30 June 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
29 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలంటే సర్వీసబుల్ సుపుత్రులైన పిల్లలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వండి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి”
ప్రశ్న: -
ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాల పట్ల అటెన్షన్ పెట్టాలి?
జవాబు:-
ఎప్పుడూ కూడా ఈశ్వరుని ఎదురుగా ప్రతిజ్ఞ చేసి, దానిని ఉల్లంఘించకూడదు. ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. క్రోధం చేయకూడదు, విసిగించకూడదు అనగా ఈశ్వరుని పేరును అప్రతిష్ఠపాలు చేసే నడవడిక నడుచుకోకూడదు….. అలా చేస్తే వారు చాలా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. అందుకే, అటువంటి కర్మలేవీ చేయకూడదు. మాయ తుఫాన్లు ఎన్ని వచ్చినా, అనారోగ్యం తిరగబడినా కానీ రైట్-రాంగ్ యొక్క బుద్ధితో నిర్ణయించి, రాంగ్ కర్మల నుండి సదా సురక్షితంగా ఉండాలి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నా మనసు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు….. (కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే….. )
ఓంశాంతి. ఓంశాంతి అని ఎవరన్నారు? బాప్ మరియు దాదా. మన పారలౌకిక తండ్రి పరమపిత పరమాత్మ శివుడని మరియు వీరు (బ్రహ్మా) పిల్లలందరికీ అలౌకిక తండ్రి అని, వీరినే ప్రజాపిత బ్రహ్మా అంటారని పిల్లలకు తప్పకుండా నిశ్చయం ఉంటుంది. ఇంతమంది పిల్లలు ప్రజాపిత బ్రహ్మాకు తప్ప ఇంకెవరికైనా ఉంటారా. ఇంతకుముందు ఇంతమంది పిల్లలు ఉండేవారు కాదు. అనంతమైన తండ్రి వీరిలో ప్రవేశించిన తర్వాత వీరు దాదాగా అయ్యారు. మీకు పారలౌకిక తండ్రి యొక్క ఆస్తి లభిస్తుందని ఈ దాదా స్వయంగా అంటారు. మనవలు ఎప్పుడూ తాతగారికి వారసులుగా ఉంటారు. వారి బుద్ధియోగం తాతగారి వైపుకు వెళ్తుంది ఎందుకంటే తాతగారి ఆస్తిపై హక్కు లభిస్తుంది. ఎలాగైతే రాజుల వద్ద జన్మ తీసుకున్న పిల్లలు, ఇది పెద్దల ఆస్తి అని అంటూ ఉంటారు. పెద్దల ఆస్తిపై వారికి ఎలాగూ హక్కు ఉంటుంది. మేము అనంతమైన తండ్రి ద్వారా అత్యంత గొప్ప ఆస్తిని అనగా స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని ఆ తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. సమ్ముఖంగా ఉన్న నషా కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉంటుంది. కొందరి హృదయాలలోనైతే చాలా ప్రేమ ఉంటుంది. మనము ఉన్నతాతి ఉన్నతమైన భగవంతునికి ఈ సాకార మాతా-పితల ద్వారా వారసులుగా అవుతాము. అనంతమైన తండ్రి చాలా మధురమైనవారు, వారు మనల్ని రాజ్యానికి యోగ్యులుగా చేస్తారు. మాయ అసలు యోగ్యత లేనివారిగా చేసేసింది. నిన్న బాబాను కలుసుకునేందుకు ఎవరో వచ్చారు కానీ వారేమీ అర్థం చేసుకోలేదు. వారికి బాబా అర్థం చేయించారు – వీరంతా బ్రహ్మాకుమారులు, మీరు కూడా బ్రహ్మాకు మరియు శివునికి బిడ్డ కదా. దానికి అతను, అవును నిజమే అని అన్నారు. ఇది కేవలం విని, అవును అని అన్నారు కానీ అతని హృదయంలో కూర్చోలేదు. నిజంగా నేను వారి బిడ్డనే అనే బాణం తగలలేదు. వీరు (బ్రహ్మా) కూడా తండ్రి సంతానమే, వారసత్వం తీసుకుంటున్నారు. ఈ విధంగా మన వద్ద కూడా చాలామంది పిల్లలకు చాలా కొంచెం మాత్రమే బుద్ధిలో కూర్చుంటుంది. వారిలో ఆ సంతోషం, ఆ ఆత్మిక నషా కనిపించవు. లోపల సంతోషపు పాదరసం బాగా పైకి ఎక్కాలి. అదంతా ముఖంపై కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రేయసులైన మీకు జ్ఞాన అలంకరణ జరుగుతుంది. మీరు ఆ ప్రియునికి ప్రేయసులని మీకు తెలుసు. ఒక రైతు కూతురి కథ ఉంది కదా. ఒక రాజు, రైతు కూతురిని రాజ్యానికి తీసుకువస్తాడు కానీ ఆమెకు ఆ రాజ్యంలో మజా అనిపించలేదు కనుక ఆమెను తిరిగి పల్లెలో విడిచిపెట్టి వచ్చాడు. నీవు రాజ్యానికి యోగ్యురాలివి కావు అని అన్నాడు. ఇక్కడ కూడా తండ్రి అలంకరిస్తున్నారు. మీరు భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి అని అంటారు. పట్టపురాణిగా చేసేందుకు ఎత్తుకువెళ్ళాడని కృష్ణుడి గురించి కూడా అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు, అందరూ అధర్మయుక్తమైనవారే. ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుందని, ఇది స్వాభావికమని అనుకుంటారు. చాలా మంది మందిరాలకు వెళ్ళరు, శాస్త్రాలు మొదలైనవాటిని నమ్మరు. గవర్నమెంట్ కూడా ధర్మాన్ని నమ్మదు. భారత్ ఏ ధర్మానికి చెందినదిగా ఉండేది, ఇప్పుడు ఏ ధర్మానికి చెందినదిగా ఉంది అనేది అసలు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ కులానికి చెందినవారు. ఎలాగైతే వారు క్రిస్టియన్ కులానికి చెందినవారో, అలా మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. మొట్టమొదటగా పిల్లలైన మిమ్మల్ని పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తానని తండ్రి అంటారు. పావనంగా అవుతూ అవుతూ మళ్ళీ 21 జన్మల కోసం మీరు దైవీ సంప్రదాయం కలవారిగా అవుతారు. దైవీ ఒడిలోకి వెళ్తారు. ఇంతకుముందు ఆసురీ ఒడిలో ఉండేవారు. మీరు ఆసురీ ఒడి నుండి ఈశ్వరీయ ఒడిలోకి వచ్చారు. మీరు ఒక్క తండ్రి పిల్లలు, సోదరీ-సోదరులు. ఇది ఒక అద్భుతము. మేము బ్రాహ్మణ కులానికి చెందినవారమని అందరూ అంటారు. మనమైతే శ్రీమతాన్ని అనుసరించాలి, అందరికీ సుఖాన్నివ్వాలి, మార్గాన్ని తెలియజేయాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా తీసుకోవడం జరుగుతుంది అనేది నోటితో చెప్పగలిగేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. మీకు అనంతమైన తండ్రి లభించారు. మీరు మాత్రమే వారికి పిల్లలుగా అయ్యారు. ఎవరైతే కల్పక్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని ఉంటారో, వారే వచ్చి తీసుకుంటారని బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. బుద్ధిలో కొద్దిగా ఉన్నా కూడా, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చేరుకుంటారు. రావడం కూడా ఎదో ఒకటి తీసుకునేందుకే వస్తారు. మీలో కూడా నంబరువారుగా తెలుసుకున్నారు. ఈ రోజు పావనంగా అయ్యేందుకు వస్తారు, రేపు మళ్ళీ పతితంగా అయిపోతారు. ఎవరిదైనా చెడు సాంగత్యం అంటుకున్నప్పుడు – తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని విడిచిపెడితే చాలా పాపాత్ములుగా అవుతారనేది మర్చిపోతారు. ఎలాగైతే ఎవరినైనా హతమారిస్తే పాపం అంటుకుంటుంది. ఆ పాపం కూడా దీనికన్నా తక్కువే. ఇక్కడ ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయి విడాకులిస్తారో, ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారులుగా అవుతారో, వారికి చాలా పాపం అంటుకుంటుంది. జ్ఞాన మార్గంలో అంటుకున్నంత పాపం అజ్ఞాన కాలంలో అంటుకోదు. అజ్ఞాన కాలంలో మనుష్యుల్లో క్రోధమనేది కామన్. ఇక్కడ మీరు ఎవరిపైనైనా క్రోధం చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది, అవస్థ పూర్తిగా దిగజారిపోతుంది ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించలేదు. పవిత్రంగా అవ్వండి అని ధర్మరాజు ఆజ్ఞ లభిస్తుంది. మీరు ఈశ్వరునికి చెందినవారిగా అయి, ఏ మాత్రం వారి ఆజ్ఞను ఉల్లంఘించినా 100 రెట్లు శిక్ష పడుతుంది. రచయిత అయితే వారొక్కరే. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా వారి రచన. ధర్మరాజు కూడా రచనయే. ధర్మరాజు రూపాన్ని కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తారు. ఇక ఆ సమయంలో ఋజువు చేసి చెప్తారు – చూడు, నేను క్రోధం చేయను, ఎవరికీ దుఃఖమివ్వను అని నువ్వు ప్రతిజ్ఞ చేసావు, అయినా నువ్వు ఫలానావారికి దుఃఖమిచ్చావు, విసిగించావు, ఇప్పుడు శిక్ష అనుభవించు. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు ఇవ్వరు. ఋజువు కావాలి కదా. నిజమే, నేను తండ్రిని విడిచిపెట్టి ఈ చెడు కర్మలు చేసాను అని వారు కూడా అర్థం చేసుకుంటారు. చెడ్డ పేరు తీసుకువస్తే చాలామందికి ఆపద కలుగుతుంది. దీనివల్ల ఎంతమంది అబలలకు బంధనం ఏర్పడుతుంది. ఆ శిక్ష అంతా చెడ్డ పేరు తీసుకువచ్చేవారికి పడుతుంది. అందుకే తండ్రి అంటారు – అతి పెద్ద పాపాత్మను చూడాలంటే ఇక్కడే చూడండి. చాకలివాడి వద్ద చాలా మురికి పట్టిన వస్త్రాలు ఉన్నప్పుడు వాటిని బాది ఉతకడంతో అవి చిరిగిపోతాయి. అలాగే ఇక్కడ కూడా దెబ్బ సహించలేక వెళ్ళిపోతారు. ఈశ్వరుని ఒడిలోకి వచ్చి డైరెక్టుగా వారి ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే శిక్షలు తినవలసి ఉంటుంది. పార్టీని తీసుకువచ్చే హెడ్ బ్రాహ్మణిపై చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. పార్టీలో ఏ ఒక్కరైనా, ఒకవేళ చేతిని వదిలేసి వికారిగా అయినట్లయితే ఆ పాపం తీసుకువచ్చిన వారిపైకి వస్తుంది. అటువంటివారిని ఇంద్ర సభలోకి తీసుకురాకూడదు. నీలం పరి, పుఖరాజ్ పరి అనే దేవ కన్యల కథలు కూడా ఉన్నాయి కదా. ఇంద్ర సభలోకి ఎవరినో రహస్యంగా తీసుకొస్తే ఇంద్ర సభలో దుర్గంధం రావడం మొదలయ్యింది. కనుక తీసుకువచ్చిన వారికి శిక్ష పడింది. ఈ విధమైన కథలు కొన్ని ఉన్నాయి. అలా తీసుకువచ్చిన ఆమె రాయిగా అయిపోయింది. బాబా పారసనాథులుగా తయారుచేస్తారు కానీ ఒకవేళ ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాయిగా అయిపోతారు. రాజ్యాన్ని పొందే సౌభాగ్యాన్ని కోల్పోతారు. ఎవరైనా పేదవాడిని రాజు దత్తత తీసుకున్నారనుకోండి, ఒకవేళ అతడు యోగ్యుని లేకపోతే, అతడిని రాజు తిరిగి పంపించేస్తే, అప్పుడు ఏమవుతుంది. మళ్ళీ పేదవాడిగా అయిపోతాడు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడిక చాలా దుఃఖం అనుభవమవుతుంది, అందుకే తండ్రి అంటారు – ఎప్పుడూ ఏ ఆజ్ఞను ఉల్లంఘించకండి. తండ్రి సాధారణంగా ఉంటారు, అందుకే శివబాబాను మర్చిపోయి సాకారుని వైపుకి బుద్ధి వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. ఎవరైతే అశుద్ధంగా అవుతారో, వారు ఇక ఇంద్ర సభలో కూర్చోలేరు. ప్రతి సెంటరు ఇంద్రప్రస్థము, అక్కడ జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. నీలం పరి, పుఖరాజ్ పరి అనే పేర్లు ఉన్నాయి కదా. నీలం అని రత్నమును అంటారు. పిల్లలకు ఈ పేర్లు పెట్టడం జరుగుతుంది. కొంతమంది చాలా మంచి రత్నాల వలె ఉన్నారు, ఎటువంటి లోపము లేదు. వజ్రాలలో కొన్ని-కొన్ని చాలా మచ్చలు కలవి ఉంటాయి. కొన్ని పూర్తి శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ కూడా నంబరువారు రత్నాలు ఉన్నారు. కొంతమంది రత్నాలు చాలా విలువైనవారిగా ఉన్నారు. చాలా మంచి సేవ చేస్తారు. కొంతమంది సర్వీసుకు బదులుగా డిస్ సర్వీసు చేస్తారు. గులాబి పుష్పాలకు మరియు జిల్లేడు పుష్పాలకు కూడా ఎంత తేడా ఉంటుంది. శివునికి రెండింటినీ అర్పిస్తారు. మనలో ఎవరెవరు పుష్పాలు అనేది ఇప్పుడు మీకు తెలుసుకున్నారు. బాబా, మాకు మంచి మంచి పుష్పాలను ఇవ్వండి అని అందరూ వారినే కోరుకుంటారు. ఇప్పుడు మంచి మంచి పుష్పాలను ఎక్కడి నుండి తీసుకురావాలి. రత్న జ్యోతి అనే పుష్పమైతే కామన్. ఇది తోట కదా. మీరు జ్ఞాన గంగలు కూడా. తండ్రి సాగరుడు కదా. వీరు (బ్రహ్మా) బ్రహ్మపుత్ర, అన్నింటికన్నా పెద్ద నది. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. అక్కడ సాగరం మరియు నది యొక్క మేళా చాలా భారీగా జరుగుతుంది. తప్పకుండా బాబానే జ్ఞాన సాగరుడు. వారు చైతన్య జ్ఞాన సాగరుడు. మీరు కూడా చైతన్య జ్ఞాన నదులు. అవి నీటి గంగలు. వాస్తవానికి నదులకు పేర్లుంటాయి కానీ ఆసురీ సంప్రదాయం వారు ఇది కూడా మర్చిపోయారు. హరిద్వార్ లో గంగా నది ఒడ్డున చతుర్భుజుని చిత్రాన్ని చూపిస్తారు. దానిని కూడా గంగ అని అంటారు కానీ మనుష్యులు ఈ చతుర్భుజుడు ఎవరు అనేది అర్థం చేసుకోరు. తప్పకుండా ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు సత్యమైన జ్ఞాన నదులు. అవి నీటి నదులు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ నది ఒక దేవి అని భావిస్తారు. మనుష్యులకైతే ఎప్పుడూ 4-8 భుజాలుండవు. అర్థాన్ని ఏ మాత్రం తెలుసుకోరు. బాబా మనల్ని ఏ విధంగా తయారుచేస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. మనం 100 శాతం తెలివిహీనులుగా ఉండేవారము. బాబా ఒడి తీసుకోవడంతో మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఇక్కడ ఎవరైనా రాజుగా ఉన్నా సరే, స్వర్గ సుఖాలకు మరియు ఇప్పటి సుఖాలకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీలో కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, అటు తండ్రిని అర్థం చేసుకోరు, ఇటు స్వయాన్ని కూడా అర్థం చేసుకోరు. నేను ఎంత సుగంధాన్ని ఇస్తున్నాను? తప్పుడు మాటలు మాట్లాడడం లేదు కదా? క్రోధం చేయడం లేదు కదా? అని పరిశీలించుకోవాలి. ఈ బిడ్డ ఎలాంటివాడు అనేది నడవడికతో తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. సర్వీసబుల్ పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. అందరూ ఒకే విధంగా ప్రియంగా అనిపించరు. అటువంటి పిల్లల కోసం లోపల నుండి స్వతహాగా ఆశీర్వాదాలు వెలువడతాయి. బాబా ఆజ్ఞలను పాటించని పిల్లలుంటే, తండ్రి అంటారు – ఇటువంటి బిడ్డ మరణిస్తే మేలు. అటువంటివారు పేరును ఎంతగా అప్రతిష్ఠపాలు చేస్తారు, దీనిని భాగ్యం అని అంటారు. ఎవరి భాగ్యంలో ఏముంది అనేది వెంటనే తెలిసిపోతుంది. ఫలానావారు సుపుత్రులని, ఫలానావారు కుపుత్రులని బాబా అర్థం చేయిస్తారు. ఒకవేళ బాప్ దాదాను గుర్తించకపోతే, భాగ్యంలో వారసత్వం తీసుకోవడమనేది లేకపోతే ఏమి చేస్తారు. ఈ జ్ఞాన మార్గంలోని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. తండ్రి పవిత్రంగా అయి, పిల్లలు అవ్వకపోతే ఆ పిల్లలు హక్కుదారులుగా కాలేరు. అటువంటివారిని పిల్లలుగా భావించరు. మేము శివబాబాను వారసునిగా చేసుకుంటామని, అప్పుడు బాబా మాకు 21 జన్మల కోసం రిటర్న్ ఇస్తారని అంటారు. అలాగని బాబా వద్దకు వచ్చి కూర్చుండిపోవాలని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అందరినీ సంభాళించాలి కూడా, కానీ ట్రస్టీగా అయి ఉండాలి. మీ పిల్లలు మొదలైనవారిని తండ్రి కూర్చుని సంభాళిస్తారని కాదు. ఇటువంటి ఆలోచనలున్నవారు భ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా వద్దనైతే పూర్తి పవిత్రత కావాలి. అపవిత్రులెవ్వరూ కూర్చోలేరు. లేదంటే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. తండ్రి శాపమేమీ ఇవ్వరు. ఇది ఒక లా. తండ్రి అంటారు – జాగ్రత్తగా ఉండండి. కర్మేంద్రియాలతో ఏదైనా పాపం చేసినట్లయితే చనిపోయినట్లు. ఇది చాలా భారీ గమ్యము. బాబాకు పిల్లలైన తర్వాత, అనారోగ్యమంతా తిరగబడుతుంది, భయపడకూడదు. ఫలానా మందుతో మీ అనారోగ్యం తిరగబడుతుంది, మీరు భయపడకండి అని వైద్యులు కూడా అంటారు. తండ్రి కూడా స్వయంగా అంటారు – మీరు తండ్రికి చెందినవారిగా అయినట్లయితే మాయా రావణుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు, చాలా తుఫాన్లు తీసుకొస్తాడు. ఇప్పుడు మీకు రాంగ్ మరియు రైట్ యొక్క బుద్ధి లభించింది. ఇంకెవ్వరికీ రాంగ్-రైట్ యొక్క బుద్ధి లేదు, అందరిది వినాశకాలే విపరీత బుద్ధి. మీలో కూడా ప్రీతి బుద్ధి అనేది నంబరువారు పురుషార్థానుసారంగా ఉంది. ప్రీతి బుద్ధి కలవారు తండ్రి సేవను చాలా బాగా చేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈశ్వరుని పిల్లలుగా అయి, వారి ఆజ్ఞలను ఏ మాత్రం ఉల్లంఘించకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు. సుపుత్రులుగా అయి తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలి.
2. ట్రస్టీగా అయి తమ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. జ్ఞాన మార్గంలో ఏ నియమాలైతే ఉన్నాయో, వాటిని పూర్తిగా అనుసరించాలి. రైట్ మరియు రాంగ్ లను అర్థం చేసుకొని మాయతో జాగ్రత్తగా ఉండాలి.
వరదానము:-
ప్రతి సమయం, ప్రతి సెకండు, ప్రతి కర్మ చేస్తూ నేను స్టేజ్ పై ఉన్నాను అని సదా స్మృతిలో ఉండాలి. ప్రతి కర్మ పట్ల అటెన్షన్ ఉండడంతో సంపూర్ణ స్టేజ్ కు సమీపంగా వస్తారు. దానితో పాటు వర్తమానం మరియు భవిష్య స్టేటస్ యొక్క స్మృతి ఉండడంతో ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది. ఈ రెండు స్మృతులే తండ్రి సమానంగా చేస్తాయి. సమానతలోకి రావడంతో ఇతరుల మనసులోని సంకల్పాలను సహజంగానే క్యాచ్ చేయగలరు. దీనికోసం కేవలం సంకల్పాలపై కంట్రోలింగ్ పవర్ కావాలి. తమ సంకల్పాలలో ఇంకేమీ కలవడం అనేది ఉండకూడదు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!