31 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 30, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సదా సుఖమయంగా ఉండండి, ఎంతగా స్మృతి చేస్తారో, అంత సుఖం లభిస్తుంది. తండ్రి పిల్లలైన మీకు ఇదే ఆశీర్వాదాన్ని ఇస్తారు’’

ప్రశ్న: -

సంగమయుగంలో పిల్లలైన మీరు మొత్తం కల్పంలో జరగని ఎటువంటి శుభ కార్యాన్ని చేస్తారు?

జవాబు:-

పవిత్రంగా అవ్వడము మరియు తయారుచేయడము – ఇది అన్నింటికన్నా శుభకార్యము. పవిత్రంగా అవ్వడంతో మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. పవిత్రంగా అవ్వడానికి తండ్రి యుక్తిని తెలియజేసారు – మధురమైన పిల్లలూ, మీరు నన్ను ప్రేమగా స్మృతి చేయండి. దేహీ-అభిమానులుగా అవ్వండి. ఈ యుక్తిని అందరికీ వినిపిస్తూ ఉండండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఎవరు ఈ ఆటను అంతా రచించారు..

ఓంశాంతి. శివబాబా కూర్చుని తమ పిల్లలకు, సాలిగ్రామాలకు అర్థం చేయిస్తారు. శివబాబా అయితే అందరికీ తెలుసు. శివబాబాకు తమ శరీరం లేదు అని కూడా తెలుసు. శివుని ప్రతిమ అయితే ఒక్కటే. ఇందులో ఏమీ తేడా రాదు. వారిని చూపించడం కూడా లింగం వలె చూపిస్తారు. ఎలాగైతే మనుష్యులున్నారో, ఆ మనుష్యలలో ఎలాంటి తేడా ఉండజాలదు. కనులు, ముక్కు, చెవులు అందరికీ రెండు ఉన్నాయి. ఆత్మ దాగి ఉన్న వస్తువేమీ కాదు. ఎలాగైతే మనుష్యులకు, దేవతలకు పూజ జరుగుతుందో, అలా ఆత్మలకు మరియు పరమాత్మకు కూడా పూజ జరుగుతుంది. శివుని మందిరానికి వెళ్ళినట్లయితే, అనేక చిన్న-చిన్న సాలిగ్రామాలు పెట్టి ఉంటాయి. వాటికి పూజ జరుగుతుంది. మనుష్యులవి రెండు రకాల పూజలు జరుగుతాయి – ఒకటి వికారులది, రెండవది నిర్వికారులది, దానిని భూత పూజ అని అనడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడైతే ఎవరి శరీరం కూడా పవిత్రంగా లేదు. 5 తత్వాలతో తయారుచేయబడింది. మట్టితో తయారుచేయబడిన బొమ్మ. మూర్తులను తయారుచేస్తారు, అప్పుడు కూడా మట్టి మరియు నీటిని కలుపుతారు. తర్వాత వాటిని ఆరబెట్టేందుకు సూర్యకాంతి కావాలి. సూర్యకాంతి కూడా అగ్ని యొక్క అంశము. ఇదివరకు సూర్యకాంతితో అగ్ని వెలిగించేవారు. కావున పిల్లలకు ఇది తెలుసు, నిరాకారునికి కూడా పూజ జరుగుతుంది, సాకార దేవతలకు కూడా జరుగుతుంది, అలానే మనుష్యులకు కూడా పూజ జరుగుతుంది. దేవతలు పవిత్రమైనవారు, ఇక్కడ అపవిత్రమైనవారు ఉన్నారు. ఇకపోతే, పూజ అయితే భూతాల (5 తత్వాల) కు జరుగుతుంది. ఆత్మ అంటే ఏమిటి – ఇది మనుష్యులకు తెలియదు. రియలైజ్ యువర్ సెల్ఫ్ (స్వయాన్ని తెలుసుకోండి) అని అంటారు. ఆత్మను తెలుసుకోండి. ఆత్మ బిందువు వలె ఉంటుంది. చాలామంది సాక్షాత్కారాలను కూడా చేసుకున్నారు. చిన్న వెలుగు వారి నుండి బయటకు వచ్చి మాలో ప్రవేశించింది అని వర్ణిస్తారు. అచ్ఛా, దీని వలన లాభమైతే ఏమీ కలగలేదు. నారదుడు మరియు మీరా భక్తిలో తీక్షణమైన వారని అంటూ ఉంటారు. అయితే, సాక్షాత్కారాలు జరుగుతాయి కానీ మెట్లు దిగవలసి ఉంటుంది కదా. లాభం అల్పకాలికంగా లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. ఇంతకుముందు మేము దేహ-అభిమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు ఇవి కొత్త విషయాలు. ఆత్మ చదువుకుంటుంది. ఇదైతే పూర్తిగా పక్కా చేసుకోవాలి – బాబా మాకు చదివిస్తున్నారు అని. మొదట ఇది పక్కా నిశ్చయం అయిపోవాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. అర్ధకల్పం ఆత్మాభిమానులుగా అవుతారు, మళ్ళీ అర్ధకల్పం దేహ-అభిమానులుగా అవుతారు. సత్యయుగంలో ఆత్మకు, మాకు పరమాత్మ గురించి తెలుసు అని శుద్ధ అభిమానముండదు. శుద్ధ అభిమానము మరియు అశుద్ద అభిమానము ఉంటాయి కదా. కర్తవ్యాలు కూడా శుభము మరియు అశుభము ఉంటాయి. శుభ కార్యంలో ఆలస్యం చేయకూడదని అంటారు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని ఎంత మంచిగా తయారుచేస్తాను. మీరు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు, ఇటువంటి శుభ కార్యం ఇంకేదీ ఉండదు. మీరు పావనంగా ఉండేవారు. ఇప్పుడు పదే-పదే తండ్రి చెప్తారు – దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిపై పూర్తి ప్రేమనుంచాలి. ఆత్మ యొక్క సంబంధం ఒక్క తండ్రితోనే ఉంది. వారు కూర్చుని చదివిస్తారు. ఇది ప్రాక్టికల్ అనుభవం యొక్క విషయము. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి కూడా అంటారు – ఓ మధురాతి మధురమైన పిల్లలూ! ఆత్మలతో అంటారు. ఆత్మ ఈ చెవులతో వింటుంది. ఈ రోజు మమ్మల్ని మధురాతి-మధురమైన పిల్లలూ అని ఎవరు అంటున్నారో మీరు అర్థం చేసుకుంటారు. మధురాతి-మధురమైన పిల్లలూ. తండ్రికి పిల్లల పైన ప్రేమ ఉంటుంది కదా. చాలా సంతోషంతో పిల్లల యొక్క పాలన చేస్తారు. వీరు కూడా పిల్లలకు అనంతమైన తండ్రి. ఆత్మ అంటుంది – నేను శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా వినిపిస్తాను. అజ్ఞాన కాలంలో తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. వీరు వారసుడు, వీరిని మేము యోగ్యంగా తయారుచేస్తాము దీని ద్వారా చాలా సుఖవంతులుగా అవుతారని తెలుసు. మంచి వారసత్వాన్ని పొందాలి. పిల్లలూ, జీవిస్తూ ఉండండి, సుఖవంతులుగా అవ్వండి అని ఆశీర్వాదాలు వెలువడుతూ ఉంటాయి. కుమారుడు ఎల్లప్పుడు సుఖవంతంగా ఉండాలి. కానీ వారైతే సదా సుఖవంతులుగా ఉండలేరు. పిల్లలైన మీకు తెలుసు – బాబా మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, సదా సుఖవంతులుగా ఉండండి. తండ్రి ఎంత ప్రీతితో, ప్రేమగా, నమ్రతతో కూర్చుని అర్థం చేయిస్తారు . తండ్రి పిల్లలకు సేవకుడు కదా. ఎంతగా పిల్లలకు చాకిరీ చేయవలసి ఉంటుంది. తల్లి మరణిస్తే తండ్రి పిల్లలకు అన్ని చేయవలసి వస్తుంది. ఈ తండ్రి ఎంతగా పిల్లలకు ప్రేమగా అర్థం చేయిస్తారు. తమ కాళ్లపై నిల్చోవాలి. ఓ ఆత్మలూ! మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. దేహ భానాన్ని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి – ఇది చాలా భారీ పాఠము. పిల్లలు పదే-పదే మర్చిపోతారు. బాబాను స్మృతి చేయడం మర్చిపోతున్నామని అంటారు. స్మృతి అనే పదం చాలా సహజమైనది. యోగం మరియు నిష్ఠ మొదలైనవి శాస్త్రాలలోని పదాలు. తండ్రి ఎంత సహజంగా చెప్తారు – కేవలం స్మృతి చేయండి. తండ్రిని చూస్తూనే చాలా సంతోషం అనిపించాలి. మన తండ్రి వంటి తండ్రి ప్రపంచంలో ఇంకెవ్వరికీ లభించరు. మీకు తెలుసు – ఆత్మలైన మనం పతితంగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి పావనంగా తయారుచేస్తారు, అందుకని పిలుస్తారు కూడా – ఓ పతితపావనా! రండి వచ్చి పావనంగా తయారుచేయండి. తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇంక ఎటువంటి కష్టమునివ్వరు. దీని పేరే ఉంది సహజ స్మృతి, సహజ జ్ఞానము. ఇది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు ఆత్మ జ్ఞానం యొక్క సాగరము, జ్ఞానం యొక్క అథారిటీ. ఇక్కడ మనుష్యుల యొక్క మహిమ జరుగుతుంది, ఫలానా వారు శాస్త్రాల యొక్క అథారిటీ అని. ఇక్కడ తండ్రి అంటారు – నాకు మాత్రమే అన్ని వేద శాస్త్రాల గురించి తెలుసు, అథారిటీని. భక్తి మార్గంలో చిత్రాలను కూడా చూపిస్తారు – విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు. వారికి మళ్ళీ శాస్త్రాలనిచ్చారు. బ్రహ్మా ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని అన్ని విషయాలను మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రహ్మా అయితే సూక్ష్మవతనంలో ఉన్నారు. భగవంతుడు మూలవతనంలో ఉన్నారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో ఎవరికి జ్ఞానం వినిపిస్తారు. తప్పకుండా ఇక్కడకు వచ్చి వినిపిస్తారు కదా. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని భగవంతుడు ఎక్కడ వినిపిస్తారు? వినిపించే విషయమైతే ఇక్కడే ఉంటుంది.

భగవంతుడు ఏ విధంగా వచ్చి బ్రహ్మా ద్వారా వినిపిస్తారు అన్నది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. పిల్లలకు అపారమైన సంతోషముండాలి. మనుష్యులు 5-10 లక్షలు సంపాదిస్తారు ఎంత సంతోషముంటుంది! ఇక్కడ తండ్రి కూర్చొని మీ ఖజానాను నింపుతారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు బంగారం లాగ అయిపోతారని వారంటారు. ఈ భారత్ బంగారు పిచ్చుకగా అయిపోతుంది. బాబా మూలవతనం నుండి వచ్చి బ్రహ్మా ద్వారా మనకు శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలుసు. అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఆ యోగం, తపం, దానం, పుణ్యము మొదలైన వాటితో ముక్తి అయితే ఎవ్వరూ పొందరు. ఇవన్ని మార్గాల ద్వారా మేము ముక్తిలోకి వెళ్తామని మనుష్యులు భావిస్తారు. ఒకవేళ అలా జరిగితే మళ్ళీ పతితపావనుడైన తండ్రి వచ్చే అవసరమేముంటుంది. ఒకవేళ అది మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గమైతే ఎవరైనా వెళ్ళా్లి కదా. ప్రపంచంలో మనుష్యులవి అనేక మతాలు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు – తిరిగి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. తండ్రి అంటారు. నేను వీరి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. వీరు కూడా చాలామంది గురువులను ఆశ్రయించారు, ఎంతో చదివారు. తండ్రి అంటారు – వీటన్నింటినీ మర్చిపోండి. పతితపావనుడు అని పరమపిత పరమాత్మనే అంటారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, వృక్షపతి, చైతన్యమైనవారు. ఆత్మలన్నీ చైతన్యమైనవి. మీకు తెలుసు, మేము మూలవతనానికి వెళ్ళి మళ్ళీ పాత్రను అభినయించడానికి వస్తాము అని. అర్ధకల్పం సుఖం యొక్క పాత్రను అభినయిస్తాము. మొత్తం ఆధారమంతా చదువుపై ఉంది, ఎంతగా చదువుకుంటారో, అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది. నరుని నుండి నారాయణునిగా, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉన్నప్పుడు ఎటువంటి హింస జరగదు. అక్కడ వికారాల యొక్క విషయము ఉండదు. అలానే, గొడవలు, కొట్లాటలు ఉండవు.

ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉంటాయో, అప్పుడు భాషలు కూడా అనేకము ఉంటాయని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. అందరిదీ ఒకే భాష ఉండజాలదు. ఇప్పుడు మీ అద్వైత ధర్మం స్థాపన అవుతూ ఉంది. అద్వైతము అన్నా లేక దేవతా అన్నా, ఒకటే అర్థము. ఇప్పుడు మీరు దేవతా ధర్మం వారిగా అవుతున్నారు. పాట కూడా ఉంది కదా, బాబా, మేము మీ నుండి 21 జన్మల కోసం మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం తీసుకుంటాము అని. అక్కడ ఈ విధంగా ఎవరూ అనరు, ఇది మా స్థలము, ఇటువైపు నుండి మీరు వెళ్ళకండి అని. ఇక్కడైతే ఒకరినొకరు భయపెట్టుకుంటూ ఉంటారు. కూర్చుని-కూర్చునే గొడవపడి-కొట్లాడుకునే భూతం వచ్చి కూర్చుంది. మనము శ్రీమతంపై మన రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. మనం భారత్ లోనే ఉంటాము. ఢిల్లీకి దగ్గరలో నదీ తీరాలలో ఉంటాము. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువు ఉంటుంది, అందరూ సుఖంగా ఉంటారు. ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది కదా. మేము ఏ విధంగా మళ్ళీ దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అనేది మీరు అర్థం చేసుకోగలరు. కనుక పిల్లలు తండ్రి స్మృతిలో చాలా సంతోషంలో ఉండాలి. నిరంతరం స్మృతి చేయండి, ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వడం జరగదు, ఇందులోనే శ్రమ ఉంది. పదే-పదే తండ్రి స్మృతిని మర్చిపోతారు. దేహ-అభిమానంలోకి రావడంతో తప్పుడు కర్మలు చేసేస్తారు. దేహాభిమానమే మొదటి వికారము. ఇది మీకు పెద్ద శత్రువు. దేహీ-అభిమానులుగా లేని కారణంగానే మళ్ళీ కామము మొదలైన వికారాలు కాటు వేస్తాయి. గమ్యము ఉన్నతమైనదని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. పవిత్రంగా కూడా ఉండాలి. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. కోట్లాది మందికి భూ-భూ చేస్తూ ఉండండి. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడ మీకు వర్తిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు మీ కార్య వ్యవహారాలు మొదలైనవైతే చేసుకోండి, ఆఫీసులో కూర్చోండి, చూడండి, ఏ ఖాతాదారులు లేరు అన్నట్లయితే స్మృతిలో కూర్చుండిపోండి. మీతో పాటు చిత్రాలు ఉండాలి. తర్వాత మీకు అలవాటైపోతుంది. మేము బాబా స్మృతిలో కూర్చుండిపోతాము. బాబా అనేక రకాల యుక్తులనైతే చెప్తారు. భక్తి మార్గంలో చిత్రాలను గుర్తు చేస్తారు. ఇక్కడ ఇది విచిత్రుని యొక్క స్మృతి. ఇది కొత్త విషయం కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. కొత్త విషయమైన కారణంగా శ్రమ అనిపిస్తుంది. ఇందులో ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. జ్ఞానమైతే లభించింది. విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు అనేది కూడా అర్థము చేయించారు. విష్ణువు అనగా లక్ష్మీ-నారాయణులు, 84 జన్మల తర్వాత వారే బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. ఈ విషయాలు ఇంకే శాస్త్రాలలోనూ లేవు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడుతారు అని కాదు. తండ్రి అంటారు – నేను పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తాను. దాని అర్థం కూడా మీకు తెలుసు. మీ ఈ పదాలు ఎంత గుప్తమైనవి అంటే, వాటిని ఎవ్వరూ కాపీ చేయలేరు. ఈ రోజులలో కాపీ కూడా చేస్తారు కదా. శ్వేత వస్త్రధారులుగా కూడా చాలా మంది అవుతారు, పోటీపడుతూ ఉంటారు. ఇందులో ఎవ్వరూ కాపీ చేయలేరు.

ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, మేము బాబా నుండి రోజూ సమ్ముఖంలో కూర్చుని వింటాము అని. మధుబన్ లో శివబాబా బ్రహ్మా ద్వారా మురళీ నడిపిస్తారు అని బయట ఉన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. ఆత్మనే తండ్రిని స్మృతి చేస్తుంది. స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి ఎందుకంటే ఎప్పటి నుండైతే వికారులుగా అయ్యారో, పాపాలు చేస్తూనే వచ్చారు. కనుక జన్మ-జన్మాంతరాల పాపం తలపై ఉంది. తమోప్రధానంగా అవుతూ ఉంటారు. తమోప్రధానంగా అవ్వడానికి అర్ధకల్పం పట్టింది. సతో, రజో, తమోగా అవుతూ మాలిన్యం చేరుకోవడం ద్వారా ఆత్మ మురికిగా అయిపోతుంది కదా. ఆ మాలిన్యాన్ని తప్పకుండా తొలగించాలి. లేదంటే తండ్రి స్మృతితో తప్ప ఆత్మ ఎగరలేదు. మాయా రావణుడు అందరి రెక్కలను తెంచేస్తాడు. ఇది కూడా అర్థం చేసుకునే విషయము. మోక్షము మొదలైనవేవీ ఎవ్వరికీ లభించనే లభించవు. పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. అంతే ఇందులో ఇక ఏ ఇతర విషయము లేనే లేదు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలో తండ్రి శిక్షణనిస్తారు. పిల్లలకు వ్రాస్తూ కూడా ఉంటారు – పిల్లలూ, మీరు తండ్రిని మర్చిపోయినందున తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలైన మీలో 84 జన్మల జ్ఞానముంది. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసారు. ఆత్మలో చాలా పెద్ద పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతమనిపిస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉంది! మేము 84 జన్మలు తీసుకుంటాము అని ఆత్మ అంటుంది. ఇది కూడా మీకు ఇప్పుడే వివేకం లభించింది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు – ఆత్మలైన మీరు 84 జన్మలు అనుభవిస్తారు. ఒక శరీరాన్ని విడిచి వేరొకదానిని తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అయి రాజ్యం చేయాలి కనుక ఎంత సంతోషం ఉండాలి! బాబా మనకు అనంతమైన వారసత్వం కల్ప-కల్పము ఇస్తూనే ఉంటారు. పిల్లలైన మీకిప్పుడు పరిచయం లభించింది. మీకు తెలుసు – మేము మాలలో మణులుగా అవుతాము మళ్ళీ నంబరువారుగా రాజ్యం చేస్తాము. అక్కడి రాజధానిలో ఏవైతే ఆచారాలు-పద్ధతులు ఉంటాయో, అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. వాటికోసం వ్యర్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఎలా రాజ్యం చేసి ఉంటారో, అలాగే చేస్తారు. అది సాక్షిగా అయి చూడాలి. ఏం జరుగుతుంది అని చింతన చేయాల్సిన అవసరం లేదు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శుభ కార్యంలో ఆలస్యం చేయకూడదు. పవిత్రంగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకొని తమ కాళ్ళపై నిలబడాలి. ఒక్క తండ్రితో పూర్తి ప్రేమను పెట్టుకోవాలి.

2. కార్య వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఎటువంటి వ్యర్థ ఆలోచనలూ చేయకూడదు. సతోప్రధానంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి.

వరదానము:-

పిల్లలకు ఒక్క ఫిర్యాదు ఉంటుంది – సంబంధీకులు వినడం లేదు, సాంగత్యం మంచిగా లేదు, ఈ కారణంగా శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంతో జ్ఞాన స్వరూపము, శక్తి స్వరూపము యొక్క వరదానులుగా అయి తమ స్థితిని స్థిరంగా తయారుచేసుకోండి. సాక్షిగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. తమ సతోగుణీ పాత్రలో స్థితులవ్వండి. సదా తండ్రి సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుణీ ఆత్మ యొక్క సాంగత్యపు రంగు ప్రభావం పడజాలదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top