30 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

30 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

29 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ రావణ రాజ్యం, పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం వస్తుంది, అందుకే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రంగా అయినట్లయితే శ్రేష్ఠమైన దేవీ-దేవతలుగా అవుతారు”

ప్రశ్న: -

తండ్రి తమ పిల్లలకు సత్యనారాయణ కథను వినిపిస్తారు, ఆ కథ రహస్యమేమిటి?

జవాబు:-

ఆ కథ రహస్యమేమిటంటే – రాజ్యాధికారాన్ని తీసుకోవడము మరియు పోగొట్టుకోవడము. అల్లిఫ్ (మొట్టమొదటివాడు అనగా దాదా లేఖ్ రాజ్) కు అల్లా లభించగానే గాడిద చాకిరిని వదిలేసారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే 84 జన్మలు తీసుకొని రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ తండ్రి వారికి రాజ్యాధికారాన్ని ఇస్తారు. పతితుల నుండి పావనంగా అవ్వడము, గాడిద చాకిరి వదిలి రాజ్యాధికారాన్ని తీసుకోవడము – ఇదే సత్యమైన సత్యనారాయణ కథ, దీనినే తండ్రి వినిపిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది… (ఆఖర్ వహ్ దిన్ ఆయా ఆజ్…)

ఓంశాంతి. ఓంశాంతి అర్థాన్ని అయితే ఆత్మిక తండ్రి అర్థం చేయించారు. ఓం అంటే – నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ కనిపించదు. నేను ఆత్మను, ఇది నా శరీరమని అర్థమవుతుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి లేదు. ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలుంటాయి. ముఖ్యమైనది ఆత్మ. ఆ ఆత్మను ఎవ్వరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడముగా అయిపోతుందని అర్థం చేసుకోగలరు. ఆత్మను చూడలేము, శరీరాన్ని చూడగలము. అలాగే ఆత్మకు తండ్రి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని అంటామో, వారు కూడా కనిపించరు. వారిని అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. శరీరంలోకి వచ్చినప్పుడు – వీరు సోదరులు లేక సోదరీ-సోదరులు అని అంటారు. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ. దైహిక సోదరీ-సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, వారిని చూడలేము. తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు వచ్చారు. కొత్త ప్రపంచం సత్యయుగము, ఈ పాత ప్రపంచం కలియుగము. ఇప్పుడు ఇది పరివర్తన అవ్వనున్నది. ఎలాగైతే పాత ఇల్లు సమాప్తమై, కొత్త ఇల్లు తయారవుతుందో, అలా ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. సత్యయుగం తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు ఉంటాయి, మళ్ళీ తప్పకుండా సత్యయుగం వస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవ్వనున్నాయి. సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యముంటుంది. సూర్యవంశం మరియు చంద్రవంశం అర్ధకల్పం ఉంటాయి. వాటిని లక్ష్మీనారాయణుల వంశము, సీతారాముల వంశము అని అంటారు. ఇది సహజమే కదా. తర్వాత, ద్వాపర-కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. అప్పుడు, పవిత్రంగా ఉన్న దేవీ-దేవతలు అపవిత్రంగా అయిపోతారు. దీనిని రావణ రాజ్యమని అంటారు. రావణుడిని ప్రతి సంవత్సరం కాలుస్తారు కానీ అసలు కాలడం లేదు. రావణుడు అందరికీ పెద్ద శత్రువు, అందుకే అతడిని కాల్చే ఆచారం మొదలయ్యింది. భారత్ యొక్క నంబరు వన్ శత్రువు రావణుడు మరియు నంబరు వన్ మిత్రుడు, సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుదా (భగవంతుడు). ఖుదాను దోస్త్ (మిత్రుడు) అని అంటారు కదా. దీనిపై ఒక కథ కూడా ఉంది, కావున భగవంతుడు మిత్రుడు, రావణుడు శత్రువు. ఖుదా దోస్త్ ను ఎప్పుడూ కాల్చరు. రావణుడు శత్రువు కావున 10 తలల రావణుడిని తయారుచేసి అతడిని ప్రతి సంవత్సరం కాలుస్తారు. గాంధీజీ కూడా – మాకు రామ రాజ్యం కావాలని అనేవారు. రామ రాజ్యంలో సుఖముంటుంది, రావణ రాజ్యంలో దుఃఖముంటుంది. ఇప్పుడు ఇదంతా ఎవరు కూర్చొని అర్థం చేయిస్తారు? పతిత పావనుడైన తండ్రి శివబాబా మరియు బ్రహ్మా దాదా. బాబా ఎప్పుడూ – బాప్ దాదా అని సంతకం చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా కూడా అందరికీ చెందినవారు, వారిని ఏడమ్ అని అంటారు. వారిని గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారు మనుష్య సృష్టికి ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు, తర్వాత బ్రాహ్మణులే దేవీ-దేవతలుగా అవుతారు. దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు, వీరిని ప్రజాపిత బ్రహ్మా, మనుష్య సృష్టికి పెద్ద అని అంటారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు. వీరు సాకార బాబా. శివబాబా నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారని అంటూ ఉంటారు. ఇది పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుని ఆసురీ ప్రపంచం సమాప్తమైపోతుంది, ఈ మహాభారత యుద్ధం అందుకే ఉంది. తర్వాత, సత్యయుగంలో శత్రువైన ఈ రావణుడిని ఎవరూ కాల్చరు. అక్కడ అసలు రావణుడు ఉండనే ఉండడు. రావణుడే ఈ దుఃఖపు ప్రపంచాన్ని తయారుచేసాడు. అలాగని, ఎవరి వద్దనైతే చాలా ధనముందో, పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయో, వారు స్వర్గంలో ఉన్నారని కాదు. తండ్రి అర్థం చేయిస్తారు – కొందరి వద్ద కోట్లు ఉన్నా కానీ శాంతి లేదు, ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త గనులు వెలువడతాయి, వాటితో కొత్త ప్రపంచంలోని మహళ్ళు మొదలైనవన్నీ నిర్మించడం జరుగుతుంది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. సత్యయుగంలో వైస్ లెస్, సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. అక్కడ పిల్లలు యోగబలంతో జన్మిస్తారు. అక్కడ వికారాలు ఉండనే ఉండవు. దేహాభిమానముండదు, క్రోధముండదు, కామముండదు. 5 వికారాలు ఉండనే ఉండవు, అందుకే అక్కడ ఎప్పుడూ రావణుడిని కాల్చరు. ఇక్కడ రావణ రాజ్యముంది కావున అందరూ – ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. వారు ముక్తిదాత మరియు సర్వుల దుఃఖహర్త. ఇప్పుడు అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. తండ్రికి వచ్చి విడిపించాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు – మీరు పవిత్రంగా అవ్వండి. ఈ పతిత ప్రపంచం సమాప్తమవ్వనున్నది, ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తారో, వారు శ్రేష్ఠమైన దేవీ-దేవతలుగా అవుతారు. వినాశనమైతే జరుగుతుంది, అందరూ సమాప్తమైపోతారు. ఇక ఎవరు మిగులుతారు? ఎవరైతే శ్రీమతం అనుసారంగా పవిత్రంగా ఉంటారో, వారే తండ్రి మతంపై నడుచుకొని విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా. ఇప్పుడు రావణ రాజ్యముంది, ఇది సమాప్తమవ్వనున్నది. సత్యయుగ రామ రాజ్యం స్థాపనవ్వనున్నది. రాముడు అంటే ఆ సీతకు సంబంధించిన రాముడు కాదు. శాస్త్రాలలో చాలా అనవసరమైన విషయాలను రాసేసారు. ఈ ప్రపంచమంతా లంక, ఇందులో రావణ రాజ్యముంది. సత్యయుగంలో భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. అప్పుడు, వేరే ఏ రాజ్యము ఉండేది కాదు. తండ్రి భారత్ లోకి వచ్చి దీనిని మళ్ళీ బంగారు పిచ్చుకగా, స్వర్గంగా తయారుచేస్తారు. ఈ మిగతా ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సముద్రం కూడా ఉప్పొంగుతుంది. బొంబాయి ఎలా ఉండేది, ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఇప్పుడు సత్యయుగ స్థాపన జరుగుతుంది. అప్పుడిక, బొంబాయి మొదలైనవి ఉండవు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుష్యులుంటారు. ఢిల్లీ రాజధానిగా ఉంటుంది, అక్కడ లక్ష్మీనారాయణుల రాజ్యముంటుంది. సత్యయుగంలో ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది. ఢిల్లీలోనే సింహాసనముండేది. రామ రాజ్యంలో కూడా ఢిల్లీనే రాజధానిగా ఉంటుంది. కానీ రామ రాజ్యంలో వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి, అపారమైన సుఖముండేది. తండ్రి అంటారు – మీరు విశ్వ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, నేను మళ్ళీ ఇస్తాను. మీరు నా మతాన్ని అనుసరించండి. శ్రేష్ఠంగా తయారవ్వాలంటే కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి, ఇతర దేహధారులెవ్వరినీ స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు, నా వద్దకు వచ్చేస్తారు. మీరు నా మెడలోని మాలగా అయి, తర్వాత విష్ణు మెడలోని మాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను, తర్వాత యుగళ్ అయిన బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. వారే సత్యయుగ మహారాజు-మహారాణులుగా అవుతారు. తర్వాత ఎవరైతే నంబరువారుగా సింహాసనంపై కూర్చొంటారో, వారి మాల ఉంటుంది. నేను ఈ బ్రహ్మా-సరస్వతులు మరియు బ్రాహ్మణుల ద్వారా భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాను. ఎవరైతే శ్రమ చేస్తారో, వారి స్మృతిచిహ్నాలు తయారవుతాయి. ఆత్మలు నివసించే స్థానం పరంధామము, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఆత్మలైన మనమందరము అక్కడ స్వీట్ హోమ్ లో తండ్రితో పాటు నివసిస్తాము. అది శాంతిధామము, మనుష్యులు ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించేందుకు రావాల్సిందే. అప్పటివరకు తండ్రి మిమ్మల్ని తయారుచేస్తూ ఉంటారు. మీరు తయారైపోతే, అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చేస్తాయి, ఆ తర్వాత సమాప్తమైపోతుంది. మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు, మళ్ళీ నంబరువారుగా చక్రం తిరుగుతుంది. పాటలో కూడా విన్నారు కదా – చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది అని. భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తింటూ ఉండేవారు. తండ్రి జ్ఞాన సూర్యుడు. జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞానాంధకారం సమాప్తమైపోతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. నరకవాసులుగా ఉన్న భారతవాసులు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారని మీకు తెలుసు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. చాలా తక్కువగా అర్థం చేయించాలి, అల్ఫ్ అనగా బాబా, బే అనగా రాజ్యాధికారము. అల్ఫ్ ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది. గాడిద చాకిరి సమాప్తమైపోతుంది. ఆ కథను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. మిగిలినవన్నీ కట్టుకథలు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఈ జ్ఞానాన్ని బాబానే వినిపిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పటివరకు కొనసాగింది అనేదానికి సంబంధించిన చరిత్ర-భూగోళం కదా. కావున ఇది కథ కూడా అవుతుంది కదా! ఎవరైతే విశ్వంపై రాజ్యం చేసేవారో, వారు 84 జన్మలు తీసుకొని పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు.

ఇప్పుడు తండ్రి అంటారు – నేను ఆ రాజ్యాన్నే మళ్ళీ స్థాపన చేస్తాను. మీరు పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఎలా అవుతారో, ఆ మొత్తం చరిత్ర-భూగోళమంతటినీ అర్థం చేయిస్తారు. మొట్టమొదట సూర్యవంశీయుల రాజ్యం ఉంటుంది, తర్వాత చంద్ర వంశీయులది ఉంటుంది… ఆ తర్వాత ఇతర ధర్మాలు, బౌద్ధులు, ఇస్లాములు, తర్వాత క్రైస్తవులు వచ్చారు. అప్పుడు, దేవీ-దేవతా ధర్మం ఏదైతే ఉండేదో, అది మాయమైపోయింది. మళ్ళీ ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. శాస్త్రాలలో బ్రహ్మా ఆయువును 100 సంవత్సరాలుగా చూపించడం జరిగింది. ఏ బ్రహ్మాలోనైతే తండ్రి కూర్చొని వారసత్వాన్ని ఇస్తారో, వారి శరీరం కూడా అంతమైపోతుంది. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు వినిపిస్తారు, వారే పతితపావనుడు. మనుష్యులు మనుష్యులను పావనంగా చేయలేరు. ఎవరైతే స్వయమే ముక్తులుగా అవ్వలేరో, వారు ఇతరులను ముక్తులుగా ఎలా చేస్తారు. వారంతా భక్తిని నేర్పించే అనేకమంది గురువులు. ఫలానా వారి భక్తి చేయమని కొంతమంది అంటారు, శాస్త్రాలను వినమని కొంతమంది అంటారు. అనేకానేక మత-మతాంతరాలు ఉన్నాయి, అందుకే అందరూ ఇంకా వివేకహీనులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులుగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయారు. మళ్ళీ శివబాబా వచ్చి నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. తండ్రి వచ్చి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, దానితో ఇక్కడ భాగ్యం మేల్కొంటుంది. తండ్రి మనుష్యమాత్రుల భాగ్యాన్ని మేల్కొలిపేందుకే వస్తారు. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు కదా. అందరూ త్రాహి-త్రాహి అంటూ (దుఃఖంలో రక్షణ కోసం అలమటిస్తూ) వినాశనమైపోతారు. అందుకే, బాబా అంటున్నారు – త్రాహి-త్రాహి జరగకముందే అనంతమైన తండ్రి నుండి కొంత వారసత్వమైనా తీసుకోండి. ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో, అదంతా సమాప్తమవ్వనున్నది. భారత్ యొక్క పతనము, భారత్ యొక్క ఉన్నతి అని అంటారు. ఇదంతా భారత్ కు సంబంధించిన ఆట. సత్యయుగంలో ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో పతనం అవ్వనున్నది. ఇదంతా రావణ రాజ్యం యొక్క ఆర్భాటము. ఇప్పుడు వినాశనం జరగనున్నది. ప్రపంచ పతనము, ప్రపంచ ఉన్నతి అని అంటారు. సత్యయుగంలో ఎవరెవరు రాజ్యం చేస్తారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భారత్ యొక్క ఉన్నతి అనగా దేవతల రాజ్యము. భారత్ యొక్క పతనము అనగా రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. దానికన్నా ముందు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు చదువుకుంటున్నారు. ఇది ఎంత సహజము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. సన్యాసులది నివృత్తి మార్గము. ఆ ధర్మమే వేరు. వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలి వెళ్ళిపోతారు, వారిది హద్దు సన్యాసము. మీరు ఈ పాత ప్రపంచాన్ని సన్యసించి, మళ్ళీ తిరిగి ఇక్కడకు రారు. ఏయే ధర్మాలు ఎప్పుడు వస్తాయనేది కూడా మంచి రీతిలో అర్థం చేయించాలి. ద్వాపరం తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి. ముందు సుఖం, తర్వాత దుఃఖం అనుభవిస్తారు. ఈ చక్రమంతటినీ బుద్ధిలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. చక్రంలోకి వచ్చినప్పటి నుండి మీరు మహారాజు-మహారాణిగా అవుతారు. కేవలం అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికారం) గురించి అర్థం చేయించాలి.

బాబా విదేశాలకు వెళ్ళేందుకు ఎవ్వరినీ కాదనరు. తమ మృత్యువు తమ దేశంలోనే సంభవించాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు వినాశనమైతే అవ్వాల్సిందే, ఎంత హంగామా జరుగుతుందంటే ఇక విదేశాల నుండి తిరిగి రాలేరు కూడా, అందుకే తండ్రి అర్థం చేయిస్తారు – ఏ భారతభూమిలోనైతే తండ్రి వచ్చి అవతరిస్తారో, అది అన్నింటికన్నా ఉత్తమమైనది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కేవలం కృష్ణుని పేరు వేయడంతో మహిమ అంతా సమాప్తమైపోయింది. మనుష్యమాత్రులందరి ముక్తిదాత ఇక్కడకు వచ్చి అవతరిస్తారు. గాడ్ ఫాదర్ యే వచ్చి ముక్తులుగా చేస్తారు. కావున అటువంటి తండ్రికి నమస్కరించాలి, వారి జయంతిని జరుపుకోవాలి. కానీ కృష్ణుని పేరు వేయడంతో మొత్తం విలువంతటినీ మాయం చేసేసారు. లేదంటే భారత్ అన్నింటికన్నా ఉన్నతమైన తీర్థ స్థానము. ఆ తండ్రి ఇక్కడికే వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. కావున ఇది అన్నింటికంటే పెద్ద తీర్థస్థానం అయినట్లు. అందరినీ దుర్గతి నుండి విడిపించి, సద్గతినిస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. మన బాబా ఈ శరీరం ద్వారా ఈ రహస్యాలను అర్థం చేయిస్తున్నారని ఆత్మలైన మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మలైన మనము ఈ శరీరం ద్వారా వింటాము. ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే, తుప్పు వదులుతూ ఉంటుంది మరియు పవిత్రంగా అయి మీరు తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే, అంత పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఉన్నత పదవిని పొందుతారు, అందుకే సెకెండులో జీవన్ముక్తి అని గాయనం చేస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి మెడలోని మాలగా అయి విష్ణు మెడలో కూర్చబడేందుకు సంపూర్ణ సతోప్రధానంగా తయారవ్వాలి. ఒక్క తండ్రి మతాన్నే అనుసరించాలి.

2. అనేక ఆత్మల ఆశీర్వాదాలు లభించే సేవను చేయాలి. త్రాహి-త్రాహి అని అనడం (దుఃఖంలో రక్షణ కోసం అలమటించడం) కన్నా ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:-

ఎవరైనా సింహాసనంపై కూర్చొన్నప్పుడు, తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటాయి. అలాగే, ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో, వారి మస్తకంపై సదా అవినాశీ ఆత్మిక స్థితి యొక్క తిలకం దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల కళ్యాణం యొక్క శుభ భావన వారి నయనాల ద్వారా మరియు ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ, అన్నీ తండ్రి సమానంగా ఉంటాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top