31 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
30 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మా తండ్రి మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చారని మీకు నషా ఉండాలి. మనం వారి సమ్ముఖంగా కూర్చున్నాము”
ప్రశ్న: -
కర్మల గుహ్య గతి తెలిసినవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు?
జవాబు:-
స్మృతిలో ఉండే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు, ఎందుకంటే స్మృతితోనే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలను, కర్మభోగాన్ని సమాప్తం చేసుకోకపోతే, దానికి శిక్షలు అనుభవించవలసి ఉంటుందని మరియు పదవి కూడా భ్రష్టమైపోతుందని, పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుందని వారికి తెలుసు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. బాప్ దాదా సమ్ముఖంగా రావడాన్ని చూసినప్పుడు, పిల్లలకు అపారమైన సంతోషము యొక్క పాదరసం ఎక్కుతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఏమి చేసేందుకు వచ్చారు? పిల్లలకు ఈ నషా ఎక్కి ఉంది. స్వర్గానికి యజమానులుగా చేయడానికి తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలందరికీ తెలుసు. మనల్ని యోగ్యులుగా చేస్తున్నారు. మనకు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే యుక్తులను పదే-పదే తెలియజేస్తున్నారు. ఆ యుక్తి చాలా సహజమైనది. పిల్లలకు చాలా సహజమైన స్మృతిని నేర్పిస్తారు. అజ్ఞాన కాలంలో తండ్రికి కొడుకు జన్మిస్తే, నాకు వారసుడు జన్మించాడని భావిస్తారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. మీరంతా ఎలాగూ శివబాబా పిల్లలే. కానీ మీకు వినిపించగలిగేలా మరియు మీరు వారి నుండి వినగలిగేలా తండ్రి మిమ్మల్ని తమవారిగా ఎలా చేసుకోగలరు? శివబాబా ఈ బ్రహ్మా తనువు ద్వారా చెప్తున్నారు – నేను మీ తండ్రిని, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. కేవలం పతితంగా ఉన్న మీ ఆత్మ ముక్తిధామానికి గాని, జీవన్ముక్తిధామానికి గాని వెళ్ళలేదు. మీరంతా ఒక్క తండ్రి పిల్లలు. అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. ఎంతోమంది పిల్లలున్నారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. దత్తత తీసుకుంటూ ఉంటారు. ఓ ఆత్మలు, ఇప్పుడు మీరు నా సంతానము. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎవరినైతే మనం అర్ధకల్పం పాటు స్మృతి చేసామో, మనకు ఆ బాబా లభించారు, ఇది ఎప్పుడూ మర్చిపోకండి. ఓ పతిత పావన, ఓ దుఃఖహర్త-సుఖకర్త అని ఆత్మ అర్ధకల్పం నుండి ఈ శరీరం ద్వారా స్మృతి చేస్తూ వచ్చింది, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు మేము చాలా సుఖమయంగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని మిల్లులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయి అని ఎవరైతే భావిస్తారో, ఇవన్నీ అల్పకాలికమైనవి. అంతిమంలో చాలా దుఃఖంతో రక్షణ కొరకు అలమటిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడతాయి. ఇంతటి ఆస్తి సెకెండులో సమాప్తమైపోతుంది. తండ్రి నుండి మీకు సెకెండులో వారసత్వం లభిస్తుంది. మీకు సెకెండులో స్వర్గ రాజ్యాధికారం ఇస్తానని అంటారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అంతా శుభ్రంగా అవ్వాలి కదా. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రంగా అవుతుంది. పిల్లలు ఎంత శ్రమిస్తున్నారు అనేది బాప్ దాదా, ఇరువురూ అర్థం చేసుకోగలరు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి చాలా తక్కువ శ్రమను ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ ఆత్మిక తండ్రి నిరాకారుడు, ఆత్మలైన మనం వారిని పిలుస్తాము కదా. పతితంగా అయిన మీ ఆత్మ పావనంగా ఎలా అవుతుంది అని తండ్రి అంటారు. పతితపావనుడు అయితే ఒక్క తండ్రి మాత్రమే కదా. నీటి నదులు పతిత పావని అయితే, వెంటనే వెళ్ళి మునకలు వేసి రావాలి. గంగా స్నానాలు చాలామంది చేస్తారు, అయినా పతితులుగానే ఎందుకున్నారు? రాత్రింబవళ్ళు ఇదే జపిస్తూ ఉంటారు – పతితపావన సీతారామ, అనగా భక్తులందరి రక్షకుడు లేక సీతలందరి రక్షకుడు ఒక్క రాముడైన పరమపిత పరమాత్మ. వారే పతితపావనుడు, పతులకే పతి. వారు వచ్చినప్పుడే పావనంగా చేస్తారు. కనుక ఇప్పుడు తండ్రి అంటారు – మీరు నా శ్రీమతమును అనుసరించాలి, ఇతురులెవ్వరి మతమును అనుసరించకండి. భక్తితో భగవంతుడు లభిస్తారని వారు భావిస్తారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే, భక్తులను రక్షించడానికి వారు వస్తారని ఎందుకంటారు? భక్తులకు ఏ ఆపద వచ్చిందని వారిని రక్షిస్తారు? ఏదైనా ఆపద వస్తే, రక్షించడమనేది జరుగుతుంది. మీరు ఎంత దుర్గతిని పొందారని తండ్రి అంటారు. ఇది రౌరవ నరకము, అందరూ దుఃఖితులుగా, రోగగ్రస్తులుగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఏమేమి జరుగుతుందో చూడండి. దుఃఖమే దుఃఖముంది, అందుకే బాబా, మా దుఃఖాన్ని హరించండి, సుఖమివ్వండి అని పిలుస్తారు. భారత్ లోనే సదా సుఖముండేది, ఇప్పుడు దుఃఖముంది. ఇది భారత్ కు సంబంధించిన విషయము, మిగతా ఖండాలు వేరు. అవి తర్వాత వెలువడతాయి. కొందరు 60 జన్మలు, కొందరు అంతకన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. దేవతా ధర్మం వారు 84 జన్మలు తీసుకుంటారు. కనుక ఈ లెక్కన అర్ధకల్పం తర్వాత ఎవరైతే వస్తారో, వారు 84లో సగం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ 84 జన్మల చక్రం తిరుగుతారని కాదు. మనుష్యులకు ఏది తోస్తే, అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకుంటున్నారు. రత్నాలైతే చాలా విలువైనవి. తండ్రి అర్థం చేయించడం కూడా చాలా సహజంగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు పిలుస్తూ వచ్చారు, అందుకే తండ్రి వచ్చారు. మనము పావనంగా అయినట్లయితే, స్వర్గానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శివబాబా మనల్ని రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా, రాతినాథుల నుండి పారసనాథులుగా తయారుచేయడానికి వచ్చారు. భక్తి మార్గపు చిత్రాలన్నీ రాతితో తయారుచేయబడినవి. రాళ్ళతో తల బాదుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు – మీరు ఎంత శ్రమించినా కానీ లాభమేమీ ఉండదు. ఇంతకుముందు తమను తాము బలి ఇచ్చుకునేవారు. కానీ ఏమి లాభం కలిగింది? మహా అయితే దేవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది, తర్వాత, ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. పతితపావనుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే సంగమంలో వస్తారు. సత్యయుగంలో భక్తి మార్గపు విషయాలు అసలు ఉండవు. శిరస్సును ఖండించుకోండి, ఇది చేయండి అని అయితే తండ్రి చెప్పరు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏమేమో చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దేవీలకు మనుష్యులను బలి ఇచ్చేవారు. మీరు బాగున్నప్పుడు దేవతలుగా ఉండేవారని తండ్రి అంటారు. ఇప్పుడు ఎంత రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు! మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చాను. ఎన్ని బంగారు, వజ్రవైఢూర్యాల మహళ్ళు ఉండేవి, అపారమైన ధనం ఉండేది. దానిని ఏమి చేసారు? ఇప్పుడు మీరు ఎంత దుఃఖితులుగా అయిపోయారు. మీరు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మం వారిగా ఉండేవారు కదా. ఇప్పుడు కేవలం మీరు రజో, తమోలోకి వచ్చారు. మీరు దేవతా ధర్మం వారిగా ఉండేవారు, మరి స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటారు? ఇతర ధర్మాలవారందరూ తమ-తమ ధర్మాలనే నమ్ముతారు. ధర్మమైతే ఒక్కటే ఉంటుంది కదా. ముసల్మానులది ముస్లిమ్ ధర్మము, క్రిస్టియన్లది క్రిస్టియన్ ధర్మము, ఇవి కొనసాగుతూ వస్తాయి. మీకు ఏమయ్యింది? మీరు చాలా సుఖమయంగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయిపోయారు? వాస్తవానికి మేము సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారము, తర్వాత సంపూర్ణ వికారులుగా ఎలా అయ్యాము అనేది అసలెవరికీ తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోగా అయ్యారు, ఇప్పుడు పూర్తిగా తమోప్రధానంగా, పతితులుగా ఉన్నారు. తప్పకుండా సత్యయుగం నుండి కలియుగం వరకు వస్తాము. అన్ని ధర్మాలు సతో, రజో, తమోలలోకి రావాల్సిందే, వృద్ధిని పొందాల్సిందే. మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా. వృక్షంలో చూడండి – అంతిమంలో బ్రహ్మా నిలబడి ఉన్నారు, బ్రహ్మాయే 84 జన్మలు తీసుకొని వెళ్ళి, అంతిమంలో వృక్షం యొక్క శిఖరంలో నిలబడి ఉన్నారు. కింద కూర్చుని ఉన్న బ్రాహ్మణులైన మీరు మళ్ళీ అంతిమంలో పతితులుగా, శూద్రులుగా అయ్యారు. కింద మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వృక్షంలో చాలా మంచి వివరణ ఉంది. ఇప్పుడు మీరు రాజయోగ తపస్సును చేస్తున్నారు. మీ స్మృతిచిహ్నమే నిలబడి ఉంది. ఇది చైతన్య దిల్వాడా మందిరం, అది జడమైనది. సత్యయుగంలో ఇది ఉండేది కాదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాన్ని చూసుకుంటున్నారు. మీరు ప్రాక్టికల్ గా సత్యాతి-సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చున్నారు. స్వర్గ స్థాపన జరుగుతుంది. తర్వాత స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవేవీ ఉండవు. మమ్మా-బాబా మరియు పిల్లలైన మనం కూర్చున్నాము. ఇది అచ్చంగా మీ మందిరమే. మధుబన్, ఒక చైతన్య దిల్వాడా మందిరం అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు, మళ్ళీ ఈ మందిరాలను నిర్మిస్తారు. తండ్రి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేసారు కనుక మీరే మళ్ళీ వారి మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు, యోగ్యత అనుసారంగా, శక్తి అనుసారంగా అందరూ నిర్మిస్తారు.
మేము పూజ్యులుగా ఉండేవారమని, తర్వాత ద్వాపరంలో పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. ఇంతటి షావుకార్లుగా చేసిన శివబాబాకు, భక్తిలో మళ్ళీ మీరే మందిరాలు నిర్మిస్తారు. ఈ విషయాలు ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. కనుక ఇప్పుడు పురుషార్థం చేసి, మళ్ళీ రాజులకే రాజుగా అవ్వాలి. సత్యయుగంలో మహారాజులు అని అంటారు, త్రేతాలో రాజులని అంటారు. తర్వాత ప్రపంచం పతితంగా అయినప్పుడు మహారాజులు కూడా పతితంగా అవుతారు, రాజులు కూడా పతితంగా అవుతారు. వారు నిర్వికారీ మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను నిర్మిస్తారు, తర్వాత దేవతలవి నిర్మిస్తారు. వారంతట వారే మందిరాలను నిర్మించి పూజిస్తారు, 84 జన్మలు అనుభవిస్తారు కదా. మీరు అర్ధకల్పం పూజ్యులుగా, అర్ధకల్పం పూజారులుగా అవుతారు. మనుష్యులు భగవంతుని గురించి, వారే పూజ్యుడు, వారే పూజారి అని అనుకుంటారు. అంతా వారే ఇస్తారు, వారే తీసేసుకుంటారు అని అంటారు. అచ్ఛా, వారే ఇచ్చి వారే తీసుకున్నప్పుడు మీకెందుకు చింత కలుగుతుంది? ఇక మీరు ట్రస్టీలైనట్లు. ఇక ఏడ్వాల్సిన అవసరం ఏముంది? తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు నంబరువారుగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు తండ్రిని అసలు స్మృతి చేయరు. దేహీ-అభిమానులుగా ఉండరు. ఇక్కడ ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది – అరే, మీరు ఆత్మలు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు అని. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. ఆత్మయే బ్యారిస్టరుగా అవుతుంది, ఆత్మయే మెజిస్ట్రేటుగా అవుతుంది. రేపు ఏమవుతారు? ఒకవేళ ఆత్మ తండ్రిని మంచి రీతిగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. ఇక మృత్యులోకంలో మరో జన్మ తీసుకోదు. ఒకవేళ ఏవైనా లెక్కాచారాలు మిగిలి ఉంటే, శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కర్మ భోగాన్ని అనుభవించి సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు ఉన్నత పదవి లభించదు. తండ్రి ఈ కర్మల గుహ్యగతిని పిల్లలకు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. సత్యయుగం సతోప్రధానమైనదని కూడా పిల్లలకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. కృష్ణుడు ఆవులను సంభాళించేవారని అంటారు. రాజులు ఆవులను సంభాళిస్తారా? ఇలాంటిదేమీ ఉండదు. సత్యయుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయని చూపిస్తారు, వాటిని కామధేనువు అని అంటారు. జగదంబ సరస్వతి కూడా కామధేనువు. 21 జన్మల కోసం అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. మీరు కూడా కామధేనువులే. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులకు కూడా ఈ పేరే పెట్టారు. రాజుల ఇళ్ళల్లో చాలా ఫస్ట్ క్లాస్ ఆవులుంటాయి. ఇక్కడి రాజుల వద్దనే మంచి-మంచి ఆవులు ఉన్నప్పుడు, స్వర్గంలో ఇంకెంత సుందరంగా ఉంటాయి. అక్కడ అసలు ఎటువంటి దుర్గంధం ఉండదు.
ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తారు – నేను వచ్చాను, మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసి నాతో పాటు తీసుకువెళ్తాను. ఓ పతిత పావనా రండి, పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రండి అని నన్ను పిలుస్తారు. వీరు (బ్రహ్మా) పతితంగా ఉన్నారు, వారు పావన ఫరిశ్తా. పోల్చడం జరుగుతుంది. మీరు కూడా పతితం నుండి అలాంటి పావన ఫరిశ్తాలుగా అవుతారు. సత్యయుగీ దేవతలను ఇంగ్లిష్ లో డైటీలని అంటారు. ఫరిశ్తాలు సూక్ష్మవతనవాసులు. ఇప్పుడు మీరు ఫరిశ్తాలుగా, పవిత్రంగా అవుతారు. తండ్రి ఎంత సహజమైన శిక్షణనిస్తారు. ఇక్కడకు వచ్చినప్పుడు, బయటి మిత్ర-సంబంధీకులు, ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిని గుర్తు చేసుకోకూడదు. తండ్రి సమ్ముఖంగా వచ్చారు కదా! యోగం యొక్క సంపాదన చేసుకోవడానికే ఇక్కడకు వచ్చారు కనుక ఇందులో నిమగ్నమవ్వాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు, యోగబలంతో పాత లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీగా ఉంటూ అంతా సంభాళించాలి. ఏ విషయంలోనూ చింతించకూడదు. ఆత్మాభిమానులుగా అవ్వాలి.
2. ఇది సంపాదన యొక్క సమయము. ఇందులో ఇళ్ళు-వాకిళ్ళు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిని గుర్తు చేసుకోకూడదు. ఫరిశ్తాలుగా అయ్యేందుకు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి.
వరదానము:-
వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి యొక్క అవసరముంది. రోజు-రోజుకు అశాంతికి గల అనేక కారణాలు పెరుగుతూ ఉన్నాయి మరియు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ స్వయం అశాంతిగా లేకపోయినా సరే, ఇతరుల అశాంతి యొక్క వాయుమండలం, వాతావరణం శాంతి అవస్థలో కూర్చోనివ్వవు. అశాంతి వలన కలిగే టెన్షన్ యొక్క అనుభవం పెరుగుతుంది. అటువంటి సమయంలో మాస్టర్ శాంతిసాగరులైన మీరు, అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి, విశేషంగా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపజేయండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!