన్మల కోసం సుఖం యొక్క మార్గాన్ని ఎలా చూపించాలి, అందరికీ తండ్రి యొక్క సత్యాతి-సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి – ఈ ఉత్సుకత పిల్లలైన మీలో ఉండాలి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు… (భోలేనాథ్ సే నిరాలా…)
ఓం శాంతి. భోళానాథుడు, పిల్లలకు ఓం శాంతి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. వారు స్వయము కూడా ఓం శాంతి అని అంటారు, అలాగే పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. తమ పరిచయాన్ని ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుందంటే – ఆత్మలమైన మనం శాంత స్వరూపులము, శాంతిధామ నివాసులము, మన తండ్రి కూడా అక్కడి నివాసి. భక్తి మార్గంలో కూడా బాబా-బాబా అని అంటారు. మనుష్యులు అనడం అలా అంటారు కానీ ఉండడం రావణుని మతంపై ఉన్నారు. రావణ మతము మనుష్యులను పాడు చేస్తుంది. తండ్రి వచ్చి పాడైపోయినదానిని బాగు చేస్తారు. రావణుడు కూడా ఒక్కడే, రాముడు కూడా ఒక్కరే. 5 వికారాలను కలిపి రావణుడు అని అంటారు. శోక వాటికలో కూర్చునేటువంటి తన రాజ్యాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. అతడు పాడు చేస్తాడు, వీరు బాగు చేస్తారు. రావణుడిని మనిషి అని అనరు. కానీ 5 వికారాలు పురుషునివి, 5 వికారాలు స్త్రీవి చూపిస్తారు. రావణ రాజ్యంలో ఇరువురిలోనూ వికారాలున్నాయి. మనలో కూడా 5 వికారాలుండేవని, ఇప్పుడు మనం శ్రీమతంపై నిర్వికారిగా అవుతూ ఉంటామని మీకు తెలుసు. పాడైనదానిని బాగు చేస్తున్నాము. ఏ విధంగానైతే తండ్రి అందరి దుర్భాగ్యాన్ని సరి చేస్తారో, అలా పిల్లలలో కూడా – మేము పాడైనవారిని ఎలా బాగు చేయాలి అనే ఉత్సుకత ఉండాలి. మనుష్యమాత్రులందరూ ఒకరినొకరు పాడు చేస్తూ ఉంటారు. దుర్భాగ్యాన్ని సరి చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఏ విధంగానైతే మీరు బాగయ్యారో, అలా దుఃఖిత ఆత్మలకు ఎలా వెళ్ళి సహాయం చేయాలి అనే తపన ఉండాలి. తండ్రి యొక్క ఉత్సుకతను, సుపుత్రులైన పిల్లలు మాత్రమే పూర్తి చేయగలరు. ఎవరి దుర్భాగ్యాన్ని అయినా ఎలా సరి చేయాలి అని పిల్లల బుద్ధిలో ఉత్సుకత ఉండాలి. మిత్ర-సంబంధీకులకు కూడా అర్థం చేయించాలి. వారికి కూడా మార్గాన్ని తెలియజేయాలి. దుఃఖితులుగా ఉన్న జీవాత్మలను 21 జన్మల కోసం సుఖమయంగా చేయాలి, ఎంతైనా వారు మన సోదరీ-సోదరులు, చాలా దుఃఖితులుగా, అశాంతిగా ఉన్నారు. మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము కావున వెళ్ళి ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి, భాషణ ఎలా చేయాలి అన్న ఆలోచన కలగాలి. ఇంటింటికీ వెళ్ళాలి, మందిరాలకు వెళ్ళాలి. తండ్రి ఏమని డైరెక్షన్ ఇస్తారంటే – మందిరాలలో చాలా సేవ చేయవచ్చు. భక్తులు అనేకమంది ఉన్నారు, అంధ విశ్వాసంతో శివుని మందిరాలకు చాలామంది వెళ్తారు. లోపల ఏదో ఒక అశ పెట్టుకుని వెళ్తారు. శివుడు మా తండ్రి అని అర్థం చేసుకోరు. వారికి ఇంతటి మహిమ ఉందంటే తప్పకుండా ఎప్పుడో ఏదో చేసి వెళ్ళి ఉంటారు. శివుని మందిరాలకు ఎందుకు వెళ్తారు! అమరనాథ్ యాత్రకు ఎందుకు వెళ్తారు! బ్రాహ్మణులు లేక సన్యాసులు ఎంతోమంది యాత్రికులను తీసుకువెళ్తారు. ఇది భక్తి మార్గపు వ్యాపారము, దీని ద్వారా బాగుపడరు. భోళానాథుడైన తండ్రే వచ్చి దుర్భాగ్యాన్ని సరి చేస్తారు. వారు విశ్వానికి రచయిత మరియు యజమాని కానీ స్వయం అలా అవ్వరు. యజమానులుగా పిల్లలైన మిమ్మల్ని చేస్తారు. కానీ వారు ఉన్నతమైనవారు, వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంది. మేము సోదరీ-సోదరులకు మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని మీకు మనసులో అనిపించాలి. ఎవరినైనా దుఃఖితులుగా, రోగగ్రస్తులుగా చూసినప్పుడు వారిపై దయ కలుగుతుంది కదా. తండ్రి అంటారు – ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంత సుఖమయంగా చేస్తానంటే ఇక అర్ధకల్పం కోసం రోగగ్రస్తులుగా అవ్వరు. కావున పిల్లలైన మీరు ఇతరులకు కూడా సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేయాలి. సేవ చేయాలన్న ఉత్సుకత ఉన్నవారు ఒక చోట ఉండలేరు. మేము కూడా వెళ్ళి ఎవరికైనా సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేయాలని భావిస్తారు. బాబా అయితే చాలా సవాలు చేస్తూ ఉంటారు. అవినాశీ జ్ఞాన రత్నాల ధారణ పూర్తిగా జరిగినట్లయితే అనేకుల కళ్యాణము చేయగలుగుతారు. ఈ రాజ్య స్థాపనలో ధనం యొక్క అవసరముండదు. ఆ మనుష్యులైతే రావణుని మతంపై పరస్పరంలో కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. మనం రావణుడి నుండి రాజ్యము లాక్కుంటాము. రామ రాజ్యము రాముని ద్వారానే లభిస్తుంది. రామ రాజ్యము సత్యయుగంలో ప్రారంభమవుతుంది, ఇక్కడ కలియుగంలో రామ రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది. ఇది రావణ రాజ్యము, అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. ఎవరైతే పేదవారు, వ్యాపారస్థులు ఉన్నారో వారికి మొదట అర్థం చేయించాలి. ఇకపోతే పెద్ద వ్యక్తులు – మాకు తీరిక లేదు, మేము బిజీగా ఉన్నాము అని అంటారు. వారు – మేము భారత్ ను స్వర్గంగా చేస్తున్నామని భావిస్తారు, దాని కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ శివబాబా తప్ప ఇంకెవ్వరూ స్వర్గాన్ని తయారుచేయలేరని మీకు తెలుసు. ఇప్పుడిక కొద్ది సమయమే మిగిలి ఉంది. రామ రాజ్యాన్ని స్థాపన చేయడంలో సోమరిగా ఉండకూడదు. ఎవరినైనా దుఃఖము నుండి ఎలా విడిపించాలని రాత్రింబవళ్ళు చింత ఉండాలి. సోదరీ-సోదరులకు మార్గాన్ని ఎలా తెలియజేయాలని పిల్లలకు మనసులో అనిపించాలి. ఇప్పుడు అందరూ రావణుని మతంపై ఉన్నారు. తండ్రి అయితే తండ్రే, వారు వచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. మనుష్యులు కోర్టుకు వెళ్ళి ఏమంటారంటే – ఈశ్వరుడు హాజరై ఉన్నారని, వారు అన్నింటినీ చూస్తున్నారని భావిస్తూ సత్యము చెప్తాము అని. మరి ఒకవేళ వారు సర్వవ్యాపి అయినట్లయితే ఇక ఎవరికి ప్రార్థన చేస్తున్నారు! వారికి ఏమీ తెలియదు. మిత్ర-సంబంధీకులను మేల్కొల్పండి అని తండ్రి పదే-పదే అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. క్రోధము యొక్క అంశము కూడా ఉండకూడదు, కానీ పిల్లల్లో అందరూ అయితే ఇలా తయారవ్వలేరు. చాలామంది పిల్లలకు మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. ఎంతగా అర్థం చేయించినా, విననే వినరు. అందరూ మంచి రీతిలో తండ్రి సేవలో నిమగ్నమవ్వడానికి బహుశా సమయం పట్టవచ్చు అని తండ్రి కూడా అర్థం చేసుకుంటారు. బాబా, మమ్మల్ని సేవకు పంపించండి, మేము వెళ్ళి ఇతరుల కళ్యాణం చేస్తాము – ఇలా బాబా వద్దకు వచ్చి చెప్పేటువంటి అభిరుచి కూడా ఉండాలి కదా. కానీ అలా చెప్పరు. పిల్లల కర్తవ్యమే సత్యమైన గీతను వినిపించడము. పదాలు రెండే – అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము). బాబా ఈ యుక్తిని మంచి రీతిలో అర్థం చేయించారు. మొట్టమొదటి విషయము ఇదే – పరమపిత పరమాత్మతో మీకేమి సంబంధముంది! కింద ప్రజాపిత బ్రహ్మాకుమారీ అన్న పేరు రాసి ఉంది. బాబా చాలా కొత్త పద్ధతిని, చాలా సహజంగా తెలియజేస్తారు. ఇలాంటి-ఇలాంటి బోర్డులను పెట్టాలి అని బాబాకు ఉత్సుకత ఉంటుంది. బాబా డైరెక్షన్లు ఇస్తారు. తండ్రిని దయాహృదయుడు, ఆనంద సాగరుడు అని అంటారు కావున పిల్లలు కూడా తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వాలి. ఈ చిత్రాలలోనైతే చాలా గొప్ప ఖజానా ఉంది. ఈ చిత్రాలలో స్వర్గానికి యజమానులుగా అయ్యే యుక్తులు ఉన్నాయి. తండ్రి అయితే చాలా యుక్తులను కనుగొంటూ ఉంటారు. కల్పక్రితము కూడా కనుగొన్నారు మరియు ఇప్పుడు కూడా కనుగొన్నారు. ఈ విషయము చాలా బాగుందే, తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది అని మనుష్యులకు టచ్ అవుతుంది. ఇది కూడా రాయండి – మీరు స్వర్గ వారసత్వానికి హక్కుదారులు, మీరు వచ్చి అర్థం చేసుకోండి, ఇది చాలా సహజమైన విషయము అని. కేవలం బోర్డులు తయారుచేసి మంచి-మంచి స్థానాలలో పెట్టాలి. 10-20 స్థానాలలో బోర్డులు పెట్టండి, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా వేయించవచ్చు. మన నుండి దూరమైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారికి ఈ పదాలు తగులుతాయి. అసలు వీరేమి అర్థం చేయిస్తారో తెలుసుకుందాము అని అంటారు. ఈ చిక్కు ప్రశ్నను అర్థం చేసుకున్నట్లయితే మీరు ఒక్క సెకండులో ముక్తి-జీవన్ముక్తులను పొందగలరు అని కూడా రాసి ఉండాలి.
తండ్రి అంటారు – ఒకవేళ మీ జీవితాన్ని తయారుచేసుకోవాలంటే సేవ చేయండి. సాగరుని వద్దకు వచ్చి రిఫ్రెష్ అయి మళ్ళీ సేవ చేయాలి. భక్తి మార్గంలోనైతే అర్ధకల్పం ఎదురుదెబ్బలు తిన్నారు. ఇక్కడైతే ఒక్క సెకండులో తండ్రిని తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది అందరి వానప్రస్థ అవస్థ. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది అన్నింటికన్నా మంచి వ్యాపారము. ఇకపోతే మనుష్యులు ఏవైతే చేస్తారో, అవి తప్పుడు వ్యాపారాలు. కేవలం ఒక్క వ్యాపారమే చేయాలి – తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. కాలేజీలకు వెళ్ళి ప్రిన్సిపాళ్ళకు అర్థం చేయించినట్లయితే చదువుకునేవారు కూడా అర్థం చేసుకుంటారు. మీరు ఎంత సహజంగా వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చాలా చాలా మధురంగా అవ్వాలి. క్రోధం యొక్క అంశాన్ని కూడా తొలగించివేయాలి. తండ్రి సమానంగా దయా హృదయులుగా అయి సేవలో తత్పరులై ఉండాలి.
2. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది వానప్రస్థ అవస్థ, అందుకే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. భారత్ ను రామరాజ్యంగా తయారుచేసే సేవలో తమదంతా సఫలం చేయాలి.
వరదానము:-
అన్నింటికన్నా పెద్ద బలహీనత దేహాభిమానము. దేహాభిమానం యొక్క సూక్ష్మ వంశం చాలా పెద్దది. దేహాభిమానాన్ని బలి ఇవ్వడము అనగా అంశం మరియు వంశం సహితంగా సమర్పితమవ్వడము. ఇటువంటి బలి ఇచ్చేవారే మహా బలవాన్ గా అవుతారు. ఒకవేళ దేహాభిమానం యొక్క అంశాన్ని ఏదైనా దాచి పెట్టుకున్నారంటే, అభిమానాన్నే స్వమానమని భావించారంటే, అందులో అల్పకాలిక విజయం కనిపిస్తుంది కానీ బహుకాలం యొక్క ఓటమి ఇమిడి ఉంటుంది.
స్లోగన్:-
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు
1 – ఈ అవినాశీ జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానమని అంటారు, ఈ జ్ఞానము యొక్క అర్థము – జీవిస్తూ మరణించడము, అందుకే కోట్లలో ఎవరో అరుదుగా ఈ జ్ఞానం తీసుకునేందుకు ధైర్యం ఉంచుతారు. ఈ జ్ఞానం ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేస్తుందని అయితే మనకు తెలుసు. మనము ఏదైతే వింటామో, ప్రాక్టికల్ గా అలా అవుతాము. ఇటువంటి జ్ఞానాన్ని ఏ సాధు-సత్పురుషులు, మహాత్ములు ఇవ్వలేరు. వారు మన్మనాభవ అని చెప్పరు. ఇప్పుడు ఈ ఆజ్ఞను కేవలం పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు. మన్మనాభవ అంటే అర్థము, నాతో యోగము జోడించండి. ఒకవేళ నాతో యోగం జోడించినట్లయితే నేను మిమ్మల్ని పాపాల నుండి ముక్తులుగా చేసి వైకుంఠం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తాను. మీరు అక్కడకు వెళ్ళి రాజ్యం చేస్తారు, అందుకే ఈ జ్ఞానాన్ని రాజులకే రాజు అని అంటారు. ఇప్పుడు ఈ జ్ఞానము తీసుకోవడమనేది చాలా ఖరీదైన వ్యాపారము, జ్ఞానం తీసుకోవడమనగా – ఒక్క వేటుతో జీవిస్తూ మరణించడము. శాస్త్రాలు మొదలైనవాటి జ్ఞానం తీసుకోవడమనేది చాలా సులువైన వ్యాపారము. అక్కడైతే ఘడియ-ఘడియ మరణించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వరు. అందుకే బాబా అంటారు – ఇప్పుడేదైతే చేయాలో అది ఇప్పుడే చేయండి, ఇక తర్వాత ఈ వ్యాపారము ఉండదు.
2 – పరమపిత పరమాత్మను సత్-చిత్-ఆనంద స్వరూపుడని కూడా అంటారు, ఇప్పుడు పరమాత్మ సత్యాన్ని ఎందుకు వినిపిస్తారు? ఎందుకంటే వారు అవినాశీ, మరణము లేనివారు, వారెప్పుడూ అసత్యము కారు. వారు వృద్ధాప్యము లేనివారు, అమరుడు మరియు పరమాత్మను చైతన్య స్వరూపుడని కూడా అంటారు. చైతన్యము అంటే అర్థము పరమాత్మ కూడా మనసు-బుద్ధి సహితంగా ఉన్నారు, వారిని నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ అని అంటారు. వారు జ్ఞాన-యోగాలను నేర్పిస్తున్నారు, అందుకే పరమాత్మను చైతన్యమని కూడా అంటారు, అయితే వారు జనన మరణ రహితుడు కూడా. వారు ఆత్మలైన మన వలె జన్మ తీసుకోరు. ఈ జ్ఞానాన్ని మరియు శాంతిని ఇచ్చేందుకు పరమాత్మ కూడా బ్రహ్మా తనువును లోన్ గా తీసుకోవాల్సి ఉంటుంది. వారు చైతన్యంలో ఉన్నారు కావుననే మనకు ఈ ముఖం ద్వారా జ్ఞాన-యోగాలను నేర్పిస్తున్నారు, అంతేకాక పరమాత్మను సత్-చిత్-ఆనంద స్వరూపుడని కూడా అంటారు, అయితే ఈ గుణాలన్నీ పరమాత్మలో నిండి ఉన్నాయి, అందుకే పరమాత్మను సుఖ-దుఃఖాలకు అతీతుడు అని అంటారు. మనము పరమాత్మను దుఃఖదాత అనేమీ అనము. వారు సదా సుఖము మరియు ఆనందము యొక్క భాండాగారము. వారి గుణాలు సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్నప్పుడు ఇక వారు ఆత్మలమైన మనకు దుఃఖము ఎలా ఇవ్వగలరు!
3 – అనాదిగా తయారై తయారుచేయబడి ఉన్న ఈ సృష్టి డ్రామా ఏదైతే నడుస్తుందో, దానంతటినీ పరమాత్మ నడిపిస్తున్నారని చాలామంది మనుష్యులు భావిస్తున్నారు, అందుకే వారు ఏమంటారంటే – మనుష్యుల చేతిలో ఏమీ లేదు… చేసేవారు-చేయించేవారు స్వామి… అంతా పరమాత్మే చేస్తారు, సుఖము మరియు దుఃఖము, ఈ రెండు భాగాలను పరమాత్మే తయారుచేసారు అని అంటారు. ఇప్పుడు ఇటువంటి బుద్ధి కలవారిది ఎలాంటి బుద్ధి అని అనాలి? వారు మొట్టమొదటగా అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే – ఈ అనాదిగా తయారై తయారుచేయబడిన సృష్టి ఆట ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటుంది. ఇంకా, ఇదంతా పరమాత్మనే చేస్తారని అంటారు. పరమాత్మను చేసేవారు-చేయించేవారు అని ఏదైతే అంటారో, ఈ పేరు ఏ గొప్పవారిది? ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మొదటగా ఏమి అర్థం చేసుకోవాలంటే – ఈ సృష్టి యొక్క అనాది నియమము ఏదైతే ఉందో, అదేమిటంటే ఇది తయారై తయారుచేయబడినది. ఏ విధంగానైతే పరమాత్మ అనాదినో, అదే విధంగా ఈ చక్రం కూడా ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు అనాదిగా, అవినాశీగా తయారై తయారుచేయబడినది. ఏ విధంగానైతే బీజములో వృక్షం యొక్క జ్ఞానము ఉంది అన్నది అర్థమవుతుంది మరియు వృక్షములో బీజముంది అన్నది అర్థమవుతుంది, రెండూ కంబైండ్ గా ఉన్నాయి, రెండూ అవినాశీగా ఉన్నాయి. ఇకపోతే, బీజము యొక్క పనేమిటి, బీజము నాటితే వృక్షము వస్తుంది. ఒకవేళ బీజము నాటకపోతే వృక్షము ఉత్పన్నమవ్వదు. కావున పరమాత్మ కూడా స్వయంగా ఈ మొత్తం సృష్టికి బీజరూపుడు మరియు పరమాత్మ యొక్క పాత్ర బీజము నాటడము. పరమాత్మ ఏమంటారంటే – నేనెప్పుడైతే బీజము నాటుతానో, అప్పుడే నేను పరమాత్మను, లేదంటే బీజము మరియు వృక్షము అనాది, ఒకవేళ బీజము నాటకపోతే వృక్షమెలా వెలువడుతుంది! ఎప్పుడైతే నేను పరమ కార్యాన్ని చేస్తానో, అప్పుడే నా పేరు పరమాత్మ. ఎప్పుడైతే నేను స్వయంగా పాత్రధారినై బీజము నాటుతానో, అప్పుడది నా సృష్టి అవుతుంది. సృష్టి యొక్క ఆది కూడా చేస్తాను మరియు అంతము కూడా చేస్తాను. నేను చేసేవాడిగా అయ్యి బీజము నాటుతాను, బీజం నాటే సమయంలో ఆది చేస్తాను మరియు చివర్లో కూడా బీజము వస్తుంది, అప్పుడిక మొత్తం వృక్షము బీజము యొక్క శక్తిని పట్టుకుంటుంది. బీజము అనగా రచించడము, మళ్ళీ దానిని అంతము చేయడము. పాత సృష్టిని అంతము చేయడము మరియు కొత్త సృష్టిని ప్రారంభించడము, అంతా పరమాత్మనే చేస్తారని దీనినే అంటారు. అచ్ఛా, ఓం శాంతి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!