30 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 29, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు సతోప్రధానంగా అవుతారు, అమృతవేళ సమయం చాలా మంచిది”

ప్రశ్న: -

ఆజ్ఞాకారీ పిల్లల గుర్తులేమిటి?

జవాబు:-

ఆజ్ఞాకారీ పిల్లలు – ఉన్నతోన్నతమైన తండ్రి మహావాక్యాలను తమ శిరస్సుపై పెట్టుకుంటారు అనగా తమ జీవితంలో ధారణ చేస్తారు. వారి నడవడిక చాలా రాయల్ గా ఉంటుంది. వారు చాలా ఓర్పు కలిగి ఉంటారు. వారికి విశ్వాధిపత్యం యొక్క గుప్తమైన నషా ఉంటుంది. ఆజ్ఞాకారీ పిల్లలు తమ ఏ కర్మ ద్వారా కూడా బాప్ దాదాకు అవమానం కలగనివ్వరు. అవమానపరిచేవారు అనగా ఆజ్ఞను ఉల్లంఘించే పిల్లలు చాలా డిస్ సర్వీస్ చేస్తారు. ఆజ్ఞాకారీ పిల్లలు సదా ఫాలో ఫాదర్ చేస్తారు, ఎప్పుడూ తప్పుడు పనులు చేయరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి..

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు రెండు పదాలను విన్నారు. ఇప్పుడు పిల్లలు అయితే దీని అర్థాన్ని తెలుసుకున్నారు – తండ్రి ఇక్కడ ఉన్నారు అని. తండ్రి కూర్చుని రైట్ విషయాలను అర్థం చేయిస్తారు ఎందుకంటే మనుష్యులు జ్ఞానం గురించి, ఈశ్వరుడిని కలుసుకోవడం గురించి చెప్పే విషయాలన్నీ రాంగ్. ఇప్పుడు పాటలోని లైన్లను విన్నారు – ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి… అని. కానీ ఆకాశ సింహాసనం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. పతితపావనుడైతే రావాల్సిందే. కొందరు – భగవంతుడు అసలు లేరు అని అంటారు. మరికొందరు, అందరూ భగవంతులే భగవంతులు అని అంటారు. మరి వారు ఎందుకు వస్తారు? తండ్రి వచ్చారని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇక భక్తి మార్గపు ఈ గాయనము మొదలైనవన్నీ వినడం ఇష్టం అనిపించదు. పతితపావనుడు వచ్చి తమ పరిచయాన్నిచ్చి రచన ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలను ప్రపంచంలోని మిగతా వారు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఎన్ని మతాల వ్యక్తులు ఉన్నారు. మనుష్యులు పవిత్రంగా అవ్వడమనేది జరగదు అని అంటారు. అది కూడా, తప్పకుండా భగవంతుడు ఎప్పటివరకైతే రారో, అప్పటివరకు పవిత్రంగా ఎలా అవ్వగలరు. పరమాత్మయే వచ్చి శిక్షణనిస్తారు మరియు ఇందులో ఎంత భారీ ప్రాప్తి ఉంది అనే ఆకర్షణ ఇస్తారు. తండ్రి ఈ విధంగా అంటారని మీకు తెలుసు – నాకు చెందినవారిగా అయి శ్రీమతాన్ని అనుసరించకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎలాగైతే తండ్రి తన పిల్లల ప్రవర్తన బాగోలేకపోవడం చూస్తే, చెంపదెబ్బ కొడతారు, ఈ తండ్రి అయితే చెంపదెబ్బ కొట్టరు. కేవలం అర్థం చేయిస్తారు – ప్రతిజ్ఞను రక్తంతో కూడా రాసి ఇస్తారు, అయినా ఓడిపోతారు అని. పవిత్రంగా అవ్వడం వలన ఏం లభిస్తుంది అనేది మనుష్యులకు తెలియనే తెలియదు. పతితులు అని ఎవరిని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఎవరైతే వికారాలలోకి వెళ్తారో, వారు పతితులు. వికారాలను వదలడం అసంభవమని మనుష్యులు భావిస్తారు. వారికి చెప్పండి – దేవీ-దేవతలైతే సంపూర్ణ నిర్వికారీగా ఉండేవారు అని. చిత్రాలను చూపించాలి. ఈ ప్రపంచం నిర్వికారీగా ఉండేది కదా. పవిత్రత ఉన్నప్పుడు భారత్ ఎంత షావుకారుగా ఉండేది, శివాలయంగా ఉండేది. వికారాలు లేకుండా ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది అని మనుష్యులకు ఈ చింత ఉంటుంది. అరే, గవర్నమెంట్ విసిగిపోయింది, జనాభా వృద్ధి చెందకూడదు అని, అయినా ప్రతి సంవత్సరం ఎంతమంది మనుష్యులు పెరిగిపోతూ ఉన్నారు. జనాభా తగ్గడమైతే చాలా కష్టము. ఇక్కడ అనంతమైన తండ్రి చెప్తున్నారు – ఒకవేళ మీరు పవిత్రంగా అయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇది చాలా భారీ సంపాదన. మేము మాయా జీతులుగా అయినట్లయితే తప్పకుండా జగత్ జీతులుగా అవుతామని పిల్లలకు తెలుసు. రావణుడిని జయించి రామ రాజ్యాన్ని పొందుతారు. అక్కడ ఈ వికారాలు ఉండవు. ఆ వికారాలను మీరు జయించారు కదా. ఈ విషయాలను ఎవరో కష్టం మీద అర్థం చేసుకుంటారు. ఇవి లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటారు. ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, వారు ఆది సనాతన ధర్మం వారు కారు అని అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడ భాషణ చేసినా సరే, ఇదే చెప్పండి – భగవానువాచ, కామం మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారు, దానిపై విజయాన్ని పొందితే జగత్ జీతులుగా అవుతారు. వివరణ చాలా స్పష్టంగా ఉంది, అయినా వారు అర్థం చేసుకోరు, లేక అర్థం చేయించే వారిలో తెలివి లేదు. బాబాకు అర్థమవుతుంది – పిల్లలు రూపాయిలో 5 అణాలు కూడా కష్టం మీద నేర్చుకున్నారు లేదా స్వయం పూర్తి యోగులుగా అవ్వలేదు కనుక శక్తి లభించదు. స్మృతితోనే శక్తి లభిస్తుంది. బాబా సర్వశక్తివంతుడైన అథారిటీ కదా. యోగముంటే శక్తి కూడా లభిస్తుంది. చాలా మంది పిల్లల యోగము చాలా తక్కువగా ఉంది. సత్యాన్ని కూడా ఎవరూ రాయరు. స్మృతి చార్టును కూడా కష్టం మీద రాస్తారు. టీచర్లే చార్టు పెట్టకపోతే, విద్యార్థులు ఎలా పెడతారు. చాలా మంది విద్యార్థులు యోగంలో చాలా చురుకుగా ఉన్నారు. ముఖ్యమైన విషయము – తండ్రిని స్మృతి చేయాలి. యోగం అనే పదం శాస్త్రాలకు సంబంధించినది. మనుష్యులు విని తికమకపడతారు. యోగం నేర్పించండి అని అంటారు. అరే, యోగం అనేది నేర్చుకునే విషయమేమీ కాదు. ఉదయాన్నే లేచి మీకు మీరే స్మృతి చేయాలి. ఇందులో కూర్చుని నేర్పించేందుకు టీచరు అవసరమేముంది, అందుకే స్మృతి అనే పదం సరైనది. యోగం అనేది నేర్చుకునే విషయం కాదు. ఈ అలవాటు చేసుకోకూడదు. తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. అమృతవేళలో స్మృతి చేయడం మంచిది. భక్తిని కూడా ఉదయము లేచి చేస్తారు. వీరు (బ్రహ్మా) కూడా తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభించాలి. భక్తి మార్గంలో శివుడిని స్మృతి చేస్తారు కానీ ఆ శివుడి నుండి ఏం లభించేది ఉందో వారికి తెలియదు. ఈ విషయం కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు – మీ కళ్యాణం చేసుకునేందుకు నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే శక్తి వస్తుంది. శక్తితో వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానంతో వికర్మలు వినాశనమవ్వవు. జ్ఞానంతో పదవి లభిస్తుంది. స్మృతితోనే పతితం నుండి పావనంగా అవుతారు. చాలా మంది పిల్లలు ఇందులో ఫెయిల్ అవుతారు. చాలా మంచి మహారథులు 5 అణాల స్మృతి కూడా కష్టం మీద చేస్తారు. కొందరైతే ఒక్క పైసా అంత కూడా స్మృతి చేయరు, ఇందులో చాలా శ్రమ ఉంది. వివరణ అయితే వెంటనే నేర్చుకుంటారు, కానీ ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో, అప్పుడే నావ తీరం చేరుతుంది. అప్పుడే జన్మ-జన్మల వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రిని పిలుస్తారు – మీరు వచ్చి మమ్మల్ని పతితం నుండి పావనంగా చేయండి అని. పావనంగా అయితే ఎంతోమంది అవుతారు కానీ ఎవరైతే స్మృతిలో మంచి రీతిగా ఉంటారో, వారే ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. మీ కన్నా కూడా, బంధనంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వారు ఎక్కువగా స్మృతి చేస్తారు. స్మృతితోనే వికర్మలు వినాశనమవ్వగలవు. ఎవరైనా పవిత్రంగా ఉండడం అసంభవం అని అంటే, ఇక అటువంటి వారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. భారత్ నిర్వికారీగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేది. కానీ షావుకార్ల బుద్ధిలో ఈ జ్ఞానం కూర్చోవడమే కష్టం ఎందుకంటే స్మృతిలోనే శ్రమ ఉంది.

తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ వారితో కూడా సంబంధాలను నిర్వర్తించండి. వాస్తవానికి నియమాలు చాలా కఠినమైనవి. మీరు జన్మజన్మలుగా పాపాత్ములకు దానమిస్తూ పాపాత్ములుగానే అవుతూ వచ్చారు. ఇప్పుడు మీరు పాపాత్ములకు ధనాన్ని ఇవ్వలేరు. కానీ తాతగారి వారసత్వాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే తండ్రి అంటారు – ముందు అన్ని (లౌకిక) పనులను పూర్తి చేసి తర్వాత సరెండర్ అవ్వండి. ఇటువంటివారు కూడా కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. ఇది చాలా భారీ గమ్యము. ఫాలో ఫాదర్ చేయాలి. నష్టోమోహులుగా అవ్వడమనేది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినట్లు ఏమీ కాదు, ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది ఎంత భారీ ప్రాప్తి. కల్ప-కల్పము ఎవరైతే విశ్వానికి యజమానులుగా అయ్యారో, వారే మళ్ళీ అవుతారు. డ్రామా రహస్యం కూడా కొంతమంది బుద్ధిలోనే కూర్చొంటుంది. షావుకార్లు అయితే కష్టం మీద మేల్కొంటారు. పేదవారైతే వెంటనే అంటారు – బాబా, ఇదంతా మీదే అని. తర్వాత వారు సేవ కూడా చేయాలి. పావనంగా అయ్యేందుకు స్మృతి కూడా కావాలి. లేదంటే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు అనుభవిస్తే పదవి కూడా తగ్గిపోతుంది. ఎవరైతే స్మృతి చేయరో, వారు శిక్షలు అనుభవిస్తారు. జ్ఞానం ఎంత తీసుకున్నా సరే, దానితో వికర్మలు వినాశనమవ్వవు. శిక్షలు తిని తర్వాత చిన్న పదవిని పొందడమంటే, అది వారసత్వమేమీ కాదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రికి ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఉన్నతోన్నతమైన తండ్రి మహావాక్యాలను శిరస్సుపై పెట్టుకోవాలి. కృష్ణుని ఆత్మ కూడా ఈ సమయంలో వారసత్వాన్ని తీసుకుంటుంది. ఈ లక్ష్మీ-నారాయణుల అనేక జన్మల అంతిమంలో నేను వారిని మళ్ళీ చదివించి వారసత్వాన్ని ఇస్తాను. మీలో కూడా రాకుమార-రాకుమారీలుగా అయ్యేవారు ఉంటారు కదా. రాయల్ వంశంలోకి వచ్చే వారి నడవడిక చాలా ఓర్పు కలదిగా ఉంటుంది, గుప్తమైన నషా ఉంటుంది. బాబా ఎంత సాధారణంగా ఉంటారు. బాబాకు తెలుసు – ఇంకా కొద్ది సమయమే ఉంది, నేను వెళ్ళి విశ్వ మహారాజుగా అవ్వాలి అని. వీరు కూడా పతితంగా ఉండేవారు. వీరు బాబా రథము, అందుకే ఇక్కడ గద్దెపై కూర్చోవాల్సి ఉంటుంది. లేదంటే బాబా ఎక్కడ కూర్చోవాలి. వీరు కూడా మీలాంటి విద్యార్థియే, చదువుకుంటున్నారు. చాలా మంది పిల్లలు తండ్రిని గుర్తించరు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. తండ్రి అంటారు – నా ఆజ్ఞను పాటించకుండా, నన్ను అవమానపరిస్తే ధర్మరాజు చాలా శిక్షలను ఇస్తారు. మీరు డైరెక్టుగా, నా ఆజ్ఞను మరియు నా బిడ్డ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు. తండ్రికి చాలా కాలం దూరమై తర్వాత కలిసిన బిడ్డ ఒకే ఒకరు ఉన్నారు. ప్రేమ ఉంటుంది కదా. వీరిని అవమానపరిస్తే ఎన్ని శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కొద్దిగా ఆపదలు రానివ్వండి, అప్పుడు చూడండి, ఎంతమంది పరుగెత్తుకుంటూ వస్తారో. మీరందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. వీరేమీ ఇంద్రజాలం మొదలైనవి చేయలేదు. ఇంద్రజాలికుడు శివబాబా. వీరిలోకి శివబాబా వస్తారు అనే అటెన్షన్ కూడా లేనివారు చాలా మంది ఉన్నారు. శివబాబా ఎదురుగా మనం ఏదైనా తప్పు చేస్తే, అప్పుడు తండ్రి ఇతడు యోగ్యుడైన బిడ్డ కాదు అని అంటారు. వీరిలో ఇద్దరు ఉన్నారు కదా, అందుకే టెలిగ్రాంలో ‘బాప్ దాదా’ అని రాస్తారు. కానీ పిల్లలు, బాప్ దాదా ఇరువురూ ఎలా కలిసి ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోరు. తండ్రి, దాదా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. బాప్ దాదా ఎవరో మీకు తెలుసా? – అని మీ అంతట మీరే ఈ విషయాన్ని తీసుకురావాలి. మీరు బాప్ దాదా అని ఎవరిని అంటున్నారు అని ఎవరైనా అడగవచ్చు. బాప్ దాదా అనేది ఒక్కరి పేరు అవ్వదు. కనుక పిల్లలు యుక్తిగా అర్థం చేయించాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారి బుద్ధిలో కూర్చోవాలి – శివబాబా దాదా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు, ఇప్పుడు వినాశనమైతే జరగనున్నది, దానికంటే ముందు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మీరు కూడా నేర్చుకోండి, ఏ తండ్రినైతే అర్ధకల్పం బట్టి పిలిచారో, వారు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు అని చెప్పండి. అయినా కూడా, ఇది అర్థం చేసుకునేందుకు తీరిక లేదు అని అంటారు. అప్పుడు మీరంటారు – మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కాదు, మీ భాగ్యంలో స్వర్గ సుఖాలు లేవు. ఇకపోతే, ఇక్కడ తల వంచి నమస్కరించడం మొదలైనవేమీ చేయకూడదు. సన్యాసుల పాదాల పైన తప్పకుండా పడతారు. వీరు గుప్తమైనవారు కదా. మున్ముందు చాలా ప్రభావం వెలువడుతుంది. ఆ సమయంలో చాలా గుంపు ఏర్పడుతుంది. గుంపులలో ఎంతమంది మనుష్యులు మరణిస్తారు. ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారి దర్శనం చేసుకునేందుకు ఎంత పెద్ద సమూహం నిలబడి ఉంటుంది. ఇక్కడ బాబా పిల్లలతో పాటు ఎంత గుప్తంగా కూర్చొన్నారు. ఇక్కడ ఎవరిని చూస్తారు? వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారని వీరి గురించైతే తెలుసు. బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని ఎలా రచించారు అనేది శాస్త్రాలలో కూడా ఉంది. తండ్రి అంటారు – నేను వీరిలో ప్రవేశించి రచిస్తాను. ఇది కూడా రాయబడి ఉంది కానీ రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలను పతితం నుండి పావనంగా తయారుచేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇకపోతే, కొత్త రచనను ఏమీ రచించరు. ఇది పతితులను పావనులుగా తయారుచేసే యుక్తి. విరాట రూప చిత్రం తప్పకుండా ఉండాలి. చిత్రం పెద్దదిగా ఉంటే, అర్థం చేయించడం కూడా సులభమవుతుంది. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేయడం – ఇది సులభమైన విషయమేమీ కాదు. కొందరైతే వెర్రి వారిలా చూసి వెళ్ళిపోతారు. ప్రజలుగా అయ్యే వారు ఉంటే, ఎంతో కొంత బుద్ధిలో కూర్చొంటుంది. మనమే బ్రాహ్మణులుగా, తర్వాత మనమే దేవతలుగా, హమ్ సో అర్థాన్ని తండ్రి ఎంత బాగా అర్థం చేయించారు. వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు. మనం ఆత్మలమేనని ఇక్కడ మీకు తెలుసు. ఆత్మలైన మనం ముందు బ్రాహ్మణులుగా, తర్వాత మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా… అవుతాము. మనం ఎన్ని రకాల వర్ణాలలోకి వస్తాము. 84 జన్మల చక్రంలో తిరుగుతాము. ఇకపోతే, ఎవరైతే తర్వాత వస్తారో, వారికి సుమారుగా ఎన్ని జన్మలు ఉంటాయి! లెక్క తీయవచ్చు. చిత్రాలు చాలా చక్కగా, బాబా మనసుకు నచ్చే విధంగా తయారవ్వాలి. చిత్రాలను తయారుచేయడంలో సహాయం చేయగల ఇద్దరు లేక నలుగురు మంచి పిల్లలు కావాలి. బాబా ఖర్చు ఇచ్చేందుకు తయారుగా ఉన్నారు. ఆ తర్వాత హుండీని బాబా వారంతట వారే నింపిస్తారు. ముఖ్యమైన చిత్రాలను ట్రాన్స్ లైట్ తో తయారుచేయాలని బాబా అంటారు. మనుష్యులు వాటిని చూసి సంతోషిస్తారు. మొత్తం ప్రదర్శినీ ఈ విధంగా తయారుచేయాలి. కానీ పిల్లలను నిలబెట్టడానికి బాబాకు శ్రమించాల్సి వస్తుంది.

తండ్రి స్మృతే ముఖ్యమైనది. స్మృతితోనే మీరు పతితం నుండి పావనంగా, సృష్టికి యజమానులుగా అవుతారు. ఇంకే ఉపాయము లేదు. నడుస్తూ-తిరుగుతూ బాబాను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. మీ స్వభావం చాలా రాయల్ గా ఉండాలి. నడుస్తూ-నడుస్తూ కొందరికి లోభం, కొందరికి మోహం పట్టుకుంటుంది. కొంతమంది ఇష్టమైన వస్తువులను పొందడానికి అలవాటు పడి ఉంటారు, లభించకపోతే జబ్బు పడిపోతారు. అందుకే ఏ అలవాట్లను ఉంచుకోకూడదు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ కళ్యాణం చేసుకునేందుకు తండ్రి ఆజ్ఞను పాటించాలి. బాప్ దాదా ఆజ్ఞను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. లోభం, మోహం యొక్క అలవాట్లు ఏవీ ఉంచుకోకూడదు.

2. మీ స్వభావాన్ని చాలా రాయల్ గా తయారుచేసుకోవాలి. ఉదయాన్నే అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

వరదానము:-

తమ అసలైన పొజిషన్ లో నిలిచి ఉండడమే స్మృతి యాత్ర. నేను ఎవరిని, ఎవరికి చెందినవాడిని – ఇందులో స్థితులై ఉండండి. ఈ అసలైన స్వరూపం యొక్క నిశ్చయం మరియు అనేక సార్ల విజయం యొక్క స్మృతితో సదా నషా అనే స్థితి యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సుఖదాతకు పిల్లలైనప్పుడు దుఃఖపు అల ఎలా రాగలదు, సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనులుగా ఎలా అవ్వగలరు! ఈ పొజిషన్ యొక్క అనుభవాలలో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖం స్వతహాగా ప్రత్యక్షమవుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top